నిర్వహణ: శివునూరి లలితా కృష్ణ
***************
కవివరుల జాబితా
1. మండ నాగేశ్వర్రావు గారు
2. వి.వీరాచారి గారు
3.అపరాజిత్ గారు
4.డాక్టర్. భమిడి మఱ్ఱికమలాదేవి గారు
5.మండ నాగేశ్వరరావు గారు
6. కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
7. కొంజేటి రాధిక గారు
8. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
9. లలితాచండి గారు
10. బొప్పెన వెంకటేష్ గారు
11. సింహాద్రి వాణి గారు
12. యం.టి.స్వర్ణలత గారు
13. కొమురవెల్లి అంజయ్య గారు
14.డా. బల్లూరి ఉమాదేవి గారు
15.దామర్ల నాగేశ్వరరావు గారు
16.గజవెళ్ళి శ్రీనివాసాచారి
17.దోసపాటి వేంకటరామచంద్రరావు
18.మొహమ్మద్. అప్సర వలీషా గారు
**************
పేరు
1
మండ.నాగేశ్వర్రావు.
ఇల్లూ =ఇల్లాలూ...!
ఇంటిఇల్లాలే ఇంటి సౌభాగ్యం!
ఇనుమడించు ఆ ఇంటి గౌరవం,
ఇంతివలనే కదా!ఇంతిలేని ఇల్లు
కొడిగట్టు దీపమేనయా,వెలుగురాదు!!
ఇంటిని చూసి ఇంటి ఇల్లాలిని
చూడమన్నారయా, ఇల్లాలులేని
ఇల్లు దెయ్యాలకొంపేగదా!
సత్యమిది తెలుసుకోమన్నారయా!!
ఇల్లాలిరాకతో వెలుగునిండేనయా!
ఇంటికంతా వెలుగు "ఇంతే"నయా !
ఇంతి తిరుగాడిల్లు పూలబంతేనయా!!
నందామయా గురుడ నందామయా!
గృహలక్షి నవ్వే ఇంటికానందమ్ము
ఇంతికన్నీరెపుడు ఇంటికేచేటు!
ఇల్లాలిచిరునవ్వె ఇంటికారోగ్యమ్ము
ఇంటిల్లిపాదికీ కలుగుసంతోషమ్ము!
ఇల్లాలు మసలిల్లు దేవతలకొలువు
ఇంతిలేని కొంప కలగూరగంప!! తనుకరుగుక్రొవ్వొత్తివెలుగునేపంచి
ఇంటికే వెలుగిచ్చి తాకరుగు ఇంతి..!
గృహలక్షి మనసునే నాయకులు చదివారు..!!
గృహలక్షి ఓటుకే గేలాన్ని వేశారు..!!బస్సుల్లో ఫ్రీ అంటూవాగ్దానమొసగేరు..!!నాయకులుగెలిచేరు,రాజ్యాన్నిపొందేరు..!!!
ఇంటిబాగునుకోరి ఇల్లాలు నడచు
ఇంటిల్లిపాదికీ సుఖమునే పంచి..!!
ఓర్పులో తానెపుడు భూదేవినే మించు
గృహలక్షి నవ్వేను తనసుఖముమరచీ!!
----మండ.నాగేశ్వర్రావు.✒️
సరిపల్లి, పెందుర్తి.,
7793939724.
2
కవితా గానం సీజన్4
మాఘ మాసం పౌర్ణమి నగదు పురస్కారాల కవితల పోటీ
కవన జ్యోతి సమూహం పక్షాన
అంశం :గృహలక్ష్మి (ఉచిత బస్సు ప్రయాణం)
తేటగీతి మాలిక
.......................
ఉచిత బస్సు ప్రయాణమన ఉత్సుకతయె.
మహిళలకు జూడ నేడెంతొ మంచి దాయె.
గుళ్ళు, గోపురమ్ముల నెన్నొ కోరి చూడ,
వలసిన ప్రదేశముల చూడవచ్చుగాన.
తల్లి గారింటికిని మరి పిల్లలిళ్ళు,
బంధుమిత్రుల ఇళ్లకు బహు ముదమున
వెళ్లి రావచ్చు మహిళలు వేడ్క మీర.
పేద మహిళలకిది బహుమోద మాయె.
మన తెలంగాణ రాష్ట్రాన ఘనములైన
యాదగిరి వాసుడైనట్టి వేదవేద్యు
లక్ష్మి నరసింహ స్వామి నిలాతలమున
కోరి దర్శించవచ్చును కోర్కె మీర.
భద్ర కాళికాదేవి నపార భక్తి
జూడ సమ్మక్క -సారక్క వేడుకలర.
వేములాడ రాజన్న ప్రభు వేడుకలను
కొండగట్టు అంజన్న ను కోర్కె మీర
దర్శనము జేయవచ్చునో తల్లులార.
