Skip to main content

season 6 వైశాఖ పూర్ణిమ

కవనజ్యోతి,కవితాగానం సీజన్ 6 
వైశాఖ పౌర్ణమి నగదు పోటీలు 
 పోటీకి కవితలు పంపించిన కవి వరుల జాబితా

 1. శ్రీ పిళ్ళావెంకటరమణ మూర్తి గారు

 2. శ్రీ సంగీతం సంతోష్ కుమార్ గారు
ji
3. శ్రీ జి సూర్యనారాయణ గారు 

4.శ్రీ మండ నాగేశ్వరరావు గారు

5.శ్రీమతి కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు 

6.శ్రీమతి నెల్లూరు వెంకటలక్ష్మి గారు

7.శ్రీ అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు

8..శ్రీ కోరాడ నరసింహ రావు గారు 

9.శ్రీమతి డాక్టర్ భమిడిమర్రి కమలాదేవి గారు

10.శ్రీ కాసుల ధీరజ్ శర్మ గారు 

11.శ్రీ కూని అంకబాబు గారు

12.శ్రీ మతి డా.వేమూరి సత్యవతి గారు 

13.శ్రీమతి డా.బల్లూరి ఉమాదేవి గారు

14.శ్రీ.దోసపాటి వేంకట రామచంద్రరావు గారు

15.శ్రీ అపరాజిత రెడ్డి గారు 

16. శ్రీ ఏడెల్లి రాములు గారు 

17.శ్రీ డాక్టర్ ఆళ్ళ నాగేశ్వరరావు గారు 

18. శ్రీ కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 

19. శ్రీ మద్ది పుల్లారావు గారు 

20.శ్రీమతి సింహాద్రి వాణి గారు 

21. శ్రీ డా.దీపక్ న్యాతి గారు 

22. శ్రీ ఆర్.వి.వి.రాజా గారు 

23.శ్రీమతి వాణీ సరోజినీ లక్కరాజు గారు 

24.శ్రీమతి తంగిరాల నాగలక్ష్మి గారు 

25.శ్రీ.గొర్రెపాటి శ్రీను గారు 

26.శ్రీమతి కొంజేటి రాధిక గారు 

27.శ్రీ పిన్నక నాగేశ్వరరావు గారు 

28.శ్రీమతి లలితా చండి గారు 

29.శ్రీ మహేందర్ జవ్వాజి గారు 

30.శ్రీ ఇంద్రావత్ రాహుల్ గారు

31. శ్రీమతి మొహమ్మద్.అఫ్సర వలీషా  గారు 

32.శ్రీమతి తోట సులోచన గారు 

32.శ్రీ వీరా గుడిపల్లి గారు 

33.శ్రీమతి శివునూరి లలితాకృష్ణ 

Veera Gudipally: 
1
రచన: *పిళ్ళా వెంకట రమణమూర్తి* 
"""""""""""""""""""""""""""""""""""""""
శీర్షిక: *అంతిమ స్పర్శ* 

మృత్యువు నిన్ను అంతిమంగా ముద్దాడింది..

అశాంత నేత్ర జలపాతాల్లోంచి,
అనంతానంత ప్రవాహంలోకి..

మృత్యువు చిటికెన వేలు పట్టుకుని..

ఆద్యంతాలు తెగిపోయి,
తుదీ మొదలు చీలిపోయి..

మెల్లగా నిశ్శబ్దాలు రాలుస్తూ వెళ్లిపోయి!

సెగ బారిన ఊపిరి నీడల కింద ఒగర్చే పొద్దుకు చూపులు జోడించి..

కుప్పకూలిన ఆశలతో *వలిక* దారిలో పయనించిన..

నీ దేహాన్ని, నిన్నూ అరచేతుల్లో యిముడ్చుకున్న వీధులు..

మరుక్షణమే నీ అంతిమ స్పర్శని విస్మరించి..

సమాధిపై వెలిగించిన మిణుగురుల్లా రెప రెప లాడుతాయి!

ముదురు తమస్సు లో మునిగిన సమాధుల కొలువులో..

ఎన్నో ఏళ్ళు గడిచినా మరపురాని 
కవితా సుధలొలికించిన కవుల కలాలు..

శ్రవణానందకరమైన గాయకుల కంఠ స్వరాలు..

చీలిన దారుల్లో విడిపోయిన చేతుల వెనుక మాతృమూర్తుల గర్భశోకాలు..

ధన వ్యామోహంతో రక్త సంబంధాలను తెంచుకున్న పాశాలు!

యీ పితృ మందిరంలో సేదతీరిన నిశ్చలన ప్రశాంత శయనాలు..

ప్రేత గృహ కక్ష్య మారు మూలల్లోంచి చలించలేని నయనాలు..

నిశీధి వేళ తిమిరం నిండిన శ్మశాన వాటికలో రాజ్యమేలు నిశ్శబ్దాలు..

ప్రకృతి గతి తప్పిన అంబరంలో బలిభుక్కులూ,
ఉలూకాల వికృత రావాలు..

నిశ్శబ్దాంబర అంచులో అశ్రు ధారలతో బరువెక్కిన బాంధవుల హృదయాలు!

ఔను! ఇది శ్మశాన మందిరమే, మృతదేహాల ఆవాస సదనమే..

అస్పృశ్యత కు తావులేని సమా శ్రయ వేదికల సమాహారమే..

కుల మత వర్ణాలకు అతీతమైన భూగర్భ సౌధాల ప్రాంగణం..

నిటలాక్షుని విలయ తాండవానికి అనువైన నృత్య మండపం!
************************ 
*
సింగీతం సంతోష్ కుమార్ 
జిల్లా 
*
కామారెడ్డి 
కవిత
*
శీర్షిక:- హాస్య బ్రహ్మ 

గుంటూరు జిల్లా, సత్తెనపల్లి గ్రామ వాసి
నాగలింగాచారి, లక్ష్మీనరసమ్మ దంపతుల పుత్రుడు
విద్యాభ్యాసం తరువాత అత్తిలిలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తు
దర్శకుడు జంధ్యాల
వెండితెరకు పరిచయం చేసి
నటుడిగా బ్రహ్మానందంగా అరంగేట్రం చేసిన మహానటుడు....
ఆయన నడిస్తే కామెడీ
మాట్లాడితే కామెడీ మాట్లాకడపోయినా కామెడీ
మొహం చూస్తేనే కామెడీ
నవ్వినా ఏడ్చినా నవ్వులే
చిన్నపాటి నుండి కుటుంబం "మనీ" కష్టాలతో ముందుకు సాగుతున్న సమయం
అనగనా ఒక రోజు చిత్ర సీమలో
మూడు దశాబ్దాలుగా విరామం లేకుండా "దూకుడు"తో
నవ్విస్తున్నా ఘనుడు...
నవ్వు పుట్టించడంలో అతనికి "అతడే" సాటి...
అందరితో ప్రేమగా మెలిగే "మన్మధుడు"
రికార్డులు సృష్టించడంలో
"రేసుగుర్రం"
నవ్వుకే నవ్వు పుట్టించగల సమర్థుడు...
చిత్రసీమ అనే పొలంలో
చిరునవ్వుతో మొలకెత్తిన
హాస్య విత్తు...
అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోగా గిన్నిస్ వరల్డ్ రికార్డు ఆరు సార్లు నంది అవార్డు
3
*
జి.సూర్యనారాయణ, అవనిగడ్డ. 
జిల్లా 
*
కృష్ణాజిల్లా, ఆంధ్ర పదేశ్.
కవిత
*
అకటా...అన్న దాత...!


ఆధునిక వ్యవసాయంలో 
అన్న దాతలకు గిట్టు బాటు ధరలు లేవు
ఆరుకాలాలు పసిడి పంటలు పండించినా..
రైతులకు పిడికెడు మద్దతు ధర రాదు.?

సాగులో పెట్టుబడుల ఖర్చులు
వరిగడ్డి వాముల్లా పెరిగి పోయే
పంట దిగుబడులు మాత్రం
చిన్న కుప్పలై వెక్కిరించే...!

రైతన్నలు చేసిన గట్టులేని అప్పులు
మురుగుకాల్వ లోని గుర్రపు డెక్కలా అల్లుకు పోయే
కర్షకుల బతుకులు అష్ట కష్టాలు పాలాయే
వ్యవసాయ దారుడు చివరికి.. కూలీగా మారే..!

పొలాల్లో హలాన్ని పట్టి.. బంజరు భూములలోన
పంటల బంగారాన్ని దండిగా పండించగలడు
చేతిలో కొడవలి, బారు కర్ర ఉన్నా...
కనీస మద్దతు ధర కోసం పాలకుల విధానాల పై
తలపాగాను చుట్టి ...హరిత యుద్ధం చేయలేని దుర్బలుడు రైతు..!

పంటలకు విరామం ప్రకటించి.. మహాధర్నా చేద్దామన్నా..
తన దేశం పట్టెడు బువ్వ కోసం అల్లాడుతుందని
నిరసనలను విరమించుకునే..నిబద్ధత గల హాలికుడు..!

దేశానికీ వెన్నెముక..దేశానికీ రైతేరాజని..
దేశాధినేతలు చేత ఎన్ని కితాబులు పొందినా..
వర్గ పోరాటాలను చేయలేక..
తన బీడు భూములను నేటికీ.. పండించు కోలేని..
అసంఘటిత కార్మికుడు...మన దేశపు కర్షకుడు..!
..............

