కార్తీక మాసం పౌర్ణమి నగదు పురస్కారాల కోసం
ప్పోరకటించిన అంశం: ఆలాపన
నిర్వహణ: శివునూరి లలితా క్రిష్ణ
**********************
కవితలు పంపిన కవివరులు
**************
1.శ్రీ కూని అంకబాబు గారు
2.శ్రీ దోసపాటి రామచంద్రరావు గారు
3. శ్రీ అపరాజిత్ రెడ్డి గారు
4. శ్రీమతి సింహాద్రి వాణి ఢగారు
5.శ్రీ కోరాడ నరసింహారావు గారు
6.మండ నాగేశ్వరరావు గారు
7.శ్రీ కేశరాజు వేంకట ప్రభాకర్ గారు
8.డా.దీపక్ న్యాతి గారు
09.శ్రీమతి నెల్లూరు వేంకట లక్ష్మి గారు
10.శ్రీ ఆళ్ళ నాగేశ్వరరావు గారు
11.శ్రీ అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
12. శ్రీమతి డా.బల్లూరి ఉమాదేవి గారు
13.శ్రీ దామర్ల నాగేశ్వరరావు గారు
14.శ్రీ.జి సూర్యనారాయణ గారు
15.డా. భమిడిమఱ్ఱి కమలాదేవి గారు
16. శ్రీమతి లలితాచండి గారు
17.శ్రీమతి కొంజేటి రాధిక గారు
18.శ్రీమతి తోట సులోచన గారు
19.శ్రీ.ఏడెల్లి రాములు గారు
20.శ్రీమతి వాణి సరోజిని లక్కరాజు గారు
21.శ్రీమతి మొహమ్మద్ అఫ్సర్ వలీషా గారు
22.శ్రీ పిళ్ళా వెంకట రమణ మూర్తి గారు
23.శ్రీ మద్ది పుల్లారావు గారు
24.శ్రీ తిప్పా వఝల నరసింహమూర్తి గారు
25.శ్రీమతి వేమూరి సత్యవతి గారు
26.గొర్రెపాటి శ్రీను గారు
*****************
1.1
కూని అంకబాబు
జిల్లా
*
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
ఫోన్ నెంబర్
*
9640637991
కవిత
*
శీర్షిక: అవిభక్త కవలలు
గుండె గూటిలో
సప్త స్వరాలు ఏకమై
ఒక రాగం పుట్టుకొచ్చింది
దాన్ని ఆలపిస్తున్నప్పుడు
అర్ధాలను వెతకాలనిపించలేదు
ఎందుకంటే
దిగులు కూడు తింటున్న నా గుండెకు
ఆ రాగం లాలిపాటలా అనిపించింది
అది ఏ రాగమో కూడా తెలియదు
ఆ సమయానికి అనురాగాన్ని
నా హృదయానికి అందిస్తుంది
అంతకన్నా ఇంకేం కావాలి
దాని గురించి శోధించడం మాని
ఆ సమయానికి ఆస్వాదించడమే
మేలకున్నాను
ఆలాపన ఆయుష్షు పెంచుతుంది
ఈ మాట ఎక్కడో విన్నట్టు తోచి
అలాగే కొనసాగించాను
వేదనలో ప్రేలాపాలన పోయే కంటే
ఆలాపనను ఆలంబనగా
చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం కదా
చిక్కిపోయిన గుండెకు సైతం
అది దన్నుగా నిలవగలదు
అందులో ధైర్యాన్ని నింపగలదు
దైన్యాన్ని దహనం చేసి
మోమును దేదీప్యం చేయగలదు
ఆ ఆలాపన అమ్మ లాంటిది
దానికి ఇవ్వడమే గాని
తీసుకోవడం తెలియదు
బహుశా ఆలాపన అమ్మ
అవిభక్త కవలలేమో
అందుకే కాదనక
ఆలాపనను ఆశ్రయిస్తున్నాను
2
దోసపాటి వేంకటరామచంద్రరావు
జిల్లా
*
విజయనగరం
ఫోన్ నెంబర్
*
7780594995
కవిత
*
కవితాగానం సీజన్5
కార్తీక పౌర్ణమి నగదు పురస్కారాల కవితలపోటి
అంశం:ఆలాపన
శీర్షిక:రాగమయజీవనం
దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం
జీవనం రసమయభరితం
అనురాగతరంగాల ఉద్దీపనం
మధురానుభూతుల సమన్వయం
స్వరజతులగతుల సంగమం
హృదిలో మెదిలె అలజడుల బంధనం
సరస సల్లాపాల సమ్మేళనం
పల్లవి చరణాల ఆలాపనల అనుభవం
కలసినమనసుల కమనీయగీతం
ఊహాజగతిలలో సయ్యాటల సంబరం
సప్ననాల సాధనల సమిశ్రమం
వాయులీన తరంగాల సహవాసం
సుధారసమయ అస్వాదనం
మధువిపంచికల ఉల్లాసం
వినోదవిహారాల నిస్వనం
రాగమయజీవనమే స్వాంతనం
కల్లోల విచలిత వినాశనం
ప్రేమమయ జీవన స్వాగతం
పావన జీవనయానం
కల్పన తపనల సమాహారం
నిర్మల నిరామయ నినాదం
సకలజనులకు సమతామమతల సరాగం.
ఇది నాస్వీయరచన.ఈసమూహముకొరకై పంపబడినదని
హామి ఇస్తున్నాను.
3.
అంశం: ఒక్క క్షణం
శీర్షిక: క్షణం విలువ!
పేరు:ఎం ఆపరాజిత్ రెడ్డి
కలంపేరు: ఆపరాజిత్
ఊరు జిల్లా; సూర్యాపేట
సెల్ ఫోన్ నంబర్:9848532031
క్షణాలు గంటలై రోజులై సంవత్సరాలై
కుసుమాళ్లా రాలిపొతూనే ఉంటాయ్!
