Skip to main content

వైశాఖ పూర్ణిమ శోభకృత్ 2023

నిర్వహణ
వీరా గుడిపల్లి
శివునూరి లలితా కృష్ణ
***************
అంశం: మందాకిని
*******************
కవివరుల జాబితా

1. శ్రీమతి ధనాశి ఉషారాణి గారు 

2.శ్రీ ఆకుల మల్లికార్జున్ గారు 

3.శ్రీ కోరాడ నరసింహారావు గారు 

4. శ్రీ మద్ది పుల్లారావు గారు 

5. శ్రీమతి డా.బల్లూరి ఉమాదేవి గారు 

6. శ్రీ గొర్రెపాటి శ్రీను గారు 

7.శ్రీమతి గంటి మీనా కుమారి గారు 

8. శ్రీ కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 

9. శ్రీమతి సింహాద్రి వాణి గారు

10.శ్రీ కవిత వెంకటేశ్వర్లు గారు

11.శ్రీమతి చయనం అరుణాశర్మ గారు

12.శ్రీమతి లలితా చండి గారు

13.శ్రీ వేదాంతం సురేష్ బాబు గారు 

14.శ్రీ గజవెళ్ళి శ్రీ నివాసాచారి గారు

15.శ్రీమతి వేమూరి సత్యవతి గారు 

16. శ్రీ బాసరాజు యాదగిరి గారు 

17. శ్రీ. సింగీతం సంతోష్ కుమార్ గారు 

18.శ్రీ ఏడెల్లి రాములు గారు

19. శ్రీ పిన్నక నాగేశ్వరరావు గారు 

20.శ్రీమతి దారల విజయ కుమారి గారు 
*********************
1
ధనాశి ఉషారాణి గారు

శీర్షిక. మందాకిని

పన్నెoడు సంవత్సరాలకొచ్చేటి ముచ్చట్టయిన పండుగ
దేవకాంతవై భూమిమీదకొచ్చిన ఓ మహారూపమా
సుందర జలాలకు సొగసులు అద్దినావు తల్లీ
తీర్థమాత్రలకు ఓ గంగమ్మా నీవు మూలస్తoభము

వనమూలికలను నిత్యము కరిగించుకుంటూ నిలిచి
లేగదూడ గంతులతో వయ్యారాలను ఓలికించే ఓ గంగమ్మా
పుట్టిన పసిగుడ్డుకు జీవధారవు ఓ గంగమ్మా
మనిషి అస్థికలు కలుపుకోని స్వర్గము నిచ్చేవు తల్లీ

పరమశివున్ని పరవసింపచేశినావు ఓ గంగమ్మా
నవ్వినా ఏడ్చినా గంగమ్మ తల్లీ నిత్యము తోడువై నిలిచేవు
పురాణ ఘట్టాల్లో నిలిచిన నిత్య దేవతా రూపమా
అందుకోమా నిత్యం శతకోటి నీరాజనాలను

సంఘమ ముక్తి క్షేత్రాలను ముద్దుగా దాటి ప్రవహించేవు
సీతమ్మ తల్లి నీ సేవలో తరించి నిలిచింది
వీర యోధులు నీకు ప్రణమెల్లినారు
వీరచరిత నీది అందుకో మా వందనాలు ఓ గంగమ్మా
*
ఆకుల మల్లికార్జున్ 
జిల్లా 
*
రంగారెడ్డి 
ఫోన్ నెంబర్ 
*
7207256204
కవిత
*
సురగంగ జీవుల గంగ రసగంగ
ఉత్తుంగ తరంగ నర్తన విన్యాస
హిమగిరుల శిఖరాలు దాటొచ్చి
పావనాంతరంగ పవిత్ర జలంగ
భారతీయ జీవన గాత్రమైతివి
పాడి పంటల పల్లెవాసుల కు
భుక్తిసాగ బలమైనాధారమైతివి
పాపాలు ప్రక్షాళన చేయు దేవేరివి
దేశమే శివలింగ స్వరూపమవ్వగ
అభిషేకమొనరింప కదిలే గంగా
శివ జటాజూటుగ్ర మహోత్తంగ
సత్యసనాతనోదయ సత్వసార
నాగరికతల దాచుకున్న పేటిక
పుణ్యక్షేత్రాలతీర్థాల ధన్యవాటిక
ధాన్యాల గాదెల సిరుల కోటల
జీవనాడిల నిరతంబు సాకు తల్లి
నా దేశీయుల పోషించు కల్పవల్లి
సంస్కృతీసంప్రదాయాల సమ్మేళ 
నాధ్యాత్మికోదయ వికసిత మందాకినీ
3
వైశాఖ పౌర్ణమి కవితలపోటీకి !
అంశం :- * మందాకిని *
శీర్షిక :- @ పావన గంగ..... 
       .. సలిలతరంగా... !
      కోరాడ నరసింహా రావు 
          ***************
పావన గంగా, సలిలతరంగా 
 సకలపాప హరిణీ... మోక్ష ప్రదాయినీ....నమామ్యహం !
     స్వర్గలోక మందాకినియే తొలుత భగీరధుడు పితృ, పితామహు లైన సగర సంతతి పాప పరిహారార్ధము,దివిజగంగ ను భువికి దింపగ ఘో ర తపమును ఆచరించెను ...! తనను భరించగలవాడు పరమశివుడు ఒక్కడే యని, శివునిశిరమును తాకినంతనె తాను శుభకరి యయ్యెను !! హిమవంతునకేపుత్రిక తానై...  
 ప్రవహించిన ప్రాంతమంతా... 
దాహార్తిని, క్షుద్బాధలుదీర్చుచు 
 పుణ్య క్షేత్రములును, నవ నాగరికతల విలసిల్లె . !
 
