శివునూరి లలితా కృష్ణ
***********************
అంశం
శుభాకాంక్షలు
************
పౌర్ణమి కవివరుల జాబితా
***********************
1.శ్రీ కోరాడ నరసింహారావు గారు
2.శ్రీ ఆర్.వి.వి.రాజా గారు
3. శ్రీ కొమురవెల్లి అంజయ్య గారు
4.శ్రీ చేబియ్యం శ్రీనివాస రావు గారు
5.శ్రీ అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
6. శ్రీ డా.దీపక్ న్యాతి గారు
7.శ్రీమతి వేమూరి సత్యవతి గారు
8. శ్రీమతి దారల విజయ కుమారి గారు
9. శ్రీ మతి డా బల్లూరి ఉమాదేవి గారు
10. శ్రీ దోసపాటి వేంకట రామచంద్రారావు గారు
11.శ్రీ.ఇంద్రావత్ రాహుల్ గారు
12.శ్రీమతి గంటి మీనా కుమారి గారు
13. శ్రీ అపరాజిత రెడ్డి గారు
14. శ్రీ బాలు కత్తుల గారు
15. శ్రీమతి లలితా చండి గారు
16. శ్రీ మతి కె.దేవికారాణి రత్నాకర్ గారు
17.శ్రీ తిప్పావఝల నరసింహ మూర్తి గారు
18. శ్రీ మతి తోట సులోచన గారు
19. శ్రీమతి వాణి సరోజిని లక్కరాజు గారు
20. శ్రీమతి డా.నాగలక్ష్మి తంగిరాల గారు
21. శ్రీ కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు
22. శ్రీ మద్ది పుల్లారావు గారు
23.శ్రీ ఆళ్ళ నాగేశ్వరరావు గారు
24. శ్రీ వేదాంతం సురేష్ బాబు గారు
25. శ్రీ మతి సింహాద్రి వాణి గారు
26. శ్రీ మేకల రామస్వామి గారు
27.శ్రీమతి కందూరి సుజాతా రాణి గారు
28.శ్రీ గజవెళ్ళి శ్రీ నివాసా చారి గారు
29. శ్రీమతి రాజశేఖరుని శ్రీ శివలక్ష్మి గారు
30. శ్రీ కవిత వెంకటేశ్వర్లు గారు
31. శ్రీ మతి మొహమ్మద్ అఫ్సర వలీషా గారు
32. శ్రీ గొర్రెపాటి శ్రీను గారు
33. శ్రీ పొర్ల వేణు గోపాల్ రావు గారు
34. శ్రీ ముడుంబ తిరు వేంకటాచార్యులు గారు
35. శ్రీ మతి కొంజేటి రాధిక గారు
36. శ్రీ మతి మన్నె లలిత గారు
37.శ్రీ ఏడెల్లి రాములు గారు
****************
1
కవితాగానం పౌర్ణమి కవితలపోటీ !
అంశం :- * శుభాకాంక్షలు *
కోరాడ నరసింహా రావు
శీర్షిక :- మనసావాచాకర్మణ
***************
మనుసా , వాచా , కర్మణా...
త్రికరణ శుద్దితో... చెబుతున్నా
శుభాకాంక్షలు.... !
నువ్వు - నేను.... వీధి - ఊరు
అందరం బాగుండాలని కోరుకుంటూ చెబుతున్నా శుభాకాంక్షలు... !
ఎవరే మంచిపనిని ప్రారంభించినా... విజయవంతము కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... చెబుతున్నా శుభాకాంక్షలు !
పిల్లా పాపలతో అందరూ సుఖ సంతోషాల ఆనందంతో... కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ తెలియజేస్తున్నా
మీ అందరికీ... నా శుభాకాంక్షలు.... !!
జన్మించిన ప్రతిబిడ్డా...
సుఖ, సౌఖ్యానందాలతో
వర్ధిల్లాలని కోరుకుంటూ... తెలియజేస్తున్నా... శుభాకాంక్షలు !
ఎవరే మంచిపనిని ప్రారంభించినా... విజయవంతము కావాలని త్రికరణ శుద్ధి గా చెబుతున్నా శుభాకాంక్షలు !
నూతన వధూవరులు వందేళ్లు పెళ్లిరోజులను జరుపుకోవాలని ఎంతో ప్రేమతో చెబుతున్నా శుభాకాంక్షలు... !
ఈ జగమంతా యుద్ధభయాలు రోగబాధలు లేకుండా సుఖశాంతులతో బ్రతకాలని హృదయపూర్వకముగా... చెబుతున్నా... శుభాకాంక్షలు
ప్రపంచమంతా బేధభావములు విడనాడి, సుహృద్భావముతో కలిసిమెలిసి జీవించాలని ఆ సర్వేశ్వరుని కోరుకుంటూ ప్రతిఒక్కరికీ... చెబుతున్నా నా హృదయపూర్వక శుభాకాంక్షలు... !
2.
తేదీ 30-3-2023
కవితగానం సీజన్ -4 చైత్రమాస పౌర్ణమి పోటీలకు
అంశం : శుభాకాంక్షలు
శీర్షిక : ఆశలూదు..
********************************
రాలిన ఆకుల మధ్య నిలబడి
రోదిస్తున్న చెట్టును చూసామా
కూలిన గూడును చూసి గుక్కపేట్టిన పిట్ట కనబడిందా
అడ్డంకి రాళ్ళకు జడిసి ఏ నదైన
వెనకడుగువేసిందా....
కష్టాన్ని కంటి చివర్లలో కారనీయక
పంటిబిగువున అదిమిపెట్టి ఎదురు చూస్తే
కాలం ఎదురొచ్చి గెలుపు గులాబీలిస్తుంది
శిశిరం ఎప్పటికైనా శిథిలమౌతుందనే
మోడు మౌనం చిగురు కలలు కంటుంది...
దిగులు నివురు కిందున్న
జీవనకణికకు ఆశలూది
ప్రజ్వాలింపచేసి దైన్యాన్ని
ధైర్యపు శిఖరం ముందు
నిలబెట్టే పాటవాలకే ఎదురెళ్లి
శుభకామనలు కుమ్మరిచాలి...
జరిగిన దాన్ని పక్కకు జరిపి
జరగాల్సిన దాన్ని సంబరంగా మలుచుకునే అద్వితీయ తత్వాన్నే
బతుకున శుభ కాంక్షగా వెలిగించాలి...
*************************************
ఆర్. వి. వి. రాజా, శృంగారాయునిపాలెం,
తూ. గో. జిల్లా.9059492795.
హామీ పత్రం
ఈ నా పైరచన పూర్తిగా నా సొంతం. మరి ఏ ఇతర రచనకు అనుకరణ గాని అనుసరణ గాని కాదు. ధన్యవాదాలు.
3
శుభాకాంక్షలు
.........................
విత్తు మొలకైనా, మొలక చెట్టైనా, చెట్టు కాతయినా
తెలుపరు శుభాకాంక్షలు, చప్పట్లతో అభినందనలు
ప్రకృతి ధర్మమంటారు యాంత్రికంగా
మబ్బు పట్టక, చినుకు రాలక, మట్టి తడువక పోతే
చేస్తారు కప్పల పెళ్లి, నింపుతారు శివలింగాన్ని నీటిలో
చినుకు వాన, వరద, నదిగా మారి
పరుగు పందెంలో గెలిస్తే
ఆనంద ప్రకృతిని ఆస్వాదిస్తారు
విసిరేస్తారు పైసలు నదిలోకి దండం పెట్టి
ఉండదు శుభాకాంక్షల సందడి
శుభాకాంక్షలు చప్పట్లన్నీ మనుషులకే
పండుగలు, పబ్బాలు, పుట్టుకలు, పెళ్లి దినాలకు
గతంలో ఆత్మీయత పలకరింపులు
అనుభూతుల ఆలింగనాలు
చేతి ఆత్మతో స్పర్శలు చెరుకు గడ తిన్నట్లుండేవి
విజ్ఞానం గొడుగు
విశ్వమంతా సాలెగూడులా అల్లుకున్నాక
వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వగైరా అన్ని
ప్రచార విస్తర్లు పరిచాయి బిర్యానీలతో
ప్రతి నవ్వుకు, ఆనందానికి యాంత్రిక శుభాకాంక్షల డప్పులు
చేరాల్సిన వారికి చేరుతున్నాయా?
నాడు పోస్ట్ కార్డయినా దాచుకునేలాగుండేది
ల్యాండ్ ఫోన్ మోగితే ఆత్మ లేచొచ్చినట్లుండేది
నేడు అన్నీ చూడలేక, జవాబివ్వలేక
ధన్యవాదాలు అందరికీ మొక్కుబడిగా
శుభాకాంక్షల చిరునవ్వు కడుపు నింపాలి
తెల్లగాగితంపై మనుమరాలు బొమ్మ గీసి
ఆకాంక్షల మనసు నింపినట్లుండాలి
బాబు పతంగి ఎగరేసి చేతికిచ్చినట్లుండాలి
నిర్లక్ష్యంగా చిల్లర పైసలు విసిరేసినట్లు
తెలిపే శుభాకాంక్షలు జిరాక్స్ తీసినట్లైనా ఉండవు
..................................................................
కొమురవెల్లి అంజయ్య
సిద్దిపేట
తేది..02-04-2023
4
అంశం: శుభాకాంక్షలు
శీర్శిక :చిన్నారుల విద్యకై పోరాడు సేవకులకు
శుభాకాంక్షలు తెలుపుదాం
రచన : చేబియ్యం శ్రీనివాసరావు
ఊరు : గుజరాతిపేట , శ్రీకాకుళం
చరవాణి : 7674055482
ప్రక్రియ : వచన కవిత్వ
సగటు జీవితం అవుతున్నది దుర్భరం
పేదరికపు జీవన ప్రారంభం
పెద్ద చదువులకు అందని సంబంధం
అనాగరికపు ఆచారాలకు
ఆటవికపు బానిసత్వాలకు
అలవాటుపడిన తల్లిదండ్రులు
అభ్యుదయపు వాదుల్లా అల్లూరికి వారసుల్లా
గురజాడ బాటలో పయనిస్తున్నట్లు కనబడినా
అవసరం కష్టం కనబడగానే
భావోద్రేకపు ఆశయాలను బజారులో అమ్మేసి
పిల్లల చదువులపై చిమ్మ చీకటి కప్పేసి
పండగకు బలిఇచ్చు మేకపోతులా
పెద్దింటి గుమ్మాలకు
కాసుల కక్కుర్తికి చిట్టి చేతులను కట్టేస్తున్నారు
ప్రభుత్వ పథకాలు దూరని గృహాలలో
విద్య కొనలేని మురికి కూపాలలో
ఎన్నో చిట్టి చేతులు బడి బాట పట్టక
బడాబాబుల బానిసలుగా మారుతున్నారు
రండి ! ఆ చిట్టి చేతులకు విముక్తి కలిగిద్దాం
బడి బయట పిల్లలను బడిలోకి పంపిద్దాం
నవభారత నిర్మాణ సారధుల
కార్ఖానాలు పాఠశాలలే అని తెలుపుదాం
ఈ కార్యక్రమ వారధులకు
వారి శుభ సంకల్పం
విజయవంతమవ్వాలని
శుభాకాంక్షలు తెలుపుదాం
5
కవితాగానం (సీజన్-4) చైత్రమాస పౌర్ణమి కవితా పోటీలకు
తేది:-31-03-23.
