Skip to main content

రంౙాన్ 2023

నిర్వహణ
శివునూరి లలితా కృష్ణ
వీరా గుడిపల్లి
**************
కవివరుల జాబితా
1. కోరాడ నరసింహారావు గారు 
2.వింజమూరి సూర్య లక్ష్మి గారు 
3.సింగీతం సంతోష్ కుమార్ గారు 
4.వీరా గుడిపల్లి
5.శివునూరి లలితా కృష్ణ 
6. ఆళ్ళ నాగేశ్వరరావు గారు
7.
***************

1
 * రంజాన్ మహిమ *
... కోరాడ నరసింహా రావు !
      ******************
 నియమాలతో కూడుకున్న దీక్షలనేకం... అన్నిమతములలోనూ !
 ఏ మతం చెప్పినా.... 
   మనిషి జీవనం సుఖానంద సంతోషాలతో గడవటానికేగా !మహమ్మదీయుల ప్రవక్త చెప్పిన మంచిలో..., ఖురాన్ ఉపవాసాలు, నియమాలు ప్రాశస్త్యమై ఈ నాటికీ భక్తి శ్రద్దలతో మహ్మదీయులచే ఆచరింపజేయుటే కదా దాని గొప్పతనం !
      సూర్యోదయమునుండి... సూర్యాస్తమయమువరకూ... మంచినీళ్ళైనా ముట్టక నెలరోజులు ఉపవాసదీక్షను కొనసాగించటం అంటే, మాటలుచెప్పేసినంత సులువు కాదుగా... ఆచరించటం... !అసత్య మాడకుండుట... 
  పరస్త్రీలను కామదృష్టితో... 
      చూడకుండుట.... !
 ఇతరులకెవరికైనా చేతనైన మంచినే చేయుట...., ఎన్నెన్ని మంచి మంచి విషయాలు పొందుపరచబడినాయి, !!ఏ మత గ్రంధం చెప్పినా ఈ మంచినే గాకచెడునే మతగ్రంధమైనా చెప్పిందా ?!హింసకు పాల్పడమని ఏ మతమైనా ఉపదేశించిందా !? 
   మతం చెప్పిన మంచిని ఆత్మశుద్ధితో ఆచరిస్తున్నవారెందరు, ఏ మతంలోనైనా.సరే .... !
  అలా అందరూ ఆచరించగలిగితే... ఈ కుమ్ములాటలు, మారణహోమాలూ జరిగేవా !
  హే అల్లాహ్... ముస్లిం మిత్రుల ఉపవాస దీక్షలు ఫలించి, వారందరికీ మంచి జరిగేట్టు అనుగ్రహించు !
ఆనందోత్సాహాలతో సోదరులు
రంజాన్ వేడుకలు కేవలము ధనికులకే గాక, పేదలకు ను....ఆనంద - సంతోషాలను 
ప్రసాదించు అల్లాహ్ !ఖుదాఫీస్... !
       ****************
2
[20/04, 8:25 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్‌ 4 ) 20/4/2023/ గురువారము
" రంజాన్‌ పండుగను పురస్కరించుకొని "
  " రంజాన్‌ పండుగ విశిష్టత "
                      (1)
సీ ! రంజాను పండుగ రమణీయమనగాను
ముక్తిదాయకమగు ముక్తినొసగు

నీతిమార్గమునందు నిలిపేటిపండుగ
ఆధ్యాత్మికతనంత నందజేయు

సద్గుణములన్ని చక్కగపెంచును
ప్రవచనములవిన్న పరవసించు

ఉపవాసదీక్షను నుల్లాసముగజేయు
నెలరోజులన్నియు నేర్పుతోడ

ఆ ! మతమునందు దెలుపు మంచితనముచూడ
మంచిభావములును మదినిచేరు
పేదధనికులన్న బేధములేకుండ
ధార్మికగుణములును దరికిచేరు !
                      (2)
సీ ! నింగినినెలవంక తొంగిచూచినచాలు
నుత్సాహమంతయు నురకలేయు

