Skip to main content

సింధూరం 07052025

******************
సింధూరం దిద్దిన వారు 
1.వీరా గుడిపల్లి
2.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు,
3.గొర్రెపాటి శ్రీను 
4.దోసపాటి వేంకట రామచంద్రరావు 
5.అపరాజిత్
6.వేమూరి సత్యవతి 
7.జ్యోతి 
8.మండ నాగేశ్వరరావు 
9.గడ్డం కృష్ణారెడ్డి.రేపాల.సూర్యాపేట
10.కవిత వెంకటేశ్వర్లు 
11.ఆర్ వి వి రాజా 
12. శ్రీ కోరాడ నరసింహారావు గారు 
13. శ్రీ ఉదయగిరి మధుమోహన్ గారు 
14. శ్రీమతి బల్లూరి ఉమాదేవి గారు 
15. శ్రీమతి తోట సులోచన గారు 
16. శ్రీ జి సూర్యనారాయణ గారు 
17. శ్రీ గజవెల్లి శ్రీనివాస చారి గారు 
18. శ్రీ వనపర్తి గంగాధర్ గారు 
19. శ్రీమతి వాణి సరోజిని లక్కరాజు గారు 
20. శ్రీమతి సింహాద్రి వాణి గారు
21. శ్రీ ఆచార్య అయ్యల సోమయాజులు ప్రసాద్ గారు 
22.
23.శ్రీమతి నెల్లూరు వేంకటలక్ష్మి గారు
24.శ్రీ ఏడెల్లి రాములు గారు 
25. శ్రీమతి డాక్టర్ తంగిరాల నాగలక్ష్మి గారు 
26. శ్రీ కూని అంకబాబు గారు 
27. శ్రీ తిన్నాక నాగేశ్వరరావు గారు 
28. శ్రీమతి లలితా చంటి గారు 
29. శ్రీ పిల్ల వెంకటరమణ మూర్తి గారు 
30. శ్రీమతి మహమ్మద్ అప్సర వలీషా గారు
31.శ్రీమతి శివునూరి లలితాకృష్ణ గారు 
****"******************
1
రక్త చందనం 
08052025
****************
మాకు సహనం ఎక్కువ 
ఎంతంటే 
ప్రత్యర్థికి కూడా విసుగొచ్చేంత

మాకు బలమెక్కువ 
ఎంతంటే మేం తప్ప 
ప్రపంచమంతా తెలుసుకునేంత

మాకు ఉదార బుద్ధెక్కువ 
ఎంతంటే 
యుద్ధం గెలిచినా 
మా భూభాగం నుండి వాడిని పంపించనంత

నిలువునా మాపై ద్వేషంతో 
రగిలిపోతున్న వాడిలో 
కనిపించని మంచితనం
వెతుక్కునేంత ప్రేమ

దాయాదులంటూ 
కాపాడుకుంటున్న చెలిమిని
చాతకాని తనమనుకుని 
పహల్గాం దాడుల్లో
 తల్లుల నుదుటి బొట్టు తుడిపేస్తే

అప్పుడొచ్చిందాయనకు
 రవ్వంత కోపం 
చెప్పాల్సిన వాళ్ళకు చెప్పడం 
రావాల్సిన వాళ్ళు రావడం 
దిద్దాల్సిన చోట సింధూరం దిద్దడం.
అంతా అరగంటలోనే.......

తొమ్మిది చుక్కలబొట్టు పెట్టి
సుతారంగా హెచ్చరించిన 
సోఫియా ఖురెషీ
వ్యోమికాసింగ్ సాక్షిగా
హెచ్చరిస్తున్నాం....
 
ఇప్పటికైనా మారకపోతే 
దాయాదులని మరచిపోయి 
రక్తచందన మలదక తప్పదు
..... వీరా గుడిపల్లి
2
కవనజ్యోతి పక్షాన 
కవితాగానం సీౙన్ 6 ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన ప్రత్యేక సందర్భాల్లో సమూహం నిర్వహిస్తున్న కవితా సంపుటి కొరకు వ్రాసిన కవిత

తేదీ::8/5/2025
శీర్షిక ::: సింధూర తిలకం 
స్వీయ రచన కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, పాతర్లపాడు, ఖమ్మం. 

మతం కోసం మారణహోమం సృష్టించిన 
మతోన్మాదుల మజ్జను నుజ్జునుజ్జు చేసిన
మోతకు దిగంతాలే దిమ్మె తిరిగి దిశలు మార్చి 
మొత్తుకుంటున్నాయి ఇలా మునుపెన్నడూ చూడలేదని !!

దశాబ్దాలుగా అధునాతన ఆయుధాలతో బెదిరించి 
దిసమొలలు చూపించమని, చూసి ధడేల్మని కాల్చి 
దరువేసుకుంటున్న దుర్మార్గుల దునుమాడుటకు 
దుర్గామాతను ఆవాహన చేసుకొని,సింధూర తిలకం 
దిద్దిన వీరసిపాయిలు వందేమాతరం అంటూ!!

శౌర్య పరాక్రమాలతో, ప్రాణాలను పణంగా పెట్టి
క్రౌర్యం పూనిన క్రూరులను వధించుటకు వెళ్లి వధించి 
గర్వంతో తిరిగి వచ్చిన పర్జన్య గర్జనలను చూసి దేశం 
నివ్వెర పోయింది, భరతమాత సంతుకు ఇంత వీరత్వమా ఇంతటి థీమత్వమాయని!!


శతాబ్దాలుగా మనవ్యవస్థలో ఉన్న అవస్థను మొదలంటూ కత్తిరించుటకు అంది వచ్చిన అవకాశాన్ని, 
తుదకంటూ మనమంతా అండగా నిలిచి మెండైన 
ఫలితం సాధించేవరకు సాగేపోరులో పారే నదిలా!!

ఊరేచలమలా కాసే చెట్టులా వీచే గాలిలా 
ఉదయించే సూర్యునిలా మది దోచే ప్రకృతిలా 
నిష్ఫలాపేక్షతో సింధూరం కార్యక్రమం ముగించేవరకు 
నినాదాలతో హోరెత్తించాలి శత్రువు గుండెలో దడ పుట్టించాలి. 

సంఘటనంతో సమైక్య భావన కలిగించే గీతాలు 
సర్వం సమర్పించే స్ఫూర్తిదాయక పాటలు 
సత్తా చాటి రణమున గెలిచే రోషం పెంచు 
స్వరాలు వినిపించే భావావేశ కవిత్వం అందించాలి!!

 అవధులు లేని ఖర్చులను అధిగమించుటకు 
 నిధులను సమకూర్చి దేశాన్ని సమున్నతంగా నిలపాలి! 
పొరపాటున క్షతగాత్రులైన వారికి రక్తదానముతో, రక్తనిధులను ఏర్పాటు చేసి ఊపిరి పోయాలి!!


స్వీయ శక్తిని అమేయ యుక్తిని దేశభక్తిని 
వ్యక్తిగా వ్యవస్థగా వలపుతో వడ్డించాల్సిన తరుణమిదే!
అందుకే 
మన తరానికి కలిగిన ఈ సౌభాగ్యం మన అదృష్టంగా భావిద్దాం 
బాధలు తుంచే యజ్ఞానికి బాధ్యత మోసేద్దాం 
రండి రారండి 
ముష్కరమూకల నిర్మూలనలో 
చేయి చేయి కలుపుదాం
జయ జయధ్వానం పలుకుదాం 
విజయ కేతనం ఎగరేద్దాం 

ఇది నా స్వీయ రచన
3
కవితాగానం కోసం ప్రత్యేకంగా వ్రాసిన కవిత 

"ప్రతీకార విలయ తాండవం"   

ముష్కరులు విచక్షణారహితంగా

కాశ్మీరు లయలో కాల్పులుజరపగా

26 మంది ప్రణాలు కోల్పోయిన వేళ

భారతమాత రోధించిన మిన్నంటింది!

తన కళ్ళముందే నేలకొరుగుతున్న

బిడ్డల ఆక్రందాన్ని చూసి విలవిలాడిపోయింది!

మతం పేరుతో మానవత్వాన్ని మరచిన ఉగ్రవాదులు

సుందర కాశ్మీరాన్ని వీక్షించాలని ఇష్టంగా వెళ్ళిన వారిపై తుపాకీలు ఎక్కుపెట్టి

విధ్వంసానికి పాల్పడి ప్రాణాలు తీసి తల్లిభరతమాతకు కన్నీటి శోకాన్ని మిగిల్చారు!

తనవాళ్ళని రక్షించుకోలేక నిస్సహాయంగా నిలిచిన భరతమాత ని అవహేళన చేశారు!

అదంతా గతం..

నేడు ప్రతీకారం తో రగులున్న భారతావని

తల్లి భరతమాత కష్టం తీర్చగా

"ఆపరేషన్ సిందూర్" అంటూ భరతమాతముద్దుబిడ్డలైన వీరులు 

శత్రుస్థావరాలై వైమానిక దళాల సాయంతో విరుచుకుపడ్డారు !

