Skip to main content

పుష్యమాసం పౌర్ణమి కవితలు

అంశం:
రామమందిరం
నిర్వహణ
శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
............................
పౌర్ణమి పోటీకి కవితలు పంపించిన
కవివరుల జాబితా
*********†*****
1.మండ నాగేశ్వర్రావు గారు 
2.దోసపాటి వేంకట రామచంద్రరావు గారు 
3.వి వీరాచారి గారు 
4.నెల్లూరి వెంకట లక్ష్మి గారు 
5.డా.వేమూరి సత్యవతి గారు 
6.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 
7.డా.బల్లూరి ఉమాదేవి గారు 
8.మద్ది పుల్లారావు గారు 
9.పిన్నక నాగేశ్వరరావు గారు 
10.గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు 
11.లలితా చండి గారు
****************
*
మండ.నాగేశ్వర్రావు.
జిల్లా 
*
విశాఖపట్టణం
ఫోన్ నెంబర్ 
*
7793939724
కవిత
*
🙏 శ్రీరామ మందిరం..!!🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


అద్భుతమైనది శ్రీరామమందిరం
దర్శించుకుందాం అందరము.!!
రామాయణమే ఒక వేదం
శ్రీరామనామమే మన నాదం!!

అయోధ్యాపురమే అపురూపం
ఆప్తులందరికి పరవశము!
రామమందిరమొక అద్భతమూ 
ఆతని స్మరణే అమోఘము!!!

ఇలలో మరియొక సాకేతము 
దేవతలందరి సమ్మతము!
భారతీయులా పుణ్యభాగ్యము
చరిత్ర కందని స్వర్గధామము!!

శబరీగుహులా జన్మధన్యము
వానరమూకల స్నేహధర్మము!
పక్షీ ఉడుతల సహాయమర్మము
తెలిపేదే శ్రీరామ మందిరమూ!!

సరయూనది తీరమునందున
కరసేవకులా త్యాగఫలం !!
అయోధ్య రాముని మందిరము
దర్శించుటయే జన్మధన్యము !!

అద్భుతకళలకు ఆలవాలము 
భక్తులందరి కల సాకారం!!
నిర్మించిన వారి పుణ్యఫలం
అయోధ్య పుర రామమందిరం!!

భారత ప్రజల భాగ్యమదేమో 
సీతరామలక్ష్మణహనుమశోభితం!!
జీవితాన దర్శించడమే మనోభీష్టము
శ్రీరామాలయ దర్శనమే జన్మపావనం!!!

అదిగో అదియే అయోధ్యపురము
నమో నమో శ్రీసీతారామం..!!
జగతికి ఇదియే రాముని వరము
బాలరాముని శ్రీరామమందిరం!!!


         ----మండ.నాగేశ్వర్రావు.✒️
               సరిపల్లి, పెందుర్తి.
               విశాఖ పట్నం జిల్లా.
              ఫోన్:7793939724.

 2
*
దోసపాటి వేంకటరామచంద్రరావు
జిల్లా 
*
విజయనగరం
ఫోన్ నెంబర్ 
*
7780594995
కవిత
*
కవితాగానం
శోభకృత్ నామసంవత్సర పుష్యమాస పౌర్ణమి
నగదు కవితలపోటి
అంశం:రామమందిరం(అయోధ్య)
దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం
శీర్షిక:కలనిజమాయెనే!
ఎన్నినాళ్ళా నిరీక్షణ ఇది
ఎందరి కల నిజమైనది
ఎన్ని ఆందోళనల ఫలితమిది
ఎందరి జీవనత్యాగఫలమది
కలనిజమాయెనే నేడు
మనువుచేనిర్మించబడిన సుందరనగరమది
సత్యసంధులు నడయాడిన నగరమది
సన్మార్గమున ప్రజలందరు నివసించిన ప్రాంగణమది
ఐదువందల వత్బరముల కాలము గడిచినది
శ్రీరామచంద్రుని జన్మస్థానమది
సకలసౌభాగ్యాలకు నిలయమది
బుధ్ధిజీవీబ్రహ్మ తెలివితోడైనది
విష్ణుచక్ర సంరక్షణలోనున్నది
శివుని త్రిశూలం కాపాడునది
అదిగదిగో అయోధ్యానగరి
బాలరాముని ప్రతిష్ట జరుగబోవుచున్నది
అంగరంగవైభవంగా తయారైనది
రంగులమయమై రాగరంజితమైనది
రామనామజపముతో మారుమ్రోగుచున్నది
శ్రీరామరక్షాస్తోత్రముతో ప్రతిధ్వనించుచున్నది
పవిత్రసరయూనదీతీరమందు అవతరించినది
దేశవిదేశములలో రామమందిరము ప్రఖ్యాతమవబోతున్నది
ఎందరెందరో మహనీయుల రాకతో ఫరిఢవిల్లుచున్నది
న్యాయస్థాన ఆదేశముతో పూర్వవైభవము పొందుచున్నది.

