Skip to main content

క్రోథినామ సంవత్సరం ప్రథమ పౌర్ణమి కవితల పోటీ. అంశం ప్రయత్నం

క్రోథి నామ సంవత్సర చైత్ర మాసంల పౌర్ణమి కవితల పోటీ 
నగదు బహుమతులు 
అంశం 
ప్రయత్నం 
నిర్వహణ 
శివునూరి లలితాక్రిష్ణ 
********
కవివరుల జాబితా 
సీౙన్ 5 తొలి పౌర్ణమి పోటీకి 
ఇప్పటి వరకు కవితలు పంపినవారు
********
1.గొర్రెపాటి శ్రీను గారు 

2.మండ నాగేశ్వర్రావు గారు 

3.కోరాడ నరసింహారావు గారు 

4.పిళ్ళా వెంకటరమణ మూర్తి గారు
 
5.నెల్లూరు వేంకటలక్ష్మి గారు
 
6.వడ్ల వీరాచారి గారు 

7.ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 

8. గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు 

9. వేమూరి సత్యవతి గారు 

10. తిప్పావఝల నరసింహ మూర్తి గారు 

11. మద్ది పుల్లారావు గారు 

12. డా.భమిడిమఱ్ఱి కమలాదేవి గారు 

13. తరణికంటి సూర్యలక్ష్మి గారు 

14. కొంజేటి రాధిక గారు 

15.శాడ వీరారెడ్డి గారు 

16.దోసపాటి వేంకట రామచంద్రరావు గారు 

17. బాలు కత్తుల గారు 

18. కోడూరు లలిత గారు 

19. లలితా చండి గారు 

20. . సింహాద్రి వాణి గారు 

21. శాడ వీరారెడ్డి గారు 

22. కొమురవెల్లి అంజయ్య గారు 

23. శ్రీమతి వాణి సరోజినీ లక్కరాజు గారు 

24. శ్రీమతి తోట సులోచన గారు

25. కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 

26. పిన్నక నాగేశ్వరరావు గారు 

27 . మధు అమరగాని గారు 

28. మొహమ్మద్ అఫ్సర్ వలీషా గారు 

29. డా.తంగిరాల నాగలక్ష్మి గారు 

30. డా.బల్లూరి ఉమాదేవి గారు 

31. ఏడెల్లి రాములు గారు 

32. ముడుంబ తిరు వేంకటాచార్యులు గారు 

********
నిర్వహణ 
శివునూరి లలితాకృష్ణ
[
1
గొర్రెపాటి శ్రీను   
జిల్లా 
*
Medical Malkajgiri
కవిత
*
కవన జ్యోతి సీజన్ -5 
చైత్రమాసం కవితల పోటీ కోసం వ్రాసిన కవిత .

అంశం :ప్రయత్నం
శీర్షిక : "ప్రపంచం మెచ్చే విజేత"

బ్రతుకు బాటలో ఎత్తుపల్లాలు సహజం !
జీవన పోరాటంలో గెలుపుఓటములు ఎదురవుతుంటాయి!
ఓడినప్పుడు బాధపడతాం!
ఓటమి నేర్పిన పాఠాన్ని గ్రహిస్తే..
వీడని ప్రయత్నం నీదైతే 
గెలుపు నిన్ను తప్పక విజయ తీరాలని చేర్చి విజేతగా నిలబెడుతుంది ! 
ఎదురైన చిన్ని విజయానికే 
నా అంతటివాడు లేడని విర్రవీగితే అధోగతిపాలవుతావు ! 
ప్రయత్నాలని కొనసాగిస్తూ
అచంచలమైన ఆత్మవిశ్వాసంతో..
ముందుకు సాగుతుంటే 
నీ బతుకు పయనం సంబరాలమయం అవుతుంది !
ఎదిగిన కొద్ది ఒదుగుతూ
పదుగురికీ చేయూతగా ఉంటూ
తోటివారికి సన్నిహితుడవై   
పెద్దవారిపట్ల విధేయుడవై
నలుగురితో సఖ్యతగా మసలుకుంటూ..
నీదైన శైలిలో 
సదా గెలుపుకోసం ప్రయత్నిస్తూ శ్రమిస్తుంటే ..
ప్రపంచమెచ్చే విజేతవు నువ్వవుతావు !
_ గొర్రెపాటి శ్రీను

 2
మండ.నాగేశ్వర్రావు.
జిల్లా 
*
విశాఖ పట్టణం
కవిత
*
ప్రయత్నం..!!
==========


ఒక చిన్నప్రయత్నం జీవితాన్నే మార్చేస్తుంది...!!
ఎంతటి విజయానికైనా ప్రయత్నమే పునాది ..!!
ఎన్నివేలమైళ్ళ గమ్యానికైనా
మొదటి అడుగే ఆది!!
ప్రయత్నమన్నది లేకుంటే ఏపనైనా
అభాసుపాలే అవుతుంది.
ప్రయత్నమంటూ చేస్తేనే ఎంతటి పనైనా తలవంచి పాదాక్రాంతమవుతుంది !!

సాధనకైనా, శోధనకైనా ప్రయత్నమే ప్రాణం!అసలుప్రయత్నమే లేనినాడు ఏపనికూడా అవలీలగ కాదు!
చిన్న ప్రయత్నంతో కానిపని విశ్వప్రయత్నం తో అవుతుందని అనుభవాలు చెబుతాయి!
సాధనమున పనులు సమకూరు ధరలోన! సామదానదండోపాయాలన్నీ మానవ ప్రయత్నాలే!!
హద్దుమీరి ప్రయత్నిస్తే అవమానమె మిగులుతుంది!!

ప్రయత్నమేమి చేయకుండా భగీరధుడు గంగను భువిపైకి దించాడా...??
ప్రయత్నమేమిచేయకుండ చంద్రుణ్ణి మనిషి చేరగలిసాడా !??
ప్రయత్నమే చేయకుండ పక్షిగూడు కడుతుందా..!?
ప్రయత్నమది చేయకుండ పులి వేటను పొందుతుందా!?ప్రయత్నమే చేయకుండ మడుగు లోతెంతో తెలుస్తుందా!?
గమ్యంచేరేవరకూ ప్రయత్నం చేయాలి..!!
ప్రయత్నం ఒక వ్రతం!
ప్రయత్నమొక క్రతువు!! పట్టుదలతో...అంతా సఫలం! చేసినప్రయత్నం విఫలమైందని వెనుదిరగమాకు!!
పట్టుదలతో ప్రయత్నిస్తే ఏకు కూడ అవుతుంది మేకు..!!
మనప్రయత్నం మనంచేస్తే దైవానుగ్రహం తప్పక లభిస్తుంది..!!

ప్రతిప్రయత్నం ఒక విజయాన్ని తేవాలీ..!!
ప్రతివిజయం జగతికి నవోదయం కావాలీ..!!

            -----మండ.నాగేశ్వర్రావు
3
    * తినగ తినగ వేము...! *
  కొరాడ నరసింహా రావు...! 
      ****************
 ఆరంభించరు నీచ మానవుల్
 అన్నట్టు.... 
 ఎన్నెన్నో గొప్ప గొప్ప ఆలోచన లతో ఎన్నో కలలుకంటుంటారు
 గానీ,ఏ ఒక్కమంచిసంకల్పాన్ని
 ఆచరించి ప్రయత్నించరు కొందరు... 
   కొందరు వారి కలలను నిజం చేసు కుందుకు ప్రయత్న0 మొదలు పెడతారు ఒకటి, రెండు ఎదురు దెబ్బలు తగిలే సరికి, మనకు ఛాత కదులే అనుకుని ఆ పనిని సంగంలోనే
 విడిచి పెట్టెస్తారు ఛాలా మంది
      ఏ కొద్దిమందో... ప్రయత్నం
 మొదలు పెట్టిన తరువాత ఎన్ని అడ్డంకు లేర్పడినా...ఎన్నె న్ని కష్టాలెదురైన... ఆ కార్యాన్ని సఫలీకృతం చేసుకున్నంత వారకూ విశ్రమించరు పట్టు వదలని విక్ర మార్కుల్లా వదిలి పెట్టరు...! 
   వీల్లు సంకల్పమనేగాలిని పూర్తిగా నింపు కున్న బంతుల్లా గోడకి కొడుతున్న ప్రతిసారి మరలా సిద్దమైనట్టు ఎదురు దెబ్బలు తగులుతున్నామల్ ,మల్లి మల్లిసిద్ద పడుతూనే ఉంటారు
 తల పడు తూనే ఉంటారు...!! 
 సాధనమున పనులు సమకూరు ధర లోన అని ఊరికే అన్నారా పెద్దలు... 

ఓ పనిని ప్రారంభించి ప్రయత్నిం చట మంటూ మొదలు పెట్టిన తరుదాత పూర్తయే వరకూ ప్రయత్నిస్తూనే ఉండాలి... 
  ఆలా సఫలీకృతు లయే వర కూ ప్రయత్నిం చే వారే ఘనులు
 వారే విజయులు కాగలరు...!! 
      ******************
*
పిళ్ళా వెంకట రమణమూర్తి 
జిల్లా 
*
విశాఖపట్నం 
కవిత
*
*కవనజ్యోతి సీౙన్5 చైత్రమాసం*
 పౌర్ణమి కవితల పోటీ. 
అంశం: *ప్రయత్నం* 
 *తేదీ: 25-04-2024* 
******************************
శీర్షిక: *మాంటేజ్ దృశ్య సమూహాలు* 

పుస్తకాలకేం తక్కువని మనం చదవాలి గాని..
 
మూల గదిలో అసంఖ్యాక విజ్ఞాన ప్రపంచాలు గోళీకాయల్లా దొర్లి పోతున్నాయి..

గదిలో బల్ల చుట్టూనో, మీదనో ఏదో ఒక పుస్తకాల దొంతరల్లోనో..