కేవలం 25 నిమిషాల్లోనే ఉగ్రమూకల మూలాలని సమూలం గా నాశనం చేశారు !

నేడు శత్రుదేశం తలెత్తి మనవైపు చూడాలంటేనే భయం కలిగేలా విధ్వంసం సృష్టించారు !     

దేశప్రజల రక్షణార్థమై   

ఎలాంటి సవాళ్ళకైనా సిద్దమంటూ 

భారతావని అంతటా 

"ఆపరేషన్ అభ్యాస్" నిర్వహిస్తూ 

జన జాగృతికి శ్రీకారం చుట్టిన

నరేంద్ర మోడి నాయకత్వం ప్రపంచానికే ఆదర్శం !  

            -రచన : గొర్రెపాటి శ్రీను 9652832290
4
కావ్యగానం సీజన్ 6
పహెల్గాం ఘటనకు ప్రత్యేక కవిత.
శీర్షిక:సాగదు ఈ దురాగతం!

చరిత్రలో రక్తసిక్త పుటగా పహెల్గాం
క్షమించరాని దురాగతం
చర్యకు ప్రతిచర్యే సమాధానం
ఆపరేషన్ సింధూర్ అసలు సిసలు ప్రతీకారం
దాయాదులు చేసే దుష్టకార్యం ఎన్నాళ్ళని సహిస్తాం
ఉగ్రవాద ఉన్మాదం ఎన్నాళని భరిస్తాం
శాంతికాముకలమని సహించలేరా
సర్వజనహితాన్ని ఓర్వలేరా
సాధిస్తున్న ప్రగతికి కన్నుకుట్టిందా
ఏమి సాధించాలని మీ ఉద్దేశం
ఎందుకింత కండకావరం
ఖబడ్ధార్ ఖభడ్ధార్ సాగదు మీదురాగతం
శాంతి సహనాలే మా ధ్యేయం
తీవ్రవాదాన్ని ఎంతమాత్రం సహించం
ఎన్ని కుతంత్రాలనైనా తిప్పికొడతాం
కులమతాల విధ్వేషం పెరగనివ్వం
సహజవనరులను సరిహద్దులను సంరక్షిస్తాం
ఒక్క నీటిచుక్కకూడ మీకివ్వం
ప్రజసంక్షేమం కన్నా సమరం కాదు ముఖ్యం
ఇకనైనా వెనక్కి తగ్గితే మీకే శుభం
శలభాలై అగ్నీకీలలకు బలికావొద్దని హెచ్చరిస్తున్నాం!

ఇది నాస్వీయరచన.
దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం.
5
సిందూరం నుదుటిపై దిద్దుకున్న భారత్,,,,,,,!!

పాకిస్థాన్ మతం గజ్జితో
ఏ పనీ చేతగాని వెధవలు
తిన్న తిండి వంటబట్టక
ఫారిన్ విస్కీలలో రక్తంకూడు తింటూ
కష్టపడి వళ్ళు వంచి పనిచేయని వెధవలు
అప్పనంగా వచ్చిన ఫారిన్ డబ్బు
మందుగుండు రైఫైల్స్ రాకెట్స్ తుపాకులు
టెర్రరిస్టుల పేరిట క్రూరమృగాళ్ళా
కైపెక్కిన డబ్బు మదంతో
అమాయకులకు ఆశచూపి
మనదేశంపై ఉసిగొలిపి జనసమ్మర్థ ప్రాంతాల్లో
బాంబులు వేసి ఉగ్రతాండవం చేసే
బడాబాబులు మతచాందసులు
తమ దేశంలో ఆకలి చావులు పేదరికంలో మగ్గినా
మతం గజ్జిలేసి మారణహోమం సృష్టిస్తే
మనదేశం లౌకిక దేశం ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు
నీ దేశం అస్తవ్యస్త పరిస్థితిలో
ఎక్కడా లా ఎండ్ ఆర్డర్ లేక చస్తుంటే
నీ దేశాన్ని బాగుచేసుకోలేని మతచాందసుడా
అభివృద్ధి చెందుతున్న నా దేశంలో
పొద్దస్తమానం కష్టపడి బ్రతికే కష్టజీవుల
నివాసాలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి
ఆడవాళ్లు పిల్లలను సైతం బాంబులతో బలిచేసే
నరరూప రాక్షసులను కనిపిస్తే కాల్చేయాలి
అందుకే మా ప్రభుత్వం చేపట్టింది
ఆపరేషన్ సింధూర్ టెర్రరిస్టులను ఏరివేయడానికి
ఈ పోరాటంలో సైనికుల లక్ష్యం
కేవలం ఉగ్రవాదుల మూకలు ముష్కరులను కూల్చివేయడానికే
సామాన్య పౌరుల జోలికి మా ప్రభుత్వం వెల్లదు గాక వెల్లదు
నీవు నీ మతచాందసం దొబ్బితిన్నది అరగని మూర్ఖత్వం
సజీవ సమాధి కావాలి ఖబడ్దార్ మతమౌఢ్యం రాక్షసులు,,,,,, ,,,,

అపరాజిత్
సూర్యాపేట

హామీపత్రం ఈ కవిత నా కలం సేత అని నా హామీ
6
వేమూరి సత్యవతి 
శీర్షిక..సింధూరం
తూరుపు సింధూరం కొత్త రోజుకి తెరతీస్తుంది!
భారతమాత సింధూరం ఉగ్రవాదంపై కత్తి దూసింది! 
నుదుటిపై మహిళ ధరించే కాశ్మీరకుంకుమలో
సాహచర్యపు మధువులే కాదు,సాహసాలున్నాయి!
అసమర్ధతనుకుంటే శాంతిని కూడా తోసిరాజంటుంది!
భావిపరిణామాలగురించిన చింతనతో క్షమాభిక్ష పెట్టినా.. పాత్రతలేని బిచ్చగాడికి
బుధ్ధి చెప్పాల్సిన ఘడియ వచ్చింది!
అడుగేయటం అవసరమే,కానీ
శాంతి కాముకత, యుద్ధ వైముఖ్యం
నర నరాన జీర్ణించుకున్న జాతి మనది!
అందుకే అందరూ అప్రమత్తమై,ఇరుగు పొరుగులా.. అడుగడుగునా అదృశ్యంగా నిలచి ఆత్మ ధైర్యాన్ని దెబ్బతీయాలని చూసే సైతానులను వేయి కళ్ళతో వెతుకుదాం! 
పిరికితనం లేని వీరభక్తిని ప్రకటిద్దాం! ఐకమత్యంతో అడుగు వేద్దాం!!
7
జ్యోతి JNTU
ఉగ్రపాక్ కి చూపిద్దాం మన ఉగ్ర రూపం


మా ఆడపడుచుల సింధూరాన్ని కాలరాసిన నీకు 
కాళరాత్రి చూపించింది మా ఖురేషి,
కవ్వింపు చర్యలతో కాలు దువ్వె ఓ పాక్
నీ కాళ్ళు విరిచేసింది మా వ్యోమీకా 

బుద్ది లోపించి ఆలోచన మందగించి 
మళ్ళీ మళ్ళీ కవ్విస్తావేలవేలసార్లు
లజ్జా రహితుడవై పారిపోతావే అన్నిసార్లు
గుణపాఠం నేర్పలేదా కొట్టిన దెబ్బ ప్రతిసారి 

అన్ని రంగాలలో అభివృద్ధి పథం లో నడిచే 
సోదర దేశాన్ని చూసి నేర్చుకోరాదా నడక
సస్య శ్యామలమైన నా దేశాన్ని , చూసి ఏడవకురా చేతనైతే చేసుకో నీ దేశాన్ని సుశ్యామలం

ఓర్వ లేని నీబుద్ధి నిన్నే ఊడ్చేస్తుంది
బుద్ధి మార్చుకో,బ్రతుకును తీర్చి దిద్దుకో 
చదువు మా దేవుడు చెప్పిన గీతను,
అదే మార్చేస్తుంది నీ తల రాతను

నా తల్లి నుదుటి సింధూరమే ఆ కాశ్మీరం 
ఆ సింధూర కాంతులే కాల్చేస్తాయి నిన్ను
 పారిపో ,బ్రతికిపో , వదిలి వెళ్ళి మా కాశ్మీరం 
వేడుకో ఇస్తాం సింధు నీటిని ,బ్రతికించుకో నమ్మిన నీ వారిని


మా భరతమాత సహనానికి అవధి ఉంది 
ఉగ్ర రూపంచూపిస్తే మీఉగ్రపాక్ తట్టుకుంటుందా?
మానవత్వాన్ని మడిచి మా సైన్యం విజృంభిస్తే 
మనిషి అనే వాడు మీపాక్ లో మిగులుతాడా?

