Skip to main content

Posts

Showing posts from February, 2024

మాఘమాసం పౌర్ణమి కవితలు

నిర్వహణ: శివునూరి లలితా కృష్ణ *************** కవివరుల జాబితా 1. మండ నాగేశ్వర్రావు గారు 2. వి.వీరాచారి గారు  3.అపరాజిత్ గారు  4.డాక్టర్. భమిడి మఱ్ఱికమలాదేవి గారు  5.మండ నాగేశ్వరరావు గారు  6. కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  7. కొంజేటి రాధిక గారు  8. అయ్యల సోమయాజుల ప్రసాద్  గారు 9. లలితాచండి గారు 10. బొప్పెన వెంకటేష్ గారు 11. సింహాద్రి వాణి గారు  12. యం.టి.స్వర్ణలత గారు 13. కొమురవెల్లి అంజయ్య గారు  14.డా. బల్లూరి ఉమాదేవి గారు 15.దామర్ల నాగేశ్వరరావు గారు  16.గజవెళ్ళి శ్రీనివాసాచారి  17.దోసపాటి వేంకటరామచంద్రరావు 18.మొహమ్మద్. అప్సర వలీషా గారు  ************** పేరు  1 మండ.నాగేశ్వర్రావు. ఇల్లూ =ఇల్లాలూ...! ఇంటిఇల్లాలే ఇంటి సౌభాగ్యం! ఇనుమడించు ఆ ఇంటి గౌరవం, ఇంతివలనే కదా!ఇంతిలేని ఇల్లు కొడిగట్టు దీపమేనయా,వెలుగురాదు!! ఇంటిని చూసి ఇంటి ఇల్లాలిని చూడమన్నారయా, ఇల్లాలులేని ఇల్లు దెయ్యాలకొంపేగదా! సత్యమిది తెలుసుకోమన్నారయా!! ఇల్లాలిరాకతో వెలుగునిండేనయా! ఇంటికంతా వెలుగు "ఇంతే"నయా ! ఇంతి తిరుగాడిల్లు పూలబంతేనయా!! నందామయా గురుడ నందామ...