అంశం:- శుభాకాంక్షలు
పేరు:-
అయ్యలసోమయాజుల ప్రసాద్
ఊరు:- హైదరాబాద్
చరవాణి:-9963265762
కవితా శీర్షిక:-
విజయానికి సోపానాలు.
.................................
ధర్మేచ, అర్థేచ ,కామేచ మోక్షేచ అని వేద పండితుల ఆశీర్వచనంతో
తాళి కట్టిన ధర్మపత్ని
ఏడాది లోపు మీ బిడ్డకు జన్మనిస్తున్నాని చెప్పిన
తరుణంలో ఆనందంతో శుభాకాంక్షలు భర్త చెప్పి
కౌగిట తీసుకున్నపుడు ఆమె హృదయస్పందన వర్ణింపతరమా.
జన్మనిచ్చిన పిల్లలు రాష్ట్ర స్థాయిలో ఉత్తీర్ణత పొంది ప్రభుత్వంచే సత్కరించబడి,సమాజంలో అందరి మన్ననలు పొందిన సమయాన తల్లిదండ్రుల ఆనందహేళి మరువలేనిది.
ఇంతితై వటుడింతై అన్నట్లు దేశాధ్యక్షునిగా ఎన్నికైనా నూతన సంవత్సర శుభాకాంక్షలు చరవాణిలో విద్యాబుద్ధులు నేర్పిన గురువు కి చెప్పినపుడు ఉపాధ్యాయుని సంతోషం మాటలకతీతం.
ఆత్మీయత, అనురాగాల మేళవింపు శుభాకాంక్షలు
ఏ రంగంలో ఉన్న ప్రోత్సాహిస్తు శుభాకాంక్షలు తెలియచేసిన కాగలవు
విజయానికి సోపానాలు.
..................................
హమీ పత్రం
ఇది నా స్వీయరచన
కవితాగానం పౌర్ణమి పోటీల కొరకు మాత్రమే వ్రాసినది.
అయ్యలసోమయాజుల ప్రసాద్
హైదరాబాద్
9963265762.
.................................
6
డా.దీపక్ న్యాతి
జిల్లా
*
మేడ్చల్ మల్కాజ్గిరి
ఫోన్ నెంబర్
*
9849488837
కవిత
*
శీర్షిక : మానవజన్మ
విశ్వాన విహరిస్తున్నందుకు శుభాకాంక్షలు
పాలపుంతలో పావైనందున శుభాకాంక్షలు
సౌరకుటుంబంలో సంచరిస్తున్నందుకు శుభాకాంక్షలు
పృథ్వీపైన పురుడు పోసుకున్నందుకు శుభాకాంక్షలు
సురీడి సెగలను సారంగ వాడేవు శుభాకాంక్షలు
వరణుడి వరమున తడుస్తున్నందుకు శుభాకాంక్షలు
పవనుడి పవనాలకు అర్హుడివైనందున శుభాకాంక్షలు
మట్టిని వంటికంటించుకున్నందుకు శుభాకాంక్షలు
నింగి నీడలో వెలుగుతున్నందుకు శుభాకాంక్షలు
పంచభూతాల పంచనున్నందున శుభాకాంక్షలు
ప్రకృతిని పూజించ నేర్చినందుకు శుభాకాంక్షలు
జీవ వైవిధ్యాన్ని గౌరవిస్తున్నందుకు శుభాకాంక్షలు
మానవత్వాన్ని మనసుకు పూసుకున్నందుకు శుభాకాంక్షలు
పాలించే దక్షత దక్కించుకున్నందుకు శుభాకాంక్షలు
మనిషిగ మనగలుగుతున్నందున మరి మరి శుభాకాంక్షలు
ఎంతెదిగినా కొంత ఒదిగున్నందున శుభాకాంక్షలు
ప్రేమను తరచూ పూయిస్తున్నందున శుభాకాంక్షలు
బంధాల బాధ్యతలను భరిస్తున్నందున శుభాకాంక్షలు
అందరికీ ఆదర్శంగా అడుగులేస్తున్నందుకు శుభాకాంక్షలు
స్నేహితుడివై తోడుగా పయనిస్తున్నందుకు శుభాకాంక్షలు
7.
వేమూరి.సత్యవతి
జిల్లా
*
కృష్ణా జిల్లా
ఫోన్ నెంబర్
*
9885136308
కవిత
*
శీర్షిక.. ముక్తాయింపు!
ఆకాంక్ష లు, ఆశీర్వాదాలు మన సంస్కృతి!!
ఆర్ష సంప్రదాయ మైన మనో ధర్మమే సుమా!!
మనోవాక్కాయ కర్మలని ఒకటిగా చేసి మనసు సిధ్ధబడితే...
అక్కడో శుభాకాంక్షల పంట పండితే...
శుభాశీస్సుల వాయులీనాలు శ్వాసలో నిలిస్తే..
మరీ మరీ కోరుకునే మనోబలం తోడైతే..
అది ఒక ప్రార్ధన లా ఫలించదా?
అభినందనలు, ప్రేమారాధనలు వెల్లువలా
సత్యాగ్రహ సారధిని జాతిపితగా నిలపలేదా?
మహాత్ముడిగా మన్నించలేదా?
దృష్టిదోషం - నివారణ నమ్మేవారున్నపుడు
శుభాకాంక్షల బలాన్ని ఎలా కాదనగలం?
పెద్ద మనసున్న వృద్ధుల ఆశీస్సులని
సాక్షాత్తు రాముడు,కృష్ణుడు స్వీకరించ లేదా?
దైవం కన్నా మిన్నగా వెలిగిన గుర్వనుగ్రహాల గురుచరిత్ర లెన్నో!?
పెదవి చివరి నుంచి "మంది శుభాకాంక్షల్లో" మనసుండదు!
రాజకీయమే కానీ, శ్రధ్ధ లేని శబ్దకాలుష్యమే!
ధ్యానం లో, ప్రార్ధన లో, ప్రాణాయామం లో,
ఆకాంక్ష ల్లో,ఆశీస్సులలో మనసుండాలి!
మంచి మనుష్యులు మంచి మనసులు
పంచేంద్రియాలలో దాగిన పరమ శక్తి
ఆకాంక్షల్ని అనుగ్రహాలు గా మారుస్తుంది మరి!!
శుభాకామనల బలాన్ని
శుభాకాంక్షల అనుగ్రహాన్ని
శుభాశీస్సుల ప్రరంపరలకు
అందుకునే పాత్రత తోడవ్వాలి!
సంచితపు సంభారాలు వెంట రావాలి !!
ఇది కదా ముక్తాయింపు !!!
8.
కవన జ్యోతి ఆధ్వర్యంలో కవితాగానం సీజెన్ 4 నిర్వహించు, శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, చైత్రమాసం,పౌర్ణమి కవితల పోటీ కోసం
అంశం : శుభాకాంక్షలు
శీర్షిక : ఎందరో..అందరికీ
31-3-2023
******************************
యుగయుగాలుగా..చీకటికి చిక్కిన రాత్రులను విడిపించి..
ఎద ఉదయాలకు..వెలుగు వెచ్చదనాల ముద్రల నిచ్చిన
ఆదిత్యుని ఆగమేఘాలపై పంపే ఆకాశానికి
వికసించి..ఒక వేసవి సాయంత్రాన్ని
చల్లగా..పరిమళ భరితంగా చేసిన మల్లె మనసుకు
ఊపిరిలో ఊపిరిగా..దేహపు అణువణువునూ..
పట్టుజారిపోకుండా అదృశ్యం గా..అసువులను కాస్తూ
శ్రమ స్వేదపు ఉక్కపోతలను స్పృశించే గాలి గుండెకు
పట్టెడు మెతుకులను..పచ్చదనాలను కడుపున మోసే..మట్టిని మమకారంతో..తడిమే
చినుకుల చేతులకు
ఈ సముద్రాన్ని తట్టుకుని నిలబడిన తీరానికి
జ్ఞాపకాల నావలను తీరానికి మోసుకు తెచ్చిన కెరటాలకు
తెగనరుకుతున్నా..చిరునవ్వును చెరిపేసుకోని
కొమ్మ చివరి చిగురాకులకు
వరాలు కురవని వర్షాభావం లోనూ..
తడారిన రెప్పల మధ్య కలలను సాగుచేసిన కనులకు
కల్లోలపు హృదిని నిదుర పుచ్చిన..
వీది అరుగు సాంత్వన గీతానికి
ఇక్కడొకటి అక్కడొకటిగా విసిరేయబడిన
బంధాలను కలిపి కుట్టిన కాలానికి
కటిక చీకటిలో దారిపొడవునా
వెలుగుచూపిన చిట్టి దీపాలు
మినుగురుల నవ్వుల వెలుగులకు
ఒంటరితనపు దుఃఖం లో..ఎద కిటికీ లోకి దూరే పిచ్చుకల కిచకిచలకు
ఇలలోకి నన్ను ఒంపి..
పొలమారిన ప్రతిసారీ..
తలపైన తట్టే..ఆత్మీయ స్పర్శలకు
ఏ దిక్కుకైనా ఏకంగా ఎగిరిన
బుడిబుడి అడుగుల బాల్యపు జతలకు
వేలు విడిచినా వెన్నుదన్నుగా సాగిన సోదర వాత్సల్యాలకు
శుభాకాంక్షలు
డా.దారల విజయ కుమారి
హామీ పత్రం
**************
నమస్తె సర్/మేడం
ఈ కవిత నా స్వంత రచన. ఎటువంటి అనువాదం కాదు. ఏ సోషల్ మీడియా లోనూ ప్రచురితం కాదు.
