మార్గశిర మాసం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
********
అంశంనూతన సంవత్సరం
నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
******************
పాల్గొన్న కవివరుల జాబితా
1.కోరాడ నరసింహారావు గారు
2. మండ నాగేశ్వరరావు గారు
3. ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
4. నెల్లూరు వెంకట లక్ష్మి గారు
5. దోసపాటి వేంకట రామచంద్రరావు గారు
6. డా.భమిడిమర్రి కమలాదేవి గారు
7. కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
8.డా.బల్లూరి ఉమాదేవి గారు
9.కాసుల ధీరజ్ శర్మ గారు
10.కవిత వెంకటేశ్వర్లు గారు
11.కొమురవెల్లి అంజయ్య గారు
12. సింహాద్రి వాణి గారు
13.రాజశేఖరుని శ్రీ శివలక్ష్మి గారు
14. జక్కిడి వెంకట్ రెడ్డి గారు
15. లలితా చండి గారు
16. బొప్పెన వెంకటేష్ గారు
17. కొంజేటి రాధిక గారు
18. ఏడెల్లి రాములు గారు
19. దారల విజయ కుమారి గారు
20. మన్నె లలిత గారు
21.వనపర్తి గంగాధర్ గారు
22. మధు అమరగాని గారు
23. మద్ది పుల్లారావు గారు
24. వేమూరి సత్యవతి గారు
25.అఫ్సరవలీషా గారు
26. పిన్నక నాగేశ్వరరావు గారు
***********************
1
* నూతన సంవత్సరము *
శీర్శిక:- క్రొత్తఆశలు చిగురించు!
కోరాడ నరసింహా రావు..!
******************
తీరని ఆశలకు ఊపిరు లూదుతూ....,
క్రొత్త సంవత్సరం వస్తోంది...!
గత0 నెరవేర్చని కోర్కెలు... తీరుస్తు0దన్న నూ త నో త్సా హాన్ని ఏమూలనోఅంకురింప జేస్తూ..!
అందరిదీ నాలాంటి అనుభవం ఎందు కవు తుంది?!
వారంతా అదృష్ట వంతులు..!
పుణ్యం చేసుకు పుట్టు0టారు!!
ఎప్పుడూ ,కల్పవృక్షాన్నికోరుకోవట0.... ఆముద0 మొక్క మాత్రమే లభించట0।।...!
ఇది నా దురదృష్టం..!!
ఊహించని... లెక్క లేనన్ని
విజయాలు కొందరి వైతే...,
నమ్మక0 గా అనుకున్నవీ
పరాజయానుభవాలుగా...
క్రుంగ దీసేది నాలాంటి ఏ కొందరికే నేమో..!
ఐ నా.... ఆశ..! ఈ సంవత్సరమైనా ఆశ నెరవేరి కోరికలు టిరవచ్చు నేమో...!
ఈ ఆశ యే.... ఇన్నేళ్లగానన్ను
నడి పిస్తున్నది..!!
ఇలాగే ... నా కోరిక నెరవేర కుండానే ఈ తనువు రాలి పో తుందేమో...!
ఏ మో..... కానున్నది కాక మానదు..!
ఇలా0టి సందర్భాలలోనే....
నాకో సినిమా పాట గుర్తు కొస్తుంటు0ది....
" అనుకున్నామనిజరగవుఆన్ని
అను కోలేదనిఆగవు కొన్ని...!
జరిగే ద0తా మంచి కని...
అను కోవడమే మనిషి పని "
ఇది అక్షర సత్యమే అనిపిస్తుం టు0ది...!
ఏ మనిషికి యే అనుభవాలు ఎప్పుడు, ఎందుకు కలిగిస్తాడో
ఆ పరమాత్మకే ఎరుక...!
ఇలా0టి నిరాశా సమాయాలలోనే .... "కర్మలుచే యుట యందే నీకధి కారము కలదు, గానీ వాటి ఫలి తము ల యందు కాదు,..., అట్లని కర్మ లను చేయుట మాన రాదు...! "
ఈ గీతా వాక్యములే....నన్ని ట్లు నడిపించుచున్నవి...!!
ఏటి కేడూ నూతనోత్సా హముతో...ఆశలు చిగు రింప జేస్తు !!
********
2
: కొత్తకోయిల కూసింది...!!!
==🏵️===🏵️===🏵️==
ఏ ఏటికాయేడే నూతనం!!
ప్రతి ఏడూ జనంగోడు
విన్నూతనం....!!
మోడువారిన ఆశలు చిగురించేదెన్నడో?
చిగురించే ఆశలు ఫలించేదెన్నడో....??
మోసగించడం ప్రభువులకలవాటే!
మోసపోవడం జనానికి పరిపాటే!!
ఎన్నాళ్ళీ గ్రహపాటు?
ఎవరిది ఈ పొరపాటు?
ఏ ఏటికాయేడే నూతనం!
ఉచితాలనాశించడం జనం పొరపాటు
వద్దన్నా వాటిని పోషించడం పాలకులగ్రహపాటు!
ఎవరెన్నన్నా వదలదీ సోమరితనం!!
నూతన సంవత్సరాన ప్రతినబూని సాగండి...!!
చిత్తసుద్ది లేని పాలకులకు
చరమగీతం పాడండి!!
సంక్రమించిన హక్కులను
సక్రమంగా వాడండి.!!
ఆవేశం ఆగ్రహం క్షణికమే
అన్ననిజం గ్రహించారు పాలకులు
రొట్టెముక్క ఎరవేసి అరవకుండ చేస్తారు...!!
అధికారం చిక్కినాక అదోలాగ చూస్తారు..!!
అధ్భుతంగా కలలుకంటూ,
సాకారానికి పరిశ్రమిస్తూ, పరిశోధిస్తే....
కోటిఆశలదీపకాంతులు ప్రతిహృదయంలో వెలగాలంటే
సంయమనం పాటిస్తూ సలహాలను స్వీకరిస్తూ
ప్రతి మనిషీ ఉద్యమించి
ఉషస్సుకై పరితపిస్తే ,
ప్రతిఫలాన్ని ఆశిస్తే ,
ప్రతిఉదయం
నూతనమే....
పలుకుదాం...
ఆశల ఆశయాలకాహ్వానం!!
కావాలి...
ప్రతిఉదయం నవోదయం!!
ప్రతిఏడూ విన్నూతనం!!!
----మండ.నాగేశ్వర్రావు.✒️
సరిపల్లి, పెందుర్తి.
3
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
అంశం:-
నూతన సంవత్సరం
శీర్షిక:-
సంతోషమయం
..................................