ఒక్క క్షణం తరచిచూడు నీ జీవితాన్ని
కస్టపడి భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన క్షణాల్లో
సోమరివై యవ్వనమంతా దొర్లిపోతున్న క్షణాల్లో వృధాచేస్తే
జీవితంలో ఎడారిలో మొలిచిన నాగజెముడు మొక్కవైతావ్!
ఒక్క క్షణం అంతరంగాన్ని దర్శిస్తే చేరాల్సిన గమ్యం కళ్ళల్లో తేలియాడుతుంది
మహాత్ముడు సమయానికిచ్చిన విలువ మరువలేం!
గడిచిపోయిన క్షణాలు మళ్లీ రావు
ఉద్యోగం రావాలన్నా,వ్యాపార వ్యాపకాలేవైనా సరే!
క్షణ కాలం కూడా వృధా చేయక శ్రమిస్తేనే విజయం తలుపులు తెరుచుకుంటాయ్
వయసు మళ్లితే చేజారిన క్షణాలను గుర్తుచేసుకుని కుమిలిపోతావ్!
క్షణ భంగురమీ జీవితం మరువకు
ఒక్కో క్షణాన్ని ఒక్కోమెట్టుగా భావించి
కష్ట సుఖాల కావడి మోయి!
నీకయినా నాకయినా దేశ ప్రధానికైనా ఒకే సమయం
ఒక్క క్షణంకూడా వృధాపోనీయని ప్రధానికి
ఒక్కో క్షణాన్ని జారవిడుచుకున్న ఫలితంగా
నీ ఉనికే లేకుండా చివరకి కాలగర్భంలో కలిసిపోతావ్!
క్షణ క్షణం అనుక్షణం నీ కర్తవ్యం గుర్తుం డాలి!
ఆపరాజిత్
హామీపత్రం:ఇది నా స్వీయరచన
4
ఆశ్వయూజ మాసం పౌర్ణమికవితల పోటీకి
అంశం:-- ఐచ్ఛికం
తారీఖు:--17/10/2024
వారం:-- గురువారం
రచన:-- సింహాద్రి వాణి
శీర్షిక:-- నేటి బాలలే రేపటి పౌరులు
ప్రక్రియ:-- పద్యం
1)కం:-- బాలలె భావికి నేతలు
బాలలె జగతికి సుగతిని, ప్రగతిని కూర్చున్
బాలలె రేపటి పౌరులు
బాలలె చక్కని భవితను వ్రాయు విధాతల్.
2) ఉ.మా:-- కొల్లగ నీతిధర్మముల కూర్చుచు చిత్తములందు నిత్యమున్
పిల్లల నెప్పుడైన కడు ప్రేమగ చూచుచు పెంపు చేయగా
మెల్లగ మంచి మార్గమున మేదిని సాగుచు భావియందునన్
యెల్లరి క్షేమమున్ యెరిగి యెల్లపు డిచ్చును స్నేహ హస్తమున్.
3)మత్తకోకిల:--
మంచిచెడ్డల తారతమ్యమునెత్తి చూపుచు నెప్పుడున్
సంచితమ్మవ జ్ఞానసంపద చాల శిక్షణ నిచ్చుచున్
త్రుంచుకొమ్మని చెడ్డస్నేహము, త్రోవమంచిగ సాగగా,
పెంచగావలె పిల్లలందున ప్రీతి పెద్దలు మెండుగా.
4) ఉ.మా:-- నీతిగ నేర్పుతో యువత నిండుగ విద్యలు నేర్చుకున్నచో
జాతికి దీపమై భవిత జాగృతి నొందును వెల్గులీనుచున్
రాతలు మారులే నవతరానికి ప్రజ్ఞయు విజ్ఞత పెంపు చెందగా
భూతల మందునన్ జనత భూరిగ కాంచెదరద్భుతమ్ములన్.
5) మత్తకోకిల:--చెడ్డ దారుల పట్టి సాగిన చీకటేనని జీవితాల్
అడ్డదిడ్డపు మార్గం మందున ఆగమౌనని సర్వమున్.
చెడ్డవారిని చేరకుండగ చెప్పుకోవలె నీతులన్
జిడ్డు వీడగ పెద్దవారలు చిన్న వాళ్ళకు నెప్పుడున్.
6) మత్తున మున్గకండెపుడు మైకము ముంచుకు జీవితమ్ములన్
చెత్తగ మార్చి పూర్తిగను ఛిద్రము జేయును సంతసమ్ములన్
చిత్తము నందునన్ యువత చేరగ నీయక మత్తువాంఛలన్
చిత్తుగ చేయగా వలయు చెడ్డను
జీవిత కాలమంతయున్.
హామీ:-- ఈ పద్యాలు నా స్వీయ రచన.
5
అంశం:- ఐచ్ఛికం , కోరాడ నరసింహారావు !
శీర్షిక :- @... మజిలీ......!
(సార్థకత)
*******************
జన్మించిన పుట్టింటికి ....
మరణించిన స్మశానపు మెట్టినింటికి...
మధ్య మజిలీయేగా జీవితం !
ఒక్కో మజిలీలో ఎన్ని వింతలు..
ఎన్నెన్నివిడ్డూరాలు..!
ఆకాశానికి - పాతాళానికి ఆశ - నిరాశల ఊగిసలాటలు !
తీర్చే కొద్దీ, కోరికల ఊట... అలా ఊరుతూనే వుంటుంది!
మనసుఖం కోసం ఎదుటి వారిని ఎంతైనా దుఃఖ పెట్టమంటూనే వుంటుంది..!!
ఈ భూమ్మేదే ఉన్న ఈ మనిషి మనసు ఎన్నెన్ని కాలాలు, ఎన్నెన్ని లోకాల్లో విహరిస్తుందని !!
ప్రేమలు - ద్వేషాలు...