ఇట్లు
తమ విధేయురాలు
డా.దారల విజయ కుమారి
9
*
డా బల్లూరి ఉమాదేవి
జిల్లా
*
కర్నూలు జిల్లా
ఫోన్ నెంబర్
*
9493846984
కవిత
*
శుభాకాంక్షలు
వచ్చింది వచ్చింది కొత్త సంవత్సరం
ఆరంభమయ్యింది శుభాకాంక్షలపర్వం
తీయని జ్ఞాపకాలతో పాటు
చేదుగుర్తులను వెంట పెట్టుకుని
భారంగా సాగింది గత వత్సరం
అన్యాయాలను అక్రమాలను దూరం చేస్తూ
శాంతిని నెలకొల్పడానికివస్తోంది మనకోసం
అమానుష ఘటనలు అత్యాచారాలు
కలలో నైనా పునరావృతం కానీకు
అన్ని వర్గాల వారికలలు పండేలా
వెతలను చికాకులను దూరం చేస్తూ
సకల జనావళికి ఏడాది పొడుగునా
అంబరాన్ని అంటే సంబరాన్ని పెంచుతూ
స్నేహం పరిమళాలను వెదజల్లుతూ
మురిపించగ రావమ్మా నూతన వత్సరంమా
కొత్త పనులకు పురిగొల్పేవీ శుభాకాంక్షలే సుమా
కొంగ్రొత్త ఆశలతో ఆశయాలతో
పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకొంటూ
అందరినీ అభినందించడం మన సంప్రదాయం
అది మరపురాని మధురమైన ఘట్టం
10
కవి పేరు
*
దోసపాటి వేంకటరామచంద్రరావు
జిల్లా
*
విజయనగరం
ఫోన్ నెంబర్
*
7780594995
కవిత
*
కవితాగానం సీజన్4
శోభకృత్ నామసంవత్సర చైత్రమాస పౌర్ణమి కవితలపోటి
అంశం:శుభాకాంక్షలు
ప్రక్రియ:వచన కవిత
శీర్షిక:శుభం భూయాత్!
సర్వజన సంక్షేమం సర్వజనహితం
సర్వకాల సర్వావస్థలలో అభిలషణీయం
సర్వాంగ సమృద్ధి సంక్షేమసాధనం
సర్వజనా సుఖినోభవంతు సందేశం
అందరూ బాగుండాలి
అందులో మనముండాలి
అవే అకాంక్షలు అందరూ కలిగుండాలి
అందరికి అవి చేరాలి
శుభాకాంక్షలు శుభప్రదం
శుభాకాంక్షలు సర్వశ్రేయస్కరం
శుభాకాంక్షలు కారాదు శుష్కప్రియాలు
అందించరాదు శూన్యహస్తాలు
శుభంకోరితే .శుభం కలుగు
శుభం సర్వజనామోదం
శుభం సర్వజనహితం
శుభం సర్వసంపత్కరం
సమయం సందర్భం కానక్కర్లేదు
సకలశోభలతో విల్లివిరియాలి
సర్వస్వామ్య విధానమే శుభాకాంక్షలు
శుభం భూయాత్!శుభం భూయాత్!
ఇది ఈసమూహముకొరకై రాసినదని హామి ఇస్తున్నాను.
దోసపాటి వేంకటరామచంద్రరావు
11
ఇంద్రావత్ రాహుల్
జిల్లా
*
నిజామాబాద్
ఫోన్ నెంబర్
*
9848054079
కవిత
*
శుభాకాంక్షలు
నూతన తెలుగు సంవత్సర
శుభాకాంక్షల మందారాలు
వసంతం వాటేసుకుంటుంది
ప్రకృతి కాంతను తనివితీరా ఆస్వాదించేలా
ఇసుక తిన్నెలు పరిమళపూరిత సువాసనలు పూసుకుంటాయి.
కోయిల పాటకు చిన్నారులు జాబు రాస్తుంటారు
పసిడి పాదాలకు తెలిమంచు తగులుతూ
పదం హిమమారుతమై హాయిగా హత్తుకుంటుంది
పక్షులు కొమ్మలకు పదనిసలై తాకుతూ
ఊయలూగిస్తూ మలయమారుత సేవలా
కవనమిస్తుంటాయ్
ఆకుపచ్చని తొడుగులో పొద్దిక్కిన వీధిదీపాలు
పసిడి కాంతులతో శోభాయమానంగా పలకరిస్తాయి
గంధ విలేపన దారియైన ధరణిమాత
వాసంత సమీరం పరి పరి విధాలా మనకు తోచిన
రీతిన ఆమె పాదరవిందాలను ప్రస్తుతించే ఉత్సాహాన్ని
మనలో నింపి తెలుగు నాట చైతన్యతను నెలకొల్పాలని
కోరుకుంటూ...శుభాకాంక్షలతో
వసంతం వాటేసుకుంటుంది
ప్రకృతి కాంతను తనివితీరా ఆస్వాదించేలా..
12
*
గంటి.మీనాకుమారి
జిల్లా
*
శ్రీకాకుళం
కవిత
అంశం:, శుభాకాంక్షలు
శీర్షిక: " జనులు మెచ్చు మాట "
________________________________________
మంచి పంచు మాట ,మంచి పెంచు
మాట,శుభములు ,పల్కెడిమాట ,మదిన
సంతసము నింపు మాటయు ,సకల జనుల
హితము కోరి ముచ్చట గొల్పి ,హావ ,భావ
ములలొ మార్పు దెచ్చెడి మాట ,ముదముగల్గు
మాట,అన్ని శుభమ్ములఆద్యమైన
మాట,పర్వదినములందు మనము పలుకు
మాట ,సర్వ సమ్మతమ్మైనమాట ,అంద
మైన మాట ,అందరిలో మమతలు పెంచు
మాట,సుమనస్సుతో పల్కు మాట,సుంద
రమ్ము యీ మాట ,జన్మదినమ్మునందు
దీవెనలుయిచ్చుమాట, ధీటుఅయిన
మాట,అధికమై యలరారు మాట,పేద
గొప్పబేధమేమి యెరుగకుండయుండి
జనులనోళ్ళలో నలుగును జాస్తిగాను
భాషవేరైన పలికెడి భావ మొకటె
సర్వదా శుభం కల్గియు సంతసించు
మనియు ఆశీర్వదించియు మనల నడుపు
మాట,యీ శుభాకాంక్షలు మహిమ గల్గి
వెల్గి,ఆప్యాయతలుపెంచి వెల్లివిరియు .
________________________
13
అంశం : శుభాకాంక్షలు
శీర్షిక. : శుభాకాంక్షలు ఎవ్వరికి?!!
పేరు : అపరాజిత్ రెడ్డి
ఊరు : సూర్యాపేట
ఫోన్. :9848532031
ఉన్నత చదువులు చదివి ఏళ్ళతరబడి నిరుద్యోగులై
ఏలికలు ప్రకటించిన ఉద్యోగాల ప్రకటనతో
ఊరడిల్లి ఉద్యోగాలు సాధించేందుకు జరిపే పోటీ పరీక్షలకు
శిక్షణలకు డబ్బులు వెచ్చించి చదువుల శ్రమలతో
రేయింబవళ్లు ఆకలి దప్పికలు మరచి
బహులైచ్చిక ప్రశ్నల తూటాల పరీక్షలకై
సూచించిన విషయ సంగ్రహము నంతా తిరగదోడి
ఇష్టపడి కష్టపడి చదివితేనే గగణతరమైన
ఉద్యోగాన్ని సాధించవచ్చునని నమ్మి
పరీక్షలకు సిద్ధమైన తరుణంలో
కొందరు పరీక్షల బోర్డు నీతిమాలిన అధికారుల
ప్రశ్నాపత్రాల లీకేజీల బేరసారాలు బట్టబయలై పరీక్షలు రద్దుచేసిరి,,,,,,,!!
నిరుద్యోగులు కన్నీరు మున్నీరై విలపిస్తూ పోరుబాట పట్టిరి
నిరుద్యోగుల కళ్ళనుండి నిప్పులు రాలగ ఏలికలను నిలదీస్తే
జరిగిన తప్పిదానికి మరోవంక చెప్పి
రద్దుచేసిన పరీక్షలు తిరిగి నిర్వహించేందుకు తేదీలు ప్రకటిస్తే,,,,,,,,,!
గుండెలవిసి పోయిన నిరుపేద నిరుద్యోగులు
చదివిందే చదివి వ్రాసిందే వ్రాసి
బ్రతుకు పోరులో తల్లిదండ్రుల శ్రమనంతా
నెత్తుటి ముద్దలు తింటూ
ఎగబడి తిరగబడి చదివే చదువులు అభాసుపాలై
ప్రభుత్వాలు పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తే
ఈ పోటీల పర్వంలో వేల మంది వ్రాసిన పరీక్షల్లో
కేవలం వందల మంది ఉద్యోగాలు సాధించిన నిపుణులకు
శుభాకాంక్షలు తెలిపితే,,,,,,,
తమ గుండెలలోని దుఃఖాన్నంతా వెళ్లగ్రక్కుతూ
ఈ శుభాకాంక్షలు తమవరకే కాదని
పరీక్షలు వ్రాసిన నిరుద్యోగులకంతా వర్తిచేలా చెప్పండి చేతనైతే,,,,,,,!
పిడికిళ్ళు బిగించి ఎరుపెక్కిన కళ్ళతో
యువతరమా నవతరమా కళ్ళుతెరువు ఇకనైనా,,,,,,,!!
అపరాజిత్
హామీపత్రం : ఈ కవిత నా కలం సేతయని అనువాదం అనుసరణ కాపీకాని కాదని నా హామీ
అపరాజిత్
14
శుభాకాంక్షలు
మంచి ఏది చేసినా శుభాకాంక్షలు అందిస్తాం
శుభకార్యం ఏది మొదలు పెట్టిన శుభాకాంక్షలు తెలుపుతాం
మనిషి పుట్టిన కానుంచి జీవితాంతం ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుడతాడు
అందులో భాగంగానే
జన్మిస్తే శుభాకాంక్షలు
ఏదైనా గెలుపొస్తే శుభాకాంక్షలు
డిగ్రీ పట్టా పొందితే శుభాకాంక్షలు
రైలు పట్టా కొలువోస్తే శుభాకాంక్షలు
జీవితంలో భాగస్వామి అడిగెడితే శుభాకాంక్షలు
ఒక్కరు ఇద్దరైతే ఇద్దరు ముగ్గురైతే శుభాకాంక్షలు
విజయ బావుటా ఎగిరేస్తే శుభాకాంక్షలు
జీవితంలో గెలుపు సాధిస్తే శుభాకాంక్షలు
పండుగ అయిన పబ్బమైన శుభదినం ఏదైనా
శుభం కలగాలని శుభాకాంక్షలు
ఆనందాన్ని పంచడానికి ఆత్మీయత పెంచడానికి ఈ శుభాకాంక్షలు...