ఇది నాస్వీయరచన. ఈ పోటీ కొరకై రాసినదని హామి
ఇస్తున్నాను.

3
అయోధ్య రాముడు (కవిత)

అందరి చూపులు అయోధ్య వైపే!
అందరి మనసులు రాముని పైనే!
పితృ వాక్య పరిపాలక రాముడు.
ఆశ్రిత రక్షక! శ్రీరామ చంద్రా!
తన పాలనలో ప్రజలందరినీ,
సుఖశాంతుల కాపాడే రాముడు!
రామ బాణముకు తిరుగేలేదు.
రామచంద్రునిది ఒకటే మాట.
శ్రీరామచంద్రుని కొకరే భార్య.
ప్రపంచమంతా ఎదురు చూడగా,
సుగుణమ్ముల ఖని, అయోధ్య రాముని,
అందాల రాముని, జగదభిరాముని,
బాల రాముని విగ్రహ ప్రతిష్ట
జరుగనున్నది అయోధ్య నగరిలో.
బహు శుభ సమయం మనకందరికీ!
కన్నుల పండుగ, శోభాయ మానం!
అందమైన మన అయోధ్యాపురిలో,
రాముని పూజలు రాముని భజనలు!
ఎందరొ భక్తులు ఏతెం చిరిటకు.
ఆధ్యాత్మికపురి, అందాల అయోధ్యలో
సుగుణాభిరాముడు,శ్రీరామచంద్రుడు
నడయాడిన ఈ పుణ్య అయోధ్యలో,
శ్రీరాముని స్పర్శతో పులకించిన
సరయూ నదిది ఎంతటి పుణ్యమో!

రచన: వి. వీరాచారి,LCE, కవిరత్న, దాశరధి పురస్కార గ్రహీత, వనపర్తి టౌన్ మరియు జిల్లాpin.509103.

4
*
Nelluru Venkatalakshmi 
జిల్లా 
*
Kurnool 
ఫోన్ నెంబర్ 
*
9491632232
కవిత
*
పౌర్ణమి కవితా పోటీ
నెల్లూరు వేంకట లక్ష్మీ, ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా 
శీర్షిక: రామమందిరం/అయోధ్య 
**********************"
పురుషోత్తముడి దివ్య స్వరూపం తో
పులకించి పోతోన్న అయోధ్య నగరం
ఆదర్శమూర్తికి ప్రాణప్రతిష్ట చేసే
సుందర సుమధుర ఘట్టం 
యావత్తు జగతి భక్తి పారవశ్యంతో
పరవళ్ళు తొక్కుతున్న జనసందోహం

కోదండధారియై దివి నుంచి భువికి
చిద్విలాసంతో చేరుకున్న బాలరాముడు 
చూసినంత నే చాలు పాపప్రక్షాళనం గావించు ముఖారవిందముతో
మూర్తీభవించిన సుందరరూపంతో
అయోధ్యా పీఠంపై ఆసీనుడాయెను

