Skip to main content

అయోధ్య రామయ్య

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం, ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం జనవరి 2024 సందర్భంగా
కవి సమ్మేళనం, కవితోత్సవం.
నిర్వహణ: శివునూరి లలితా కృష్ణ 
వీరా గుడిపల్లి
❇️❇️❇️❇️❇️❇️❇️

కవనజ్యోతి /కవితాగానం  
సమూహ మిత్రులందరికీ విజ్ఞప్తి

అయోధ్య రామాలయం లో
 ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో(22/01/2024) మనం పాల్గొనలేక పోయినా 

అక్షర/అక్షయ తూణీరాలతో
ఆ రామచంద్ర మూర్తి ఆశీస్సులు పొందే అవకాశం 

కవితాభిషేకం చేద్దాం
కవన దుందుభి మ్రోగిద్దాం

రాముని గురించి రాస్తారా
రామాయణం గురించి రాస్తారా
ఏం చెప్తారనేది మీ ఇష్టం

12/01/2024 నుండి 18/01/2024
వరకు ప్రతీ రోజు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు

రామ కథల గురించి
అయోధ్య రామయ్య గురించి ఏం చెబుతారో మీ ఇష్టం
 కవితాభిషేకం చేయండి
అన్ని కవితలూ బ్లాగు లో భద్రపరచడం తో పాటు 
ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రం అందజేయబడును.

గమనిక :కవితలు రాత్రి 7:00నుండి 9:00వరకు సమూహం లోనే పంపాలి
ఇతర msgs తొలగించబడును.
కవితలు మాత్రమే పంపుతూ సహకరించగలరు.

❇️❇️❇️❇️❇️❇️❇️
***********************
1. డా.కమలాదేవి గారు 
2. కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 
3. మద్ది పుల్లారావు గారు 
4. కొంజేటి రాధిక గారు 
5.కాసుల ధీరజ్ శర్మ గారు 
6. దోసపాటి రామచంద్రరావు గారు 
7. గొర్రెపాటి శ్రీను గారు 
8. కె వి.రమణాచారి గారు 
9.కోరాడ నరసింహారావు గారు 
10.కేశరాజు వేంకట ప్రభాకరరావు గారు 
11.గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు 
12.మండ   నాగేశ్వర్రావు గారు 
13.డా.బల్లూరి ఉమాదేవి గారు 
14.కె.వీ. రమణాచారి గారు 
15. దోసపాటి వేంకట రామచంద్రరావు గారు 
16.కొంజేటి రాధిక గారు 
17.గజవెల్లి శ్రీ నివాసాచారి గారు 
18. నెల్లూరి వెంకట లక్ష్మి గారు 
19.డా.బల్లూరి ఉమాదేవి గారు 
20.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు in
21.దోసపాటి వేంకట రామచంద్రరావు గారు 
22.రమణాచారి గారు 
23. సింహాద్రి వాణి గారు 
24.దామర్ల నాగేశ్వరరావు గారు 
25.కొంజేటి రాధిక గారు 
26.తాతపూడి సోమశేఖర శర్మ గారు
27.గొర్రెపాటి శ్రీను గారు 
28. కవిత వెంకటేశ్వర్లు గారు 
29. గజవెల్లి శ్రీ నివాసా చారి గారు 
30. కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు 
31.కె.వి రమణాచారి గారు 
32.కొంజేటి రాధిక గారు
33.ఎన్ నరేశ్ చారి గారు 
34.వేమూరి సత్యవతి గారు 
35. ఏ.భూపతి గారు 
36.డా.బల్లూరి ఉమాదేవి గారు 
37.దోసపాటి వేంకట రామచంద్రరావు గారు 
38. ఏ.భూపతి గారు 
39.డా.బల్లూరి ఉమాదేవి గారు 
40. కొంజేటి రాధిక గారు 
41.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు
42.లలితా చండి గారు
43. కాసుల ధీరజ్ శర్మ గారు 
44.వీరాచారి గారు
45. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
46.గజవెల్లి శ్రీనివాసాచారి గారు
47.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
48. శ్రీ శివ లక్ష్మి రాజశేఖరుని గారు
49.డా.నాయకంటి నరసింహ శర్మ గారు
50.కె.వి.రమణాచారి గారు 
51.కొంజేటి రాధిక గారు 
52.డా.బల్లూరి ఉమాదేవి గారు 
53. కవిత వెంకటేశ్వర్లు గారు 
54.సింహాద్రి వాణి గారు 
55.తిప్పావఝల నరసింహ మూర్తి గారు 
56.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 
57.కె.వీ.రమణాచారి గారు 
58.కోరాడ నరసింహారావు గారు 
59.గజవెల్లి శ్రీనివాసాచార్యులు గారు 
60.ముడుంబై తిరు వేంకటాచార్యులు గారు 
61.మన్నె లలిత గారు 
62.సత్య స్వరాళి గారు 
63.దోసపాటి రామచంద్రరావు గారు 
64.పిన్నక నాగేశ్వరరావు గారు 
65.గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు 
66.సింహాద్రి వాణి గారు 
67.కె.వి.రమణాచారి గారు 
68.కేశరాజు వెంకట ప్రభాకరరావు గారు 
69.కొంజేటి రాధిక గారు 
70.డా.తంగిరాల నాగలక్ష్మి గారు 
71.కోరాడ నరసింహారావు గారు 
72.డా.బల్లూరి ఉమాదేవి గారు 
73.వనపర్తి గంగాధర్ గారు 
74.కోరాడ నరసింహారావు గారు 
75.సింగీతం సంతోష్ కుమార్ 
76. నాగేశ్వరరావు దామెర్ల గారు 
*********************************
1.కవితాగానం సీజన్ 4
కవనజ్యోతి/కవితాగానం
పేరు : డా.కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
తేది : 12-1-24