మనుషుల మధ్య జాత్యాహంకారాలు పోవాలని
పేద గొప్ప తారతమ్యాలు సమసి
అసూయ, ద్వేషాలన్నవి లేకుండా
నేడు వసుదైకాన జరుగుతున్న నరమేథాల
భయానక యుద్ధ వాతావరణం పోయి
ప్రజల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరిసి
మానవత్వమే మాధవత్వముగా కలసి మెలసి ఉండాలని
శాంతి, అహింసలే ప్రగతికి సోపానాలన్న
దేశం నాకేమిక్భిందని గాక
దేశానికి నేనేమి చేశానన్న
స్వామి వివేకానంద, జాతిపిత మహాత్మా గాంధీ సూక్తులు పాటించే
ప్రజలతో సురాజ్యం, రామరాజ్యం తప్పక వస్తుందని
భక్తి శ్రద్ధలతో భగవంతునికి కైమోడ్చి ప్రార్ధిస్తున్నా కొత్త సంవత్సరం సంతోషమయం
సౌభాగ్యప్రదమయి
"లోకా సమస్తా సుఖినో భవంతు " అన్న సనాతన ధర్మ సూక్తి కి ప్రతీకగా తప్పక నిలుస్తుందని ఆశీస్తున్నాను......!!
................................
ఇది నా స్వీయకవిత. కవన జ్యోతి పౌర్ణమి పోటీలకై వ్రాసినది.
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
.............................
4
నెల్లూరు వెంకట లక్ష్మీ
ఎమ్మిగనూరు
చరవాణి:9491632232
అంశం:కొత్త సంవత్సరం
శీర్షిక:కొత్త అడుగు వేద్దామా
*****************
కుంచించుకు పోతున్న
మనసులతో
కుదించిపోతున్న మానవత్వంతో
కంపించిపోతున్న సమసమాజం
నీలినీడల కౌగిట్లో నలిగి పోతున్నది
విచ్చలవిడితనం విశృంఖల వైపరీత్యంతో
పెరిగి పోతున్న పౌలస్త్య బ్రహ్మ సంతానంతో
భరతమాత భరించలేని వేదన పడుతోంది
ఆధునికత వెంట పరుగులు పెడుతున్న
నవతరం వేసే తప్పటడుగులకు
అనుభవ తరపు అడుగులతో సరిదిద్ది
గిర్రున తిరిగిన కాలచక్రంలో గత
వత్సరం నేర్పిన పాఠాలు గుణపాఠాలు
పదేపదే స్ఫురణ మంత్రంలా జపిస్తూ
రాబోయే విపత్తులకు స్ఫూర్తిగా మలచి
గుభాళించిన పరిమళ జ్ఞాపకాలను
గుండె గూటిలో గుప్తం చేసి
జీవన పయనంలో ని ప్రతీ మజిలీ ని
మనసారా ఆస్వాదిస్తూ
తడబడిన తప్పటడుగులను
కొత్త అడుగులతో సరిచేసి
జాగరూకతనే జీవితముఖ చిత్రంగా గీసి
పుటలన్నీ కొత్త సంవత్సరానికి అట్టి పెట్టి
సిరాక్షరాలతో లిఖించడమో
శిఖరాగ్రాన నిలబడడమో..
తేల్చుకుందాం..కొత్త పంథాలో పయనిద్దాం
హామీ పత్రం: ఆర్యా! ఈ కవిత నా స్వంతం. ఇది దేనికి అనుకరణ అనువాదం కాదని హామీ ఇస్తున్నాను.
5
*
దోసపాటి వేంకటరామచంద్రరావు
జిల్లా
*
విజయనగరం
ఫోన్ నెంబర్
*
7780594995
కవిత
*
కవనజ్యోతి కవితాగానం సీజన్4శోభకృత్ మార్గశిరమాస పౌర్ణమి నగదు బహుమతులపోటి.
కవితాంశం:నూతన సంవత్సరం.
దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం
శీర్షిక::కొత్త ఆశలపర్వం.
మళ్ళీ వచ్చింది కోత్త ఆశలపర్వం
పాతరోతలకు వీక్కోలు పలుకుతూ
కొంగ్రొత్త తీర్మానాలను కలగలుపుతూ
సరికొత్త ఆశలకు ఊపిరులూదుతూ
నూతన సంవత్సరము నిత్య నూతనం కావాలి
నవనవోన్మేష కొత్తకాంతులను వెదజల్లుతూ
నిరుడు నింపిన నిరాశానిస్ప్రుహలను తొలగించుతూ
మంచిచెడుల విచక్షణ మాకెప్పుడూ కలగాలి
ఆరంభం ఆనందకరమైతే అంబరమైనా అందుకోవొచ్చులే
అందరి సంతోషమే మన సంబరమని ఆశించాలిలే
కట్టబాటులేకాదు దిద్దుబాటులు కూడా ఆవశ్యమే
కష్టనష్టాలను కలగలపుకొని కలిసి నడవాలిలే
నిన్నను గుర్తుంచుకొని
నేటిని నడిపించుకొని
రేపటిని మెరుగుపరచడానికి
నూతన పదక్షేపాలను కదిలించాలిలే
నూతనవత్సరమంటే
హోరుజోరుల హుషారులు కాదు
మత్తులో జోగుతూ తూగుతు వాలడాలుకాదు
చిందులు విందులు పొందులు హంగామాలు కాదు
ఆనందమంటె ఇదేనా
ఆశలతీర్మానాలంటే ఇలాగేనా
సర్వజనహితము సర్వజనశుభము జరగాలి
స్వాగతము పలుకుదాం నూతనసంవత్సరానికి.
ఇది ఈ పోటికొరకై రాసినదని హామి ఇస్తున్నాను.
6
డా.భమిడిమర్రి కమలాదేవి
అంశం : నూతన సంవత్సరం
శీర్షిక : గతం గతః
తిరిగిరాదు గతించిన కాలం - ఆగదు కాలగమనం
ఎవరి అనుమతితోను పనిలేదు కాలానికి
ఎవరిని అడిగిరాదు, ఎవరికీ చెప్పిరాదు
అవిశ్రాంతంగా నడుస్తూనే ఉంటుంది కాలం
తిరుగుతూనే ఉంటుంది కాలచక్రం
వెనుకకు నడిచింది ఒక సంవత్సరం
కొత్తసంవత్సరానికి దారి యిస్తూ
చెప్దాం వీడ్కోలు పాత వత్సరానికి
పలుకుదాం స్వాగతవాక్యాలు కొత్తవత్సరానికి!!
చేదు అనుభవాలను తొలగించి-
కొత్త ఆశలు చిగురింపజేయ రావమ్మా
ఓనూతన వత్సరమా! మానవతా పరిమళాలను పరిఢవిల్లజేయి
నిర్మూలించు అరాచకాలను , మదాంధకారాలను!!
నూతనోత్తేజాన్ని కలగించు!!