ఐదు శతాబ్దాల నిరీక్షణకు తెర
రామభక్తుల కల నెరవేరిన తీరు
పుణ్యచరితుని పాదంతో పునీతమయిన పుణ్యభూమి
రెండు కన్నులు చాలని సకలగుణాభిరాముని వైభోగం
సద్గుణధాముని సంబ

5
*
డా.వేమూరి.సత్యవతి
జిల్లా 
*
కృష్ణా జిల్లా.
ఫోన్ నెంబర్ 
*
9885136308
కవిత
*
శీర్షిక...."మోక్షపురి"

భారతీయత పల్లవిస్తే..
ఆధ్యాత్మికానందం వెల్లివిరిస్తే..
విశ్వాసపు తలపులు తొంగి చూస్తే..
ఇతిహాసపు తలుపులు తెరిస్తే..
పూర్వపుణ్యాలతో కోసలగర్భంలో..
సూర్య సరోవరపు - కమలంలా...
అపుడెపుడో బాలరాముని పుట్టుక..!!
ఈ నేలపై పాకిందీ, పరుగులు పెట్టిందీ, ఆటలాడిందీ..
కళకళలాడి..నవ్వులుకురిసింది..విద్యలు నేర్చిందీ..
ఇదే..ఇదే..సరయూతీరం..తమసాతటం..ఇదే "మోక్షపురి"!!.
దశరథుని పుత్రోత్సాహం,మాతృమూర్తుల మురిపెం..తో..
 రాచభవనమంతా.. అయోధ్యంతా నీలమేఘశ్యాముని నిలయం!!
మర్యాదారాముని శీలనిర్మాణమిక్కడే!!
గురు విశ్వామిత్రుని రాక అడవులకి నడిపించినా..
తాటకాంతకుడై, అహల్యాశాపవిమోచనతో..
"కళ్యాణరాముడై" . తిరిగొచ్చి కనువిందు చేశాడు!
"వరాలు" స్వార్ధజ్వాలాగ్నులను రగిలించినా..
విలువల వలువలకట్టి సీతాసౌమిత్రులతో..అరణ్యవాసం!!
మాయామృగాన్ని కూల్చి, అంజనానందనునికి ఆత్మయై..
వానరసేనతో కడలికి వారధి లీలగా కట్టి..
రావణవధచేసి రమణి ని రక్షించి, "అజేయఅయోధ్య"ప్రభువై
రామరాజ్యపు రుచిచూపి ప్రజలందరికి కైవల్యమిచ్చినాడు.
మాయమైన మందిరం మళ్ళీ వచ్చి పండుగ తెచ్చింది!!
అదుగో మోక్షపురీ! తమసా, సరయు, అదుగో చూడండీ!
                               +++

6
రామ మందిరం (అయోధ్య)
తేదీ:::23/01/2024
శీర్షిక... రామమందిరం 
స్వీయ రచన:: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, పాతర్లపాడు, ఖమ్మం.


ఏ సంఖ్యా సరిపోదేమో!?
బలిదానాల లెక్కలు ఒప్ప చెప్పటానికి !
ఏ కొల పాత్రా సరిపోదేమో
బుడబుడ మంటూ భూమిపై పారిన లోహితము కొలవడానికి!

ఏ కొలమానానికి అంతు చిక్కదేమో 
కపాలాలతో కట్టిన
కోట బురుజుల ఎత్తు కొలవటానికి !!

అక్కసుతో ఆక్రమణ దారులు, 
అడుసులో కలిపిన అయోధ్యలో రామాలయ 
పునః నిర్మాణం కోసం 
అంతులేని పోరాటం చేసి నేలకొరుగుతున్న భక్తుల చూసి!!

కన్నీరు కారుస్తూ ఏమీ చేయలేక
కాలం కరిగి పోయింది 
ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ కాలం!!

సంకల్పం పూని భక్తులు, సమరం వీడక నిలువగా 
సహనం వహించిన సమయం 
సాధించింది, వినయం ఉట్టి పడే విజయంతో 
సరయూ తటి పై సాకేత రాముని సన్నిధానాన్ని !!