ఎన్నో ఎన్నెన్నో కొత్త అంశాలు వింతలు విశేషాలు అతికించని మాంటేజ్ దృశ్య సమూహాలు..

మాట మాత్రమేనా శబ్దించని ప్రపంచంలో ఏ ఒక్క కేకా వినబడని ఆమూల గదిలో..

ఒకరినుంచి ఇంకొకరికి ఇంకొకరి నుంచి మరొకరికి స్వచ్ఛందంగా అందుతున్న అక్షరాల జలథిలో..

విజ్ఞాన నదిలా సంగమించే ఈ సత్సాహిత్య సిశృక్షువుల పేరేమిటో?

ఎందుకోసం వెతుకుతున్నామో తెలియని ..

అజ్ఞానమనే చీకటి నుండి సుజ్ఞానమనే వెలుగు గది తలుపులు తెరుచుకుని.. 

ఆకాశ హర్మ్యాల్లా అంతస్తుల కొద్ది పేర్చిన *కవిలెక్కుల* మధ్య నెలకొన్న భావావేశాలని..

మంచు పర్వతంలా ఎన్నటికీ తరగని పదసమూహాల గాఢ పరిష్వంగన లో..

మస్తిష్కంలో గదులు కట్టుకుని పొందిన జ్ఞానాన్ని మూటకట్టుకుని..

చదివినంత మేరా జీవన సరళిని దిద్దికుని..

మనలోపలి వికృతి మీద కత్తులు దూసి..

గొప్ప చలన జ్వలనంతో ఒక నిశ్చలన దృశ్యానికి తెర తీద్దాం..

కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పుస్తకాలను రక్షించుకునే *ప్రయత్నం చేద్దాం* !
""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
    👇🏻
 *కవిలెక్కు* అనే పదం శబ్దార్ధ రత్నాకరం లో *పుస్తకం* అనే సంస్కృత పదానికి తెలుగు అర్థం 
*******************************
పిళ్ళా వెంకట రమణమూర్తి విశ్రాంత సంస్కృత అధ్యాపకుడు
బి వి కె కళాశాల విశాఖపట్నం.

5
*
నెల్లూరు వేంకట లక్ష్మి 
జిల్లా 
*
కర్నూలు 
కవిత
*
పౌర్ణమి కవితా పోటీ 
నెల్లూరు వేంకట లక్ష్మి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా 
అంశం: ప్రయత్నం 
శీర్షిక: సంకల్ప సిద్ధి 
***********************
బతుకు పుస్తకంలో
నాకంటూ ఓ పేజీనీ
లిఖిద్దామని
ఆశల విత్తును నాటి
ఆశయమనే సౌధం
నిర్మించి
ఒద్దికగా ఓర్పుగా
ఒక్కో మెట్టు ఎక్కుతూ
స్వశక్తితో స్వానుభవంతో
ఎగుడుదిగుళ్ళను చదును
చేసుకుంటూ
గమ్యమనే నిచ్చెనను
చేరాలని సంకల్పించాను

ప్రతీ పనిలోను
ఆటంకాలనే కంటకాలు
అవరోధాలనే కత్తుకలు
మాటల పిడిబాకులు
తూటాల విసురులు
గెలుపుకు అడ్డుగోడలే

ఇంకేముంది..?
కలల గూడు చెదిరింది
కంటిపాప చేమ్మగిల్లింది
ఆశల విత్తు రాలింది
మనసు మొగ్గ వాడింది
గమ్యం గతి తప్పింది
అయితేనేం..?
పొత్తంలో చివరి పేజీ
వరకు నావేగా..!
ఈ పేజీ చినిగిందని
మరో పేజీని
ప్రయత్నించకుండా
వుండగలనా..?
వున్న ఒక్క జిందగీని
దాని లోతు అంతును
రుచి చూసేదాక
కంటిని ఒంటిని
నిదుర పోనీయనంతే!

నా ప్రయత్నం ఆపగలగడం
నా మనసుకు సాధ్యమా..?

ఈ కవిత నా స్వంతం ఇది దేనికి అనుకరణ అనువాదం కాదని హామీ ఇస్తున్నాను.

6
*
వడ్ల వీరాచారి, LCE,కవి రత్న,(విశ్రాంత సహాయక ఇంజనీర్ ఇంజనీర్
జిల్లా 
*
వనపర్తి టౌన్ మరియు జిల్లాpin.509103.
కవిత
*
అంశం... ప్రయత్నం

నీవు చేయాలనుకున్న పనిమీద లగ్నం చేయాలి మనస్సు.
తలపెట్టిన కార్యం సఫలమయ్యేదాకా విడువరాదు పట్టుదల తపస్సు
చేయాల్సిన పని విజయవంతంగా చేసి ఫలితం దేవునికి వదిలిపెట్టు
నమ్మకంతో ,పట్టుదలతో పని చేస్తే విజయం నీదేనోయి నమ్ము ,ఒట్టు!

7
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
ఊరు:-
విశాఖపట్నం
చరవాణి:-9963265762
అంశం:-ప్రయత్నం
శీర్షిక:-
విజయానికి సోపానం
................................
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడక
నీవు చేయవలసిన కర్తవ్యాన్ని
ప్రయత్న పూర్వకంగా చేయి అన్న స్వామి వివేకానంద.

శాంతి అహింసలే సాధనలుగా స్వాతంత్ర్య సముపార్జన చేసిన జాతిపిత మహాత్మాగాంధీ సూక్తి
'గెలవక పోవడం కాదు తిరిగి ప్రయత్నం చేయక పోవడం అసలయిన ఓటమి అన్న దానిని అనుసరించి

పేపర్ బాయ్ నుంచి దేశ అత్యున్నత దేశాధ్యక్ష పదవికి ఎదిగిన భారతరత్న అబ్దుల్ కలామ్ గారు చెప్పినట్లు
కలలు కనండి కలలు కనండి ఆ కలలను నెరవేర్చుకునే ప్రయత్నంలో
ఎన్ని అవరోధాలు ఎదురైన
ఆదరక,బెదరక ముందుకు సాగితే లక్ష్యం నీ దరి చేరు అన్నది అనుసరించిన
'ప్రయత్నమే విజయానికి సోపానం
అది జీవిత సాఫల్యతకు ప్రతీక...!!
..............................
ఇది కవితాగానం సీజన్5 చైత్రమాస పౌర్ణమి పోటీకొరకు వ్రాసిన నా స్వీయరచన
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
(పుష్యమి)
విశాఖపట్నం
9963264762.
.......................

8
*
గజవెళ్ళి శ్రీనివాసాచారి 
జిల్లా 
*
కాజీపేట హన్మకొండ జిల్లా 
కవిత
*

అంశం: ప్రయత్నము
శీర్షిక: పాశుపతాస్త్రము 
...
మానవ జీవితంలో 
గెలుపు ఓటములు సహజమేగా

ఓటమి అంటే 
గెలవకపోవడం కాదుగా
ప్రయత్నించకపోవడమే; 
ప్రయత్నం మనిషి చేతిలో 
పాశుపతాస్త్రమే

లక్ష్యసాధనలో 
కష్టాలను ముందే ఊహించుకుని 
ప్రయత్నం విరమించడము 
మూర్ఖత్వమేగా 

ప్రతికూల పరిస్థితులలోనూ 
ప్రయత్నం, పట్టుదలతో 
ముందుకు సాగడమే
విజేతల లక్షణము 

అవమానాల ముళ్ళు 
ఎదకు గాయం చేస్తున్నా 
నిరాశా నిస్పృహలు 
చుట్టుముడుతున్నా 
లక్ష్యం దిశగా పయనించాలి

స్వాతంత్ర్య సంగ్రామంలో 
ఎందరో దేశభక్తులు 
చిత్తశుద్ధితో ప్రయత్నించి 
ప్రాణాలు త్యాగం చేసిన 
ఫలితమేగా నేటి స్వాతంత్ర్యమ

: 9
*
డా.వేమూరి.సత్యవతి
జిల్లా 
*
కృష్ణా
కవిత
*
శీర్షిక _ "చింతామణి"
  
ఎండిపోయిన కొమ్మ లో ఆరాటం చిగురైంది!
నరికేసినా చైతన్యం పచ్చదనమై పకపకమంది!
అలలతో ఎగసే అంతూ-దరీ లేని అగాధ జలాలపై
రామదండు వార్ధిపై నిలచే రాళ్ల వారధి తెచ్చారు!
బాటకై కొండల్ని తొలచే తపన దూరాన్ని తగ్గించింది!
 రాపిడి యజ్ఙం రాయిని రత్నం గా వెలిగించింది !
వేలాది గొంతుల వ్యతిరేకత ఉద్యమంపై విప్లవమైంది!
సావిత్రి "ఆత్మ-శక్తి" పతి ప్రాణమై తిరిగొచ్చింది! 
గొంతులో ధ్వనులను సాధన సంగీతంగా పలికించింది!
అక్షరం పేర్చాలనుకుంటేనే మంచిరచనై అలరిస్తుంది!
పనిగట్టుకుని వేదనని తరిమితేనే ఉత్సాహం వస్తుంది!
ప్రకృతి యత్నమంతా ఆరు ఋతువులనందించటానికే!
రాతి మీద ఉలి లయాన్విత నాట్యమే శిల్పమయ్యేది!
వెదురు బొంగు లో గాలి ఊదితేనే మురళీ రవళి!
తాబేలు ఆగిపోని నడకే కుందేలు పై గెలుపుని తెచ్చింది !
ఎదలో చీకటి ని చెదర గొడితేనే వెలుగు విచ్చుకొంటుంది!
వేలి పై కుదురైన‌ నల్లచుక్క ఐదేళ్ళ నిశ్చింతనిస్తుంది!
ఆశే లేని తరుణంలో ఆఖరియత్నమే అక్షయవస్త్రమైంది!
విమర్శ నుంచి యత్నం నాపచేను పంటగా నవ్వుతుంది!
అసలంటూ ప్రయత్నం చింతలు తీర్చే చింతామణి కదా!
సిధ్ధించినా, లేకున్నా శ్రమించే అనుభవాల-సిరి నీదే కదూ?!
ఆపని ప్రయత్నమే కర్తవ్యమనేది పరమాత్మ గీత కదా!!?
          ‌. *******