పారదోలు నిరాశాచీకట్లను, యువశక్తిని ఉద్దీపితం చేయి
సద్భావనలతో, సదాశయాలతో, సదాచారణ లతో నడిపించు మానవలోకాన్ని ముందుకు
చక్కటిప్రణాళికలతో,సమర్థవంతంగా
దేశ సమస్యలను పరిష్కరించుకుంటూ-
దేశ ప్రగతికై సాగే బాటవేయవమ్మా
ఓ నూతనవత్సరమా! స్వాగతం!,సుస్వాగతం!,నీకు శుభస్వాగతం.
7
*
కేశరాజు వేంకట ప్రభాకర్ రావు
జిల్లా
*
ఖమ్మం
ఫోన్ నెంబర్
*
6281697982
కవిత
*
కవనజ్యోతి సమూహం పక్షాన కవితాగానం సీౙన్ 4, నిర్వహించే పౌర్ణమి కవితా నగదు బహుమతుల పోటీ
మార్గశిర మాసం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
కవితాంశం
నూతన సంవత్సరం
శీర్షిక:: ఆశల గడపలు
26/12/2023
గడచిన ఏడాది, చేదు, తీపి అనుభవాలను
జ్ఞాపకాలలో నిక్షిప్తం చేసి
నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ
సమస్త మానవాళికి వేనవేల శుభాకాంక్షలు తెలుపుతూ
అర్థరాత్రి చీకట్లో కలిసి పోయింది, నిన్నటి సంవత్సరం !!
చీకటిని చీల్చి, నవోదయానికి నాందీ పలికిన,
నూతనంగా పొడిచిన పొద్దు, హద్దుల్లేని ఆనందాన్ని అందరి జీవితాలలో నింపాలని ...ఆశల గడపలలో
సరికొత్త జీవనానికి ఉపాధి విద్యలు బోధిస్తుంది
అరాచకాలకు అన్యాయానికి లంచాలకు
దోపిడీ దౌర్జన్యాలకు మంగళం పాడి, దేశం కోసం,
దేశంలో,ప్రతి ఇంటికి సురక్షిత కవచమై నిలువటానికి
ప్రతి ఒక్కరిని వెన్ను తట్టి జాగృతం చేస్తుంది!!
నూతన సంవత్సరంలో ,వేట గాళ్ళ వలలో చిక్కక
పచ్చ పచ్చని బయళ్ళలో పశు పక్ష్యాదులు
నిర్భయంగా విహరించటానికి కంచె వేస్తుంది!!
ముక్కు పచ్చలారని పసికందులు ,సైకోల బారిన పడి
చొక్కుటాకులవకుండ,ముష్కరులకు చిక్కంవేస్తుందని !!
మగువల మాన ప్రాణాలను వారికి వారే కాపాడుకునే తెగువను, తెలివిని పెంచి పోషిస్తుందీ వత్సరం!!
చిన్న పిల్లలకు పౌష్టికాహారం
బాల బాలికలకు చదువు సంస్కారం
యువతకు ఉపాధి ...భవితకు భరోసా
వృద్ధులకు భద్రత, ఆరక్షణ...
వికలాంగులకు చేయూత నిచ్చి
ప్రళయాలను ఏమార్చి విలయాలను కడతేర్చి
ప్రమోదం కలిగించే,వినోదం పంచుతుందీ నూతన సంవత్సరం!!
ఇది నా స్వీయ రచన
8
*
డా బల్లూరి ఉమాదేవి
జిల్లా
*
కర్నూలు
ఫోన్ నెంబర్
*
9493846984
కవిత
*
శీర్షిక:స్వాగతం
వచ్చింది వచ్చింది కొత్త సంవత్సరం
ఆరంభమయ్యింది శుభాకాంక్షలపర్వం
తీయని జ్ఞాపకాలతో పాటు
చేదుగుర్తులను వెంట పెట్టుకుని
భారంగా సాగింది గత వత్సరం
అన్యాయాలను అక్రమాలను దూరం చేస్తూ
శాంతిని నెలకొల్పడానికిరా మాకోసం
అమానుష ఘటనలు అత్యాచారాలు
కలలో నైనా పునరావృతం కానీకు
అన్ని వర్గాల వారికలలు పండేలా
వెతలను చికాకులను దూరం చేస్తూ
సకల జనావళికి ఏడాది పొడుగునా
అంబరాన్ని అంటే సంబరాన్ని పెంచుతూ
స్నేహం పరిమళాలను వెదజల్లుతూ
మురిపించగ వచ్చిందీ నూతన వత్సరం
కొత్త పనులకు పురిగొల్పేవీ శుభాకాంక్షలే సుమా
కొంగ్రొత్త ఆశలతో ఆశయాలతో
పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకొంటూ
అందరినీ అభినందించడం మన సంప్రదాయం
అది మరపురాని మధురమైన ఘట్టం.
కొత్త రోగాలను దేశ సరిహద్దుల్లో రానీయక
ప్రజల భయాలను పార ద్రోలగ
వడివడిగా రావమ్మా కొత్త వత్సరమా.
డా బల్లూరి ఉమాదేవి
కామవరం ఆదోని
9
*
కాసుల ధీరజ్ శర్మ
జిల్లా
*
తూప్రాన్, మెదక్ జిల్లా
ఫోన్ నెంబర్
*
9440522864
కవిత
*
అంశం . నూతన సంవత్సరం!!
శీర్షిక. : స్వాగతం.!!
నూతన ఆంగ్ల వత్సరానికి
వినూత్న రీతిలో స్వాగతం !
కాలమా నీ మహిమే వేరు
ప్రతికూలతను అనుకూలతగా మార్చి అవలీలగ గట్టెక్కించి దాటించినావు గత వత్సరాన్ని!
కటిక చీకట్లను అధిగమించి కంటికి రెప్పలా కాపాడటానికి వెలుగు రేఖలవైపు తొలి
అడుగులు వేస్తూ మనస్ఫూర్తిగా
రమ్మంటున్నాము ఈ నూతన వత్సరాన్ని!!
కాలచక్ర పరిభ్రమణములో కార్య సాఫల్యతలకు గాను
కరుణా వాత్సల్యాలను కురిపించబోతున్నావు!
రాబోవు నూతన సంవత్సరంలో శుభకారక
శుభ ఘడియలను అందించబోతున్నావు !!
లెక్కకు మిక్కిలి సృష్టించి
ప్రశాంత వదనంతో మనకందిస్తుంది పకడ్బందీగా!
మనోల్లాసములతో ముందడుగులు వేయిస్తుంది లెక్కకు మిక్కిలిగా!!
చైతన్య రస స్రవంతిని కల్పించి అందరిలో
ఆనందాల ఉత్తేజాన్ని నింపి నిత్య నూతన చైతన్యాన్ని నింపబోతున్నావు!