పుత్రులను కోల్పోయిన మాతల కన్నీరు,
దారి చూపే కాగడాలను వెలిగించే తైలమై కొంత,
రక్తసిక్తమైన సరయూనదిని మరికొంత పావనం చేస్తుంటే
చేతులు చప్పట్లు చరుస్తూ మంగళ వాయిద్యం
మోగిస్తున్నాయి ...

భర్తల కోల్పోయిన భార్యల నయనాలు ,పడమట వాలిన 
సూర్యునిలా,శోణిత మయమైనా, మనసు భగవన్నామ సంకీర్తనతో భవ్యమై,రామమందిర గోపురం నుండి 
విశ్వ కళ్యాణ కీర్తనలతో శ్రావ్యంగా, సున్నితంగా బాధా తప్త హృదయాలకు వినిపించి,తాకి ఊరడిస్తోంది !!

ఆధ్యాత్మిక భావనల,అభ్యాసానికి ఆత్మ గౌరవానికి
అలౌకిక ఆనందానికి అపారమైన పరాక్రమానికి
వినయానిక విరిసిన విరియై, అనంత శక్తికి అణువై
మానవత్వానికి మంచి గంధం పూసే అయోధ్య రామమందిరం!!

7
*
డా బల్లూరి ఉమాదేవి 
జిల్లా 
*
కర్నూలు 
ఫోన్ నెంబర్ 
*
9493846984
కవిత
*
రామమందిరం(అయోధ్య)

రాముడొస్తున్నాడు 
బాల రాముడొస్తున్నాడు
పుట్టి పెరిగిన అయోధ్య పురికి
సకుటుంబంగా వస్తున్నాడు
వేదమంత్రాలతో ప్రాణప్రతిష్టనుచేశారు
ఇండ్ల ముందు పందిళ్ళు వేద్దాం
కల్లాపి చల్లి ముగ్గులు వేద్దాం
ఆ ముగ్గుల్లో రంగులు నింపుదాం
బాజాభజంత్రీలు మ్రోగిద్దాం
కొత్త బట్టలు కట్టుకొందాం కోవెలకూ వెళదాము
అన్నీ మనకొసగిన స్వామికిపట్టాభిషేకం చేద్దాము
అంతదూరం మనం పోయినాచూడగలేము సంబరాలను
ఇంట్లో కూర్చొని దూరదర్శినిలోఅంతాచూద్దాం ఆనందిద్దాం
మనసా వాచా రాముని సేవలో తరిద్దాం
నాటి వైభవం చూడక పోయిన నేటి వైభవం తిలకిద్దాం
ఒకటేమాట ఒకటేబాణం ఒక్కభార్యయే ధర్మమని చాటాడ
ఆదర్శపురుషుడుగా నిలిచిన శ్రీరాముని బాటలో నడుద్దాం
రాముడే మరలి అయోధ్యకు వచ్చాడు
నవరస భరితం రాముని చరితంవిందాం చూద్దాం రారండీ
కనివిని ఎరుగని జనసందోహం విదేశీయుల ఆగమనం
కపులు భల్లూకాలురాబందులుకూడా వచ్చాయి
ధనుర్ధారిగా నిలిచాడు జగతికి ముదమును పంచాడు.