చింతామణి అనే ఈ కవిత నా సొంత రచన!
10
 ఏ పనైనా నా వల్లకాదు అనుకోవడం మూర్ఖత్వం/.
ప్రయత్నించి చూద్దాం అనుకోవడం ఉత్తమం/.
ప్రయత్నించి పని ప్రారంభిస్తేనే కదా పూర్తి చేయడం సాధ్యం./
అసలు ప్రయత్నమే చేయకుండా నిర్లక్ష్యం చేసే వాడు నీచమానవుడు./
ప్రయత్నించి మధ్యలో వదిలేసే వారు మధ్యములు./
పలుమార్లు ప్రయత్నించి సఫలీకృతులయ్యేవారు ధీరులు.
పట్టివిడుటకన్న పడి చచ్చుటే మేలు అన్నాడు వేమన్న.
ప్రయత్నించి సఫలీకృతులు కావడంలో మనందరికీ ఆదర్శం భగీరథుడు./.
ఎంతో ప్రయత్నంతో గంగను ఆకాశమునుండి భువికి తీసుకురావడంలో అయినాడు కృతకృత్యడు.
అపర భగీరథుల్లా ప్రయత్నించి అనుకున్న లక్ష్యాన్ని చేరారెందరో మహానుభావులు.
ప్రయత్నించే కదా రామయ్య వారధి నిర్మించింది./
ప్రయత్నంతోనే కదా గీతాచార్యుడు అర్జనుడికి కనువిప్పు కల్గించింది./
కఠోర ప్రయత్నం తోనేకదా దేవదానవులు క్షీరసాగర మథనం కావించింది.
మానవ ప్రయత్నం ఉంటే తప్పక ఉంటుంది దైవసహాయం./ సాధించొచ్ఛు తొలి ప్రయత్నం లోనే విజయం.
జాగుచేయక అనుకున్న పనిని ప్రారంభిద్దాం.
నిరంతరం ప్రయత్నంతో ఫలితం సాధించి కృతకృత్యులౌదాం.
ప్రయత్నించి చూస్తే పోయేదేముంది?
అపజయాన్ని ‌పారద్రోలడం తప్ప.

కవితా గానం సీజన్ 5
చైత్రమాసం పౌర్ణమి నగదు బహుమతులు పోటీ
అంశం:ప్రయత్నం
శీర్షిక: ప్రయత్నించి చూద్దాం

తిప్పావఝల నరసింహమూర్తి.

11
*
మద్ది. పుల్లారావు
జిల్లా 
*
NTR
కవిత
*
ప్రయత్నం పురుష లక్షణం ఒకప్పటి మాట
ప్రయత్నం సర్వుల లక్షణం ఇది నేటి మాట
భగీరధుడు చూపించె ప్రయత్నం శక్తి ఎంతో! 
విశ్వామిత్రుడు బ్రహ్మర్షి గా మారే ప్రయత్నం తోనే
ఏకలవ్యుడు మేటి విలుకాడాయె ప్రయత్నం తోనె
ఎన్నో లోక కళ్యాణ విప్లవాల కు నాంది కొందరి ప్రయత్నమే! 
సాధన చేయుము రా నరుడా
సాధ్యము కానిది లేదురా
యని వచించితిరి మన పెద్దలేనాడో
అలుపెరగని ప్రయత్నాలతో శాస్త్రవేత్తలు
విజ్ఞానరంగంలో అద్భుతములు సాధించె
గుహ నుండి మహలు దాకా
నడక నుండి రోదసీ నౌక దాకా
అమ్ముల నుండి అణ్వస్త్రాల దాకా
దివిటీల నుండి విద్యుద్దీపాల దాకా
అణువు నుండి అంతరిక్షం దాకా
మానవ పురోగతి ప్రయత్న ఫలితమే గదా! 
శ్రమను విల్లు గా, ప్రయత్నాలు అక్షయ తూణీరాలుగా
సంకల్పము తో ముందుకు సాగు వానికి
ఈ ధరాతలాన అసాధ్యమన్నది లేదు గదా! 
కృషితో నాస్తి దుర్భిక్షం
శ్రధ్దావాన్ లభతే ఙ్ఞానం
కర్మ సిద్ధాంతం మూల సూత్రం ప్రయత్నమే
ఇవన్నీ ప్రయత్నం అను పదానికి గౌరవ వాక్కు లు గదా!

12
పేరు : డా.భమిడిమఱ్ఱీ కమలాదేవి
తేది : 25-4-24
అంశం : ప్రయత్నం

శీర్షిక : యత్నేన సాధ్యతే సర్వం

'యత్నేన సాధ్యతే సర్వం'
అక్షరసత్యం
సాధ్యమవుతాయి జీవితంలో
ఏవైనా ప్రయత్నంతో
ఉండకూడదు ప్రయత్నలోపం
ఎప్పుడూ
"అనగననగరాగమతిశయిల్లుచు నుండు
తినగతినగ వేము తీయగుండు"
అన్నాడు యోగివేమన
అదే వస్తుంది రాగం
పాడగా పాడగా 
అర్థం అయి తీరవలసిందే చదవగా చదవగా ఎంతటి క్లిష్టమైన విషయమైన
" ప్రాక్టీస్ మేక్స్ ద మాన్ పెర్ ఫక్ట్"
ఆంగ్ల ఆర్యోక్థి
విజయసౌధానికి గట్టి పునాది
ప్రయత్నం
విజయాలనావను నడిపే చుక్కాని ప్రయత్నమే
విజయపథానికి దారిచూపే
వెలుగుదివ్వె ప్రయత్నం
విజయసోపానికి తొలిమెట్టు ప్రయత్నం
కార్యసాఫల్యానికి బలమైన సాధనం, ఒకఉపకరణం కూడ ప్రయత్నం
సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు లోకంలో
సాధించచ్చు దేనినైనా ప్రయత్నంతోటే
అసాధ్యాలను సుసాధ్యాలు చేసే గొప్ప సాధనం ప్రయత్నం
చేయండి గట్టి ప్రయత్నం దేనికైన
వెతుక్కుంటూ తనే వస్తుంది మీ చెంతకు విజయలక్ష్మి
ప్రగతి పథంలో సాగండి ముందుకు జయలక్ష్మి చేయి పట్టుకుని.

పైకవిత నాస్వంతం
13
అంశం--- "ప్రయత్నం "

   ప్రయత్నం వుంటే
సాధించలేనిదంటూ లేదు.
ఆశతో ప్రయత్నించాలి
నిరాశా నిస్పృహలతో
ఏదీసాధించలేము
ఏ ప్రయత్నమైనా మానవాళిమేలుకోరి
ప్రయత్నించాలి.
అంతేగాని స్వార్థపూరితముగా
వుండరాదు.
అట్టి ప్రయత్నానికి ఆపరమాత్మసాయం
తప్పకుండావుంటుంది.
సాలిపురుగు తనగూటి నిర్మాణానికి
తానెంతకష్టపడితే కట్టగలిగింది.
ఒక్కొక్కసారి ఒక్కరివల్లనే
ఏప్రయత్నం నెరవేరదు.
అందరి ప్రయత్నము అవసరముంటుంది
మానవప్రయత్నం మొకటివుంటే
భగవంతుడైనా మనతోపాటు తానూ ప్రయత్నిస్తాడు.
మంచిపనికి పదిమందిసాయ మవసరముంటుంది.
పదిమంది నాయికులతోపాటు ప్రజలుకూడాప్రయత్నిస్తేకదా
దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.
గాంధిమహాత్ముని శాంతి సమరాలు,
అల్లూరి, భగత్ సింగు, కట్టబొమ్మ, సుభాసువీరుల త్యాగబలముతోపాటు,
ప్రజలలోరేగిన చైతన్య ప్రభారాల
దేశప్రజల ఘోషల ప్రయత్నాలే
మన దేశస్వాతంత్ర్యయానికి మూలకారణాలు.
ఏదిసాధించాలన్నా మనప్రయత్న మొకటే
మనకు "శ్రీరామరక్ష "
                        రచన
      తరణికంటి సూర్యలక్ష్మి.
                 *****
14
పేరు కొంజేటి రాధిక 
ఊరు రాయదుర్గం 
అంశం... ప్రయత్నం 
శీర్షిక.... అస్త్రం 
9493273114