పేదల తిరుపతిగ నిల పేరుగాంచె
మన్నెము కొండ జూడంగ మనసు మరియు.
ముచ్చటగ కాంచన గిరిలొ మోదమలర
వెలసిన కురుమూర్తి స్వామి వేడుకలను, సింగపట్నము లక్ష్మీనృసింహస్వామి
పూజలందు పాల్గొనవచ్చు నపూర్వరీతి.
బీద మహిళల కెంతొ సంప్రీతి యయ్యె.
రచన : వి.వీరాచారి, కవి రత్న, దాశరధి పురస్కార గ్రహీత, వనపర్తి టౌన్ మరియు జిల్లా.pin.509103
Cell.8897182796
హామీ పత్రం
ఇది నా స్వంత రచన దేనికి అనువాదం కానీ అనుసరణ గాని కాదు.
ఇదివరకు ఎక్కడా ప్రచురింపబడలేదు.
వి .వీరాచారి., కవిరత్న, దాశరధి పురస్కార గ్రహీత, వనపర్తి.
3
అంశం : గృహలక్ష్మి
శీర్షిక : జయహో మహిళామణి,,,,!
పేరు ; అపరాజిత్ రెడ్డి
ఊరు ; సూర్యాపేట
ఫోన్ నంబర్ : 9848532031
ఓ మహిళారత్నం సోనియాగాంధి ఎన్నికల వాగ్దానం మేరా,,,,,
రేవంత్ సర్కారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి పచ్చజెండా ఊపిందే తరువాయి........
ఫోలోమని మహిళలంతా ఎక్కడలేని ఉత్సాహంతో విరగబడి స్వేచ్ఛగా బస్సు ప్రయాణం చేస్తున్నారు,,,,,,,
రాష్ట్రానికి స్వతంత్రం ఇప్పుడే వచ్చిందా అన్నట్లుమహిళలు ఉచితంగా ఇష్టమొచ్చిన చోటుకు ప్రయాణిస్తున్న తీరు ప్రభుత్వ నిర్ణయం బహుపరాక్,,,,,,,,
కాయాకష్టం చేసే స్త్రీలకు ఇది ఒక వరం బహుదూరాలు చుట్టివస్తున్నారు ఇన్నాళ్టికి బ్రతుకు భారం దించుకున్నట్లు,,,,,,,,,
పట్టణాల్లో సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలు రకరకాల పనులు చేసే మహిళలకిది ఉహాతీత వరం,,,,,,,,
ధనిక బీద తేడా లేకుండా మహిళలంతా పుణ్యక్షేత్రాలను రాష్ట్రంలోని పెద్ద పెద్ద పట్టణాలలో దర్శనీయ స్థానాలను చుట్టివస్తున్నారు,,,,,,,,,,
అయితే మహిళలతో బస్సులు కిక్కిరిస్తూ ప్రయాణాలు కష్టతరమవుతున్నాయి మగాళ్లు కూర్చోలేక నించోలేక ఆపసోపాలు పడుతున్నారు వృద్ధుల పరిస్థితి అగమ్యగోచరం,,,,,,,,
ఈ పథకం మరింత విజయవంతమవ్వాలంటే ప్రభుత్వం ఎంత ఖర్చయినా భరించి కావల్సినన్ని బస్సులు సమకూర్చాలి,,,,,,,
మహిళలూ బహుపరాక్,,,,,,!!
అపరాజిత్
హామీపత్రం : ఈ కవిత నా కలం సేత అని నా హామీ
4
లలితాగానం సీజన్ 4
మాఘమాసం పౌర్ణమి నగదు
బహుమతి కవితలపోటీకి
నాకవిత
అంశం : గృహలక్ష్మి ( ఉచిత బస్సుసౌకర్యం)
శీర్షిక : గృహమే స్వర్గసీమ
ఇంటికి దీపం ఇల్లాలే
ఆధారపడి ఉంటాయి గృహంలోని శాంతిసౌఖ్యాలు
ఆగృహలక్ష్మిపై
సామాన్యురాలుకాదు గృహిణి
సవ్యసాచి, శాంతసహనాలే
ఆమె ఆభరణాలు
వంటఇంటి సామ్రాజ్యమే కాదు
గృహసామ్రాజ్యాన్ని ఏకఛత్రాధి
పత్యంతో ఏలే మహారాణి
సర్వసమర్థురాలు
భర్తకు ప్రేమరూపిణి యైన భార్యగా
బిడ్డలకు అనురాగ ఆప్యాయతల నందించే మాతృమూర్తిగా
అత్తమామలకు అణకువ, వినయవిధేయతలుగల కోడలుగ
మరుదులకు ఆడబడుచులకు వదినగా
తోటికోడళ్లకు సోదరిలా
పోషిస్తుంది గృహిణి ఎన్నో
పాత్రలను
ఎరుగదు విసుగువిరామాలను
సమయపాలనచేస్తూ
నిర్వహిస్తుంది సర్వకార్యములను
ఒక యంత్రంలా
గృహసీమ స్వర్గతుల్యం కావాలంటే
అది కేవలం సాధ్యం గృహిణి వలననే
అందుకే అంటాము ఆమెను గృహలక్ష్మి అని
కల్పించింది ఎన్నో సదుపాయాలను ప్రభుత్వం
ఆగృహలక్ష్ములకు
బయటకువెళ్లటానికి
ఏర్పరిచింది ఉచిత బస్సుసౌకర్యం.