   అన్నింటిలో అతి పవిత్ర క్షేత్రము కాశి కాగా....అత్యంత పుణ్యతీర్ధము కాశీక్షేత్ర గంగయే ఐనది... !! 
గంగయే పవిత్రము..., పండ్రెండేండ్ల కొకపరి పుష్కరుడీ నదిని చేర 
పుష్కర సమయమున గంగ పరమ పవిత్రం... !
సకల పాపములు హరించి... 
పుణ్యము ప్రాప్తిoపజేయు
మహిమాన్విత ఈ మందాకిని!
    పుష్కర సమయమున... 
 స్నానమే కాదు.... పిండ ప్రధానములు, జప, తపములు దానములూ అన్నియూ అత్యంత ఫల ప్రదాయినులే !!
     ఇది హైందవ ఔన్నత్యం..., 
మానవ జీవనమునకే ఆదర్శం 
      *******************
*
మద్ది.పుల్లారావు
జిల్లా 
*
NTR
ఫోన్ నెంబర్ 
*
9951287113
కవిత
*
తేటగీతి పద్యాలు
...

1)
తే.గీ

విష్ణు పాదాల నుండియే వెలసె గంగ
శంకరుడు జటాజూటాన స్థానమిచ్చె
పుణ్యుడు భగీరథుని తపంబునకు మెచ్చి
ఈశ్వరుడు పంపె భువి పైకి యిష్టుడగుచు

2)
తే.గీ

గిరులు దాటుచు యెన్నియో తరులు దాటె
పృధ్వి జేరి భగీరధు వెతలు దీర్చె
జాహ్నవిగ దాను పేరొందె జగతి మురియ
జీవనదిగ మందాకిని సేదదీర్చు

3)
తే.గీ

వారణాసి లో విశ్వేశు పంచనుండె
అమరనాధుని కేదారునాత్మ దాను
భారతీయులకు సిరుల పంట దాను
పద్మ పేరున బంగ్లాన పరిమళించె

4)

తే.గీ
హిమగిరుల జనియించెను హితము గూర్చ
మోక్ష దాయినిగా నిల్చె ముక్తి నీయ
జనుల పాపాలు హరియించు స్పర్శతోనె
జగతినుద్దరించు మహిమలు గల తల్లి

5)
తే.గీ
పుష్కర సమయమందున బుడమిలోన
శోభతో విలసిల్లును సొగసుగాను 
సర్వ శుభములు గలుగును స్నానమాడ
గైకొనుము తల్లి పూజలు ఘనముగ
5
*
డా బల్లూరి ఉమాదేవి 
జిల్లా 
*
ఆదోని/కర్నూలు జిల్లా 
ఫోన్ నెంబర్ 
*
9493846984
కవిత
*
మందాకిని 
జలమే జగతికి ప్రాణాధారం
  పంచభూతాలలో ప్రముఖస్థానం 
శివుని అష్ట మూర్తులలో ఆవాసం
 పవిత్ర భారతదేశంలో నురగలతో
ప్రవహించే పావనమైన నది మందాకిని
శివునివాసమైన కేదారనాథ్ లో
ఉరికురికి ఉబుకుబికివచ్చే 
నదీమ తల్లి మందాకిని
అందానికి మారుపేరుగా 
మతపరమైన ప్రతీకగా ప్రవహించే 
అపురూపమైన నంది మందాకినీ
ఆకాశ గంగగా ఖ్యాతి నందినది
 భగీరథుని ప్రయత్నించేత
దివి నుండి భువికేతెంచిన నదీమతల్లి
మందాకిని స్నానం సకల పాప హరం
  నర నారాయణల పుణ్యక్షేత్రమైన 
   బదిరిలో గలగల పారే అలకనందలో    
   కలిసే అత్యద్భుత జల ప్రవాహం
*
గొర్రెపాటి శ్రీను
జిల్లా 
*
 మేడ్చల్ మల్కాజ్ గిరి
ఫోన్ నెంబర్ 
*
9652832290
కవిత
*
కవితాగానం సీజన్ 4 

వైశాఖ పౌర్ణమి శోభకృత్ కవితల పోటీకి ప్రత్యేకంగా వ్రాసిన కవిత .

 

"పుణ్యనదికి ప్రణమిల్లుదాం !" 

 

భారతావని పవిత్ర భూమి

వేదాలకు,ఉపనిషత్తులకి పుట్టినిల్లు

ఎందరో మహనీయులకి జన్మనిచ్చిన పుణ్యస్థలి

భారతదేశానికి ఉత్తరాన వున్న హిమాలయాలు

సాక్షాత్తు శ్రీ మహాశివుడు కొలువై వున్న కారుణ్యప్రదేశం

పరమ పవిత్రమైన గంగానదికి ఉపనదిగా పిలవబడుతున్న

మందాకినీ నది జనించిన చోటు

కేదారనాథ్ మందిర సమీపాన వున్న చోరాబరి !

