నిర్వహణ
వీరా గుడిపల్లి
శివునూరి లలితా కృష్ణ
*********************
కవివరుల జాబితా
కవనజ్యోతి సమూహం నుండి
శోభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా పురస్కారం
***********
ప్రశాంసార్హ మైన కవిత నందించిన కవివరులకు
శుభాకాంక్షలు.
**************
1.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
2.సింహాద్రి వాణి గారు
3. దోసపాటి వేంకట రామచంద్రారావు గారు
4.గజవెళ్ళి శ్రీనివాసా చారి గారు
5.తిప్పావఝల నరసింహ మూర్తి గారు
6.గంటి మీనా కుమారి గారు
7. అపరాజిత రెడ్డి గారు
8.గొర్రెపాటి శ్రీ ను గారు
9. భూపతి సార్
10. అయ్యల సోమ యాజుల ప్రసాద్ గారు
11. పి.లక్ష్మణ్ రావు గారు
12. రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి గారు
13. కందూరి సుజాతా రాణి గారు
14.డా.బల్లూరి ఉమాదేవి గారు
15.ధనాశి ఉషారాణి గారు
16.సింగీతం సంతోష్ కుమార్ గారు
17.మేకల రామస్వామి గారు
18. నాయకంటి నరసింహ శర్మ గారు
19.కవిత వెంకటేశ్వర్లు గారు
20.ముత్యం వెంకటేశ్వరరావు గారు
21.కొంజేటి రాధిక గారు
22.కె.వి రమణాచారి గారు
23.ఆళ్ళ నాగేశ్వరరావు గారు
24.తోట సులోచన గారు
25.లలితా చండీ గారు
26.పాల్వంచ హరికిషన్ గారు
27.వేమూరి సత్యవతి గారు
28.మద్ది పుల్లారావు గారు
29.మొహమ్మద్ అఫ్సర్ వలీషా గారు
30.డా.కమలా దేవి గారు
31.డా.దారల విజయ కుమారి గారు
32.పిన్నక నాగేశ్వరరావు గారు
********
నిర్వహణ
వీరా గుడిపల్లి
శివునూరి లలితా కృష్ణ
*****
1
కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు Poet: అంశం...ఉగాది
శీర్షిక...నవ చైతన్య గీతిక
స్వీయ రచన కేశవరాజు వెంకట ప్రభాకర్ రావు పాతర్లపాడు ఖమ్మం
*******"*""""**************************************************"
ఎన్నో ఆశలు
మరెన్నో ఆశయాలను
మూట కట్టుకుని
మనుగడ సాగించాలని!!
మహత్తరమైన బృహత్తరమైన
కార్యాలను సాధించాలనే
బాటలో పువ్వులు విరబూయాలని
సువాసనలు వెదజల్లాలని!!
కపట మాయోపాయాల
కార్ఖానాల తలుపులకు తాళం వేయాలని
దోపిడీ దౌర్జన్యాల భరతం పట్టాలని
అత్యాచారుల అంతం చేయాలని !!
ఆడపడుచుల ఆనందాల
హరివిల్లు ఆకాశం నిండా విరియాలని
ఆ బాలగోపాలం సంతోషాల
జడివానలో తడిసి ముద్దయిపోవాలని!!
ప్రకృతి విపత్తులు పరిధులు దాటకుండా
ప్రాణాపాయ పరిధిని కుదించి
పరిరక్షించే ప్రమాణాల పెంచి
సురక్షిత ఆ రక్షిత కేంద్రంగా సంరక్షిస్తుందని !!
ఘన స్వాగతం సుస్వాగతం
శోభకృత్తు నామ సంవత్సర ఉగాదికి!!
స్వీయ రచన:: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు
పాతర్లపాడు ఖమ్మం.
2
రచన:-- సింహాద్రి వాణి
ప్రక్రియ:-- పద్యం
ఊరు:-- విజయవాడ
చరవాణి:--7569820872
ఉ.మా. స్వాగత మమ్మ నీకు కడుసాదర పూర్వక , శోభకృత్ భళా
రాగల వత్సరమ్మ, భువి రాల్చుము కల్మష మీర్ష్య ద్వేషముల్
సాగగ నీతి న్యాయముల సవ్యపు బాటను నెల్లవేళలన్
రోగములన్ని గూల్చి, ప్రజ రోయగ జేయుము స్వార్థం భావనల్
2) ఉ.మా. ఏదినమందునైన జనులెల్లరు సౌఖ్యము పొందు రీతిగా
యాదినముల్ యుగాది ప్రజ కాదర మొప్పగ నీయగావలెన్
నాది యనల్ప భావనను, నైచ్యపుటూహలు కూల్చివేయ, రా
వా,దిశలన్నియున్ వెలుగు వాగులు పొంగగ లోకమందునన్.
3) సీ. ఈర్ష్య క్రోధములను నిలపైన బాయగా
కనువిప్పు కలిగించు కలుష ప్రజకు
ప్రేమానురాగాలు పెంపొంద జేయుమా
కులమత భేదాలు కూల్చివేసి,
మోసాలు కుట్రలు మొదలంట తొలగించి
మనుషులు మనసున మమత పెంచు
చదువు జ్ఞానములిచ్చి చల్లగా కాపాడు
పెడదారి పోకుండ పిల్లలెపుడు
ఆ.వె. కష్ట సుఖములందు కలిగి సంయమనమ్ము
సాగిపోవగ ప్రజ స్థైర్యమిడుము
శాంతి సౌఖ్యములిచ్చి చల్లగా దీవించు
దినము దినము గడువ దివ్యముగను
5)ఆ.వె. యువత భవిత గూల్చు వివిధ దారులు మూసి
చదువు వైపు శ్రద్ధ చాల గూర్చు
విజ్ఞత కడు పెంచు విజ్ఞాన మును నిచ్చి
దేశ భవిత వెలుగు నాశ నింపు
3
కవనజ్యోతి
శోభకృత్ నామసంవత్సరము సందర్భంగా కవితలపోటి.
అంశం:ఉగాది
శీర్షిక:నూతనసంవత్సరమా!నీకు స్వాగతం!
మళ్ళీ వచ్చింది కొత్తసంవత్సరము
శోభకృత్ అనేకొత్తపేరుతో
శోభాయమానంగా మారాలని మా అకాంక్ష
శుభకృత్ నామసంవత్సరానికి వీడ్కోలు పలుకుతున్నాం
నూతనసంవత్సరమా !నీకు స్వాగతం!సుస్వాగతము!
కోకిలపలుకులు ఎక్కడో ఊరికి దూరంగా పలుకుతున్నాయి
ప్రకృతిలో ఊహించని మార్పులే జరుగుతున్నాయిలే
ఆకాశాన్నంటే ధరలతో మామిడాకులు పచ్చదనాన్ని కోల్పోయాయి
వేపపూవ్వు మరింతగా చేదయిపోయింతి
చింతపండు పులుపతో పళ్ళు పులిసిపోయాయి
బెల్లం ఎంత కలిపినా తీపిరుచి తగడంలేదు
కారంఘాటు కి కళ్ళంటే నదీప్రవాహమే
ఉగాదిపచ్చడి వాసనతోనే గడుపుతాములే
పండివంటలపేరు చెప్పకొని సంబరపడతాము
గతసంవత్సరపు బట్టలనే పరుపుక్రింద మడతపెట్టుకొని
కట్టుకుంటాము
పిల్లలకి పచ్చడిమెతుకులతో బుజ్జగిస్తాము
పెద్దలకోపాలను ఎలా తీర్చాలో తెలియటంలేదు
పంతులుగారు పంచాంగశ్రవణం చెబుతామంటున్నారు
ఏమో !మారాతలు ఏలా గుంటాయో మరి!?