ఆర్యా...
సదరు కవిత నా సొంతం. దేనికీ అనువాదంలేదు.అనుకరణకాదు. మీ పోటీకీ ప్రత్యేకంగా 
రాసానని హామీ యిస్తున్నాను.
ex 1
ప్రశాంత చిలుక
జిల్లా 
*
కామారెడ్డి 
కవిత
*
సంసారం సాగరం:
సంసారం లోని సారాన్ని పట్టుకోవడానికి.....,
నాతో నేను యుద్ధం చేస్తున్నా...... ,
పిల్లలకోసం యజ్ఞం చేస్తున్నా......., 
ఆనందం అనే ఇల్లు కట్టడానికి ప్రేమ అనే ఇటుకలు పేర్చడానికి ప్రయత్నిస్తున్నా.... కానీ,
నా చుట్టూ పరిస్థితులు, నా ముందున్న కాలం, 
నా ప్రాప్తం అన్నీ ఒంటరిని చేసి ఆడుకునేవే..... 
ఓడించి ఎగతాళి చేసేవే.....
ఐనా సరే, పోరాడి ఓడినా...
ప్రయత్నాన్ని వదలకుండా....
కాలానికి ఎదురీది...
బ్రతుకుని గెలిచి చూపించాలి..
అదే కదా సంసార సాగరం అంటే......
4
రచన:- మండ.నాగేశ్వర్రావు.
            విశాఖ పట్టణం
             7793939724.
శీర్షిక:-
ప్రతిజ్ఞ చేద్దాం...!!!
⚡⚡⚡⚡⚡⚡

మనిషికి మనిషే శత్రువై,
మానవత్వమే మృగ్యమై
మతాలముసుగులో మారణహోమం సృష్ఠిస్తూ నరమేధం సలిపే మృగాలమందకు గురిపెడదాం !! 
సైనికులై కదనరంగంలో పోరు సలపకపోయినా బాధ్యతగా పౌరులందరం మనపని మనం చేసుకుపోదాం !!
నారసింహాలమై గర్జిద్దాం!!
వేదఘోషనే వినిపిద్దాం !!

మతోన్మాదం ధర్మపధానికి గంతలుకట్టి మంచుకొండల్లౌ మరోసారి తిరుగుతోంది !! 
తెల్లనిమేఘం కూడా మళ్ళీ మనరక్తంతో తడిసి ఎరుపెక్కుతోంది !!
చీమూనెత్తురు సిగ్గొదిలేసి మనధర్మంపై దాడులుచేస్తోంది!!
దయాదాక్షిణ్యాలూ పక్కనబెట్టి
హరోంహరా అని ఉప్పెనలాకదులుదాం!!
పెనుశంఖాలను పూరిద్దాం !!
ఢమరుకనాదం వినిపించుదాం !!ముష్కరమూకల మతోన్మాదాన్ని కూకటివేళ్ళతో పెకలిద్దాం !!
వారికి మద్దతు పలికే వారికి
సహాయనిరాకరణచేసి వారివ్యాపారాల్ని బహిష్కరిద్దాం !! 
యుద్ధం చేయలేకపోయినా రాముడికి ఉడతలా సాయంచేసి మనగెలుపుకి మనమే పునాది వేద్దాం!!
ఈరోజునుంచే మనం ప్రతిజ్ఞ చేద్దాం !!

ఆర్ధికంగా ఛిన్నాబిన్నం కావిద్దాం!!
మనశత్రువు అన్నమో "రామచంద్రా" అని అరిచేలా ఆచరిద్దాం!!
అపరకాళికలై చేతకరవాలం పట్టకపోయినా శత్రువు మూలం పసిగట్టి పౌరుషంగా పెడరెక్కలువిరిచి పనిపడదాం !!
ప్రణవనాదమే పలికిద్దాం !!
విశ్వానికి మన ఉనికిని తెలియజేద్దాం!!
విజయకేతనం ఎగరేద్దాం !!

          ------మండ.నాగేశ్వర్రావు.✒️
                7793939724
------------------------
5
రచన: శ్రీమతి కొలకలూరి దేవికారాణి రత్నాకర్ ; తెనాలి.--------------------------------------------------

పేల లుకలుకలు...
పేలవమైన దుస్తులు...
డంపింగ్ యార్డు లా ఆమె.
డంపింగ్ యార్డ్ లో తిరుగుతూ...
ఊరంతా పారేసిన వాటిని 
ఏరేసుకునే పనిలో ఆమె.,
సూర్యునితో పాటే 
మొదలవుతుంది ఆమె దిన చర్య..
పనికిరాని వస్తువుల్లో జీవికని 
తన ఖాళీ కడుపుకు ఆహారాన్ని..
వెతుక్కుంటూ ఆమె....
రీసైక్లింగ్ యంత్రాలకి 
ముడి సరుకు చేర్చి..
వ్యర్థాల్లో అర్థాలు వెతికే పని కత్తె ఆమె.
భూమిని తన చేతి వేళ్లతో శుభ్రం చేసే చీపురు.,
జీతం ఎరుగని నగర దీపిక..
పర్యావరణాన్ని పరిరక్షించే కాలుష్య నివారిణి..
కాలం ఎలా ఉన్నా..
కాళ్లకు బలపాలు కట్టిన బొంగరంలా 
తిరుగుతూనే ఉంటుంది ఆమె...
మసక చీకట్లో దిగబడే గాజుపెంకులో..
ముళ్ళు రాళ్లూరప్పలో... అశుద్ధపు ఆనవాళ్లో...
విష సరీసృపాలో ఎగబడే మృగాలో...
పక్కకు లాక్కెళ్ళే మగమృగాళ్ళో.....
అయినా ఆమె వెతుకులాట ఆగదు 
పాపం... చిత్తు కాగితాల అమ్మి......

6
*
నెల్లూరు వేంకట లక్ష్మి 
జిల్లా 
*
కర్నూలు 
కవిత
*
శీర్షిక: శ్రామిక సౌందర్యం
************************
ఆ చేతులకెపుడూ అలుపు రాదు
ఆ దేహాలెపుడూ అలసి పోవు

ఆ మనసుకెపుడూ నిరాశావహించదు
ఆ గుండెపుడూ గుబులు కానరానీదు

ఆ చెమట చుక్క ఎపుడూ విరామమెరుగదు
ఆ పిండి కొట్టిన పిడికిలెపుడూ రక్తమోడదు

పగిలిన మబ్బులనుండి రాలే చినుకే వారి ఆశ
రగిలిన వేదనలో గుప్పెడు ముద్ద నే వారి ఆశయం

మేడలు కట్టేది వీరే
మెతుకులకై అల్లాడేది వీరే

అందరికీ అన్నం పెట్టే ది వీరే
అప్పులతో ఆత్మహత్యలో ముందుండేది వీరే

నిన్నటి గురించి బెంగ లేదు వీరికి
రేపటి మీద ఆశ చావదు ఎన్నటికీ

గుండె గోడలు పగిలినా
బీటలు బారిన మొండి మనసులు వీరు

సంపదలోనే వీరు నిరుపేద లు
నిండు మనసులో వీరి తర్వాతే
ఎవరైనా గరీబులు

జీవన చిత్రానికి సజీవ సాక్ష్యాలు వీరు
శ్రమైక సౌందర్యానికి నిలువెత్తు దర్పణాలు

ఈ ధరిత్రి మీద నిత్య శ్రామికులు
సాటిలేని సాటిరాని సమర సైనికులు

7
అయ్యలసోమయాజుల ప్రసాద్
ఊరు:- విశాఖపట్నం
అంశం:-స్వేచ్చా కవిత
శీర్షిక:-
మతమా? మానవత్వమా?
................................
యుక్తాయుక్త విచక్షణ కలిగిన మానవునివే
జగతిన ఉన్న ప్రజలంతా పరమేశ్వర ప్రతిరూపాలని 
కులమత బేధాలు, పేద గొప్ప తారతమ్యాలు లేక
అందరిలోను ప్రవహించేది ఒకే రక్తమని తెలిసి 
నాలుగు రోజులక్రిందటే వివాహామై
కోటి ఆశలతో జీవితాంతం తోడునీడగా బ్రతకాలని
హానీమూన్ కై వచ్చిన నవవధూవరులు ప్రకృతిలో మమేకమై విహరిస్తున్న సమయాన కాళ్ళ పారాణి ఆరకమునుపే
భార్య ఎదుట మతం మేమిటని అడిగి భర్తను కాల్చిన నరరూప రాక్షసుడు
ఇద్దరు పిల్లలతో వేసవి విడిదిగా వచ్చి ఆనందంతో దంపతులో
భర్తను విడదీసి బ్రతిమాలిన తమ బుల్లెట్లతో
ప్రాణాలు తీసి ప్రధానికి నీ మొర చెప్పుకో అన్న కిరాతకుడు
బాధ్యతలు తీరేయని అరువది ఏండ్లు దాటిన వృద్ధజంటలు స్విట్జర్లాండ్ గా ప్రసిద్ధి గాంచిన పహల్ గావ్ కి వస్తే
బట్టలూడదీసి మత నిర్ధారణ చేసుకుని
వేడుకున్నా కనికరించక కళ్ళలో బుల్లెట్లతో దాడిచేసి
ప్రాణాలను హరించిన నరరూప మృగాలను
నే సూటిగా ప్రశ్నిస్తున్నా 
ప్రాణం పొసే హక్కు మీకు లేనప్పుడు
ప్రాణం తీసే హక్కు మీకెక్కడని?
భర్తను పోగొట్టుకుని, తండ్రిదూరమయిన
పసిపిల్లలు,
పారణి ఆరక ముందే వైదవ్యం పొందిన సోదరి,
జీవితచరమాంకాన కొడుకును కోల్పోయిన వృద్దదంపతుల కడుపు కోతకు కారణమెవరు
మతం గొప్పదా మానవత్వమా?
ఈ నరమేథానికి అంతమెక్కడ?
.........................
ఇది నా స్వీయరచన
అయ్యలసూమాయజుల 
ప్రసాద్
విశాఖపట్నం
9963265762.
..............................
అమ్మా లలితమ్మ ఈ ఘటనలో గురువు గారు అని పిలిచే బ్యాంక్ విశ్రాంత అధికారి ఉన్నారు
వారి మరణం మరచిపోలేను
ఆర్ద్రతతో వ్రాసాను తల్లి
లోకా సమస్తా సుఖినో భవంతు
...........................
కంటి ప్రాబ్లమ్ వల్ల మీకే పంపిస్తున్నా
దీర్ఘ సుమంగళీ భవ
.........................
8
   కోరాడ నరసింహా రావు !
        ***************
కూటి కోసం కోటి యాతనలు !
  బ్రతుకు కోసం పడలేని పాట్లు...!!

దొరికిందే తింటూ...
  ఆకులనే కప్పుకుంటూ...
    గుహలలోనే తలదాచుకుంటూ....,
   వావివరుసలు తెలియవు...!
 మహిళదే నాయకత్వం..!!