అద్భుతమైన ప్రకృతి అందాల నడుమ

పచ్చని చెట్ల సమీపాన

లోయల్లో ఒంపులు తిరుగుతూ

పారే సుందరనది మందాకినీ !

పూర్వకాలం లో ఈ నది సమీపాన రుషులు తపస్సు చేసి

ముక్తిని మోక్షాన్ని పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి !

మందాకినీ నది అలకనంద నదిలో సంగమమయ్యే చోట

వెలసిన సుప్రసిద్ద శైవ క్షేత్రం రుద్రప్రయాగ !

మాహాశివుడు లయకారుడు !

మహాశివుడు బోళాశంకరుడు !

మహాశివుడే జగద్రక్షకుడై విశ్వాన్ని సంరక్షిస్తున్న చోట పుట్టిన నది మందాకిని !

గంగానదికి ఉపనదిగా విరాజుల్లుతూ

సదాలోకానికి పవిత్రతను ప్రసాదించే మందాకినీ నదీమతల్లికి నమస్కరిద్దాం ..!

మహేశ్వరుడి మమతానురాగాలు అందుకుంటూ ఆనందంగా జీవిద్దాం!

"ఓం నమఃశ్శివాయ"

 

 

                     - రచన గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)
7
గంటి .మీనాకుమారి 
జిల్లా 
*
శ్రీకాకుళం 
ఫోన్ నెంబర్ 
*
9494205334
కవిత
*
కవితాగానం సీజన్ _4
 వైశాఖ పౌర్ణమి కవితల పోటీ కొరకు 
_____________________________________
అంశం :మందాకినీ 
శీర్షిక: "దివ్య గంగ "
______________________________________
    పశుపతి రాగమాలపించ  
పరవశుడై ద్రవీభవించే నారాయణుండు  
బ్రహ్మ కమండలువు పట్టి 
విష్ణుపాదములు కడుగంగా 
ప్రవహించునదే ఈదివ్యగంగ
ఆకాశగంగగా యలరారుచుండి  
విష్ణుపాదము నుండిజాలువారి విష్ణుపది యాయె
తాతలకు సద్గతులు కలుగజేయ  
దివిజ గంగన భువికి తేవ  
తపముజేసే భగీరదుండు  
వచ్చెద నను భరించువారెవ్వరని గంగ యడుగ
భవుని మెప్పించి వరమందె భగీరదుండు
తన జటా ఝూటమున బంధించి  
నొక్కధారగా నొదిలే శివుడు
ఉరకలు వేయుచు నడచి
ముంచె జహ్నుమున్యాశ్రమము 
ఆగ్రహించి ఔపాసనపట్టె ముని
వేడుకొనగ వదలుటచే జాహ్నవాయే  
స్వర్గమందు మందాకినిగ
భూలోకమ్మున గంగగా ,అలకానందగా  
పాతాళమునందు భోగవతిగా  
ముల్లోకమ్ముల ప్రవహించుగాన త్రిపథగా
పేరునొందె ఈమందాకినీ పరమ పావనీ
_
8
అంశం ::మందాకిని
శీర్షిక.... జలము 
కవితలు పంపించవలసిన చివరి తేదీ 26/04/2023

స్వీయ రచన::కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
పాతర్లపాడు, ఖమ్మం.
*************************************************************

జలం లేనిదే జననం లేదు, 
జీవము లేనిదే జగత్తు లేదు
జవము లేనిదే జీవిక లేదు, 
జరామరణముల ఊసే లేదు!!

అందుకే పంచభూతాల ప్రమాణం
అవని పుట్టుకకు అవే ఆధారం
దాని సంరక్షణ కొరకై జరుగుతున్న ప్రయత్నంలో 
పురాణేతిహాసాల ప్రముఖ పాత్ర !! 

భగీరథుని ఘోర తపస్సుకు మెచ్చిన మిన్గంగ ...
దివి నుండి శివుని తలపై దునికి జటాజూటంలో
చిక్కుకుని ఉరవడి తగ్గించుకొని యుగాల తరబడి పేరుకు పోయిన పాపాలను నశింప చేస్తు 
కాననమంతా తడుపుతు మందహాసముతో మందాకిని
కాష్ఠాలను తుడుపుతు పావన మొనర్చిన పావని !!

మానవులంతా మనుగడ కోసం 
చేసిన పాపాలెన్నో కడుగుట కొరకు
స్నానాలతో నదీనదాలలొ మునకలు వేసి 
మలినము చేసిన నీటిని చూసి

జీవుల పాపాలు తుడిచి తాను అపవిత్రమై తల్లడిల్లుతున్న మందాకినిని పవిత్రమొనరించి 
జలజల సురుచిర సుస్వర గానంతో 
మనోహరంగా విరాజిల్లు విన్గంగగా నిలపాలని !!

పుష్కరుడెంతో వేదనతోటి ఖేదముతో
తపస్సు చేసి బ్రహ్మనువేడి వరమును పొంది
పుష్కరతీర్థుడై సురలోకమునున్న సురగంగ
మందాకిని నది యందు అంతర్భూతుడై!!

జలము గళమున పేరిన గరళము గీకి
చలనం పెంచి పరవళ్ళు తొక్కించి 
జనహితముకై వెల‌సిన పుష్కరాలలో పుష్కరుడు, 
అదే మందాకిని నదిని మానవ కళ్యాణ వేదికగా
మార్చిన దేవగురుడు !!

స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.