ఆదరించాలి , గౌరవించాలి
గృహలక్ష్ములను
ప్రజ , ప్రభుత్వం కూడా.
పైకవితనాస్వంతం.
5
మహలక్ష్మి ప్రయాణం!!
====🔥=====🔥====
మహలక్షుల ఓట్లకొరకు ఊరించిన తాయిలం!!
గృహలక్షిల ప్రయాణాలు బస్సుల్లో
ఉచితం..!!
కోరికలే తీరేందుకు ఇదోరకం
ఆయుధం!!
పడతులంత పనిమానీ బస్సులలో ప్రయాణము..!!
సోయిమరచి మీరుంటే గుల్లయ్యే
సంసారం..!!
ఉచితబస్సు ప్రయాణమే రద్దీలో అతిప్రమాదం!!
జేబుదొంగలందరికీ బహుచక్కని
ప్రదేశము..!!
ఆడైనా,మగైనా చేతివాటముంటే
అదోరకం ఆదాయం!!
మహాలక్షి లందరికీ ఉబుసుపోని
ఉద్యోగం..!!
పనిఉన్నా లేకున్నా ప్రయాణమే
పరమార్ధం!!
బస్సులన్నిఫుల్లూ,ఆదాయమేమొనిల్లూ....!!
ప్రభుత్వాల విధానాలు పనికిరాని
సొల్లు...!!
ఒళ్ళుగుల్ల ఇల్లుగుల్ల ఒద్దుబాబు
ఈ ఉచితం!!
మరోరకం తాయిలాన్ని రేవంతన్న
నడుగుదాం..!!
గృహలక్షిల ఆశలన్ని పాలకులకు
చెబుదాం...!!
ఎన్నాళ్ళని ఉచితాలతో గౌరవంగ
బ్రతుకుతాం.??
మనమంతా బ్రతికేందుకు ధరలన్నీ
దించుదాం..!!
ఆరోగ్యం విద్య కూడ ఉచితంగా అడుగుదాం!!
మనపిల్లల భవిష్యత్తుకి బరోసానె
కోరుదాం..!!
చక్కనైన ఉపాధినే ఇయ్యమనీ
వివరంగా వేడుదాం!!
మహలక్షి లాగ బ్రతికేందుకు మరో
మారు మ్రొక్కుదాం!!
----మండ.నాగేశ్వర్రావు.✒️
సరిపల్లి, పెందుర్తి.
7793939724.
6
మాఘ మాసం పౌర్ణమి నగదు పురస్కారాల కవితల పోటీ
కవనజ్యోతి సమూహం పక్షాన
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
మాఘమాసం పౌర్ణమి నగదు పురస్కారాల కవితల పోటీ.
అంశం :: గృహలక్ష్మి (ఉచిత బస్సు ప్రయాణం)
శీర్షిక:: అనుచితము
స్వీయ రచన:: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, పాతర్లపాడు, ఖమ్మం .
తేదీ 20/02/2024
**********************"
అయాచితంగా అమరిన ఏ సౌకర్యమైన
అలుసవుతుంది, అభాసు పాలవుతుంది,
అణా ఖర్చు లేకుండా అక్కర ఉన్నా ,లేకున్నా,
అదే పనిగా ప్రయాణించే ఆడవాళ్ళ సంఖ్య
అనుదినం పెరిగి పోతోందని లెక్కలు చెబుతున్నాయి!!
ఆధార్ అంగీ జేబులో పెట్టుకొని, అమ్మ కోపం చేసిందని,
అడ్రస్ దొరక్కుండా బస్సులు ఎక్కుతూ దిగుతూ
అమ్మాయి మూడు రోజులు రేయిపగలు తిరిగిందంటే
ఆలోచించండి, ఆనందంగా ఉన్న గృహంలో,
ఆందోళన, ఆవేదన,ఏ స్థాయిలో ఉంటాయో!?
ఈ దేశం ఒక దేవాలయం అందులో ఈ సమాజం
లలి లాలిత్య వల్లరి,సుమనోహర సుమబాల
సువాసన వెదజల్లే సౌగంధికా మంజరి... దాని పై
ఉచితాల ఉన్మాదపు మిడతల దండును తోలి
సంకుల సమరంలో విజయం సాధించాలన్న
సంకుచిత స్వార్థ రాజకీయ క్రీడ తప్ప మరొకటి కాదు!!
