Skip to main content

పరీక్షా సమయం

అంశం: పరీక్షా సమయం
నిర్వహణ: శివునూరి లలితాకృష్ణ
**********
కవివరుల జాబితా

1. శ్రీ అపరాజిత్ రెడ్డి గారు 

2. శ్రీ వి.వీరాచారి గారు
 
3. శ్రీ మండ నాగేశ్వర్రావు గారు 

4. శ్రీ మద్ది పుల్లారావు గారు 

5. శ్రీమతి కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు 

6.శ్రీ.దామర్ల నాగేశ్వరరావు గారు 

7.శ్రీమతి లలితా చండి గార

8. శ్రీ కోరాడ నరసింహారావు గారు

9. శ్రీ ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 

10. శ్రీ తిప్పావఝల నరసింహ మూర్తి గారు

11. శ్రీ కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు

12. శ్రీ పిన్నక నాగేశ్వరరావు గారు

13. శ్రీ మతి తోట సులోచన గారు

15.శ్రీమతి నెల్లూరి వెంకట లక్ష్మి గారు 

16. శ్రీ.పిళ్ళా వెంకట రమణ మూర్తి గారు 

17.తాతపూడి సోమ శేఖర శర్మ గారు

18. శ్రీ పలుగుల సతీష్ కుమార్ గారు

19.శ్రీ మతి వాణి సరోజిని లక్కరాజు గారు 

20.శ్రీ ముడుంబ తిరువేంకటాచార్యులు గారు 

21.

22.శ్రీ మతి మొహమ్మద్ అఫ్సర వలీషా గారు

23.శ్రీ మతి కొంజేటి రాధిక గారు 

24.శ్రీ మతి సింహాద్రి వాణి


25.శ్రీ మతి డాక్టర్ భమిడిమఱ్రి కమలాదేవి గారు

26.శ్రీ మధు అమరగాని గారు

27.శ్రీమతి డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు

28. శ్రీ మతి వేమూరి సత్యవతి గారు
**********************
1
అంశం : పరీక్షా సమయం
శీర్షిక : యవ్వనపు పొంగు---పరీక్షా సమయం,,,,,!
పేరు : అపరాజిత్ రెడ్డి
ఊరు : సూర్యాపేట
ఫోన్ నంబర్ : 9848532031

యుక్తవయస్సు పిల్లలు
తల్లిదండ్రుల ఆధిపత్యం భరించలేక
ఇటు సమాజంతో రాజీపడలేక
ఎంత కృషి చేసినా చదువులలో పోటీ తత్వంతో తట్టుకోలేక
తీవ్ర సంఘర్షణకు లోనై
తల్లిదండ్రుల చిన్న మందలింపులకే
ఆవేశ కావేశాలకు లోనవుతూ విరుచుకుపడతారు
తల్లిదండ్రులు తమ పిల్లల మనోగతం తెలుసుకోవాలి
ఉపాద్యాయులు సున్నితంగా వ్యవహరించి నెమ్మది నెమ్మదిగా వాళ్ళలో మార్పు తీసుకురావాలి
లేదంటే సైకాజిస్ట్ లచే కౌన్సెలింగ్ కొద్దిరోజులు ఇప్పించాలి
లేకపోతే సంఘ విద్రోహులయ్యే ఆస్కారం పొంచివుంది
చిన్న చిన్న విషయాలకే విసుక్కోవడం
ఈ చదువులు తల్లిదండ్రులు గుదిబండలని
అందరితో కలువలేక ఒంటరియవుతారు
ఈ జీవిత పోరాటం ఒక్కరోజుతో అయిపోయేది కాదని
మీ ముందు నిండు నూరేళ్ళ జీవితం ఉందని
కలలు కన్న స్వప్నాలను నిజం చేసుకోవడంలో అపజయాలు మనకు పాఠాలు మాత్రమే
కృంగిపోకుండా పడిలేచే కడలి తరంగాల్లా ఎగిసి పడుతూ
విజయాలు చేజిక్కించుకుని భవిష్యత్తు మార్గం సుగమం చేసుకోవాలి
ఇష్టమనుకో కష్టమనుకో నీ విద్యుక్త ధర్మం నీవే నిర్వర్తిస్తావు వేరెవరూ కాదు కదా
ఎప్పుడైనా నీకు బాగా నచ్చిన సులువైన మార్గమే ఎంచుకో
జీవితం అందమైన పూలతోటగా తీర్చిదిద్దుకునేందుకు ఒంటరిగా కాకుండా జనంలో మమేకమవ్వాలి
లౌక్యం తెలియాలి
ఇలా వివరించి నెమ్మది నెమ్మదిగా యుక్తవయస్సు పిల్లలకు మార్గ నిర్దేశం చేయాలి !

అపరాజిత్
హామీపత్రం : ఈ కవిత నా కలం సేత అని నా హామీ
2
వి .వీరాచారి, కవి రత్న, దాశరధి పురస్కార గ్రహీత., విశ్రాంతAE
జిల్లా 

Siddipet
వనపర్తి టౌన్, వనపర్తి జిల్లా, తెలంగాణpin.509103cell.
8897182796
కవిత

పరీక్షాసమయం 👌
అంశం .....పరీక్షా సమయం
సంవత్సరమ్మంత కష్టపడి ,ఇష్టపడి,
బాగుగా చదువొచ్చు ,కాని విద్యార్థీ!
నిర్ణీత సమయముకు, పరీక్షల స్థలికి
చేరక పోతివా లాభమేముంది?
3
 
అంశం:పరీక్షా సమయం!


పరీక్షా సమయం!!
============

ఐదేళ్ల కోసారి మనభవితను
దిద్దుకునే పరిక్షా సమయమిది!!
ప్రతిపౌరుని కర్తవ్యం గుర్తుచేసుకుని
పంచుకునే విలువైన విషయమిది!!ప్రతిమనిషికీ ఎదో సమయంలో
ఎదురయ్యే సామాన్య కారణం!!
సమయస్పూర్తీ సంయమనంతో
ఎదుర్కోవాలి ఆపరిక్షాసమయం!!విద్యార్థులకు కూడా తన ప్రతిభను
ప్రదర్శించే విలువైనసమయం!!
ప్రేమైనా పెళ్ళైనా గెలిచేవరకూ
ప్రతి క్షణమూ పరిక్షాసమయమే!!కర్షకుడైనా కార్మికుడైనా
సామాన్యుడైనా సైనికుడైనా
తప్పదు వీరికి పరిక్షాసమయం
ఎదురీదాలి ప్రతిక్షణమూ !!దేవుడికైనా దీనుడికైనాతప్పదులే
ఎవరైనా కాలం మాత్రం ఒప్పదులే
పేదోడైనా పెద్దోడైనా గమనం ఒకటే
గమ్యంచేరే మార్గం ఒకటే..!!ప్రతిజీవికీ ఓపరీక్షాసమయం పొంచి ఉంటుంది...
అది దాటి విజయతీరాన్ని చేరితేనే
జీవితం సాఫల్యం అవుతుంది!!
నాయకులకు ఎన్నికలొక పరిక్షా సమయం! రైతన్నలకు అదునికి పదును లేకుంటే పరిక్షా సమయమే..!!
తల్లికి మాత్రం ప్రసవం ఒక పరిక్షాసమయం !!రక్తం పీల్చే జలగల ఏలుబడిలో జనులకు నిత్యం పరీక్షా సమయమే!!
ప్రతినిత్యం బడుగుజీవులకు బ్రతుకే
ఒక పరీక్షాసమరం!!! విజ్ఞతతో పరిక్షా సమయాన్నెదుర్కొని విజయాన్నందుకోవడమే మనుగడ..!!!