వసంత శోభలా మనసంతా
శోభాయమానము చేయించబోతున్నావు!!
రూపు రేఖలనే మార్చి భాగ్య రేఖలుగా మార్చేందుకు
వినయ వినమ్రతతో స్వాగతిస్తున్నాము!
నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పరిపూర్ణ విశ్వాసంతో
ప్రార్థిస్తున్నాము!!
విప్లవాత్మక చారిత్రాత్మక శుభకర మార్పులకు
శ్రీ కారం నీవే అవుతావని నిండు మనస్సుతో నమ్ముతున్నాము!
సాదర మనస్సులతో సకుటంబ సపరివారంగ స్వాగతం పలుకుతున్నాము!!
10
అంశం::*నూతన సంవత్సరము*
శీర్షిక::కొత్త సంత్సరము
రచన:: కవిత వెంకటేశ్వర్లు
ఊరు:: కర్నూలు
సెల్:: 8309920625
వత్సరము - వత్సరము
నూతన సంవత్సరము
ఉండకూడదు మనలో మత్సరము
మంచి చేయుటకు చేయకు
తాత్సారము!!
కులాల కుమ్ములాటలు కూలీపోవాలి
మతాల మారణ హోమాలు ఆగిపోవాలి
దుర్మార్గపు పనులు ధూళీలో కలిసిపోవాలి
సన్మార్గులు సత్యమై నిలవాలి!!
జిత్తుల కత్తులు మొద్దుబారిపోవాలి
ఎత్తుకు పైఎత్తులు ఎవరి నాశనము చేయకుండాలి
దోచుకోవడము దాచుకోవడము మానేయాలి
ఇష్టపడి కష్టపడడము నేర్చుకోవాలి!!
హత్యల జోలికి పోరాదు
ఆత్మహత్యలు చేసుకోరాదు
అత్యాచారాలు చేయరాదు
ఆడపిల్లల ఉసురు తగలించుకోరాదు!!
అహం లేను స్నేహాలు వెల్లివిరియాలి
కొట్లాటలు గలాటలు లేని
కాపురాలు కావాలి
సంతోషాలు సంబరాలు
అందరికి ముదావహము కావాలి
అందరు ఆనందముతో అన్నదమ్ముల వలే అక్కాచెల్లెళ్ల
వలే జీవించాలి
హాయిగా సుఖంగా కలిసిమెలిసి
ఉండాలి
ఇదే నా నూతన వత్సర కోరిక
ప్రతి గుండె కావాలి వేదిక!!
ఈ కవిత నా స్వీయ రచన అని
హామీ
11
శీర్షిక.. కొత్త ఏడాదంతా
ఆత్మబంధువు లెక్కొచ్చి అలుముకుంటది
పాత క్యాలెండర్ పక్కనపెట్టి ఎత్తుకోమంటది తనను
గతం తప్పులకు గడ్డి పెట్టి చెప్పమంటది బుద్ధి
పునరావృతమైతే మిగిలిపోతాం తప్పుడు మనిషిగా
నూతన సంవత్సరం కావాలి మానవాధ్యాయం
పుట్టబోయే బిడ్డ కోసం ష్వెట్టర్ అల్లుకునే తల్లిలా
వచ్చే వాన కోసం పొలం ఇరువాలు దున్నే రైతులా
భవిష్యత్తుపై ఆశలతో రూపమివ్వాలి కొత్త డైరీకి
తేదీలు మారకముందే సిద్ధం చేయాలి ఊహా ప్రపంచాన్ని
వానలకు తడవకముందే సర్దుకునే పెంకుటిల్లులా
వండటానికి ముందే కడిగే బియ్యంలా
బ్యాటింగ్ కు ముందే కట్టుకునే ప్యాడ్లలా
భవనం కట్టేటప్పుడు ఇంజనీర్ వేసే ప్లాన్ లా
యుద్ధానికి ముందు సైనికునిలా కావాలి సన్నద్ధం
గతం గాడిదలా వెెనక్కాళ్లతో తంతే
భవిష్యత్తు గుర్రంలా సవారి చేస్తుందనుకోవద్దు
గాడిదల్ని, గుర్రాల్ని మలుచుకోవాలి అనుకూలంగా
నూతన వత్సరాన్ని సంబరాలతో సరిపెట్టుకోవడం సరే
ఒకరోజు ముచ్చట కాదు ఏడాదంటే
బండను శిల్పంలా మలిచే శిల్పిలా మార్చాలి దాన్ని
సంఖ్య, పేరు ఏదైనా ఏడాది రూపం మన చేతుల్లోనే
పునాదుల నుంచే జాగ్రత్త పడాలి
కొత్త కోడలు ఏడాది ఇంట్లో అడుగుపెట్టిన సంబురం
కొనసాగాలంటే పంచిపెట్టాలి మమతల బంధం
..............................................................
కొమురవెల్లి అంజయ్య
సిద్దిపేట
12
శీర్షిక:-- " నూత్న ఆంగ్ల సంవత్సరమా, స్వాగతం."
రచన:-- సింహాద్రి వాణి
ఊరు:-- విజయవాడ
చరవాణి:--7569820872
1) కం. హితమును కోరుము జనులకు
సతతము రాబోవు నాంగ్ల సంవత్సరమా,
యతిగా, నీకిదె సుస్వా
గతము, శుభములు సమకూర్చు కబురులు చెపుమా!
2) ఉ.మా. ఏదినమందునైన జనులెల్లరు సౌఖ్యము పొందు రీతిగా
యాదినముల్ సదా ప్రజల కాదరమొప్పగ నీయగావలెన్
నాది యనల్ప భావనను నైచ్యపుటూహలు కూల్చివేయ, రా
వా, దిశలన్నియున్ వెలుగు వాగులు పొంగగ లోకమందునన్.
3) సీ.ప. ఈర్ష్య క్రోధములను నిలిపైన బాయగా
కనువిప్పు కలిగించు కలుష ప్రజకు
ప్రేమానురాగాలు పెంపొంద జేయుమా
కులమత భేదాలు కూల్చివేసి
మోసాలు కుట్రలు మొదలంట తొలగించి
మనుషుల మనసుల మమత పెంచు
చదువు జ్ఞానమునిచ్చి చల్లగా కాపాడు
పెడదారి పోకుండ పిల్లలెపుడు
ఆ.వె. కష్ట సుఖములందు కలిగి సంయమనమ్ము
సాగి పోవగ ప్రజ స్థైర్య మిడుము
శాంతి సౌఖ్యములిడి చల్లగా దీవించు
దినము దినము గడువ దివ్యముగన
4) ఆ.వె. యువత భవిత గూల్చు వివిధ దారులు మూసి
చదువు వైపు శ్రద్ధ చాల గూర్చు
విజ్ఞత కడు పెంచు విజ్ఞాన మందించి
దేశ భవిత వెలుగు నాశ నింపు.