8

జై జై జవాన్ !! జై జై కిసాన్ !!
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

ముందుగా....
దేశంకోసం...మనందరికోసం
తమప్రాణాలని పణంగాపెట్టి కదనభూమిలో కాలూనిన మనవీర సైనికులకు వందనం !!
వారికి వెన్నుతట్టి పంపిన వారి కుటుంబ సభ్యులకు ప్రణమిల్లుదాం !!
వారికి కంటిమీదకునుకు లేకున్నా , మనం కంటినిండా నిద్రపోతే చాలన్న వారి త్యాగానికి సాష్టాంగ ప్రణామం!!
ఉగ్రవాదమూకలస్థావరాలపై రుద్రతాండవమాడి,భరతమాత నుదుట "వీరసింధూరం" అద్దిన ముద్దుబిడ్డలు మనజవానులు !!

ఉగ్రవాదాన్ని ఉసిగొలిపి మనధర్మంమీద,మనకాశ్మీరంలోనే ముత్తైదువుల నుదుటకుంకుమ చెరిపేసిన ముష్కరమూకల నూకలుచెల్లేలా ప్రతినబూనుదాం !!
యుధ్ధంముగిసి శత్రువు శరణుజొచ్చేంతవరకూ ప్రతిఫౌరుడూ భాద్యత తో జీవనంసాగించాలి !!
విలాసజీవనానికి స్వస్తిచెప్పిసాత్వికతను అవలంబించాలి !!
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ , మనజన్మభూమి మనకిగొప్ప !!
స్వర్గంకంటే మిన్న మనభూమి !! 
మనభూమిని మనంకాపాడుకోవాలి !!ఎవడోవచ్చి"ఇదినాదంటే' ఎందుకూరుకోవాలీ..!??
మనవాదం మననాదం ఓంకారమవాలి !!
ఉగ్రవాద సానుభూతిపరుల వ్యాపారాలూ, నిత్యజీవన ఉద్యోగాల నిషేదం అత్యవసరం !! 
వారిబ్రతుకును దిగ్భంధనం చేయాలి సత్వరం !!
నీటికీ అన్నానికీ దూరం పెడితేనే దొరికేది పరిష్కారం !!
భరతమాతబిడ్డలం మనం
ఒకటేజట్టుగా కలిసికట్టుగా
హరోంహరాఅనికదిలొద్దాం!
ఢమరనాదాన్నివినిపిద్దాం!!
ప్రణవనాదాన్నిపలికిద్దాం!!!
విజయకేతనం ఎగరేద్దాం !!!!
జై జవాన్ !! జై కిసాన్ !!!
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳

           -----మండ.నాగేశ్వర్రావు.
                  విశాఖ పట్టణం,
9
కం//💐💐💐

మోదీజీ మావాడై
దాదాగిరి చేయగలడు దాయాదులపై
పాదమ్ములు మోపగలడు,
కాదను దమ్మున్న వాడు గలడే కృష్ణా!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల.సూర్యాపేట!!
10
కవిత గానము 

పాకిస్థాన్ పై భారత్ దాడి

ప్రతికార చర్య మొదలైంది
పాకిస్థాన్ గుండె దడ పెరిగింది

ఊరకే అనవసరంగా పెట్టుకున్నాము
భారత్ తో యుద్ధము చేయలేము

మేకపోతు గాంభీర్యము చూపినాము
భారత్ తోయుద్ధము చేయలేము

నిన్న అర్థరాత్రి దాటిన తర్వాత
తుపాకుల మోత మోగించారు

ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల
వర్షము కురిపించిన భారత్

ఉగ్రవాదాన్ని అంతము చేయాలని
కృతకృత్యము చేసిన భారత్ సేన

సై అంటే సై అనే భారతము
కవ్వింపు చర్యలకు తిప్పికొట్టిన
భారతము

మారణ హోమము సృష్టించాలని
పాకిస్థాన్ వ్యూహము 
చేత కాక చేయలేక చతికిలబడిన
అహము 

ఎక్కడి కక్కడ కట్టడి చేశాము
ఎవరిని అంతగా ఊరకే వదలిపెట్టము

ఇరవై ఆరు మంది ఇల్లాండ్ర కుంకుమ చేరిపేసిన పాక్

మీకు పెట్టక తప్పదు చెక్
లుక్ అట్ ఫస్ట్ సైటు ఇస్తాము

పీఒకే మొప్పై కిలోమీటర్ల దూరంలో వున్న సవాయినాలా నాశనము
వాస్తవాధీన రేఖ దాటకుండా
ఆపరేషన్ పూర్తి చేసిన సైన్యము

అయినా పాకిస్థాన్ పౌరులకు చీమ కుట్టినంత హాని జరుగలేదు

అది భారతము అంటే
అది మన సత్తా అంటే
అది మన ధైర్యమంటే
అది మన స్థిరత్వమంటే
అది మన సైనికుల నైపుణ్యమంటే
అది మన వీరుల కౌశలమంటే!!

                      కవిత వెంకటేశ్వర్లు
స్వీయ రచన అని హామీ
11
8-5-25
శీర్షిక: సింధుర సూర్యోదయం

ఇక...
నీ దివారాత్రాలన్ని
దుఃఖంతో ముంచబడతాయి
నీ క్షణాలన్ని మరణాలతో నింపబడతాయి
నీ కళ్ళ కింద నిద్ర కూడా మందు పాతరాల పేలుతుంది
నీ దేశంలో ఇక విషాదాపు ఉషోదయమే పొడుస్తుంది
 ఛింద్రమైన నీ పెంపుడు మృత్యువు దేహల్ని
నీ జెండాలోమూట కట్టుకొని ప్రపంచం ముందు నిసహాయంగా నిలబడతావు...

ఎందుకంటే ఒక మహా సింధువును 
నీ రాబందు రెక్కలతో చీల్చలేవు 
ధర్మ కవచం ధరించిన నా దేశంలోని 
మట్టి రేణువు కూడా పట్టుకెళ్లలెవ్ 
నీ చీకటి వ్యూహాన్ని చీలుస్తూ
 నీ దేశపు నడిరేయి నెత్తిన ఇక 
ప్రతిరోజు సింధూరపు సూర్యోదయం 
 మిమ్మల్ని పేలుస్తూనే ఉంటుంది...
 మేము ఇప్పటికీ శాంతికాముకులమే 
 మా జోలికి రానంతవరకు...

                              ఆర్. వి. వి రాజా
                              శృంగారాయునిపాలెం
12

          ఖబడ్దార్....!
   కోరాడ నరసింహా రావు 
        ************
సిందూర్... శహభాష్.....!  
 శహభాష్...! సిందూర్...!! 👏👏👏👏💐🙏🌷👌👍✌️🤝🎷🎺🎻🎼******************
     ఇది కదా మన భారతీయత..!
   అహింస యే మన పరమ ధర్మము..!
   పదుగురు నిరప రాదు లను చంపవచ్చిన వాని చెయ్యిని, కాదు...తలను నరకటమే ముమ్మాటికీ ధర్మము...!
    ఇది హింస కానే కాదు... శాంతి స్థాపన...! ధర్మసం స్థాపన..!!

కులం పేరుతో...
  మతం పేరుతో...
 మితిమీరిన అధికార దాహంతో....
   తోటి, సాటి మనుషులను చంపటాన్ని పైశాచికం అనటంకూడా తక్కువే....!

అటువంటి వాళ్లకు వేసే శిక్ష 
   ఎంత భయంకరంగా ఉండాలి అంటే....,
    వాళ్ళు కలవరింతలతో కలలో కూడా వనికి పోవాలి !

మీ దుర్మార్గపు అకృత్యాన్ని  
మోడీ కి చెప్పుకోవాలా ..!?
   మోడీకి కాదురా లుచ్చా !
  ఈ భారత మాత ఆడబిడ్డలు చాలురా... మీ బతుకులకి !

మా సహనాన్ని పదే పదే రెచ్చ గొట్టటమంటే...
  మీ తలలకు మీరే కొరివి పెట్టుకోవటమే.... అని ఇంకెన్నిమార్లు బుధ్ధి చెప్పాలిరా మీకు...?!

ఇంతకాలమూ... హింసా,దౌర్జన్యాలతో మీరు ఏమి సాధించారు రా...?!

వందమందిని చంపటం కాదు.... ఒక్కరికైనా బ్రతుకు నివ్వు... అదిరా మానవత్వం!
.
ఈభరత భూమి ఒక్కమారు కన్నెర్ర జేస్తే...
 నామరూపాల్లేకుండా మాడి, మసై పోతార్రా మూర్ఖుల్లారా...!!

ఇదే... మీకు ఆఖరి అవకాశం...!
   మీ నామ రూపాలు లేని 
 సర్వ నాశనాన్ని మీరు కోరుకోకుంటే...,
 ఇలాంటి దురాగతాలకు మరోమారు పాల్పడవద్దు ! ఖబడ్దార్...!!
     ****#******#****
13
జైజవాన్! జై భారత్!!