గుడికెళ్ళి ఆ దేవుడిని వేడుకుంటాములే
ఈసంవత్బరమైనా మాబ్రతుకులు బాగుచేయమని!
ఇది నాస్వీయరచన.
దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం.
4
శీర్షిక: తొలి పండగ
గజవెళ్ళి శ్రీనివాసాచారి
...
చైత్రమాసంలో
తెలుగు వారి తొలి పండగ
ఆ పండుగే ఉగాది
నక్షత్ర గమనాన్ని
రుతు ధర్మాన్ని అనుసరించి
పండుగలు జరుపుకునే ఆచారం
చాంద్రమానం ప్రకారం
చైత్రశుద్ధ పాడ్యమి రోజు
బ్రహ్మ సృష్టిని ఆరంభించాడని
బ్రహ్మ పురాణోక్తి
ఉగాది రోజు
వేపపువ్వు, కొత్త బెల్లం
నెయ్యి, మామిడి ముక్కలు
చెరుకు ముక్కలతో
ఉగాది పచ్చడి చేసి
దైవానికి నైవేద్యం సమర్పించేది
తెలుగు లోగిళ్ళలో
దేవాలయ ప్రాంగణంలో
పంచాగ శ్రవణం
ఘనంగా నిర్వహించేది
5
శీర్షిక:నిజమైన శోభకృత్
ఆకాశంలో వర్షపు మేఘాలు హడావిడి చేస్తుంటే,రైతు మనసు ఆనందంతో తాండవ నృత్యం చేస్తుంది
గగనంలో విద్యులతల్లా మెరుపుతీగలు తళుక్కుమంటుంటే
రైతుమనసులో వెలుగులు విరజిమ్ముతూ ఉంటాయి.
మిన్నులో ఉరుముల ఢమఢమలు రైతు చెవులకు భాజాభజంత్రీలౌతాయి.
తొలకరి చినుకులు భూమాతను ముద్దాడి పులకరింప చేస్తే వచ్చే మట్టి వాసన రైతునాసికకు సౌగంధిక పుష్ప సువాసనౌతుంది.
పొలందున్ని నారేత ఏస్తుంటే రైతుకు తనింట పచ్చని తివాచీ పరుస్తున్నట్లుంటుంది.
కలుపు మొక్కలు పీకేస్తుంటే గత అనుభవాల అనుమానపు తెరలు తొలగిపోతున్నట్లుంటుంది.
యూరియా వేసిన తర్వాత కరుకుమీదున్న ముదురుపచ్చని పైరు గాలికి తలలూపుతుంటే రైతు మదిలో తియ్యటి తలపులు తలుపులు తడుతున్నట్లుంటుంది.
పొట్ట మీదున్న వరిపిలకలనుచూస్తుంటే గర్భంతో ఉన్న తనబిడ్డే ముందున్నట్లుంటుంది.
అధిక దిగుబడి వచ్చి గిట్టుబాటు ధర లభిస్తేరైతుకు ఏనుగెక్కినట్లుంటుంది
ఓ శోభకృత్ నామ సంవత్సరమా!
ప్రభుత్వ భరోసా పాటూ నీవూ ఇవ్వాలి రైతన్నకు తగు ఊతం.
ప్రకృతి వైపరీత్యాలకు అడ్డుకట్ట వేయాలి నీ ఆగమనం.
చీడలు,తెగుళ్ళు ఆశించకుండా చేయాలి నీ చల్లని చూపు.
అధికదిగుబడితో, గిట్టుబాటు ధర లభించేలా చేయాలి నీ మహత్తు.
వ్యవసాయం దండగకాదు,పండగ
అనే మనోస్థైర్యం ఇవ్వాలి శోభకృత్.
తిప్పావఝల నరసింహమూర్తి.
బుచ్చిరెడ్డి పాలెం.నెల్లూరుజిల్ల
6
శోభకృత్ నామ సంవత్సరం ఉగాది పండుగ పురస్కరించుకొని ప్రత్యేక కవితల కొరకు
_________________________
పేరు : గంటి .మీనాకుమారి
SA(తెలుగు)
ఊరు: శ్రీకాకుళం .
శీర్షిక: "ప్రకృతి_ వసంతుల పరిణయం "
_________________________
వసంతుని రాకతో పరవశించి పులకించె ప్రకృతి కాంత
వీరి పరిణయానికి ఉగాది శుభ దినం కాగా ప్రతి ఇంటికి మామిడి తోరణాలు కట్టగా , రక రకాల పూల పరిమళాలు సుగంధ సువాసనలు వెద జల్లగా,
పిల్లగాలులకు చెట్ల కొమ్మలు వింజామరలు వీచగా
గండుకోయిలల గానాలు మంగళ వాద్యాలు కాగా ,
పచ్చని చేలను చీరగ చుట్టి ,
వివిధపూలను సిగలోతురిమి ,
చల్లనినదీ జలాలను కంఠంలో వజ్రాల హారంగా ధరించి ,
ఎత్తైన పర్వతాలు తన శిరస్సు కాగా,
ఉదయిస్తున్న ఎర్రని సూర్య బింబాన్ని నుదుట బొట్టుగా ధరించి ,
సర్వ సుందర శోభాయ మానంగా అలంకరించుకొని, వచ్చిన భూమాత పెద్దరికం వహించి పెళ్లి చేస్తుండగా , సకల శోభలతో విరాజిల్లుతూ మంగళ ప్రదంగా విచ్చేసిన శోభకృత్ మనస్సులు ఆనందింపజేసి,ఆహ్లాదాన్ని కల్గించి , అబ్బుర పరచి , సందడి చేస్తోంది .
_________________________
పైకవిత నా స్వంత రచనని ,దేనికీ అనువాదం ,అనుకరణ కాదని హామీ ఇస్తున్నాను .
_________________________
7
అపరాజిత్ రెడ్డి
ఊరు : సూర్యాపేట
ఫోన్: 9848532031
అంశం : ఓ ఉగాది!
శీర్షిక : ఉగాదీ! ఈ అరాచకాలు సమాధి కావాలి!!