ఈ ఆటలో పావులై పడతులు ఓడి పోకూడదు
ఆ కూట నీతికి తాట తీసి, తేటతెల్లం చేసి
మేటి వీర వనితలు గా వినుతికెక్కి
సాటి లేని ఆర్థిక వ్యవస్థగల రాష్ట్రంగా తీర్చి దిద్దుటకు
పోటు వేయాలి, అనుచితమైన ,ఉచిత ప్రయాణం తిరస్కరించి!!
ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసే,
అనుచితమైన వ్యవహారాలను సమర్ధించి, రాష్ట్రానికి
ద్రోహులుగా మారొద్దు !
కలహంసలై ఆకాశాన అబ్బురంగా విహరిస్తూ,
ఈ గబ్బును సాధికారతతో తిప్పి కొట్టాలి ధీరోదాత్తులై!!
గండుపిల్లులై ఓట్ల చేపలకు వేసే
ఎర ఈ ఉచితం అని మరవద్దు
గృహ లక్ష్ములు ఉత్తుత్తి గహ్వారములో ఊగొద్దు
గృహాలను గహనసీమలుగా మర్చొద్దు!
వెట్టి చాకిరీ అని, ఆ నాడు అందరు అసహ్యించకుని
అంతం చేసారు...
ఇదొక నయా వెట్టి,
ఇప్పుడు ఇదెలా సబబు అవుతుంది
అందుకే! కందకంలో పాతర వేయాలి!ఈ ఉత్తచాకిరీని !!
ఇది నా స్వీయ రచన
7
9493273114
అంశం...మహాలక్ష్మి (ఉచిత బస్సు ప్రయాణం)
పేరు కొంజేటి రాధిక
ఊరు రాయదుర్గం
ఉచితములు సముచితములే.... మగువల పెదాలపై చిరునవ్వుల పూలు పూయించి,
భారమైన ప్రయాణ భారాన్ని తేలిక చేసి, అంబరమంటే సంబరాలతో పండుగను చేసుకుంటున్నారు ప్రతి ఇంట మగువలు...
అగమ్య గోచరమైన గమ్యాలను అతి సులువుగా చేర్చి, దుర్గేద్ధ్యమైన కార్యాలకు మార్గం సుగమం చేసి, పెదింటి మహిళల పాలిట పెన్నిధి గృహలక్ష్మి పథకం...
పేదింటి మగువల మదిలో దాచుకున్న కోరికలను తీర్చుకునేందుకు ఓ అభయహస్తము గృహలక్ష్మి...
గుడి కైనా, బడికైనా ఉచిత ప్రయాణంతో పోవెత్తున ఎగిసిపడే ఆమె సామర్థ్యానికి చేయూతనిచ్చి, ఆమె విజయానికి ఓ అదృశ్య హస్తం గృహలక్ష్మి...
పలుకరింపుకు నోచుకోని బంధాలను బాంధవ్యాలను దగ్గర చేసి, చిరకాల వాంఛలను తీర్చే గృహలక్ష్మి కల్పవల్లి... అక్షయమైన ఆనందాన్ని ఇచ్చే అత్యద్భుతమైన పథకం గృహలక్ష్మి.
8.
కవనజ్యోతి కవితా సమూహం
కవితాగానం(సీజన్4) ఆధ్వర్యంలో జరుగు పుష్యమాస పౌర్ణమి కవితా పోటీల కొరకై
తేది:-20-02-24.
పేరు:-
అయ్యలసోమయాజుల ప్రసాద్
ఊరు:-విశాఖపట్నం
చరవాణి:-9963265762.అంశం:-గృహలక్ష్మి(ఉచిత బస్సు ప్రయాణం)
శీర్షిక:-
ఆమె జీవితం లో వెలుగు
.............................
మూడు ముళ్ళ బంధంతో
మధ్య తరగతి భాగస్వామి ఇంట అడుగుబెట్టి
సంప్రదాయమని అత్తమామల
కట్టుకున్న వాడి కోరికతో
పుత్రుడే పున్నామ నరకం నుంచి రక్షిస్తాడన్న మూఢ నమ్మకం తో
ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చి
భర్తతోబాటు గృహలక్ష్మిగా తోడు నీడగా సంసార బరువు భాధ్యతలు మోస్తు
ప్రైవేట్ విద్యాలయంలో
ఆరువేల జీతానికి పనిచేస్తు
ఆరువందల రూపాయల తన బస్సు ప్రయాణానికి
ఆడపిల్లలు ఎదిగే కొద్దీ
అక్షరం ముక్కవస్తే అన్నానికి లోటుందన్న సమయంలో
కళాశాలలో, విద్యాలయలలో చదివే
పుత్రికల ఉచిత బస్సు ప్రయాణం వల్ల
రెండు వేలు ఆదా చేస్తు
గుట్టుగా సంసారం చేస్తు
తను బాల్యంలో చూపని కనీసం రాష్ట్రంలో ఉన్న
దేవాలయములకి
ప్రకృతి సౌందర్య ప్రదేశాలకి
ఉచిత బస్సు ప్రయాణం ద్వారా సెలవులలో తీసుకెళుతున్న
గృహాలక్ష్మి జీవితాన వెలుగు ఉచితబస్సు ప్రయాణం
'అతి సర్వత్ర వర్జయేత్' గా వినియోగించే స్త్రీలకు
ఉపయోగపడే రవాణా సాధనం....!!