రాయి, కర్రె ఆయుధాలైన
   ఆ బ్రతుకుల్లో నిప్పుతో వెలుగొచ్చి... మొదలైంది క్రమ వికాసం...!

ఆహారాన్వేషణలో గుంపుల మధ్య యుద్ధాల పరిస్థితిలు మారి, పరీవాహక ప్రాంతాలలో ఆహారోత్పత్తితో... స్థిర జీవనాలు!

స్త్రీకి మాతృత్వమే దౌర్బల్యము కాగా... దారి తీసిన పురుషా ధిక్యాహంకారం!

గుంపులమధ్య దాడుల నుండి రక్షణకై... బలానికి, తెలివికి కై వశమైన అధికారం...!
   పరస్పర సహకార సుఖ జీవనానికి ఏర్పరచుకున్న పనివిభజన , సృష్టించిన కులాలహెచ్చు,తగ్గులు...!
   స్వార్ద, స్వప్రయోజ నాలకు వాడుకుంటున్న సర్వజన శ్రేయో హితోపదేశ మతాలు...!

సౌలభ్యం కోసం మనిషి సృష్టించుకున్న డబ్బే... మనిషిని ఆట బొమ్మను చేసి ఆడించే వైనం!

వినాశకర విధ్వంసాలను సృష్టి స్తున్న కాంత, కనకం, సర్వాధికార సామ్రాజ్య కాంక్షలు...!
 
శతాబ్దాలు కాదు... యుగాల పరిశ్రమ...!
  రాతియుగం నుండి రాకెట్ యుగానికి ఎదిగామన్నది వట్టి భ్రమేనా...!
      
ఈ పరిణామానికేనా...
  ఈ మనిషి సుదీర్ఘ తపన?!
  ఈ మనిషి ఇంత తపనా ఈ దుస్థితి కోసమా....!?!
    ఇదా.... మనిషి సాధించిన పరిణామ ఫలం!?!?
      ***************

9
అంశం : ఐచ్ఛికం
పేరు : డా.భమిడిమఱ్ఱీ
కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
చరవాణి : 9871096566

శీర్షిక : నీకునీవే ప్రశ్నగా మిగలకు
జీవితమే ఒక పెద్ద ప్రశ్న
ఒక పెద్దగ్రంథం జీవితం
తెలుసుమనకు వెనక పుటలో
ఏముందో
కానీఎంతమాత్రం తెలియదు
పక్కపేజీలో ఏముందో
సవాలు చేస్తూంటాయి ఎన్నో
ప్రశ్నలు మనలను
సమాధానాలు దొరకని ప్రశ్నలే గఅధికం
మిగులుతూంటాము ఒక్కొక్కసారి మనమే ఒక పెద్దప్రశ్నగా
మనలను చదవలేరు ఇతరులు
ఎదుటివారిని చదవలేము మనం
ప్రయత్నించాలి మనం 
ప్రశ్నగా మిగలకుండా ఉండటానికి
నడుచుకోవాలి పరిస్థితులకు అనుగుణంగా
గమనించుకోవాలి పరిసరాలను
ప్రవర్తించాలి సందర్భానుకూలంగా
సమయానుకూలంగా
అరికట్టుకోవాలి అరిషడ్వర్గాలను
ఉండాలి నొప్పించక తానొవ్వక
అంతేకాని
మిగలకూడదు మనం ప్రశ్నలుగ ఎవరికీ
మనకి మనం కూడా మిగలకూడదు ప్రశ్నగా
సమాధానాలను వెతుక్కుంటూ పోవాలి
ఉండాలి
ఇతరులకు సమాధానం దొరికేటట్లుగా
మనకి మనమే సమాధాన పడేటట్లుగా
అంతేకాని కాకూడదు కొరుకుడు పడని ప్రశ్నగా మాత్రం.

10
*
కాసుల ధీరజ్ శర్మ
జిల్లా 
*
తూప్రాన్ మెదక్ జిల్లా
కవిత
*
అంశం : శిల్పం 
శీర్షిక : 
మౌన యోగి పుంగవులు 
- మన శిల్ప కారులు
 to 
శిల్పికి ఎంత నేర్పో 
శిలకు అంత ఓర్పు!
శిల్పికి ఎంత ఓర్పో 
శిలకు అంతే మార్పు!!

శిల్పి తన నేర్పరితనముతో 
ఎన్ని మార్లు ఉలిదెబ్బలు కొట్టినను మారు మాట్లాడకుండా తన మార్పును అంగీకరించి స్వీకరించును శిల!!

శిల గొప్పదా శిల్పి గొప్పవాడా 
అన్న తర్జనభర్జనలు ఆపేసి 
శిలను శిల్పి దృష్టితో చూడు
దైవత్వం నీకే కనిపిస్తుంది!!

శిల్పిని ఏకాకిని చేసి చూడకు! అలాగే శిల్పి పట్టుదలకు మారుపేరని మరువకు!!

నల్ల రాయి నైనా తెల్ల రాయి నైనా
అత్యద్భుతమైన శిల్పంగా తీర్చిదిద్దేవరకు నిద్రాహారాలు తాను మానుకొనైనా 
అపురూప అనన్య దైవ స్వరూపాలను సాక్షాత్కరింప చేస్తాడు శిల్పి!!

పలు భంగిమలలో
ఆ చంద్ర తారార్కం నిలిచేలా 
స్వీయ క్రమ శిక్షణతో 
ప్రాణప్రదంగా చూసుకొని 
కఠినత్వంలోనే కమ్మని తత్వాన్ని ఆస్వాదిస్తూ కర్తవ్య దీక్షను పూర్తి చేస్తాడు కంకణబద్ధుడై!!

తాను తీర్చిదిద్దిన పూర్ణ సంపూర్ణ స్వరూపాన్ని చూసి తానిచ్చానని మురిసిపోతాడు అలౌకిక ఆనందంలో ఉలి సవ్వడుల మధ్యన మౌన యోగి పుంగవుడై!!

అందుకే కాబోలు 
మన శిల్ప కారులు!!

11
*
కూని అంకబాబు 
జిల్లా 
*
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 
కవిత
*
     శీర్షిక: దారుణ కాండ ( నిర్యోష్టి కవిత )

 దయ జాలి కరుణ 
 గిట్టని యుద్ధాన్ని ఆశ్రయించి 
 సాధించేది ఏందని 
 కూడగట్టుకునేది ఏందని 
 అవలీలగా అసువులను హరించి 
 జగతిని సోకాగ్నిలోకి తోసేసి 
 శాంతి అనే కళావేదికను కూలదోసి 
 అసంఖ్యాక జీవితనావలను
 కదనసంద్రాన అతలాకుతలంగా చేసేసి 
 సాధించేది ఏందని
 కూడగట్టుకునేది ఏందని 

 యుద్ధకాంక్షను తలకెక్కించుకునే 
 క్రూర హృదయాలకు 
 జగజ్జేత కావాలని విర్రవీగిన 
 అలెగ్జాండర్ చేతులెత్తేసిన 
 ఘటన గుర్తుకు రాలేదా 
 వేలాది సైనికుల ఉసురు తీసి 
 ఆ శవాల గుట్టలను చూశాక సిగ్గునొంది 
 చలించి శాంతి చరిత్ర లిఖించిన 
అశోకుని చరిత్ర గుర్తుకు రాలేదా

 నాటి రావణుడు కౌరవుల దాహానికి
 నేలకొరిగిన కాయాలు తెగిన కంఠాలు 
 ఎన్నో ఎన్నెన్నో
 నేటి కలియుగాన
 రాజుల రారాజుల రాజ్యకాంక్షకు
 దేహాలు చాలించిన వారు ఎందరో 
ఆధునిక యుగాన అణుయుద్ధాలు 
 సాగించిన వికృత కాండను
 వివరించడానికి 
 ఎన్నో గుండెలు ధైర్యాన్ని చేయలేదంటే
ఆజి ఎంత దారుణకాండో కదా 
to 
 అందుకే
 అవనిలో జీవితాలు వికసించాలంటే 
 సుఖశాంతులు అంకురించాలంటే 
 జన సంచయాలు
 సఖ్యతా సుధా రసాన్ని సేవించి
 యుద్ధకాంక్షకు తిలోదకాలిచ్చి
 నిస్వార్థ గుళికలు చల్లి
 శాంతికి తోడుగా నిలవాలి కదా
 శాంతికి ధైర్యాన్నివ్వాలి కదా
 శాంతిని అత్యున్నత శిఖరానికి చేర్చాలి కదా 

12
*
డా.వేమూరి.సత్యవతి.
జిల్లా 
*
కృష్ణా
కవిత
*
శీర్షిక.."గాయపడిన కోయిల"

ఉదయం నుండీ ఆపకుండా కోయిల కూస్తూనే వుంది!
ఆహ్లాదానికి బదులు ఎందుకో విషాదపుజీరవిన్పిస్తోంది!?
ఎన్నోసార్లు వ్యక్తిత్వం ముడుచుకుపోతోంది!
పెదవులు నవ్వుని నటిస్తూ..నిజాన్ని దాచేస్తున్నాయి!
మర్యాద నతిక్రమించినట్టు చాలాసార్లన్పిస్తోంది!!
పెద్ద చదువులు చదివినా....లేకున్నా
ఉద్యోగంచేస్తున్నా...కూలిపనికెళ్తున్నా....
జీతం లేని, క్షణం తీరికే లేని ఇల్లాలైనా....
ఆటలాడాలన్నా..పాటపాడాలన్నా..తెరపైనటించాలన్నా,
ప్రతిభకన్నా అష్టవంకర్ల చూపులు అర్ధమవాలంటే..
కాటేశాక అవకాశాలనే శిక్షల్లేని శిక్షకులు,అధిష్ఠానాలు! 
చిన్నబోవటం, కళ్లు తుడుచుకోవటం తప్పట్లేదు!!
పిల్లల్ని పదినెలలు మోయటమే కాదు,
బతికున్నంతకాలం బరువెత్తి పరుగెత్తటమే!
సమానత్వమా,పాడా?..నగలన్నీతాయిలాల తాకట్టులు..
నీకేంతెలియదనటం మామూలై నిజమైపోయింది!
నువ్వూరుకో..నీకెందుకు? నోర్మూసుకోవచ్చుగా కాస్త...
ప్రతీదానికీ ఏడవటంపై కూడా విసుక్కునే ఆంక్ష లు!
వేదికలపై ఆత్మవంచనతో అందమైన ప్రసంగాలు!!
కోయిలకూత లోపంచమ స్వరం కొండ కోనలప్రతినిధిలా
బాధావీచికలని దిగంతాలవరకూ వివినిపించబోతోందా?
నాకేనా? అందరికీ అలానే వినిపిస్తోందా?
మన ఇంటి కోయిల గానం మరింతశ్రధ్ధగా విందామా?
                          **********

"గాయపడిన కోయిల" నా స్వంత రచన. 
డా.వేమూరి.సత్యవతి.
9885136308.
విజయవాడ. 
                           