9
పౌర్ణమి కవితల పోటీకి
కవనజ్యోతి ఆధ్వర్యంలో,
కవితాగానం‌ సీజన్ 4, నిర్వహించు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, వైశాఖ మాసం పౌర్ణమి కవితల పోటీకోసం
అంశం:-- మందాకిని
రచన:-- సింహాద్రి వాణి
శీర్షిక:-- గంగానది పుష్కరాలు
ప్రక్రియ:-- వచన కవిత్వం
ఊరు:-- విజయవాడ 
చరవాణి:--7569820872  

 భారతదేశంలో పన్నెండు నదులకు పుష్కర మహోత్సవాలు నిర్వహిస్తారు
ప్రతినదికి పన్నెండేళ్ళ కొకసారి పుష్కరం వస్తుంది
పుష్కర కాలంపన్నెండురోజులు
పుష్కర స్నానం హిందువులకు అతి పవిత్రం
పుష్కర సమయంలో తమ వంశంలోని పూర్వీకులకు, తమ తాత ముత్తాతలకు పిండప్రదానం చేసి,
కర్మకాండలు నిర్వహించే వేదపండితులైన పురోహితులకు దానధర్మాలను కానుకలుగా సమర్పించుకుని పితృదేవతలను స్మరించుకుంటారు
పుష్కరస్నాన మాచరించే
టప్పుడు తెలిసీ తెలియక చేసిన పాపాల నుండి ఉపశమనం పొందుతున్నామనే భావన మనసుకు ప్రశాంతత కల్గిస్తుంది
ఆస్నానం, ఆనీటి స్పర్శ తరతరాల తమవారిని తాకుతున్నామనే అనుభూతిని
వారి ఒడిలో సేదతీరుతున్న హాయిని, ఆనందాన్ని కల్గిస్తుంది
ఈ సంవత్సరం గంగానదికి పుష్కరాలు
గంగమ్మ స్వర్గంలో, వైకుంఠంలో ప్రవహించేటప్పుడు మందాకిని, విరజానది
భూలోకంలో గంగానది అలకనంద
పాతాళంలో ప్రవేశించిన పిదప భోగవతి
గంగమ్మ పుష్కర దినాలలో స్నానమాచరించిన వారి పాపాలను పోగొడుతుంది
మంగళకరమైన శుభాలనిస్తుంది
శరీర రోగాలను తొలగించి ఆరోగ్యమిస్తుంది.
   
వీలైనవారు గంగాపుష్కర స్నానాల నాచరించండి.
10
కవితా గానం 
26.4.23...బుధవారం
అంశం:: పుష్కర గంగ
శీర్షిక:: మందాకిని

బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కిన పాదం
ఆ పాదాన్ని బ్రహ్మ జలంతో కడిగిన పాదం
అది సుర గంగగా మారిందని వామన పురాణము
కొన్ని వందల పర్వతాలను 
చీల్చుకొని భువికి చేరుటచే
"గంగ" అని నామము
విష్ణు పాదం నుండి ఉద్బవించినది గనుక "విష్ణు పది"గా ఆఖ్యము
గంగ స్వర్గ లోకము నుండి
భూలోకానికి అక్కడి నుంచి
పాతాళ లోకానికి చేరడము
వల్ల"త్రిపథ"గా వ్యవహరము
వైకుంఠములో పుట్టి బ్రహ్మలోకానికి అక్కడి నుండి
దేవలోకానికి అక్కడ"మందాకిని"గా పేరు
పన్నెండు వత్సరాల కొకసారి
వస్తాయి పుష్కరాలు
చేస్తారు పుణ్యస్నానాలు
గంగలో కలిసిపోతాయి పాపాలు
చేరుతాయి చేసుకున్న పుణ్యాలు
చేయాలి దాన ధర్మాలు
పెద్దలకు శ్రాద్ధకర్మలు
కోరాలి మంచి మానవత్వాలు
పెంచాలి ప్రేమ ఆప్యాయతలు
పంచాలి కరుణ ఆత్మీయతలు
అందించాలి అభిమానాలు
పోగొట్టాలి అనుమానాలు
అసమానతలు
అందరూ కలిసి మెలసి జీవించాలి
అవే పుష్కరాలకు ప్రమాణాలు!!

ఈ కవిత నా స్వీయ రచన అని
హామీ
                  కవిత వెంకటేశ్వర్లు
                  కర్నూలు
                  8309920625
11.
*వైశాఖమాసం పౌర్ణమి కవితల పోటీకి*
*అంశము-మందాకిని*

శీర్షిక-మందాకిని-జీవనవాహిని

పాప నాశము చేయగ పావనగంగ
పద్మనాభుని పాద పద్మముల ప్రభవించి
భగీరధుని మనోరధమును తీర్చగ
సగరులకు పుణ్యగతులు సంప్రాప్తించగ
హరుని జటాజూటము వీడి
భాగీరధిగా అవతరించిన గంగ
సగరులకు పుణ్యగతులు సంప్రాప్తించగ
అవనికేతెంచెను ఆకాశ గంగ
కరుణాంతరంగ ఉత్తుంగ తరంగ
హిమవత్పర్వత సానువులలో
జనియించిన జీవధార మందాకిని
అలకనంద భాగీరధి మందాకినిల
సంగమమై గంగగా రూపొందె పుణ్యఝరి
 పవిత్ర భారతావనిలో పరమ పావనిగా
గంగామాతయై పరిఢవిల్లె గంగ
అడుగిడిన ప్రాంతములను
 సస్య శ్యామలము చేయుచు
జీవధారయై జీవన వాహినియై
స్నానము చేసినంత పాపాలు హరించి
పుణ్యమునిచ్చును పావనగంగ