ఆత్మలోమలినాలు నావిరికాగాను
నెలదినములదీక్ష నెగిరిపోవు

పరమాత్మరూపము పదిలపరచగానె
మమతానురాగాలు మదినపొంగు

ఆకలిదప్పుల నన్నియు మరిపించు
ఆధ్యాత్మచింతన నలవడగను

ఆ ! చెడుతలపులనన్ని చెంతకుచేరక
మంచితలపులన్ని మదిని నిండు
పండుగదినమనుచు పదిమందిచేరగ
దివ్యమగుఖురాను దీసిచదువు !
    తరణికంటి సూర్యలక్ష్మి .
                   ****
3
[20/04, 8:26 pm] సింగీతం సంతోష్ కుమార్: కవితా గానం సీజన్ 4 
తేది:-20-04-2023
కవి పేరు:- సింగీతం సంతోష్ కుమార్
ఊరు:-కామారెడ్డి
చరవాణి :-8897152205

అంశం:- రంజాన్ సందేశం
శీర్షిక:- పవిత్ర మాసం
_______________________________

ముస్లిం సోదరులు అతి పెద్ద పండుగ
ముప్పైరోజుల పాటు కొనసాగిన ఉపవాస దీక్ష
పవిత్ర దివ్యఖురాన్ అవరించిన మాసం
క్రమశిక్షణ,దాతృత్వం,ధార్మిక చింతన కలయిక రంజాన్
అద్బుతమైన కలిగించే మాసం
చిన్న,పెద్ద,యువకుడు, వృద్దుడు అని లేకుండా
భగవంతునికే అంకితమై
నీరు తాగకుండా
పొద్దున,సాయంత్రంవేళలో మసీదులలో
నిరంతరం ఖురాన్ పఠిస్తూ 
పాలనను పాటిస్తూ
క్రమశిక్షణ ఐక్యమత్యం తో పేదవారికి,వస్త్రాలు,పండ్లు, పైసలు,ఆహార పదార్థాలు దానం చేస్తూ
ఆపదలో ఉన్న వారికి ఆదుకున్న ఎలా మానవాళికి ఇచ్చే గొప్పనైన సందేశం
సహాయానిక,సమైక్యతకు సామరస్యానికి,కరుణకు,
సర్వమానవ సమానత్వానికి
ప్రతీక
రంజాన్ పండుగ......

____________________________
హామి పత్రం:- ఈ కవిత నా స్వీయ రచన అని......
4
[20/04, 8:33 pm] Veera Gudipally: రంౙాన్
***********-
పవిత్ర మాసమంటే
ప్రతేటా 
పదిరోజులు ముందుకు జరుగుతూ
యాడాదంతా పవిత్రమని చాటి
అన్నీ మంచిరోజులని చెప్పిన
పండగది

పవిత్ర గ్రంథం
ప్రవక్త ద్వారా ప్రకటించిన కాలమది
మానవాళి
మనుగడనే శాసించిన శాసనం

నమ్మకానికి రూపమిస్తే
రంౙాన్
ప్రేమను ఆచరణలో చూడాలంటే
రంౙాన్
ఎడారి జీవితాలలో వసంతాలు
పంచాలన్నా
రంౙాన్
తీర ప్రాంతంలో
తిప్పలు తప్పించాలన్నా
రంౙాన్
అంతే...

ఆధ్యాత్మిక మార్గానికి.....
ఆఖరి ప్రయత్నం
 ఖురాన్..
మనం కోరుకున్న దివ్య వాణి..... 
మనకందిన మాసం
రంౙాన్...
.... వీరా గుడిపల్లి
5.
శీర్షిక :*ఆధ్యాత్మిక తరంగం*

నెలవంక కోసం
ఆకాశమంత ఎదురుచూపులు.....

నెల రోజుల రోజా..
సమస్త మానవాళికి..
 నేర్పే పాఠాలెన్నని చెప్పడం...

ఆకలి దప్పులకతీతుల్ని
చేసే...
ఆ దీక్షలన్నీ
నిగ్రహపు స్వీయసమీక్షలవడం కోసమనీ..