మితృత్వాలు - శతృత్వాలు...
పగలు - ప్రతీకారాలు...
త్యాగము - స్వార్థము...
సుఖాలు - దుఃఖాలు...
అనురాగాలు - వైరాగ్యాలు...
ఎన్నెన్ని ద్వంద్వాలను సమన్వయించుకోలేక ...
సతమతమై పోతుందని!!
బుద్ధి చెప్పినది మనసు వినదు
వివేకం గొంతు స్వార్థం నొక్కేస్తుంది!!
ఏమీ చేయలేని చేతగానితనం తో, మానవత్వం మూగగా ఆక్రోసిస్తోంది...!
ఇందుకా... ఇందుకేనా ఈ జన్మ మెత్తినది...!?
నీ చావుకి - పుట్టుకకి మధ్య ఇలా ఇంకా ఎన్ని మజిలీలు చేస్తావ్!?
ఈ మజిలీల మోజు నీకింకా తీర లేదా...?!
ఓ జీవా...!
నీవీ జన్మ మెత్తినది... ఆనందించటానికోయ్..!
ఇతరులను ఆనందింప జేయటం లోనే నీ ఆనంద ముందోయ్ జీవా..!
ఈ సంసార సమాజం ఓ జీవనదోయ్.... నీ బ్రతుకు నావ సాఫీగా సాగి, సుఖంగా గమ్యం చేరాలంటే...,
ఈ సంసారంలో నీవుండు ...
నావలోకి నీరునిండి నట్టు , ఈ సంసారాన్ని నీలోకి రానిచ్చా వంటే,మునిగిపోతావ్
ఈ సూక్ష్మ సత్యాన్ని గ్రహించ లేకే ... నీకు ఇన్నిన్ని చావులు, పుట్టుకలునూ...!!
నీలో ప్రవేశించిన స్వార్ధాన్ని తరిమికొట్టు...,
నీ నిజ స్వరూపమైన త్యాగాన్ని మేల్కొలుపు...
నీవు ప్రేమ, త్యాగాలతో పరిమలిస్తావు !
అది నీకూ ఆనందమే...నీ చుట్టూ వున్న ప్రపంచానికీ ఆనందమే...!
ఇదికదా నీ జన్మకు సార్థకత!
ఇదే జన్మకు సార్థకత!!
*****************
6
ఆశ్వయుజమాసం పౌర్ణమి కవితలపోటీకి.
అంశం: ఐచ్ఛికం
రచన:మండ.నాగేశ్వర్రావు.
7793939724
శీర్షిక: దీపావళి.
దీపావళి🔥
===×====
ఈ అమావస్య రోజు
పున్నమిలా వెలిగింది.
ఈరోజే తెలిసింది
అందరి మొఖాలూ
మతాబులౌతాయని...
పిల్లలచేతిలో పువ్వొత్తు
చూసి,తాతయ్య మొఖం
మతాబులా వెలిగింది!!
నాయకులు పేలుస్తున్న
బాంబుల్ని నమ్మకండి
ఎప్పటిలాగే తుస్సుమంటాయ్!!
పేలదనుకున్న బాంబే
గమ్మత్తుగ పేలుతుంది
అందుకనే ఆదమరచి
ఉండకండి!! ఎపుడైనా పేలొచ్చు!!
జువ్వలా దూసుకుపోతేనే
అందాల్సింది అందుతుంది
లేకపోతే మన బతుకు
చీదేసిన చిచ్చుబుడ్డే!!
పేలాల్సిన టైం లో పేలితేనే
బాంబుకి విలువ..
లేకపోతే పేలని బాంబని
పెంటలో పడేస్తారు!!
మతాబు వెలిగినా
వెలక్కపోయినా పొగ రావాలి
అపుడే విషపు దోమలు
చచ్చినట్టు ఛస్తాయి!!
వెలుగుతున్న తాడుతాను
మరోవత్తిని వెలిగించినట్టే
చేతనైన ఉపకారంతో
మరోజీవికి చేయందించు..!!
ఆ అనుభూతిని నీకునువ్వే
మనసారా ఆనందించు!!!
సమాజపు ప్రమిదలో
వివేకమనే నూనె పోసి
విజ్ఞానమనే వత్తివేసి
జ్ఞాన దీపంవెలిగించి చూడు
ప్రతిక్షణం దీపావళే!!
---- మండ.నాగేశ్వర్రావు,✒️
7793939724.
సరిపల్లి,పెందుర్తి..
7
[01/11, 10:11 am] Lalita Sister: కవనజ్యోతి కవితాగానం నిర్వహించే ఆశ్వీయుజ మాసం పౌర్ణమి కవితల పోటీ కొరకు
తేదీ::17/10/2024
ఐచ్ఛికం
శీర్షిక:::విజయ దశమి
స్వీయ రచన:కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, పాతర్లపాడు, ఖమ్మం. సెల్ ఫోన్:: 6281697982
శరన్నవరాత్రులు,
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమిన మొదలై,
శుద్ధ నవమితో అంతమవుతూ,
అత్యంతభక్తిశ్రద్ధలతో,
నవదుర్గల పూజలు వ్రతాలుచేస్తూ,
హృదయ కుహరంలో తిష్ట వేసిన శర్వరమునే శర తొలగించమని ఆర్తితో భక్త జనాంబుది!!
శాంభవి,శాంకరి,ఈశ్వరి,ఆదిపరాశక్తి, అయిన
మూలపుటమ్మనుశరణుజొచ్చి, సాగిలపడి
వేడుకొని చేసిన వేడుకలకు,
కరుణించిన కరుణామయి కాళీమాత
కడు కటాక్ష వీక్షణములు ప్రసరించగ
పులకించెను భక్తుజనకోటి నేడు !!