నూతన వత్సరం శోభకృత్ దైవ కృపతో
నవనవోన్మేశంగా సాగాలి బడుగు బ్రతుకులు శోభిల్లగ
కష్టజీవుల నిరాశ నిస్పృహల గుండె సవ్వడుల్లోఆశల వెలుగులు చిందాలి
వికృత అపహాస్యాలకు గురవుతున్న మహిళల్లో చైతన్య జ్వాలలు రగల్చాలి
స్త్రీలను అర్ధనగ్నంగా చిత్రీకరించే చీకటి చిందుల కెమెరాలు కట్టేయాలి
వయసు వడలిపోతున్న తల్లిదండ్రులను హతమార్చడమా సిగ్గు సిగ్గు
నట్టనడిరోడ్డుపై భార్యాభర్తల హత్యారాజాకీయాల కంపు
నిట్టనిలువునా చీలిపోతున్న మానవతా విలువలు
నిప్పును మింగే నిశీధి రాత్రులు తాగుబోతు గుండాల దాష్టికాలు
బ్రతుకు బండి ఈడ్చుతున్న మధ్యతరగతి మనసుల్లో కమ్ముకున్న మేఘాలు
ఓట్ల గల్లపెట్టే పట్టుకుని పంచుతున్న డబ్బులు మందుసీసాలు
ఓటు విలువ తెలిసీ తెలియక వాటిని ఆభగా అందుకునే సామాజిక నైజం
ప్రకృతి వైపరీత్యాలతో నిండా మునుగుతున్న రైతన్నలు
విష సంస్కృతి విద్య సుదీర్ఘ కాలంగా పిల్లల్లో దిగజారుస్తున్న నైతిక విలువలు
కుల మతాల కుమ్ములాటల్లో సామాన్యుల బలిదానాలు
యువతరం నవతరం ఈ వత్సరం ముందున్న సవాళ్ళెన్నో
మేధావులూ అంధకారంలోంచి బయటకు రండి
ఆకలి మంటల అభాగ్యుల కన్నీళ్ళు తుడవండి
శోభకృత్ ఉగాది కాలం కడలిలో కలువక ముందే మంచి మార్పుకోసం ఎదురుతెన్నులు!!
అపరాజిత్
హామీ పత్రం: ఈ కవిత నా కలం సేత అని నా హామీ
8
"కవితాగానం సభ్యులైన కవిమిత్రులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు"
కవితా గానం సీజన్ - 4
పేరు :గొర్రెపాటి శ్రీను
ఊరు : హైదరాబాద్
శీర్షిక :"ఉగాది లక్ష్మికి స్వాగతం!"
కొత్త ఊహలెన్నో చిగురులు తొడుగుతుంటే
నవ్య చైతన్యాలను అందిపుచ్చుకుంటూ
కవులు కమ్మని కవనాలు లిఖిస్తూ
ఉగాది లక్ష్మికి స్వాగతం పలుకుతుంటే
అంబరాన్నంటే సంబరాలని వెంటేసుకుని వస్తుంది ఉగాది !
నవ వసంతం రాకతో
ప్రకృతి పులకరిస్తున్న సమయాన
చైత్రమాసం సరికొత్త అందాలని సంతరించుకుంటూ
ప్రజలందరిని కొత్త ఆశల పల్లకిలో ఊగేగిస్తున్న శుభవేళ
ఆనందంగా తరలి వస్తుంది ఉగాది !
అనురాగం ఆప్యాయతలకు నెలవైన
తెలుగు లోగిళ్ళు
పచ్చని మామిడి తోరణాలతో ముస్తాబవుతూ
అలంకారాల సిరులతో అలరారుతుంటే
చిరునవ్వుల దివ్వెలతో
ఎదురేగి ఉగాది కి ఆహ్వానం పలుకుదాం !
మావిచిగుళ్ళు తింటూ పరవశాల తో
"కుహు..కుహూ" అంటూ కోయిలమ్మలు
ఆలపించే కమ్మని సుస్వరాలని ఆస్వాదిస్తూ ..
ఉగాది పచ్చడిని ఆరగిస్తూ ..
పంచాంగ పఠానాలని ఆలకిస్తూ ..
వేపపూతలను తాకుతూ వీచే పవనాల హాయిదనాలని అనుభవిస్తూ ..
సకల సంపదలు చేకూర్చే
ఉగాది లక్ష్మికి సాదరంగా స్వాగతం పలుకుదాం !
"ఉగాది లక్ష్మికి స్వాగతం !" అను కవిత నా స్వంతమని హామీ ఇస్తున్నాను.
- గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్) 9652832290.
9
అంశం ...ఉగాది పండుగ
శీర్షిక ....అందాల సందడే .
పెరు ..ఏ. భూపతి
ఊరు ..హైదరాబాద్, 9989218154..
తెలుగింటి తొలి పండుగ ద్వారం
మామిడి వగరుల సంతోష పర్వం ,
నూతన వస్త్రాల దస్త్రం ,
వినూతన ఊహల పల్లకి ,
భవితకు పునాది పూజ ,
షడ్రుచుల సంగమ మురిపం ,
మామిడి తోరణాల స్వాగతం,
రంగు రంగు పూల మెరుపు ,
అనుబంధాల చిరునవ్వు ,
ఆనందాల మైమరుపు ,
కోకిల పాటల చిగురుమామిడి,
చిన్నారుల కోలాహలం ,
వంటగదుల గలగల నవ్వు ,
పసుపు కుంకుమల పరిమళలాలు
అందరిని కలిపే ఆహ్వానం ,
పంచాగ శ్రావణ పారవశ్యం ,
ప్రకృతి పరచిన ఋతువు ,
ఉగాది పచ్చడి రుచులు ,
అన్నీ తెచ్చే ఈ శోభకృత
నామ సంతత్సరం మన
తెలుగు సంప్రదాయాల
అందాల సందడే ...కదా....!
హామీ...ఈ కవిత నా సొంతం
అనువాదం కాదు .
10
అంశం:- ఉగాది
శీర్షిక:-
శోభాయమానంగా రావమ్మా శుభకృత్
...........................
కరోనా సృష్టించిన కరాళ నృత్యం నుంచి ముక్తి పొంది
శుభకృత్ కొన్ని శుభాలునిచ్చినా నేటి సమాజంలో
జరిగే అఘాయిత్యాలు,అరాచకాలు తొలిగి
కులమత భేధాలు లేని వర్ణవివక్షతపోయి
పేద గొప్ప తారతమ్యంలేని
అసూయ, ద్వేషాలు సమసిపోయు
మానవత్వమే మాధవత్వమని
ప్రేమతత్వమే సమాజకల్యాణమని
తెల్లవారుజామున అభ్యంగన స్నానం చేసి
శ్రీరామచంద్రునికి నివేదించిన
షడ్రుచుల ఉగాది పచ్చడిని
భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తే
సంవత్సరమంతా సుఖ సంతోషాలతో
అన్నదమ్ముల వలె మనుషులంతా ఉండేటట్లు
శోభాయమానంగా శుభములు చేకూర్చడానికి వస్తున్న శోభకృత్ కు స్వాగతమమ్మా.....!!
.............................
ఇది నా స్వీయరచన
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం.
9963265762
..........................
11
సందేశం
*********
చీదరింపు చేదులో
వెక్కిరింత పులుపు కలిపి
కషాయం వగరులో
కరుకుదనం కారం ముంచి
ఆనందం మధురంలో
రుచికరం లవణం వేస్తే
ఉగాది పచ్చడి !
షడ్రుచుల అనుభవంతో
జీవిత గమనానికి
చేయాలి కట్టడి !