శీర్షిక: ఆదర్శపురుషుడు
శ్రీమద్రామాయణ
కథానాయకుడు
మన శ్రీరాముడు
దుష్టశిక్షణ, శిష్టరక్షణకై
అవతరించిన అవతారపురుషుడు
దశరథ తనయుడు
కౌసల్యానందనుడు
సుందరాంగుడు,
నీలమేఘశ్యాముడు
విశ్వామిత్రశిష్యుడు
తాటకాదిరాక్షస సంహారముచే
యజ్ఞయాగాదులను రక్షించిన
యాగ, యోగ పురుషుడు
శ్రీరాముడు
ఒకేమాట,ఒకేబాణము,
ఒకపత్నిగల
ఏకపత్నీవ్రతుడు
మన శ్రీరాముడు 
అయోధ్య వాసియైన
అయోధ్యారాముడు
సాకేత పురవాసియైన
సాకేతరాముడు
అందరిని అలరించు
అందాలరాముడు
జానకిని పరిణయమాడిన జానకీవల్లభుడు
మూర్తీభవించిన పుణ్యమూర్తి
ప్రజారంజకుడు, ఆర్తత్రాణ
పరాయణుడు, శరణాగత
రక్షకుడు
లోకాభిరాముడు, కల్యాణ రాముడు,
కోదండరాముడు
వీరుడు, ధీరుడు,యుగపురుషుడు
మన శ్రీరాముడు
పితృభక్తి, గురుభక్తి
సోదరప్రేమ,స్నేహ శీలత
మూర్తీభవించిన రూపమే
మన శ్రీరాముడు 
తారక రాముడు
పుణ్యపురుషుడు,
మనందరికి ఆదర్శప్రాయుడు.
హామీ : పైకవిత నాస్వంతం.