ఉన్నా లేకున్నా..
 చేసే 
దానం.....
నిత్యజీవన విధానమవాలనీ..

ప్రవక్త ప్రవచనాలను మది మదిలో పదిలపరచి 
మానవతను మేల్కొలిపే
సంప్రదాయమవాలనీ...

అందించే సందేశాలేమని చెప్పడం......

సానుకూల భావనా 
వనంలో విహరింపజేసే 
పవిత్ర మాసమనీ 

వరాల వసంతమనీ..

రంజాన్ అంటే..

ఋజుమార్గంలో
పయనించమనే 
కాంతి పుంజం 

విలువల దర్పణం 

స్వయంసమర్పణం 

అంతరంగాన సద్గుణాలను ధ్వనింపజేసే
ఆధ్యాత్మికతరంగం 

********శివునూరి లలితా కృష్ణ
6
కవితాగానం సీజన్ 4
తేది :20/04/2023
కవి పేరు : ఆళ్ల నాగేశ్వరరావు
ఊరు :తెనాలి
జిల్లా : గుంటూరు
చరవాణి :7416638823
అంశము : రంజాన్ విశిష్టత
శీర్షిక :
      "" సమతా మమతల వెలుగులు ""

మతాలసారం మానవత్వమని
మనిషికి ముఖ్యం సోదరతత్వమని
ప్రభోదించిన
సృష్టికర్త అల్లా విరచిత ఖురాన్ పవిత్ర గ్రంధాన్ని
పవిత్ర రంజాన్ మాసంలో
అనుదినము నిర్మల మనస్కులై పారాయణ గావిస్తూ
దైవ ప్రార్ధనతో నమాజు చేసుకుంటూ
కనీసం లాలాజలాన్ని కూడా మింగకుండా కఠిన ఉపవాస దీక్షను ఆచరిస్తూ
దీనజనులకు ఉడుతాభక్తితో సాయమందిస్తూ
కారుణ్యాన్ని మనోఫలకంపై ముద్రించుకుంటూ
సమాజ సేవలో రంజాన్ మాసపు దినాల్ని గడుపుతూ
ప్రకృతిలోని అణువణువునూ దైవ చింతనతో నింపుతూ
చెడులను తరిమెసేందుకు కళ్ళకు పరదాలను వేసుకుంటూ
కళ్ళకు కట్టిన అహంకారపు పొరలను తొలిగించుకుంటూ
హృదయమనే ప్రమిదలో
మానవత్వమనే తైలంపోసి
దాత్రుత్వమనే దివ్వెను వెలిగించి
జగతిని సమతా మమతల వెలుగులతో నింపే
రంజాన్ పర్వదినాన్ని ఈడ్ ముబారక్ అంటూ
హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ స్వాగతిద్దాం!

*************************
***************

Comments

Popular posts from this blog

సింధూరం 07052025

****************** సింధూరం దిద్దిన వారు  1.వీరా గుడిపల్లి 2.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, 3.గొర్రెపాటి శ్రీను  4.దోసపాటి వేంకట రామచంద్రరావు  5.అపరాజిత్ 6.వేమూరి సత్యవతి  7.జ్యోతి  8.మండ నాగేశ్వరరావు  9.గడ్డం కృష్ణారెడ్డి.రేపాల.సూర్యాపేట 10.కవిత వెంకటేశ్వర్లు  11.ఆర్ వి వి రాజా  12. శ్రీ కోరాడ నరసింహారావు గారు  13. శ్రీ ఉదయగిరి మధుమోహన్ గారు  14. శ్రీమతి బల్లూరి ఉమాదేవి గారు  15. శ్రీమతి తోట సులోచన గారు  16. శ్రీ జి సూర్యనారాయణ గారు  17. శ్రీ గజవెల్లి శ్రీనివాస చారి గారు  18. శ్రీ వనపర్తి గంగాధర్ గారు  19. శ్రీమతి వాణి సరోజిని లక్కరాజు గారు  20. శ్రీమతి సింహాద్రి వాణి గారు 21. శ్రీ ఆచార్య అయ్యల సోమయాజులు ప్రసాద్ గారు  22. 23.శ్రీమతి నెల్లూరు వేంకటలక్ష్మి గారు 24.శ్రీ ఏడెల్లి రాములు గారు  25. శ్రీమతి డాక్టర్ తంగిరాల నాగలక్ష్మి గారు  26. శ్రీ కూని అంకబాబు గారు  27. శ్రీ తిన్నాక నాగేశ్వరరావు గారు  28. శ్రీమతి లలితా చంటి గారు  29. శ్రీ పిల్ల వెంకటరమణ మూర్తి గారు  30. ...