 13
*
డా బల్లూరి ఉమాదేవి 
జిల్లా 
*
కర్నూలు 
కవిత
*

              సంగీతము

ఆ.వె:సంతసమ్ము గూర్చు జగతిలో నెప్పుడూ
        తాపము దొలగించి తనువునకును
      హితము కూర్చు నట్టి యింపైన గీతముల్
        సతము వినుచు నుండ శాంతి కల్గు.
         
ఆ.వె:తాపముడుపి మనకు ధరలోన ముదమును
      కూర్చు చుండు సతము కూర్మి తోడ
     జంతు జాలములకు సత్త్వమొసగుచున్న
   గానమిదియె రండు గనగ మీరు.
    
ఆ.వె:హర్ష మొసగు నిదియు నవనిలో జనులకు
        వలపు నందు నైన వగపు నైన
       జంతు జాలములకు సంకీర్తన మటంచు
      నాదరాన నుడివె యన్నమయ్య.

ఆ.వె:జనుల బాధ లెపుడు జగతిలో బాపుచూ
     సంతసమ్ముతోడ జయము నొసగు
      జంతుజాలములను చక్కగా కాపాడు
      నదియు నామ స్మరణ మండ్రు బుధులు.

కం:హరిసంకీర్తనమే యిల
     నరులకు ముదమిచ్చి తాప నాశమొనర్చున్
      పరవశమును గూర్చుచు తా
      పరిపరి విధముల సకలుర పరిరక్షించున్.

ఆ.వె:జనుల మనములోని జడుపులు తొలగించి
        సతము నింపు చుండు సంతసమ్ము
      హరి ననవరతమ్ము నర్చించి కీర్తించ
       జయము కల్గు ననుట సత్య మిలను.

తే.గీ: నవ విధములగు భక్తులు నవని యందు
      గలవు నందు కీర్తనలవి ఘనము నెపుడు
      కీర్తనములను బాడంగ నార్తి దొలగు
   . పక్షులకును పశువులకున్ వసుధయందు.
ఫోన్ నెంబర్ 
 14
*
దోసపాటి వేంకటరామచంద్రరావు
జిల్లా 
*
విజయనగరం
కవిత
*
కవితాగానం సీజన్ 6
కవనజ్యోతి వైశాఖ పౌర్ణమి కవితలపోటి
అంశం:స్వేచ్ఛాకవిత
శీర్షిక:కలుపుమొక్కలు
సారవంతమైన సస్యక్షేత్రం
దుక్కిదున్ని విత్తుజల్లి 
నీరు పోసి ఎరువు కూర్చి
కంచె వేసి కాపాడుకుంటే 
పచ్చనిపైరులో కలుపుమొక్కలు మొలిస్తే
మళ్ళీ ఏరివేతలు చేయాలి
పైరు పెరిగి వెన్ను వెయ్యాలి
వెన్నువేసినంతనే చీడపిడలను తరిమికొట్టాలి
అతివృష్టి అనావృష్టి వస్తే
ఇక చెప్పలేని అవస్తే
అరిష్టాలన్ని దాటితే
ముందస్తుగా ఎన్నో తిప్పలు
పంట చేతికందుతుందో లేదోనన్నభయం
అమ్మకానికి ఎన్నో తికమకలు
కిట్టబాటు ధరదొరకక లుకలుకలు
తక్కువధరకమ్మితే ఋణబాధలు
దిక్కతోచక దిగాలుపడే ఇక్కట్లు
దగాపడిన తమ్ముళ్ళుగా అచ్చట్లు
అన్నదాతకు తప్పని పాట్లు
ఎప్పటికి తీరేను ఈ గ్రహపాట్లు
ఎందుకు వెయ్యాలి మీకు ఓట్లు
ఎలా దిద్దుతారు పొరపాట్లు.

ఇది నాస్వీయరచన.
దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం
778059499
ఫోన్ నెంబర్
15
పేరు : అపరాజిత్ రెడ్డి
ఊరు : సూర్యాపేట
అంశం: ఐచ్ఛికం
శీర్షిక : తొలిపొద్దు
ఫోన్ : 9848532031

కష్టాల కడలి లో తొలి పొద్దు పొడిచింది
ఈ జన్మ ఎత్తిన దుఃఖాలన్నీ ఒక్కసారిగా నిష్క్రమించాయ్
పాపపు విషం నింపుకుని తూలనాడిన కళ్ళు నివ్వెరపోతూ తలలు దించుకున్నాయ్
వెర్రి ముదిరిన మెదళ్లు విసిరిన కత్తులు సరిగ్గా తిరిగి తమ కుత్తుకలనే తెగ్గోశాయ్
నిర్మల నిశ్చల కడలి రెక్కలు విప్పుకుని సునామీ తరంగాలతో తిరగబడతోంది దుష్టులను దునుమాడుతూ,,,,,,
దుర్మార్గపు సర్కారుల కొలువులు వెక్కిరించి నవ్వులపాలు చేసినా
కన్నీళ్ల బరువుతో బ్రతుకు భారమయ్యి విగతజీవినయిన వేళ
చదివిన చదువులు మస్తిష్కాన్ని తొలిచే పురుగులై
బ్రతుకు పోరాటంలో నన్ను నేను హింసించుకుంటూ చీకటి ఎదలో దీపం వెలిగించి
కంటక భూయిష్ట దారిలోనే మరుమల్లెలు పూయించినట్లు,,,,,
చేతిలో రూపాయి లేకున్నా స్నేహితుల సహకారంతో స్వయం సంమృద్దితో నిరంతరం శ్రమల కష్టాల కడలిలో చిరుచేపపిల్లలా ఈది ఈది,,,,,,,,
నన్ను ఎగతాళి చేసి నవ్వులపాలు చేసిన జనం ఇప్పుడు నాముందు తలయెత్తి చూడలేదు,,,,,,,
చూస్తే గీస్తే నా కుబేర సింహాసనాన్ని కళ్ళు నులుముకుని ఎగాదిగా ఏడ్పు ముహంతో చూసేది నా హృదయం ఉదయించిన ప్రకృతి వెలుగులలో ఎవ్వరూ ఎదగలేని అనంత సూర్యగోళాన్ని ముద్దిడిన నేను నాలో ఊపిరులూదిన ఆ బ్రహ్మరాతను తిరగరాసుకున్న నా మనోచైతన్యాన్ని ,,,,,,,,,
దిక్కులు పిక్కటిల్లేలా ఆనందభైరవి రాగం ఆలపించే నా సంకల్పశక్తి ఎవరూ ఊహించలేనిది,,,,,,,,!!

అపరాజిత్
హామీపత్రం : ఈ కవిత నా కలం సేత అని నా హామీ.
16
కవితా గానం 
విశ్వావసు నామ సంవత్సర వైశాఖ పౌర్ణమి నగదు బహుమతులపోటీ కోసం 
ఏడెల్లి రాములు‌ 
శీర్షిక*శాంతి కోసం యుద్ధం*

ఎన్ని మజిలీలు 
ఎన్ని ఘోరాలు 
అన్నీ తెలిసీ తెలీకగా చేసే దుష్టపన్నాగాలే
మనసుతో మలినాలను వేరుచేయని పనులే

 కాఠిన్యాలతో అంతా కర్కశ నికృష్టులే
సాటి మనుషుల్ని తూటాలతో కడతేర్చడమే
వాడుకునే హైటెక్నాలజీలో సైకాలజీ మాయం 

ఈ లోకమంతా యుద్ధోన్మాదుల రణస్థలం 
పాపాలను ముడులేసుకునే శాపగ్రస్థుల నిలయం 

కనికరం పిసరంతైనా ఇరుముడి కట్టుకోరు
జాలీ దయా అణువంతైనా చెవితో వినరు 

ఆగని చంపుడుపందేరములో అమాయకుల కుత్తుకలే కొత్తిమీర తరుగు 
నేతల తలలమీద కిరీటాలు పదిలం 

ప్రాణాలు పోయలేని ఉన్మాదం 
సహస్ర కోరలు చాచె విషసర్పం

అసువులు బాసిన ఆత్మలన్నీ రెడీ టూ సీ
యుద్ధోన్మాదుల తలలతో బంతాట ఆడుకోవడానికి 

శాంతిని కాపాడుకోకుంటే
ఇలపై మనిషి ఉనికే డ్రోన్స్ దాడులతో 
మరుభూమిగా మారేను సుమీ!???