మతం పేర ఉన్మాదం ఉగ్రవాదుల అమానుషం

పహల్ గామ్ దాడిలో 
చిందిన అమాయకుల ప్రతి రక్తపు బొట్టు 
ఈ అమానుషం ఇంకెన్నాళ్ళు అని భారతీయులందరు
ప్రశ్నిస్తున్న వేళ

మేమున్నాం అంటూ
మన సైనిక బలగాలు 
రొమ్ములు చూపి ఎదురునిలుస్తూ
మనకోసం నిలబడి
పోరాడుతున్నాయి 
ఆపరేషన్ సింధూర్ తో
భారత భూమికి వీర తిలకం 
దిద్దిన వీర సైనికులకు చేస్తున్నాం సలామ్ 

భారత మాత ముద్దు బిడ్డల బలి దానం దాయాదుల పాలిటి మృత్యువు కానుంది 
డ్రోన్ లతో వచ్చిన
మిసైల్ విసిరిన
నీ వెన్ను విరిచి బొంద పెట్టగల వజ్రాయుధాలు
మా సైనికులు   

నీటిలోంచి వచ్చిన 
రోడ్డు ద్వారా చేరాలన్న
గాలిలో ఎగిరొచ్చిన
నిన్నంతమొందించగల
గాండీవాలు మా భరత దేశ
సైనికులు 

ముష్కర మూకల్లార
నా దేశ ప్రజల ఓపిక 
నీ బలం అనుకొని 
ఆక్రమణ కొస్తే
నీ అంతం తప్పదు 
భారత త్రివిధ దళాల కు
భారత జాతి యావత్తూ 
మద్దతు గా వుంది 
మా రక్షణకై వారు వేసే
ప్రతి అడుగు లో మేముంటాం
ప్రభుత్వానికి మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం
 జై జువాన్! జై భారత్!!
..... మధు మోహన్ వుదయగిరి
14
ఆపరేషన్ సింధూరన్ అభినందిస్తూ
  తారీకు :9/5/25
   వారం: శుక్రవారం 
    రచన: డాక్టర్ బల్లూరి ఉమాదేవి     
   శీర్షిక: ఘనవిజయం 


 విజయానికి చిహ్నం సింధూరం
నారీ శక్తి ని జగతికిచాటగనెంచి
ముందడుగులు వేశారు నారీ మణులు
సాటి మగువల సింధూరం తుడిచిన
మతోన్మాదుల మదమణిచినదీ స్త్రీ శక్తి 
కదనరంగంలో కాళీమాతలుగ విజృంభించి 
అలనాటి ఆదిశక్తి నే తలపించారీనాడు
గగన విహారం చేస్తూ శత్రుమూకలను
కాలరాచి మృత్యు గహ్వరానికే పంపారు
“ఆపరేషన్ సింధూర్” పేరిట ఆడపులుల్లా
విజృంభించి తమ సత్తానే చూపారు
విజయకేతనం ఎగురవేశారు గగనంలో 
ప్రేమను పంచడానికైనా పగసాధించడానికైనా 
మేము సైతం సిద్ధమంటూ రంగంలో దుమికిన
మహిళా శక్తికి అందిద్దాం మన జోహార్లు 
మతం కన్నా దేశం అభిమతం ముఖ్యమైన ఈ
మాటల్లో కాక చేతల్లో చూపుతున్నారదిగదిగో
శత్రు నిర్మూలనంచేసినభారతమాత ముద్దుబిడ్డలకు
అందిద్దాం అభినందన మందార మాలలు
ఉగ్రవాదం నిర్మూలన చేసేవారిని ప్రోత్సాహిద్దాం
వెనుకడుగువేయని స్త్రీ శక్తికి జోహార్లర్పిద్దాం.

డా బల్లూరి ఉమాదేవి

15
తోట సులోచన
నెల్లూరు
అంశం ఆపరేషన్ సింధూర్
శీర్షిక .. జై జవాన్

మనిషిని చంపితే గాని మతం బ్రతకదా
మనుషులను హతమార్చి రక్తపు టేరులు పారిస్తారా
ప్రజలు భయం గుప్పిట్లో విలవిల లాడుతుంటే
హాహాకారాలతో ఉన్మాదానికి పరాకాష్ట ప్రారంభమే
ఈ ఘాతుకానికి స్వస్తి పలుకకపోతే
మనిషి జీవనం అస్తవ్యస్తమే

అందాలు చిందిస్తూ, ప్రశాంత పవనాలతో నలరారుతూ
పర్యాటకుల సందడితో మిల మిల మెరుస్తూ
కాశ్మీరం ఆనందాల పొదరిల్లుగా మురిసిపోతుంటే
ఉన్మాద శక్తులు చెలరేగి, భీభత్సం సృష్టించితే
దేశమంతా యుగ్రవాదానికి వ్యతిరేకంగా 
నినాదాల హోరుతో యురకలెత్తగా
మానవత్వం తలయెత్తి గర్వంతో నిలువగా
ప్రజల్లో అణువణువునా దేశభక్తి వరదలా
పొంగి ప్రభుత్వం తగిన చర్యలకు సంసిద్దమాయే

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమై
లౌకిక దేశమై,మానవులంతా సమానమంటూ
జాతి, మత, కుల వివక్షకు స్వస్తి చెప్పి
విలసిల్లుతున్న భారతదేశంలో 
ఈ దాడులను సమాధి చేయాలని
దేశమంతా యేకమై నిరసనలు, దీక్షలతో
ప్రశాంతంగా మానవత్వానికి జేజేలు 
పలుకుతుంటే
అరాచకాలు,దాడులు,అమానుషత్వాలు
తోక ముడిచి ఫలాయనం చేయదా
ఇట్టి దుర్మార్గాల అంతాని కందరు
సహకరించి, దేశభక్తితో అణువణువు 
పులకించగా
మారణ హోమాలకు ముగింపు యివ్వాల్సిందే
దేశం శాంతి, సౌభాగ్యలతో వృద్ధి సాధించాలని
మనసారా కోరుకుందాం

ఈ కవిత నా స్వంతమని హామీ
16
అంశం: సిందూర్ ఆపరేషన్
శీర్షిక : గర్జించు సైనికా...!
రచన: జి.సూర్యనారాయణ,
ఊరు: అవనిగడ్డ, కృష్ణాజిల్లా.
--------------------------------

మదమెక్కిన ముష్కరులు
అందాల కాశ్మీరం నుదుట
సిందూరాన్ని తుడిచి వేసి
ఆసేతు హిమాచలం వరకు
దేశభక్తిని శక్తిగా రగిలించారు
కోట్ల మందిని.. వీర సైనికులుగా మార్చేశారు...!

సిందూరం నామధేయంతో
భారత సైనికులు చేస్తున్న 
ఆపరేషన్ కి హడలి చచ్చిరి
ఉగ్రపాలు తాగిన ఉగ్రవాదులు
మత్తెక్కిన మతోన్మాదులంతా...!

భారత దేశమంటే శాంతి నిలయం
భారతీయులంతా... పొరుగువారిని ప్రేమించే వారే
భారతీయుల సహనాన్ని పరీక్షిస్తే..ప్రతీకారం తప్పదు మరి...!

గర్జించు వీర సైనికా...
నిర్జించు ఉగ్రవాదాన్ని 
తప్పించు మన దేశానికి
మతోన్మాదుల ఉత్పాతాన్ని..!

*జి.సూర్యనారాయణ, 6281725659.*
17
 సింధూర్ 
రచన: గజవెళ్ళి శ్రీనివాసాచారి 
శీర్షిక: నరమేధం 
@@@
తెల్లని కొండల్లో నెత్తురు ధారలు 
కశ్మీరు లోయలో ఉగ్రవాదుల నరమేధం 
పహల్గావ్ లోని పచ్చిక బయళ్ళలో
ప్రకృతి అందాలను చూసి పరవశించే
పర్యాటకులపై పాశవిక దాడి
ఉగ్రమూకల విచక్షణారహిత కాల్పులు 
కాశ్మీర్ కుంకుమ పువ్వు 
రుధిరంతో తడిసిన దృశ్యము 
ఇది దారుణ మారణకాండ 
దేశంలో నింపింది పెను విషాదం 
అనేక కుటుంబాలలో తీరని శోకం

ఆపరేషన్ సింధూర్ పేరిట 
ఉగ్రవాదులను తుదముట్టించగ 
అత్యంత ఖచ్చితత్వంతో 
మన వాయు సైన్యం 
ఉగ్రవాదుల శిబిరాలపై
బాంబులు ప్రయోగించె 
వందమంది ఉగ్రవాదులు హతమవగ 
మన సైనికులు చూపిన 
ధైర్యసాహసాలు మరువలేనివి 

త్రివిధ దళాలు సమన్వయంతో 
పాకిస్థాన్ పై జరిపిన దాడులతో 
కకావికలైన దాయాది దేశం 

ప్రభుత్వ చర్యలకు 
మనమంతా అండగా నిలబడాలి 
జయహో భారత్
18
*అంశం:ఆపరేషన్ సిందుర్*
*శీర్షిక:రక్త తర్పణం*

భారతదేశం వీరత్వానికి ప్రతీక
ఆత్మాభిమానానికి అసలైన వేదిక
రాముడు ఏలిన ప్రజాస్వామిక
అహింసకు ఆనవాలు ఈ భువనైక