అలనాడు అసురుల ఆగడాలకు,
అలమటించిన ఆధ్యాత్మిక వాటికలు,
అమాయక భక్తులు,అందాల అతివలు,
వారు వీరనే తేడా లేకుండా
కార్చిన కన్నీరు ఘోర కడలిని తలపించ,
ఆగ్రహించిన అమ్మ దుర్గమ్మ!!
మహిషాసురుని సంహరించి ,
చండాముండలను దునుమాడి,
శంభు నిశుంభుల వధించి,
లోక కంటకుల నిర్జించి పాపాత్ముల పరిహరించి,
లోకంలో సుఖశాంతులు నెలకొల్పిన రోజు...
అదే నేటి విజయదశమి పండుగరోజు!!
విశ్వాన్ని,ధర్మాన్ని,
విజయం వైపు నడిపిస్తున్న,
చండీ చాముండి దయగల తల్లి
అఖిలాండేశ్వరి అమ్మ,భవాని!!
మణి మాణిక్యాలను సమకూర్చి,
సిరి సంపదల నొసగే శ్రీ మహాలక్ష్మి ,
విజ్ఞానం ప్రసాదించే శ్రీ వాగ్దేవి,
దైత్య దానవ వినాశిని మహాకాళి !!
మూలపుటమ్మ, ముగురమ్మలుగా
మూర్తీభవించి శిష్ట రక్షణ చేయుచు,
మూర్ఖులను, దుష్టులను శిక్షించే,
బాలాత్రిపురసుందరి, నమోస్తుతే !!
ఇది నా స్వీయ రచన
8
[01/11, 10:11 am] Lalita Sister: కవితాగానం సీజన్ 5
ఆశ్వయుజమాస పౌర్ణమి
కవితల పోటీ
తేది : 17 -10 -2024
అంశం : ఐచ్చికం
శీర్షిక : మాయని ఎదురుచూపు
తొలిసంధ్య అరుణ కిరణాలు కదిలించినా
మలిసంధ్య మరవక ఆహ్లాదాన్నిచ్చినా
ప్రకృతి సోయగాలు పరవశింపజేసినా
పక్షుల కిల కిల రావాలు
పలుకరించినా
నెమలి నాట్యం మైమరపించినా
పసిడి రాసులు అభిషేకించినా
కనకవర్షం కుండపోతలా కురిసినా
నీ తలపు మరపురాదాయే చెలి
నా మనసంతా నువ్వే కదా కోమలి
కళ్ళల్లో కాపురం చేసే నీ రూపం
నా గుండెల్లో నువ్వే నెలకొన్న దైవం
నింగి నేల నే కాదు విశ్వమంతా నీ ఉనికే
చందమామను జయించి బంధించి తేనా
సూర్యుని చుట్టంలా చూసెల్లమని ఆజ్ఞాపించనా
ఇంద్రలోకాన్ని నీకు రాసిచ్చే సాహసం చేయనా
మది గెలిచిన మృదులత కుసుమానివి
నా స్వప్న లోకాల్లోనే విహరిస్తావా
మౌన వీణ ను మృదువైన స్పర్శతో మీటి
హృదయస్వరాల స్పృశించి పూలకింజేయవా
ఎన్ని జన్మలైనా ఎదురు చూసే వరమీయవా
🤝
డా.దీపక్ న్యాతి
సినీ దర్శక నిర్మాత
9
నెల్లూరు వేంకట లక్ష్మీ ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా
***********************
శీర్షిక:ఆశల మిణుగురు
***********************
ఏం బతుకులో
నిరాశ ఆవరించి
నిస్తేజం ఆవహిస్తూ..
ఏం జీవితాలో
కోరికల గుర్రాలకు కళ్ళెం వేస్తూ
హద్దుల గిరిలో బతుకునీడుస్తూ..
ఎన్ని వెతలో
కరువు కాటక విలయంలో
ఆకలిదప్పుల వలయంలో..
ఎన్ని రొదలో
బాధ్యతల చట్రం లో
బాదరబంధీల సాలెగూడులో..
ఎన్ని సొదలో
కడుపు చించుకున్న
కష్టాల కావిళ్ళలో..
ఎన్నెన్ని కథలో
చేత డిగ్రీ పట్టాలతో
చేయూత చచ్చిన చేవలో..
ఎన్ని ఆటుపోట్లు
ఎన్నెన్ని సమ్మెటపోట్లు ..
గమ్యం అగమ్యగోచరమై
లక్ష్యం అలక్ష్యమవుతుంటే..
నీకు నీవుగా నీతో నీవై
ఆశనే శ్వాసగా మార్చి
కన్నీటి కెరటానివై
వెతల బాటలో ఆశల మిణుగురు
విజయీభవ అంటూ
వెలుగు తీరం చేరమని
బ్రతుకు చుక్కాని పై
సిరివెన్నెల జల్లులతో
సరికొత్త దృశ్య మానం చూపుతూ
గుండె వనాన్ని పచ్చదనంతో నింపుతుంది
ఈ కవిత నా స్వంతం ఇది దేనికి అనుకరణ అనువాదం కాదని హామీ ఇస్తున్నాను.
10
ఆశ్వయుజమాసం పౌర్ణమి కవితల పోటీకి
అంశం :ఐచ్చికం
శీర్షిక; "" జీవన విజేతలు ""
సాగరానికి అలలు
సంసార సాగరాని కి ఆటుపోటులు సహజం
ఆ ఆటుపోట్లను ఎదుర్కొని
సంసార సాగరాన్ని ఎదురీది
జీవన సంగ్రామంలో పోరాడి
విజేతలైన వయోవృద్ధులు వారు!
ఆరు పదుల పైబడిన వయస్కులైన వారికి కావల్సినది
కేవలం ఆర్ధిక సాయమే కాదు
హార్ధిక సాయం కూడా అవసరం!
నేటి యువకు లే రేపటి వృద్ధులు
నేటితరం వృద్ధులను
నేటి యువతరం సంరక్షిస్తే
రేపటి తరం వృద్ధులను
రేపటి యువతరం సంరక్షిస్తుంది!