ఏడెల్లి రాములు‌ ✍️ 
ది*04*05*2025(14*27)
ఎల్కలపెల్లి 🦢
పెద్దపల్లి
17
డా. ఆళ్ళ నాగేశ్వరరావు ( కమల శ్రీ )
జిల్లా 
*
గుంటూరు 
కవిత
*
కవితా గానం వారి పౌర్ణమి కవితల పోటీకి'
అంశం:: ఐ చ్చికం
ప్రక్రియ: వచన కవిత

పేరు :  డా. ఆళ్ల నాగేశ్వరరావు( కమల శ్రీ)
ఊరు :తెనాలి
తేది :25/04/2022
ఫోన్ నెంబరు : 7416638823
శీర్షిక :
         ""  చైతన్యదీప్తులు  ""

ఉషోదయపు ప్రభాత కిరణాలతో
అరుణారుణ వెలుగురేఖలతో
నిరాశ, నిస్పృహల నిశరాత్రికి వీడ్కోలులతో
శీతల పవనాలను తరుముతూ
నులివెచ్చని కాంతి స్పర్శ తో
జగతిని జాగృతి పరచే 
ప్రకృతి పరవశ  కారకులై
కృషీవలలకు అండదండై నిలుస్తూ
కష్టజీవులకు కాయకష్టాలను అందిస్తూ
వన్యప్రాణులకు  జీవం పోస్తూ
సర్వ జీవులకు సుప్రభాతం పలుకుతూ
సృష్టి కార్యాలకు స్వాగత గీతం ఆలపిస్తూ
వెలుగు కిరణాలను విస్తరిస్తూ
చిమ్మ చీకట్లను చీల్చుతూ
అజ్ఞానపు దొంతెరలను అంతమొందిస్తూ
విజ్ఞానపు మొలకలను అంకురింపచేస్తూ
ప్రతిమనిషి హృదిలో ఉషాకిరణాలను ఉదయింపచేస్తూ
మానవతా సుమాలను వికసింపచేస్తూ
భానోదయంతో బాధలను మాటుమయం చేస్తూ
ప్రతిదినము  ప్రభాత వెలుగు కిరణాలతో
చైతన్య ప్రదీప్తులను పుడమి పై
ప్రసరింప చేసే దినకరుడు  సూర్య భగవానుడు
ఈ ఉషోదయపు ఉషాకిరణాలు
జీవులకు జీవం పొసే జీవ ప్రదాతలు!
...........................................

 18
కవిత)
తేదీ 05/05/2025
శీర్షిక::: కుంకుమపువ్వు 
స్వీయ రచన కేశరాజు వేంకట ప్రభాకర్ రావు 
పాతర్లపాడు ఖమ్మం.... 6281697982.

ఎలనాగలా ఎతైన కొండలు, చూపరుల 
ఎదలను హత్తుకునే సూదంటు రాయిలా !!
చల్లని గాలి మెల మెల్లగా వీస్తుంటే 
తెల్లని మంచు పర్వతాల సోయగం ఊరిస్తుంటే!!

గుట్టలపైనుంచి దూకుతు శిలలను మీటుతూ 
జలజలా ప్రవహించే లిద్దర్ నది జతులతో!!
పచ్చని పచ్చిక బయళ్ళపై వెచ్చని జంటల
మెచ్చుకోళ్ళతో నిటారుగా నిలబడిన పైన్ చెట్లు!!

కుంకుమపువ్వు అరుణారుణ రంగుల్లో పూస్తుంటే 
మంకెనపువ్వు రంగుల్లో ఆపిల్ కాస్తుంటే,చూద్దామంటూ,
చంకలు గుద్దుకుంటు డొంకలు వెతికి మరీ చేరిన 
వెంకన్న సోపతిగాళ్ళు,కుటుంబాలతో ఆడుకుంటుంటే!!

మతంమాయలో పడి పిచ్చిలేచిన ముష్కరులు 
మారణాయుధాలు ధరించిన తురుష్కులు !!
మానవత్వాన్ని మంట కలిపి, మతమేదో తెలుసుకొనుటకు 
మర్మాంగాలను చూచుటకు లోదుస్తులు విప్పించిన కర్కశులు!!

ఇస్లాం కలీమా చదవమని,చదివినా చదవకున్నా 
ముస్లిం వ్యతిరేకివే అని అల్లాః అక్బర్ అంటూనే 
పాయింట్ బ్లాంక్ రేంజిలో ధన్ ధన్ ధనా ధన్ 
మెషిన్ గన్ పేలుస్తుంటే,నేలకొరుగుతున్న ఒక్కొక్కరిని చూసి!!

తమపై కారుతున్న రుధిర ధారలను భరించలేక 
పచ్చని బయళ్ళు వెచ్చని కన్నీటిని స్రవిస్తుంటే 
అమానుషాన్ని చూడలేక పైన్ వృక్షాలు తలలు దించుకున్నాయి, ఏమి చేయలేని నిస్సహాయస్థితి అని!!

జతులతోటి మతులను మత్తెక్కించే లిద్దర్ నది 
గతి తప్పి సద్దు చేయటం వల్ల కాదని, స్థాణువైతే !!
కాలువలై పారుతున్న రక్తంతో,మట్టి పుట్ట గుట్ట,మాను, మొలక, గరిక ఎఱుపెక్కి  వెక్కి వెక్కి ఏడుస్తుంటే
ఆపిల్ పండ్లన్నీ దేశ ప్రజల గుండెల్లా... బరువెక్కినా!!

రాలకుండా!
సమాధానపడి సమైక్య శంఖారావం ఊది 
సమరం చేసైనా సమూలంగా ఉగ్రవాదులను 
సమాప్తం చేయాలని ప్రతిన పూనుతుంటే...

ఎందుకు నాకీఎరుపని !? 
కుంకుమపువ్వు కునారిల్లినా,తెప్పరిల్లి... 
ఉదయించే సూర్యునిలో ఎఱుపునై 
హృదయాలను కదిలించే మమకారాన్నై
దేశంలో ఉగ్రమూకల ఉనికిని చెరిపే జెండానౌతా !!

మళ్లీ సందర్శకుల సందడి చూసి 
ఉర్వి అంతా పండుగ చేసుకొనేలా!!!!

19
*
మద్ది .పుల్లారావు
జిల్లా 
*
NTR
కవిత
*
ప్రవర్తన
............. 
ప్రవర్తన తోనే మనిషికి విలువ
ప్రవర్తనే మనిషికి అలంకారం
ప్రవర్తనే ఉనికికి గీటురాయి
సంఘంలో గుర్తింపు తెస్తుంది
ఆనందకర జీవితానికి ఆలంబన
సత్ప్రవర్తనతో సాదించవచ్చు సర్వము
కానీ నేడు విపరీత ప్రవర్తన లు వెర్రితలలేస్తున్నాయ్
మాట తేనెలొలుకు మనసంతా విషంగా మారె
సంకుచిత భావాలతో మనుజులు ధనుజులౌతుండె
పరఫీడన, నయవంచనలకు చిరునామాలు గా మారె
కాసులు, గ్లాసులకు బందీలై
నైతిక విలువలకు పాతరేయుచుండె
ఆషాడభూతులుగా నమ్మకద్రోహాలకు పాల్పడుతుండె
అంతరం లో అసూయాజ్వలనాలు
బాహ్యంలో ఆలింగనాలు  షరా మామూలాయె
ఖలునకు నిలువెల్ల విషమనినట్లు
అత్యధికులు ఖలలుగా వర్తిల్లగ
సమసమాజ స్థాపన జరుగుటెట్లు? 
మానవత్వం మంచిగంధం వంటిది
దయాగుణాన్ని దైవము మెచ్చును
దానగుణం సద్గతులను ఇచ్చును
సత్ప్రవర్తనతో మిత్రులు పెరుగు
సత్ప్రవర్తనతో ప్రతిష్ట గలుగు
సత్ప్రవర్తన తో ఆత్మతృప్తి గలుగు
సద్గుణాలతో రాముడు దేవుడాయె
సత్యశీలంతో హరిశ్చంద్రుడు కీర్తి బొందె
దానగుణం బలిని చరితార్ధు జేసె
20
 కవనజ్యోతి
విశ్వావసు నామ సంవత్సర వైశాఖ పౌర్ణమి నగదు బహుమతులు పోటీ కోసం
తారీఖు:--4/5/2025
వారం:-- ఆదివారం
అంశం:-- ఐచ్ఛికం( స్వేచ్ఛా కవిత)
రచన:-- సింహాద్రి వాణి
ప్రక్రియ:-- పద్యం
శీర్షిక:--స్వాగతించ వలయు శాంతి నెపుడు

మత్తకోకిల 1) సుందరమ్మగు కాశ్మిరమ్మును చూచి సంతసమొందగా
ఎందరెందరొ వచ్చుచుందురు నెక్కడెక్కడి నుండియో,
కొందరక్కడ కూడి చేరిరి కోరి చూడగ దృశ్యముల్
ముందు కాలమునందు వచ్చెడి ముప్పు కానక నయ్యయో!

మత్తకోకిల 2) ఇంతలోపల యెంతఘోరమొ యేగు దెంచెను శత్రువై
చెంత చేరియు ప్రశ్న వేయుచు చెప్పుమంచు మతమ్మునన్
యింతయైనను జాలి లేకను నెక్కుపెట్టి తుపాకులన్ 
సంతసమ్ముగ కాల్చివేయగ చచ్చిపోయిరి యెందరో.

ఉత్పలమాల 3) చేదును పంచుటెందులకు చేష్టల తోడను దుష్టజాతిలన్
చేదుచు ప్రాణముల్ ప్రజల, చిమ్మగ రక్తము గుండ్లు పేల్చియున్
మేదిని యందునన్ మిగుల మించగ క్రూరము నుగ్రమార్గమున్
వాదము ఖేదమై దనరు వాదన లేదిక మానుడిమ్మహిన్.

ఉత్పలమాల 4) ఇంతకు నెంతయో ఫలిత మెక్కువ వచ్చును ముందు కాలమున్
వంతున యున్నదై, మిగుల‌ వాస్తవ మిద్దియె శత్రుదేశమా,
ఇంతలు నింతలై కరవు, నెన్నియొ బాధలు చుట్టుముట్టుచున్
చింతిల జేయులే, సుఖము చేకురదప్పుడు నెంత యేడ్చినన్.

ఆటవెలది 5) ఉగ్రవాదమేల, యూచకోతలవేల?
రక్తపాతమేల, రణములేల?
మనిషి మనసులోన మాలిన్యములు జేరి
చింద రక్తమిలను చేటు కాదె?

ఆటవెలది 5) వద్దు టెర్రరిజము, వద్దు నక్సలిజము
వద్దు రుధిరధార వసుధ పైన
పుడమి‌ యంత మైత్రి పుష్పాలు విరియంగ
స్వాగతించ వలయు శాంతి నెపుడు.