ఈ కవిత స్వీయ రచన,దేనికీ అనువాదం కాదు,ఏ సమూహములో పంపలేదని హామీ ఇస్తున్నాను

*చయనం అరుణాశర్మ*
 26-04-2023
12
.అంశము....*మందాకిని*

శీర్షిక ----- మౌన ప్రయాణం  

మందాకిని,
కేదారానా పుట్టిన జల సోయగాల మనోహరి
చిరు జల్లులాటల మందాకినీఝరి
అలకనందాకు ఉపనదీమతల్లీ    
ఇలకు తరలివచ్చిన భగీరధికి చెల్లి
కొండల్లో కోనల్లో లోయల్లో పచ్చికబయిల్లో
వూరూరా సాగే ఎన్నెన్ని పేర్లతో 
పరవశానా ప్రవాహించే అమృతధార
ఉరుముల మెరుపుల నడుమ
ఉప్పొంగే తరంగాల ఒయ్యారి
మూడు కాలాల మురిపాలకై
ఆరువర్ణాల ఋతువుల కోకలను చుట్టుకొని రేయింబగళ్లు హరితాన్నీ హత్తుకొని అలరించే ప్రకృతిలో మమేకమై కనిపించని తోడై అంతటా ప్రవహిస్తూ ప్రక్షాళనం చేస్తున్నా....
పాప పరిహారం అంటూ, పుష్కరాలంటూ,
పడిపడి మునకలు వేస్తూ  
జీవ నదులను సైతం కలుషితం చేసే 
మూఢులకు ఏమితెలుసు? 
 గంగ అంతరంగ మధనం 
జన జీవన క్రాంతిలో ఓ భాగమై
సంస్కతికి మూలమై, సంప్రదాయలకు నెలవై 
జీవ చైతన్యానికి నాదమై సాగే మౌన ప్రయాణం ,ప్రణయ జల రాగం ,
ఎవరికి తెలుసు?

 లలితా చండీ 
న్యాయవాది హైదరాబాదు 9885552922 
26-4-2023

కవితా గానం సీజన్ 4
""'''''"""""""""""""""""""""""""'"'''''"""
అంశం:- మందాకిని
"""'''''"""""""""""""""""""""""""""""""
పితరులకును పుణ్య గతులు
ప్రాప్తించగ చేయుటకై
తపము జేసి భగీరథుడు
సుర గంగను రప్పించగ
కఠిన తపమునకు మెచ్చి
కరుణించెను గగనఝరి
నా ఉరుకులు పరుగులకు
తట్టుకొనే వారెవ్వరు
ఉత్తుంగ తరంగిణులను
పట్టుకొనే వారెవ్వరు
గర్వము నిలువెల్ల నిండి
పొగరుగ తల నెగరేసెను
పటుతరమౌ దీక్ష తోడ
అటలమ్ముగ తపసు జేసి
నిటలాక్షుని మెప్పించి
సురగంగను భరియించగ
ప్రార్థించెను ప్రాంజలితో
ఫెళ ఫెళ ఆర్భాటముతో
తరలెను సుర శైవలిని
తడబడకను శిపివిష్టుడు
జడలందున బంధించెను
భగీరథుని ప్రయత్నమున
మున్నేరు భువి జేరెను
భస్మ రాసులన్ని ముంచి
పాపము ప్రక్షాళించెను
మందాకిని , భాగీరథి
పద్మా , జాహ్నవి పేరుల
ఖ్యాతి గాంచె గంగమ్మ
భరత జాతి పుణ్యముగా
****************************
🖋️ వేదాంతం సురేశ్ బాబు
       చెన్నూరు
14 
గజవెళ్ళి శ్రీనివాసాచారి 
*
కాజీపేట హన్మకొండ జిల్లా 
ఫోన్ నెంబర్ 
*
9059438068
కవిత
*
వైశాఖ మాసం 
పౌర్ణమి కవితల పోటీకి 
...
అంశం: మందాకిని 
శీర్షిక: పుష్కర వైభవం 
...
హిందూ సనాతన ధర్మంలో 
నదులను, వృక్షాలను 
దేవతామూర్తులుగా కొలిచే సంప్రదాయం 

అద్భుతమైన మంచుకొండల్లో 
ఉద్భవించిన మందాకిని 
కేదారీశ్వరున్ని సందర్శించి 
పచ్చని పర్వతాల నుంచి జాలువారుతూ 
లయభరిత సంగీతం వినిపిస్తూ 
పాలధారగా ప్రవహిస్తూ 
లోయలో ప్రతి రాయిని పలకరిస్తూ
ప్రతి మలుపులో సౌందర్యభరితమే

ప్రవాహంలా సాగిపోతూ 
అలకానందలో లీనమై 
అస్తిత్వం కోల్పోయినా
బాధపడని స్థితప్రజ్ఞత

ఏ నదిలో మునిగితే 
పాపాలు తొలగిపోతాయో 
ఆ పవిత్ర నది గంగ;
ఆ నదికి పుష్కర వైభవం జరుగుతున్నది 

నదులను పూజించడమే కాదు
నదులను రక్షించడం
కాలుష్యరహితంగా తీర్చిదిద్దడం 
మనందరి కర్తవ్యం
15
వేమూరి.సత్యవతి

శీర్షిక..సలిల చందన చర్చ!