పి.లక్ష్మణ్ రావ్
అసిస్టెంట్ రిజిష్ట్రార్
సహకార శాఖ
9441225989
12
[21/03, 8:46 pm] Lakshmi Chamarthi Khammam: కవితగానం 4
రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి
కల్లూరు ఖమ్మం జిల్లా
అంశం ఉగాది
శీర్షిక మరో ఉగాది
కాలం కొమ్మకు మారాకు వేసింది
గతం లిఖించిన మహాప్రస్థానలన్నీ
అనుభవాల గూట్లో పదిలపరచి
మరో ప్రస్థానానికి తెరతీసింది
నిన్నలలో తీపెంతో చేదెంతో
మనస్సు మూలల్లో బాదెంతో బరువెంతో
సాధించిన వెన్నో వేధించిన వెన్నో
పదిల పరుచుకున్న జ్ఞాపకాలెన్నో
విదిలించుకునే వేదనలు ఎన్నో
ఏ రోజుకారోజు
కొత్త పాటల కోకిలయింది జీవితం
రేపటి కోసం మిగిల్చుకున్న ఆశలు
నిన్నని సాదరంగా సాగనంపితే
సంకల్పాల శోభ కృతిలో
కొత్త ఆకృతి దాల్చుకున్న ఆశయాలు
వస్తే రానీ
కష్టమో నష్టమో
సుఖమో దుఃఖమో
మరణమో జననమో
పదునెక్కే ఆశయాల పదరంగం ఇది
మారుతున్న కాలాల మధు రాగం ఇది
అలుపులేని పాట అవుతానో
వెనక నడుచు పాదాల బాటవుతానో
తీర్పు కాలానిదే
గెలుపు ఓర్పు హృదయానిదే
ఈ కవిత నా స్వీయ రచన. అనువాదం అనుకరణ కాదు.
13
[21/03, 8:46 pm] కందూరి సుజాత Poetess: శోభాకృత్ ఉగాది
*******************
ప్రతమ పండుగ పల్లవి శోభాకృత్ నామ
ప్రవాహిణీ.
ప్రమోద పండుగల ఉదయ జాబిలి
ఉగాది.
కాలహారంలో పుష్పరాగలు
రుతుమాసాలు
మణితునకలు పండుగలు
పదేపదే వస్తున్న.. ఏటికేడు కొత్తదనం
అదేకదా మన సంస్కృతి పదం.
అనాది జావళిలో ముంచుకొచ్చింది
ఉగాది జాము.
వసంత హేలి కోకిల లాళి
మావి మళ్ళియ హోలీ- సంస్కృతి కేళి ఉగాది వీధి.
నవ సంవత్సర నాంది శుభఫల ప్రారబ్ది.
షడ్రుచుల పచ్చడి నవరసాల సంగమ అంగడి.
కొత్తకుండ రసిబరితం ధన ధాన్య సమన్వితం.
పంచాంగ శ్రవణ తన్మయం
ఉగాది తత్వం.
తెలుగు పునాదికి ఉగాది తిలకం .
తెలుగు పాదముకు ఉగాది వేదం .
తెలుగు తనానికి తలపాగా.
తరతరాల అధ్యాయం
సంప్రదాయ ఉద్యాపనం.
ఐక్యత పూచే ఉద్యానం
ఆత్మీయత మొలిచే సేద్యం.
మానవ మనుగడ సౌభాగ్యం
మానవీయత ప్రేరేపణ వైభోగం .
శుభకృత్ శోభాకృతి ఏకమై ఎగిసిన వేళా
త్రివేణి సంగమ పవిత్ర గంగాలా .
పాపికొండల ప్రశాంతములా .
నింగినితాకే హిమవన్నగములా.
కృష్ణ పించము జాగృతిలా.
పూజ పువ్వులా పాప నవ్వులా
గాలి అలల గంధర్వ పరిమళమై
నవ తేజముతో సూర్యపుంజమై
షోబిళ్ళుమా శుభ తరంగిణి శోభాకృత్ నామ ఉగాది.
కందూరి సుజాతారాణీ
కవయిత్రి, రచయిత్రి
రాజేంద్రనగర్, హైదరాబాద్
9392162822
హామి.. పై కవిత నా స్వీయ రచన
14
డా. బల్లూరి ఉమాదేవి
కామవరం ఆదోని
కర్నూలు జిల్లా
అంశం: ఉగాది పండుగ
శీర్షిక: వత్సరాదికి స్వాగతం
తెలుగు వారి తొలి పండుగ ఉగాది
ఏటేటా వస్తున్నా ఇది నిత్యనూతనం
కొత్త కొత్త ఆశలను రేకెత్తిస్తోంది అందరిలో
సుఖదుఃఖాలను కష్టసుఖాలును
సమంగా స్వీకరించాలనే సూచనతో
షడ్రుచుల వేపపచ్చడినారగించమంటూ
జీవనయానంలో కొత్తశోభను నింపడానికి
శోభకృత్తు నామసంవత్సరం వస్తోంది
ఆమని రాకతో మావిచిగురుతిన్నకోయిలమ్మ
గళంసవరించుకోంటుంది గానమాలపింప
కొత్త ఆశలనురేకెత్తిస్తూ పూలతేరునెక్కి
చెరుకువిల్లు చేత పట్టి వసంతుడు
వడివడిగా వస్తున్నాడదిగదిగో
పచ్చదనంతో నిండిన పుడమిని చూస్తూ
మురిసిపోతోంది ప్రకృతి కాంత
పంచాంగ శ్రవణంతో ఆరంభిద్దాం
రాశిఫలాలను తెలుసుకొందాం
ఆదాయ వ్యయాలను పరిశీలిద్దాం
కలం బలం చూపుతూ కొత్త ఆలోచనలతో
కవితామతల్లికి అక్షరార్చన చేద్దాం
చేయిచేయికలుపుదాం తెలుగు వెలుగులను
కలిసికట్టుగా దశదిశలా ప్రసరింపచేద్దాం
సర్వేజనా సుఖినోభవంతు అంటూ
అందరి క్షేమాన్ని ఆకాంక్షిద్దాం.
డా బల్లూరి ఉమాదేవి
కామవరం/ఆదోని
కర్నూలు జిల్లా
15
అంశము.ఉగాది
శీర్షిక.తొలిపండుగ
........
ఉగాది రోజు
వేపపువ్వు కొత్తబెల్లముతోను
మామిడి ముక్కలు చెరుకు గడులుతోను
ఉగాది పచ్చడితోను బతుకును
నిండుగా పరవశo పొందేము
ఉగాది రోజున
పెద్దలను తలిచి కొత్తబట్టలుతో.
స్మరించి పూజించేరుగా
ముద్దుగాను ముచ్చటపడుతూ
చంద్రామానము ప్రకారము
చైత్రసిద్ద పూజరోజున
బ్రహ్మ పురాణోక్తి
నమ్మి నిలిచేరు ప్రజలు ఇల
గత అనుభవాల అనుమానపు
ముసుగును తెంచుకుని
కొత్త జీవిత తెమ్మరలను ఆస్వాదిద్దాము హాయి హాయిగాను
ధనాశి ఉషారాణి
భాకరాపేట
16
అంశం:- ఉగాది
శీర్షిక:- నవ వసంతం
కవి పేరు:- సింగీతం సంతోష్ కుమార్
ఊరు:- కామారెడ్డి
చరవాణి:- 8897152205
____________________________
నవ వర్షికనికి స్వాగతం పలుకుతూ
మామిడి పూతలు
కోయిల కుహు కుహుమనేకూతలు
విరబూస్తున్న విరులు
కాలంలో వచ్చే ఈ తొలి మార్పేల పండుగ
తెలుగువారి పండుగలలో
తొలి పండుగ....
ప్రకృతిలో మార్పు కారణంగా వచ్చే తొలి పండుగ
ఆరు రుచులు ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి,అనుభవానికి ప్రతిక
తెలుగు వారంతా గొప్పగా జరుపుకునే పండుగ...
మనసుకు అధిపతి అయిన చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి
దాని ఆధారంగా జరుపుకోనే పండుగ యుగాది....
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.
17
శోభాకృత్ సుశోభలతో
******************
నేనెలా మరచిపోగలను
నాకసలే యాది ఎక్కువ
కాల గమనంలో...