భిన్నత్వంలో ఏకత్వమై విరాజిల్లుతున్న అవని
సర్వమత సమ్మేళనమై జీవిస్తున్న ధరణి
ఉగ్రవాదం పేరుతో అమాయకుల ఉసురు తీస్తే ఊరుకోం
ఉవ్వెత్తున ఎగిసి ఉగ్రవాదం కుత్తుకలు కత్తిరిస్తాం

హిందు రక్తంలో లేదు హింసావాదం
అందరిని చూస్తుంది సమానంగా
మాకు జిహాద్ లు లేవు
అందరూ మాకు సోదర సమానమే

హింస ఏ రోజు మనలేదు
ఓ ఉగ్రవాదమా చరిత్ర చదివి చూడు
భారత ఔన్నత్యం తెలుసుకో
ఇకనైనా చాలించు ఈ క్రూర దానవ కృత్యం

వంద కోట్ల జనాభా మీ అరాచకం చూస్తుంది
తిరగబడితే ముక్కలవాల్సిందే నీ ఉగ్రఅహంకారం
ఈ సింధూరం మీ పాలిట రక్త తర్పణం
చాలించుకో నీ ఆరాచకత్వం,హింసావాదం

*పేరు:వనపర్తి గంగాధర్*
*ఊరు:హన్మకొండ*
19
 సిందూరం 
వాణిసరోజిని లక్కరాజు 

భూదేవికున్న ఓర్పు 
సముద్రానికున్నంత నిబధ్ధత 
పిడుగుకున్న బలిమి 
అంతకుమించి శాంతికాముకత 
భారతావనిసొంతం 
దేనికైనా హద్దంటూ ఒకటుంటుందికదా !
ఓర్పునసించిన భూమిబద్దలవుతుంది 
హద్దుమీరి సముద్రం వుప్పెన గా మారుతుంది 
పిడుగుపాటకుమొత్తంమాడి మసియౌతుంది అదేజరిగిందినేడు 
పహల్గామ్ లో ప్రేమజంటల బతుకు చిదిమి 
పైశాచికానందం పొందిన వుగ్రమూకల వూపి రాగింది. 
భరతమాత నుదుట నలదిన సిందూరం 
శత్రుమూకల చెండాడేందుకు యెఱ్ఱ జండానెగరేసింది 
నిదురలేపి రెచ్చగొట్టినరీతి , శాంతి సౌభ్రాతృత్వపు 
చల్లని నీడలో సేదదీరే భారతాంబను ,
కవ్వించి కాలుదువ్వింది పాక్. 
అపరహనుమంతుడై మోడీజీ త్రివిధధళాలకు 
తిప్పికొట్టేందుకు గట్టి యండై నిలచారు 
ఉగ్రవాదుల స్థావరాలు మాడిమసిగాగ 
పంతంగా పగతీర్చుకోటానికి పాకీస్థాన్ తెగబడింది. 
భారత్ లోని జనావాసాలపై దాడి మొదలుపెట్టింది 
సిందూరం చెరగకుండా సైనికులుతిప్పికొట్టారు 
సిందూర్ 2మొదలయి యుధ్ధం భీకరమై
పాకిస్థాన్ డ్రోన్లు మిసైల్స్ ను పడగొట్టింది భారత్. 
పలుజాగ్రత్తలుచెప్పి, యప్రమత్తం చేసింది ప్రభుత్వం 
అమ్మభారతికి యలదిన సిందూరం చెరగకుండా 
శత్రుమూకలను చీల్చి చండాడారు మనసైన్యం 
భగవద్గీత సందేశం భారతీయులకు నాచరణీయం 
శత్రుమూకలచండాడి సత్యంగెలిపించాలి 
ధర్మోరక్షతి రక్షితగా. ధర్మరక్షణ జరిగి. ధరనున్యాయం గె లవాలి .అదేమనలక్ష్యం 
అదేమనకోరిక. 
జైభారత్ 

20
 ప్రభుత్వ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పురస్కార గ్రహీత సింహాద్రి వాణి
శీర్షిక:-- భారత మాతకు జై.

మతం కోసం మానవత్వాన్ని మంటలపాలుజేసే మూర్ఖులారా,
మతం పేరిట మారణహోమం సృష్టిస్తూ, ఉగ్రవాదంతో ఊరేగే దుర్మార్గులారా,
ఇప్పుడర్థమౌతోందా, ప్రాణభయం ఎంత దుర్భరమో?
చంపవద్దని వేడుకున్నా, వదిలిపెట్టక కాల్చి చంపిన కసాయిమూకలారా,
భారతీయులేం చవట దద్దమ్మలు కాదు, అణువు అణువునా దేశభక్తి నిండిన భరతమాత బిడ్డలు, వీర సింహాలు.
ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే సహనం మా భారతీయులకున్నా, ఆ సహనం హద్దు దాటితే ముష్కరులు ఫలితం అనుభవించక తప్పదు. 
సింహంముందు చిట్టెలుక పారిపోయి తల దాచుకోవలసిందే.
మాలోని శాంతిసహనాలను రెచ్చగొడితే మాలో వున్న ప్రతి అణువులోని దేశభక్తి, పౌరుషం, ఆత్మాభిమానం త్రివేణీ సంగమమై ఉప్పొంగి శత్రుదేశాన్ని ముంచెత్తి, సర్వనాశనం చేస్తుంది.
అర్థరాత్రి దాటిన తర్వాత ఉగ్రమూకల శిబిరాలపై దాడులు‌చేసి మా యుద్ధ నైపుణ్యాన్ని రుచి చూపించాం.
ముష్కరుల అమానుష ఉగ్రదాడిలో ఈ రోజున వీరమరణం పొందిన మురళీ నాయక్, నీకివేమా అశ్రుపూరిత నయనాలతో నివాళులు. 
నాయక్, నీ ప్రాణత్యాగం, నీలాంటి‌ వీరజవానుల శౌర్యం ఊరికే పోదు, శత్రుదేశానికి మరచిపోలేని ప్రతీకార చర్యతో తగిన గుణపాఠం చెప్పి, అంతిమ విజయంతో వీరులకు నివాళులర్పిస్తాం.
భారత మాతకు జై.

హామీ:-- ఇది నా స్వీయ రచన.
21
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
ఊరు:-విశాఖపట్నం
అంశం:- ఆపరేషన్ సింధూర్.
శీర్షిక:-ధర్మో రక్షతి రక్షితః
..............................
సనాతన సంప్రదాయాల పుట్టినిల్లు
భరతావని వసుదైకానికే ఆదర్శం
జగతిన ఉన్న ప్రజలంతా పరమేశ్వర స్వరూపులేనని
మానవత్వమే మాధవత్వమని
శాంతి అహింసలే ప్రగతికి సోపానాలని
పరమత సహనం భిన్నత్వంలో ఏకత్వంగా నిలిచే దేశంలో
పహల్గాం లో జరిగిన నరమేథ0
మతం పేరడిగి ఇరవై ఏడు మందిని పొట్టబెట్టుకుని
కుటుంబకోతకు కారణమై
సౌభాగ్యానికి చిహ్నమైన సింధూరాన్ని తొలగించి వ్యథకు కు కారణమైన
పాక్ ముష్కరులారా
మీ నరమేథానికి ప్రతీకగా "ఆపరేషన్ సిందూర్" పేరిట
మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ అదేశంతో
కేవలం ఇరవై ఏడు నిమిషాల్లో
ఇద్దరు స్త్రీలు కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ నేతృత్వంలో అపర దుర్గలై
మట్టికరిపించి 
విజయానికి కారణమైన సంఘటన
నూటనలుబది కోట్ల భారతీయుల విజయమే.

ఖబడ్దార్ ఒక చెంప కొడితే రెండవ చెంప చూపే రోజులు పోయాయి
ప్రతి స్త్రీ అపర దుర్గలే 
రాణి రుద్రమ, ఝాన్సీ లక్ష్మీ బాయ్ వారసులే
వీరాశివాజీ రాణా ప్రతాప్
భగత్ సింగ్ ,అల్లూరి వారసులమని మరువకండి
ఆనాటి కురుక్షేత్ర యుద్ధం
ధర్మయుద్ధమే
నేటి ఆపరేషన్ సింధూర్
"ధర్మోరక్షతి రక్షితః" కు ప్రతీక
అంతిమవిజయం మాదే...!!
.........................
ఇది నా స్వీయరచన
కవిమిత్ర, సాహిత్యరత్న
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
 విశాఖపట్నం
9963265762
...........................
22
ఉగ్రవాద ఉనికి భూభువన నభోంతరాళలో వెదికినా
దొరక కూడదు
ఉగ్రవాదం సర్వ నాశనానికి సోపానం 
కన్నీళ్ల ధారలై కన్నె పిల్లనుండి వృద్ధుల దాక కష్ట పెట్టి
మత మార్పిడి జేసిఉగ్రవాదులు గా తయారుజేసే
నిరంకుశ త్వానికి వీడ్కోలు చెప్పాలి
ఘోరాతి ఘోరకృత్యం ఉగ్రవాదం 
మతం ముసుగులో ఉన్మాదులై హింసాత్మాక చర్యలు తలపెట్టే ఉగ్రవాదం నశించాలి
ఎవరి మతం లో వారు ధర్మంగా వుండే స్వేచ్ఛ కావాలంటే
ఉగ్రవాదం అరకట్టాలి
 శాంతి పతాకం ఎగురావేయాలి
ఆక్రోశం పెల్లుబికి అగ్ని జ్వాలలై మండింప జేసే
ఉగ్రవాదం నశించాలి 
ఉగ్రవాదాన్ని నామ రూపాలు లేకుండా చేయాలి