season 6 వైశాఖ పూర్ణిమ

కవనజ్యోతి,కవితాగానం సీజన్ 6  వైశాఖ పౌర్ణమి నగదు పోటీలు   పోటీకి కవితలు పంపించిన కవి వరుల జాబితా  1. శ్రీ పిళ్ళావెంకటరమణ మూర్తి గారు  2. శ్రీ సంగీతం సంతోష్ కుమార్ గారు ji 3. శ్రీ జి సూర్యనారాయణ గారు  4.శ్రీ మండ నాగేశ్వరరావు గారు 5.శ్రీమతి కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  6.శ్రీమతి నెల్లూరు వెంకటలక్ష్మి గారు 7.శ్రీ అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 8..శ్రీ కోరాడ నరసింహ రావు గారు  9.శ్రీమతి డాక్టర్ భమిడిమర్రి కమలాదేవి గారు 10.శ్రీ కాసుల ధీరజ్ శర్మ గారు  11.శ్రీ కూని అంకబాబు గారు 12.శ్రీ మతి డా.వేమూరి సత్యవతి గారు  13.శ్రీమతి డా.బల్లూరి ఉమాదేవి గారు 14.శ్రీ.దోసపాటి వేంకట రామచంద్రరావు గారు 15.శ్రీ అపరాజిత రెడ్డి గారు  16. శ్రీ ఏడెల్లి రాములు గారు  17.శ్రీ డాక్టర్ ఆళ్ళ నాగేశ్వరరావు గారు  18. శ్రీ కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  19. శ్రీ మద్ది పుల్లారావు గారు  20.శ్రీమతి సింహాద్రి వాణి గారు  21. శ్రీ డా.దీపక్ న్యాతి గారు  22. శ్రీ ఆర్.వి.వి.రాజా గారు  23.శ్రీమతి వాణీ సరోజినీ లక్కరాజు గారు...

వీడ్కోలు ఆషాఢమాసం పౌర్ణమి

అంశం: వీడ్కోలు  సందర్భం: ఆషాఢమాసం పౌర్ణమి  నిర్వహణ:  వీరా గుడిపల్లి లలితాకృష్ణ  ################## కవివరుల జాబితా  1.పిళ్ళా వెంకట రమణమూర్తి గారు  2. జి.సూర్యనారాయణ గారు  3.మండ నాగేశ్వరరావు గారు  4.డా‌.బల్లూరి ఉమాదేవి గారు  5. డా.కమలాదేవి గారు  6.గొర్రెపాటి శ్రీను గారు  7.వేమూరి సత్యవతి గారు  8.కూని అంకబాబు గారు  9.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  10.కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  11.తోట సులోచన గారు  12.వాణిసరోజిని లక్కరాజు గారు  13. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు  14.అపరాజిత రెడ్డి గారు 15.లలితాచండి గారు 16. నెల్లూరు వెంకటలక్ష్మి గారు  17.కమలశ్రీ గారు  18.రాధిక గారు 19.చంద్రమౌళి గారు  20.శ్రీకాంత్ గారు  21.సింగీతం సంతోష్ కుమార్ గారు  22.. దారల విజయ కుమారి గారు  23.ఎన్.నరేశ్ చారి గారు  24. పిన్నక నాగేశ్వరరావు గారు  25.సింహాద్రి వాణి గారు  26.ఏడెల్లి రాములు గారు  27.కొంజేటి రాధిక గారు  ++++++++++++++++++++++++++++++++ ఆషాడ మ...