నీ పుట్టుకేమొ వెన్నుని పాదాలు!!
ప్రవహించేది దేవతలు నగరం లో..
అధివసించింది శంభుని శిరంబు!!
పుణ్యానికి,పవిత్రతకు ప్రతీకగా..
త్రిపథగా జీవనది గా జీవితాలనిచ్ఛే వాహినివి!
ఎందరో ఋషులు,యోగులు చే ఆరాధింప బడుతూ..
అష్ట వసువులకి అమ్మగా నీ అంగీకారమే దేవకార్యం!
పితరుల ముక్తి కై భగీరథుని తపస్సుకి కరిగిన ధారవి!!
జగన్నాధ పండిత రాయలు కవితా ధారలకి
పద్యానికో మెట్టు పొంగుతూ,ఉప్పొంగుతూ
కవి దంపతులకి మోక్ష మిచ్చి న ముక్తి ధారవి!!
సీతమ్మతల్లి చే మొక్కబడిన మహిమాన్వితవు!
ఎన్నో ఉపనదులు కలుపుకున్న మహానందవు!
యమునా, సరస్వతీ నదుల కలిసిన త్రివేణివి!
బదరీనాధు ని మొక్కుతూ, కేదారనాధుని చుట్టేస్తూ..
ప్రకృతిసౌందర్యానికి పెద్ధపీటవౌతావు!
హరిద్వార్ లో నీ వేగమంతా హరి పాదాల కోసమేనా?
హృషీకేశ్ లో భక్తి ప్రపత్తుల శాంతసుందరి వి!
వారణ,అసి ల కలిసి కాశీనగరపు కాంతి వాహినివి!
విశ్వనాథుని కమనీయ జటాకలాపానివి !
నీ నీటిలోని మహిమలు శాస్త్రపరిశోధకులు పసిగట్టలేనివి!
భగీరథుని మనో రథం తీర్చిన భాగీరథివి!
జహ్ను ముని చెవిజారిన జాహ్నవివి!
భారతీయులకు నీవో బహుమతి వి!!
కాలుష్యం కాకుండా కాపాడటమే 
మందాకిని కి మనమిచ్చే చందన చర్చ!!!
16
బాసరాజు యాదగిరి 
*
అంశం : మందాకిని

మంద గమన పరవళ్ల మందాకిని
మదిలో దాగిన ప్రేమని మేల్కొల్పావు
నిను వీడి అపుడే పుష్కర కాలమైనది
నీ జాడలే ఇంకా నను వీడి పోలేదు

వసంత కాల ఆగమనంతో
హృదిలో అలజడి రేపావు
అకాల వర్షంలా నను
నీ ప్రేమతో తడిపావు

నీ చిరునవ్వే ఇంకా నా కళ్ళలో
మెరుపులా మెరుస్తున్నది
నీ కౌగిలింత కై నా హృదయం
తహ తహ లాడుతున్నది

నీ వొస్తావానే ఆశతో నేనింకా
జీవిస్తున్నా నంటే నమ్మవేమో
నీ జ్ఞాపకాల నీడలలో నను
గుర్తిస్తావు యే నాటికైనా
17.
సింగీతం సంతోష్ కుమార్
శీర్షిక:- గంగ భవణి 
_

శివుని శిరస్ పై చిందులడిన 
గంగ
శ్రీ విష్ణు పాదన వెలిసిన గంగా
దైవ స్వరూపం గంగానది
స్వర్గంలో మందాకినిగా
భూలోకంలో గంగగా
పాతాళంలో భోగవతిగా మూడు లోకాల్లో ప్రహించినందున త్రిపథన
ఇంద్రలోకంలో మందాకినీ 
పాతాళలోకంలో భోగవతి భూలోకంలో అలకనంద భారతీయ సంస్కృతీ సంప్రదాయాల జలనిధి
నదిలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలనుండి విముక్తి 
కల్గించు నది 
జీవకోటికి ప్రాణాధారం
గంగా జలం మింగితే స్వర్గప్రాప్తి
కల్గించే మందాకిని
 ప్రపంచంలోనే అతిపెద్ద జనసమూహం కూడుకొనే ఉత్సవం
వారాణాసి హిందువులకు పరమ పవిత్ర స్థానం గల నది
స్వర్గంలో మందాకినిగా 
భూలోకంలో గంగగా
పాతాళంలో భోగవతిగా మూడు లోకాల్లో ప్రహించినందున త్రిపథన...

18.
ఏడెల్లి రాములు 

కవితా గానం
పౌర్ణమి కవితల పోటీల కోసం
మందాకినీ...