ఎందుకంటే
ఈ ఊరుకి.ఆ ఊరేంత దూరమో
ఆ ఊరుకి ఈ ఊరు అంతే దూరం కదా!
కారణాంతరాల వలన వేరుగా ఉంటున్నప్పటికీ
వారానికోసారి ప్రత్యక్షంగా ఓ పలకరింపుని
ఓ ఓదార్పుని
క్షేమ సమాచారాల సముదాయింపుని
మీకు అండగా మేమున్నామన్న మనోధైర్యాన్ని
నేటి యువత వారికందిస్తే
అంతకంటే వారు ఆశించేదేముంటుంది!?
మన విజయాలకై
అహర్నిశలూ శ్రమించిన
ఆ శ్రమ జీవులను
ఆశ్రమాల పాలు చేయక
అన్ని వేళలా వారిని ఆదుకుంటూ
వృద్ధో రక్షతి రక్షిత: అనే నవనానుడ్ని నిజం చేద్దాం
భవితలో వృద్దాశ్రమాల అవసరాలు లేకుండా చేద్దాం!
...........................................
రచన
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు....జిల్లా
ఆంధ్రప్రదేశ్....రాష్ట్రం
చరవాణి : 7416638823
*******************†***
పై వచన కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను.
11
ఆశ్వయుజ మాస పౌర్ణమి పోటీలకు
తేది:-17-10-24.
పేరు:-
అయ్యలసోమయాజుల ప్రసాద్
ఊరు:-విశాఖపట్నం
ఆంశం:-ఐచ్ఛికం
శీర్షిక:-
చెడు పై మంచికి విజయమే దసరా
.......................
దక్షిణాయన పుణ్యకాలంలో
శరదృతువు నందు
ఆశ్వయుజ మాసాన
పౌర్ణమి ముందు వచ్చు
పాడ్యమి నుంచి నవమి వరకు
అమ్మలగన్న అమ్మ
ముగ్గురు అమ్మల మూలపుటమ్మని
నవవిధ రూపాలతో
సనాతన ధర్మాన్ని అనుసరించి
భక్తి శ్రద్ధలతో ప్రజలందరు
మొదటి రోజు కన్నెపిల్లల వరములిచ్చు
బాలత్రిపుర సుందరిగా
రెండవరోజు సర్వమంత్రాలకు అధిదేవత గాయాత్రీ మాతగా
మూడవరోజు జీవుల కడుపు నింపు అన్నపూర్ణా దేవిగా
నాల్గవరోజు సంపత్కారణి శ్రీ మహాలక్ష్మి దేవిగా
ఐదో రోజు రాక్షస ప్రవృత్తులయిన ఈర్ష్య, ద్వేషాలు తొలగించే చండీ మాతగా
ఆరోరోజు యుక్తాయుక్త విచక్షణను తెలియచేసే
జ్ఞాప్రదాయిని సరస్వతీ మాతగా
ఏడోరోజు సౌభాగ్యాన్ని చేకూర్చే లలితా త్రిపుర సుందరీ దేవిగా
ఎనిమిదో రోజు ఆర్తితో ఆరాధిస్తే కామితారర్ధ ప్రదాయిని దుర్గామాతగా
తొమ్మిదవ రోజు అసురప్రవృత్తులయిన కామ, క్రోధ, మొహాలను నాశనం చేసే మహిషాసుర మర్ధినిగా
కోరినకోర్కెలు తీర్చే కల్పవల్లి రాజరాజేశ్వరి మాతగా
నవవిధ శక్తి రూపాలలో ఆరాధన చేస్తే
వసుదైకానికే సుఖ సంపదల నిచ్చు
చెడు పై మంచికి విజయమే
మన సంస్కృతి సంప్రదాయాల విజయదశమి...!!
..........................
ఇది నా స్వీయరచన
అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం
9963265762.
.........................
12
ఆశ్వయుజ మాసం పౌర్ణమి కవితల పోటీకి
అంశం: ఐచ్ఛికం
తారీకు :17 -10- 24
వారం: గురువారం
రచన: డాక్టర్ బల్లూరి ఉమాదేవి
శీర్షిక :అక్షర తూణీరాలు
ప్రక్రియ: వచన కవిత
రవిగాంచనివి కవి చూస్తాడన్నారేనాడో
కవి చేతిలోని కలమే కరవాలమై
జనాలను ఉత్తేజపరిచింది ఆనాడు
భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో
బాపూజీ అహింస అనే ఆయుధంతో సాగితే
వత్తాసు పలుకుతూ విజృంభించింది
కవుల చేతిలోని కరవాలమే కాదా
"మాకొద్దీ తెల్ల దొరతనం/' అంటూ నినదిస్తూ
"చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా' అంటూ
నిద్రాణమైన జాతిని మేల్కొల్పినవీ
మన కవుల చేతిలోని అక్షరాయుధాలే
కలాలే తూటాలై మర ఫిరంగులై
ఎక్కుపెట్టిన బాణాలై విజృంభించి
తగలాల్సిన చోట తగిలాయన్నది
జగమెరిగిన సత్యం కాదా
సంఘంలోని దురాచారాలను మాన్పడానికి
వరకట్న నిర్మూలనకు కన్యాశుల్క నిరసనకు
స్త్రీ విద్యావ్యాప్తికి వితంతు వివాహాలకు
అన్నింటికీ కవి చేతిలోని కలమే కరవాలమై
విజయకేతనం ఎగరేసిందన్నది అక్షర సత్యం.
స్వీయ రచన
డా బల్లూరి ఉమాదేవి
[01/11, 10:11 am] Lalita Sister: కవితా గానం సీజన్ 5
ఆశ్వయుజ మాసం పౌర్ణిమ కవితల పోటీకి..
పేరు. జి.సూర్యనారాయణ, ఊరు : అవనిగడ్డ.