ఎన్ని వసంతాలు...చూశానో...
మరెన్ని శిశిరాలు ...దాటానో....!
కన్నీటి ఉప్పును చప్పరించాను
మమకారపు తీయదనాన్ని జుర్రాను
అసూయా ద్వేషాల చేదును దిగమింగాను
అహంకారమనే కారాన్నివొంటబట్టించుకున్నాను
పులుపులోని ..వగరును ఆస్వాదించాను
తెలుపులోని నలుపును గుర్తించాను
నలుపులోని తెలుపును పసిగట్టాను
నేను నేనుగా నిలబడ్డాను
నేనే కారణమని తడబడ్డాను
అందుకే
నేనెలా మరచిపోతాను
నాకసలే యాది ఎక్కువ
అనుభవాల పాఠశాలలో
అనుక్షణం విద్యార్థినై
ఎత్తువంపుల జీవితానికి
ససాక్ష్యముగా ముద్రపడ్డాను
మార్పులు తెచ్చే కాలచక్రానికి
ఆహ్వానమిస్తాను
భ్రమిస్తూ పరిభ్రమిస్తున్న భూగోళానికి
బుుతురాగమౌతాను
ధుఃఖములో బాధపడక
సంతోషంలో సుఖపడక
సమత్వంతో స్థితప్రఙ్ఞుడనై
శోభకృత్ వత్సరానికి సుస్వాగతమంటాను
*************
మేకల రామస్వామి
18
నాయకంటి నరసింహ శర్మ గారు: ఉగాది కవిత
ఓహో శోభకృత్ వత్సరమా
రచన డాక్టర్ నాయకంటి నరసింహా శర్మ. వనపర్తి.
నవ వసంత రుతు శోభలతో వచ్చెను శోభకృత్తు
కుహురవాలతో పంచమ స్వననాదాలతో కలస్వనములతో బృందాన్ని కుంజములతో నింబ పత్ర చిత్రములతో నవచూత పల్లవ వల్లరీ పుంజములతో
సందడి చేసింది పండుగ చేసింది వెచ్చని దివాకర మయూఖములతో
పుడమి పుత్తడిలా మెరిసింది జగత్తు పూలరెమ్మలా విరిసింది ఎలదేటి పాటలు గీతాలవలె
శుకశారికల తీయ తీయని పలుకులే పంచదార చిలుకలై మానవుని హృదయ కాసారంలో నీలోత్ఫలములు విచ్చుకున్నాయి ఆహా ఈ ఆనందం గగనమంతా పరుచుకునేలా సమాయత్తం చేసిన ఓ శుభకృతువత్సరమా నీకు జోహార్లు హార్దిక స్వాగతం చూత పత్రములతో గుమ్మానికి తోరణాలు అలంకరించారు మీ రాకకై ఓ శోభనామయూఖ నూతన వత్సరమా నీ ఆశీస్సులే మా జగద్రక్ష
19
తేదీ::21.3.23..మంగళవారం
అంశం:: ఉగాది
పేరు:: కవిత వెంకటేశ్వర్లు
ఊరు:: కర్నూలు
శీర్షిక:: అసలు సిసలు ఉగాది
శోభకృత్ నామ వత్సరము
చేసుకుంటుంది తెలుగు జాతి సంబరము
అది అందుకుంటుంది అంబరము
ఉగాది రోజు అంతా శుభం శుభము
ఇంటికి మామిడి తోరణాలు కట్టి
చుక్కల ముగ్గులు పెట్టి
చక్కటి దుస్తులు కట్టి
దేవునికి నైవైద్యము పెట్టి
అథిదుల ఆనందపరచి
వైషమ్యాలు మరచి
అందరూ హాయిగా ఉగాది జరుపుకుంటారు
ఏడాదంతా గుండెల్లో సంతోషము దాచుకుంటారు
అది అందరికీ అందితే బావుండు
ఎందరో పేదరికంలో మగ్గుతుండ్రు
కష్టాల కొలిమిలో కాలుతుండ్రు
బాధల చట్రములో నలుగుతుండ్రు
రోజోక గండంలా నడుస్తుంది వారికి
బ్రతుకే భారంగా సాగుతుంది వారికి
దినమొక యుగంలా వుంది
వెలుగే లేని కటిక చీకటి కమ్ముకు0ది
వారి జీవితాల్లో వెలుగు రావాలి
ఇంటిల్లిపాది సుఖ జీవనము గడపాలి
శ్రమకు ఫలితం అందాలి
రైతులకు గిట్టుబాటు ధరలు దక్కాలి
వారిలో ఆత్మస్థైర్యం పెంచాలి
మారాలి వారి జీవనము
సుఖ శాంతులతో గడపాలి సర్వ జనావళి
అప్పుడే ఉగాదికి శుభావళి శోభావళి!!
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ
20
అంశం: ఉగాది
ప్రక్రియ: వచన కవిత
శీర్షిక:షడ్రుచుల సమ్మేళనం
ముత్యం వెంకటేశ్వరరావు
గురజాల, పల్నాడు జిల్లా
శోభకృత్ నామ సంవత్సరం ఇది
కొత్త ఆశయాలకు పునాది
షడ్రుచుల నవజీవన ఉగాది
అందరూ బాగుండాలి ప్రతి యేడాది
పక్షుల కిల కిల రావాలు
పచ్చని పైర పంటలతో
వసంత ఋతువుకు
స్వాగతం పలుకుతున్నాయి
ఆమని హరిత కాంతులు
ఉషోదయపు ఉషస్సులు
నూతన సంవత్సరానికి పట్టాభిషేకం
నవ వసంత ఆనందాల హేల
తెలుగింటి తొలి పండుగ వేళ
ఆరు ఋతువులు ఆరు రుచులు
తీపి వగరు చేదు కారం పులుపు ఉప్పు
చక్కని చిక్కటి షడ్రుచులు
ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం
తెలుగింటి ముంగిట్లో అనురాగాల సందడి
తెలుగు సంస్కృతికి వన్నె తెచ్చిన
మన పంచాంగం శ్రావనం మధురమైనది
సప్త స్వరాలు అందించే సామర్ధ్యం
ఒక్క తెలుగు భాషకే ఉంది
కోయిల రాగ స్వరాలు తెలుగింటి వరాలు
పచ్చని తొరణాలతో కనువిందు చేసే
అంబరాన్ని తాకిన ఉగాది సంబరాలు
సంప్రదాయ నూతన వస్త్రాలతో జరుపుకునే
తెలుగింటి తొలి పండుగ మన ఉగాది!
*******************************
హామీ పత్రం:ఈ కవిత నా స్వీయ రచన
అని హామీ ఇస్తున్నాను.
21
పేరు :కొంజేటి రాధిక
ఊరు రాయదుర్గం
శీర్షిక.. జగానికి ఉగాది
నవ వసంతం ప్రకృతికి పచ్చల హారం మణిహారమై మెరవ.గా... నవోత్సాహంతో చెట్టు పుట్ట పశుపక్షాదులన్నీ ఆనందంతో రంకెలయ్యగా...
కొత్త బట్టలు,
కొత్త ఆశలు,
ముగ్గులై రంకెలెయ్యగా జగమంతా కొత్తదనంతో ముస్తాబై ,
నవ్యతకు నాంది పలుకుతుంటే,
గర్భగుడిలో గంటలన్నీ వేదమంత్రాలు వల్లించగా... పంచాంగ శ్రవణాలు ఆలయం ముంగిట్లో ప్రభవించగా...