 8
*
మద్ది. పుల్లారావు
జిల్లా 
*
Ntr
ఫోన్ నెంబర్ 
*
9951287113
కవిత
*


నీలమేఘశ్యామ నినుపొగడ నా తరమ
కౌసల్యాతనయుడు కదలి వచ్చు దర్మం
దశరదనందనుండు దయామయుడతండూ
సోదర ప్రేమలోన యాదరణీయుడతడు
స్మితపూర్వబాషియు చిత్తనిగ్రహుడతడు
ధనుజ సంహారముతొ ధరణిని కాపాడెను
జనకుని మాట కొరకు కానలకేగినాడు
భరతుడభ్యర్దించ పాదుకలొసగినాడు
పాపచింతనయున్న వాలిని సంహరించి
సుగ్రీవు రక్షించె సుగుణాభిరాముడు
శబరి యెంగిలి తిన్న సహృదయమతనిది
ఉడుత భక్తికి పొంగి యుత్తమ గతులనిచ్చె
విభీషణుకభయముతొ..విశ్వమున పేరొందె
రావణుని చెరనున్న రాణిని విడిపించెను
రాజ్య ప్రజలందరికీ రాజె తండ్రియనుచు
కన్నబిడ్డలవలెనె.మిన్నగ పాలించెను
అల్పుని మాట కొరకు యాత్మయైన సీతను
కానలకంపినాడు కడుయాదర్శనీయుడు
శరణనిన రక్షించు పరమవీరుడతడు
హనుమనేలినవాడు..యాదర్శపురుషుడూ
దర్మమనంగ రాముడు దైవమనంగ రాముడె
 చిరకాల స్వప్నం నేను నెరవేరె
అయోద్య లో బాల రాముడు అపురూపంగా కొలువాయె
ఎన్నో బలిదానాలకు నేడు ఫలితమొచ్చు
భారతజాతి యావత్తు పరవశించి పోయె
...

: 9
*
పిన్నక నాగేశ్వరరావు.
జిల్లా 
*
హనుమకొండ. 
ఫోన్ నెంబర్ 
*
79890 77056
కవిత
*

కవితా గానం(సీజన్4). 23--1--2024.
పిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ. 
పుష్య మాసం కవితల పోటీకి...
శీర్షిక :-- గెలిచి నిలిచిన శ్రీరాముడు.

నాడు గుడిపైన మసీదు కట్టారని పోరాటం
మా దేవుడ్ని పూడ్చిపెట్టారని ఆరాటం
ఎప్పటినుంచో రగులుతున్న కాష్టం 
అప్పటి నుంచీ మండుతున్న కొలిమి
ఒక్కసారిగా భగ్గుమంది రెండు దశాబ్దాల క్రితం
కట్టడాన్ని కూల్చివేసిన కరసేవకులు 
తృప్తిగా శ్వాస పీల్చుకున్న నాయకులు
కోర్టులో దావా వేసిన వైరి వర్గం
వేసిన దావా మూసివేసే సరికి
పట్టిన కాలం ఇరువదేండ్లు పైన
అప్పుడు మొదలైంది రామాలయం కట్టటం 
సర్వ శోభితంగా తయారయింది నిర్మాణం
నాలుగు సంవత్సరాల కాలం పట్టింది
మూడు ఎకరాలలో మూడు అంతస్తులతో 
ఆధునిక దేవాలయం మౌలిక వసతులతో 
బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ 
కార్యక్రమం కన్నులపండుగ
అయోధ్యలో నిలబెట్టారు రామచంద్రుడిని
వందల సంవత్సరాల కల సాకారమయిందని 
దేశ ప్రజల ఆనందానికి అంతేలేదని
మొన్నటి ప్రారంభోత్సవం చాటి చెప్పింది.
**************************

10
*
గజవెళ్ళి శ్రీనివాసాచారి 
జిల్లా 
*
కాజీపేట హన్మకొండ జిల్లా 
ఫోన్ నెంబర్ 
*
9059438068
కవిత
*
అంశం: రామమందిరం(అయోధ్య)
శీర్షిక: దివ్య మందిరం
...
ఎవరూ ఊహించలేదు 
రామజన్మభూమి అయోధ్యలో 
రామమందిర నిర్మాణమౌతుందని 
ఐదు శతాబ్దాల స్వప్నం 
సాకారమవుతుందని

జగదభిరాముని జన్మస్థలంలో 
రామునికి ఆలయంలేని దుస్థితి;
రామభక్తుల సంకల్ప శక్తి 
ఎందరో కరసేవకుల త్యాగాలే
నేటి దివ్య, భవ్య మందిరము 