అంశం : ఐచ్ఛికం
శీర్షిక : సుకవి
*సుకవి..!*
కదిలే కాలానికి కాపలా దారుడు సుకవి
కాలం రహదారి లో బహుదూరపు బాటసారి
పరిగెత్తే కాలాన్ని పరిశీలించే నవ పరిశోధకుడు
మూడు కాలాలను ముక్కంటి లా చూస్తూ
నిక్కచ్చిగా కలంతో చక్కగా రాసేవాడు...!
ఏకాంతం వనంలోకి వేదాంతిలా వెళ్ళి పోయి
ఊహకాంతతో తీరిగ్గా ఊసులాడు తుంటాడు
ఉల్లములో భావావేశం పెల్లుబికినప్పుడు
కరములో ఆరోవేలు పెట్టి కవితలు రాస్తాడు
గడ్డములు పెంచుకుంటాడు దొడ్డ రుషిలా
మురికి బట్టలు ధరిస్తాడు ఊరిలోని గరీబులా
కలిమి లేములు జోలికి అస్సలు పోడు
కలాలు కాగితాల తో చెలిమిని చేస్తాడు..!
సమాజం లోని అసమానతలను చవి చూస్తాడు
మంచి చెడ్డలను రాయంచ లాగా వేరు చేస్తాడు
మరో ప్రపంచం కోసం అంతర్మథనం పడతాడు
చందన చర్చలకు స్పందన చూపుతాడు
వేదిక నిచ్చే దాతకోసం ఎదురు చూస్తుంటాడు
తాను చదివిన కవితలను మెచ్చు కుంటే
కొత్త పుస్తకానికి వేసిన ముఖ చిత్రం లా
సుకవి సదా మురిసి పోతుంటాడు విచిత్రంగా..!
****************************
జి.సూర్యనారాయణ, 6281725659.
ఆర్యా...సదరు *సుకవి* కవిత నా స్వంతం. దేనికి అనువాదం కాదు.
అనుకరణ లేదు. మీ పోటీకి మాత్రమే ప్రత్యేకంగా రాశానని హామీ ఇస్తున్నాను.
మీ సూర్యనారాయణ, అవనిగడ్డ.
[01/11, 10:11 am] Lalita Sister: దామర్ల నాగేశ్వరరావు
9908568099.హైదరాబాద్.
------------------------------------------
*కవితా గానం సీజన్-5*
*ఆశ్వయుజ మాసం కవితలు*
+++++++++-+++++++++++++
*శీర్షిక -మానవత్వము*
మాధవుడును పూజించినా లభించని తృప్తి, పుణ్యము
ఒక ఆకలి గొన్న అనాధకు
గుప్పెడు అన్నము పెడితే
గొప్ప పుణ్యము, మనశ్శాంతి
లభిస్తుంది.
మన దేశములో అత్యధిక ధనవంతుల్లో ఒక గొప్ప వ్యక్తి
కుమారుడు వివాహము చేసి
వచ్చిన బడా బాబులకు లక్షలు,
కోట్లు ఖరీదు చేసే బహుమతులు
ఇచ్చాడు.
ఇది ఒక విడ్డూరం,వింతలకు వింత.
ఆయనకు లభించేది చింత.
కరోనా టైం లో *సోనే సూద్*
అను చిన్న నటుడు చేసిన
సహాయం *నభూతో న భవిష్యత్*
కర్ణుడు,శిబి ల దాతృత్వం విన్నాము, చదివాము
కాని ఆ నటుడు చేసిన
సహాయం,అదియు అభాగ్యులకు
చేసినది మహోన్నత మేలైనది.
అంతకంటే మహా గొప్ప నటనా
చక్రవర్తుల వారెందరో కాని వారు
పిల్లికి పిడికెడు అన్నము పెట్టారు.
ఎంగిలి చేత్తో కాకిని తోలు.
*పుట్టేటప్పుడు ఏమీ తీసుకు*
*రాలేదు,పోయేటప్పుడు ఏమీ*
*తీసుకు పోలేము*-ఇది అందరకు
తెలిసిన సత్యము.
కాని ప్రాణమున్నంత వరకు
సంపాదన,దాచి పెట్టుట,కూడా
బెట్టుట-వారసులకు ఇచ్చుట.
వారు కష్టము తెలియకుండా
సంపదకు వారసులు-చెడ్డ
వ్యసనాలకు బానిసై
సంపద నంతా పోగొట్టకొందురు.
కావున ఇటీవల చనిపోయిన *రతన్ టాటా* గారికి మాదిరి
సంపాదన లో కొంత దాన ధర్మాలకు
వెచ్చించుట ఉత్మమము.
*మానవ సేవయే మాధవ సేవ*
హామి -ఇది నా స్వీయరచన.
*****************************
[01/11, 10:11 am] Lalita Sister: కవితాగానం సీజన్ 5
ఆశ్వయుజమాసం పౌర్ణమి కవితలపోటీకి
నాకవిత
పేరు : డా.భమిడిమఱ్ఱి
కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
తేది : 17-10-24
అంశం : ఐచ్ఛికం
శీర్షిక : జీవనరాగం
పలురాగాల సమ్మేళనం
జీవితం
పలుభావాల మేళవింపు
జీవనరాగం
సుఖదుఃఖాల సమన్వయం
కష్టనష్టాల కలగల్పు
అపశ్రుతులులేని రాగాలు ఉండవు
ఉంటాయి ఎన్నో అపశ్రుతులు
జీవనరాగంలో కూడా
ఆరోహణ, అవరోహణలు సరేసరి
ఆలాపనలు తప్పవు
ఏరాగానికైనా, ఏగీతానికైనా
జీవనగీతానికీ అంతే
సరిచేసుకోవాలి శ్రుతులను
సరిచూసుకోవాలి తాళ, లయలను
సరియైన క్రమంలో ఉండాలి
ఆరోహణ
అవరోహణలు
సాగదీయకూడదు రాగాన్ని
జీవితరాగమూ అంతే
చూసుకోవాలి అపశ్రుతులు లేకుండా
అపశ్రుతులు పలకకుండా
ఆలపించాలి జీవనగానాన్ని
జీవిత గీతాన్ని, జీవనరాగాన్ని
ఎప్పుడూ మోహనరాగమే కాదు
బిలహరి, తోడి ఇలా రాగాలెన్నో
జీవితగీతం కూడా అంతే
ఎన్నో అనుభవాలు, ఎన్నో
అనుభూతులు
ఐతే
ఆలపించాలి మనం జీవనగీతాన్ని
అపశ్రుతులు లేకుండా
సరియైన శ్రుతిలో
తాళ,లయ బద్ధంగా
ఆరోహణ, అవరోహణలను
సమన్వయపరుస్తూ
అవుతుంది అప్పుడు జీవితం
రాగరంజితం.