కార్య సాధనకై చీకట్లోనైనా సంధించే గురి తప్పని రామబాణం ప్రయత్నం... ఆశయ సాధనకు ఆయువునిచ్చే పాశుపతాస్త్రమే ప్రయత్నం....
 లోపం లేకుండా చేస్తే ఫలితం నీ బతుకు ముంగిట్లో రంగుల హరివిల్లై విరుబూసి,
నీ పెదాలపై ఆనందం నాట్యం చేయిస్తుంది... లక్ష్యం చేరే దాకా అవరోధాల్ని లెక్కచేయక, లెక్కకు మించిన యత్నాలే విజయ సాధనకు సోఫానాలు...
 నిరంతర సాధనే నీ విజయ రహస్యమైతే, మహోన్నత శిఖరంపై 
నిన్ను అధిరోహింప చేస్తుంది ప్రయత్నమనే ఐరావతంపై... అసాధ్యాలని సుసాధ్యం చేసేందుకు...
 ప్రయత్నాల పరంపర అనే వారధిని ఏర్పరచి, నిర్దేశించుకున్న దుర్వేద్యమైన గమ్యాన్ని చేరెందుకు ప్రయత్నం ముళ్ళబాటను పూల పాన్పుగా మలచుకోవాలి, కఠిన దీక్షను మనసులో ఉంచుకుని,
 పట్టుదలను ప్రగతికి పై మెట్టుగా చేసుకుని, సంకల్పాన్ని గాలిగా పిలుస్తూ...
 క్రమశిక్షణనే కంకణంగా కట్టుకుని,
 నిద్రయనే సుఖానికి దూరంగా..
 వ్యాపకాలకు తిలోదకాలిచ్చి,
 గమ్యాన్ని చేరే దాకా... విజయంక మోగించేదాకా....
 అలుపెరగని గజని దండయాత్రల పరంపర కొనసాగితేనే ప్రతిపాలించేది...
 ప్రయత్నం చేరే దాకా ఆపకు...
 మళ్లీ మళ్లీ చేసే ప్రయత్నమే నీ గమ్యాన్ని చేర్చే రాచమార్గమవుతుంది...
13

     "క్రోధినామ సంవత్సరం "
'చైత్రమాసం పౌర్ణమి కవితల పోటీ '
అంశం--- "ప్రయత్నం "

   ప్రయత్నం వుంటే
సాధించలేనిదంటూ లేదు.
ఆశతో ప్రయత్నించాలి
నిరాశా నిస్పృహలతో
ఏదీసాధించలేము
ఏ ప్రయత్నమైనా మానవాళిమేలుకోరి
ప్రయత్నించాలి.
అంతేగాని స్వార్థపూరితముగా
వుండరాదు.
అట్టి ప్రయత్నానికి ఆపరమాత్మసాయం
తప్పకుండావుంటుంది.
సాలిపురుగు తనగూటి నిర్మాణానికి
తానెంతకష్టపడితే కట్టగలిగింది.
ఒక్కొక్కసారి ఒక్కరివల్లనే
ఏప్రయత్నం నెరవేరదు.
అందరి ప్రయత్నము అవసరముంటుంది
మానవప్రయత్నం మొకటివుంటే
భగవంతుడైనా మనతోపాటు తానూ ప్రయత్నిస్తాడు.
మంచిపనికి పదిమందిసాయ మవసరముంటుంది.
పదిమంది నాయికులతోపాటు ప్రజలుకూడాప్రయత్నిస్తేకదా
దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.
గాంధిమహాత్ముని శాంతి సమరాలు,
అల్లూరి, భగత్ సింగు, కట్టబొమ్మ, సుభాసువీరుల త్యాగబలముతోపాటు,
ప్రజలలోరేగిన చైతన్య ప్రభారాల
దేశప్రజల ఘోషల ప్రయత్నాలే
మన దేశస్వాతంత్ర్యయానికి మూలకారణాలు.
ఏదిసాధించాలన్నా మనప్రయత్న మొకటే
మనకు "శ్రీరామరక్ష "
                        రచన
      తరణికంటి సూర్యలక్ష్మి.
                 *****

15 
*
శాడ వీరారెడ్డి. (యస్వీరెడ్డి)
జిల్లా 
*
సిద్దిపేట
కవిత
*
అప్పుడే అనుకున్నా..
అప్పుచేసైనా మరొక్కసారి 
గొప్పకోచింగ్ సెంటర్లో చేర్పించాలని

ముడి వజ్రం లాంటి కొడుకుని
మూడు రోజులైనా ఇంటిపట్టున ఉండనీక
పెట్టే-బేడా సదిరి నెట్టినంత పనిచేసా..

పోయిన దగ్గర్నుంచి వారాంతాల్లో
ఫోను కిలుక్కుమన్నపుడల్లా
మెయిన్సు మార్కుల మెసేజీలే అనుకున్నా.

చదువుతున్నావా? అనే అడిగా
ఏంటీ మార్కులని కడిగా!
పెట్టుబడికి, మార్కుల రాబడికి వ్యత్యాసమే చూసా

ఒక్కసారి ఇంటికొస్తా నాన్నా! అన్నా
ఒద్దొద్దనే అన్నా.. 
బుద్ధిగా చదువుకోమన్నా..

మెరుగుపడుతుంటే,..మెరిసిపోతుంటే
మురిసిపోయాను, శ్రమ మరిచిపోయాను
ఒరిపిడైతే తప్ప ఒడ్డునపడడనుకున్నాను.

పెరిగిన ఒత్తిడి మెదడును కరిగిస్తే
తిరోగమనం మొదలైంది
తిరిగి ఏ ముఖంతో రావాలనుకున్నాడో ఏమో

సాగనంపిన పెట్టెనక్కడే పెట్టి
సరాసరి *పెట్టెలోనే వచ్చాడు చల్లగా..*
సారీ నాన్నా ! అంటూ ఉత్తరం రాసి మరీ..

చదివించాలనే నా ప్రయత్నాలు 
చదవాలనే వాడి ప్రయత్నం 
'మెయిన్' (స్) గేటు ముందే సమాధియై
ఫలితాలు రెపరెపలాడుతున్నాయ్ పేపర్లలో..

16 
*
దోసపాటి వేంకటరామచంద్రరావు
జిల్లా 
*
విజయనగరం
కవిత
*
కవితాగానం సీజన్ 5 చైత్రమాస పౌర్ణమి కవితలపోటి
అంశం:ప్రయత్నం
దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం
శీర్షిక::ఆరంభమే ఆదర్శం.
వేయి ఆడుగులు దాటాలంటే మొదటి అడుగు వేయాలి
తొలి అడుగే తొలి విజయం కావాలి
ఆరంభంశూరత్వం కారాదు ప్రయత్నం
యత్నింస్తే కాదేది అసాధ్యం
ఆవేశం కాదు ఆరంభం
ఆలోచనయే ఆదర్శం

సరియైన సమయంలో చేసుకొనేదే నిర్ణయం
ఆలస్యమైతే అదే విషతుల్యం
సాధనతో కూడినదే సామరస్యం
సాహసం చేస్తేనే సహచర్యం
ఆరంభమే ఆదర్శమైతే
ఆశయం ఆచరణీయం
అడ్డుగోడలు తొలగించాలి
అవరోధాలు అధిగమించాలి
అపజయాలను ఆహ్వానించాలి
ఫలితం కావాలంటే ప్రయత్నము చేయాలి
చెమటపడితేనే శ్రమ ఫలిస్తుంది
చీమను చూస్తేచాలు శ్రమవిలువ తెలుస్తుంది
ప్రయత్నం కాకూడదు ప్రచారం.

17
*
బాలు కత్తుల 
జిల్లా 
*
ఉమ్మడి నల్గొండ 
కవిత
*
కవిత శీర్షిక: ప్రయత్నం

ప్రయత్నిస్తే పోయేదేముంది
ఓటమి తప్ప....
జీవితంలో గెలవాలంటే
గెలుపొందే వరకు ప్రయత్నిస్తూ ఉండాలి
సమస్యలపర్వం ఒడిదుడుకుల నేస్తం వెంటాడుతున్న
మన చుట్టూ సుడిగుండాలై చుట్టూ ముట్టిన..
మన ముందర ముళ్ళ బాటలు కనిపిస్తున్న..
అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్న..
కారు మబ్బులు కమ్ముకు వస్తున్న..
అగ్ని రవ్వలు ఎగిరి పడుతున్న..
సముద్ర అలలు ఎగిసిపడుతున్న..
తుఫాను కెరటాలు ఏకమై ఆకాశం ఎత్తుకు తీసుకెళ్లిన.. 
ప్రయత్నం మాత్రం మరువకు 
పట్టిన పట్టు వదలకు
ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలి 
ఏదేమైనా గెలుపొందే తీరాలి
లక్ష్యాన్ని ఢీ కొట్టి చూడాలి
చివరి శ్వాస వరకు పోరాడే 

బాలు కత్తుల
ఉమ్మడి నల్గొండ 
9676219655
18
*
కోడూరు లలిత 
జిల్లా 
*
సిద్దిపేట 
కవిత
*
శీర్షిక: *ప్రయత్నం* 

నా *ప్రయత్నం!* 

ప్రయత్నం లేకుండా ఏ పనైనా 
జరిగే పనా... ప్రయత్నమే 
ఓ పని! అదే ఆ ప్రయత్నమే 
నిరంతరం *ప్రయత్నిస్తూ* ఉన్నాను!  

అనారోగ్య బాధితులకు 
అసంబద్ధ జీవనశైలితో 
రోగగ్రస్తమైన జనావళికి 
వెలలేని పూలు పండ్లు ఆకులు బెరడ్లు వేర్లు ఎన్నని?!
ఓషధుల సంజీవనులతో
ఆరోగ్యాన్ని అందించే 
*ప్రయత్నం* చేస్తూనే ఉన్నాను ! 

రకరకాల స్వార్థం పెచ్చరిల్లి
చెట్టు చేమను నరికే 
మూర్ఖజాతి కోసం....
ప్రాణవాయువు అందించే 
*ప్రయత్నం* చేస్తూనే ఉన్నాను ! 

నన్ను పట్టించుకోని నాయకులు 
అభివృద్ధి పేరుతో 
గుట్ట గట్టు అన్నింటిని నామ 
రూపం లేకుండా చేసినా....
ఎటువంటి కీడు చేయక
మౌనంగా ఉండే *ప్రయత్నం* 
చేస్తూనే ఉన్నాను ! 

అమృతజలం! ఎంతో అమూల్యం! 
అంతా సముద్రునికే అంకితం! 
ఎందరు వర్షాన్ని ఒడిసి పట్టి 
దాచుకుంటున్నారు? ఐనా 
భూగర్భ జలనిధిని అందించే 
*ప్రయత్నం* చేస్తూనే ఉన్నాను ! 