బాలు కత్తుల
15.
అంశం---శుభాకాంక్షలు
రచన--- లలితా చండీ
*శీర్షిక శుభకామన*
ఓచిరు కామన ఇస్తుంది
అలవి కాని సంతోషం.
విజేతగా నిలిచిన క్షణాన
శుభాకాంక్షలు వెల్లువ మరువలేని
మధరానుభూతుల కొలను.
మామిడి తోరణాల ఆహ్వానాలు
మనసుకు రంజిల్లే మధుర గానాలు
జన్మదినాలు, పర్వ దినాలలో
ఎన్నో శుభాకాంక్షలు
శుభోదయాల శుభరాత్రులలో
సృశించే శుభాకాంక్షలూ ఎన్నో
ఆనాటి ఆత్మీయుల పలకరింపులే శుభాకాంక్షలు
గడచిన వసంతాన్నీ గుర్తు చేస్తుంటే
ఒకప్పుడు అమ్మ దీవెనల ప్రేమధారలై,
నాన్న స్వేదంతో నిండిన కావడిలో
తడిసిన అక్షరాలతో నుండిన
శుభాశీస్సులజాబులెన్నో జ్ఞాపికలుగా
అలమారు అరలలోఅంతరంగాల సొరుగుల్లో
పదిలంగా అప్పుడప్పుడు ఇప్పుటికీ పలకరిస్తుంటాయి
ప్రియ భాంధవి మోహన గీతాలు వినిపించిన
దూరవాణి రూపు మార్చుకొని కరవాణిగా మారి,
అందులో కనిపిస్తూ,వినపిస్తూ, కురిపించే శుభాకాంక్షలుఎన్నో,
నేడు సాంకేతి పరిజ్ఞానం అంబరానికి కెగిరి అంతర్జాలంలో ఈమోజిల
శుభాకాంక్షల సందడే సందడి.
16
కవిత గానం సీసన్ ఫోర్
శోభకృత్ నామ సంవత్సరం చైత్రమాసం
పౌర్ణమి నగదు బహుమతుల పోటీ కోసం
-------------------------------------
అంశం: శుభాకాంక్షలు
శీర్షిక: మనిషి తనం
రచన: కే దేవికారాణి రత్నాకర్ తెనాలి.
''''''’'''''''''''''''''''''''''''''''''''''''’'''''''''''''''''''''''''''’
విజయం ఆనందపు కిరీటాన్ని అలంకరించిన శుభవేళ
అభినందనలు వెల్లువలై ఎదుటివారి హృదయాలను తడిపినప్పుడు కురిసే సుగంధ పరిమళాల వానలే
ఈ శుభాకాంక్షలు....
అసాధ్యాన్ని సుసాధ్యం చేసినప్పుడు సహృదయ శుభాకాంక్షల నేత్రపర్వం
శతకోటి సంతసాలకు అనంతకోటి శుభాకాంక్షలు ఉంటాయి
దానికి భిన్నమైన అభినందనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి....
తల్లి గర్భం నుండి వెలువడి తప్పటడుగులు వేసేదాకా అమ్మ ఆశీస్సుల శుభాకాంక్షలు నన్నింత చేసాయి.
అనాథబాలికను ఇంటికి తెచ్చి చెల్లి స్థానాన్ని ఇచ్చి
అమ్మానాన్నల ప్రేమాదరాలకు భాగస్వామిని చేసినప్పుడు ఆ చిన్నారి కళ్ళలో ఆనందాశ్రువులు
నా గుండె ఎగసిపడిన శుభాకాంక్షలఅర్ణవం
పేద స్నేహితునికి పరీక్ష ఫీజు కట్టినప్పుడు
వాడి చిరునవ్వు ఒలికించిన ముత్యాల శుభాకాంక్షలు
ఏ త్రాసుతో కొలవగలం?
ప్రమాదానికి గురైన క్షతగాత్రున్ని ఆసుపత్రికి చేర్చి
మృత్యు ముఖం నుండి తప్పించినప్పుడు దారి పొడవునా మానవత్వం పూచిన వృక్షాల నుండి రాలిపడిన అభినందన సుమాలు మెడ చుట్టూ అల్లుకున్న చల్లని జేజేల వీవనలు శుభాకాంక్షలై నా పాదాలను ముద్దాడాయి.
నాలోని మనిషి తనం వికసించి శత సహస్ర పత్రాలై వెల్లి విరి సి ప్రేమను లోకోత్తరం చేసినప్పుడు నా మనసు శుభాకాంక్షలహిమవన్నగమై ఐస్ క్రీమ్ ఇచ్చింది.
17
కవనజ్యోతి
కవితా గానం సీజన్4
చైత్రమాస పౌర్ణమి కవితలపోటీ
మనదేశం సమస్త మానవకోటికి గురుతుల్యం
మన సనాతనధర్మం అన్నింటికీ మించిన మతం.
పరుల శుభాన్ని కోరుకోవడమే మన సనాతనధర్మం.
శుభాన్ని కాంక్షిస్తూ మంగళ శాసనంచేయడం మన సాంప్రదాయం
శత్రువుకైనా శుభాకాంక్షలు చెప్పడం మన సంస్కారం.
సర్వేజనా సుఖినోభవంతు,లోకసమస్తా సుఖినోభవంతు అనేది మన వేద సంస్కృతి గొప్పతనం.
దీన్ని నరనరాల్లో జీర్ణించుకున్న మనంఅదృఫ్టవంతులం.
నేటి యువత పరాయి సంస్కృతికి ఆకర్షితులవ్వడం మన దురదృష్టం.
హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ దసరా అనడం అవమానకరం.
శుభ అనే విస్తృత అర్థంకలిగిన పదాన్ని ఉపయోగించే శుభాకాంక్షలు చెపుదాం.
శుభాకాంక్షలు అందుకున్న వ్యక్తి పొందుతాడు మానసిక బలం.
కలుగుతుంది నాతో నలుగురున్నారనే ఆత్మస్థైర్యం.
శుభాకాంక్షలతో గట్టిపడుతుంది మానవ సంబంధం.
స్వార్థాన్ని పక్కనబెట్టి పరుల
శుభాన్ని కాంక్షిద్దాం.
శుభం భూయాత్ అనే మంత్రాన్ని నిత్యం జపిద్దాం.
నిష్కల్మషమైన హృదయంతో చెబుదాం శుభాకాంక్షలు.
మన సనాతనధర్మాన్ని, సంస్కృతిని రక్షించుకుందాం.
వసుధైక కుటుంబంగా జీవిద్దాం.
తిప్పావఝల నరసింహమూర్తి
బుచ్చిరెడ్డి పాలెం.నెల్లూరుజిల్లా
18
కవన జ్యోతి ఆధ్వర్యంలో
కవితా గానం సీజన్,-4 నిర్వహించు
శోభకృత్ నామ సంవత్సరం, చైత్ర మాసం
పౌర్ణమి కవితల పోటీ
అంశం శుభాకాంక్షలు
శీర్షిక శుభాశీస్సులు
శుభ తరుణంలో ఆత్మీయుల పలకరింపులు
ఆశీస్సులైన శుభాకాంక్షల పరిమళాలు
మనకు శుభములై వెలిగే సమయాలెన్నో
వివాహా,జన్మదిన,గృహాప్రవేశ సందర్భాలెన్నో
ఆత్మీయుల, బంధువుల, మిత్రుల
శుభాకాంక్షలతో మనసు పురి విప్పిన
నెమలిలా మారి విహరించు
కనులముందు వసంతం విరిసినట్లే
పెద్దల,మంచి మనసు గలవారి దీవెనలు
దేవుని ఆశీస్సులై శుభ పరంపరలు
ఆత్మీయుల శుభాకాంక్షలు ఆనందాలై
మది మల్లెల పరవశంతో మురిసిపోవు
తోటివారి శుభములకు అసూయగాలి
శోకనీక మంచి మనసుతో శుభమును
కాంక్షించి చిరునవ్వుతో శుభాశీస్సులివ్వడం
మానవత్వ మనుషులుగా మన కర్తవ్యం
ఆత్మీయుల శుభాకాంక్షలు కొండంత
ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగించు
ఆహ్వానించినవారందరు హాజరై
అభినందనలు అందించినపుడు
అ ఆనందం వర్ణనాతీతమై భాసించు
సాటివారికి సాయపడక పోయినా
నిండు మనసుతో దీవించడం
మానవధర్మమై మమతల సుఘంధమై
వారికీ, మనకు అనుబంధాలు బలమై
ప్రేమ పట్టాభిషేకంతో మనసులు పులకించు
తోట సులోచన
నెల్లూరు
చరవాణి 9490173053
హామీ పత్రం
ఈ కవిత నా స్వంతమని హామీ
19.
శోభకృత్ నామ సంవత్సర చైత్రమాస
పౌర్ణమి కవితల పోటీ కొరకు.
కవనజ్యోతిసమూహం
కవితాగానం సీజన్ 4
అంశం శుభాకాంక్షలు .
రచన. వాణి సరోజిని లక్కరాజు హైదరాబాద్
శీర్షిక శుభాశీస్సులు
సర్వేజనా సుఖినోభవంతు,లోకాసమస్తా సుఖినోభవంతు ,
అనేవేదోక్త అక్షరసుమ ఆశీర్వచనాలే
ఒండొరులు అందజేసుకునే శుభాకాంక్షలు .
అవేభారతీయులకు రక్షణ కవచాలు,
భారతీయ ,సంస్కృతీ సంప్రదాయాలకు నిదర్శనాలు.
పుట్టుక మొదలు సర్వశుభకార్యాలలో
పూల జల్లులా వర్షించేవే శుభాకాంక్షలు
సర్వజనానందమే సౌభాగ్య దాయకమని,
సమాజశ్రేయమే తనకు శ్రేయమని
తెలియజేసే శుభాకాంక్ష, లే భారతీయసంస్కృతికిపట్టుగొమ్మలు .
వక్రభాష్యం,వయోపరిమితి కి అతీతం గా,
సర్వకాల సర్వావస్ధలలో అనుసరణీయ అమృత వచనాలు.
సుహృదయ స్నేహభావమాధుర్యం
చవిచూపేఅక్షరమధురిమలు,
అందుకున్నవారిని,ఆనందడోలికలలోఓలలాడిస్తాయి.