పైకవిత నాస్వంతం.
[01/11, 10:11 am] Lalita Sister: కవితాగానం సీజన్ 5
ఆశ్వీజ పౌర్ణమిపోటీలకు
అంశము ---ఐచ్చికం
రచన---లలితాచండి
శీర్షిక -- *అయుర్వేదం*
------- ------- ------
అయుర్వేదమే ఆచారమైనదో అభ్యాసమైందో
ఆ అభ్యాసం ఆయుర్వేద మైనదో
మూలాలు తెలిపిన మునులు ఎరిగిన సనాతన మూలికా వైద్య విజ్ఞానం
విరించి ముఖ ప్రభావితం అయుర్వేదం
వేదానికి ఉపవేదమై
వెలిగిన వైద్యం
ఆయుష్షు పెంచే వైద్యం
అలనాటి భారతీయ వైద్యం
వస్తు గుణ ప్రకాశికలలో
పదార్ధ విజ్ఞానం అవగతం
వాత,పిత్త,కఫ దోషాలు
రోగలకు కారణాలు మూడు
ధన్వంతరి, చరకుడు
శుశ్రుతుడు వివరించిన వైద్య విధానం
పురాతన విజ్ఞాన రహస్యం
రోగాలను మూలాల నుండి
పెరికి వేసే ఆరోగ్య సేద్యం
తనువున నాడి సూచించేను
శ్వాస నిశ్వాసల వేడి
హడావుడి లేని వైద్యం
అలనాటి ఆరోగ్య సిద్దాంతం
ఇలపై వెలిగే ఇంపైన వైద్య సౌభాగ్యం
రామాయణంలో లక్ష్మణునికి ప్రాణశక్తి నొసగిన సంజీవిని
యుగాలు మారినా వన్నె తగ్గని వైద్యం
కరోనాకాలంలోను ఇంటింటా
కళకళలాడిన చిట్కా వైద్యం
పంచమ వేదమై వెలిగిన
అయుర్వేదం
అందరికి ఆచరణీయం
లలితా చండి
17-10-2024
స్వీయ రచన✍️
[01/11, 10:11 am] Lalita Sister: కవిత గానం పౌర్ణమి కవితల పోటీకి గాను... పేరు కొంజేటి రాధిక
ఊరు రాయదుర్గం
అంశం... ఐచ్ఛికం శీర్షిక...పయనం పతనం వైపే!?
అత్యాశల సెలయేట్లో ఓలలాడుతూ,
అనంతాన్ని అరచేతిలో ఇముడ్చుకోవాలన్న దురాశ....
చెరువులు, కుంటలు, బీడు భూములు, రహదారులు, ఒకటేమిటి, కనుచూపు పడిన ప్రతి వస్తువును ఆక్రమించాలన్న అత్యాశ... ప్రతి ఒక్కరూ అలెగ్జాండర్ లై ,
ప్రతి ఒక్కరూ హిట్లర్లై పోతే ప్రపంచం ఏంగానూ... ఒకరిపై మరొకరు దండయాత్ర చేసుకుంటూ, పేరాశల బందిఖానాలో బందీలై,
అనుబంధాల చట్రానికి రంగు కాగితాలను కట్టుకుని,
ధనం చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ ఇదే పరమార్థమని చాటుకుంటూ... బతుకును సాలభంజికల యక్ష ప్రశ్నగా మార్చుకుంటూ... ఎటువైపు ప్రయాణిస్తున్నాడో తనకే తెలివి మేధావి మనిషి...
తన అతి మేదోతనానికి మూల్యం చెల్లించుకుంటూ తను కొని తెచ్చుకున్న ఉపద్రవాలకు నష్టపోతూ, కష్టపడుతూ, కన్నీళ్లను కార్చుకుంటూ,
కలతల కాపురం చేసుకుంటూ,
వెతల బతుకును బతుకుతూ.... పురోగమనం అంటూ పురిటి నొప్పులతో అమ్మ గర్భంలోంచి ప్రసవించని మాతృమూర్తిలా వేదనను అనుభవిస్తున్నాడు మనిషి...
నాగరికం వైపు పయనం అంటూ అనాగరికంగా ప్రవర్తించే మనిషి పయనం ఎటు వైపోవైపో?
నింగికి నిచ్చెనలేసుకుంటూ, ప్రగతి ప్రగతి అంటూ కూర్చున్న కొమ్మునే నరుక్కుని,
తన కిందకి తానే నీళ్లు తెచ్చుకుంటూ,
ఏం సాధిస్తున్నాడో?
ఏం సాధించాలనో తనకే తెలియని మనిషి భవితవ్యం ప్రశ్నార్థకమే? జీవితం అగమ్య గోచరమే!
[01/11, 10:11 am] Lalita Sister: కవిత గానం సీజన్ 5
ఆశ్వయుజ మాసం కవితల పోటీ కోసం
**?*?*?*
జ్ఞానపీఠం
అధిరోహించడం
సులువేనా?!!