....................
ఇది నా స్వీయరచన.
పౌర్ణమి పోటీలకొరకు మాత్రమే వ్రాసినది.
అయ్యలసోమయాజుల ప్రసాద్.
.............................
9
కవితాగానం
కవన జ్యోతి సీజన్ -4
మాఘ పౌర్ణమి పోటీలకు
అంశం--మహాలక్ష్మి (ఉచితబస్సు ప్రయాణం)
శీర్షిక... ఆధార్...
ఒక్కసారి ఆధార్ కు రెక్కలు వచ్చాయి అందుకే రోజు బయటకు వెడుతోంది
పాలకులకు ఉచితంగా ఒోట్లు వేసిన మహిళలు కూడా గుర్తుకు వచ్చారెేమో? ఏమైనప్పటికీ
రాష్ట్రం పొలిమేరల వరకు చేసిన అభివృద్ధి నిస్వార్ధంగా చెప్పేందుకో...మరెందుకో
మాటతప్పక అమలు చేసిన ఎన్నికల వాగ్ధానం
కూరల బేరంలో మిగిలిన ఐదుపదులకే
సంబరపడే పాపం మహిళలు
ఒక్కసారి తబ్బిబ్బేకదా! ప్రయాణం మరీ బాగుంది ఉచితం కదా!
నిత్యం వంద రూపాయులు
ఇట్టే ఆదా ఎంత ఆనందం!...
పన్నులు కట్టేదొకరు ఉచితాలు పోందేదొకరు
సఖ్యతలేని పరిపాలన కంటెే
కాలుష్యం లేని ధరిత్రి
వ్యత్యాసాలు లేని విద్యా ఉద్యాగాలే
ఎల్లలు లేని ప్రగతికి మూలం...
మహాలక్ష్ములు ఆధార్ జాగ్రత్త సుమా!...
ఎల్లకాలము ఏవి వుండవట...
ఏమో మరి!...
లలితా చండి
హైదరాబాదు
9885552922
కవితాగానం
మాఘ పౌర్ణమి పోటీల కోసం ఇప్పుడే రాసినది.
కవయిత్రి
10
కవిత శీర్షిక: సళ్ళని వార్త
కైకిలు గమ్మడి చేసుకుని
కడుపు కింత నమ్మకంగా తిన్నోల్లం
ఆడోళ్ళం గదాని..
ఎటన్న వొదామంటే
ఎన్కటి నుంచి ఎనుక ముందు అయినోల్లం
ఆపతి సంపతి అరుసుకోను
మనది కడ్ప దాటని కతే అయింది
రాక పోకలు సాగియ్య
మనది సాగిరాని సంసారమయింది
గిప్పుడు
కొత్త సర్కారు కొలువుతీరిన గీయాళ్ళ..
సళ్ళని వార్త సంబురమయింది
ముందరి కాళ్ల బంధం వొట్టి ముచ్చటే అయింది
నాలుగు తరాలను మోస్తున్న నాలుగు చక్రాల బండి మహాలక్ష్ములతో
పల్లె వెలుగై పరుగులు తీస్తుంది
బొడ్లే సంచి మరచిపోయిన అవ్వ పానం నిమ్మలమైతుంది
ఇగ మహిళలూ...
చెయ్ సంచి సదురుడే ఆల్షం
చెప్పులు ఏసుకునుడే తరువాయి
11
కవితా గానం సీజన్ -- 4
శోభకృత్ నామ సంవత్సరం మాఘమాసం పౌర్ణమి నగదు పురస్కారాల కవితలు పోటీకి
అంశం:-- మహాలక్ష్మి ( ఉచిత బస్సు ప్రయాణం)
శీర్షిక:--
రచన:-- సింహాద్రి వాణి
ఊరు:-- విజయవాడ
చరవాణి:--7569820872
సూది బహుమతిచ్చి ప్రతిఫలంగా కామధేనువును తీసుకున్నట్లు,
మహాలక్ష్మి( ఉచిత బస్సు ప్రయాణం) ఆశ చూపి ఉచితాసనాలెక్కారు నాయకులు.
గృహలక్ష్ములు అల్ప సంతోషులు. భర్త తెచ్చిన మూరెడు పూలకే మురిసి మైమరచి పోతారు స్త్రీ మూర్తులు.