-----మండ.నాగేశ్వర్రావు.✒️
4
*
మద్ది. పుల్లారావు
జిల్లా 


విద్యావ్యవస్థలో. విలువైనది పరీక్ష
కష్టపడి చదివినది ఘనపరచు పరీక్ష
జ్ఞాపకశక్తినివే మాపనము జేయునూ
తెలివితేటల ను తేటతెల్లముజేయును
పోటీ తత్వము పెంచి పూర్తి సామర్థ్యమును
వెలుగు లోనికి దెచ్చు విజయ తీరాలు జేర్చు
లక్ష్యసాధన చేసి మెట్టు పైకెక్కించు
జీవితాలను మార్చు జేజేలు కొట్టించు
ఉన్నతిని గల్పించి యుత్తములను జేయును
అంచనాలకందక.అనుకున్నది జరగక
నిరుత్సాహ పడెదరు నీరసపడుచుందురు
లక్ష్యసాధన లోన రాగలవు సమస్యలు
మొక్కవోని ధైర్యము చక్కని ప్రణాళికలు
విజయ సోపానాలు నిజమని తెలుసుకొండి
అపజయాలకు వెరచి యాత్మవిశ్వాసమును
కోల్పోవద్దెన్నడు ఘోరములు చేయకుడు
పరీక్షలు తప్పినను ప్రమాదము లేదండి
కష్టించుటే మన పని కలలు కనవద్దండి
ఫలితమేదైననూ ప్రారబ్ధమనుకోండి
అంతా మన మంచికే హాయిగా బ్రతకండి
విశాలమగు విశ్వము వేలకొలది జనులకు
అవకాశాలనిచ్చి యాదరించుచుండును
పరీక్షలు ప్రధానమె బ్రతుకవే కాదండి
గురువుల సలహాలే గుండె నిబ్బరమిచ్చు
జీవితము మధురమది జీవించి చూపండి
5
అంశం =పరీక్షలు
శీర్షిక =
బాబోయ్ పరీక్షలు 
రచన కొలకలూరి దేవికారాణి రత్నాకర్ తెనాలి
- ****************************************
నాన్ డి టెన్షన్ రహదారిలో
బ్రహ్మానందంగా బ్రహ్మానందరెడ్డి పాస్ అయిపోయిన విద్యార్థులకు
ఒక్కసారిగా కొండచిలువై చుట్టుకున్న కామన్ ఎగ్జామ్స్ పెనుభూతం
ప్రశ్నాపత్రం జవాబు పత్రం ముందుగానే తెలిసి పోయే రోజులు
చదువుకోటానికా... స్లిప్పులు చింపుకోటానికా...
ఆర్టీఈ చట్టంతో ఉపాధ్యాయుని ప్రాధాన్యత జీరో...

ఉపాధ్యాయుణ్ణి బఫూన్ లా చూసే విద్యార్థి హీరో?!

అర్జునుడి లాంటి విద్యార్థులు కరువు
సిన్సియర్గా చదివే విద్యార్థికి పాఠాల బరువు

చదువుకుందామని కూర్చుంటే ముంచుకొచ్చే నిద్ర
చదవడం రాయడం కూడా రాని విద్యార్థుల మౌనముద్ర

పరీక్షల నిర్వహణలో ఇన్విజిలేటర్ అడకత్తెరలో పోక చెక్క
నిక్కచ్చిగా ఉంటే కుదురుతుంది తిక్క

స్ట్రిక్ట్ గా ఉంటే విద్యార్థుల రౌద్రం
కాపీలు కొట్టించితే ఉపాధ్యాయ ప్రవృత్తికది క్షుద్రం

సంవత్సరం అంతా సరదాగా గడిపేసి పరీక్షల ముందు నైట్ అవుట్లు

పరీక్ష హాల్లో రాయలేక కూరుపు పాట్లు
చదువెంత ఉన్నా రసజ్ఞత ఉండాలి అంటాడు తెలుగు మాస్టర్
ఎంత తెలివి ఉన్న బట్టీ కొట్టి రాయక పోతే చిరిగిపోతుంది వాడి పోస్టర్

పరీక్ష తప్పితే మళ్ళీ రాసుకోవచ్చు
జీవిత పరీక్షలో నెగ్గి చూపించరా కన్నా
లేరు తోపులు నీకన్నా
6
పేరు 
*
Nageswara Rao Damarla
జిల్లా 
*
Sangareddy
కవిత
*
  దామర్ల నాగేశ్వరరావు 9908568099.
---------*****--------------*****-------
ఫాల్గుణ మాసం పౌర్ణమి కవితల పోటీ,కావున జ్యోతి సమూహం
నిర్వ హిస్తున్న పౌర్ణమి కవితలపోటీ
*****************************
అంశము-*పరీక్షా సమయం*. 
శీర్షిక -ఇంటర్మీడియట్ పరీక్షలు
               ప్రారంభం.
రచయిత -దామర్ల నాగేశ్వరరావు
హైదరాబాద్, 502032.
+++++++++++++++++++++++
మార్చి మాసం వచ్చింది,
పరీక్షలు ఆసన్న మైనాయి,
తెల్లవార్లు మేల్కొని చదువ వద్దు,
పునః సమీక్ష మాత్రమే చేయాలి,
తెల్లవారి జామున మరల పునః
సమీక్ష చేయాలీ,ఉదయం స్నానాంతరం భగవంతుని ప్రార్ధించాలి,హాల్ టికెట్ మరువవద్దు
రెండు పెన్నులు జేబులో నుంచుకొని
టిఫిన్ తిని, అమ్మ దీవెనలు పొంది
నీ పరీక్షా హాల్ వద్దకు అర్ధ గంట
ముందు చేరాలి.
        సమాధానపత్రమును జాగ్రత్తగా పూర్తిచేయాలి.హాల్ టిక్కెట్ చూసి నీ పరీక్షా నెంబరును
పెద్ద అంకెలతో తప్పులు,దిద్దుళ్ళు
లేకుండా వేయాలి.
    పరీక్షా పత్రం పై నీ నెంబరును
వేసి ఎటువంటి భయము లేకుండా
ఆత్మ విశ్వాసం తో సమాధానాలు
వ్రాయాలి.
      బాగుగా తెలిసిన ప్రశ్నలకు
సమాధానములు వ్రాయాలి.తెలియని వాటి గురించి
ఆలోచించి కాలము వ్యర్ధం చేయవద్దు.ఎట్టి గాభరా పడవద్దు.in
పిరికి తనం మనిషి మనస్సు ను
ఆటంకం పరచును.
ఆత్మ విశ్వాసమే విజయానికి నాంది.
హామి-ఇది నా స్వీయరచన.దేనికి
అనుకరణ కాదు.మరియే ఇతర
మాధ్యమాలకు పంపించ లేదు,
పంపించను..ఇది నాహామి.
*****************************
7
*అంశము--పరీక్షసమయం*
*శీర్షిక --- జీవితం* 

సమయం సందర్భం లేకుండా జీవితం పెట్టే పరీక్షలెన్నో,అనుక్షణం
ఎదురైయ్యే ప్రతి సంఘర్షణ  
గెలుపు ఓటమిల సయ్యాటే

పాఠాలే చెప్పని పాఠాశాలలో 
రాసే పరీక్షలు ఎన్నో 
కనిపించని పుస్తకంలో 
ఖాళీ ప్రశ్నా పత్రాలూ ఎన్నో 

కాలం పరుగెడుతూ నడిపిస్తుందో,
నడిపిస్తూ పరిగెడుతోందో, అందుకునేమో శిక్షణా తరగతులలో పరీక్షలెన్నో...
అభ్యాసం కోసమే బాల్యంలోనే ఆరంభం
 
అవనిజకే తప్పలేదు అగ్నిపరీక్ష  
హరిశ్చంద్రుడు కాటికాపరి అయినా,
ధర్మజుడు రాజ్యమే ఓడినా బడి మడిలో పెరిగే మొక్కలకూ, తోటమాలికి, తప్పదు ఋతువులతో కత్తి మీద సాము. 

బ్రతుకు తెరువు చదువులకు
శ్రేణులే తీర్మానాలు
ఎవరి అనుమతి సంబంధం 
లేని పరీక్షలకు 
లేవు సమయా సమయాలు‍.
ఎప్పటిక ప్పుడు రాసే 
ప్రతి పత్రం అవగాహనికి కొలమానం 
భవిష్యత్తు జీవన సాఫల్యానికి సోపానం

లలితాచండి
రచయిత్రి/న్యాయవాది
8
కవితాగానంపౌర్ణమికవితలపోటి..! 
  అంశ0 :- పరీక్షా సమయం..! 
     కోరాడ నరసింహా రావు . 
      " ఉత్కంఠ భరిత0 ...! "
             ***********
ఇచ్చిన అవకాశాన్ని... 
  చక్కగా సద్విని యోగం చేసుకున్న వారికి... 
  ఉద్వేగమా... ఆందోలనా... 
 భయమా...! 
     సర్వ సన్నద్దతతో... 
  సిద్ద0గా ఉన్న వారికి... 
 ఉత్సాహం తప్ప... 
 ఇవేవీ ఉండవు కదా...!! 

విద్యార్ధుల కైతే.... ఏటికీ ఏడూ
 పరీక్షా సమయమే..! 
  అనుకున్నది సాధించి... 
   ఆర్ధిక స్థిరత్వం కుదిరేవరకూ
   వారికి తప్పదీ ఉత్కంఠ...! 