రామమందిరం గర్భగుడిలో 
అభిజిత్ లగ్నంలో 
వేదమంత్రాల ఉచ్చారణతో 
మంగళ వాయిద్యాల నడుమ
బాలరాముని ప్రాణప్రతిష్ట 
కనివిని ఎరుగని రీతిలో 
ఆవిష్కృతమైన మహోన్నత ఘట్టం

కోట్లాదిమంది భారతీయులు 
భక్తి తన్మయత్వంలో 
ప్రాణప్రతిష్టను తిలకించి 
జన్మ ధన్యమైనదని భావించగ 

రామాలయ నిర్మాణం 
నవ శకానికి శ్రీకారం

11
*
లలితా చండి
జిల్లా 
*
Hyderabad 
ఫోన్ నెంబర్ 
*
9885552922 
కవిత
*
కవితాగానం
 కవన జ్యోతి సీజన్ -4
అంశం రామ మందిరం 

  *శీర్షిక రామ మందిరం*    
 
మన దేవుడే, శ్రీరాముడు
సృష్టి కర్త అయినా
సత్య,ధర్మాలకు ప్రతిరూపమై చరించాడు
శతాబ్ధాల పోరాటం ఎట్టకేలకు జయ కేతనమై సింధూర వర్ణమై ఎగిరింది.
స్వాతంత్ర భారతాన డెబ్భైఏడేళ్లకు పుట్టిన గడ్డపై స్వపరిపాలనలో కుమ్ములాటల నడుమ చిట్టచివరకు బాలరాముడు నిలిచాడు...
అన్నదమ్ముల అనుబంధాలకు, భార్యాభర్తల అనురాగానికి, 
 పితృవాక్య పరిపాలనకు ఆదర్శం
  
రాక్షస సంహారం చేసినా ముష్కర  
 మూకల తిప్పలు తగ్గలేదు నేటికి.
రామరాజ్యమే యుగాలచరిత్రకు పునాది 
తరతరాల సంస్కృతికి అనాది 
ముగిసిన శతాబ్ధాల లక్షల బలిదానాల పర్వం
స్వపరిపాలనలో సైతం వేల కరసేవకుల సజీవ సమాధి ప్రాణత్యాగాలుమూకుమ్మడిగా ఒక్కటై ప్రకాశంమై ప్రజ్వరిల్లింది.  
అడుగంటిన ఆశకు ప్రత్యూషమై
సనాతన ధర్మానికి పట్టాభిషేకం చేసింది.
ప్రతి ఇంటా వెలిగినదీపాలు ఆలయ దీపాలై ధైర్యానికి పునాదిగా పంచభూతాల సాక్షిగా ప్రతి భారతీయుని ఆశయంగా నిలిచిన
అయోధ్య రామ మందిరం

Comments

Popular posts from this blog

సింధూరం 07052025

****************** సింధూరం దిద్దిన వారు  1.వీరా గుడిపల్లి 2.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, 3.గొర్రెపాటి శ్రీను  4.దోసపాటి వేంకట రామచంద్రరావు  5.అపరాజిత్ 6.వేమూరి సత్యవతి  7.జ్యోతి  8.మండ నాగేశ్వరరావు  9.గడ్డం కృష్ణారెడ్డి.రేపాల.సూర్యాపేట 10.కవిత వెంకటేశ్వర్లు  11.ఆర్ వి వి రాజా  12. శ్రీ కోరాడ నరసింహారావు గారు  13. శ్రీ ఉదయగిరి మధుమోహన్ గారు  14. శ్రీమతి బల్లూరి ఉమాదేవి గారు  15. శ్రీమతి తోట సులోచన గారు  16. శ్రీ జి సూర్యనారాయణ గారు  17. శ్రీ గజవెల్లి శ్రీనివాస చారి గారు  18. శ్రీ వనపర్తి గంగాధర్ గారు  19. శ్రీమతి వాణి సరోజిని లక్కరాజు గారు  20. శ్రీమతి సింహాద్రి వాణి గారు 21. శ్రీ ఆచార్య అయ్యల సోమయాజులు ప్రసాద్ గారు  22. 23.శ్రీమతి నెల్లూరు వేంకటలక్ష్మి గారు 24.శ్రీ ఏడెల్లి రాములు గారు  25. శ్రీమతి డాక్టర్ తంగిరాల నాగలక్ష్మి గారు  26. శ్రీ కూని అంకబాబు గారు  27. శ్రీ తిన్నాక నాగేశ్వరరావు గారు  28. శ్రీమతి లలితా చంటి గారు  29. శ్రీ పిల్ల వెంకటరమణ మూర్తి గారు  30. ...