ఎవ్వడు కొడితే దిమ్మతిరిగి 'మైండ్ బ్లాక్' అవుతుందోవాడే పండుగాడులా,
ఎవ్వరిని ఉచితాల ఎర వేసి, రంగంలోకి దింపితే 'మైండ్ బ్లాక్' అయ్యే ఫలితాల నిస్తారో,వాళ్ళే మహాలక్ష్ములు.
ప్రజలకు ఉచితాల పథకాలు, ప్రతిభకు గుర్తింపు పతకాలు ఇవ్వడం హర్షణీయం, ఆమోద యోగ్యం.
ఏదైనా అనుకున్న వెంటనే అమలుచేయకుండా,పకడ్బందీ వ్యూహంతో, ముందుకడుగు వేస్తే మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణంలా ఇబ్బందులు ఎదురు కావు.
ఆదాయం లేక ఆటో వాళ్ళకు అగచాట్లు, పురుషులకు ప్రయాణించేందుకు బస్సుల్లో దొరకని ఖాళీలు, ఉచిత శిగపట్ల దృశ్యాలు,స్కూటీల వ్యాపారులకు తగ్గిన అమ్మకాలు. ఇలా ఇలా చాలా చాలా.
ఇంతకూ ఉచిత బస్సులో సీటు చేతి రుమాలు వేయించిన వాళ్ళదా?
వేయించిన వాళ్ళకంటే ముందుగా బస్సు ఎక్కినవాళ్ళదా?
హామీ:-- ఇది నా స్వీయ రచన.
12
12
యం.టి.స్వర్ణలత
జిల్లా
*
మంచిర్యాల
ఫోన్
*
9849772512
కవిత
*
శీర్షిక... ఉచిత బస్సు ప్రయాణం
బస్సు ఎక్కిన...
మహాలక్ష్ముల మోములో చిరునవ్వులు
కండక్టర్ల మాటల్లో చిర్రుబుర్రులు
సీటు దొరికిన మహిళల్లో మోదం
సీటు దొరకని వారిలో ఖేదం
పురుష పుంగవులలో నిస్తేజం
ఉచితమైనా కాకున్నా ఒకటే నైజం
టిక్కెట్టు కొనుక్కున్నా దక్కని సీటు
సీట్లో కూర్చుంటే పరువుకు చేటు
ఏదేమైనా పడింది పురుషులపై వేటు
లాభనష్టాలు ప్రభుత్వానికెరుక
ఉచిత ప్రయాణమే మహిళల కోరిక
చేసుకుంటున్నారు పనులలో తీరిక
హాజరవుతున్నారిక ప్రతీ వేడుక
ఇది వనితలకు దక్కిన కానుక
సాధ్యమైంది మరో రాష్ట్రాన ఈ పథకం
ఆటోవాలాల పాలిట అయ్యింది శాపం
కిక్కిరిసిపోయిన బస్సులు
అవసరమా ఈ ఉచితమని కొందరి కస్సుబుస్సులు
ఆర్థిక శాఖపై అదనపు భారమని సాధింపులు
ప్రభుత్వమే భరిస్తుంది మనకేంటని ఊరడింపులు
మిశ్రమ స్పందనల పరంపరలు
సామాన్యునికి అంతుచిక్కని చిక్కుముడులు
రాజకీయ చదరంగపుటెత్తులు
13
13
కొమురవెల్లి అంజయ్య
జిల్లా
*
సిద్దిపేట
ఫోన్
*
9848005676
కవిత
*
అంశం గృహలక్ష్మి (ఉచిత బస్సు ప్రయాణం)
శీర్షిక.. గృహానికి లక్ష్మి
స్వేచ్ఛ పక్షి ఎగిరింది రహదారులపై
కొన్ని బంధనాలకు విముక్తి కలిగించి
అడ్డదిడ్డపు ఆలోచనల తాళ్లు తెంచిన
చిన్న పథకం ఎంత ఊపిరి పోసింది
బస్సుల పయ్యల్లో జీరో టికెట్ గాలి నిండింది
అక్కలు, చెల్లెలు, అమ్మలు, అవ్వలు
అంతా పుట్టింటి వాళ్లే నన్న భావన బస్సులకు
గృహలక్ష్మిలకు దక్కిన గౌరవం సృష్టి కాళ్లకు తొడిగిన గజ్జెలు
భూమిపై సగభాగం సగర్వంగా తలెత్తుకుంది
కాళ్లు బయటపెడితే కందిపోతాయన్న భావన
అనేక రకాల చిన్న చూపు
తమ కోసమే తయారైన వస్తువన్న ఆలోచన
శారీరక మానసిక దోపిడీ
పురుషాధిపత్య సమాజంలోని
సంకెళ్లు తగ్గుతున్నాయి మెల్లమెల్లగా
ప్రకృతి మహిళలకు కొన్ని ప్రత్యేకతలిచ్చింది
వాటికి ప్రత్యేక మార్కులు వేయకపోవడం
పెత్తనాల కింద నలిగిపోవడంతో మొదలైన స్త్రీవాదం
కొంతైనా సంబరపడుతోంది గృహలక్ష్మితో
సీట్ల భర్తీ పెరిగింది సుబ్బరంగా
సీట్ల కోసం వెతుక్కుంటున్న పురుషులు
పతుకులాడుతున్నారు తమ వాటా కోసం
గృహలక్ష్మి అమలైతే గృహానికి లక్ష్మి పూర్తిస్థాయి
వెల్లువెత్తుతాయి ఇంటింటా ఆనందాలు
........................................................
