Skip to main content

Posts

Showing posts from July, 2025

పార్నంది పద్య సౌరభం

పార్నంది పద్య సౌరభం  శివునూరి లలితాకృష్ణ              SA (తెలుగు) నివాసం : సిద్ధిపేట  చరవాణి సంఖ్య:7842906949 శీర్షిక:పద్యవైభవం 1.ఉత్పలమాల పద్యము పద్మమై మృదుల భావ పరాగ పరీమళమ్మిడున్ పద్యము సద్మమై వెలుగు వాజ్మయ దీప్తుల వైభవమ్మునన్ పద్యము వాద్యమై వసుధ వాక్సుధలన్ మురిపించుచున్సదా పద్యము హృద్యమై వరలు వర్ధిలు నిత్యవినూత్నశోభలన్ 2.ఉత్పలమాల పద్యము మేఘమై కవన వర్షపుధారలదన్పు నిచ్చలున్  పద్యము రాగమై హృదిని స్వాదము హ్లాదము నింపు స్వచ్ఛతన్ పద్యము వేద్యమై తనరు పాఠ్య ప్రబంధపురాణ వర్ణనన్ పద్యము పాద్యమై నిరతభారతిసేవ దరించుభాగ్యమౌ 3.ఉత్పలమాల పద్యము భాసమై ప్రబలు భారత భారతి కీర్తిచంద్రికన్ పద్యము లాసమై వెలయు భాగవతమ్మున భక్తి భావనన్ పద్యమునాశువై చెలగు ప్రాజ్ఞుల నోట వధాన కేళిగన్ పద్యము భూషయై యలరు వాణివరమ్మున మానవాళికిన్ 4.ఉత్పలమాల పద్యము తీవెయై పదము పల్లవమొందగ పందిరేయునా పద్యము పూవునై తనరు   వర్ణవిలాసపుసౌకుమార్యతన్ పద్యము తావియై యతుల ప్రాసల గంధము పూయునింపుగన్ పద్యము మావియై మధురభావరసామృత ధారయౌ ధరన్ 5.ఉత్పలమాల  పద్యము ప్రాచ్యభావ...

వీడ్కోలు ఆషాఢమాసం పౌర్ణమి

అంశం: వీడ్కోలు  సందర్భం: ఆషాఢమాసం పౌర్ణమి  నిర్వహణ:  వీరా గుడిపల్లి లలితాకృష్ణ  ################## కవివరుల జాబితా  1.పిళ్ళా వెంకట రమణమూర్తి గారు  2. జి.సూర్యనారాయణ గారు  3.మండ నాగేశ్వరరావు గారు  4.డా‌.బల్లూరి ఉమాదేవి గారు  5. డా.కమలాదేవి గారు  6.గొర్రెపాటి శ్రీను గారు  7.వేమూరి సత్యవతి గారు  8.కూని అంకబాబు గారు  9.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  10.కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  11.తోట సులోచన గారు  12.వాణిసరోజిని లక్కరాజు గారు  13. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు  14.అపరాజిత రెడ్డి గారు 15.లలితాచండి గారు 16. నెల్లూరు వెంకటలక్ష్మి గారు  17.కమలశ్రీ గారు  18.రాధిక గారు 19.చంద్రమౌళి గారు  20.శ్రీకాంత్ గారు  21.సింగీతం సంతోష్ కుమార్ గారు  22.. దారల విజయ కుమారి గారు  23.ఎన్.నరేశ్ చారి గారు  24. పిన్నక నాగేశ్వరరావు గారు  25.సింహాద్రి వాణి గారు  26.ఏడెల్లి రాములు గారు  27.కొంజేటి రాధిక గారు  ++++++++++++++++++++++++++++++++ ఆషాడ మ...