హిమానీనదమున నీ పాదముద్రలట
అలకనంద నదిలో నీ ప్రవేశమట
వీణియవై సలిలిత లలిత జలతరంగిణీ మందాకినీ
వెన్నెల పైటేసీ అలల మేనియలపై
జల జల జాలువారే జలపాతమా
లోయలలో నీ హొయల ఒంపులు
మానవ కంటితో నీ అపూర్వ అందాలు చూడతరమా
మందాకినీ జల జల అలల ప్రవాహినీ

గంగమ్మ తల్లికి మల్లెపూదండవట
గౌరీ కుండ్ కు సిరిమల్లె పువ్వువట
దేవభూమికే దేవికవై 
కేదారనాథునికి జలాభిషేకమై
బిర బిర బిర బిర పరుగున వచ్చేటి
మందాకినీ హిమానీనద ప్రియవాహినీ జలతరంగిణీ

చిత్ర కూట్ న పాయసుని నీ మధురనామం 
మధురం మధురం సుమధురం
చోరాబరి నీ ఆగమనము
అలకనందలో నీ ప్రవేశము
గంగానదుల సంగమాలకే
స్వర్గధామం నీ పుణ్యనామం
మందాకిని జయ జల ప్రవాహినీ
నీ ప్రియ నామం తలచిన చాలు
పంచప్రయాగలు మదిలోన నిలుచును
మోక్షదాయినీ వీణాపాణీ మందాకినీ
జయ మందాకినీ జయ జయ ప్రియ
జలప్రవాహినీ
నమో నమో నమో నమః

నదివై జలనిధివై పుణ్యతీర్థమై
బిర బిర పరుగిడ 
నీ మందగమన నడకల చూసే
భాగ్యమొసంగుమమ్మా 
మందాకినీ జలప్రభ ప్రవాహినీ 
19.
కవితా గానం(సీజన్4). 26--4--2023.
పిన్నక నాగేశ్వరరావు.
అంశము :-- మందాకిని.
శీర్షిక :-- గంగా పుష్కరాలు.

ప్రాణికోటి మనుగడకు ఆధారం జలం
ఆ జలంతో ముడిపడినవే మన సంప్ర
                                              దాయాలు 
జలస్నాన ప్రాముఖ్యతను తెలిపేవి 
                                            పుష్కరాలు
అలకనందకు ఉపనది మందాకిని
మందాకినికి మరో పేరే గంగానది
బృహస్పతి మేషరాశిలో ప్రవేశం
గంగా పుష్కరాలు ప్రారంభం
పుష్కరుడు సంవత్సర కాలం ఉంటాడు
గంగానదిలో                                            
పుష్కరుడు గంగానదిలో ఉన్న 
మొదటి పన్నెండు రోజులు పుష్కర కాలం
పుష్కర జలంలో స్నానం చేసి
పుణ్య ఫలం దక్కించుకోవాలని 
పూజలు,దానాలు,తర్పణాలు,పిండ
                                            ప్రదానాలు
చేయుట మానవ సాంప్రదాయం
మానవులే కాదు, ముక్కోటి దేవతలు
పుష్కర జలాల్లో మునకలు వేయాలని
తహతహలాడతారట 
ఒకసారి చేస్తే పుష్కర స్నానం
పన్నెండేండ్లు పన్నెండు పుణ్య నదులలో 
స్నానం చేసిన పుణ్యం
లభిస్తుందని ఒక విశ్వాసం.
20.
కవన జ్యోతి.. కవితా గానం సమూహం..
శోభకృత్ నామ సంవత్సర  పోటీ వైశాఖ మాసం పౌర్ణమి కవితల పోటీ కోసం 
అంశం : మందాకిని
శీర్షిక : పవిత్ర భాగీరథి
********************

ఏ ముని శాపమో..ప్రమాద పవనమో..
వేగంగా వీచి..రెపరెపలాడిన దేహపు దివ్వెలు 
భస్మం గా రాలి పడిన వేళ..

బంధాల విలువ తెలిసిన పచ్చని వంశాంకురమొకటి..ఆహుతైన పితరుల ఊపిర్లకు ఊతంగా నిలిచింది

నేల పైని ఆ గొప్ప ఆశయం ఆకాశాన్ని తాకింది
గంగ తననే వొంపుకుంది
సగర మనో వాంఛను తీర్చ దివి నుంచి దిగింది
ఆ పవిత్ర భాగీరథి..

ఆ మందాకిని మమతల వెళ్ళువ మనిషి కోసం
నింగినొదిలి..ఆదిభిక్షువు సిగలో మల్లియలా జవజవ లాడింది

బస్మపు క్షేత్రాల పై నుంచీ ప్రవహించి దేహ ప్రాణాల నిచ్చి..మట్టి మీదుగా ప్రవహించి..
సిరి సంపదలనిచ్చి..సంస్కృతులను గుదిగుచ్చి..

మనిషి మాలిన్యాలను కడిగి..భారతావనిని పునీతం చేసి..
ఆ జలజలలతో మానవాళిని కట్టిపడేసిందా మందాకిని

సుదీర్ఘ మంద గమన మందాకినీ తరంగాలలో 
ఓలలాడాలని..ఆ జల బాహువుల్లో చేరి ఒకింతసేపైనా..తరించాలని..పుష్కరాన
ఆసేతు హిమాచల చిరకాల స్వప్నం 

ఒక చోట నిలుకు లేని.. కూసింత కుదురు లేని
అలకనంద సమేత అపురూప జీవ గంగకు
సాగర సంగమమే కొండంత సాంత్వన

డా. దారల విజయ కుమారి 

హామీ పత్రం
************
నమస్తె సర్/ మేడం
ఈ కవిత నా స్వంత రచన. ఎటువంటి అనువాదం కాదు. ఏ సోషల్ మీడియా లోనూ ప్రచురితం కాదు.
ఇట్లు
తమ విధేయురాలు
డా. దారల విజయ కుమారి
**************************************