ఆనందాలు హరివిల్లులై ప్రతి ఇంటి ముంగిట రంగవల్లులై విరబూయగా మామిడి తోరణాలతో వాకిళ్లు అల్లుకోగా షడ్రుచులే సమ్మేళత జీవన సారాన్ని ఉగాది పచ్చడి నిదర్శనమై , ప్రతి ఇంటి కోవెలలో ఆనందాలు పల్లవులై ప్రభవించాలని ఆకాంక్షిస్తూ ఉగాదికి ఆహ్వానం...
22
*నేడే ఉగాది*
నాలుగు కళ్ళు చేసుకొని కూడలి మధ్య పని కి ఎదురు చూసి పనిలో లీనమై చెమట స్నానం చేసి నాటి కైకిలు చేతిలో పడ్డ *రోజే ఉపాది ఉగాది*,
ఇరుకు గదుల్లో హోటల్ కూడుతో కళ్ళల్లో ఒత్తులు పోసుకొని పుస్తకాన్ని మస్తకంలోకి ఎక్కించుకొని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగికి ఆశించిన ఉద్యోగం తన కల *సాకారమైన రోజు ఉద్యోగ ఉగాది*,
తన ఇంటి సుడిగుండంలో చుక్కల చూపుతున్న సరుకుల ధరల శాంతాడు సామాన్ల చిట్టి చూసి దిగులుపడక , ఈ నెలకు ఏదో రకమైన కొత్త అప్పు కాకుండా వెల్లదీసిన *సగటు ఉద్యోగి కి ఊపిరిపీల్చుకున్న ఉగాది,*
భూమిని నమ్ముకొని కుటుంబాన్ని పక్కన పెట్టి అహర్నిశలు కష్టపడి అతి అనా వృష్టిలకు పంట చేతికొచ్చేదాకా భయం భయంగా గడుపుతూ అమ్ముడుపోయి సరైన ధర పలికినప్పుడు *రైతు కు వ్యవసాయఉగాది*,
తాను మోసుకొచ్చిన సరుకులు తగిన ధరకు త్వరగా అమ్ముడు పోవాలని ఆశించి ఎండనకా వాననక గిరాకీకై వేయికళ్లతో ఎదురుచూస్తున్న వ్యాపారికి త్వరగా అమ్ముడుపోవడం *సగటు వ్యాపారికి అపార వ్యాపారఉగాది*,
అందరి ఆశలు *మోస్తూ ప్రకృతి చిగురించిన ఈరోజే హృదయానికి అసలైన ఉగాది*!
రచన కే వి రమణా చారి తెలుగు పండితులు నిజామాబాద్ జిల్లా
23
అంశం : శోభకృతు ఉగాది
ప్రక్రియ : వచన కవిత
పేరు : ఆళ్ల నాగేశ్వరరావు
ఊరు : తెనాలి
జిల్లా : గుంటూరు
చరవాణి : 7416638823
కవిత శీర్షిక : ఉజ్వల ఉగాది
నవ నవోన్మేష ఉషస్సుల ప్రభాత భానునిలా
శతకోటి యశస్సుల కాంతి పుంజాలలా
నవతకు నాందిగా
మానవతకు పునాధిగా
సమానతకు వేదికగా
నవ సమాజ నిర్మాతగా
ఉజ్వల భవితకు వారధిగా
అరువదియేండ్ల ఆనక అమితొత్సాహంతో అరుదెంచు చున్నది శోభాకృత్ నవ ఉగాది
ఇదే కానున్నది ఉజ్వల ఉగాది!
మానవత్వం మృగ్యమై
దానవత్వం జ్వలిస్తున్న తరుణంలో
హృదయమనే ప్రమిదలో
మానవత్వమనే తైలంపోసి
మంచితనమనే దివ్వెను వెలిగించి
మానవతా వెలుగులను ప్రసరింప చేసేందుకు
అందరికి శుభాలనొసగెందుకు
నవ్య యుగాది శోభకృత్ ఉదయిస్తుంది
నవోదయాన్ని పూయిస్తుంది
సర్వజనా సుఖినోభవంతని దీవిస్తుంది!
అందరి ఆశ(యా ) లను నెరవేర్చుతుంది!
**************************
హామీపత్రము :
పై వచన కవిత నా స్వీయరచనేనని, ఇది దేనికీ అనువాదం, అనుసరణ కాదని, ఇది ఎప్పుడు, ఎక్కడ ప్రచురణ, ప్రసారం కాలేదని హామీ ఇస్తున్నాను.
====================
24
కవన జ్యోతి
అంశం ఉగాది
శీర్షిక ఉగాది యుగాది
మంచు తెరల సందడి నిష్క్రమించగా
మల్లెపూల పరిమళ మినుమడించగా
వసంతుని రాకతో వికసించిన తరువులు
చిగిర్చి పచ్చదనంతో మెరిసిన వృక్షశాఖలు
కోకిలల కుహు రాగాల పరవశం
ప్రకృతి పులకించిన సమయం
వేపపూలతో భూదేవిని అలంకరించగా
మామిడి పిందెలతో మురిపించగా
జగతి నూతన సంవత్సర శోభలతో,
శోభకృతు ఉగాది నరుదించే వేడుకలతో
కొత్త వస్త్రాల గరగరలతో సందళ్ళు
అతివల హస్త లాఘవాలతో ముంగిళ్ళు
షడ్రుచుల ఉగాది పచ్చడి
సంవత్సరాదికి జనుల నోరూరించి
పిండివంటల ఘుమఘుమలతో
విందుభోజనాలతో ఉగాదికి స్వాగతాలు
ఉగాదిలక్ష్మిని నాహ్వానించుటలో
కవులు మునిగి, కవితాగానాలతో
వేదికలు మారుమ్రోగుతుండగా
ఒకవైపు పంచాంగ పఠనాలతో
ఆలయాలు శుభప్రదమై శోభించే
కోరికలను కొంగున ముడేసుకుని
ఉగాది లక్ష్మి కళకళ లాడుచు
చిరునగవులతో నరుదెంచే
ఈ కవిత నా స్వంతామని హామీ.
తోట సులోచన
నెల్లూరు
చరవాణి 9490173053
హామీ పత్రం
ఈ కవిత నా స్వంతమని హామీ
25
గర్జించే సింహం లా
వర్షించే మేఘంలా
అమ్మా అన్న పిలుపులా
అమ్మో అన్న కేకలా
అచ్చంగా వచ్చేదే కవిత
పురివిప్పిన నెమలిలా
అరవిరిసిన మందారంలా
ఉదయించే సూర్యునిలా
విరబూసిన వెన్నెల లా
అచ్చంగా వచ్చేదే కవిత
ఘోషించే వేదంలా
వినిపించే రాగంలా
కదిలించే కావ్యంలా
కరుణించిన దైవంలా
అచ్చంగా వచ్చేదే కవిత
బోధించే గురువులా
శోభించే విద్య లా
రాణించే వృత్తి లా
అభ్యశించే విద్యార్థి లా
అచ్చంగా వచ్చేదే కవిత
పడి లేచే కెరటం లా
పయనించే నావలా
ప్రవహించే నదిలా
మెరిసే ముత్యంలా
అచ్చంగా వచ్చేదే కవిత
లలితా చండీ
21-3-2023
[21/03, 9:02 pm] లలితాచండీ Poetess: *కవిత*
గర్జించే సింహం లా
వర్షించే మేఘంలా
అమ్మా అన్న పిలుపులా
అమ్మో అన్న కేకలా
అచ్చంగా వచ్చేదే కవిత
పురివిప్పిన నెమలిలా
అరవిరిసిన మందారంలా
ఉదయించే సూర్యునిలా
విరబూసిన వెన్నెల లా
అచ్చంగా వచ్చేదే కవిత
ఘోషించే వేదంలా
వినిపించే రాగంలా
కదిలించే కావ్యంలా
కరుణించిన దైవంలా
అచ్చంగా వచ్చేదే కవిత
బోధించే గురువులా
శోభించే విద్య లా
రాణించే వృత్తి లా
అభ్యశించే విద్యార్థి లా
అచ్చంగా వచ్చేదే కవిత
పడి లేచే కెరటం లా
పయనించే నావలా
ప్రవహించే నదిలా
మెరిసే ముత్యంలా
అచ్చంగా వచ్చేదే కవిత
లలితా చండీ
21-3-2023
26
..కృతం🎯
ఈ తెలుగు సంవత్సరం
శుభకృతుకు.. చివరి రోజు
మస్తు మజా.. చేయరే..!