ప్రకృతి ప్రేమికులం అనే 
ఓ కులం ఉంది తెలుసా? వీరికి 
కులం పేరు చెప్పుకోవడంలో 
ఉన్న కాంక్ష ఓ మొక్కను పెంచడానికి లేదే... ఐనా 
కొండవాగులు సెలయేళ్ళను 
సజీవంగా ఉంచే *ప్రయత్నం* 
చేస్తూనే ఉన్నాను !

నేల నింగి గాలి వాన సమస్తం 
కలుషితం... మితిమీరిన స్వార్థం 
నాటి వ్యవసాయం నేడు 
రసాయనాల *వ్యయసాయం* !
ఐనా మానవాళికి ఆకలి తీర్చే 
*ప్రయత్నం* చేస్తూనే ఉన్నాను!

ఇంతకీ నేనెవరో చెబితే కానీ 
గుర్తు పట్టలేని జాతి మీది 
తాతల తత్వం నుండి ఏ
వారసత్వం నిలబెట్టుకోలేని 
మీకు.... నేనెవరో చెబితే కానీ 
గుర్తు పట్టలేని జాతి మీది! 

ధరిత్రిపై నా ఆనవాలు 
పర్యావరణం నా ముద్దు పేరు 
ప్రకృతి నా అసలు పేరు !
నన్ను నన్నుగా గౌరవించే 
కీటకాలు పక్షులు జంతువులు 
జలజీవులు అన్ని... అన్నీ 
నన్ను సంతోష పెట్టేవే ! తెలివైన 
మనిషి మాత్రమే నన్ను నాశనం 
చేస్తూ... తన వినాశనానికి 
అంపశయ్య పేర్చుకునే 
*ప్రయత్నం* చేస్తూనే ఉన్నాడు!

19 
*
లలితాచండి
జిల్లా 
*
హైదరాబాదు 
కవిత
*
*కవితా గానం సీజన--5*
*చైత్ర మాసం పౌర్ణమి పోటీలకు*
*అంశము--ప్రయత్నం*
*శీర్షిక --- అనుకుంటే కానిదేముంది* 
*రచన--లలితాచండీ*

కృషి వుంటే కానిదేముంది
ప్రయత్నిస్తే ఫలితం నీదేగా!
భగీరధుడు తేలేదా!గంగను ఇల పైకి 
మంచి చెయ్యాలనుకుంటే
 వెనకా ముందు చూడక
 మంచి చెడులను ఎంచక
 లాభం నష్టం అంటూ నసగక
 ఆలస్యం అసలే చెయ్యక ప్రయత్నిస్తే కానిదేమున్నది?...

కపి వరులైతేనేమి కడలిపై వారధి కట్టలేదా! చిట్ట ఉడుత చిరు ప్రయత్నం వినలేదా!    
 రామ గురుతులతో మోక్షం
పసివాడు ధ్రువుడు లేడా మనకు ఆదర్శం 
బ్రతుకు పోరాటంలో కడలి
ఆటుపొట్లలో, తెడ్ల వెేటులో
ఒడిదుడుకులు మలుపులలో
గెలుపుకై ప్రయత్నిస్తే,తీరం చేరువే కదా!

అహింసే ఆయుధంగా
సత్యాగ్రహంమే సాధనంగా
రాలేదా స్వాతంత్ర్యం 
అందుకే తెలుగు భాషకు 
జై కొడదాం తెలుగే మాట్లాడదాం
దేశభాష లందు తెలుగు లెస్స అంటూ 
తెలగు పిలుపులో పలుకుదాం  
పలుకు పలుకులో వెలుగుదాం
తెలుగు పధంగా మెదులుదాం 

 
లలితాచండి
రచయిత్రి/న్యాయవాది
ఫోన్ నెంబర్ 
9885552922
20
సింహాద్రి వాణి గారు 
కవన జ్యోతి‌ సీజన్--5
చైత్రమాసం పౌర్ణమి నగదు‌పురస్కారాల కవితలు పోటీకి
అంశం:-- ప్రయత్నం 
రచన:-- సింహాద్రి వాణి
శీర్షిక:-- ప్రయత్నం
ఊరు:-- విజయవాడ
చరవాణి:--7569820872 

జీవనయానంలో, జీవిత గ్రంథంలో లిఖించే ప్రథమ పదం ప్రయత్నం

తీసుకునే‌ తొలి ఊపిరితో‌ ఆరంభమైన ప్రయత్నం, కొన ఊపిరి వున్నంత వరకూ నిరంతరం సాగే యత్నం.
సృష్టిలో అప్పుడే పుట్టిన ప్రతి ప్రాణి, ప్రథమంగా తీసుకునే ఆహారం ప్రయత్నంతో లోపలికే మింగుతుంది. 
కానీ, బయటకు ఊయదు. అదే, సృష్టి రహస్యం.
ఫలితం లేని ప్రయత్నం వుంటుంది. కానీ, ప్రయత్నం లేని ఫలితం వుండదు.
జీవిత పోరాటంలో బ్రతుకు ఆరాటంలో అపజయాలు ఎదురైనా అకుంఠిత కార్యదీక్ష తో, పట్టుదల, ధైర్యంతో విజయాలను సాధించాలి.
ప్రయత్నం ఒక నిరంతర సాధన
ఫలితాన్ని సంపాదించుకొనే సాధనం.
ప్రయత్నం అలుపెరుగని ప్రయాణం. 
ప్రయత్నం అద్భుతాలు సృష్టించే మూలధనం.
ప్రయత్నం గరళాన్ని అమృతంగా మారుస్తుంది.
ప్రయత్నం ఎడారిలో పూలు పూయిస్తుంది.
ప్రయత్నం లేనిదే జ్ఞానం లేదు.
ప్రయత్నం లేనిదే విజ్ఞానం లేదు.
ప్రయత్నం లేనిదే ప్రగతి లేదు
ప్రయత్నం లేనిదే జగతి లేదు.
ప్రయత్నం చేయనివాడు ఏదీ సాధించి లేడు.
విశాల విశ్వం నిండా ఎగిరే విజ్ఞాన పావురాలు
ప్రయత్నం ప్రభవించిన సుజ్ఞాన వరాలు.
అత్యున్నతంగా ఎగిరే విజయ పతాకాలు
అలుపెరుగని ప్రయత్నానికి నిదర్శనాలు.

హామీ:-- ఇది నా స్వీయ రచన.


 
21
*
శాడ వీరారెడ్డి (యస్వీరెడ్డి)
జిల్లా 
*
సిద్దిపేట 
కవిత
*
*ప్రయత్నం*


అప్పుడే అనుకున్నా..
అప్పుచేసైనా మరొక్కసారి 
గొప్ప కోచింగ్ సెంటర్లో చేర్పించాలని

ముడివజ్రం లాంటి కొడుకుని
మూడు రోజులైనా ఇంటిపట్టున ఉండనీక
పెట్టే-బేడా సదిరి నెట్టినంత పనిచేసా..

పోయిన దగ్గర్నుంచి వారాంతాల్లో
ఫోను కిలుక్కుమన్నపుడల్లా
మెయిన్సు మార్కుల మెసేజీలే అనుకున్నా.

చదువుతున్నావా? అనే అడిగా
ఏంటీ మార్కులని కడిగా!
పెట్టుబడికి, మార్కుల రాబడికి వ్యత్యాసమే చూసా!

ఒక్కసారి ఇంటికొస్తా నాన్నా! అన్నా..
ఒద్దొద్దనే అన్నా.. 
బుద్ధిగా చదువుకోమన్నా..

మెరుగుపడుతుంటే ,మెరిసిపోతుంటే
మురిసిపోయాను,శ్రమ మరిచిపోయాను
ఒరిపిడైతే తప్ప ఒడ్డునపడడనుకున్నాను.

పెరిగిన ఒత్తిడి మెదడును కరిగిస్తే
తిరోగమనం మొదలైంది.
తిరిగి ఏ ముఖంతో రావాలనుకున్నాడో ఏమో

సాగనంపిన పెట్టెనక్కడే పెట్టి
సరాసరి *పెట్టెలోనే వచ్చాడు చల్లగా..*
సారీ నాన్నా ! అంటూ ఉత్తరం రాసి మరీ..

చదివించాలనే నా ప్రయత్నాల్ని
చదవాలనే వాడి ప్రయత్నాన్ని
'మెయిన్' (స్) గేటు ముందే సమాధి చేస్తూ
ఫలితాలు రెపరెపలాడుతున్నాయ్ పేపర్లలో..