Comments

Popular posts from this blog

సింధూరం 07052025

****************** సింధూరం దిద్దిన వారు  1.వీరా గుడిపల్లి 2.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, 3.గొర్రెపాటి శ్రీను  4.దోసపాటి వేంకట రామచంద్రరావు  5.అపరాజిత్ 6.వేమూరి సత్యవతి  7.జ్యోతి  8.మండ నాగేశ్వరరావు  9.గడ్డం కృష్ణారెడ్డి.రేపాల.సూర్యాపేట 10.కవిత వెంకటేశ్వర్లు  11.ఆర్ వి వి రాజా  12. శ్రీ కోరాడ నరసింహారావు గారు  13. శ్రీ ఉదయగిరి మధుమోహన్ గారు  14. శ్రీమతి బల్లూరి ఉమాదేవి గారు  15. శ్రీమతి తోట సులోచన గారు  16. శ్రీ జి సూర్యనారాయణ గారు  17. శ్రీ గజవెల్లి శ్రీనివాస చారి గారు  18. శ్రీ వనపర్తి గంగాధర్ గారు  19. శ్రీమతి వాణి సరోజిని లక్కరాజు గారు  20. శ్రీమతి సింహాద్రి వాణి గారు 21. శ్రీ ఆచార్య అయ్యల సోమయాజులు ప్రసాద్ గారు  22. 23.శ్రీమతి నెల్లూరు వేంకటలక్ష్మి గారు 24.శ్రీ ఏడెల్లి రాములు గారు  25. శ్రీమతి డాక్టర్ తంగిరాల నాగలక్ష్మి గారు  26. శ్రీ కూని అంకబాబు గారు  27. శ్రీ తిన్నాక నాగేశ్వరరావు గారు  28. శ్రీమతి లలితా చంటి గారు  29. శ్రీ పిల్ల వెంకటరమణ మూర్తి గారు  30. ...

season 6 వైశాఖ పూర్ణిమ

కవనజ్యోతి,కవితాగానం సీజన్ 6  వైశాఖ పౌర్ణమి నగదు పోటీలు   పోటీకి కవితలు పంపించిన కవి వరుల జాబితా  1. శ్రీ పిళ్ళావెంకటరమణ మూర్తి గారు  2. శ్రీ సంగీతం సంతోష్ కుమార్ గారు ji 3. శ్రీ జి సూర్యనారాయణ గారు  4.శ్రీ మండ నాగేశ్వరరావు గారు 5.శ్రీమతి కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  6.శ్రీమతి నెల్లూరు వెంకటలక్ష్మి గారు 7.శ్రీ అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 8..శ్రీ కోరాడ నరసింహ రావు గారు  9.శ్రీమతి డాక్టర్ భమిడిమర్రి కమలాదేవి గారు 10.శ్రీ కాసుల ధీరజ్ శర్మ గారు  11.శ్రీ కూని అంకబాబు గారు 12.శ్రీ మతి డా.వేమూరి సత్యవతి గారు  13.శ్రీమతి డా.బల్లూరి ఉమాదేవి గారు 14.శ్రీ.దోసపాటి వేంకట రామచంద్రరావు గారు 15.శ్రీ అపరాజిత రెడ్డి గారు  16. శ్రీ ఏడెల్లి రాములు గారు  17.శ్రీ డాక్టర్ ఆళ్ళ నాగేశ్వరరావు గారు  18. శ్రీ కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  19. శ్రీ మద్ది పుల్లారావు గారు  20.శ్రీమతి సింహాద్రి వాణి గారు  21. శ్రీ డా.దీపక్ న్యాతి గారు  22. శ్రీ ఆర్.వి.వి.రాజా గారు  23.శ్రీమతి వాణీ సరోజినీ లక్కరాజు గారు...

వీడ్కోలు ఆషాఢమాసం పౌర్ణమి

అంశం: వీడ్కోలు  సందర్భం: ఆషాఢమాసం పౌర్ణమి  నిర్వహణ:  వీరా గుడిపల్లి లలితాకృష్ణ  ################## కవివరుల జాబితా  1.పిళ్ళా వెంకట రమణమూర్తి గారు  2. జి.సూర్యనారాయణ గారు  3.మండ నాగేశ్వరరావు గారు  4.డా‌.బల్లూరి ఉమాదేవి గారు  5. డా.కమలాదేవి గారు  6.గొర్రెపాటి శ్రీను గారు  7.వేమూరి సత్యవతి గారు  8.కూని అంకబాబు గారు  9.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  10.కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  11.తోట సులోచన గారు  12.వాణిసరోజిని లక్కరాజు గారు  13. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు  14.అపరాజిత రెడ్డి గారు 15.లలితాచండి గారు 16. నెల్లూరు వెంకటలక్ష్మి గారు  17.కమలశ్రీ గారు  18.రాధిక గారు 19.చంద్రమౌళి గారు  20.శ్రీకాంత్ గారు  21.సింగీతం సంతోష్ కుమార్ గారు  22.. దారల విజయ కుమారి గారు  23.ఎన్.నరేశ్ చారి గారు  24. పిన్నక నాగేశ్వరరావు గారు  25.సింహాద్రి వాణి గారు  26.ఏడెల్లి రాములు గారు  27.కొంజేటి రాధిక గారు  ++++++++++++++++++++++++++++++++ ఆషాడ మ...