తెల్లవారితే శోభకృతు
కొత్త వత్సర స్వాగత
శుభాకాంక్షలు శెప్పరే..!
ఇంగిలీషు మోజులో..
తెలుగు ఊసు మరిస్తిరేల?
శుభకార్యాలకు శుభం కలగాలి
తిథీ నక్షత్రం యోగం చూడాలి
తేదీనేమో.. ఇంగిలీషుదవ్వాలి
గిదేం ఇశిత్రమో అర్థం కాదుగానీ
సొమ్మొకడిది సోకొకడిది
అనేది ఒక పాత సామెత
వ్రతం ఒకడిది ఫలితం ఇంకొకడిది
నయా సామెతైంది కదా
గట్లనేనేమో..
మంచి కోసం మన పంచాంగం
కంచి కోసం పరాయి మంత్రాంగం
ఇదే నేటి తెలుగు వారి యంత్రాంగం..
ఇది యుగాదియో మరి
వ్యధాదియో..
నడిచే నవ జనతాదో..
సంక్రమణమేదైనా..
నవ నాగరికత నడక తత్వం
నగిషీలు చెక్కినా నగ్న మూర్తిమత్వం
ఇదే నేటి మూఢత్వం
అయినా కోరుకుందాం
నవీన శోభకృతం..!
💐💐🌱🌱💐💐
--✍️అర్జున
27
వైరస్ నుంచి ఊపిరి పీల్చుకోమని కొంత ఓదార్పు నిచ్చింది శుభకృత్ !
పై గా వెడుతూ వెడుతూ నాటు పాటై ఆస్కార్ నిచ్చింది!
అరవై వత్సరాల తర్వాత వస్తున్న శోభకృత్ తెలుగునేల ల్ని చూసి తెల్లబోకుండా చూడాలి!
కోయిల పాటతో పిలుద్ధామంటే...
వడగళ్ల వానకి దాక్కుందా?
మాస్క్ పెట్టుకుందా? పాటై వినిపించట్లేదు!
పంచాంగశ్రవణం ఛానెల్ కో రకంగా
పార్టీపరంగా మారిపోతోంది!!
సంవత్సర ఫలితాల కన్నా పరిహారాలు భయపెడుతున్నాయి!!
పసందుగా పచ్చడి తినిపిస్తే సరి!!
చింతపండు వేస్తే గాస్ వస్తుందా?
అయోడిన్ ఉప్పా,కల్లుప్పా?
ఆర్గానిక్ బెల్లమా? మామూలు దా?
కారం కాదు మిరియం వేస్తే సరి!
మామిడి కాయ మురిపెం గా నవ్వింది!
నా పిందె వగరు; నా కాయ పులుపు,నా పండు తీపి అంది మూడు శాఖలు నిర్వహించే మంత్రిలా!
ఉగాది పచ్చడి లో తీపి తగిలేలా చేయాలి!!
ఉగాది ప్రతిజ్ఞ లేం చేద్దాం?
తెలుగు పిల్లలకి తెలుగక్షరాలు నేర్పుతామనా?
యువతని మత్తు,మాదక ద్రవ్యాలకి దూరం చేస్తామనా?
ప్లాస్టిక్ నుండి ప్రకృతి ని రక్షిస్తామనా?చెట్లు,నరకం. .అనా?
లీకేజీల స్కాముల్లో వుండమనా?
శోభకృత్ సంతోషించి తాయిలాలు తెస్తుంది!!
ఆనందం,ఆరోగ్యం, ఇచ్చి
పాడి పంటలతోఆశీర్వదించాలని కోరుతూ
శోభకృత్ ఉగాది
శుభాకాంక్షలి విగో!!!
. +++++
28
[21/03, 9:20 pm] Maddi Pullarao Poet: కవితాగానం
శీర్షిక : శుభాల శోభకృతు
తేటగీతులు
....
1
భారతీయులకిష్టమీ పర్వదినము
సంవత్సరమునకాదియై జయములిచ్చు
పెద్ద పండుగౌ జనులకు ప్రేమ మీర
సర్వజనులకానంద మొసగు యుగాది
2.
ఋతుగమనము నిర్ణయముగ ఋషులు మనకు
శాస్త్ర విధముగ దేల్చిన సాంప్రదాయ
పర్వదినమె యుగాదాయె ప్రాభవముగ
తరలి వచ్చు వసంతము వరములీయ
3.
శిశిరమెళ్ళగ చిగురించు చెట్లు భువిన
మార్పులు జరుగు చైత్రాన మంచి కొరకు
కర్షకులకు యుగాదియె కల్పతరువు
కవులు వినిపించు కమనీయ కవితలపుడు
4.
జరుగు పంచాంగ శ్రవణాలు జయము గోరి
పిండి వంటల ఘుమఘుమ దండిగుండు
కొత్త వస్త్రాలు ధరియించి గుడులకేగి
శౌరికి నమస్కరింతురు శుభము గలుగ
5.
కోయిలల కుహూరాగాలు హాయినిచ్చు
పచ్చడి తినిన మేలు పాడ్యమందు
పసుపు గుమ్మాలు రమణీయ వైభవములె
శోభకృతు!జగతికి కడు శుభములీవె!
....................
కవి : మద్ది.పుల్లారావు
ఊరు : నందిగామ
NTR జిల్లా
చరవాణి : 9951287113
29
[21/03, 9:20 pm] అఫ్సర్ వలీషా గారు: కలితాగానం సీజన్ 4
అంశం... శోభకృత్ నామ సంవత్సర ఉగాది
శీర్షిక...శుభాల జల్లు
వసంత ఋతువు రాక
వళ్ళంతా సంతోషాల కేక...
మధుమాసపు మల్లెల వింత ఒకింత
మధురమైన అనుభూతుల పులకింత.....
ఆమని కోయిల కుహు కుహుల సంగీతం
ఆనందాలు మోసే శోభాకృత్ కు స్వాగత సంకేతం....
గుమ్మాలకు మామిడి తోరణాలు
గుమ్మం ముంగిట ముగ్గుల హరివిల్లు వర్ణాలు.....
కొత్త బట్టల రెపరెపలు
కోరిన వంటల ఘుమఘుమలు....