అదే... పాల కుల కైతే..., 
  ఐదేళ్ల కో మారు అగ్ని పరీక్షే !! 
  అధికారం కోసం... 
  అనేకవాగ్దానాలు...! 
  అవి నెర వేర్చ టానికి... 
   పడరాని పాట్లు...! 
 ఎత్తులు... పై ఎత్తులు... 
  మేజిక్కులు... జి మ్మిక్కులు
 ప్రలోభాలు.. తాయిలాలు..! 
 ఎన్నిచేసినా... పరీక్షాసమయం
    ఉత్కంఠ భరితమే...!! 

మనలో .. నిజాయతీ ఉంటే... 
 మన0 చేసే పని నిష్కల్మష మైతే.., 
     మనకెందుకు ప్రతి కూలాలొ స్తాయ్..! 
  అన్ని సాను కూలాలే.... 
 ఆనంద దాయకాలే...!! 

శీత నిప్పు లాంటిది కాబట్టే... 
 అగ్ని పరీక్షలో... 
  గెలిచి నిలిచింది...! 

పరీక్షా సమయ మంటే... 
 నీతిని నిలబెట్టటం..! 
 నిజాయ తీకి పట్ట0 కట్టటం !! 
 నిగ్గు తేల్చట0 ...!!! 

ఆయా పరీక్ష లలో... 
   నెగ్గిన వారే ఘనులు...! 
మోసగించి... మాయ చేసి... 
 అక్రమ మార్గం లో... 
 అందల మెక్కినా... 
  అధర్మ0...అన్యాయం... 
  గెలిచేది ...నిలిచేది కొన్నాల్లే
 అంతిమ విజయ0 ధర్మానిదే
 నీతి - న్యాయాలదే...!! 
 ధర్మో రక్షతి రక్షితః...! 
  సత్య మేవ జయతే...!! 
      ******************
9
కవనజ్యోతి (కవితాగానం సీజన్ 4) ఫాల్గుణ మాస పౌర్ణమి కవితల పోటీకి
తేది:-18-03-24.
పేరు:-
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
ఊరు:-విశాఖపట్నం
చరవాణి:-996326576.అంశం:-పరీక్షా సమయం.
శీర్షిక:-
జీవితమే ఒక పరీక్ష
...............................
ప్రసవవేదన పడి
పునర్జన్మ నెత్తి
పండంటి పసిబిడ్డకు జన్మనిచ్చి
పొత్తిళ్లలో పెట్టుకు
పరవశించే మాతృమూర్తి కి
ప్రసవం ఒక పరీక్షా సమయం. !!

పుట్టిన శిశువుకు
ప్రేమానురాగాలను పంచి
పెద్దవాడవుతున్న సమయాన
నైతికవిలువలు కలిగి 
చదువుతో బాటు సంస్కారవంతుడయ్యే వరకు
తల్లిదండ్రులకు పరీక్షా సమయమే..!!

ఉన్నత చదువులు చదివినా
సరిఅయిన ఉద్యోగం వచ్చే వరకు
ఉద్యోగం వచ్చి జీవనయానంలో
మనసున మనసై బ్రతుకున బ్రతుకై అన్నట్లు
సరి అయిన జీవిత భాగస్వామి లభించే వరకు పరీక్షా సమయం..!
 
పరమాత్ముడు ప్రసాదించిన
ఉత్క్రుష్ట మానవ జన్మకు
సార్ధకత చేకూరుతుందో లేదో ననే భయం
వార్ధక్యంలో అనురాగ ఆప్యాయతలు చూపే 
కన్నపిల్లలు లభించి
ఆరోగ్యంగా' శతమానం భవతిగా' జీవించి
సునాయాసేన మరణం పొందిన మానవుని జీవితం
కంచి పరమాచార్య చెప్పినట్లు సార్ధకతచెందు
అందుకే జీవితమే ఒక పరీక్ష.
స్థితప్రజ్ఞతకు దర్పణంలా భగవద్గీతలో
శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు నడచిన మానవుని జీవితం వసుదైకానికే ఆదర్శం..!!
............................
ఇది కవితాగానం సీజన్ 4
ఫాల్గుణ మాస కవితల పోటీకొరకు వ్రాసిన నా స్వీయరచన
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
  (పుష్యమి)
విశాఖపట్నం
9963265762.
.......................
10
కవితా గానం సీజన్ 4
ఫాల్గుణ మాసం పౌర్ణమి కవితలపోటీ
అంశం: పరీక్షా సమయం.
శీర్షిక:ఎవరికి పరీక్షా సమయం?

రేయింబవళ్ళు కష్టపడతాడు మనిషి తగిన ఫలితాన్ని పొందేందుకు.
ఫలితాన్ని పొందేందుకు ముందుకాలం ఎవరికైనా పరీక్షాసమయమే.
.చెమటోడ్చిపండించిన పంట నూర్పిడికాలం రైతుకు పరీక్షాసమయం
విద్యార్థులకు పరీక్షల కాలనిర్ణయం ప్రకటించినప్పటినుండి పూర్తయ్యేవరకూ పరీక్షా సమయమే.
దీక్షతో చదివి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపాలనకొనే విద్యార్థులకు నిజమైన పరీక్షా సమయం.
కాపీలుకొట్టి పాస్ కావచ్చులేఅనే ధీమాతో వుండే తిరుగుబోతు విద్యా ర్ధులకూ అసలు పరీక్షా సమయం.
ఫలితాలు రాకపోతే ఇంక్రిమెంట్ లలో కోతవిధిస్తారని భయపడే ఉపాధ్యాయ వర్గానికి నిజంగా పరీక్ష సమయం.
పాఠశాల ఫలితాలు తక్కువైతే నలుగురిముందు తలదించుకోవాలనుకొనే ప్రధానోపాధ్యాయులకూ పరీక్షా సమయం.
తల్లిదండ్రులకు అసలు సిసలైన పరీక్షా సమయం.
కాపీలుకొట్టిపాసయ్యేచీడపురుగులనుఏరిపారేద్దామనుకొనే అధికారులకు నిజమైన పరీక్షా సమయం.
ఆత్మగౌరవంతో అమ్ముడు పోకుండా 
సక్రమంగా పరీక్షావిధులు నిర్వర్తించాలనుకొనే ఉపాధ్యాయులకు 
అసలు సిసలైన పరీక్షా సమయం.
స్వార్థంతో ఫలితాలకై ఏ అకృత్యాలకైనా పాల్పడే కార్పొరేట్ యాజమాన్యలకు పరీక్షా సమయం.
ఫలితాలు తగ్గితే ఉన్న ఉద్యోగాలు ఊడతాయని భయపడే ఉప్పందపు ఉద్యోగులకు కాదా పరీక్షా సమయం?
ప్రణాళికా బద్దంగా పరీక్షా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే విద్యార్థులుచేరెచ్చు గెలుపు లక్ష్యం.

తిప్పావఝల నరసింహమూర్తి

బుచ్చిరెడ్డి పాళెం.నెల్లూరుజిల్లా
11
ఫాల్గుణమాసం పౌర్ణమి కవితల పోటీ 
కవనజ్యోతి సమూహం పక్షాన కవితాగానం నిర్వహిస్తున్న పౌర్ణమి కవితల పోటీ,నగదు బహుమతుల పురస్కారం కోరకు వ్రాసిన కవిత 
 అంశం ::: పరీక్షా సమయం
శీర్షిక ::::::: పాపం పసి హృదయాలు 
అందాల్సిన తేదీ ::' 21/03/2024
స్వీయ రచన కేశరాజు వేంకట ప్రభాకర్ రావు పాతర్లపాడు ఖమ్మం. ‌... 6281697982



గడిచిన సంవత్సరం పరీక్ష పెడుతోందిపుడు 
గడించిన విద్యాధనమెంతో గుణించటానికి!
గుడిసెలో వాసులైనా గడీ నివాసులైనా,
గడగడలాడించి ఘనులెవరో చూపటానికి!!

విద్యార్థులు దివారాత్రులకు సవాలు విసిరి
సవాలక్ష ప్రశ్నలకు జవాబులు కొసిరి 
నవాబుల్లా వెళ్తున్నా, పరీక్ష అనేసరికి,అధైర్యం ముసిరి
చివాలున లేచిన చిరు చెమటలకు, వళ్ళంతా కసరి !!