కొమురవెల్లి అంజయ్య
సిద్దిపేట
తేది..20-02-2024
సెల్..9848005676
14
[22/02, 7:17 pm] Lalita Sister:
కవితా గానం పౌర్ణమి పోటీ కొరకు
డా బల్లూరి ఉమాదేవి
ఆ.వె:ఆడవారికొరకుటంచు చక్కని సదు
పాయ మొనర జేసె ప్రభుత నేడు
నువిద బాధలరసి నుపయోగ కరమైన
పనిని మొదలు పెట్టె వాసి గాను.
ఆ.వె:ఆడవార టన్ల నవనిలో సగమని
తలచి వారికొరకుతగినరీతి
గాను బస్సు లందు ఖర్చులేకయుగమ్య
మందునట్లుచేసిరాదరమున
ఆ.వె:సంతును బడికంపుసౌకర్యముకలిగె
నుచితబస్సువలననొప్పుగాను
నన్నిపనులుతానునలవోకగాచేసి
పొదుపుచేయుసొమ్ముపొలతినేడు.
ఆ.వె: తీరిక దొరకంగ తీర్థ యాత్రలు చేయు
వీలు గలిగె ననుచు వెలదులెల్ల
పలువిధములుగాను ప్రభుత చేసినమేలు
ప్రస్తు తించుచుండ్రి ప్రతిదినమ్ము
ఆ.వె:ఆడవారియందు నమ్మనుజూచుచు
నగ్రపీఠమొసగి యాదరించి
గౌరవమ్ముకూర్చికాంగ్రెసుపార్టితా
ప్రజల మన్న నందె వాసిగాను
డా బల్లూరి ఉమాదేవి
15
[23/02, 4:31 am] Veera Gudipally:
మాఘమాసం పౌర్ణమి నగదు పురస్కారాల కవితలు పోటీ
------------------------------------------
అంశం-మహాలక్ష్మి(ఉచిత బస్సు
ప్రయాణము)
నిర్వహణ-వీరా గుడి పల్లి
శివునూరి లలితా కృష్ణ.
రచన-దామర్ల నాగేశ్వరరావు
9908568099.
+++++++++++++++++++++++
తేట గీతి పద్యాలు
1. మహిళలకు బస్సు పయనము
మహిమ గాను
ఉచిత మంటే సరద మాకు
ఊరు ఊరు
తిరుగు తాము పనులు లేవు
తీరిక గను,
వంట వార్పు చేయము మేము
ఇంటిలోన.
2. సరద సరదా తెలంగాణ తిరుగు
ముందు
ముందు ఈ అవకాశము ముచ్చట
గను
ఉండునో,లేదొ బ్రహ్మ దేవుండు
కెరుక
గాన మేము తిరుగుతాము కరుణ
లేక.
3.రైలు పయనము చౌకగా కాల
మెల్ల
పలికె నేడు మహాలక్ష్మి పథకము
ఉచి
తముగ బస్సు ప్రయాణములు
మహిళలకు
వరము మా అందరీ కోరిక
రయముగను.
4. ఉచిత పథకము ఉండవలె
చిరకాల
మూ తెలంగాణ రాష్ట్రమందూ
తెలివిగ
మహిళ మణుల దీవెనలు మీకు
హితము గను
ఈ ప్రభుత్వము నకు ఇది మా
ప్రకటన.
5.స్త్రీల సంతోష సమయము ఆల
వాల
ము హితము సమాజమున కెల్ల
మహిళ దీవె
నలు ప్రభుత్వము వర్ధిల్లు
నాణ్యముగను
దీవెనలు మావి శుభములు
దివ్యముగను.
హామి-ఇది నా స్వీయరచన.
*****************************
16
జిల్లా
*
కాజీపేట హన్మకొండ జిల్లా
ఫోన్
*
9059438068
కవిత
*
అంశం: మహాలక్ష్మి పథకం
శీర్షిక: మహిళలకు వరం
...