2
శీర్షిక..... అయోధ్య
స్వీయ రచన కేశవరాజు వెంకట ప్రభాకర్ రావు పాతర్లపాడు ఖమ్మం 62 81 6 979 82

అయోధ్య ఒక నగరం కాదు 
అనంతుని ఆవాసమది 
అది ఒక పురము కాదు
ఆది మధ్యాంత రహితుని ఆటస్థలం 
అది ఒక పల్లె కాదు 
ఆత్మతో పరమాత్మను కలిపే అమృత వాహిని
అది ఒక గూడెం కాదు 
ఆది పురుషుడు ఆవిర్భవించిన పురిటి గడ్డ

అది ఒక గ్రామము కాదు
అశేష జనావళికి ఆరాధనా భూమి 
ఆర్యవర్తమును 
అలరించిన అందాల ఆనంద నిలయం
అందరి మదిలో ఆధ్యాత్మిక భావనల సౌరపాలను వెదజల్లిన మలయ మారుతం !!

యుగాలు ఎన్నెన్నో మారినా
గానం చేస్తూనే ఉన్నాయి
ఆ గుణదభిరాముని ప్రార్థిస్తూ
అఖండ పారాయణం శ్రావ్యంగా చేస్తు!!

ముదిమి ముంచుకొచ్చిన
మతి తప్పి పడిపోయినా
మరణం ఆసన్న మైనా 
ఆ గళాలు మాత్రం మారలేదు !!

ఆశతో
అఖండ జ్యోతుల వెలిగించి
అలసటను
సమీపించనీయక
ఆనందంగా
ఆ బాలరామునితో
తారంగం ఆడిన
చతురంగ సేనల
కష్టం ఫలించి
అఖండ భారతావని
ఆరంగేట్రం చేస్తుంటే
భక్త జనావళి సంతోష సాగరంలో మునకేసి
జై శ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ
తన్మయత్వంతో ఓలలాడుతున్నది

ఇది నా స్వీయ రచన
3.

పేరు:మద్ది.పుల్లారావు
ఊరు: నందిగామ
....... 
తేదీ:12-1-2024
అంశం:సీత
శీర్షిక:ఆదర్శ మహిళ సీత
ప్రక్రియ:ఇష్టపది
.....
1)

నాగేటి చాలు లో..నరనాధు జనకునికి
దొరికిన శ్రీలక్ష్మి..పెరిగినది సీతగా
బాల్యంనుండితాను.వైకుంఠవాసునికి
పూజలను జేయుచూ.. పులకించి పోయేను
చురుకైన బాలికగ..సొగసైన కన్యగా
సర్వ శుభలక్షణగ.. జనులు మెచ్చిరి తనను
చిన్ననాడే సీత..శివ విల్లు గదిలించె
రాయుదును యిష్టపది..రామచంద్రుని దలచి 

2)
ఆశ్చర్యచకితుడయె..యా మిధిలాపతపుడు
శివ ధనుర్భంగము.శ్రీరాముడు జేయగా
శ్రీరామచంద్రుణ్ణి.. సీతమ్మ పెండ్లాడె
సిగ్గువడుటను గల్గి..సింగారమును గల్గి
నయము ప్రియమును గల్గి..నరనాధు చిత్తంబు
శీఘ్ర కాలము లోనె..సీత వశపరచుకొనె
అత్త,మామల పట్ల..యాదర భావముతో
రాయుదును యిష్టపది..రామచంద్రుని దలచి

3)

రాజమందిరమందు..రాణిగా వెలుగొందె
భర్తననుసరించుతూ..పడతి కానలకేగె
అంతులేని బాధలు..యాత్మబలము తోడను
సహించిన ధీశాలి..సర్వమంగళ సీత
రావణుని చెరలోను.. రాముణ్ణి ధ్యానించె
పదునాల్గు వర్షాలు..పరమ బాధలు పడెను
అగ్ని ప్రవేశముతో..యధిక ఖ్యాతి బొందెను
రాయుదును యిష్టపది..రామచంద్రుని దలచి