అన్నపానీయాలు సహించక దేహం ఎడారిలా 
వెన్నెల కాస్తున్నా వేడి గాలులు తోస్తుంటే
వెన్నులో వణుకు పెనుగాలికి ఊగుతున్న చెట్టులా 
కన్నులు, కుంగిన సూర్యునిలా కాంతి విహీనమై!!

పాపం పసి హృదయాలు ! భరించలేని వేసవి,
తాపం తాట తీస్తున్నా, తప్పని తంతు 
శాపం ఇదే సుమా, మానవ జీవితాలకు,
లోపం ఇదే అయినా భరించక తప్పదు ఎవరికైనా!!

సమయం సరసరా సాగిపోతుంది
సమయపాలనలో గేటు మూత పడుతుంది, 
సలసల కాగుతుంది,అన్నీ సమకూర్చుకునేసరికి రక్తం
ఎలా తట్టుకోవాలో దీనిని తెలియని బాల్యం!!

కాలం విసిరే కరకు కటారుల కాఠిన్యంలో
కలవర పడి కూలబడి పోయేదెందరో!
వాలంపై కూర్చుని ,ఘనతచాటిన వాయుపుత్రుడిలా
ఇలా తలంపై అనంతకాలం కీర్తింపబడేదెందరో 
ఈ పరీక్షా సమయాన్ని పదిలంగా వాడుకుని !!


ఇది నా స్వీయ రచన
12
కవితా గానం(సీజన్4). 21--3--2024.
పిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ. 
ఫాల్గుణ మాసం పౌర్ణమి కవితల పోటీకి....
అంశము :-- పరీక్షా సమయము.
శీర్షిక :-- విద్యార్థుల పరీక్షలు.

1.తే.గీ.
తరగతుల యందున గత వత్సరమునందు
చదివిన చదువుకు పరీక్ష మొదలు కాగ
రాత్రి పవలును వాని స్ఫురణకు తెచ్చు
కొనగ విద్యార్థులు చదువుకొనుచు నుంద్రు.

2.తే.గీ.
పదియవ తరగతి పరీక్ష వ్రాయు వారి
కీ పరీక్షలు ముఖ్యమౌ నిపుడు, వారు
జాగరూకతతో పరీక్షలను వ్రాయ
వలయు కేంద్రము లందున భయము లేక.

3.తే.గీ.
క్షుణ్ణముగ ప్రశ్న పత్రమున్ జూసి మొదట
బాగ తెలిసిన వాటి జవాబులన్ని 
వ్రాసి ముందుగా, మిగిలిన వాటి కొఱకు
సమయమును బట్టి యత్నించి జ్ఞప్తిగొనుచు
వ్రాయవలె సాధ్యమైన జవాబులన్ని.

4.తే.గీ.
ఒత్తిడిని దూరముగ బెట్టి యోచనలను
లగ్నమున్ జేసి చదువుపై, వ్రాయగాను
స్వేచ్ఛగ పరీక్ష కేంద్రాన బెరుకు లేక
మనసు నటునిటు పోనీక మసల వలయు.

5.తే.గీ.
రేపు జరుగబోవు పరీక్ష లేవి యనుచు
నేటి రాత్రికి యొకపరి వాటి లోని
పాఠముల పునశ్చరణము జరుపుచుండి
పెందలకడనే నిద్దుర నొంద వలయు.

6.తే.గీ.
నిద్ర చాలినంతగ పోవ నేడు, రేపు
జ్ఞప్తి వచ్చి జవాబులు సమయమునకు
దీక్షగా వ్రాయగాను పరీక్ష లన్ని
అన్ని విషయాల నుత్తీర్ణు లగుదు రంత.
**************************************
13
కవితా గానం సీజన్ -4
 ఫాల్గుణ మాసం పౌర్ణమి కవితల పోటి
తోట సులోచన
నెల్లూరు
చరవాణి 9490173053
అంశం పరీక్షా సమయం
శీర్షిక కృషితో నాస్తి దుర్భిక్షం

అవును. పరీక్షా సమయం వచ్చేసింది 
ఏడాది కృషిని,శ్రమ నావిష్కరించే దర్పణమిది 
పరీక్ష ప్రతిభ, పట్టుదల, దీక్షలకు సంకేతమే 
పరిక్షా సమయమపుడే రాత్రింబవళ్ళు
శ్రమపడితే ప్రయోజనానికి ఫలముంటుందా?
విద్యార్థులకే పరీక్షా సమయమా కానే కాదు

రాజకీయనాయకుల కెన్నికలు పరీక్షా సమయమే 
భవిష్యత్తు ప్రణాళికలతో గెలుపు కోసం
కష్టించే వారికి నిత్యం పరీక్షా వేళలే 
"కృషితో నాస్తి దుర్భిక్షం "పట్టుదల పూనితే
కానిదేముంది. సమున్నత ఆశయాలతో
సమగ్ర వ్యూహాలు రచించి పోరాట పటిమతో
సాగిపోయేవారికి విజయలక్మి తనంతట
తాను వరించదా 

పరీక్షా సమయ మాసన్నమైనపుడు
అణువణువున యుత్తేజాన్ని నింపుకుని
అకుంఠిత దీక్షతో, మొక్కవోని దైర్యంతో
సమర సింహంలా సత్తా చూపడమే
ఇసుమింతైనా ప్రయత్నలోపం లేక
అపర భగీరధునిలా సహనమిత్రుని
తోడ్పాటుతో సాగరంలోని కెరటాల్లా
క్రిందపడినా పైపైకి లేవడమే

మన భవిత మన చేతుల్లోనేనని
దృఢమైన విశ్వాసంతో కాలంతో పాటు
పరుగులు తీయడమే, భారాన్ని
భగవంతునిపై వేయడమే మరి

హామీ పత్రం
ఈ కవిత నా స్వంతమనియు, యీ పోటీకోసమే
వ్రాసినదని హామీ యిచ్చు చున్నాను.
14
*
డా.వేమూరి.సత్యవతి.
జిల్లా 
*
కృష్ణా జిల్లా 
కవిత
*
శీర్షిక- పరీక్షాఫలితం!

ఇన్నాళ్ళ జీవితం, ఎన్నెన్నో అందచందాలు, నేర్పరితనాలు,
ఇంకొకరి మెప్పు కోసం ఆతృతగా ఎదురు చూసేవేళ....
ఎన్నెన్నో ఆకాంక్షలకి, ఆరాటాలకి సానుకూల వర్తమానంగా..
జీవితపు మలుపైన సంబంధం కుదరటమే పరీక్షాఫలితం!!
పరీక్షా సమయాలెన్నో కదా!?
చదివినవన్నీ గుర్తుగా అక్షరాలై మురిపిస్తే..
బాగా వ్రాయ గలిగాననే ఆనందం వెల్లివిరిస్తే...
తల్లితండ్రుల ఆకాంక్షలు నెరవేరే మార్కుల్తో మెరిస్తే...
ప్రశంసల్ని వర్షించేలా పట్టభద్రుడవటమే మామంచి ఫలితం!
పరీక్షా సమయాలెన్నో కదా!?
డిగ్రీలెన్నున్నా..ప్రశ్నలోతుల్నవలోకించి
వ్యక్తీకరణ మెప్పించేదై..ప్రత్యుత్తరం పండితే..
నిన్నటి నిరుద్యోగిని నేడు లక్షాధికారిని చేస్తే..
అతి కొద్దిసమయంలోనే అందలాలెక్కించేలా ఫలితం!!
పరీక్షాసమయాలెన్నో కదా??
చేయని నేరం వెంటాడినపుడు
సరైన సాక్ష్యం కంటపడినపుడు..
న్యాయం కళ్ళెదుట నిలచే తీర్పయితే..
ముద్దాయి ముద్ర తొలగి నిర్దోషిలా నిలువగలగటమే ఫలితం!
పరీక్షా సమయాలెన్నో కదా!?
లౌకికమా? ఆధ్యాత్మికమా? 
స్వార్ధమా?ధర్మమా? ధనమా?దానమా?
దానవత్వమా?దైవత్వమా?
మానవజన్మకి నిత్యమూ పరీక్షాసమయమే!!
మంచిఫలితాలకై మార్గం తెలుసుకుంటూనే వుండాలిమరి!!
                               ------ -------


  "పరీక్షాఫలితం" అనే ఈ కవిత నా సొంత రచన!!
15
*
నెల్లూరు వేంకట లక్ష్మి 
జిల్లా 
*
కర్నూలు 
కవిత
*
గెలుపు శంఖం పూరించు