 భజరంగభళి హనుమలా ముష్కర రాక్ష సులను హతమార్చాలి
నృసింహ మూర్తిలా గర్జన జేసి చీల్చి చెండాడి వాళ్ళ రక్తం కళ్ళ జూడాలి
పరశురామగొడ్డలి వేటుకి అసురుల తలలు తెగాలి
తిరుగులేని రామ బాణం ఉగ్రవాదుల గుండెల్లో దిగాలి
గీతాచార్యుడు కృష్ణుని సారధ్యమ్ లో విజయం ధర్మానిదే
స్వాతంత్ర పోరాట యోధులు మళ్ళీ జన్మించాలి
భూమాత భారం తగ్గించాలి
లలితా మహా దేవి శక్తి సేనల స్ఫూర్తి తో దౌర్జన్యాన్ని అణగ త్రోక్కాలి
మతోన్మాద శక్తులు నిస్సత్తు వుగా మాసిపోవాలి
ఉగ్రవాద స్థావరాలు ప్రశాంతి నిలయాలుగా మారాలి
మసీదయినా, దేవాలయమైనా, చర్చి అయినా అందులో ఉండేది
ధర్మాత్ములే త్యాగధనులే శాంతిదూతలే
సర్వమత సమానత్వం తో స్వచ్ఛ, స్వేచ్ఛా భారత్
ముందడగు వేసి అభివృద్ధి పథంలో ఉన్నత శిఖరాలు
అధిరోహించాలి
భారత ధీర వీర శూర సైనికులారా! నిస్వార్ధ దేశ భక్తులరా! ధన్య జీవులారా! ఉగ్రవాదులపై జయం మీదే
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽💐💐💐💐💐
తంగిరాల నాగలక్ష్మి
23
శ్రీమతి నెల్లూరు వేంకటలక్ష్మిగారు
భిన్నత్వంలో ఏకత్వానికి 
ప్రతీకగా నిలచిన 
భారతదేశపు ప్రకృతి అందాలకు 
ముగ్ధులై మైమరిచి
పరవశిస్తున్న పర్యాటకులపై
ఉగ్ర పంజా విసిరింది 
పహల్గాం ఎరుపెక్కింది 
అతివల ఆర్తనాదాలతో 
దిక్కులు పిక్కటిల్లాయి
కాశ్మీరం మూగబోయింది 

మతోన్మాదుల మదం అణచడానికి 
నేలరాలిన సింధూరం సాక్షి గా 
సమర సైనికులు సై అంటూ
శంఖం పూరించారు 
మానవత్వం మరచిన 
ముష్కరులను మట్టు పెట్టి
ఆడపడుచుల కన్నీటికి 
భరతమాత ముద్దుబిడ్డలుగా
ఋణం తీర్చుకున్నారు
తిరుగు లేని విజయంతో
శిఖరాగ్రాన నిలిచి
సెల్యూట్ కొట్టారు
జై భారత్ అంటూ...

ఈ కవిత నా స్వంతం ఇది దేనికి అనుకరణ అనువాదం కాదని హామీ ఇస్తున్నాను.
24
ఏడెల్లి రాములు‌ 
*కాళుని స్వైర విహారం*
 
నా దేశమంటే నూట నలభై కోట్ల ఏకాత్మ
స్వరం 
సహనం సంయమనం సౌశీల్యం మా ఆభరణం 
ధైర్య శౌర్య దాన వీర శూర షోడషగుణ
రూపలావణ్యం
మదోన్మత్తులను నుసి నుసి చేసే సాహసం 
ప్రపంచ శాంతిని కోరుకునే గీతామృత తత్వం

డెబ్భై ఏళ్ళ నుండి దాయాది ఉన్మాదం 
సఖ్యతకు లొంగని రాక్షస వైరం 

మనిషన్నవాడికి మనిషితనంలో మంచితనమే మహా సుగుణం
రాకాసి అంటేనే ఘోర కౄర నేర స్వభావం 
 
వాడి జబ్బును నయం చేసే మందేముందీ!
మంచి వినరు కనరు 
నెయ్యమంటేనే కయ్యమంటరు 
కరుకుదనంలో కరుణ క్రమశిక్షణ 
సమున్నత విలువల వెన్నెలరాశి ఉండాలిగా 
వీడేమో మర్మాంగాన్ని చూసి కపాలాలు
కంఠమాలగా వేసుకుని పాపి అంటే ఒప్పుకోడు?
నూతన వధువు సింధూరం తుడిచేస్తడు!!

వీడికి మందులకు లొంగని జబ్బు చేసింది 
మంచిమాటల్తో దారికిరాకుండా దారి తప్పిండు 

వీడి పచ్చి నెత్తురు తాగే పిశాచి పిచ్చికి
కర్రు ఎర్రగా కాల్చి వాత పెట్టడమే
బుర్ర భూమ్మీద లేకుండా దుష్టశిక్షణ అవసరమే

మనిషి లక్షణాలు లేనోడిని సలక్షణంగా
వాడి జబ్బుకు వాడి చెయ్యే వాడి నెత్తిన 
పెట్టడమే

అన్నట్లు 
వినండి 
వీడికి చావు తప్ప జనాభా లెక్కల్లో చోటులేదు 
వీడిని మనిషి అంటేనే మహా పాపం సుమీ! 

మన నూతన వధువుల కన్నీళ్ళే 
వీడి పాలిట యమపాశాలై వెంటాడుతాయి
ఇది కాల నిర్ణయం 
కాళుని స్వైర విహార రాక్షస సంహార క్రీడ

ఏడెల్లి రాములు‌ ✍️ 
ది*09*05*2025(10*36)
ఎల్కలపెల్లి🌹 
పెద్దపల్లి*జిల్లా

[09/05, 8:52 pm] +64 21 233 1334: ఉగ్రవాదం
*********
ఉగ్రవాద ఉనికి భూభువన నభోంతరాళలో వెదికినా
దొరక కూడదు
ఉగ్రవాదం సర్వ నాశనానికి సోపానం 
కన్నీళ్ల ధారలై కన్నె పిల్లనుండి వృద్ధుల దాక కష్ట పెట్టి
మత మార్పిడి జేసిఉగ్రవాదులు గా తయారుజేసే
నిరంకుశ త్వానికి వీడ్కోలు చెప్పాలి
ఘోరాతి ఘోరకృత్యం ఉగ్రవాదం 
మతం ముసుగులో ఉన్మాదులై హింసాత్మాక చర్యలు తలపెట్టే ఉగ్రవాదం నశించాలి
ఎవరి మతం లో వారు ధర్మంగా వుండే స్వేచ్ఛ కావాలంటే
ఉగ్రవాదం అరకట్టాలి
 శాంతి పతాకం ఎగురావేయాలి
ఆక్రోశం పెల్లుబికి అగ్ని జ్వాలలై మండింప జేసే
ఉగ్రవాదం నశించాలి 
ఉగ్రవాదాన్ని నామ రూపాలు లేకుండా చేయాలి

 భజరంగభళి హనుమలా ముష్కర రాక్ష సులను హతమార్చాలి
నృసింహ మూర్తిలా గర్జన జేసి చీల్చి చెండాడి వాళ్ళ రక్తం కళ్ళ జూడాలి
పరశురామగొడ్డలి వేటుకి అసురుల తలలు తెగాలి
తిరుగులేని రామ బాణం ఉగ్రవాదుల గుండెల్లో దిగాలి
గీతాచార్యుడు కృష్ణుని సారధ్యమ్ లో విజయం ధర్మానిదే
స్వాతంత్ర పోరాట యోధులు మళ్ళీ జన్మించాలి
భూమాత భారం తగ్గించాలి
లలితా మహా దేవి శక్తి సేనల స్ఫూర్తి తో దౌర్జన్యాన్ని అణగ త్రోక్కాలి
మతోన్మాద శక్తులు నిస్సత్తు వుగా మాసిపోవాలి
ఉగ్రవాద స్థావరాలు ప్రశాంతి నిలయాలుగా మారాలి
మసీదయినా, దేవాలయమైనా, చర్చి అయినా అందులో ఉండేది
ధర్మాత్ములే త్యాగధనులే శాంతిదూతలే
సర్వమత సమానత్వం తో స్వచ్ఛ, స్వేచ్ఛా భారత్
ముందడగు వేసి అభివృద్ధి పథంలో ఉన్నత శిఖరాలు
అధిరోహించాలి
భారత ధీర వీర శూర సైనికులారా! నిస్వార్ధ దేశ భక్తులరా! ధన్య జీవులారా! ఉగ్రవాదులపై జయం మీదే
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽💐💐💐💐💐
తంగిరాల నాగలక్ష్మి
25
సింధూర్
తంగిరాల నాగలక్ష్మి
8-05-25
****
అందమైన సింధూర వర్ణం ఆకాశం లో ఆదిత్యునికే సొంతం
సువాసిని నుదుట సింధూరం సుహాసం
మన భారత మాత సింధూర ప్రణాళిక 
వెలుగు నివ్వాలి కనువిప్పు కావాలి
రక్కసులకు