4)
చాకలి నింద తోటి..స్వామికి దూరమాయె
లవ,కుశల జన్మమున..రమణి సంతసించెను
బాలుర స్వామికిచ్చి..యవనిన ప్రవేశించె
పంచ పతివ్రతల్లొ..పడతి స్థానము బొందె
అవని లోనే తాను..యాదర్శమాయెను
సీతారాములనిన.. సృష్టి లోనే గొప్ప
దంపతులుగా నిలిచిరి..ధర లోని యెల్లపుడు
రాయుదును యిష్టపది..రామచంద్రుని దలచి
..
ఇది నా స్వీయరచన
4.
కవిత గానం సీజన్ 4 
పేరు కొంజేటి రాధిక 
ఊరు రాయదుర్గం
 జిల్లా అనంతపురం

సమాజానికే నడకను నడవడికను వారధిగా చేసి సత్ప్రవర్తన అనే రహదారిని ఏర్పరచి, అజరామరమైన నైతిక విలువలను సమాజంలో నాటిన రామాయణ ఇతిహాస గాధ అందుకే ఆ చంద్ర తారర్కమైందేమో?!
సముచితమైన ప్రతి పాత్రకు సముచితమైన పాత్రకు సముచితమైన స్థానం కలిగించి ప్రతి పాత్ర నాటికి నేటికీ అనుసరణీయమైన పూలబాటను పరచి, ఎన్నెన్నో నియమ నిబంధనలనే వంతెనను తీర్చిదిద్ది, త్రేతాయుగంలో జరిగిన గొప్ప ఇతిహాస గాధ...
 విష్ణువు కథానాయకుడిగా లక్ష్మీదేవి కథానాయకగా, చరిత్రలో జరిగిన మానవుడిగా జన్మించిన సీతారాముల గాధ.... అందుకేనేమో 100 శతాబ్దాలు దాటినా రామాయణాన్ని మించిన అమృతతుల్యమైన గాధ ఇలలో జనియించలేదు ...
రామాయణ గాధను చదివిన చాలు మనిషి అత్యంత సంస్కారవంతుడిగా మహోన్నతుడుగా మార్చే రమనీయమైన అత్యద్భుతమైన కావ్యం... జన్మను చరితార్థం చేసి మోక్ష మార్గానికి పరమపద సోపానం.

5

రామచంద్రమూర్తి.

పేరు కాసుల ధీరజ్ శర్మ,
విశ్రాంత అకౌంట్స్ ఆఫీసర్
తూప్రాన్, మెదక్ జిల్లా
9440522864.

తండ్రి మాట జవదాటక 
అరణ్య వాసమెల్ల ఆచరించి చూపె
వనములోన ఆదర్శమూర్తి!!

సవతితల్లి మాటలకు కట్టుబడి, కైక కోరిక లెల్ల కరుణతో తీర్చె జగతి లోన సహనమూర్తి!!

సాధుసేవ సదా మరువని 
పాదసేవ లెల్లవేళల చేసి చూపె పుడమి లోన మౌనమూర్తి!!

శబరి యెంగిలి ఫలములు తిని భక్తి భావములెల్ల వ్యాపింప జేసె వసుధ లోన ప్రేమమూర్తి!!

శౌర్యముగ 
శతృ సంహారము జేసి శాప విమోచనము గావించె ఉర్విలోన మర్మమూర్తి!!

భోగభాగ్యాలు అశాశ్వతమని     
సిరులెల్ల త్యజించె
ధరిత్రిలోన ధర్మమూర్తి!!

మృదు మాటలు 
మాట్లాడి చూపె నిత్య సంయమనముగ
ఇలలో వ్యక్తిత్వ వికాస మూర్తి!!

సుస్థిర రాజ్యస్థాపనే 
స్థిర కీర్తి నిడునని నిండుగ నమ్మె జగతిలోన 
శ్రీ రామచంద్రమూర్తి!!