సమయమాసన్నమైంది
గెలుపు శంఖం పూరించడానికి..
కలాలకు పదును పెడుతూ
మస్తిష్కం ను మధిస్తూ
ఏడాది పొడవునా 
ఏకరువు పెట్టిన విషయాన్నంతా
ఏకధాటిగా గుమ్మరించి
ప్రతిభనంతా రంగరించి
కాగితపు అంతు చూసే క్షణం..
అహోరాత్రులు శ్రమించి
అహర్నిశలు కష్టించి
ఒత్తిడిని జయించే తరుణం..
గెలుపు నిచ్చెన లో మరో మెట్టు కై
కన్నవారి పరువు ఒకవైపు
లక్ష్యసాధన మరోవైపు
పట్టుసడలని సంకల్ప సిద్ధితో
సాధించే రోజు పరిక్షా సమయం..
ఎప్పటి పని అప్పుడే చేసి
గెలుపోటమి సహజాతిసహజమని గ్రహించి
కష్టేఫలి ని నమ్మిన ప్రతీ విద్యార్థి
విజయ బాట పట్టక తప్పదు మరి


ఈ కవిత నా స్వంతం ఇది దేనికి అనుకరణ అనువాదం కాదని హామీ ఇస్తున్నాను.
16 
*
పిళ్ళా వెంకట రమణమూర్తి 
జిల్లా 
*
విశాఖపట్నం 
కవిత
*
*కవితా గానం సీజన్ 4* 
కవితల పోటీ నిమిత్తం వ్రాసిన కవిత.
తే 21-03-2024దీ
అంశం: *పరీక్షా సమయం* 
""""""""""""""""""""""""""""""""""""""""""
శీర్షిక: *స్మృతి పథంలో* 

ఏది వాస్తవమో ఏది జ్ఞాపకమో
తెలియని అయోమయం కలగా పులగమై
మనసంతా ఆవరిస్తుంది..

పొంగే కన్నీటి కెరటాల వెనుక
ఇన్నేళ్ళ మన స్నేహం
తెరిచిన పుస్తకం పుటల్లా రెపరెపలాడుతూ
పదేపదే జాలిగా కదలాడుతుంది..

మొన్నటిదాకా కలలో కూడా మరువలేని నీ ఊసుల్ని 
ఈనాడు హటాత్తుగా దీపంలేని చీకటి ఇంట్లో నిస్సహాయంగా వదిలేసి..

నిశ్శబ్దంగా లంగరెత్తి అంధకారపు కడలి కడుపు లోకి
మాయమయ్యే ఒంటరి నావలా నీవు వెళ్ళిపోయిన క్షణాన..

నీ అంతరంగంలో చెలరేగిన వేదనల తుఫానుల్ని
నీ కళ్ళల్లో గట్టు తెగిన సముద్రాల్ని.. 

ఊహించుకున్నప్పుడల్లా
నా గుండె తరుక్కుపోకుండా ఎలా ఉంటుంది..

అందమైన నీ చిరునవ్వు, ఆరోగ్యంతో తొణికిసలాడే నీ రూపం
గంటలపాటు మనం చెప్పుకున్న కబుర్లు ..

ఇన్ని సంవత్సరాల మన సావాసపు గలగల నవ్వులు
అన్నీ ఒక్కసారిగా చెమ్మగిల్లిన జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి?

నిండుగా తాజాగా విచ్చిన నీ జీవన పుష్పం
రేకులు వడలిపోకముందే అంతలోనే
ఇంత బాధాకరంగా ,ఇంత అర్ధంతరంగా రాలిపోవాలా..

నీ అకాల నిష్క్రమణం తలచుకుని
ఇది నా జీవితంలో పరీక్షా సమయమని తలుస్తూ ..


నిదుర పొత్తిళ్ళలో కనురెప్పల కింద గుచ్చుకుంటున్న కలవరపు ముద్రలను కూడగట్టుకుని..
 

శూన్యానికి శూన్యానికి నడుమ చిన్న ప్రపంచాన్ని పరుచుకుని..

దేహపు గుడిసెకు నిబ్బరాన్ని యవనికలా నిట్టాడిగా నిలుపుకుని ..

అశక్తుడి కోపం లాంటి శోకంతో నీ స్మృతి పథంలో నిశ్చలన నిశ్శబ్ద నిస్తేజంగా జీవిస్తున్నా!
17
*
తాతపూడి సోమశేఖర శర్మ 
జిల్లా 
*
తూర్పుగోదావరి జిల్లా 
కవిత
*
కవితా గానం (సీజన్ 4)
అంశం.. పరీక్షా సమయం 
శీర్షిక.. ఆగదు కాలం
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం ,8328079336

ఆగదు ఏనిమిషము నీకోసము...
ఆగితే సాగదు ఈ లోకమూ....
ఒకసినీగేయకవి వ్రాసిన నిజమైనవాస్తవం
కాల గమనం ఎన్నటికీ ఎప్పుడూ ఆగదు కదిలిపోతూనేఉంటుంది ప్రతి ఒక్కక్షణము
ఇది ప్రతీఒక్కని జీవితంలోపరీక్షాసమయం
 
కాలగమనంతోబాటు నీవుకూడా
వెనువెంటనేప్రయాణిస్తూ ఉంటావు
ఆ ప్రయాణంలో ఎన్నో మంచిచెడులు
నీవెంట ప్రతిక్షణం దొర్లుతూనేఉంటాయి
కేవలం ఇది ప్రతీ మనిషికి పరీక్షాసమయం 

సుఖదు:ఖాలు కావడికుండలు
పూలబాటలను,ముళ్ల బాటలను 
జీవితంలో ఎన్నో ఎదుర్కోవాలి
ఈవిషయాలు అలా జరుగుతూనేఉంటాయి
కాలగమనంముందుకెళ్ళిపోతూనేఉంటుంది 

అందుకే నీకు తెలుసున్నంత వరకు
ఏతప్పుఎట్టిపరిస్థితులలోనూచేయకు
ఎవరికీ ఏ విధమైన హాని తలబెట్టకు 
మంచిపనులు చేయడానికే ప్రయత్నించు
చెడు అనేది నీ మనసులోకి రానీయకు
దైవధ్యానం,మంచిపనులకే కేటాయించు
కాల గమనంలో మంచికే స్థానం ఇయ్యి
భగవంతుడు పెట్టినపరీక్షలో ఉత్తీర్ణుడవై
నీ పవిత్రమైన జన్మను చరితార్ధం చేసుకో...

హామీ పత్రం
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ
18
ఫాల్గుణ మాసం పౌర్ణమి కవితల పోటీ:
అంశం: పరీక్షా సమయం
*********************
విద్యా బుద్ధులు నేర్చి మేథో వికాసం తో దేశ ప్రగతికి
పాటుపడాల్సిన యువతరం 
ర్యాగింగ్ చేస్తూ, గంజాయి సేవిస్తూ అసాంఘిక శక్తులవుతున్న వేళ, ఉన్మాదాల
మత్తులో మునగకుండా యువతరాన్ని చైతన్య పరచాల్సిన పరీక్షా సమయం 

స్త్రీలను గౌరవించే సంసృతి మరిచి, వేదింపులు బెదిరింపులు యాసిడ్ దాడులు
పసిపిల్లల నుండి వయోవృద్ధులపై అత్యాచారాలు, ఆడ బ్రతుకే వద్ధనుకునే అతివల ఆవేదన కు ముగింపు పలకాల్సిన పరీక్షా సమయం 

పసిపిల్లల పాలు, రోగుల మందులు , ఆహార పదార్థాలలో కల్తీ లు, నేరాలు
ఘోరాలు, బరువు పరువు హత్యలు, సమాజంలో అభద్రతా వాతావరణం
అక్రమ సంపాదన కోసం అఘాయిత్యాలకు వెనుకాడని
పరిస్థితి లో మార్పు తేవాల్సిన
పరీక్షా సమయం 

జాతి విద్వేషాలు, అపనమ్మకాలు, అంతర్యుద్ధాలు, బాంబు పేలుళ్లు గ్రెనేడ్ ప్రయోగాలతో
ప్రపంచ మంతా అస్థిరత్వం
అపార ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరుగుతున్నా అణుబాంబులు
ప్రయోగించడానికి వెనుకాడమంటున్న నాయకులు తీరులో మార్పు తేవాల్సిన పరీక్షా సమయం.
    పలుగుల సతీశ్ కుమార్
      యాదాద్రి భువనగిరి.
19
కవితాగానం
ఫాల్గుణమాసం పౌర్ణమి కవితల పోటి 
సీజన్ 4
కవన జ్యోతి సమూహం కవితాగానం
అంశం పరీక్షా సమయం
శీర్షిక బతుకు పరీక్ష .
ప్రక్రియ. వచన కవిత
వాణి సరోజిని లక్కరాజు 
హైదరాబాద్ 