స్నేహహస్తంచాపి ,శత్రువు లను సైతం,మిత్రులను,చేసేవేశుభాకాంక్షలు. నిష్కల్మషమైత్రి,చాటుతూ,మానసిక నిర్మలతనుచాటే భావబంధన లుగా,మురిపించి మరిపిస్తాయి.
కుల,మత,ప్రాంతీయతలకు అతీతం గా,
ఎదుటివారి లోని ప్రత్యేకతలు గుర్తించి ప్రశంసిస్తూ వారి ఎదుగుదలకి ప్రోత్సహించటమే శుభాకాంక్షల లక్ష్యం అదేమనిషి వ్యక్తి త్వసంస్కారం.
ఉత్తమ గుణగణాలకు మచ్చుతునక .
కవులు, కళాకారులప్రతిభకు
సముచిత గుర్తింపుని చ్చేసధ్భావ ప్రకటన.
సన్మాన సత్కారాలతో,అభినందనలు తెలియజేసే ప్రక్రియ
పదిమంది తెలియజేసే శుభాకాంక్షలు
పావన మంత్రాక్షతలై ప్రగతికి సోపానాలౌతాయి .
కవితాగానానికి
శుభాకాంక్షలు
ఈకవిత నాస్వీయరచన
వాణి సరోజిని లక్కరాజు హైదరాబాద్
20
అంశం: శుభాకాంక్షలు
డా. నాగలక్ష్మి తంగిరాల
శుభశోభకృతున నాలోని ఆశాకిరణాల శుభాకాంక్షల గుచ్ఛం ఈ కవిత
శుభాలు కలగాలని ఆశించటం
శుభా కాంక్ష
"సర్వేజనా సుఖినో భవంతు"
అదే శుభాకాంక్ష
శుభం భూయత్ ఇదే శుభాశ్వీరచనం
అదే మనసుకు ఆనందం
మానస సరోవరం లో ఎన్నో కాంక్షల అలలు
వాటిని దాటి పోవాలి
జీవి చేరాలి జీవన తీరం నిశ్చలంగా
ఆశించటం లో ఆకాంక్షించట లో తప్పు లేదు
కానీ దాన్ని సాధించటానికి చేయాలి కృషి
అప్పుడే శుభాకాంక్షలు సఫలీ కృతం అవుతాయ్
ఎన్నో ఆశలు ఆశయాలు అవితీరాలనే
శుభాకాంక్షలు
సంస్కృతి ని నిలబెట్టాలనే తపన శుభాకంక్ష
సమాజాన్ని ఉద్ధరించి ప్రగతి పథంలో పూలబాట లో నడిపించాలని
శుభాకాంక్ష
సంగీత సాహిత్య కళలు అంత్యంత వెలుగులోకి రావాలని వాటి ఔ న్నత్యం
ప్రతిఒక్కరూ గుర్తించాలని శుభాకాంక్ష
నాదేశం సస్యశ్యామలంగా ఉండాలనే శుభాకాంక్ష
శాంతి అనే మౌన గీతాన్ని మధురం గా ఆలపించాలనే ఆకాంక్షిద్దాం
మంచి తనంతో మెలగాలని ఆశించటం
శుభాకాంక్ష
భావి పౌరులు నిజాయితీ తో
నిస్వార్ధంగా దేశ రక్షణకు వెన్నెముకలా
నిలబడాలనే శుభాకాంక్ష
శుభాకాంక్షలకు జయం విజయం మన
సౌశీల్యత మీదే ఆధారపడివుంది
శుభాకాంక్షలన్నీ కనులముందే ప్రత్యక్ష మవ్వాలంటే సత్య ధర్మాది నియమాలతో
సేవాతత్పరతో త్యాగనిరతి తో సాధిద్దాం
యుగాల భ్రమణం లో రామ రాజ్య
పాలన ఉండాలనే శుభాకాంక్ష నెరవేరాలని
జగత్ కర్త భర్త అయిన పరమాత్ముని
వేడుకుందాం
21
అంశం: శుభాకాంక్షలు
శీర్షిక.... శుభాకాంక్షలు..
స్వీయ రచన ...కేశరాజు వెంకట ప్రభాకర్ రావు
పాతర్లపాడు... ఖమ్మం
కవితలు అందవలసిన చివరి తేదీ 03/04/2023
*************************************************************
తూరుపు దిక్కున ఉదయించే సూర్యుని
తుషార ఉషోదయములో
హుషారుగా మేలుకున్న లోకానికి
హృదయపూర్వక మేలి వేకువ !!
లేలేత కిరణాల నులి వెచ్చని స్పర్శతో
పులకించిన పుడమి తల్లి ఒడిలో పెరిగిన
పచ్చని పంట పొలాలు పసిడి రాసులు కురిపిస్తుంటే
గుమ్ములు నింపుకనే రైతుకు శుభాకాంక్షలు!!
రంగు రంగుల రమణీయ పుష్పాలతో
మత్తెక్కించే క్రొత్తావుల వెదచల్లుతూ
మధురమైన మధువులను జాలు వార్చే
మనోహరమైన ప్రకృతి కాంతకు శుభాకాంక్షలు!!
చావును ధైర్యంగా ఎదిరించి పోరుచేసి
బాధలను భయపెట్టి పక్కకు నెట్టేసి
తీపుల నొప్పులకు నిలువునా తాట తీసి
బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి శుభాకాంక్షలు!!
సమస్యల సుడిగుండాలెన్ని చుట్టుముట్టినా
సంసారంలో పొరపొచ్చాలు ఏర్పడినా
సహనంతో అన్నిటినీ భరించి అధిగమించి
సంసృతిని కాపాడే సతులకు శుభాకాంక్షలు!!
వారాలు చేసుకున్నా వసతిగృహాలే దిక్కైనా
వేదననొదలి రోదన మరచి సాధనలోనే సారం పెంచుకుని
సంకల్పమే ఆయుధంగా విద్యాభ్యాసము ఆశయమై
విజయ కేతనం ఎగరేసిన విజయులకు శుభాకాంక్షలు!!
చెడుపై మంచి పైచేయి సాధించిన పుణ్య తిథులు వినాయక చవితి, దసరా, దీపావళి, ఉగాది ,శ్రీ రామ నవమి పండుగలను ... పుట్టినరోజులు,పెళ్లిరోజులు,
షష్టి పూర్తి జరుపుకొనే వారందరికి శుభాకాంక్షలు
22
*
మద్ది.పుల్లారావు
జిల్లా
*
NTR
ఫోన్ నెంబర్
*
9951287113
కవిత
*
స్ఫూర్తినిచ్చును ఒకరికొకరు తెలుపుకొను శుభాకాంక్షలు
సంతృప్తినిచ్చును హృదయపూర్వక శుభాకాంక్షలు
ఉత్సాహాన్నివ్వగలవు స్నేహితుల శుభాకాంక్షలు
విద్యార్ధులకవసరం గురువు ల శుభాకాంక్షలు
కార్మికులు కోరేరు యాజమాన్యం శుభాకాంక్షలు
ఉద్యోగులుకానందమిచ్చు అధికారుల శుభాకాంక్షలు
సాధనకు ఉత్ప్రేరకం మిత్రుల శుభాకాంక్షలు
గౌరవాన్ని కలిగించు విజయపు వేళ శుభాకాంక్షలు
యోగ్యతను గుర్తించేవి అయినవారి శుభాకాంక్షలు
జీవితాలను మార్చగలవు శ్రేయోభిలాషుల శుభాకాంక్షలు
మనశ్శాంతి ని కలిగించు ఇష్టంలేని వారి శుభాకాంక్షలు
దీవెనలిచ్చును పుణ్యమూర్తుల శుభాకాంక్షలు
ధైర్యాన్ని కలిగించు దయామయుడు శుభాకాంక్షలు
పరిపూర్ణతకు రహదారి పండితుల శుభాకాంక్షలు
నైపుణ్యాలను వృద్ధి చేయు నాగరికుల శుభాకాంక్షలు
బాధలో ఉన్నవారికి ఓదార్పు శుభాకాంక్షలు
కంటికి చీకటిని వెన్నెల చేయు మానవులకు శుభాకాంక్షలు
కంటికి నేలను మెత్తటి పరుపు చేయగలదు శుభాకాంక్షలు
అనుబంధాలు కబందమాలయే శుభాకాంక్షలు
బతుకులో తీయదనాన్ని కలిగించేది శుభాకాంక్షలు
గ్రీష్మం లో తొలకరి చినుకులు వగైరాలు శుభాకాంక్షలు
విరోధిని పట్టి కౌగిట చేర్చగలదు శుభాకాంక్షలు
మధురస్మృతులను మందిని నిలిపేవి శుభాకాంక్షలు
మూర్ఖులను సైతం మార్చగలిగే పదం శుభాకాంక్షలే
శుభాకామనలు పంచును శుభాకాంక్షలు
పెళ్ళి రోజుకు బంధుమిత్రుల శుభాకాంక్షలు
పుట్టిన రోజుకు శ్రేయోభిలాషుల శుభాకాంక్షలు
ఉత్తీర్ణత సాధిస్తే ఉర్వఇజనఉల శుభాకాంక్షలు
ఉద్యోగం సాధిస్తే సకల జనుల శుభాకాంక్షలు
మహత్తుగల మహిమాన్విత పదం శుభాకాంక్షలు
23
*
ఆళ్ల నాగేశ్వరరావు
జిల్లా
*
గుంటూరు
ఫోన్ నెంబర్
*
7416638823
కవిత
*
శీర్షిక : మనోవీచీకలు
మనసులోని శుభ ఆకాంక్షలను
తెలిపే మనోవీచీకలే శుభాకాంక్షలు
ప్రగతిపధ పురోగమనానికి మార్గదర్శకాలు
మరో విజయ సాధనకు ఊతమిచ్చే శక్తియుక్తులు!
నిత్య జీవితంలో ఎదురయ్యే శుభ సందర్భాలను
ప్రతి పండుగ పర్వదినాలను
జాతీయ నేతల జన్మదినములను
మహిమాన్విత ఉద్భవ దినోత్సవాలను
.......
కులమత వర్గ, వర్ణ, రహితంగా జరుపుకుంటూ
హృదయ పూర్వక శుభాకాంక్షలను వారికీ అందించడం
అనాదిగా వస్తున్న మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు
వాటిని ఆచరించడమే భారతీయులుగా మనందరి కర్తవ్యాలు!
భిన్నత్వంలో ఏకత్వ సాధనతో
వేదాల భోధనా సారాంశములతో
ఐకమత్యమే భారతీయుల బలం, బలగం అంటూ
ప్రపంచదేశాలచే శుభాకాంక్షలు అందుకుంటున్న భారతమాతకు జేజేలు పలుకుదాం
సకల జనులకు శుభాలను ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలను అందిద్దాం!