22
కొమురవెల్లి అంజయ్య
జిల్లా 
*
సిద్ధిపేట 
కవితy
*
అంశం ప్రయత్నం
శీర్షిక కదలిక

మొదట్లో తప్పటడుగులే పడ్తాయి
ఆరంభ శూరత్వం ప్రదర్శిస్తే చతికిలపడతాం
ఎన్నిసార్లు కింద పడ్డా పైకి లేవాలి, ముందుకు కదలాలి
పలకపై బలపంతో అక్షరాలు దిద్దినట్లు
అన్ని సరిదిద్దుకోవాలి మళ్ళీ మళ్ళీ
ప్రయత్నం కావాలి కదలికకు స్ఫూర్తి
ప్రయత్నాల వాకిట్లోనే అటూ ఇటూ కదులుతుంటే
పెద్దర్వాజా దాటం, మాట పతారా పోగొట్టుకుంటుంది

రాజకీయ నాయకులు ఇస్తారు హామీలు ఎన్నికలలో
గెలిచాక ప్రయత్నాలంటూనే చెప్తారు సాకులు
చెల్లని కాసులు పెడ్తారు చెవుల్లో
ముందుకు కదలని ప్రయత్నాలు మొదటికే మోసం

ఎంత ప్రతిభావంతులైనా
పొరపాటున కాలు జారితే ఆగిపోవద్దు అక్కడే
ప్రయత్నించి దారి మార్చుకోవాలి, కాదంటే జంప్ చేయాలి
తప్పు తమదైతే ఒప్పుకోవాలి వినయంగా
సరిదిద్దుకోవాలి సత్వరమే

ప్రయత్నం మీద పనితనం జీవుల లక్షణం
పాము కుబుసం విడిచినట్లు వదిలించుకోవాలి కొన్ని
ఎండలో కమిలిపోకముందే చేరాలి నీడకు
కాళ్లు కాలకుండా చెప్పులేసుకున్నట్లు
తెలివిని ఆసరా చేసుకుని మసులుకోవాలి

ఫోన్ నెంబర్ 
*
9848005676

23
వాణి సరోజని లక్క రాజు గారు 
కవతాగానం
కవిపేరు వాణి సరోజిని లక్కరాజు 
హైదరాబాద్ 
అంశం ప్రయత్నం .
సెల్ నెంబర్ 9491054829

కృషితో నాస్తి దుర్భిక్షం .అనిఆర్యోక్తి
కృషివుంటే మనుషులు ఋషులుగామారి
మహాపురుషులౌతారు .అని యొకమహాకవియన్నట్లుగా ,
ఒక ప్రయత్నం తోరాయి రత్నమై కనువిందు చేస్తుంది కంఠహారంగా
 స్వప్నావస్ధను జాగృతంచేసి స్వయంకృషికి పునాదియై
తనలోనిఆలోచనలకు పదునుపెట్టి నిదురలేపుతుంది. 
మందగొడిలో చైతన్యం రగిల్చి నైపుణ్యం ప్రజ్వలింపజేసేది
 మంచి ప్రయత్నమే 
జీవితాన్ని మలుపు తిప్పి చరిత్రపుటలలో చిరునామా
చిరస్థాయిగా నిలుపుతుంది 
పరమపద సోపానపటంలా ,నిచ్చెన యెక్కటం, జారి పడటం 
పయత్నంలో భాగాలే 
తొలియడుగు తప్పటడుగయినా మలియడుగు మలుపుదిరిగి విజయ పధానికి సారధి యోతుంది .
నిర్వేదం, నిరుత్సాహం, దరికిచేరనీక ,పట్టుదలకు పట్టంగడితే , ప్రయత్నంమనిషిని విజయపధంలో పరుగులెత్తిస్తుంది
ఒక ప్రయత్నం తో అట్టడుగు స్దానంనుండి అంబరాన్ని చుంబించిన మట్టిలో మాణిక్యాలు యెంతమందిలేరు ?
భగీరధుడు భాగీరధిని భారతావనికిజేర్చి ,పుడమి నభిషేకించలేదా ?
భరతమాతశృంఘలాలనువదిలించటానికి ,మహాత్మునితోపాటు యెందరో మహాను భావులు పోరాడి గెలువ లేదా ?
చినుకుగా మొదలైన కందుకూరి సంఘసంస్కరణలు
ఝరీపాతాలై సమాజంలో వెల్లువెత్తాయిగదా !
పేపర్బాయిగా పనిజేసిన అబ్దుల్ కలాం అంబరాన్ని అందుకునేందుకు చేసినప్రయత్నం అధ్భుత
ఫలితాలను అందించలేదా ?
ప్రయత్నం పొరపాటు కాదు, ఒకఅవసరం.
ఒక ప్రయత్నం విపత్తును దూరం చేసి ,విలువైన ప్రాణాలకు పునర్జీవితం ప్రసాదిస్తుంది .
పదిమందికి వుపయోగపడే ప్రయత్నం .సమాజాన్ని 
అభివృధ్ధి పధంలో పరుగులెత్తిస్తుంది 
ప్రయత్నాన్ని భగవంతుని దీవెనగా భావించి 
మొదలు పెడి తే దైవమే వెన్నుతట్టి విజయ పధంలో నడిపిస్తాడు. 

ప్రయత్న మనే పైవచనకవిత నాస్వీయరచన .

24
తోట సులోచన గారు 
కవనజ్యోతి కవితా గానం సీజన్ -5
చైత్ర మాసం పౌర్ణమి కవితల పోటీ 

అంశం ప్రయత్నం 
శీర్షిక విజయానికి ప్రయత్నం నాంది 

ఎముకలు కొరికే మంచు పర్వతాలపై 
కాలు మోపి,ప్రాణాలను తృణప్రాయంగానెంచి 
ఎందరో శిఖరాల నధిరోహించడం
 కలలను సాకారం చేసుకునే ప్రయత్నమే 

కార్య సాధనకు ప్రయత్నం నాంది 
తొలి అడుగు ప్రయత్నంతో ఆరంభమే 
ఈ పోటీ ప్రపంచంలో ప్రయత్నమొకటే చాలదు 
సంకల్పదీక్ష,పట్టుదల,సహనాలే మూలస్తంభాలు 

అబ్దుల్ కలాంగారు నిరుపేద కుటుంబంలో 
పుట్టి యనేక కష్ట నష్టాల కోర్చి, ప్రయత్నమే 
ఆయుధంగా, దీక్షా పట్టుదలే పెట్టుబడిగా 
నిరంతర సాధనతో విజ్ఞానఘనిగా నిలచె
తుదకు దేశ ప్రధమపౌరునిగా యెంపిక కాగా 
భరత దేశ ఖ్యాతి విశ్వమంతా మారుమ్రోగే 

కృషితో నాస్తి దుర్భిక్షం అన్నది సత్యం 
మంచి సంకల్పానికి ప్రయత్నం తోడైతే
విజయం నీ ముంగిట ప్రత్యక్షమే మరి 
కొన్ని సార్లు ప్రయత్నమెంత సాధనతో 
సాగినా ఓటమితో కష్టాల కావడే 
అప్పుడు సాగరంలోని కెరటాలే ఆదర్శం 
భగీరధుని కఠోర ప్రయత్న ఫలితమే 
 గంగమ్మ తల్లి భువిని పావనం జేసే 
అందుకే భగీరధ ప్రయత్నమని ప్రసిద్ధి         
శ్రమకు తగిన ఫలితంతో నీ మనసు 
విహంగమై నింగిలో విహరించు 

తోట సులోచన 
నెల్లూరు
చరవాణి 9490173053

హామీ పత్రం 
ఈ కవిత నా స్వంతమని హామీ ఇచ్చుచున్నాను


25
*
కేశరాజు వేంకట ప్రభాకర్ రావు 
జిల్లా 
*
ఖమ్మం 
కవిత
*
కవనజ్యోతి సీౙన్5 
చైత్రమాసం పౌర్ణమి కవితల పోటీ 
27/4/2024
అంశం:::ప్రయత్నం 
శీర్షిక:::: కృషి 
స్వీయ రచన కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, పాతర్లపాడు, ఖమ్మం.

ఏదో చేయాలని ఇంకేదో సాధించాలని 
ఎద ! ఎడతెరిపి లేకుండా సొద చేస్తుంటే ,
పొద్దులా పొడిచి ముద్దుగా చైతన్యం 
మొద్దు బారిన మనిషిని సరిచేస్తూ!!

ఇసుక మేటల భేటీలో, తడారిన ఎడారిలో ,
కిసలయల కూని రాగాలతో, తూనీగల మేజువాని ,
పసతో పండించి, చూపించాలనే ప్రయత్నం
విసుగు చెందక విశ్రమించక శ్రమించబూను !!

ఊహలకు రెక్కలు తొడిగి కలలలో తేలిపోక 
ఉపాయంతో ఉక్కుకు ఈకలు మొలిపించి 
లోహ విహంగమై విశ్వాన్ని అలవోకగా చుట్టి 
వస్తున్న మానవ ప్రయత్న సాఫల్యతే !!

ఎండలు మలమల మాడ్చి వేసినా !
కొండలపై కురిసిన వాన వరదలై దోచుకుపోయినా !
సడలని ఆత్మ విశ్వాసంతో పడిలేస్తు ,
పంటలు పండించే రైతు, మళ్లీ మళ్లీ ప్రయత్నం చేయక పోతే, పడిగాపులు కాసే అన్నార్తుల పరిస్థితి ఏమిటి !!


ఆహ్వానించని అవసరాలు నట్టింట అతిథులై కూర్చుంటే ,
ఆదరించి అలరించే సాధనా సంపత్తి కొరకై ప్రయత్నం ,
అందిరాని అవకాశాలు, నింగిలో చుక్కలై వెక్కిరిస్తుంటే
అందిపుచ్చుకొనే మార్గాన్వేషణ కొరకై కృషి!!

ప్రపంచం ప్రయాణం చేస్తు పురోగమిస్తోంది 
ప్రముఖుల ప్రయత్నాలతో ప్రేమ శాంతి వెల్లివిరిసి,
ప్రసిద్ధ శాస్త్ర వేత్తల ప్రయత్నంతో 
ప్రసాదమై నిలిచింది మానవ జాతి మనుగడ పరమాత్ముని కొలువులో!!

ప్రణయం ఒలికించినా పుడమి, వసంతం పండిచినా వసుధ ,
భ్రమరం తేనే చిలికినా ! తూనీగ రంగులు మెరిసినా !
సృష్టించిన వాడి ప్రయత్నమే !!

 26
పిన్నక నాగేశ్వరరావు
జిల్లా 
*
హనుమకొండ 
కవిత
*

కవితా గానం (సీజన్ 5). 27--4--2024.
పిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ. 
చైత్ర మాసం పౌర్ణమి కవితల పోటీకి...
అంశము :-- ప్రయత్నము.
శీర్షిక :-- ప్రయత్నము.