మనిషి మనుగడే పరీక్షల సుడిగుండం
ఆవలయం లోచిక్కిన మనిషికి 
అడుగడుగున పరీక్షలగండం
జన్మగండం ,బాలారిష్టలగండం
పెద్దయిన పిదప చదువులగండం
రేంకుల కోసం రేయింబగళ్ళ జాగారం
కాలేజీ సీట్ల కోసం తలిదండ్రుల ఆరాటం
ఫీజులు చెల్లించలేక అప్పులతో పోరాటం 
 పాసయిన పిల్లలకు వుద్యోగాలకోసంచెలగాటం
 ప్రశాంతత కరువై రోగాలతో సహవాసం
ఆసుపత్రులచుట్టూ అలుపులేని ప్రదక్షిణాలు
ఆడయినా మగయినా బతుకు పరీక్షలకు తేడాలేలేవు
ఆడపిల్లలవివాహాలే అంతులేని పరీక్షలయితే
మగపిల్లలు అందులో మేమూ సమాన మంటున్నారు 
బతుకు పోరాటంలో నిమిష నిమిషమూ అగ్ని పరీక్షే .
అత్తమామలకు ఒకరకమైతే కోడళ్ళకు మరొకరకం 
రాజకీయ సుడిగుండంలో క్షణక్షణం ఓటమి పరీక్షే
కోట్లుగుమ్మరించినవారికి కోరికఫలించేదాకా పరీక్షే .
గెలుపోటమిల తుఫాను లో చిక్కిదిక్కుతోచని పరిస్థితి 
ఎలక్షన్ల పండుగలో యెగిరే జండాలతోపాటు
పగిలే తలలెన్నెన్నో .
పదవుల పరీక్షల పోటీలో నెగ్గి ,పట్టం కట్టేవరకూ అడుగడుగునా అగ్ని పరీక్షే .
ఇక,ముదుసలివారి ముందున్నవన్నీ ముప్పేటల దాడులే
ఆస్తికోసం ,ఆదుకోవటంకోసం , కన్నవారి కలహాలు
కొట్టి చంపేవారు కొందరయితే బతికుండగానే
.స్మశానాలపాల్చేసేవారింకొకరు.
అనుక్షణం వారికి చావుతో చెలగాటమమే
చెప్పుకుంటూపోతే చెప్పలేనన్ని పరీక్షలు
బతుకు పోరాటంలో వెంటాడు తుంటాయి .
పైకవితనస్వీయరచన.
20
ముడుంబ తిరువేంకటా చార్యులు
జిల్లా 
*
మహబూబాబాద్ 
కవిత
*
ఇది పరీక్షాసమయం.
అవును, ఇదిపరీక్షాసమయమే.
అక్షరాభ్యాసం నుండి నేటివరకు పొందిన తమ విద్యాజ్ఞానం ఏ స్థాయిలో ఉందో మార్కుల రూపంలో తెలుసుకోవాలనుకునే విద్యార్థులకిది పరీక్షాసమయమే, 
దారితప్పి తిరుగుతున్న "విద్యార్థులకు" తాము బోధించిన విషయాలలో తామెంత మేరకు కృతకృత్యులయ్యామోనని ఉత్కంఠకు లోనయ్యే గురువులకిది పరీక్షాసమయమే,
తాము చదివిన చదువుకు, ఆర్జించిన జ్ఞానానికి, తమ విద్యార్హతలకు తగిన కొలువు కోసం పోటీపడే ఉద్యోగార్థులకిది పరీక్షాసమయమే, 
ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు "కనీస మద్దతు ధర" అయినా వస్తుందో లేదోనని ఆందోళన చెందే వ్యవసాయదారునికిది పరీక్షాసమయమే, 
ఎలక్ట్రానిక్ మాధ్యమాల ప్రభావమో,గతప్రభుత్వాల "పాలసీ"ల ప్రభావమో పెడత్రోవ పట్టిన యువ పౌర సమాజాన్ని సరైన మార్గంలోకి "తేవాలనుకుంటే", పాలకులకిది పరీక్షాసమయమే, 
ప్రజానాడిని పట్టుకోలేక పీఠం పైనుండి పడద్రోయబడి, మళ్లీ పైకెక్కాలని ప్రాకులాడే విపక్షానికిది పరీక్షాసమయమే,
తామే సూత్రధారుల్లై నడిపించిన "ప్రణాలిక"లలోని లోసుగులను పరిశీలించి, పరిశోధించి, వలవేసి పట్టుకున్న "అధికారుల" నుండి ఎలా బయటపడాలని "ఎత్తుకు పై ఎత్తు" వేసే "కిలాడీనేత"లకిది పరీక్షాసమయమే, 
దీర్ఘకాలంగా వొడ్డునపడ్డ చేపల్లా "గిలగిలలాడుతూ" మళ్లీ పీఠమెక్కాలని ఉబలాటపడే"బడా" నేతలకిది పరీక్షా సమయమే,
పీఠమెక్కిన మరుక్షణ0 నుండి అలుపెరుగని, విరామమెరుగని  
"సంస్కరణ"లలో మునిగితేలుతూనే, దేశాన్ని ముందుకు , మరింత ముందుకు నడిపించాలని పరితపించే "దీక్షాదక్షుల"కిది పరీక్షాసమయమే, 
ఈసారి ఎవరు పీఠమెక్కుతారో, దేశానికి కాబోయే ఏలిక ఎవరోనని, తమ ఓటు పైనే నమ్మకముంది, నిర్ణాయకసమయం కోసం 
, దాని ఫలితం కోసం నిరీక్షించే ఓటరు దేవుళ్లకిది పరీక్షాసమయమే, 
అయితే ఒక్కమాట! విత్తొకటి చల్లి, ఫలమొక్కటాశించే దురాశాజీవులకెప్పుడూ నిరాశే మిగులుతుంది. నీతికి, నిజాయితీకి నిలబడి, నిర్భీతిగా, నిస్స్వార్థంగా శ్రమించే వారినే విజయం వరిస్తుంది. "ధర్మస్య విజయోస్తు".
21



22
పౌర్ణ
మి కవితల పోటీ
అంశం... పరీక్షా సమయం 
శీర్షిక... ఉల్లాసంగా ఉత్సాహంగా 


 అవును.. ఇది పరీక్షా సమయమే... 

నిన్ను నిన్నుగా నువ్వు నిరూపించుకోవడానికి
దేవుడిచ్చిన ఓ అపూర్వ అవకాశం... 

ముందు.. 
భయపు కంబళి దులుపు
అభయపు నీడ సేద తీరు
మనసు డోలకాన్ని నిశ్చల స్థానానికి చేర్చు... 

నీ దిశపు ముల్లును లక్ష్యం వైపు తిప్పుకో
నీ ప్రణాళికను సిద్ధం చేయ్
నీ విలువైన సమయ పాలనకు బాటలు వేయ్..... 

నీ దేహానికి నీవే మహారాజువి
ఇతరులతో నీవు పోలికల తరాజు వేయకు
పనికి రాని ప్రతి కూల ఆలోచనలకు 
చెక్ పెట్టేయ్ ... 

ధైర్యాన్ని నీ ఆయుధంగా ధరించు
ఆందోళనల కుంపటిని 
ఆమడ దూరం విసిరేయ్ .. 

విజయ మాల వరిస్తేనే
నీ జీవితానికి గెలుపు బావుటా కాదు
పడి లేచి ఆత్మ విశ్వాసపు జెండా 
ఎగుర వెసినప్పుడే నీ పరీక్షా సమయం 
ఉత్సాహపు ఊయల లూగుతుంది
మరొకరికి స్ఫూర్తి దాయకమవుతుంది....!! 