13
రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి
కల్లూరు ఖమ్మం జిల్లా
అంశం నూతన సంవత్సరం
శీర్షిక మరో ఏడాది
కాలం కొమ్మకు మారాకు వేసింది
గతం లిఖించిన మహాప్రస్థానలన్నీ
అనుభవాల గూట్లో పదిలపరచి
మరో ప్రస్థానానికి తెరతీసింది
నిన్నలలో తీపెంతో చేదెంతో
మనస్సు మూలల్లో బాదెంతో బరువెంతో
సాధించిన వెన్నో వేధించిన వెన్నో
పదిల పరుచుకున్న జ్ఞాపకాలెన్నో
విదిలించుకునే వేదనలు ఎన్నో
ఏ రోజుకారోజు
కొత్త పాటల కోకిలయింది జీవితం
రేపటి కోసం మిగిల్చుకున్న ఆశలు
నిన్నని సాదరంగా సాగనంపితే
సంకల్పాల మరో ఏడాదిలో
కొత్త ఆకృతి దాల్చుకున్న ఆశయాలు
వస్తే రానీ
కష్టమో నష్టమో
సుఖమో దుఃఖమో
మరణమో జననమో
పదునెక్కే ఆశయాల పదరంగం ఇది
మారుతున్న కాలాల మధు రాగం ఇది
అలుపులేని పాట అవుతానో
వెనక నడుచు పాదాల బాటవుతానో
తీర్పు కాలానిదే
గెలుపు ఓర్పు హృదయానిదే
14
** కాలం కొత్త - చుట్టం **
కాలం కదుల్తనేవుంది !తన జ్ఞాపకాలను నాదగ్గర పదిలంగా వదిలేస్తూ !...
సంవత్సరాలు మారుతున్నయ్
మళ్ళీ అదేతంతును అనుసరిస్తూ ....
ఐనవారిని కొంత పరాయి చేస్తు
పరాయి వారిని కొందరిని ఐనవారిని చెస్తూ !....
చేతలకంటే మాటలమంత్రాలే
రాజ్యమెలుతున్నాయ్ ....ఎవరైతే
గతితప్పిన గతానికి గంతలు విప్పి
గదమాయించి నడిపిస్తారో !....వాడే లోగుట్టు
పట్టి లోకనాయకుడౌతాడు ...లేదంటే .... గోతుల్ని తప్పించలేక గోదాట్లోకలవాల్సిందే ....
కాలం .... గత్తార్లు లేపినా , అత్తర్లు పూసినా !
ఓ నాటి అద్దమరాత్రి కొత్తచుట్టం
కరుకుచక్రాల బండిపై రానేవస్తాడు
ఆశల ఊసులు మోసుకొస్తూ ....
మోసపోయినాగతాన్ని మట్పరిస్తూ ...
ఇరుసుకున్న చక్రం బలంగానే ఉన్నా ...
దానికి షాయి మొలే లేదు చక్రం ఊడేదాకా తెల్వదు
బతుకుబండి తిరగ బడతదని ...
సంవత్సరం ఎదైనా కాలం పిట్ట పెట్టేకూతకు
చెవులు మూసుకోవలసిందే...
కాలం ఎప్పుడూ కొత్తచుట్టమే
గత గాయాలను వారధిగా మార్చుకొని
కొత్త తీరానికి చేరుకోవాలి ...అప్పుడే నూతన సంవత్సరం వినూతనంగా ఉంటుంది.
.... జక్కిడి వెంకటరెడ్డి .
హైద్రాబాద్ .
15
కవన జ్యోతి
కవితాగానం సీజన్4
మార్గశిర మాసం
శోభకృత్ నామ సంవత్సరం
పౌర్ణమి కవితా పోటీలకు
కవితాంశం--నూతన సంవత్సరం
శీర్షిక ---- *కొత్త క్యాలెండరు*
నూతసంవత్సరానికి స్వాగతం పలుకుతూ
విడ్కోలు చెబుతోంది అర్ధరాత్రి మారుతున్న ఓసంఖ్య
ఋతువు మారలేదు ప్రకృతి నర్తించలేదు కోయిల గళమూ విప్పలేదూ...అయితేనం?
నూతన సంవత్సరంవస్తోంది అంటే ముందుగా కొనాల్సిందే కొత్త క్యాలెండరు.ప్రణాళికలకు పండగలకు,పబ్బాలకుసెలవులకు,
నెలవులప్రణాళికలకు తెలిపేదిఅదే
గతాన్ని గుర్తుకు చేస్తూ చిన్నప్పుడు
ప్రతిరోజూ గడిచిన క్షణాలను నెమరువేస్తూ,దాచుకున్నస్మృతులలో
గోడమీద క్యాలెండరు ఒకటి
అమ్మ రాసుకున్న పాలలెక్కలు,
పనిమనిషి పెట్టిన సెలవులు
గుర్తుకుపెట్టుకున్నపుట్టినరోజులు అన్నీక్యాలెండర్లలోనే
ప్రతినెలకాగితం వెనక వెచ్చాలబాకీ,చాకలి పద్దులు అన్నీ కలిసిన చిన్న నోటుపుస్తకంలా
అందరికీ అందుబాటులో మందుగదిలో గోడ మీద వేళాడేది.
దేవుడి బొమ్మలతో దళసరైన పుటలతో భలే భలేగా... కొత్త క్యాలెండర్ రాగానే పాత క్యాలెండర్ పిల్లల పుస్తకాలకు అట్టగా మార్చేసే వ్యర్ధం చేయని ఓనాటి వారి వైనమును చూస్తూ
తను కదలక కాలాన్నీ పుటలు పుటలుగా తిప్పుతూ నిలిచినది.
లలితా చండి
న్యాయవాది హైదరాబాదు 9885552922
16
అంశం: నూతన సంవత్సరం
కవిత శీర్షిక: కొంగ్రొత్త ఆశల దారి
కొత్త ఆశల్ని కొంగ్రొత్త ఆశయాల్ని పొదువుకుని/
నూతన పథంలో
ముళ్లబాటను చదును చేస్తూ/
గతుకుల ఘమకాలను సరిచేస్తూ
ఆత్మవిశ్వాసపు అడుగులు వేస్తూ/
అందమైన సుమాల్ని కూర్చుకుంటూ పూల గుచ్చంలా వికసిద్దాం/
జయాపజయాలకు అతీతంగా
ప్రయాణపు పరిమళాలను ఆస్వాదిస్తూ/
నలుగురితో కలిసి లక్ష్యాన్ని గురిపెడదాం/
అనుకున్నది సాధించడానికి అహరహం శ్రమించి చేతనత్వాన్ని సాకారం చేద్దాం/
దారి నిండా చైతన్య వెలుగులు పూయిద్దాం/
ఎడతెగని యానంలో కొన్ని కమ్మని ఊసుల్ని మూటకట్టుకొని/
స్ఫూర్తి మంత్రాన్ని జపిస్తూ ఎల్లలు లేకుండా ఎదుగుతాం/ కొన్ని హరివిల్లుల రంగుల్ని అందరి ముఖాల్లో వెలిగిద్దాం/
హామీ పత్రం: నా కవిత దేనికి అనువాదము అనుకరణ కాదు. ఏ పత్రికలో ప్రచురింపబడలేదు, పరిశీలనలో కూడా లేదు. ఇది నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను.