ఉగ్రవాదుల దాడికి అన్యాయంగా ప్రాణాలు కోల్పోయి
నేల మీద రక్త సిక్తమైతే రగులుతాయి 
ప్రజల గుండెలలో ప్రభంజన జ్వలలు
అమాయకపు సామాన్య ప్రజానీకం పై అక్రమ దాడి జేసి కాల్పులు జరిపి ప్రాణాలు తీయటంఅమానుషం

ఎవరిచ్చారు హక్కు మనిషి మరోమనిషిని చంపటానికి?
ఉగ్రవాదం వల్ల ఒరిగేది ఏమిటి అన్నివిధాలా నష్టం తప్ప?
ఈ నేరాలకి శిక్ష ఏమిటి? 
ఉగ్రవాదం యుద్దానికి దారి తీసి జన నష్టం ప్రాణ నష్టం ఆర్ధికంగా ఇంకా ఎన్నో కోల్పోటానికి కారణం
ఇదా దేశ భక్తి?

ఏ మతమైన ఏ జాతుల అయినా అహింసకు పెద్ద పీట వేయాల్సిందే
 మత ధర్మం అర్ధం తెలిస్తే 
మత మార్పిడి ఆపాలి.
పరమత సహనం ఉండాలి
 స్వధర్మాచరణమే శ్రేయం
తెలుసు అందరికీ
ఎవరు వింటారీ మాట 
******
ఎందుకీ కులాలు, మతాలు మానవత్వం లేనప్పుడు
సత్యం ధర్మం ఆచరణ లో పెట్టనప్పుడు?
ఎలా పుట్టామో ఎలా పోతామో తెలిసి
ఎందుకీ కక్షలు కార్పణ్యాలు?
****
ఎందుకీ అధికార దాహం
అలెగ్జాండర్ చివరికి ఇచ్చిన ప్రబోధం అర్ధం తెలుసా
మతపర దేశం కావాలని పోరాడి న వాళ్ళకి మళ్ళీ భారతదేశంలో ఉండే అధికారమే లేదు లేదు లేదు ముమ్మాటికీ లేదు
కుట్రలు కుతంత్రాల ప్రయోజనం ఏమిటి?
కఠినాత్ములారా ధైర్యం ఉంటే కురుక్షేత్ర యుద్ధంలా
పోరాడి గెలవాలి
కర్మఫలం తప్పదు
*****
ఏది ఏమైనా ఉగ్రవాదం నాశనం అయ్యేది ఎప్పటికి
ఉగ్రవాద వృక్షాన్ని సమూలం గా వేళ్ళతో సహా పెరికి
 పారవేసే చోటు వెదకాలి మళ్ళీ మళ్ళీ మొలకెత్త కుండా
చరిత్ర ఎన్ని గుణపాఠాలు నేర్పినా బుర్రకెక్కని
కరడు గట్టిని ముష్కరులను ఏంచేయాలి?
కలం తో వ్రాసే కవితలు లెక్క కాదు వారికి
ఎలా మార్పు తేవాలి ఈ కలియుగ రాక్షసులలో?
****
భూగోళంలో వున్న వారందరూ తెలుసుకోవాలి
అహింసా మార్గం శాంతి దాయకం అదే అంతిమలక్ష్యం
సత్యమేవ జయతే ధర్మమేవ జయతే
*****
జై భారత్ జై భారత్ జై భారత్
           ***********
26
[09/05, 8:53 pm] Kuni Ankababu: కవితాగానం సీజన్ 6
 పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో నా కవిత

 కవి :కూని అంకబాబు
  శీర్షిక:యుద్ధ మేఘాలు

 పేరుకే మనకు దాయాది దేశం
 నిజానికి అది ఉగ్రవాద దేశం
 మతం రంగు పులుముకుని
 హింసా ప్రవృత్తిని ఒంటబట్టించుకోని
 అసలు స్థావరాలకు వేదిక అయింది

 కరుణకు తావు లేదక్కడ
 నీతికి ఆయవు లేదక్కడ
 అక్కడ అంతా అదే తంతు
 వికృత మనస్తత్వానికి ప్రతీకగా
 ఘోరాలకు నిలువైన నిలిచింది

 మతఛాందసాన్ని తలకెక్కించుకొని
 విషపు గాలులను వీస్తూ
 ఇరుదేశాల మధ్య వైషమ్యాలను రాజేస్తూ
 నీచ నికృష్ట పోకడలతో
 కొవ్వెక్కి కొట్టుకుంటున్న పాక్
 పక్కటెముకలు విరిచే
 సమయం ఆసన్నమైంది

 పహల్గామ్ ధమనకాండ కు ప్రతికగా
 ఆపరేషన్ సింధూరే తగిన జవాబు
 ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచేసిన
 పాక్ ఉగ్రమూకలకు తగిన మూల్యమది
 యుద్ధమేఘాలు కమ్ముకోకముందే
 పశ్చాత్తాపంతో పాక్ కళ్ళు తెరిస్తే బాగుండు
27
 పిన్నక నాగేశ్వరరావు గారు Poet: పిన్నక నాగేశ్వరరావు. 9--5--2025.
హైదరాబాద్.

శీర్షిక :-- ప్రతీకారం.

దొంగ చాటుగా దేశంలోకి ప్రవేశించి
ముందుగానే రెక్కీ నిర్వహించి
అమాయక పర్యాటకులు లక్ష్యంగా
ఇరవై ఆరు మందిని పొట్టనబెట్టుకొని
మతోన్మాదంతో ప్రవర్తించి పహల్గాంలో
ఉగ్రవాదులు పొందిన ప్రయోజనమేమిటి?
సముద్రంలో నీటిబొట్టంత
అయినా,ఇటువంటి దుశ్చర్యలు చర్విత
చర్వణం కాకుండా ఉండాలంటే
ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించాలి
ప్రతీకార జ్వాలతో రగిలిపోయింది ప్రభుత్వం
సమయం కోసం వేచి చూచింది
ఎవ్వరూ ఊహించని రీతిలో
ఉగ్రవాద స్థావరాలపై ఉరిమింది
ఒక అర్థరాత్రి........
పాకిస్థాన్ లోని నాలుగు స్థావరాలను,
పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఐదు స్థావరాలను
ధ్వంసం చేసి ప్రతీకారం తీర్చుకుంది
ఎనభై మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది
అప్పటికి కాని జ్వాల చల్లారలేదు
పాకిస్థాన్ ఊరుకుంటుందా?
భారత దేశంపై దాడులు మొదలుపెట్టింది
ప్రకటన లేని యుద్ధం మొదలైంది
దాడులను సమర్ధంగా తిప్పికొడుతూ
భారత దేశం దీటుగా జవాబు చెప్తున్నది
జరుగుతున్న యుద్ధంలో
మన తెలుగు సైనికుడు "మురళీ నాయక్"
వీర మరణం పొందటం దురదృష్టకరం
ఆ అమర వీరునికి సజల నయనాలతో
వీడ్కోలు చెప్పటం మనందరి కర్తవ్యం.
**************************************
28
[09/05, 9:27 pm] లలితాచండీ Poetess: *సిందూర్*

 
బారతీయ స్త్రీలకు  
నుదుట సాంప్రదాయ 
 ఆభరణమై నిలిచేది
 బాల భానుని లేలేత 
 కిరణాలలో చేరి జగతిని 
జాగృతిని చేసేది
రామదూతకు ఒడలెల్ల
ఆలయాలలోభక్తితో పూసేది
భరతమాత పతాకంలో నిస్వార్ధనికి చిహ్నంగా ఎగిరేది
త్యాగానికి మూలమై సన్యాసానికి సాలంకృతమై నిర్వికల్పస్థితికి మార్గంమై నడిచేది
వ్యత్యాసాలు లేని సామరస్య సంస్కృతిని భోధించేది
అగ్నికి ప్రతిరూపమై యుద్ధంలో సిధూర వ్యూహమై అరవీర భయంకరంగా మారి
విజయడంకా మ్రోగించేది
భరతమాత ముద్దు బిడ్డలైన జావానులకు కవచమై రక్షణగా నిలిచేది
జైహింద్ అంటూ
శంఖారావం పూరిస్తూ
దేశాన్ని విజయవంతంగా 
 నిలిపేది సిందూర్


లలితా చండి
రచయిత్రి /న్యాయవాది 
9885552922 
స్వీయ రచన✍️
9-5-2025
29
పిళ్ళా వెంకట రమణమూర్తి* 
*************************
శీర్షిక: *ఓ శత్రువు లారా* 


ఓ శత్రువు లారా!
మా సమాధానం కోసమేనా ఒక రహస్య మూలలో నిలబడి నిక్కి నిక్కి చూస్తున్నారు..