హామీ... నమస్తే ఈ కవిత నా స్వీయ రచన అని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను🙏

మొహమ్మద్. అఫ్సర వలీషా
ద్వారపూడి (కోనసీమ జిల్లా)

23
అంశం.‌.పరిక్షా సమయం
పేరు కొంజేటి రాధిక
ఊరు రాయదుర్గం

క్రమబద్ధమైన వ్యూహరచనతో, బద్ధకానికి బడిత పూజ చేసి,
 సమయపాలనను పాటిస్తూ....
 ఓర్పును సమీకరించుకుంటూ, సహనాన్ని ఊపిరిగా పిలుస్తూ...
 అనుక్షణం గమ్యస్థానాన్ని చేరుటకై, 
 అవరోధాలను ఛేదించేందుకు, ప్రతి సమస్యను పరీక్షగా భావించి ఎదురయ్యే ఆటంకాలముళ్లను తీసుకుంటూ తీసేస్తూ అవరోధాల ముళ్లబాటను పూల పాన్పుగా మార్చుకుంటే ప్రతినిత్యం పరీక్షలో ఎదురయ్యే విజయకేతనాన్ని ఎగురవేయచ్చు...
 గెలుపు గుర్రంపై స్వారీ చేయవచ్చు ...
సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ,
 తలుపు తట్టిన అవకాశాన్ని చేజిక్కించుకుంటూ,
 నిత్య విద్యార్థివై సరిహద్దుల్లో సైనికుడై అప్రమత్తతను కవచంగా ధరించి,
వ్యూహరచన గావించుకుంటూ ముందుకు సాగితే గెలుపు నీ పాదాల చెంత దాసోహమవుతుంది... చిరునవ్వు నీ పెదాలపై చిద్విలాసం చేస్తుంది... ప్రణాళికను ఏర్పరచుకో ప్రగతి పథం వైపు సాగిపో...
ఒత్తిడిని జయిస్తూ ధైర్యాన్ని పోగు చేసుకుని, ఆందోళనలు అధిరోహిస్తూ ఆచంచలమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపో.... సాగిపో ఆగకు ఏ క్షణము.. నిరాశ నిస్పృహల దుమ్ము ధూళిని దులుపుకుంటూ ముందడుగు వేసావో మొదటి స్థానం నీ నీడై ,
నీ అడుగుజాడై నీ వెంటే నడుస్తుంది నీకు బాసటగా.

24
ఫాల్గుణ మాసం పౌర్ణమి కవితలు పోటీకి
కవితాంశం:-- పరీక్షా సమయ
రచన:-- సింహాద్రి వాణి
శీర్షిషక:-- పరీక్షా సమయం
చరవాణి:--7569820882
ఊరు:-- విజయవాడ

మానవ జీవితం వివిధరకాల పరీక్షల నిలయం.

నిత్యం చుట్టుముట్టే సమస్యల వలయం.

విజ్ఞానం కొరకు మొదలౌతుంది పసితనం నుంచే చదువు కోవడమనే యజ్ఞం.

ఆ యజ్ఞంలో విద్యార్థులందరికీ వస్తుంది పరీక్షా సమయం.

పై తరగతులకు పోవాలంటే
తప్పక ఉత్తీర్ణత సాధించాలి పరీక్షల్లో.

అందుకు విద్యాభ్యాసం చెయ్యాలి పట్టుదలతో, అకుంఠితదీక్షతో.

దీక్ష, పట్టుదల వున్నవాళ్ళు సలక్షణంగా లక్ష్యం చేరుకుంటారు.

ఎంతబాగా చదివినా, పరీక్షా సమయం ‌ఆసన్న మౌతుంటే మొదలౌతుంది విద్యార్థులకు గుండెల్లో భయం.

నిర్భయంగా నిబ్బరంగా కంగారు లేకుండా, చదివినది గుర్తుపెట్టుకుని రాయాలి పరీక్షలు.

విద్యార్థులు ఎదుర్కొనే ప్రశ్న లన్నిటికీ వుంటాయి సరైన జవాబులు.

ఏ ప్రశ్నకు ఏ జవాబో తెలుసుకొని రాసేందుకు అర్థవంతమైన చదువు చదవాలి.

అప్పుడు తప్పక ఉత్తీర్ణత సాధించి క్రమక్రమంగా ఉన్నత శిఖరాల నధిరోహిస్తారు.

విద్యార్థులకే కాదు జీవితంలో ప్రతివారూ ఎదుర్కొంటారు పరీక్షా సమయాన్ని.

అప్పుడు సరైన‌ నిర్ణయం తీసుకోలేక పోతే, జీవితాలు‌ తలక్రిందు లౌతాయి.

పరీక్షా సమయంలో సరైన జవాబులు, జీవితాలలో ఎదుర్కొనే పరీక్షల్లో సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు విజయాలు తప్పక లభిస్తాయి

25
పేరు : డా.భమిడిమఱ్ఱి కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
తేది : 21-3-24
చరవాణి : 9871096566

శీర్షిక : జీవనసంగ్రామం
పోరాటాలెన్నో జీవనసంగ్రామంలో
తప్పవు అలల ఆటుపోట్లు
జీవనసంద్రంలో
కష్టాల కడగండ్ల కంటకాలెన్నో
జీవన బాటలో
ఎదురవుతూనే ఉంటాయి
అడుగడుగునా
పరీక్షాసమయాలు
తప్పదు ఎదుర్కోక ముందుకు
సాగాలంటే
జీవనయానం చేయాలన్నా
జీవనబాట సుగమంగా సాగాలన్నా
ఎదుర్కోవలసిందే పరీక్షాసమయాలను
ఎదురొడ్ఠి నిలవవలసిందే
ఆపరీక్షలకు
ఏర్పడతాయి కొన్నిసార్రు
విషమపరిస్థితులు
ముందు నుయ్యి, వెనుక గొయ్యి
లా ఉంటుంది మనపరిస్థితి
సాగాలి ముందుకు గెలుపు ఓటముల చింతలేక
పరీక్షా సమయాల అవరోధాలు 
దాటాలంటే
కావాలి కొన్ని ఉపకరణాలు
ఆత్మవిశ్వాసం, గుండెధైర్యం,
మనోబలం సాధనాలుకావాలి
ఈపరీక్షాసమయాలను దాటాలంటే
ఎదుర్కోవాలి నిర్భీతిగ పరీక్షాసమయాలను
నిరాశానిస్పృహలకు లోనుకారాదు పరీక్షలో ఉత్తీర్ణులు కాకపోయినా
గ్రహించాలి ఓటమి గెలుపుకు
సోపానమని.

హామీ : పైకశవిత నాస్వంతం
26 
మధు అమరగాని 
జిల్లా 
*
సిద్ధిపేట 
కవిత
*
పరీక్షల సమయం

ఓనమాల నుండి చదివిన చదువును 
ఒడుపుతో మార్కులుగా మార్చాలనీ 
కసితో ఉన్న విద్యార్ధులకూ 
మార్కులే గాదు మానసికంగా దృఢంగా ఉండాలని
మంచినికోరే గురువులకూ 
పరీక్ష కేంద్రాలకు పరుగులు పెట్టే కన్నవారికీ 

నిశ్చలతలేని ఆలోచనల గల వీడింతే అని 
గేలి చేసే గాలి మాటలకు 
ఆన్సర్ లనే అక్షరాతో 
మనసుకైన గాయాలకు మలాం రాసే 
పరీక్షల సమయమిది…

                ****

ఎన్నెన్నో కళల సమహారమైన ఎన్నికలను
నిర్విఘ్నంగా నిర్వహించాలని అధికారులకు 
బంధాలను వదిలేసి 
బందోబస్తు చేస్తున్న పోలీస్ తమ్ముళ్లకు 
మళ్లీ గెలిచి మంత్రి పదవి చేబట్టాలనుకునే నాయకులకు
నేడు ఎక్కడ చూసినా పరీక్షలే
ఫలితాల కోసం ఫీనిక్స్ పక్షిలా నిరీక్షణలే…

27

డా బల్లూరి ఉమాదేవి 
జిల్లా 
*
కర్నూలు 
కవిత
*
పరీక్ష
జీవితమంటేనే ఓ పరీక్ష
కష్టపడాలి ఎదురించాలి
జయించాలి అపుడే కల్గును తృప్తి
నిశితంగా చూడడమే పరీక్ష
చూసినదాన్ని అవగతం చేసుకోవడం
చోసుకొన్నదాన్ని అప్పజెప్పడం
అప్పుడే పరీక్ష నెగ్గనట్టు లెక్క
పుట్టిన ప్రతి జీవికీ తప్పదు పరీక్ష
గర్భవతైన తల్లికి ప్రసవించడం
ఓపరీక్ష
పండంటి పాపాయిని చూశాక నెగ్గినంత సంబరం
ప్రతిరోజు ఇంట్లో ఇల్లాలికి పరీక్ష
యంత్రంలా వుదయంనుండీ తిరుగుతూ 
అందరికీ అన్నీ అమరుస్తూ
అందరినీ తృప్తి పరుస్తే
ఆనాటి పరిక్ష నెగ్గినట్టే
విద్యార్థులకు పరీక్షలంటే భయం
మంచి మార్కులొస్తే సంబరం
అవి తగ్గితే తప్పదు సంకటం
పరీక్షల్లో పలురకాలు
అనారోగ్యం కల్గితే వైద్య పరీక్షలు
పంటకోసం చేసేవి భూసార పరిక్షలు
పై చదువులకై ప్రవేశపరీక్షలు
ఉద్యోగాలకై అర్హత పరిక్షలు
పరిక్ష లేని బ్రతుకోలేదు
ఎదురైన ప్రతి గడ్డు సమస్యా 
ఓ పరీక్షే
ఎదురించాలి,పోరాడాలి
విజయంసాధించాలనే తపనతో ముందుకు సాగాలి .