హామీ:-- ఈ పద్యాలు నా స్వీయ రచన.
21 
శీర్షిక : సృష్టిలో భాగమైన వస్తువు జీవ సాఫల్యము

హిమగిరి శిఖరం ఎంత ఎత్తైనదైనా 
గ్రీష్మ తాపానికి సడలి కరగకుండునా 
మంచు మంచినీటిగా నిజ రూపం దాల్చి 
పల్లమెరిగి యోజనాలనెన్నింటినో దాటకుండునా
నిరంతరం పరుగులిడుతూ
ఉరుకులేయక ఊరకుండునా
జీవనది ప్రవాహంలా సాగరాన్ని చేరకుండునా
తన జీవ సాఫల్యము నెరవేర్చకుండునా

చుక్కలెన్నో ఆకాశాన చిక్కుకున్నా 
విశ్వాంతరాల విధిగా విహరించకుండునా
జిగేల్ మని చమక్కూల్ చిమ్మకుండునా
సృష్టి సూత్రాల విశిష్టతల ఆచరించకుండునా
తమ తమ సామ్రాజ్య ఉనికిని కాపాడకుండునా
తన జీవ సాఫల్యము నెరవేర్చకుండునా

బ్రహ్మాండానికి తాత్కాలిక అతిథిగా విచ్చేసిన
పిండం పండి ప్రాణిగ భువిపై పడకుండునా 
తనువు పెరిగి తరిగి తావు వీడకుండునా
ఊసు ముగిసి ఉనికి అదృశ్యమవ్వకుండునా
ఈ పాటి మాంసపు ముద్దకు స్వార్థ మేల 
మనిషి మానవత్వాన్ని వీడే సంపదలలేల
నరుడు జీవ సాఫల్యము నెరవేర్చడేలా

ఇది నా స్వీయ రచన 
డా.దీపక్ న్యాతి 
హైదరాబాద్
22
*
ఆర్. వి. వి. రాజా 
జిల్లా 
*
కాకినాడ 
కవిత
*
శీర్షిక: బ్రహ్మ కడగాల్సిన పాదాలు
**************************
అవును నేను భక్తుణ్ణే
 బ్రహ్మ కడగక మర్చిపోయిన
పాదాలకు నేను భక్తుణ్ణే
 కాని...

 గర్భాలయాలు దాటిరాక
 నైవేద్యాలు భుజించే రాతి దేవుళ్లకు కాదు...

 కన్న పేగును ధైర్యపు పొద్దుచేసి 
 పొంచి ఉన్న సరిహద్దు మృత్యువు 
ముందు నిలబెట్టిన ఆ అమ్మ ధైర్యపు పాదాలకు
 నేను భక్తుణ్ణే....

 బెత్తంతో హత్తుకుని బ్రతుకు పాఠాన్ని విప్పి చెప్పి సందేహపు మెదళ్లలో కూతూహలపు నెగల్లు రగిల్చి
 మనిషిని ఋషిగా మలచిన గురుదేవుని జ్ఞానపాదాలకు నేను భక్తుణ్ణే...

తనను తాను కోల్పోయి
కుటుంబానికి సేవల వేల్పై 
వంటగది కర్మాగారంలో పగుళ్ళిచ్చిన
పాదాలకు నేను భక్తుణ్ణే...

 లోకం ఆకలికై మట్టిని మెతుకు చేస్తూ
 ప్రాణాలను పాదాలను నేలపైనే ఉంచేసిన
 చెమట దేవుళ్ళ మట్టి పాదాలకు
 నేను భక్తుణ్ణే...

 బడుగుల అడుగుల వెనక నిలబడి 
 ఆభిజాత్యపు ఐరావతాలను ప్రశ్నల పిడికిళ్ల తో పొడవాలని చూపుడువేలు ఎత్తి సూచించిన 
 ఆ జ్ఞాన సూర్యుని పాదాలకు 
 నేను భక్తుణ్ణే...

 గెలుపుకి అలుపు సహనం తెప్పిస్తుందని 
 హింస ఆయువు అహింస చేతిలో ఉందని 
 నేల నాలుగు చెరగుల నడిచి చెప్పిన
 సత్యమేవ జయతే అన్న మహాత్మ పాదాలకు...
నేను భక్తుణ్ణే....
ఐతే....
ఇవన్నీ బ్రహ్మ కడగాల్సిన పాదాలు 
సాక్షాత్తు పరబ్రహ్మై జీవించిన భావాలు 

             -== ఆర్. వి. వి. రాజా
23
శీర్షిక    మసిబారిన మానవత్వం  .
వాణిసరోజిని  లక్కరాజు 
హైదరాబాద్ 
9491054829 .

విషంజిమ్మే. మతమౌడ్యులు
విశృంఖలత్వ విజృంభణ తో
మంచుకొండల్లో చేసిన మారణహోమం ,
మానవీయవిలువలకు మాయని మచ్చ .
దిగిన తూటాలకు,  ఆగినగుండెలు.
 అయినవారి,ఆక్రందనలతో ,తల్లడిల్లింది కాశ్మీరం .
శ్వేతగిరులమధ్య పారిన రక్తపు టేరులుజూసి,
తెగిన బంధాలయేడ్పులకు దిక్కులు పిక్కటిల్లాయి
ఏంసాధించాలని యీ నరమేధం?
ఏమతం బోధించింది మానవవూచకోతలను ?
తాము నమ్మిన  మతాలకే మచ్చతెచ్చే 
దుష్కార్యం !
మతంఒకవిశ్వాసం  ఒక మంచితనం 
సహనం సౌశీల్యతలకు చక్కని దిక్సూచి .
మతాలేవీ  కావుకదా  మానవత్వానికి విరుధ్ధం !
 ఆనందంతో కేరింతలుకొట్టే పసికూనల  భావిని  చిదిమి,పొందే పైశాచిక ఆనందం కాదా?యిది 
అందాల లోయలో ఆగిన పర్యాటకం 
కశ్మీరీ ప్రజల  కడుపు కొట్టిన కిరాతకం 
ఎన్నిచట్టాలువస్తేనేమి యెంత అభివృధ్ధి తెస్తేనేమి  ?
మానవత్వం  మంటగలిపి ప్రాణాలతో 
చెలగాట  మాడేవేళ!
తగిన బుద్ధిచెప్పి తరిమికొట్టాలి జనం 
స్థానికుల  సహకారమే యిందుకు  పరిష్కారం 
కరుడు కట్టిన  దుర్మార్గులను కసిదీర శిక్షించాలి 
ఉగ్రవాద ముష్కురులను  వురికంబ  మెక్కించాలి 
మానవత్వం మేల్కొని మంచికి సహకరించాలి.

జైభారత్.

 24
కవయిత్రి పేరు 
*
నాగలక్ష్మి తంగిరాల 
జిల్లా 
*
Auckland, Newzealand 
కవిత
*
అంశం:స్వేచ్ఛ
కవయిత్రి: తంగిరాల నాగలక్ష్మి

మనసుకున్నది స్వేచ్ఛ అందుకే మలయామారుతాంలా
విహరిస్తుంది ఊహలోకంలో ఒకతరి
మరొకతరి భగ భగ మండే అగ్ని జ్వాలలో రగులు తుంది మాట వినదు 
మన అదుపులో ఉండదు 
పరమాత్ముని వ్యక్త రూపమై పంచభూతాలతో సమ్మిళితమైన
ప్రకృతికి వుంది స్వేచ్ఛ ఎవరికీ లొంగనిది ఆయనికి తప్ప

కన్నీళ్ల బంధీఖానా లో ఇంకెన్నేళ్లు
ఆనంద భాష్పపు ముత్యాల సరాల
సరస్సులో మానవాళి ఓలలాడే దెన్నడు?
కవికి కవిత స్వేచ్ఛగా పూల బాటవేసి ఆహ్వానము పలుకు తోంది
కట్టు దిట్టమైన స్వేచ్ఛ అక్రమాలను దరి జేయ నీయక
సక్రమ మార్గానికి స్వాగతం పలుకుతుంది

స్వేచ్ఛగా మనిషి సమాజంలో తిరగాలంటే
కావాలి మానవత్వం నశించాలి అమానుషత్వం
పారద్రోలాలి హింసావాదం

స్వేచ్ఛ అంటే 
నేస్తమా! అరమరికలు లేకుండా అపార్ధాల అడ్డుగోడలు తొలగించి అభిప్రాయాలు ఆలోచనలు పంచుకోవటం

అరుణారుణ కాంతులలో సుప్రభాత వేళ విశ్వశక్తి తో  మనసును అనుసంధానం జేయటం
ప్రకృతి లోని సౌందర్య దృశ్యాల  వీక్షణలో  ఆనంద ఆహ్లాదపు టంచులలో పయనించటం

బంధాలతో అనుబంధం  పెనవవేసుకుంటే స్వేచ్చని గట్టిగా బంధించి నట్టే
స్వేచ్ఛ అంటే ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించటమా?
సినిమాలు,షికార్లు, డేటింగ్ లంటూ విలువైన జీవితాన్ని ముళ్ల కంపల లోకి త్రోయటమా?
స్వతంత్ర భావాలంటూ కన్న తల్లి దండ్రుల మాటకు విలువ, గౌరవం ఇవ్వకుండా తనకు తానే నిర్ణయాలు తీసుకో వటమా?
స్వేచ్ఛ కోపరిధి వుంది భాష కో వ్యాకరణం లా
పద్యానికి ఛందస్సులా    పాటకి రాగంలా
జీవాత్మ ఉపాధిలో బంధింపబడి నానా బాధలు పడకుండా  స్వచ్ఛమైన ఆత్మగా బ్రహ్మానందం పొంది
పరమాత్మ లో ఐక్య మయ్యే స్వేచ్ఛ మార్గం వెదకాలి
పట్టుకోవాలి సాధించాలి
********

 25
*
గొర్రెపాటి శ్రీను
జిల్లా 
*
Medchal 
కవిత
*
"అమ్మ స్పర్శ"

చిరునవ్వులు చిగురిస్తున్న మోము వైపు
సంబరంగా చూస్తూ
ముద్దుల్ని కురిపించే ప్రేమస్వరూపిణి అమ్మ!
తడబడుతూ పరుగెడుతుంటే
పడిపోవద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తూ
వెంటనే అనుసరిస్తూ
జాగ్రత్తలెన్నో వల్లించే అనురాగ మాలిక అమ్మ!
పుస్తకాలతో కుస్తీ పడుతూ
అర్థమవ్వని పాఠాన్ని
పదేపదే బట్టీపడుతూ అవస్తపడుతుంటే
చదువు చెప్పలేకపోయినా ఎలా చదవాలో జీవన పాఠాన్ని భోదించే నువ్వెన్నడూ మరవలేని జీవన పాఠశాల తొలి గురువు అమ్మ!  
ఉన్నత చదువులు చదివాక ఉద్యోగం కోసం అల్లాడుతుంటే
అధైర్యాన్ని నీ దరిచేరకుండా
హితవచనాలు చెప్పే ప్రేరణామూర్తి అమ్మ!
భార్య,పిల్లలతో ఓ ఇంటివాడైనాక
నీ ఆలనాపాలననే కాకుండా చిన్నారుల అభ్యున్నతికి సైతం
అవిశ్రాంతంగా పాటుపడే అమృతమూర్తి అమ్మ!  
నువ్వు జీవితంలో అంతో ఇంతో సాధించాక
ఉద్యోగంలో ఉన్నత పదవి చేపట్టి వైభవంగా వెలుగుతుంటే ..
తను నేలపైన లేకపోయినా
ఆకాశం నుండే ఆనందభాష్పాలు వర్షించే దేవత అమ్మ!
అదే అమ్మ పంచే ఆత్మీయ దీవెన..!
సదా నువ్వు జ్ఞప్తికి ఉంచుకోవలసిన అభినందనల జ్ఞాపిక అమ్మ !
అనునిత్యం నీ సంక్షేమాన్ని అభిలషించే నీ శ్రేయోభిలాషి అమ్మ!

