Skip to main content

శ్రీ రామనవమి 2023

నిర్వహణ
శివునూరి లలితా కృష్ణ
వీరా గుడిపల్లి
********************
కవివరుల జాబితా
1.వీరా గుడిపల్లి
2.లలితా కృష్ణ 
3.
4.
5.
6.
7.
8.
9.
10
*****************************
1
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
30032023
********************
అప్పుడప్పుడు
అయ్యో అనిపిస్తుందే 
అన్యాయాన్ని చూసినప్పుడు
అదే రాముడంటే! 
 బయటికి రానీయవేం?

అప్పుడప్పుడు
మంచేదో చెడేదో హెచ్చరిస్తుంటాడే
 నీలో ఒకడు
వాడే రాముడు!! వాడి మాటే వినవేం?

మంచికి
 మాటకు
ధర్మానికి
ప్రతిరూపంగా మసిలి ఎన్ని కష్టాలు పడ్డాడు
అందుకే 
రామున్ని ప్రతీ హృదయం మోస్తుంది భద్రంగా

బయటికి రానీయకుండా
తన మాటే వినకుండా
కష్టాలు చుట్టు ముట్టకుండా
ప్రతీ మనిషి లో ఉన్న
 రాముడి మాట విందాం
తనను బయట తిరగనిద్దాం
ధర్మాన్ని బ్రతకనిద్దాం

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
............ *వీరా గుడిపల్లి*
2.
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో...
💐💐💐💐

రామాయణమంటే
సీతమ్మ వ్యధ
రావణుని వధ కాదు

ఇలా జరిగిందన్న ఇతిహాసపు శిలాశాసనం

విలువలు తరిగిపోతున్నాయని వాపోవడమూ....

బంధాలు బలహీనమవుతున్నాయని బెంబేలెత్తడమూ 

ఏమిటీ కష్టాలంటూ..
చేవ చావడమో...
చేతులెత్తేయడమో....
చేస్తున్న వేళ..

జీవన గమనాన్ని సుగమం చేసే దారి దీపం....

కల్మషబీజాలు కన్నీటి ఫలాలనందిస్తాయని..

అనుమానాలచీడలు తనవారినీ.. తొలిచేస్తాయని..

ఆరోపణకు అవాక్కవడం కాదు
నిజ నిరూపణ కోసం..
 నిరీక్షణలు..
అగ్ని పరీక్షలూ..
తప్పదని..

కష్టాల కెరటాలకు వెరవకుండా 
ఓదార్పు నలదడమిలాగని...

మంచిని కోరుకోవడం
చెడుని చేర్చుకోకపోవడమిలాగని....

వాస్తవాలను వ్యవస్థ కు తెలిపే..
విలువల దర్పణం...

*********శివునూరి లలితాకృష్ణ

Comments

Popular posts from this blog

సింధూరం 07052025

****************** సింధూరం దిద్దిన వారు  1.వీరా గుడిపల్లి 2.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, 3.గొర్రెపాటి శ్రీను  4.దోసపాటి వేంకట రామచంద్రరావు  5.అపరాజిత్ 6.వేమూరి సత్యవతి  7.జ్యోతి  8.మండ నాగేశ్వరరావు  9.గడ్డం కృష్ణారెడ్డి.రేపాల.సూర్యాపేట 10.కవిత వెంకటేశ్వర్లు  11.ఆర్ వి వి రాజా  12. శ్రీ కోరాడ నరసింహారావు గారు  13. శ్రీ ఉదయగిరి మధుమోహన్ గారు  14. శ్రీమతి బల్లూరి ఉమాదేవి గారు  15. శ్రీమతి తోట సులోచన గారు  16. శ్రీ జి సూర్యనారాయణ గారు  17. శ్రీ గజవెల్లి శ్రీనివాస చారి గారు  18. శ్రీ వనపర్తి గంగాధర్ గారు  19. శ్రీమతి వాణి సరోజిని లక్కరాజు గారు  20. శ్రీమతి సింహాద్రి వాణి గారు 21. శ్రీ ఆచార్య అయ్యల సోమయాజులు ప్రసాద్ గారు  22. 23.శ్రీమతి నెల్లూరు వేంకటలక్ష్మి గారు 24.శ్రీ ఏడెల్లి రాములు గారు  25. శ్రీమతి డాక్టర్ తంగిరాల నాగలక్ష్మి గారు  26. శ్రీ కూని అంకబాబు గారు  27. శ్రీ తిన్నాక నాగేశ్వరరావు గారు  28. శ్రీమతి లలితా చంటి గారు  29. శ్రీ పిల్ల వెంకటరమణ మూర్తి గారు  30. ...