ఉగ్రవాదానికి జన్మనిచ్చిన నీచ నికృష్ట ద్రోహులారా..
ఎన్నో గొంతులు కోసి, మా ఆడపడుచుల నుదుట సింధూరం చెరిపి..
వలలు పన్ని కుట్రపూరిత వ్యూహాలు రచించి..
మాటల్ని విషపు కత్తుల్లా రువ్వి
ఎన్ని సార్లు లోపల్నించి వికృతంగా నవ్వుకుంటారు!

అకారణ ద్వేషాన్ని పాఠాలుగా వల్లె వేస్తారు..
అదే అద్దంలోంచి అందరి ముఖాలు చూస్తారు..
మీ ముఖం లేనితనాన్ని పొడి అక్షరాల కింద దాచేస్తారు..

మీ ఒంటరి గదిలో దీపం ఆర్పేముందు మీ లోపల ఖననం చేసిన మా పాత సమాధానాల పాత్రల్ని తవ్వి చూసుకోండి..

మీరు వదిలి వెళ్ళిన వికారమైన శబ్దాల హోరు
ఇక మీ ఉనికిని ఎలా అను వదిస్తుందో ఒకసారి ఊహించుకోండి...

ఆ ఊహకీ జాగా లేదంటారా...
మీ శవాలకి జాగరాలు చేసే కళ్ళుండవు..
పంచనామా వ్రాసే ఉక్కు చేతులు తప్ప..
మీ నుదుట మేం పూసే రక్త సింధూరం గుర్తులు తప్ప...

అరే సైతాన్ లారా!
మీ క్రౌర్యం యొక్క ప్రతిబింబాన్ని చమురు పొగ చూరిన ఆకాశంలో చూసుకోండి..
ఆయుధాలతో తప్ప వేరేగా ఎదురు పడలేని మీ 
పిరికితనం మాకు తెలుసు..
మీ పతన రహస్యం మాకు సుస్పష్టం,
మీరు రగిల్చిన అశ్రు కణాలు మీ దౌష్ట్యంపై విరుచుకుపడే సింధూర సింహాలు..
ఇక మీ అన్ని కదలికలకూ మా లక్ష్యం ఒక్కటే...
మీ సైతాన్ తత్త్వాన్ని ధ్వంసం చేయడమే!
"""""""""""""""""""'''''"""""""""""""""""""""
       హామీ పత్రం 
పైన పోస్ట్ చేసిన కవిత నా ఆలోచనా స్రవంతిలో జాలువారిన కవితయే అని హామీ ఇచ్చుచున్నాను.
30

అఫ్సర్ వలీషా గారు: మేరా భారత్ మహాన్ 

మానవత్వపు పరిమళాలు మరచి
మతం ముసుగులో మతోన్మాదం తో 
మహిళల సింధూరాన్ని మంటకలిపిన 
మానవ మృగాలను పెంచి పోషిస్తున్న 
మత దురహంకారి పాక్ కు యావత్ భారత్ ఆపరేషన్ సింధూర్ తో షాకిచ్చి
మహిళల నుదుట మీకు 
మేమున్నామనే ధైర్యపు సింధూరాన్ని ప్రసాదించింది..‌‌..

మౌనాన్ని చేతకాని తనంగా భావించిన  
మోసకారి పాక్ కు బలమైన మిస్సైల్స్ తో తిప్పి తిప్పి కొడుతున్నది మన భారత్...

మాటునుండి దొంగ దెబ్బ కొట
శీర్షిక :కథ ముగిసింది
33

ఇంకెన్ని గాయాలు చేస్తావ్?

విద్వేషపు దేహం తో నా దేశానికి ఇంకెన్ని గాయాలు చేస్తావ్??

నాడు విడిపోవాలనుకున్నావు 
దూరమై దగ్గరవుతావని 
నీ అభిమతాన్ని అడ్డుకోలేదు 

మతం పిచ్చితో ఎన్ని కుతంత్రాలు పన్నినా మనవాడేనని మన్నించాం

కసితో కసరత్తులెన్ని చేసినా మనిషి తత్వంతో ప్రేమించాం

పరిమితి దాటి సరిహద్దుల్లో దూరి ఆడబిడ్డల సిందూరాన్ని దూరం చేసిన
నీ అహాన్ని చల్లార్చలేమని విర్ర వీగితే కంట్లో నలుసుకు అలుసిచ్చినట్టే

సిందూరం విలువ తెలియజేయడం తండ్రి తక్షణకర్తవ్యమై రక్త *మోడి* స్తారని తెలుసుకోలేక పోయావ్

వ్యోమికా సోఫియాలచే వీర తిలకం దిద్దిస్తారని నిప్పుల వర్షం కురిపిస్తారని అంచనా వేయలేక పోయావ్


మారని నీ బుద్ధి మారణహోమాన్ని కోరుకుంటే ఎవరేం చేయగలరు?

పేరడిగి హతం చేయడం నీ మతమైతే 
మతోన్మాదులనే మట్టుపెట్టే మహోన్నత మానవత్వం మాది 

నీ పంచన ఉన్న దేశాలతో ప్రపంచానికి తెలిసొచ్చింది 
 నీ కథ ముగిసింది..

ఆకుపచ్చని రంగు నీ పతాక కే 
పచ్చని జీవితాలలో రుధిరం పారించ నీవు ప్రతీకవని

గుర్తుంచుకో...పహల్గామ్ ప్రతీకారం కాదు 
పాపం పండిదనడానికి పరాకాష్ట

********శివునూరి లలితాకృష్ణ

Comments

Popular posts from this blog

season 6 వైశాఖ పూర్ణిమ

కవనజ్యోతి,కవితాగానం సీజన్ 6  వైశాఖ పౌర్ణమి నగదు పోటీలు   పోటీకి కవితలు పంపించిన కవి వరుల జాబితా  1. శ్రీ పిళ్ళావెంకటరమణ మూర్తి గారు  2. శ్రీ సంగీతం సంతోష్ కుమార్ గారు ji 3. శ్రీ జి సూర్యనారాయణ గారు  4.శ్రీ మండ నాగేశ్వరరావు గారు 5.శ్రీమతి కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  6.శ్రీమతి నెల్లూరు వెంకటలక్ష్మి గారు 7.శ్రీ అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 8..శ్రీ కోరాడ నరసింహ రావు గారు  9.శ్రీమతి డాక్టర్ భమిడిమర్రి కమలాదేవి గారు 10.శ్రీ కాసుల ధీరజ్ శర్మ గారు  11.శ్రీ కూని అంకబాబు గారు 12.శ్రీ మతి డా.వేమూరి సత్యవతి గారు  13.శ్రీమతి డా.బల్లూరి ఉమాదేవి గారు 14.శ్రీ.దోసపాటి వేంకట రామచంద్రరావు గారు 15.శ్రీ అపరాజిత రెడ్డి గారు  16. శ్రీ ఏడెల్లి రాములు గారు  17.శ్రీ డాక్టర్ ఆళ్ళ నాగేశ్వరరావు గారు  18. శ్రీ కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  19. శ్రీ మద్ది పుల్లారావు గారు  20.శ్రీమతి సింహాద్రి వాణి గారు  21. శ్రీ డా.దీపక్ న్యాతి గారు  22. శ్రీ ఆర్.వి.వి.రాజా గారు  23.శ్రీమతి వాణీ సరోజినీ లక్కరాజు గారు...

వీడ్కోలు ఆషాఢమాసం పౌర్ణమి

అంశం: వీడ్కోలు  సందర్భం: ఆషాఢమాసం పౌర్ణమి  నిర్వహణ:  వీరా గుడిపల్లి లలితాకృష్ణ  ################## కవివరుల జాబితా  1.పిళ్ళా వెంకట రమణమూర్తి గారు  2. జి.సూర్యనారాయణ గారు  3.మండ నాగేశ్వరరావు గారు  4.డా‌.బల్లూరి ఉమాదేవి గారు  5. డా.కమలాదేవి గారు  6.గొర్రెపాటి శ్రీను గారు  7.వేమూరి సత్యవతి గారు  8.కూని అంకబాబు గారు  9.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  10.కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  11.తోట సులోచన గారు  12.వాణిసరోజిని లక్కరాజు గారు  13. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు  14.అపరాజిత రెడ్డి గారు 15.లలితాచండి గారు 16. నెల్లూరు వెంకటలక్ష్మి గారు  17.కమలశ్రీ గారు  18.రాధిక గారు 19.చంద్రమౌళి గారు  20.శ్రీకాంత్ గారు  21.సింగీతం సంతోష్ కుమార్ గారు  22.. దారల విజయ కుమారి గారు  23.ఎన్.నరేశ్ చారి గారు  24. పిన్నక నాగేశ్వరరావు గారు  25.సింహాద్రి వాణి గారు  26.ఏడెల్లి రాములు గారు  27.కొంజేటి రాధిక గారు  ++++++++++++++++++++++++++++++++ ఆషాడ మ...