           -గొర్రెపాటి శ్రీను
26
కొంజేటి రాధిక 
ఊరు రాయదుర్గం 
     జీవన యానం 

ఆకలితో మెలితిరిగే పేగులను,
 గోడకు కొట్టిన మేకుకు తగిలించి,
 బతుకు పరుగు పందెంలో పోటాపోటీగా పరుగులు తీసే మనసుకు పూట పూట సర్ది చెప్పుకుంటూ ఆసరా బాసర లేని లక్ష్యానికి నా ఆత్మ స్తైర్యాన్ని జోడించి,
 ఆయువుక్షీణించిన ఆర్థిక వ్యవస్థను పక్కకు నెట్టి, ఎన్నెన్ని వ్యూహాత్మక వర్ణ చిత్రాలో ఆశయ సాధనను అందుకోవడానికి...
ఆటుపోట్లు అల్లడం అలజడిని సృష్టించినా, ఒడిదుడుకుల మైలురాళ్లను దాటలేక అలసిపోయినా,
 కష్టాల నష్టాలు చిద్రం చేసినా చిత్తడి చేసినా, సడలని ఆత్మవిశ్వాసం అనువంతైన జడసిపోక గడిచిన గడియ గడియను పై మెట్టుగా చేసుకుని రేపటి కలల సాకారానికై ఇవాళ ఉపశమెంప చేసిన పస్తుల ప్రయాణం
 రేపటి భవితను బంగారు మయం చేస్తుందన్న ఆకాంక్షతో ఇవాళ శ్రమిద్దాం అలుపెరుగని పోరాట యోధుడై... కుటుంబానికైనా సరిహద్దులోనైనా హద్దులు లేని ప్రతిభకు పట్టాభిషేకమొనర్చుకుని విజయ దరహాసాన్ని పెదాలపై నిలుపుదాం.

27
పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
వైశాఖ మాసం పౌర్ణమి కవితల పోటీకి.....
అంశము :-- ఐచ్ఛికం.
శీర్షిక :-- 'ఆడ'పిల్ల.

1.తే.గీ.
'ఈడ' పిల్లవు గాదు నీ 'వాడ' పిల్ల
వనుచు పుట్టింటిలో చులకనగ చూచు
తల్లిదండ్రుల మదిలోని తత్త్వమింత
మారనంత వరకు మహి మారబోవు
ఆడపిల్లల కష్టా లనంత మగును.
2.తే.గీ.
పాలుగారెడు చిన్నారి ప్రాయమందు
మానిపించుచు చదువులు మధ్యలోన
చిన్నతనమందె పెళ్లిళ్లు చేయుచున్న
పెద్ద వారిని చీవాట్లు పెట్టవలయు.
3.తే.గీ.
పదియు నాల్గు వత్సరముల ప్రాయమందు
నాడపిల్లల పెళ్లిళ్ల కాత్రపడెడు
పెద్దవారి మూర్ఖత్వము పెచ్చరిల్ల
బలిపశువు లగుచున్నారు వనితలయ్యొ.
4.తే.గీ.
పదునెనిమిదేండ్లు రాకుండ పరిణయంబు
చేయతగ దాడపిల్లకు చేటు తెచ్చు
నతివ లారోగ్యమునకును హాని కల్గు
చట్ట మేమాత్ర మొప్పదు చుట్టమైన.
5.తే.గీ.
ఆడ పిల్లలొంటరిగ భయమును లేక
పయనమొనరించు స్థితిలేదు బయట తిరుగ
నెప్పు డెచటనుంచి మృగాళ్లు నెదురుకొనునొ
రక్షణ కరువాయెను మాన ప్రాణములకు.
*************************************
28
*
శ్రీ మతి లలితా చండి
జిల్లా 
*
హైదరాబాదు 
కవిత
*
కవితాగానం
*అక్షరాలు* 

అక్షరాలు అలవోకగా 
కదులుతున్నాయి 
పలకలపై నుండి  కాగితాల్లోకి 
కాగితాల్లోంచి  కంప్యూటర్ లోకి     
కంప్యూటర్ నుండి  
సెల్ ఫోన్లోకి.
అక్షరం ఆదిశక్తి  ఆకారం
అక్షరమే అన్నటికీ శ్రీకారం
అక్షరం విద్యాభ్యాసానికి ఆది
అక్షరం ఆలోచనలకు ఆయువుపట్టు
అక్షరాలు  
అనంత గమనాలు
అక్షరాలన్నీ బంధాలే
అక్షరం అక్షరం కలసి వెదజల్లే మల్లెల పరిమళాలు  
అక్షరాలు పసుపు దారలై 
అంతులేని బంధాలను ముడివేస్తూ  అరమరికలు ఎరుగని చరిత్ర  నిక్షేపాలు  చ
అక్షరాలు 
ఆగాధమైన భావాలకు  రూపాలై  అభిసారికలై ఎదురుచూస్తున్నాయి.
అక్షరం ఓ ఆకర్షణ
అక్షరమేగామన బంధువు
అక్షరం అర్ధంకాని అనుబంధం
అక్షరమేగా మన గురువు
అక్షరమేగా మన ఆయుధం
అక్షరాలు *గీత* లై
విధి రాతలై 
తలరాతలను మార్చే భగవద్గీతలై 
భవ బంధాలను కడదేర్చే జ్ఞాన ప్రధాతలు.

లలితాచండి
న్యాయవాది /రచయిత్రి 
29
కవిత గానం పౌర్ణమి కవితల పోటీ.
 శీర్షిక:-

అమ్మా...!

అమ్మ లోని 
కమ్మదనం ఎక్కడుంది 
నవ మాసలు మోసిన
తన కౌగిలి లో తప్ప...

అమ్మంటే ఆట బొమ్మ
కాదు పలక
బలపం చేతికిచ్చి
బతుకు బాట
చూపే ఆది గురువే
అమ్మ...
కన్న తల్లి ప్రేమ
కనిపించని సప్త సంద్రం.
జనని ఓ ధరణి సుమ...
మరవకు విడవకు రా
🙏🙏🙏

జవ్వాజి
30
ఇంద్రావత్ రాహుల్ 
జిల్లా 
*
నిజామాబాద్ 
కవిత
*
పెనారో గతం


చీకటి ముసుగు వేసుకొని 
నవో దీయో కోసం 
పురుగుల్ని లెక్కబేడుతాయి.
గాలి స్పర్శతో మత్తులో 
మునుగుతున్న చీకటి 
వయ్యారాలు మాధుర్యంనూ ఓలకపొస్తుంది.

చిరు చిరు ఆకులను తడుపుతున్న 
నీటి బిందువులు నిడకలేని నీలి 
సంద్రంలో దాక్కొని 
గుసీగాసా ఆడుకుంటాయి.
పూలు పూసినట్టు పూసి 
అప్పుడే వాడిపోతాయి.
చూసే అధర కుదురంలో 
వయ్యారం వేణువుగా 
పలుకులు పలుకుతుంది.


అర్దాలు

వేకువ కిరణాల వేకువతో
సూర్యమామ మోడ్రన్ గా 
తయారు అయి 
బొడ్డు తాడును విప్పుతాడు.

మనోవీధిలో సాగె 
మందాకిని అందం 
మల్లె మందారంలా 
విరబూసి దుప్పటి 
కప్పుకొని పడుకుంటాది.

కలలు పుట్టిన మంచు 
నిశిధిలో రాప్యార్ హర్ లా 
ఏకాంతంతో మంగళ హారతి 
పడుతుంది.

మనసు లో రాలిపోయిన 
పుప్పొడి బాణాలు భావ 
పరిమళంనూ పూయలేక 
నటింటా నాట్యం ఆడుతున్నాయి.

వసంత ఋతువులో 
ఆగం అయినా సోంళి బాయి 
మనసు వీప్పలేని చేదు నిజంతో 
నక్షత్రంకూ రాలిన చెమట 
పువ్వుల ఒంటరిగా విలపిస్తుంది..


పెనారో - పురాతన 
నవో దియో -కొత్త దీపం 
గుసీ గాసా -దాగుడుమూతలు 
రాప్యార్ హర్ -పైసలా హారం 
సోంళి బాయి -బంజారా అమ్మాయి

31.
కవితా గానం (సీజన్ 6)
శీర్షిక... ఏమవుతుంది ఈ లోకం..?

ఏమవుతుంది ఈ లోకం,ఎక్కడికి మనం చేరుకున్నాము.

మానవత్వపు పరిమళాలు ఎక్కడా వెదజల్లడం లేదు

రాను రాను ప్రపంచంలో 
శాంతి వీచికలు స్తంభించిపోతున్నాయి..

ప్రకృతి అందాలు పరవశంగా సకుటుంబ సమేతంగా 
ఆస్వాదించే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు
రాక్షస‌ కృత్యాలు అడ్డుకట్టలు వేస్తున్నాయి ..‌..