పరహితం కోరే మనస్కులై
హింసను విడనాడుతూ
అహింస ను ఆచరిస్తూ
సమానతను ఆదరిస్తూ
అందరూ బాగుండాలి అందులో నేనుండాలని తలుస్తూ
తమ జీవితాలను చరితార్థం చేసుకుంటున్న
మానవ మహనీయులకు శుభాకాంక్షలు తెల్పుదాం
శుభాకాంక్షలు తెలపడం భారతీయ సంప్రదాయమని చాటుదాం!
24.
కవితాగానం సీజన్ 4
"""''''''''''""""""""""""""""""""""""""
చైత్ర పౌర్ణమి కవితల పోటీ కోసం
కవనజ్యోతి సమూహం
అంశం:- శుభాకాంక్షలు
రచన:- వేదాంతం సురేశ్ బాబు
**************************
తొలిసారిగ ఆస్కారు
పురస్కారమును పొందిన
తెలుగు చిత్రసీమ కిదియె
హృదయపూర్వకముగ తెలుపు
ఘనమగు శుభాకాంక్షలు
విశ్వ వీధులందు మెరిసి
విశ్వ వేదిపైన జనుల
నాటు నాటు నాటనుచును
నాట్యం చేయించినట్టి
తెలుగు వాడి వేడితనము
తెలిపిన తెలుగు పాటకు
పాటకు పట్టంకట్టీ
పరుగులు పెట్టించినట్టి
పాటల మాంత్రికుడు సుభాషు
చంద్రబోసు పల్లె పదాలకు
పాటకు స్వరాలు గూర్చి
స్వర నీరాజనమిచ్చిన
స్వరాభిషేకం చేసిన
మరకతమణి కీరవాణి
సుస్వర గళమందించీ
అమృత గానమును పంచిన
సిప్లగంజ్ రాహులుకు
కాలభైరవ గానానికి
నాట్య భంగిమలు గూర్చి
కనుల కింపు గలిగించీ
గిలిగింతలు పెట్టినట్టి
ప్రేమ రక్షితుని ఆటకు
పాటకు అనుగుణంగాను
పదం పదం కలిపి ఆడి
స్టెప్పు లేసి అదరగొట్టి
ఉర్రూతలు ఊగించిన
రామ్ చరణ్ ఎన్టీఆర్
రసకందర నాట్యానికి
దర్శకత్వ ప్రతిభ జూపి
సమూహాన్ని నడిపించి
భారతదేశపు సినిమా
బహుముఖ ప్రజ్ఞను జూపి
విశ్వమంత విస్తుపోగ
విస్తృతముగ వ్యాపించి
భారతదేశపు కీర్తికి
కలికితురాయి ని గూర్చి
గురువును మించిన శిష్యుడు
అని జనులందరు పొగడ
దర్శకధీరుడుగా నిలిచిన
రాజమౌళి రసజ్ఞతకు
భరతమాత ఘనతను
విశ్వవ్యాపితం చేసిన
ప్రతి ఒకరికి పేరుపేరున
హృదయాంజలు లివిగో
మనః పూర్వకముగ తెలుపు
శుభాకాంక్షలివిగో
""""'''''''"""""""""""""''""""""""""""""""""""""""""""""
🖋️ వేదాంతం సురేశ్ బాబు
చంద్రపూర్
25
పౌర్ణమి కవితల పోటీకి
కవనజ్యోతి ఆధ్వర్యంలో,
కవితాగానం సీజన్ 4, నిర్వహించు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, చైత్ర మాసం పౌర్ణమి కవితల పోటీకోసం
అంశం:-- శుభాకాంక్షలు
రచన:-- సింహాద్రి వాణి
శీర్షిక:-- శుభాకాంక్షలు
ప్రక్రియ:-- వచన కవిత్వం
ఊరు:-- విజయవాడ
చరవాణి:--7569820872
శుభాకాంక్షలు
హృదయాన్ని సున్నితంగా తాకి, అపరిమితానందాన్ని చేకూర్చే ఆప్యాయతాఝరులు
ఎల్లలులేక విశ్వమానవ కల్యాణాన్ని హృదయ పూర్వకంగా వాంఛించే మానవత్వ పరిమళాలు
ఆకులు రాలిన వనాలులా చైతన్యం కోల్పోయిన జీవితాలలో తొలకరి జల్లులై ఆశలు చిగురింపజేసే అమృతపు చినుకులు
నిరాశా, నిస్పృహలను పోగొట్టి మనోధైర్యాన్ని ప్రసాదిస్తూ, విజయాల దారుల వైపు దూసుకుపోయేలా చేసే మహా మంచి ప్రేరకాలు
ఏ సిరులతో కొనలేని అపురూప, అద్వితీయ కానుకలు
మనసును పరిమళింపజేసే ఆరవిరిసిన ఐదు అక్షరాల పారిజాతాల విరులదండ
పుట్టిన రోజు, వివాహ, విజయాలాదిగాగల సంతోష దినోత్సవాలలో కురిపించే ఆశీర్వాదాల అక్షింతలు
ఉక్కిరిబిక్కిరి చేసే ఆనంద తరంగాలలో మునకలు వేయిస్తూ, తథాస్తు దేవతల వాక్శుద్ధితో జాతకాలలో అశుభాలను తొలగించి సుఖశాంతులను నింపే శుభాకాంక్షలు.
అందరికీ నాహృదయ పూర్వక శుభాకాంక్షలు.
హామీ:-- ఈ కవిత నాస్వీయ రచన
సింహాద్రి వాణి
26
మేకల రామస్వామి
శుభమస్తు నేస్తమా !!!!
******************
ఒకరి క్షేమాన్ని తలచి
మరొకరి అభ్యున్నతిని కోరి
పలువురి ప్రగతిని కాంక్షించి
మనసా వాచా కర్మణా
తెలియజేసే సహృదయ స్పందనే
శుభాకాంక్షలు
అవి అందుకున్నపుడు
ముకుళించుకున్న నా హృదయం
ఎంతవికసిస్తుందో
అవి నా దగ్గరకు చేరినపుడు
వెయ్యేనుగుల బలంతో మనస్సు
ఎంత పుంజుకుంటుందో
అవి పలకరించినపుడు
పరవశంతో ఎంత పులకరిస్తుందో మేను
అవ్యాజమైన అనుబంధాన్ని పెంచుతూ
ఆనందరేఖలతో స్పృశిస్తూ
సానుకూల దృక్పదమును సముద్దీపిస్తూ
విశ్వశ్రేయో భావనను విశదీకరిస్తూ
బంధాల వారధియై సంబంధాల సారధియై
మానవజీవనంలో మహత్తును కలిగిస్తున్న
అనుబంధాలకు సజీవసాక్ష్యమై నిలుస్తున్న
శుభాకాంక్షల శుభములనందజేస్తాను
అభినందనల వెల్లవతో ముంచెత్తుతాను
అందుకే అందుకోండి శుభాకాంక్షలు
ఎదలో పొదుముకోండి మా శుభకామనలు
****************
27
కందూరి సుజాతా రాణి
జిల్లా
*
రంగారెడ్డి జిల్లా
ఫోన్ నెంబర్
*
9392162822
కవిత
*
కవితా పోటికోసమై
అంశం.. శుభాకాంక్షలు
శీర్షిక... 🌷మానస కిరీటం 🌷
***********************
అవని హరిత తోరణమైన ప్రకృతిలో
కలిసి ..
అవని పరుగు కొలమానం కాలంకై వేచిచూసే ఒక పూల తీగను నేను.
వేకువనే విరబూసి వెలుగు రథమెక్కి పయనించు ఆదిత్యునికి పుష్ప శుభాకాంక్షల హారతులిచ్చి .
పూబాల సతులతో నృత్తిస్తూ
పృథ్వికి ఉదయ శుభాకాంక్షలు
అందించు లతాంగిని నేను .
గుండె గూటిని తట్టి లేపే మధురానుభూతుల వేళ..
అద్భుత మది ప్రేరణ శుభఫల శ్రమఫల విజయ సముచిత వేళ ..
జాలువారు శుభాకాంక్షల వెల్లువకు సరిజోడు
నా లలిత కోమల లావణ్య కుసుమమం.
ఆత్మీయ అనురాగాల ఆలింగనాలు.
నా తీగలా పెనవేసుకుపోగా..
వివాహాది శుభకార్యాల వేడుకలల్లో
బడిలో గుడిలో పుట్టిన మెట్టినా
అనేకనేక సందర్భాల్లో ...
తొలకరి చినుకులు శుభాకాంక్షలకు ...
మిలితము నా వర్ణల పూపరిమళ లాలింపు .
కాంతులు చిందు మరకతమణులు
కనక ఆభరణాలు ఎన్నిఉన్నా ...
పూజకు పువ్వు ప్రథమం అన్న
దైవవరంతో విశ్వ శుభాకాంక్షలు పొందితిని .
శుభాకాంక్షలను పదం మది తంత్రిని
మీటు చైతన్య వీణాగానం .
నవ తేజముతో ప్రాణులను ఉత్తేజపరచు ప్రకృతికి...
చిదిమినా కొలది చిగురుల చిందులు వేయు వనాలకు...
నరికినా కొలది ఎదుగు ప్రతిభగల కానలకు..
సదా సదా నా శుభాకాంక్షలు ...
ఊరికే రానివి శుభాకాంక్షలు...
లతాంగి వయ్యారం కళా పోషణ నయగారం.
ఒడిదుడుకులలో ఎగబాకిన సాహసం...
ప్రళయాన్ని ఎదుర్కొని ...
ప్రణయాన్ని మేల్కొలిపీ...
జగతికి అందాలు అద్ది..
గాలిశుద్ధికి పూనగా...
నా శ్రమ పలితం శుభాకాంక్షల పథకం.
పుష్పంతో మొదలు శుభాకాంక్షల సుగంధం.
అవని అణువణువు శుభాకాంక్షల
చలువ పందిర్లలకు ..
ఉల్లాసగొలుపు కుసుమాల అలంకరణ సతత సౌభాగ్యదాయకం.
శుభాకాంక్షల తరంగం మది జడతవాన్ని తుడిచే శకునం.