ఉప్పు ,తీపి, కారం, వగరు, చేదు ,పులుపు ,షడ్రుచుల మేళవింపు
ఉత్సాహపు పంచాంగ ఆకళింపు.....
మంచిచెడుల కష్ట సుఖాలు
ఆదాయ కందాయ రాశిఫలాలు....
మనసు పూల రెక్కలు తొడిగి ఆశల పందిరిలో ఊరేగుతూ
ఉషః సంధ్యల తోడుగ
జీవితాలలో కురిపించును శుభాల జల్లులు...!!
మొహమ్మద్ . అఫ్సర వలీషా
ద్వారపూడి (తూ గో జి )
హామీ.... నమస్తే 🌹🙏ఈ కవిత నాస్వంత మేనని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను 🙏🙏🙏🙏
30
ఉగాది పండుగను పురస్కరించుకొని కవనజ్యోతి
ప్రత్యేక కవిత
పేరు : డా.కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
తేది : 21-3-23
శీర్షిక :స్వాగతం నీకు
సుస్వాగతం
స్వాగతం నీకు సుస్వాగతం శుభస్వాగతం
ఓశోభకృత్ నామ వత్సరమా
స్వాగతం నీకు సుస్వాగతం
శుభస్వాగతం.
శార్వరి వెతలను దూరం చేస్తూ
ఈతిబాధలకల్మషాలను నీ ప్లవ
ప్రవాహంలో కొట్టివేస్తూ
శుభాల శుభకృత్ కి వీడ్కోలు
చెప్పి
రాజకీయ పంజరాలలో చిక్కుకోక
హింసాకాండల వ్యాఘ్రాలకు
గురికాక
అరిషడ్వర్గాలను జయించి
అంతఃకలహాలను అణచివేసి
మంచితనమే మనసుగా
మానవత్వమే మనుగడగా
శాంతిదూతవై, వెలుగురేకవై
రావమ్మా
ఓశోభకృత్ నామ వత్సరమా
స్వాగతం నీకు సుస్వాగతం
వసంతవసనాల జిలుగులతో
కోయిలలనానందాబ్ధిలో ముంచుతూ
తుమ్మెదలను సంతోషసాగరాన నోలలాడిస్తూ
పంచాంగ శ్రవణాలతో
షడ్రుచుల సమ్మేళనమే
జీవితమ్మని తెలుపుతూ
రావమ్మా ఓ ఉగాదీ !
స్వాగతం నీకు సుస్వాగతం
ప్రకృతి కాంతను అలరిస్తూ,
మురిపిస్తూ, మెరిపిస్తూ
వైషమ్యాలను తొలగించి
స్నేహలతలను ప్రోదిచేసి
మానసాంబరంలో తారవై
చైత్రమె చైతన్యంగా
రావమ్మా! ఓశోభకృత్తూ!
నిరాశల ఆకులను రాలుస్తు
కొత్త కొత్తఆశల చిగుళ్లతో
దాహంతో అలమటించే గ్రీష్మంలో జీవనదిలా
శిశిరంలో వసంతభావనలా
ఆరిపోయేఆశల దివ్వెలను
వెలిగించే నవజ్యోతిలా
మానవమహోన్నతికి దారి దారిచూపుతు
మానసోల్లాసాన్ని కలిగిస్తు
మానవాభ్యుదయాన్ని కాంక్షిస్తు
మధుపాళిని పలకరిస్తూ
మధురవసంతగీతాన్ని ఆలపిస్తు
మల్లెల సుగంధాలు విరజిమ్ముతు
మధురరాగాల కోయిలల గానాలు వినిపిస్తూ శోభాయమానంగ రావమ్మా శోభకృత్
స్వాగతం! నీకు సుస్వాగతం
శుభస్వాగతం
పైకవిత నాస్వంతం
31
అంశం: ఉగాది
శీర్షిక : వినమ్రంగా విన్నవించారు
*************
తల్లీ
శోభకృత్ నామ సంవత్సరమా..
పచ్చదనాల..
చీరను చుట్టుకుని
వేపపూలను..
తల్లో ముడుచుకుని
పంచాంగం చేతబట్టుకుని
తాయీలం లా..
మంచికాలాన్ని..వెంట తెస్తావని
తెలుగు బిడ్డలం..నీ దారి కాచి ఉన్నాం
చైత్రశుద్ధ పాడ్యమి నాడు నువ్వొస్తే
మామిడాకుల తోరణాల గుమ్మాల
స్వాగతాలు లేవనో
ముంగిట రంగవల్లులు..తీర్చిదిద్దలేదనో
కోయిల పాట కచేరీలు..
కాసింత తగ్గాయనో
నైవేద్యం నిరాశ పరిచిందనో
చిన్నబుచ్చుకోకు
అమ్మా.....
సంవత్సరాదిన నువ్వొస్తే
నీకు ఒడినింపాలని
చీరె సారెల నివ్వాలనీ ఉంది
షడ్రుచుల కమ్మదనాలను
కానుకివ్వాలని ఉంది
వడగండ్ల విసురుకు
కష్టార్జితం నేల కూలింది
అకాల వర్షం
అన్నాన్ని మట్టిపాలు చేసింది
నిర్వేదం లో మునిగున్నాం
చీకట్లను ఎదుర్కొనే
పోరాటాలను నేర్పమని
వెలుగు గమ్యాలను చూపించమని
కష్టాల
కబందహస్తాలలోంచీ
విడిపించమని
వినమ్రంగా విన్నవిస్తున్నాం
డా.దారల విజయ కుమారి
32
పిన్నక నాగేశ్వరరావు. 21--3--2023.
శీర్షిక :-- శ్రీ శోభకృత్ ఉగాది.
1. తే.గీ.
సృష్టి యారంభమైన రోజిదియె ననుచు
తెలుపుచుండె పురాణముల్ దెల్లముగను
మొదటి వత్సరము,ఋతువు మొదటిదగుచు
మొదటి మాసమును, తిథియు మొదటిదైన
పాడ్యమి దినమున "నుగాది" పర్వమగును.
2. తే.గీ.
యుగమునకు నాది పండుగ, నుదయమందు
తినెడు పచ్చడి షడ్రుచుల్ దెలియజేయు
కష్ట,సుఖముల సమముగా కాంచవలయు
ననుచు"శోభకృత్"వత్సరమందు మనము.
3. కం.
వెడలగ "శుభకృతు"వత్సర
మడుగిడితివి"శోభకృత్తు"వానందముతో
పుడమిని సుఖ,సంతసముల
నడయాడగ జేయవమ్మ నందరి బ్రతుకున్.
4. తే.గీ.
తెలుగు లోగిళ్ల యందున వెలుగు పూలఁ
జల్లగా వచ్చు తెలుగు వత్సరమ! నీకు
స్వాగతము పల్కుచుంటిమి సర్వ జనుల
కాచి రక్షించుమా భావి కాలమందు
నాయురారోగ్య మైశ్వర్య మందజేసి.
5.చం.
సమయగ ప్రాంత భేదములు సఖ్యతఁ బెంచగ
మానవాళిలో
సమతుల వర్షముల్ గురిసి సంతసమొందగ
రైతులెల్ల, దే
శము సఖభోగ భాగ్యయుత శాంతిశుభమ్ముల
తోడ నొప్ప నా
గమనము చేసి శోభకృతు! కాంక్షలనన్నియు
దీర్చిపోవుమా!
"శోభకృత్" ఉగాది శుభాకాంక్షలతో... ...
పిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
**************************************
Comments
Post a Comment