పేరు : బొప్పెన వెంకటేష్
జిల్లా: సిద్దిపేట్
చరవాణి : 9866584062
ఇ-మెయిల్ ఐడి: vboppena@gmail.com
17
9493273114
పేరు కొంజేటి రాధిక
ఊరు రాయదుర్గం
అంశం...నూతన వత్సరం
చిరునవ్వును అందరి పెదాలపై చిగురింప చేస్తూ...
ఆనందాలను అందరి ముంగిట్లో రంగవల్లికగా దిద్ది ,జనజీవన స్రవంతికి ఆగని కాల ప్రవాహం నిత్యం పాఠాలను ప్రబోధిస్తూ....
సాగిపోతోంది గతానికి తలుపులు వేసి, వర్తమానానికి ఆహ్వానం పలుకుతూ....
ఎన్నెన్నో నిర్ణయాలు సరికొత్త జీవన వేదికపై కాలం నేర్పే పాఠాలు ప్రవచనామృతమై,
నిత్యం నవవసంతంగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించే కొత్త సంవత్సరం అందరి జీవితాలలో వెలుగు పూలు పూయిస్తూ, రంగుల హరివిల్లుగా ఆనందాలను విరబోయిస్తూ ,
ఉపద్రవాల ఉప్పెనలు జనజీవన స్రవంతిని తాకక, ఏ అరాచకాలు ఆటంకాలు అడ్డగోడలు కాక, శాంతియుత జీవనానికి ప్రకృతి ప్రతిరూపమై నిలిస్తే చాలు, నవవత్సరంలో ఆనందాలు అంబరమంటి, ఈ నింగి నేలపై శాంతి సంతకానికి రక్తపాతపు రంగులు వెలసి తీరాల్సిందే అశాంతి అంతం కావాల్సిందే....
అంబరమంటే సంబరాలు శాశ్వతమై నిలిచి పోవాల్సిందే.
18
మార్గశిరమాసం పౌర్ణమి కవితా పోటీకి
కవితాగానం
అంశం*నూతన సంవత్సరం
శీర్షిక*మంచుపూల తావిలో...
పూసిన పూల పరిమళం తీరు
కాలం తేట తేట వెలుగుల తేరు
ఉన్నోళ్ళకు ఎపుడూ పండగే
లేనోళ్ళకు నిత్యమూ ఎండుగే
నూతనమా రావమ్మా
సకలమతముల సారమంతా ఒక్కటేనని
నీవైనా ఆకాశం లాంటి భావమివ్వవూ
నీ కోసం
మిరుమిట్లు గొలిపే వెలుగులను
ఆకాశమంత పరుచుకునే
మతాబులను ముస్తాబు చేశాం
ఒక్కసారి నీ వొచ్చే ముందు
నిన్నటి మా గాయాలకు సంజీవనితో రావాలి
అహం అధికార ధిక్కారం
చిన్న దేశాల ఊపిరి తీస్తుంటే
నీవైనా శాంతి మంత్రం జపిస్తూ రావా
మా తపస్సంతా శాంతి కోసమే సుమా
నీవు
ప్రపంచమంతా మంచుపూవై విచ్చుకునే యాల
మాలో కొన్ని అమృత భావాలు
చిలకరించు
మనిషి మనిషిని ప్రేమించే సౌజన్యాన్ని అందించు
నీ సంఖ్య
రెండూ సున్నా రెండూ నాలుగు కదా
మంచి చెడులలో మంచిని పెంచు
మాలో స్వార్థం సున్నా చేసేయ్
మమతా సమతా స్థితిలో మము
నడిచేలా చూడు
నాలుగు పాదాల మీద ధర్మం నడవనీ
కలి నీడలో కలీగం ఆగం కాని కానుకలతో రావమ్మా
నూతన సంవత్సరమా
నీకిదే మా స్వాగతం సుస్వాగతం
ఏడెల్లి రాములు ✍️
ది*28*12*23(23*11)
ఎల్కలపెల్లి 🌹
జిల్లా* పెద్దపల్లి
19
కవితా గానం సీసన్ 4, నిర్వహిస్తున్న పౌర్ణమి కవితా నగదు బహుమతుల పోటీ
అంశం: నూతన సంవత్సరం
శీర్షిక : శుభారంభం
*************
నూతన సంవత్సరమంటే
జారిపోతున్న జీవన ఘడియలే
కాలం మాత్రం క్యాలెండర్ అంకెల్లో
ఏం దాచిందో ఎవరికీ చూపదు
అందుకే..
చీకట్లోనూ..వెలుతురు నిచ్చే బంధాలను
ఒకసారి పలకరించుకుంటూ
సమస్యల తుప్పలు..పొదలగుండా
ఏడాదంతా నడుస్తూ.. పరిగెడుతూ
ఆగి దిక్కులు చూస్తూ..
నెమ్మది.. పరిష్కార మైదానాల దిశగా సాగాలి
ఎదలోతులను కనబడనీయకుండా
ముసుగులేసుకున్న మతలబు ముఖాలనూ కలుపుకుని
కాలంలో కలిసి కాస్త దూరం నడవాలి
ఆప్యాయతలను అస్పష్టంగా రాసి వదిలేసిన
కాలపు దిగులు చాయలని
కాస్త మరుగు చేసుకుంటూ
బతుకు పొద్దులో..దాగిన సౌందర్యాన్ని
ఇనుమడింప చేసిన
తొలి మలి సంధ్యలను పొదుపుకుంటూ
అనురాగం చిగుళ్ళేయని కాలంలోనూ
సగం తుడిచిన నల్లబల్లలా
చెరిగీ చెరగని వ్యధాక్షరాలను మోసుకుని
ముందుకు సాగడం అనివార్యంగ
బాంధవ్యాలను వెంటబెట్టుకుని నడవాలి
జవాబులు తెలియని
ఎన్నో పశ్నలను కాలం సందిస్తుంటే
సమాధానాల కోసం వెతుకుతూ వేగిరపడుతూ
కొత్త ఆశల గమ్యాల దిశగా అడుగులేయాలి
కరిగిపోతున్న కాలం విలువ ఔపోసన పట్టి
కడదాకా వెంటనడిచే చెలిమిని కాచుకుని
కాస్త మానవతను జోలెలో వేసుకుని నడవ గలిగితే
నూతన సంవత్సరానికి శుభారంభమే
డా. దారల విజయ కుమారి
హామీ పత్రం
**********
నమస్తె సర్
ఈ కవిత నా స్వంత రచన. ఎటువంటి అనువాదం కాదు. ఏ సోషల్ మీడియా లోనూ ప్రచురితం కాదు.