ప్రణవనాదం ప్రమోదభరితం
మానస కిరీటం శుభాకాంక్షల శతక
28
*
గజవెళ్ళి శ్రీనివాసాచారి
జిల్లా
*
కాజీపేట హన్మకొండ
ఫోన్ నెంబర్
*
9059438068
కవిత
*
గజవెళ్ళి శ్రీనివాసాచారి
చైత్రమాసం పౌర్ణమి కవితల పోటీ
అంశం: శుభాకాంక్షలు
శీర్షిక: మహోదయం
...
ఏమిటో.. ఈరోజుల్లో
ఏ శుభకార్యం తలపెట్టినా
శుభాకాంక్షల వెల్లువలేగా
కొత్తగా పెళ్ళైన దంపతులకు
పుష్పగుచ్ఛంతో పాటుగా
శుభాకాంక్షల పత్రాలు
పుట్టినరోజైనా
పదవిలో ప్రమోషన్ వచ్చినా
పదవీవిరమణ చేసినా
పిల్లలు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనా
శుభాకాంక్షలు, అభినందనలు
తెలిపే మిత్రులు, శ్రేయోభిలాషులు
సోషల్ మీడియాలో
పరిచయం అయితే చాలు
శుభాకాంక్షలు తెలిపేది జనం
శుభాకాంక్షలు తెలపడం
ఆనవాయితీగా మారిందిగా
పరుల నుంచి ఏదో ఆశించి
అభినందనలు తెలిపే స్వార్థపరులు
నాటి రోజుల్లో లేని
కొత్త కొత్త పద్ధతులకు
తెరతీస్తున్న ప్రపంచీకరణ
నిష్కల్మష హృదయంతో
ఇతరుల మంచికోరితే
మానవత్వానికి మహోదయం
అది నవోదయం
29
*
రాజశేఖరుని శ్రీ శివలక్ష్మి
జిల్లా
*
ఖమ్మం
ఫోన్ నెంబర్
*
8790700383
కవిత
*
శీర్షిక: పలకరింపునై పులకరిస్తూ..
విజయాన్ని హత్తుకున్నప్పుడో
వేడుకలు విచ్చుకున్నప్పుడో
అందుకున్న ఓ ఆత్మీయ సందేశం
కాలం పెదవులపై చేసిన
చిరునవ్వుల సంతకం
ఆత్మీయ ఆలింగనాల
సమాజ క్షేత్రంలో
పలకరింపుల వెనక పులకరించే
మనసొక వర్ణకుటీరం
ఒంటరికానన్న ఓ భావన
మంచిని కాంక్షించే ఆకాంక్షల
శుభాకాంక్షలతో
ఎప్పటికప్పుడు సజీవమవుతుంది
భావోద్రేకాల బతుకు రంగస్థలంపై
భద్రపరచుకున్న జ్ఞాపకాల దొంతరలో
ప్రశంసలు పొందిన ప్రతి పాత్ర
ధన్యం అవుతుంది
పరిగెత్తి అలసిన
ఓ ఏకాంతపు సాయంత్రాన
పొందిన అభినందన పత్రాలు
పొదువుకున్న గుండెల్లో
మనసులు గెలిచిన ఆనందం
నాలోని భూపాల రాగాల
పొద్దుపొడుపు అవుతుంది
30.
కవితా గానం సీజన్ 4
తేదీ:: 3.4.23... సోమవారం
అంశం:: శుభాకాంక్షలు
శీర్షిక: శుభములు కలగాలి
ఏ కాలంలోనైన మంచికే శుభాకాంక్షలు
ఏ వేళనైన శుభానికే శుభాకాంక్షలు
ఏ సమయములోనైన శాంతికే
శుభాకాంక్షలు
ఏ క్షణములోనైన ప్రశాంతతకే
శుభాకాంక్షలు
మంచి చేసే వారికే శుభాకాంక్షలు
చెడ్డవారు మంచి మారిన వారికే శుభాకాంక్షలు
మంచితనానికి అండగా నిలిచి
వారికే శుభాకాంక్షలు
దౌర్జన్యాన్ని దునిమాడే వారికే
శుభాకాంక్షలు
అన్నార్థుల ఆకలి తీర్చే వారికే
శుభాకాంక్షలు
ఆపదలో నున్న వారిని కాపాడే
వారికే శుభాకాంక్షలు
కష్టాలలో ఉన్న వారిని కాపాడే
వారికే శుభాకాంక్షలు
దౌర్భాగ్యుల నాధరించే వారికే
శుభాకాంక్షలు
వేదనలను వేణుగానముగా
మార్చిన వారికే శుభాకాంక్షలు
ఆవేదనలను ఐస్ గా మార్చే
వారికే శుభాకాంక్షలు
తాడిత పీడిత ప్రజకు అండగా
నున్నవారికే శుభాకాంక్షలు
అన్యాయాన్ని నెదురించే వారికే
శుభాకాంక్షలు
అక్రమాలనీ అరికట్టే వారికే శుభాకాంక్షలు
ప్రజాధరణ నున్న వారికే శుభాకాంక్షలు
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వారికే శుభాకాంక్షలు!!
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ
కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు
8309920625
31
కవితా గానం (సీజన్ 4)
పౌర్ణమి కవితల పోటీ..
అంశం... శుభాకాంక్షలు
శీర్షిక.... హృదయపూర్వకంగా
విజయాల తోటలో విరిసిన
గెలుపు పూలను చూసినప్పుడల్లా
మనసు సంతోషాల నావనెక్కి
చెప్పాలనుకుంటా హృదయపూర్వక శుభాకాంక్షలు...
పగలనక రేయనక
నిండు మనస్సుతో
వీర పరాక్రమాలతో
దేశ సేవకై ప్రాణాలను
పణంగా పెడుతున్న
జవాన్ల ను చూసినప్పుడల్లా
హృద్యంగా నీరుకారుతోన్న హృదితో
చెప్పాలనుకుంటా హృదయపూర్వక శుభాకాంక్షలు...
ముదిమి వయసులో నిరాదరణకు గురై
బంధాల నీడ లేక
వాడి కృంగి కృశించి పోతున్న
భారమైన తీగలకు
చెప్పాలనుకుంటా హృదయపూర్వక శుభాకాంక్షలు....
న్యాయ అన్యాయాల పోరులో
సరైన తరాజు కాటాపై నిలిచిన
న్యాయ ముల్లును చూసినప్పుడల్లా
ఉప్పొంగిన సంద్రంతో
చెప్పాలనుకుంటా హృదయపూర్వక శుభాకాంక్షలు...
శుభాభినందనలు....!!
హామీ... నమస్తే ఈ కవిత నా స్వీయ రచన అని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను🙏
మొహమ్మద్. అఫ్సర వలీషా
ద్వారపూడి (తూ గో జి)
32
*
గొర్రెపాటి శ్రీను
జిల్లా
*
మేడ్చల్ -మల్కాజ్ గిరి
ఫోన్ నెంబర్
*
9652832290
కవిత
*
శుభాకాంక్షలు
చిన్నారి పాపాయిల పసిడి నవ్వుల్ని చూస్తున్నప్పుడు..
నీలాల నింగిలో ఇంద్రధనస్సు అందంగా ఆవిష్కృతమవుతున్నప్పుడు..
పచ్చగా విరిసిన ప్రకృతి లో కొత్తగా చిగురించిన ఆకులతో
చెట్టుకొమ్మలు సన్నగా కదలాడుతున్నప్పుడు..
కురుస్తున్న వాన చినుకులు..
చిగురుల లేత చెక్కిళ్ళను ముద్దడుతున్నాప్పుడు..
ఓటమి అంచుల్లో చేరాక విజయం అనుకోకుండా ఎదురైనప్పుడు..
నింగిని తాకే ఆనందం మనస్సులో కదలాడుతుంటే
హృదయం ఆనందడోలికల్లో తేలియాడుతుంది !
మనస్సు ఉల్లాసంగా ఉన్నప్పుడు..
లోకమంతా అందంగా ఆనందమయంగా అగుపిస్తున్నప్పుడు ..
మనస్సుకు నచ్చిన ప్రియనేస్తం ఎదురై ..సాధించిన విజయాలను మెచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తుంటే ..
ఇక బతుకు పయనమంతా సంబరాలమయమే !
ఒక చిన్ని అభినందన అందించే ప్రోత్సాహం
ఇక ఎన్నో జయకేతనాల హర్షాలకు దిక్సూచిగా నిలుస్తుంది
33
*కవితాగానం.. పౌర్ణమి కవితల పోటీలు*
తేదీ: *03-04-2023-సోమవారం*
అంశము: *శుభాకాంక్షలు*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *శుభమస్తు!*
ప్రక్రియ: *పద్యము*
*********************
*(1)*
*ఎల్లరి శుభములు గోరుచు*
*చల్లని నీ మనసునందు సాత్విక రీతిన్*
*కల్లలు కపటములెరుగక*
*తల్లీనత తోడగోర దక్కును శుభముల్!*
*(2)*
*ఇతరుల క్షేమము గోరుచు*
*సతతము వారిని కలసిన సంతసమొసగున్!*
*హితవరులీవిధి జేయుచు*
*నుతులొందెదరందరింట నూరు దినములున్!*
*(3)*
*శుభములనాశించుచు నీ*
*విభవములను కొంత పంచు వేదనపరులన్*
*ప్రభవించును పుణ్యమపుడు*
*లభియించును నీకు కీర్తి రక్షణ యిలలో!*
*(4)*
*ఒరులకు క్షేమము దలచుము*
*సిరులే నీ వెంట వచ్చు చిరకాలమునన్!*
*గిరిగీసుకునుండ తగదు*
*పరులందరి శుభము నీకు భాగ్యము సుమ్మీ!*
*(5)*
*ఆకాంక్షలు నిజమగునట*
*లోకానికి మేలుజరుగు రోషము తగ్గున్!*
*ప్రాకామ్యము లన్ని యొనరు*
*నీకామన లోన శుద్ధి యింపుగ యున్నన్!*
*********************
హామీపత్రము: *స్వీయరచన*
34.
చైత్ర పౌర్ణమి కవితల పోటీకి.
అంశం: శుభాకాంక్షలు.
రచన: ముడుంబ తిరువేంకటాచార్యులు, మానుకోట.
శీర్షిక: శోభకృత్ శుభాకాంక్షలు.
ప్రపంచ తెలుగు సోదరులందరికీ శోభన/
శోభకృత్ నామ సంవత్సరాది శుభాకాంక్షలు.