season 6 వైశాఖ పూర్ణిమ

కవనజ్యోతి,కవితాగానం సీజన్ 6  వైశాఖ పౌర్ణమి నగదు పోటీలు   పోటీకి కవితలు పంపించిన కవి వరుల జాబితా  1. శ్రీ పిళ్ళావెంకటరమణ మూర్తి గారు  2. శ్రీ సంగీతం సంతోష్ కుమార్ గారు ji 3. శ్రీ జి సూర్యనారాయణ గారు  4.శ్రీ మండ నాగేశ్వరరావు గారు 5.శ్రీమతి కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  6.శ్రీమతి నెల్లూరు వెంకటలక్ష్మి గారు 7.శ్రీ అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 8..శ్రీ కోరాడ నరసింహ రావు గారు  9.శ్రీమతి డాక్టర్ భమిడిమర్రి కమలాదేవి గారు 10.శ్రీ కాసుల ధీరజ్ శర్మ గారు  11.శ్రీ కూని అంకబాబు గారు 12.శ్రీ మతి డా.వేమూరి సత్యవతి గారు  13.శ్రీమతి డా.బల్లూరి ఉమాదేవి గారు 14.శ్రీ.దోసపాటి వేంకట రామచంద్రరావు గారు 15.శ్రీ అపరాజిత రెడ్డి గారు  16. శ్రీ ఏడెల్లి రాములు గారు  17.శ్రీ డాక్టర్ ఆళ్ళ నాగేశ్వరరావు గారు  18. శ్రీ కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  19. శ్రీ మద్ది పుల్లారావు గారు  20.శ్రీమతి సింహాద్రి వాణి గారు  21. శ్రీ డా.దీపక్ న్యాతి గారు  22. శ్రీ ఆర్.వి.వి.రాజా గారు  23.శ్రీమతి వాణీ సరోజినీ లక్కరాజు గారు...

వీడ్కోలు ఆషాఢమాసం పౌర్ణమి

అంశం: వీడ్కోలు  సందర్భం: ఆషాఢమాసం పౌర్ణమి  నిర్వహణ:  వీరా గుడిపల్లి లలితాకృష్ణ  ################## కవివరుల జాబితా  1.పిళ్ళా వెంకట రమణమూర్తి గారు  2. జి.సూర్యనారాయణ గారు  3.మండ నాగేశ్వరరావు గారు  4.డా‌.బల్లూరి ఉమాదేవి గారు  5. డా.కమలాదేవి గారు  6.గొర్రెపాటి శ్రీను గారు  7.వేమూరి సత్యవతి గారు  8.కూని అంకబాబు గారు  9.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  10.కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  11.తోట సులోచన గారు  12.వాణిసరోజిని లక్కరాజు గారు  13. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు  14.అపరాజిత రెడ్డి గారు 15.లలితాచండి గారు 16. నెల్లూరు వెంకటలక్ష్మి గారు  17.కమలశ్రీ గారు  18.రాధిక గారు 19.చంద్రమౌళి గారు  20.శ్రీకాంత్ గారు  21.సింగీతం సంతోష్ కుమార్ గారు  22.. దారల విజయ కుమారి గారు  23.ఎన్.నరేశ్ చారి గారు  24. పిన్నక నాగేశ్వరరావు గారు  25.సింహాద్రి వాణి గారు  26.ఏడెల్లి రాములు గారు  27.కొంజేటి రాధిక గారు  ++++++++++++++++++++++++++++++++ ఆషాడ మ...