ఇట్లు
తమ విధేయురాలు
డా. దారల విజయ కుమారి
9177192275
20
కవితా గానం సీజన్ -4
మార్గశిర మాసం పౌర్ణమి పోటీకి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
****************************
కాలానికి శ్వాస కలం....
కాలం నాలుక కలం.....
కాల చరిత్రకు బలం కలం ....
కాలం నలువ కలం...........
కాల చక్రభ్రమణంలో శాశ్వతం కలం ...
కాలం చరిత్ర లిఖిస్తోంది ...............
భూత ,భవిష్యత్తు ,వర్తమాన
కాలాలకు అందిస్తుంది......
భాషా నాసామణి (ముక్కెర )కలం.....
అన్యాయాలకు అక్రమాలకు నిరూపణ
నాళీకము( బాణపు ములికి).......
న్యాయాధికారి చేతి కలిగ కలము......
విద్యార్థి చేతి ఆశాజ్యోతి కలము ....
ఉద్యోగార్హత చూచి ఇస్తుంది సంతకం .....
కవిని కలకాలం చరిత్రలో నిలిపేది కలం....
గంటంతో కావ్యాలు రాసిన ఆది కవులు......
కలం పట్టుకున్న వారందరూ కాలేరు కవులు......
గింజల సిరాను సీసాలో పోసి
ముంచి రాసే ,మధ్య కవుల పాళీ కవిత్వం.....
బాల్ పెన్ తో కవిత్వం నవీనం ...
ఏది ఎలా వ్రాసినా కవిత్వానికి కలం...
కవి లేనిదే లేదు కలం.
*****************************************
21
వనపర్తి గంగాధర్
జిల్లా
*
హన్మకొండ
ఫోన్ నెంబర్
*
9440146435
కవిత
*
శీర్షిక:విశ్వశాంతి
నీ ఆశలకు ఊపిరై
నీ ఆశయాలకు ఆసరా ఐ
నవ్య శకానికి నాంధియై
నూతన చైతన్య స్రవంతియై
అరుదేంచాలి నూతన వత్సరం
గతకాలపు చేదు జ్ఞాపకాలను
హృదయపొరల్లో దాచేసి
కొత్త ఆలోచనలకు స్వాగతం పలుకుతూ
ఎద గవాచ్చాలను తెరచి
కొత్త లోకానికి దారులు వేద్దాం
నిర్వేద,నిస్సహాయ మనసులకు
వెలుగు పూలను పూయిద్దాం
నవ్వుల కుసుమాలను పంచుదాం
ఆనందపు అమృతాన్ని తాగిద్దాం
సంతోషపు బావుటాను ఎగిరిద్దాం
మానవతా విలువలకు పట్టం కడదాం
మధుర భావనలను పెంచుదాం
సౌభ్రాతృత్వ తత్వాన్ని చాటుదాం
విశ్వ శాంతికి దారులు వేద్దాం
నవ వత్సరానికి ఉత్సా హమై స్వాగతిద్దాం
ఈ కవిత నా స్వీయ రచన
పేరు:వనపర్తి గంగాధర్
హన్మకొండ
22
కవయిత్రి పేరు
*
మధు అమరగాని
జిల్లా
*
సిద్దిపేట
ఫోన్ నెంబర్
*
9177860792
కవిత
*
శీర్షిక: నూతన సంవత్సరం
మార్పు ఎప్పుడు మంచిదే కానీ
అది అనాదిగా వచ్చిన ఆచారం కాదు
అరువు తెచ్చుకున్న గ్రహచారం
ఆశలకు పోషాకులు తొడుగక
తాగి ఊగేది ఊగి వాగేది
ఉప్పొంగే ఉత్సాహంతో,
అవధుల్లేని ఆనందంతో,
అంబరాన్నంటే వేడుకలతో,
హోరెత్తించే DJ మోతలతో
కొత్త అధ్యాయానికి నాంది కావాలని కోరుతున్నా
మార్పేమీ లేదు ఒక్క క్యాలెండర్ తప్ప…
కష్టాలెన్ని వచ్చినా ఓర్చుకుంటూ
సవాళ్లెన్ని ఎదురైనా కన్నీళ్లను తూడ్చుకొమ్మని
నిన్ను నువ్వు మార్చుకునేలా
నీ అభీష్టాలను తీర్చుకునేలా
సరికొత్త భవితకు పునాదిగా
జడప్రాయమైన జగత్తులోని
గతకాలపు గడుసు పనులను మరచిపొమ్మని
మార్పుకు నాంది పలికి “తేనే” నూతనం
హామీ: ఈ కవిత కవితాగానం కోసం వ్రాసినది హామీ ఇస్తున్నా
23
మద్ది. పుల్లారావు
జిల్లా
*
Ntr
ఫోన్ నెంబర్
*
9951287113
కవిత
*
తే.గీ
వచ్చెనిరువది నాల్గు సంబరము మీర
సంతసము బంచలెనని జగతికిపుడు
కొట్టుమిట్టాడుచుండిరి గూర్మిలేక
రగులుచుండెనశాంతి పొరలు జగతిన
తే. గీ
ధనము చుట్టు దిరుగుచుండె ధరణియంత
మానవత్వము కరువాయె మహిన నేడు
జనులు బలయిరి యుక్రెయిన్ జగడమందు
రష్య సైనికుల్ నశియించె రణమునందు
తే. గీ
రాజకీయాలు దిగజారె రచ్చగాను
అంతరాలు బెరుగుచుండెనంతకంత
చచ్చుబడిపోయినదనిరి సాఫ్టు వేరు
వ్యవసాయమునకు దగు ఫలము లేదు
తే. గీ
పోయినదనుకున్న కరోన పుడమి పైకి
మరల దాడి జేయుచునుండె మాయగాను
విచ్చలవిడి తనము హెచ్చె విశ్వమంత
నవ్యముగనుండు నిరువది నాల్గు మాకు
తే. గీ
తెలుగు తారలు పలువురు దివిని జేరె
శౌరి దీవించు జగమును సౌఖ్యమొంద
లోక ప్రియముగ నుండు నిరువది నాల్గు
కలుగజేయుము సద్భుద్ది వెలుగు జూపి
.
24
*
వేమూరి.సత్యవతి.
జిల్లా
*
కృష్ణా
ఫోన్ నెంబర్
*
9885136308.