మనిషి రకరకాల ఆలోచనలతో ఉన్నా
జీవుడు ఒక్కటేగా!
మనిషి మరో మనిషిని
శత్రువుగా చూసి పీడించే కాలం
ఆగేదెన్నడో?
యుగాలు దాటినా
గ్రహాలను జయించినా
పురోగమనమా? తిరోగమనమా?
నలుగురు నడిచే దారిలో
విషపు ముళ్ళేస్తూ
వ్యాపారం చేస్తూంటే
డబ్బుదే గెలుపైతే
ఈ ఓటమి ఇంకేన్నాళ్ళు?
విలువలు
ఎడారిలో ఎండమావులేనా?
బంధాలు అనుబంధాలు
గొంగళి పురుగులు పట్టిన
పచ్చనాకులౌతుంటే
నిట్టాడు కూలిన ఇల్లైంది కుటుంబం
పోయాక
ఏదీ వెంటరాదని తెలిసినా
అసలైన జ్ఞానం ఒంటబట్టించుకోకపోతే
ఎందాక ఈ కుంటి నడక !
ఒకరికొకరు మోసం చేసే
ఆషాడభూతులు లేని కాలమెపుడో ?
నిజంగానే జీవన యాత్రలో
మనిషి మహాత్ముడై
జ్ఞాన పీఠం
అధిరోహించినదెపుడో?!!
ఏడెల్లి రాములు ✍️
ది*17*10*2024(21*25)
ఎల్కలపెల్లి 🌹
పెద్దపల్లి*జిల్లా
[01/11, 10:11 am] Lalita Sister: యేడికివోతై..?
మసీదు దగ్గర మలుపు తిరిగినంత మాత్రాన
మాచాపూర్ గురుతులు మలిగిపోవు
తాళం వేసివెళ్లినంత మాత్రాన ఇంటితలపులు ఏడా తప్పిపోవు
బస్సెక్కి బయలుదేరినంత మాత్రాన
తల్లి ఊరు తల నుంచి తరలిపోదు
తాత చెప్పిన కొనికెపోగసొంటిమాటలు మతిలో మెదులుతాయి
బాపమ్మ చెప్పిన కత్తెరవాణసొంటికతలు కడుపులో సల్లగుంటాయి
బాటలు దాటినంత మాత్రాన బతుకు నిచ్చి న జీవమట్టిబాసిపోదు
సముద్రాలు దాటినంత మాత్రాన 'ఊరు'తడిముచ్చట్లు ఇంకిపోవు
ఎడారుల్లోకిజారుకున్నంత మాత్రాన
యేన మీదిపిట్టగూళ్ళు ఎదలోంచి కూలిపోవు
అరుగుల మీద చెప్పిన జాజిపూతల జ్ఞాపకాలు జాతరలా అల్లుకుంటయి
మెతుకు ఎతలు ఏరు దాటియ్యా లని ఎన్ని సరిహద్దులు దాటినా
ఇంటిఇగురం ఎన్నటికీఇడిసిపోదు
పని గట్టిన పట్నంలో ఎన్ని పద్రక్షిణలు చేసినా
ఇంతోన్ని జేసిన ఇంటిదేవుళ్లను నిత్యం తలుస్తూ నేఉంటా..!!
[01/11, 10:11 am] Lalita Sister: కవితా గానం సీజన్ -5
అశ్వయుజ మాస పౌర్ణమి కవితల పోటీ
తేది 17-10-2024
తోట సులోచన
నెల్లూరు
అంశం కాలం గొంతులో రాగాలు
శీర్షిక కాలానుగుణమైన రాగాలే
కాలం ఋతు ధర్మంతో పాటు సాగుతుంది
దానిని బట్టి కాలం గొంతులో రాగాలు
శిశిర ఋతువులో ఆకులు రాలిపడుతున్న
గలగల శబ్దాల రాగాలను గొంతులో
సవరించుకుని సవ్వడుల రాగమాలపిస్తుంది
కాలమిక వసంత మొచ్చే సరికి
ప్రకృతి పచ్చదనంతో ఆకు పచ్చ చీరను
సింగారించుకుని మురిసిపోతుంది
కాలం పరవశించి కోకిలలతో కూడి
సంతోష రాగాలనాలపిస్తుంది
ప్రకృతిని గని పరిమళ సుమాల సుఘంధాలను
ఆస్వాదిస్తూ కాలం గొంతులో మధుర స్వరాలే
ఆనంద భైరవి రాగాలను శ్రావ్యంగా
నాలాపించు
భానుడు ప్రచండ యుష్ణమును
పుడమిపై ప్రసరింప జేయగా
లోకమంతా వేడి గాలుల తీవ్రతను
భరించలేక అల్లాడుతున్నపుడు
కాలం ఆవేదనకు లోనై బాధతో
వేదన స్వరాలను గొంతునుండి వెలువరిస్తుంది
దాహార్తితో కాలం గొంతు మూగవోయి
వేదన గీతాలు పాడుతుంది
గ్రీష్మ ఋతువులో వృక్షాన్ని నాశ్రయించి
మెల్లగా స్వాంతన రాగాలు పలుకుతుంది
మేఘంతో రాయబారం పంపి తొలకరి
జల్లులకు ఆహ్వాన గీతాలు పలుకుతుంది
చిటపట చినుకులతో సన్నాయి రాగమే
జడివానలో గంభీర స్వరం గొంతులో.
ప్రకృతి విపత్తులో అల్లకల్లోలంలో
కాలం మౌనంగా శోక గీతాలు పలికిస్తుంది
ఈ కవిత నా స్వంతమని హామీ
[01/11, 10:11 am] Lalita Sister: కవితాగానం సీజన్5
ఆశ్వయుజ పౌర్ణమి కవితల పోటీ
16 10 24 బుధవారం
అంశం
Comments
Post a Comment