ఎన్నోభాషల పదాలను తనవిగా చేసుకుని విలసిల్లుతున్న తెలుగుకు తెలుగు రాష్ట్రాలలోనే లేకుండా చేయాలని పరోక్షంగా, ప్రత్యక్షంగా శాసనాలు చేస్తున్న తెలుగు రాష్ట్రాల అధినేతలకు, తెలుగును ఎలాగైనా బ్రతికించుకోవాలని తపన పడుతున్న భాషాభిమానులకు,
అన్యభాషా పదప్రయోగాలు చేస్తూనే తెలుగును తామే బ్రతికిస్తున్నామనే భ్రమలో వున్న మహాకవిపండితవర్యులకు శుభాకాంక్షలు,
అక్షరదోషాలను, ఉచ్ఛారణ దోషాలను, అర్థదోషాలను, వ్యాకరణదోషాలనూ పట్టించుకోకుండా ఎడాపెడా తెలుగును వాడేస్తున్న పాత్రికేయమిత్రులకు, సాంకేతిక ప్రసార మాధ్యమాల నిర్వాహకులకు శుభాకాంక్షలు,
అంతా బాగుందని ప్రకటించుకొనే నేతలకూ, ప్రస్తుత ఘటనలకు, పరిణామాలకు ఆందోళన ప్రకటిస్తూ, ఇంకేదో పెనుమార్పు రావాలని ఆశించే వారికి, ఏదో (పరివర్తన/వైపరీత్యం) జరుగబోతుందని భ్రమించి జీవులకు, ఇంతకుమించి ఏమీ జరగబోదని నిట్టూర్చే శ్రమజీవులకు శుభాకాంక్షలు.
తెలిసీ ఓటును అమ్ముకొనే వారికి, దాన్నే నమ్ముకొని భ్రమించే వారికీ, జనాన్ని "మత్తు"లో నింపి, మేమే గెలిచామని జబ్బలు చరుచుకునే నేతలకు, ఎంతోకొంత తామూ నింపినా, గెలువలేకపోయామనే అక్కసువెళ్లగక్కే తేలుకుట్టిన "నేత"లకు శుభాకాంక్షలు,
ఇలాగే ఉంటే చాలు, ఇంకేమీ అక్కరలేదనుకొనే బ్రతుకుజీవులకు, మార్పు రావాలని, ఇంకేదో మంచి జరగాలని కోరుకొనే ఆశాజీవులకు శుభాకాంక్షలు.
పేరులో "శోభ"లను మోసుకొచ్చిన క్రొత్త సంవత్సరం, నిజంగానే శోభలను వెల్లివిరియ జేస్తుందని నమ్మే "తెలుగురాష్ట్రాల" సోదరులందరికీ "తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు".
**** ****** ****** ***
ఈ కవిత నేనే ఇప్పుడే రాసింది. అముద్రితము, ఇతర రచనలకు అనువాదముకానీ, అనుసరణకానీ, అనుకరణకానీ కాదు...
ధృవీకరిస్తున్నాను.
మీ ముడుంబ తిరువెంకటాచార్యులు, మానుకోట.
35
9493273114
కవితా గానం పౌర్ణమి కవితల పోటీకి గాను... అంశం శుభాకాంక్షలు
పేరు కొంజేటి రాధిక
ఊరు రాయదుర్గం
శీర్షిక... బ్రహ్మానందం
ఆకాంక్షలను కాంక్షిస్తూ అకుంఠిత దీక్షతో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తే గమ్యాన్ని చేరి గెలిస్తే అభినందనలతో ముంచేత్తితే ఆ ఆనందం వర్ణనాతీతం...
అసాధారణ ప్రతిభతో విజయకేతనం ఎగురవేసి, కీర్తి కిరీటాన్ని ధరిస్తే అభినందనల వర్షం వెళ్లి విరుస్తుంది మనపై... ఆకాంక్షల తీరాన్ని చేరితే శుభాకాంక్షల అస్త్రాలు మన పెదాలపై చిరునవ్వుల పూలు పూయిస్తాయి...
ఎదుటివారి విజయానికి మనమందించే ఓ చిన్ని అభినందనల అస్త్రం కొండంత బలాన్ని ఆత్మస్థైర్యాన్ని నమ్మకాన్ని పెంపొందించే ఔషధీయాలవుతాయి... జన్మదిన, వివాహ, ఉద్యోగ వ్యాపార విషయాలకైనా అభినందనల అస్త్రం పాశుపతాస్త్రమై సంతోషాల హరివిల్లును ప్రతి ఇంటా విరబోయించే తారకమంత్రాలవుతాయి... శత్రు సామ్రాజ్యంపై విజయ డంకా మోగిస్తే, ఆ దేశ ప్రజల అందించే శుభాకాంక్షలు పూల వర్షంతో పాటు మంగళ హారతుల నీరాజనాలతో పట్టే శుభాకాంక్షలు, ఆనందానికి చిరునామాయై ఆజన్మాంతం తీయని మధుర స్మృతుల మిగిల్చే అనుభూతులై, రేపు ఉత్సాహాన్ని ఇచ్చే మందు గుళికలు అవుతాయి...
36
కవిత గానం
పౌర్ణమి పోటీల కోసం
అంశం :శుభాకాంక్షలు
శీర్షిక :శుభకామనలు .
*********************
పుట్టినరోజుకు శుభాకాంక్షలు
ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు
ఉద్యోగం వచ్చినప్పుడు శుభాకాంక్షలు
పెళ్లి జరిగినప్పుడు శుభాకాంక్షలు
పిల్లలు పుట్టినప్పుడు శుభాకాంక్షలు
బారసాలకు శుభాకాంక్షలు
అడుగులకు అరిసెల శుభాకాంక్షలు
అక్షరాభ్యాసానికి శుభాకాంక్షలు
పాఠశాల ప్రవేశానికి శుభాకాంక్షలు
అడుగడుగునా శుభకార్యాలకు శుభాకాంక్షలు
శుభ ...ఆకాంక్షలు
మంచి జరగాలని కోరికలు
కొన్ని ముఖస్తుతితో శుభాకాంక్షలు
కొన్ని నవ్వు పులుముకున్న శుభాకాంక్షలు
కొన్ని వెనుక ముఖం తిప్పి, మూతి తిప్పే శుభాకాంక్షలు
శ్రీకృష్ణుడు చెప్పాడు తులసి దళంతో శుభాకాంక్షలు
ధన ,వస్తు ,వాహన పూగుత్తుల శుభాకాంక్షలు .
ఇంట్లో లేకున్నా పరువు పోతుందని
ఏదో ఒకటి చేతిలో పెట్టే శుభాకాంక్షలు
కాడెద్దులా కార్యాలన్నీ చేసే భార్యకు
మాత్రం చెప్పరు శుభాకాంక్షలు
శుభాకాంక్షలు శరత్కాల వెన్నెలలా
చల్లగా మనసును మీటి
వర్షాకాలపు పచ్చదనంలా
వసంత రుతువులోని ప్రకృతి అందంలా
మనసుకు హత్తుకునే శుభకామనలు
కలకాలం చిరంజీవిగా నిలుస్తాయి .
**************************************
హామీ :ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను .
మన్నె లలిత
హైదరాబాద్
చరవాణి సంఖ్య :741686 32 89 .
ధన్యవాదములు .
37.
కవితా గానం 4
శుభాకాంక్షలు
శీర్షిక*హృదయకుసుమం
రంగం ఏదైనా రంగస్థలం మీద
సన్మానాలన్నీ చప్పట్లతో స్వీకారమే
శుభాకాంక్షలకు ప్రస్థానం
మది నిండా చల్లని మమతలు
ఎద మీటిన వెన్నెల్లా అక్షరాలు
ఓ సరాగాల వేళ
ఓ సంతోషాల హేల
హృదయ స్పందనలుగా పూసే వెన్నెల సంతకం
మధురోహాల శుభాకాంక్షల చిరునవ్వుల పొట్లం
ఒక విజయం
ఒక శ్రమాయుధమైన విత్తన పొత్తిలి
ఒక పరిశోధనలో కొత్త ఆవిష్కరణల
నిచ్చెనలు
పిల్లల చదువుల్లో శిఖరాగ్ర ఉత్తీర్ణత
ఆటపాటల్లో ఉత్తమ విజేతలు
మానవత్వాన్ని శాంతిని అభిషేకించే కలం
మతమేదైనా మనిషిని ప్రేమించే అక్షర కావ్యం
శుభాభినందనలకు ఆత్మీయ సాక్షాత్కారం
చరిత్రనిండా జీవన పోరాటంలో
అడ్డదారులు తొక్కని మహానీయులు
సామాజిక వికాసానికి బాటలేసినోళ్ళ
పుట్టిన రోజులన్నీ శుభాకాంక్షల సందేశాలు
వారి బాటలన్నీజగతికివెలుగుపూలు
చీకట్లను పారద్రోలే గొప్ప గొప్ప పాఠాలు
ఏడెల్లి రాములు ✍️
ది*04*04*23(17*54)
ఎల్కలపెల్లి🌹
జిల్లా* పెద్దపల్లి
కవితా గానం 4
శుభాకాంక్షలు
శీర్షిక*హృదయకుసుమం
రంగం ఏదైనా రంగస్థలం మీద
సన్మానాలన్నీ చప్పట్లతో స్వీకారమే
శుభాకాంక్షలకు ప్రస్థానం
మది నిండా చల్లని మమతలు
ఎద మీటిన వెన్నెల్లా అక్షరాలు
ఓ సరాగాల వేళ
ఓ సంతోషాల హేల
హృదయ స్పందనలుగా పూసే వెన్నెల సంతకం
మధురోహాల శుభాకాంక్షల చిరునవ్వుల పొట్లం
ఒక విజయం
ఒక శ్రమాయుధమైన విత్తన పొత్తిలి
కొత్త పరిశోధనలలో ఆవిష్కరణల నిచ్చెనలు
పిల్లల చదువుల్లో శిఖరాగ్ర ఉత్తీర్ణత
ఆటపాటల్లో ఉత్తమ విజేతలు
మానవత్వాన్ని శాంతిని అభిషేకించే కలం
మతమేదైనా మనిషిని ప్రేమించే అక్షర కావ్యం
శుభాభినందనలకు ఆత్మీయ సాక్షాత్కారం
చరిత్రనిండా జీవన పోరాటంలో
అడ్డదారులు తొక్కని మహానీయులు
సామాజిక వికాసానికి బాటలేసినోళ్ళ
పుట్టిన రోజులన్నీ శుభాకాంక్షల సందేశాలు
వారి బాటలన్నీజగతికివెలుగుపూలు
చీకట్లను పారద్రోలే గొప్ప గొప్ప పాఠాలు
ఏడెల్లి రాములు ✍️
ది*04*04*23(17*54)
ఎల్కలపెల్లి🌹
జిల్లా* పెద్దపల్లి
Comments
Post a Comment