1.తే.గీ.
ప్రతి తరగతి యందు చదువు వారలెల్ల
పై తరగతికి చేరుకో వలయు ననెడు
కోర్కెతో కృషి చేసి యకుంఠితమగు
దీక్షతో చదువుచు ప్రయత్నింతు రంత.
2.తే.గీ.
ఉన్నతంబగు చదువుల నెన్నుకొనగ
వ్రాయగా ప్రవేశపరీక్షలందు మిగుల
ర్యాంకులను తెచ్చుకొనెడు ప్రయత్నమందు
విఐఫల మైనను యత్నింత్రు వేరొక పరి.
3.తే.గీ.
బ్రతుకుతెరువుకు నొక పని వలయు గనుక
పలువురకు దరఖాస్తులు పంపుచుండి
యెన్నియో మారు లుద్యోగ మెంచుకొనగ
యత్నముల్ జేసి సాధింతు రంత్యమునను.
4.తే.గీ.
కలలు కనుటయే కాదు సాకార మగుట
కై ప్రయత్నము చేయుడు కడ వరకున
టంచు యువతకు నబ్దుల్ కలాము చెప్పె
పనిని సాధించ యత్న మవసరము గద!
5.తే.గీ.
ఆటలందున గెలుపున కందరున్ను
యత్నమున్ జేయుదురు గాని యంతమందు
నొకరు మాత్రమే విజయమ్ము నొందగలరు
మానవలదు యత్నము జయమందు వరకు.
6.తే.గీ.
నేతలంత పదవికి యత్నింతు రెన్ని
కలను నిలబడి పలుమార్లు కలలు కనుచు
కవులు కవితల పోటీకి కవిత వ్రాసి
యతనమున్ జేయుదురు బహుమతిని
                                                     పొంద.
**********
27
*పౌర్ణమి కవితల పోటీ*

అంశం: *ప్రయత్నం*

ఆశయమొక్కటే చాలదు ఆలోచిస్తే నడవదు
ఆచరణతో అలుపు లేకుండా కదిలిపో 

కలలు కనుడే కాదు 
వాటికీ నీలోని కళల్ని జోడించే ప్రయత్నం జేయి 

పడిపోతున్నా ప్రయత్నం చెయ్యి 
పసివాడి నడకలా 
పరుగెత్తగలవు ఒకనాడు 
పందెం అశ్వములా

ముందున్నది ముళ్లబాటైనా
ప్రయత్నంలో పట్టువదలని విక్రమార్కుడివై సాగిపో 

ఎదురు చూస్తే ఏదీ చెంతకు రాదు
ప్రతి కష్టాన్ని ఇష్టంగా స్వీకరిస్తూ 
ఆలోచనలను ఆకురాయిలా చేసుకొని 
నిర్విరామ కృషితో ముందుకెళ్ళు 

సడీసప్పుడు లేని పిల్ల కాలువలా సాగిపో
నీదైన రోజున నదివై వరదలా వ్యాపిస్తవు
పరిస్థితులు యెట్లున్న లోకాన్ని శాసిస్తవు 

కాలం కలిసిరాక 
నీ కలలకు కారు మబ్బులు సుట్టుముట్టాయని
కన్నీటి సుడులలో పయనం చేస్తూ
బతుకు నావను నడి సంద్రాన ముంచకు
నీ కట్టేను నువ్వే నడుమంత్రాన కాల్చకు

లోకం పోకడ సెడ్డది బిడ్డా 
ప్రయత్నిస్తూ పడిపోతే పండవెట్టి కసరెళ్ళ తొక్కుద్ది
గెలిస్తే మావొడే అని ఆకాశానికి ఎత్తుద్ది

గమ్యం చేరేవరకు నీ గమనాన్ని ఆపకు
నువ్వేవ్వరి కోసం వెనుకడు వెయ్యకు  
గెలవాలంటే కష్టాలను ఓర్చుకో
కొత్త సంగతులు నిత్యము నేర్చుకో

నిర్లక్ష్యానికి నీడనివ్వకు
లక్ష్యం ముంగిట సేద తీరకు
కృషి ఉంటే విజయం నీ పట్టపు రాణై 
వింజామరలు విసురుతది

*మధు అమరగాని*
28
కవితా గానం (సీజన్-5) 
అంశం... ప్రయత్నం
శీర్షిక....ఆయువు

యత్నమనే యంత్రాన్ని
కదిపినప్పుడే కదా
కార్యాల కౌగిటిలో ఒదిగేది ... 

నాకేమీ రాదనే తలపుల నావను
ఒడ్డున పెట్టినప్పుడే కదా
కడలి అలలలో ఉత్సాహంగా తేలియాడేది... 

నేనేమీ చేయలేననే భ్రాంతుల పరదా
తొలగించి నప్పుడే కదా
మెరుపులీనే మయూఖాలను తాకేది ... 

నేనెందుకూ పనికి రాననే 
అనుమానపు గోడలను
బద్దలు కొట్టినప్పుడే కదా
నీకెంత బలముందో తెలిసేది... 

చిన్ననాడు నీవు తప్పటడుగులు వేయడానికి
భయపు వలయంలో నిలబడి పోతే
ఈనాడు కుంటివాడుగా మిగిలిపోయే వాడివి.... 

ఆనాడు అమ్మా, అమ్మా అని
మాటలను వల్లె వేయక పోతే
ఈనాడు మూగవాడిగా మిగిలి పోయే వాడివి... 

మనసులో ప్రయత్న మనే ఆరాధన లేకపోతే
సాధనాల మెట్టును ఎక్కలేవని గ్రహించు... 

భయాల బద్దకపు బరువును
బలవంతంగా దించుకున్నప్పుడే 
ప్రయత్నాల ఆయువుకు ఊపిరి పోసేది .... 

ప్రయత్నమనేది చిన్న దైనా
దాని ఫలితం ఆకాశ మంతని గ్రహించు...!! 

హామీ... నమస్తే🙏 ఈ కవిత నా స్వీయ రచన అని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను🙏

మొహమ్మద్. అఫ్సర వలీషా
ద్వారపూడి( కోనసీమ జిల్లా)
29
తంగిరాల నాగలక్ష్మి గారు 
జీవికి చిరుత ప్రాయం నుండి ప్రయత్నమే చీకటి గుహనుండి భూమిమీద పడటానికి యత్నం పడ్డాక ఏదికావాలోఏడుపుతో,మూగగా,సంజ్ఞలతోతెలిపేప్రయత్నం బోర్లాపడటానికియత్నం, పాకటానికిప్రయత్నం తప్పటడుగులు వేస్తూ నడవటంకోసంప్రయత్నం అక్షరాలుదిద్దిభాషనేర్చుకోవాలనేప్రయత్నం పెద్దచదువులుచదివిగొప్పఉద్యోగం చేసి పేరు గడించాలనే ప్రయత్నం సమాజం, సంస్కృతి, సాహితీ రత్నాలను పొందుపరిచే ప్రయత్నం మాతృమూర్తికిమాతృభాష కి మాతృదేశానికి సేవ చేయాలనే అభిలాష తీర్చుకోవడం కోసం ప్రయత్నం పర్యావరణ సంరక్షణకు యత్నం ధర్మరక్షణకు ప్రయత్నం సత్యాన్వేషణకి చేసే యత్నం బహుకష్టమైన ప్రయత్నం చివరికి సుఖప్రాణోత్క్రమణం కోసం ప్రయత్నం తప్పదు మనిషికి అడుగడుగునా ప్రయత్నం చేయాలి చీమలు పాములు పుట్టల కోసం పక్షులు గూళ్ల కోసం మనుజులు నివసించడానికి ప్రయత్నాలేపనిముట్టు పచ్చనిచెట్లు గాలివాటుకునిలబడాలని చేస్తాయి ప్రయత్నం. వరదలనాపటానికి చేస్తుంది ఆనకట్ట ప్రయత్నం. ఉఛ్వాశ నిశ్వాస లతో నిత్యం జరిగే జీవన పోరాటమే నిరన్తర ప్రయత్నం ప్రతిజీవికీ తప్పదు ప్రయత్నం ప్రయత్నమే సాధన గమ్యం జేరటానికి జీవన నౌక లో సంసార సాగరాన్ని దాటి ఒడ్డుఅనే స్వస్థానానికి చేరటమే అంతిమ ప్రయత్నం
30
పుట్టినప్పటి నుండి గిట్టేంత వరకు 
చేయక తప్పదు అగని ప్రయత్నం 
తల్లి కడుపు నుండి బయటకు వచ్చిన 
 పసికూన పనితోనే ప్రయత్నాలు ఆరంభం
పాలు తాగాలన్న నిద్దుర పోవాలన్న
 కాల కృత్యాలు తీర్చుకోవాలి అన్నా
చేయక తప్పదువిడని ప్రయత్నం
అమ్మ వేలు పట్టి అక్షరాలు దిగాలన్న 
నాన్న మూపును ఎక్కి స్వారీ చేయాలన్న
గురువు చెప్పే పాఠాలు వింటూ పరీక్షలలో
 మంచి మార్కులు పొందాలన్నా
ఫలితం అందే వరకుచేయక తప్పదు ప్రయత్నం
పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేస్తేనే 
అందుతుంది ఆశించిన విజయం 
పట్టుదలతో విలువిద్యలో ప్రయత్నం చేసి 
 సవ్యసాచి అయ్యాడు అర్జునుడు
గురువు బొమ్మని గురిగా చేసుకుని 
గట్టి ప్రయత్నంతో విలువిద్యలో 
నిపుణుడయ్యాడు ఏకలవ్యుడు 
ఆ పని ప్రయత్నంతో నింగికే నిచ్చెన వేసి 
గొప్ప వీరుడయ్యాడు పాండు కుమారుడు భీముడు
కులమత బేధాలతో సంబంధం లేకుండా 
ధృడ మనసుతో ప్రయత్నం చేస్తే 
 సాధ్యం కానిది ఏది ఉండదనిచాటిన
మహామహులే మన ప్రయత్నానికి కావాలి ఆదర్శం.