కవిత
*
శీర్షిక. ఆహ్వానం!!
ఒక సుందర స్వప్నం సాకారమై..
ఎప్పుడూ చవి చూడని మంచి రుచిలా...
శ్రవణసుభగమైన సంగీతంలా...
ఎన్నడూ చూడని రంగుల్లో ప్రకృతి రంగవల్లిలా..
ప్రాణం పోస్తూ ఆయువై సుగంధ పరిమళ సమీరం లా..
అన్యాయమైనతీర్పులు,అకృత్యాలు లేని సుపరిపాలన లా..
వైరస్ లు హడలెత్తించని మంచికాలం లా..
సుందర దృశ్యాలు చూపగల దివ్యనేత్రంలా..
కొత్త వత్సరం రావాలని మనసారా కోరుకుంటున్నా!
కానీ కొత్త సంవత్సరం మాత్రం విసుగ్గా విస్తుబోయేలా ప్రశ్నలేసింది!
చెట్లన్నీ కొట్టేస్తూ.. ప్రకృతి రంగవల్లి కావాలా??
ఇన్ని రకాల కాలుష్యాలు పెంచుతూ.. సుగంధ సమీరం కావాలా??
ప్రతినిత్యం స్వార్థం తో ఆలోచిస్తూ.. అకృత్యాలు లేని సుపరిపాలన కావాలా?
పధ్ధతిలేని ప్రయోగాలు శోధనలు చేస్తూ వైరస్ లు లేని మంచికాలం కావాలా?? అని మందలించింది!
కోర్టు మందలింపు ల్ని పట్టించుకోని ముద్దాయి లా నేను బతిమాలాను.
పిల్లల అమాయకతల్ని అజ్ఞానాన్ని మన్నించే మాతృమూర్తి లా..
సంక్రాంతి సంబరాలని, క్రోధంలేని ఉగాదిని, జగద్రక్ష రామనవమి తో పండుగ మిఠాయి లతో
విద్యా సంపదల ప్రతి నిధిగా "కొత్త వత్సరమా"
శుభాకాంక్షగా శుభాశీస్సువై 2024గా రావాలి!!
నీవు మాకు "తీపి గుర్తు"వవ్వాలి!!
కవుల మానసాల క్రాంతి కవన జ్యోతి తరఫున నీకిదే మా "ఆహ్వానం
25
అంశం... నూతన సంవత్సరం
శీర్షిక...మారే కాలం కోసం
ఆకు పచ్చని ఆశయ సాధన కోసం
మారే కాలానికి
మనసు విప్పి చెప్పాలని ఉంది ....
చిరు నవ్వుల చిరు జల్లులు
చిలకరించే
ఆప్యాయతల వడగళ్ళ కోసం
మారే కాలానికి
మనసు విప్పి చెప్పాలని ఉంది....
చీకటి వెలుగుల అంతరాలలో
చిదిమిన జీవితాలలో
చిరుదివ్వెలు వెలగాలని
మారే కాలానికి
మనసు విప్పి చెప్పాలని ఉంది....
క్షణికావేశపు ఆత్మ హత్యలను
ఉక్కు సంకెళ్ళ చెక్కు చెదరని
ఆత్మ విశ్వాసపు
ధృడ సంకల్ప మొలకల కోసం
మారే కాలానికి
మనసు విప్పి చెప్పాలని ఉంది ....
చేదు గుళికల గురుతులను
చేరనీయక ఆత్మీయ
స్నేహ హస్తం కోసం
మారే కాలానికి
మనసు విప్పి చెప్పాలని ఉంది....
చైతన్య పూరిత నవ
సమ సమాజం కోసం
మారే కాలానికి
మనసు విప్పి చెప్పాలని ఉంది....
అవినీతికి అడ్డుగోడ
కట్టేందుకు శిలగా
మారే మార్పు కోసం
మారే కాలానికి
మనసు విప్పి చెప్పాలని ఉంది ....
అందమైన అనుభూతుల
కొమ్మల అంచున
ఆప్యాయతలు పంచుతూ
ఆనందాలు వెదజల్లే
కమ్మని కోకిల స్వరాల కోసం
మారే కాలానికి
మనసు విప్పి చెప్పాలని ఉంది...
హృదయపూర్వక ఆంగ్ల
నూతన సంవత్సర
శుభాకాంక్షలు
శుభాభినందనలు అని
ప్రతి ఒక్కరికీ పరవశంగా
గొంతెత్తి చెప్పాలని ఉంది....
నమస్తే ఈ కవిత నా స్వీయ రచన అని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను🙏
మొహమ్మద్.అఫ్సర వలీషా
26
పిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
మార్గశిర మాసం పౌర్ణమి కవితల పోటీకి... ...
అంశము :-- నూతన సంవత్సరం.
శీర్షిక :-- ఆంగ్ల సంవత్సరమా! ఆశలీడేర్చుమా!
1.తే.గీ.
వెడలు నిరువది మూడుకు వీడుకోలు
పలికి యిరువది నాల్గుకు స్వాగతమ్ము
నిడగ నాంగ్ల వత్సరమున కేల సంబ
రములను జరుపుదురు నర్ధరాత్రి యందు?
2.తే.గీ.
కదలు కాలచక్ర మిదియె క్రమముగాను
పగటి తరువాత రాతిరి వచ్చునటుల
మాసము వెనుక తరువాతి మాసము వలె
వత్సరము కూడ నడచు నా బాటలోన.
3.తే.గీ.
స్వాగతింతుము నూత్న సంవత్సరమ్మ!
గతమునందు జరిగిన దుర్ఘటనలు పున
రావృతమ్ము కానీయక రక్షసేయ
మనుచు వేడుకొందుము నిన్ను మరువకమ్మ!
4.తే.గీ.
ఇజ్రయేలు హమాసుల కిపుడు జరుగు
రణము గొంపోవ వేలాది ప్రాణములను
ఇండ్లుకూలి యనాథలై రెంతొమంది
యిట్టి మారణ హోమమ్ము లెట్టులైన
విశ్వమందున లేకుండ, విరియ జేయ
వమ్మ శాంతి పూలను నూత్న వత్సరమ్మ!
5.తే.గీ.
వరదలు తుపానులున్ లేక వసుధయందు
పంటలకు తగినట్లుగా వర్షములను
కురియగా జేసి కర్షకు లరుసమొంద
నధిక దిగుబడి నందించి యాదుకొనుము.
6.తే.గీ.
జనులకున్ కరోనా వంటి జబ్బులేవి
రాని విధముగ కలిగించు రక్షణమును
తొలగ హత్య,లత్యాచారములును ప్రజల
యందు, వారి మనస్తత్వమందు మార్పు
వచ్చునట్లుగ చేయుమా వత్సరమ్మ!
**************************************
Comments
Post a Comment