28
డా.వేమూరి.సత్యవతి.
జిల్లా 
*
కృష్ణా జిల్లా 
కవిత
*
శీర్షిక- పరీక్షాఫలితం!

ఇన్నాళ్ళ జీవితం, ఎన్నెన్నో అందచందాలు, నేర్పరితనాలు,
ఇంకొకరి మెప్పు కోసం ఆతృతగా ఎదురు చూసేవేళ....
ఎన్నెన్నో ఆకాంక్షలకి, ఆరాటాలకి సానుకూల వర్తమానంగా..
జీవితపు మలుపైన సంబంధం కుదరటమే పరీక్షాఫలితం!!
పరీక్షా సమయాలెన్నో కదా!?
చదివినవన్నీ గుర్తుగా అక్షరాలై మురిపిస్తే..
బాగా వ్రాయ గలిగాననే ఆనందం వెల్లివిరిస్తే...
తల్లితండ్రుల ఆకాంక్షలు నెరవేరే మార్కుల్తో మెరిస్తే...
ప్రశంసల్ని వర్షించేలా పట్టభద్రుడవటమే మామంచి ఫలితం!
పరీక్షా సమయాలెన్నో కదా!?
డిగ్రీలెన్నున్నా..ప్రశ్నలోతుల్నవలోకించి
వ్యక్తీకరణ మెప్పించేదై..ప్రత్యుత్తరం పండితే..
నిన్నటి నిరుద్యోగిని నేడు లక్షాధికారిని చేస్తే..
అతి కొద్దిసమయంలోనే అందలాలెక్కించేలా ఫలితం!!
పరీక్షాసమయాలెన్నో కదా??
చేయని నేరం వెంటాడినపుడు
సరైన సాక్ష్యం కంటపడినపుడు..
న్యాయం కళ్ళెదుట నిలచే తీర్పయితే..
ముద్దాయి ముద్ర తొలగి నిర్దోషిలా నిలువగలగటమే ఫలితం!
పరీక్షా సమయాలెన్నో కదా!?
లౌకికమా? ఆధ్యాత్మికమా? 
స్వార్ధమా?ధర్మమా? ధనమా?దానమా?
దానవత్వమా?దైవత్వమా?
మానవజన్మకి నిత్యమూ పరీక్షాసమయమే!!
మంచిఫలితాలకై మార్గం తెలుసుకుంటూనే వుండాలిమరి!!
                               ------ -------
  "పరీక్షాఫలితం" అనే ఈ కవిత నా సొంత రచన!!

Comments

Popular posts from this blog

సింధూరం 07052025

****************** సింధూరం దిద్దిన వారు  1.వీరా గుడిపల్లి 2.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, 3.గొర్రెపాటి శ్రీను  4.దోసపాటి వేంకట రామచంద్రరావు  5.అపరాజిత్ 6.వేమూరి సత్యవతి  7.జ్యోతి  8.మండ నాగేశ్వరరావు  9.గడ్డం కృష్ణారెడ్డి.రేపాల.సూర్యాపేట 10.కవిత వెంకటేశ్వర్లు  11.ఆర్ వి వి రాజా  12. శ్రీ కోరాడ నరసింహారావు గారు  13. శ్రీ ఉదయగిరి మధుమోహన్ గారు  14. శ్రీమతి బల్లూరి ఉమాదేవి గారు  15. శ్రీమతి తోట సులోచన గారు  16. శ్రీ జి సూర్యనారాయణ గారు  17. శ్రీ గజవెల్లి శ్రీనివాస చారి గారు  18. శ్రీ వనపర్తి గంగాధర్ గారు  19. శ్రీమతి వాణి సరోజిని లక్కరాజు గారు  20. శ్రీమతి సింహాద్రి వాణి గారు 21. శ్రీ ఆచార్య అయ్యల సోమయాజులు ప్రసాద్ గారు  22. 23.శ్రీమతి నెల్లూరు వేంకటలక్ష్మి గారు 24.శ్రీ ఏడెల్లి రాములు గారు  25. శ్రీమతి డాక్టర్ తంగిరాల నాగలక్ష్మి గారు  26. శ్రీ కూని అంకబాబు గారు  27. శ్రీ తిన్నాక నాగేశ్వరరావు గారు  28. శ్రీమతి లలితా చంటి గారు  29. శ్రీ పిల్ల వెంకటరమణ మూర్తి గారు  30. ...

season 6 వైశాఖ పూర్ణిమ

కవనజ్యోతి,కవితాగానం సీజన్ 6  వైశాఖ పౌర్ణమి నగదు పోటీలు   పోటీకి కవితలు పంపించిన కవి వరుల జాబితా  1. శ్రీ పిళ్ళావెంకటరమణ మూర్తి గారు  2. శ్రీ సంగీతం సంతోష్ కుమార్ గారు ji 3. శ్రీ జి సూర్యనారాయణ గారు  4.శ్రీ మండ నాగేశ్వరరావు గారు 5.శ్రీమతి కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  6.శ్రీమతి నెల్లూరు వెంకటలక్ష్మి గారు 7.శ్రీ అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 8..శ్రీ కోరాడ నరసింహ రావు గారు  9.శ్రీమతి డాక్టర్ భమిడిమర్రి కమలాదేవి గారు 10.శ్రీ కాసుల ధీరజ్ శర్మ గారు  11.శ్రీ కూని అంకబాబు గారు 12.శ్రీ మతి డా.వేమూరి సత్యవతి గారు  13.శ్రీమతి డా.బల్లూరి ఉమాదేవి గారు 14.శ్రీ.దోసపాటి వేంకట రామచంద్రరావు గారు 15.శ్రీ అపరాజిత రెడ్డి గారు  16. శ్రీ ఏడెల్లి రాములు గారు  17.శ్రీ డాక్టర్ ఆళ్ళ నాగేశ్వరరావు గారు  18. శ్రీ కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  19. శ్రీ మద్ది పుల్లారావు గారు  20.శ్రీమతి సింహాద్రి వాణి గారు  21. శ్రీ డా.దీపక్ న్యాతి గారు  22. శ్రీ ఆర్.వి.వి.రాజా గారు  23.శ్రీమతి వాణీ సరోజినీ లక్కరాజు గారు...

వీడ్కోలు ఆషాఢమాసం పౌర్ణమి

అంశం: వీడ్కోలు  సందర్భం: ఆషాఢమాసం పౌర్ణమి  నిర్వహణ:  వీరా గుడిపల్లి లలితాకృష్ణ  ################## కవివరుల జాబితా  1.పిళ్ళా వెంకట రమణమూర్తి గారు  2. జి.సూర్యనారాయణ గారు  3.మండ నాగేశ్వరరావు గారు  4.డా‌.బల్లూరి ఉమాదేవి గారు  5. డా.కమలాదేవి గారు  6.గొర్రెపాటి శ్రీను గారు  7.వేమూరి సత్యవతి గారు  8.కూని అంకబాబు గారు  9.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  10.కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  11.తోట సులోచన గారు  12.వాణిసరోజిని లక్కరాజు గారు  13. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు  14.అపరాజిత రెడ్డి గారు 15.లలితాచండి గారు 16. నెల్లూరు వెంకటలక్ష్మి గారు  17.కమలశ్రీ గారు  18.రాధిక గారు 19.చంద్రమౌళి గారు  20.శ్రీకాంత్ గారు  21.సింగీతం సంతోష్ కుమార్ గారు  22.. దారల విజయ కుమారి గారు  23.ఎన్.నరేశ్ చారి గారు  24. పిన్నక నాగేశ్వరరావు గారు  25.సింహాద్రి వాణి గారు  26.ఏడెల్లి రాములు గారు  27.కొంజేటి రాధిక గారు  ++++++++++++++++++++++++++++++++ ఆషాడ మ...