తెలంగాణ రాష్ట్రంలో
ఎన్నికల హామీలో భాగంగా
మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం
అమలవుతున్నదిగా
ఇది నిజంగా
మహాలక్ష్ములకు వరమేగా
ఆధార్ కార్డు చేతిలో ఉంటే చాలు
డబ్బుతో పనిలేకుండా
ఆర్టీసీ బస్సులో
ఉచితంగా పయనించవచ్చునుగా
17*
విజయనగరం
ఫోన్
*
7780594995
కవిత
*
కవనజ్యోతి
శోభకృత్ నామసంవత్సర మాఘమాస నగదు పురస్కారాల
కవితలపోటీ
అంశం:మహాలక్ష్మి(ఉచిత బస్సుప్రయాణం)
దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం
శీర్షిక:ఉచితాల విచిత్రం
ప్రగతి పేరుతో పడతులకు పరిహారం
ప్రభుత్వ ప్రయోగాల పరిహాసం
ప్రయోజనం పేరుతో పెనుభారం
ప్రజలకు ఊరడింపుల ఉల్లాసం
ఉచితాల విచిత్ర విన్యాసం
ఉఛిత బస్సుప్రయాణం ఒక పరిణామం
అవసరమైన వారికది ఆవస్యం
ఇతర వాహనచోదకఃల సంపాదనకు అవరోదం
ఉచితమేదైనా అనుచితమే
అధికారళదుర్వినియోగమే
రాజకీయ ఎత్తుగడల పర్వమే
ఎన్నికల సమయంలో ప్రజలకు ఎరవేయడమే
ఒకరినిచూచి ఒకరు పోటిపడడమే
మహలక్ష్మి పేరు పెట్టి మభ్యపెట్టడమే
మహిళలను మాయచేసి మురిపించడమే
ఉపాధి అవకాశాలను కల్పిస్తే మంచి పథకమే
ఉచితతాలంటే తాత్కాలిక ప్రయోజనమే
పదిమందికి పనికొచ్చే పథకాలే హితకరమే
ఐదువత్సరాల ప్రభుత్వానికి పబ్బం గడుపుకోవడమే
ఉపశమనాలకంటే ఉద్దరించే సాధనాలు అవసరమే.1
18
కవితా గానం (సీజన్ 4)
పౌర్ణమి కవితల పోటీ
అంశం.... మహాలక్ష్మి
శీర్షిక.... నమ్మకాల బాట
ఉచిత బస్సు ప్రయాణం
తెలంగాణా మహాలక్ష్ములకు
దేవుడిచ్చిన ఈ వరం...
గాలిలో తేలిపోయే ఊహలకు
ఊతమిచ్చింది ఈ వరం...
కష్ట నష్టాలను కూడా
లెక్క చేయక
కనికరము చూపింది ఈ వరం...
ఆడబిడ్డలకు ఆర్ధిక సాయంగా
అవసరానికి ఆసరాగా
ఆదుకుంటున్నది ఈ వరం...
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి
నిలకడగా న్యాయ పీఠం వైపు
మొగ్గు చూపింది ఈ వరం...
అడిగినంత ఇవ్వాలనే
అధికారపు బెట్టు చూపే
ఆటో వాలా వెన్ను విరిచి
నీకు నేనున్నానంది ఈ వరం....
ఆరిందలా మాట్లాడినా
ఇంకా ఐదు లోపే మా చిట్టి తల్లి
వయసనే అబద్ధాల నోటికి
తాళం వేసింది ఈ వరం...
చీకటికి, మాటికి
చిల్లర డబ్బుల కోసం
కట్టుకున్నోడికి, కండక్టర్ కు
అడిగే పని లేకుండా చేసింది ఈ వరం....
రేటుకు భయపడి
నలుగురితో వెళ్లే ప్రయాణం
ఇద్దరితో సరిపెట్టుకో నఖ్ఖర
లేకుండా చేసింది ఈ వరం....
బస్సు లో ప్రయాణం నామోషీ
అన్న రోజులకు చెక్ పెట్టి
పరవశంగా ప్రయాణించేలా చేసింది ఈ వరం.....
సావధానం పాటించండి
ప్రభుత్వానికి సహకరించండి
కుమ్ములాటలు కొట్లాటలతో
ఆది లోనే హంసపాదు వేయకండి...
మరెన్నో పథకాలకు ఆహ్వానం పలకండి
ప్రభుత్వమంటే ప్రజలు
ప్రజలంటే ప్రభుత్వమని
నమ్మకాల బాట వేయండి....
మహాలక్ష్మి అంటే మీ ఇంటి
మాలక్ష్మి అని గుర్తించండి
పరిశుభ్రత పాటించండి...!!
హామీ... నమస్తే🙏 ఈ కవిత నా స్వీయ రచన అని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను🙏🙏
మొహమ్మద్. అప్సర వలీషా
ద్వారపూడి (కోనసీమ జిల్లా)
Comments
Post a Comment