డా బల్లూరి ఉమాదేవి.

చిరునామా:
Dr.B.Umadevi
#204,SLV residency
3rd main,3rd cross
Near Aditi public School
A G S Layout
Bengaluru
560061.
ఫోను.నం:9493846984
Email:uma.balluri@gmail.com

31
కవనజ్యోతి 
చైత్ర మాసం కవితా పోటీ కొరకు 
అంశం*ప్రయత్నం*
శీర్షిక *సంకల్ప సిద్ధి*

బాల పాండవులు 
అమరావతి నుండి ఐరావతం తెచ్చుటలో 
ప్రయత్నసిద్ధికి నారదయుక్తే మంత్రం 
భీమార్జునుల సాహసమే విజయం 

ప్రయత్నం మంచిదైతే 
ఆటంకాలున్నా దైవశక్తి తోడై నడిపేను
నీ పని నీవు చిత్తశుద్ధితో చేసుకుపో
ఆ పై ఫలితం రాక మానదుగా

పరీక్షల్లో నకలుపై ఆధారపడి
ఫెయిల్ అయ్యానంటే ఎలా?
వాచకం అభ్యాసనమే విద్యార్థికి నిధి 
ఏకాగ్రత గురితప్పిందా శశి నుండి నిశీధిలోకే

సరియైన కార్తెలో విత్తు నాటడం 
చీడపీడలను దూరం చేసే ఆయుధం 
మనసు అదుపులో ఉన్న మాట 
పదిమందికి చూపే పూల బాట 

ఎంచుకున్న మార్గం ఎటో చూడు 
నమ్మకాలను ముంచేదైతే జిందగీ పొరుకపోడు 
ఓ చెట్టు నీడై సాగిపో 
ఒట్టు ప్రగతికి గట్టి పట్టం కట్టేను

మార్పును స్వాగతిస్తూ 
ఓర్పుగా నడూ అదరక బెదరక
నేటి ప్రయత్నాలే 
రేపటి కార్యసాధనకు సాటిలేని సోపానాలు 

ఒకడుగు ముందుకు వేశావో 
వెనక వచ్చిన దారి మరువకు 
చేయూతనిచ్చిన చేతులను విడవకు
అదే అదే నీ చలనబలం బలగం 

ఏడెల్లి రాములు ✍️
ది*27*04*24(18*26)
ఎల్కలపెల్లి🌹
32
కవితాగానం సీజన్ 5.
క్రోధి చైత్ర పౌర్ణమి కవితల పోటీకి 
అంశం: ప్రయత్నం 
శీర్షిక: ప్రయత్నం పురుషలక్షణం. 

"సాధనేన సాధ్యతే సర్వం" అని సూక్తి. 
"అభ్యాసం కూసువిద్య" అని పెద్దలేనాడో నుడివినారు. 
ఏదైనా సాధించాలంటే సాధకుడివి కావాలి. అనుక్షణం అభ్యాసం చేయాలి. 
ఫలితం సాధించేదాకా 
ప్రయత్నం కొనసాగించాలి. 
గెలవలేక పోవడం 
ఓటమి కాదు, 
అసలు ప్రయత్నించకపోవడమే ఓటమి. 
వేయి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతో 
మొదలు పెడతాం. 
తొలి అడుగే 
విజయానికి పునాది, 
విరామం లేని ప్రయత్నమే 
విజయానికి ఋజుమార్గం. 
చిన్నచీమైనా ప్రయత్నించి, 
వందలమైళ్ళు ప్రయాణించగలదు, 
అత్యంత వేగవంతుడైన 
గరుత్మంతుడు కూడా 
ఎగిరే ప్రయత్నం చేయకుండా 
అంగుళం కూడా కదలలేడు. 
నేలపై కదలకుండా నిలబడి శిఖరం ఎక్కాలనుకునే 
ఆలోచన వ్యర్థం, 
ఒక్కసారి ఓటమి ఎదురైందని 
అస్త్రసన్యాసం చేస్తే 
అక్కడితో చరిత్ర సమాప్తం. 
ఏ జీవికైనా, 
జీవనపోరాటంలో 
ప్రయత్నమే సంజీవని. 
అది బ్రతుకుపోరాటమైనా, విజయబావుటా ఎత్తడానికైనా...
******* ******* ******* 
ఇది నా స్వంత రచన. ఏ ఇతర రచనలకు, అనువాదము కానీ, అనుకరణ కానీ, అనుసరణ కానీ కాదు అని ధృవీకరిస్తున్నాను. 

ముడుంబ తిరువేంకటా చార్యులు, 
మానుకోట.

Comments

Popular posts from this blog

సింధూరం 07052025

****************** సింధూరం దిద్దిన వారు  1.వీరా గుడిపల్లి 2.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, 3.గొర్రెపాటి శ్రీను  4.దోసపాటి వేంకట రామచంద్రరావు  5.అపరాజిత్ 6.వేమూరి సత్యవతి  7.జ్యోతి  8.మండ నాగేశ్వరరావు  9.గడ్డం కృష్ణారెడ్డి.రేపాల.సూర్యాపేట 10.కవిత వెంకటేశ్వర్లు  11.ఆర్ వి వి రాజా  12. శ్రీ కోరాడ నరసింహారావు గారు  13. శ్రీ ఉదయగిరి మధుమోహన్ గారు  14. శ్రీమతి బల్లూరి ఉమాదేవి గారు  15. శ్రీమతి తోట సులోచన గారు  16. శ్రీ జి సూర్యనారాయణ గారు  17. శ్రీ గజవెల్లి శ్రీనివాస చారి గారు  18. శ్రీ వనపర్తి గంగాధర్ గారు  19. శ్రీమతి వాణి సరోజిని లక్కరాజు గారు  20. శ్రీమతి సింహాద్రి వాణి గారు 21. శ్రీ ఆచార్య అయ్యల సోమయాజులు ప్రసాద్ గారు  22. 23.శ్రీమతి నెల్లూరు వేంకటలక్ష్మి గారు 24.శ్రీ ఏడెల్లి రాములు గారు  25. శ్రీమతి డాక్టర్ తంగిరాల నాగలక్ష్మి గారు  26. శ్రీ కూని అంకబాబు గారు  27. శ్రీ తిన్నాక నాగేశ్వరరావు గారు  28. శ్రీమతి లలితా చంటి గారు  29. శ్రీ పిల్ల వెంకటరమణ మూర్తి గారు  30. ...

season 6 వైశాఖ పూర్ణిమ

కవనజ్యోతి,కవితాగానం సీజన్ 6  వైశాఖ పౌర్ణమి నగదు పోటీలు   పోటీకి కవితలు పంపించిన కవి వరుల జాబితా  1. శ్రీ పిళ్ళావెంకటరమణ మూర్తి గారు  2. శ్రీ సంగీతం సంతోష్ కుమార్ గారు ji 3. శ్రీ జి సూర్యనారాయణ గారు  4.శ్రీ మండ నాగేశ్వరరావు గారు 5.శ్రీమతి కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  6.శ్రీమతి నెల్లూరు వెంకటలక్ష్మి గారు 7.శ్రీ అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 8..శ్రీ కోరాడ నరసింహ రావు గారు  9.శ్రీమతి డాక్టర్ భమిడిమర్రి కమలాదేవి గారు 10.శ్రీ కాసుల ధీరజ్ శర్మ గారు  11.శ్రీ కూని అంకబాబు గారు 12.శ్రీ మతి డా.వేమూరి సత్యవతి గారు  13.శ్రీమతి డా.బల్లూరి ఉమాదేవి గారు 14.శ్రీ.దోసపాటి వేంకట రామచంద్రరావు గారు 15.శ్రీ అపరాజిత రెడ్డి గారు  16. శ్రీ ఏడెల్లి రాములు గారు  17.శ్రీ డాక్టర్ ఆళ్ళ నాగేశ్వరరావు గారు  18. శ్రీ కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  19. శ్రీ మద్ది పుల్లారావు గారు  20.శ్రీమతి సింహాద్రి వాణి గారు  21. శ్రీ డా.దీపక్ న్యాతి గారు  22. శ్రీ ఆర్.వి.వి.రాజా గారు  23.శ్రీమతి వాణీ సరోజినీ లక్కరాజు గారు...

వీడ్కోలు ఆషాఢమాసం పౌర్ణమి

అంశం: వీడ్కోలు  సందర్భం: ఆషాఢమాసం పౌర్ణమి  నిర్వహణ:  వీరా గుడిపల్లి లలితాకృష్ణ  ################## కవివరుల జాబితా  1.పిళ్ళా వెంకట రమణమూర్తి గారు  2. జి.సూర్యనారాయణ గారు  3.మండ నాగేశ్వరరావు గారు  4.డా‌.బల్లూరి ఉమాదేవి గారు  5. డా.కమలాదేవి గారు  6.గొర్రెపాటి శ్రీను గారు  7.వేమూరి సత్యవతి గారు  8.కూని అంకబాబు గారు  9.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  10.కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  11.తోట సులోచన గారు  12.వాణిసరోజిని లక్కరాజు గారు  13. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు  14.అపరాజిత రెడ్డి గారు 15.లలితాచండి గారు 16. నెల్లూరు వెంకటలక్ష్మి గారు  17.కమలశ్రీ గారు  18.రాధిక గారు 19.చంద్రమౌళి గారు  20.శ్రీకాంత్ గారు  21.సింగీతం సంతోష్ కుమార్ గారు  22.. దారల విజయ కుమారి గారు  23.ఎన్.నరేశ్ చారి గారు  24. పిన్నక నాగేశ్వరరావు గారు  25.సింహాద్రి వాణి గారు  26.ఏడెల్లి రాములు గారు  27.కొంజేటి రాధిక గారు  ++++++++++++++++++++++++++++++++ ఆషాడ మ...