season 6 వైశాఖ పూర్ణిమ

కవనజ్యోతి,కవితాగానం సీజన్ 6  వైశాఖ పౌర్ణమి నగదు పోటీలు   పోటీకి కవితలు పంపించిన కవి వరుల జాబితా  1. శ్రీ పిళ్ళావెంకటరమణ మూర్తి గారు  2. శ్రీ సంగీతం సంతోష్ కుమార్ గారు ji 3. శ్రీ జి సూర్యనారాయణ గారు  4.శ్రీ మండ నాగేశ్వరరావు గారు 5.శ్రీమతి కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  6.శ్రీమతి నెల్లూరు వెంకటలక్ష్మి గారు 7.శ్రీ అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 8..శ్రీ కోరాడ నరసింహ రావు గారు  9.శ్రీమతి డాక్టర్ భమిడిమర్రి కమలాదేవి గారు 10.శ్రీ కాసుల ధీరజ్ శర్మ గారు  11.శ్రీ కూని అంకబాబు గారు 12.శ్రీ మతి డా.వేమూరి సత్యవతి గారు  13.శ్రీమతి డా.బల్లూరి ఉమాదేవి గారు 14.శ్రీ.దోసపాటి వేంకట రామచంద్రరావు గారు 15.శ్రీ అపరాజిత రెడ్డి గారు  16. శ్రీ ఏడెల్లి రాములు గారు  17.శ్రీ డాక్టర్ ఆళ్ళ నాగేశ్వరరావు గారు  18. శ్రీ కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  19. శ్రీ మద్ది పుల్లారావు గారు  20.శ్రీమతి సింహాద్రి వాణి గారు  21. శ్రీ డా.దీపక్ న్యాతి గారు  22. శ్రీ ఆర్.వి.వి.రాజా గారు  23.శ్రీమతి వాణీ సరోజినీ లక్కరాజు గారు...

వీడ్కోలు ఆషాఢమాసం పౌర్ణమి

అంశం: వీడ్కోలు  సందర్భం: ఆషాఢమాసం పౌర్ణమి  నిర్వహణ:  వీరా గుడిపల్లి లలితాకృష్ణ  ################## కవివరుల జాబితా  1.పిళ్ళా వెంకట రమణమూర్తి గారు  2. జి.సూర్యనారాయణ గారు  3.మండ నాగేశ్వరరావు గారు  4.డా‌.బల్లూరి ఉమాదేవి గారు  5. డా.కమలాదేవి గారు  6.గొర్రెపాటి శ్రీను గారు  7.వేమూరి సత్యవతి గారు  8.కూని అంకబాబు గారు  9.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  10.కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  11.తోట సులోచన గారు  12.వాణిసరోజిని లక్కరాజు గారు  13. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు  14.అపరాజిత రెడ్డి గారు 15.లలితాచండి గారు 16. నెల్లూరు వెంకటలక్ష్మి గారు  17.కమలశ్రీ గారు  18.రాధిక గారు 19.చంద్రమౌళి గారు  20.శ్రీకాంత్ గారు  21.సింగీతం సంతోష్ కుమార్ గారు  22.. దారల విజయ కుమారి గారు  23.ఎన్.నరేశ్ చారి గారు  24. పిన్నక నాగేశ్వరరావు గారు  25.సింహాద్రి వాణి గారు  26.ఏడెల్లి రాములు గారు  27.కొంజేటి రాధిక గారు  ++++++++++++++++++++++++++++++++ ఆషాడ మ...