ఉన్మాదత్వం రెక్కలు విరుచుకుని వీర విహారం చేస్తోంది ...

అమాయకపు ఆనంద కెరటాలు తీరం చేరకుండానే 
ఉగ్ర దాహానికి రక్తపుటేరులు పారుతూ
అలల కల్లోల కడలిలో కలిసి  కడతేరి పోయాయి ...

కమ్మని కలల ప్రపంచంలో తేలియాడాలని 
సుదూర సుందర దృశ్యాలను తమ మస్తిష్కంలో బంధించి 
సంతోషాల ఉయ్యాలూగుతున్న ఉత్సాహపు ఊపిరులు ఆవిరి అయి పోయాయి ...

సగంలోనే ఆత్మీయ బంధాల శ్వాసను శాశ్వతంగా 
విడిచి అనంత లోకాలకు చేరిపోయాయి..‌.

అనుబంధాల  తాళ్ళు విరిచేసి సంబంధాలను తెగ్గొట్టిన ఉగ్రోన్మాదానికి అంతే లేదా..?

ఏమవుతుందో ,ఏం జరుగుతుందో తెలియని
ఇంత మంది అమాయకుల ఊచకోతకు అర్థ మేమిటి…?

ఏం సాధించాలని ఈ దుశ్చర్యలకు పాటు పడుతున్నారు..?

ఉన్మాదత్వానికి మందులేదా, మార్పు లేదా..?
ఉగ్ర వాదాన్ని కూకటి వేళ్ళతో పెకలించి 
సమూలంగా అంతమొందించి శాంతి జెండాను పాతినప్పుడే ప్రజల ప్రాణాలకు స్వేచ్ఛా ,రక్షణ …!!

హామీ.... నమస్తే ఈ కవిత నా స్వీయ రచన అని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను 🙏 

మొహమ్మద్.అఫ్సర వలీషా
ద్వారపూడి (కోనసీమ జిల్లా)
32
కవితా గానం సీజన్ -6
కవనజ్యోతి వైశాఖ మాస పౌర్ణమి పోటీలు
అంశం ఐచ్చికం
శీర్షిక మౌనం

మౌనం అర్ధాంగీకారమై భాసిల్లు 
అంతరంగ ఆలోచనల నిశ్శబ్దమై శోభిల్లు 
ఆత్మీయుల కఠోర వాక్కుల బాంబు పేలుళ్లకు 
మనసు చెదరి నోటి వెంట మాట రాక 
మౌనాన్ని ఆశ్రయించడమే మేలు గదా 
మనసు యీటెల్లాంటి మాటల దెబ్బలతో 
మూగవోయి మౌనమే శరణ్య మాయే 

ఊహించని కల్లోలాలతో గుండె గుడి చెదరి 
దిగులు మబ్బులు హృదయాన్ని కబళించినపుడు 
ఉర్వికి భారమైనట్లు తోచినపుడు 
నేత్రాల నుండి కన్నీరు వరదగా మారినపుడు 
మౌనం నేనున్నానని తోడై, నీడై నిలుచు 

తుఫానుకు ముందు నిశ్శబ్దంలా
ప్రళయానికి ముందు ప్రశాంతంలా
ఆలోచన స్రవంతుల వేదనలు నింగిని తాకినపుడు మెదడు స్తంభించి మొద్దుబారినపుడు
ప్రేమను పంచాల్సిన కన్నప్రేగులు
కాఠిన్యాన్ని దుస్తులుగా ధరించినపుడు
మౌనంతో గుండె జారి నీరై పోయే

మోహజాలంలో కొట్టుమిట్టాడే వారికి
మానవత్వానికి మసిబూసి, అహంకారమే
భూషణంగా దాల్చి,అన్యాయానికి బాటలు వేసి
అమానుషానికి రూపమైన వారిని, కన్న ప్రేగులను
కాదనలేక మాటలు రాని మూగవారిలా మౌనమే

ఈ కవిత నా స్వంతమని హామీ
33
అబద్దం 
*******"
తాను లేడన్నది అబద్ధం 
నమ్మరేమో కానీ 
ఎక్కడ సమావేశం జరిగినా
ఓ ఖాళీ కుర్చీలో కూర్చుని ఉంటాడు 
 నలుగురు కూడినచోట ఓ మౌన స్వరం తానై పలుకుతూ
 ఏ సెంటర్లోనో బ్యానర్ కడుతున్నప్పుడు
 కనబడకుండా చేయందిస్తూ
 ఏ బస్సు వెనకాలో పోస్టర్ అంటిస్తున్నప్పుడు నిను తొందరపెడుతూ
 ఏ టీచర్ కో కరపత్రం పంచుతున్నవేళ
చిరునవ్వై 
 నీ పక్కన తానెపుడూ ఉంటాడు 
డీటీయఫ్ అడుగులు కనపడిన చోట తానో అడుగై
ఫెడరేషన్ స్వరం వినపడిన చోట
తాను తిరుగాడుతూనే ఉంటాడు 
 గమనించ గలీగితే
కొమురన్న ప్రౙెన్స్
అనుక్షణం అనుభవిస్తూనే ఉంటాం 
జోహార్ కొమురన్న
‌...... వీరా గుడిపల్లి

34
జన్మకో శివరాత్రి 

ఏ రూపంలో కనిపిస్తావో!!!!
ఏ వేషంలో వస్తావో!!!!
 
విభూతి చాలనుకుంటే అనిర్వచనీయమైన అనుభూతినిస్తావు 

దర్శనం చాలనుకుంటే మహిమాన్వితస్పర్శనాన్నిస్తావు 


నీవే దిక్కంటే అక్కున చేర్చుకుంటావు 

నిరీక్షణకు నిర్వచనాఫలపు మాధుర్యాన్ని రుచి చూపిస్తావు 
 

ఏమా ఆధ్యాత్మిక వైభవం 
ఏమా సంతు మహంతుల సంరంభం??? 
ఏమా జయజయ ధ్వానాలు??
ఎక్కడివా శంఖధ్వనులు???

ఏమా ఢమరుకపు హేల???
 విశ్వానాథా నీ లీల కాకుంటే 

కలియుగంలో కైలాసానికి తరలివెళ్తున్న తరుణంలా...

కరుణావాహినిగా కాశీ 
వాత్సల్యపుద్వారంగా వారణాసి

నాగసాధువులతో సాగడమూ ఒక యోగమేనంటూ 


కన్నులు రెండు చాలవని కన్నీటి పర్యంతమవుతూ మనసు 
వీనుల విందంటూ తనువు 
సంవేదనాస్వాదనలో 

విశ్వనాథుని కృపావీక్షణపు పిలుపు వినిపిస్తూ 

జన్మకో శివరాత్రన్నది తలపుకొస్తుంది

********శివునూరి లలితాకృష్ణ


Comments

Popular posts from this blog

సింధూరం 07052025

****************** సింధూరం దిద్దిన వారు  1.వీరా గుడిపల్లి 2.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, 3.గొర్రెపాటి శ్రీను  4.దోసపాటి వేంకట రామచంద్రరావు  5.అపరాజిత్ 6.వేమూరి సత్యవతి  7.జ్యోతి  8.మండ నాగేశ్వరరావు  9.గడ్డం కృష్ణారెడ్డి.రేపాల.సూర్యాపేట 10.కవిత వెంకటేశ్వర్లు  11.ఆర్ వి వి రాజా  12. శ్రీ కోరాడ నరసింహారావు గారు  13. శ్రీ ఉదయగిరి మధుమోహన్ గారు  14. శ్రీమతి బల్లూరి ఉమాదేవి గారు  15. శ్రీమతి తోట సులోచన గారు  16. శ్రీ జి సూర్యనారాయణ గారు  17. శ్రీ గజవెల్లి శ్రీనివాస చారి గారు  18. శ్రీ వనపర్తి గంగాధర్ గారు  19. శ్రీమతి వాణి సరోజిని లక్కరాజు గారు  20. శ్రీమతి సింహాద్రి వాణి గారు 21. శ్రీ ఆచార్య అయ్యల సోమయాజులు ప్రసాద్ గారు  22. 23.శ్రీమతి నెల్లూరు వేంకటలక్ష్మి గారు 24.శ్రీ ఏడెల్లి రాములు గారు  25. శ్రీమతి డాక్టర్ తంగిరాల నాగలక్ష్మి గారు  26. శ్రీ కూని అంకబాబు గారు  27. శ్రీ తిన్నాక నాగేశ్వరరావు గారు  28. శ్రీమతి లలితా చంటి గారు  29. శ్రీ పిల్ల వెంకటరమణ మూర్తి గారు  30. ...

వీడ్కోలు ఆషాఢమాసం పౌర్ణమి

అంశం: వీడ్కోలు  సందర్భం: ఆషాఢమాసం పౌర్ణమి  నిర్వహణ:  వీరా గుడిపల్లి లలితాకృష్ణ  ################## కవివరుల జాబితా  1.పిళ్ళా వెంకట రమణమూర్తి గారు  2. జి.సూర్యనారాయణ గారు  3.మండ నాగేశ్వరరావు గారు  4.డా‌.బల్లూరి ఉమాదేవి గారు  5. డా.కమలాదేవి గారు  6.గొర్రెపాటి శ్రీను గారు  7.వేమూరి సత్యవతి గారు  8.కూని అంకబాబు గారు  9.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  10.కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  11.తోట సులోచన గారు  12.వాణిసరోజిని లక్కరాజు గారు  13. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు  14.అపరాజిత రెడ్డి గారు 15.లలితాచండి గారు 16. నెల్లూరు వెంకటలక్ష్మి గారు  17.కమలశ్రీ గారు  18.రాధిక గారు 19.చంద్రమౌళి గారు  20.శ్రీకాంత్ గారు  21.సింగీతం సంతోష్ కుమార్ గారు  22.. దారల విజయ కుమారి గారు  23.ఎన్.నరేశ్ చారి గారు  24. పిన్నక నాగేశ్వరరావు గారు  25.సింహాద్రి వాణి గారు  26.ఏడెల్లి రాములు గారు  27.కొంజేటి రాధిక గారు  ++++++++++++++++++++++++++++++++ ఆషాడ మ...