సర్వే జనాః సుఖినోభవంతు!!!
6.
కవితాగానం
తేదీ:12-02-2024,శుక్రవారం
ఆయోధ్యరామాలయం ప్రారంభం సందర్భంగా
కవితార్చన.
అంశం:శ్రీరాముడు
దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం

అతులితబలధాముడు అయోధ్యారాముడు
అవతారపురుషుడే ఆ శ్రీరాముడు
కోదండరాముడు కౌసల్యాతనయుడు
ఆదర్శవంతుడే ఆ దశరధతనయుడు
తండ్రిమాటను కాదనక కాననలకేగినాడు
శివధనస్సును వంచి సీతమ్మను మనువాడినాడు
వనవాసియై కష్టాలను అనుభవించాడు
లంకాధీశుడు సితమ్మను ఎత్తుకెల్లినాడని
సీతాన్వేషణకై బయలుదేరినాడు
సుగ్రీవుని తో మైత్రి చేసినాడు
వాలిని చంపి సుగ్రీవునికి పట్టాభిషేకం చేసినాడు
హనుమంతుని ఆప్తునిగా స్వీకరించాడు
లంకలో సీతమ్మజాడ తెలిసి వానరులో వారధి కట్టించాడు
రావణణిని యుద్దమందు ఓడించి సీతమ్మ తో అయోధ్య చేరినాడు.

ఇది నాస్వీయరచన.
7
కవితాగానం
సీజన్ 4

కవితాశీర్షిక :
"జగదభిరామ..జానకి రామ..పట్టాభి రామ..పావన రామ..జయ జయ శ్రీరామ! "

తండ్రి మాటను కాదనలేక అడవులబాట పట్టావు !
కట్టుకున్న భార్యను..వెంటనడిచిన తమ్ముడ్ని
కాపాడుతూ అరణ్యవాసం చేశావు !
దుష్టబుద్ధితో రావణుడు సీతమ్మని అపహరిస్తే
నీ భక్తుడైన ఆంజనేయుడ్ని పంపి ..జానకీదేవి జాడ కనుగొని
సముద్రాన్నే నిలువునా చీల్చి..
వారధిని నిర్మించి
లంకను చేరి..దశకంఠుడ్ని సంహరించి
ఇల్లాలి చేయి పట్టుకుని ..
సోదర సమేతంగా అయోధ్యా నగరానికి చేరుకుని..
హితులు,బంధువులు,ప్రజల హర్షాతిరేఖాల సంబరాలు అంబరాన్నంటే వేళ..
"మహారాజు"గా సకల జనుల నీరాజనాల నడుమ..
పట్టాభిషేకం అందుకున్న మహనీయుడవి..జనరంజక పాలకుడవి !
"శ్రీరామ " నీ చరితం తరతరాలకి ఆదర్శం !
"శ్రీరామ" నీ రూప వీక్షణం నయనానంద భరితం !
"శ్రీరామ" నీ నామ సంకీర్తనం హృదయానందభరితం ..అమృతమయం !

                                                               _ గొర్రెపాటి శ్రీను. 9652832290
8
కవితాగానం
కవనజ్యోతి
తేదీ:12-02-2024,శుక్రవారం
ఆయోధ్యరామాలయం ప్రారంభం సందర్భంగా
కవితార్చన.
అంశం: "*న్యాయం* 
కె వి రమణా చారి 
తెలుగు పండితులు
నిజామాబాద్
తెలంగాణ.
దైవానికి సాక్ష్యం అని న్యాయస్థానం అడుగు రామ భక్తితో రామ చంద్రుని ఆత్మ రామభద్రచార్యులు తెలిపినప్పుడు ఋగ్వేద జైమీనీయ సంహిత లోన రుజువు నుంచ సరయున్నది ఒడ్డున ఉందని సాక్ష్యమే చెప్పే చూడలేని భక్తి చూపే దారి.

ఇది నా స్వీయ రచన.


ఇది నాస్వీయరచన.
9
భక్తిగీతం;-అయోద్యరామయ్య.
   కోరాడ నరసింహా రావు.! 
       ******************
పల్లవి :-
అ యో ధ్య రామయ్య... కాం చ వయ్యా నీ ఆనంద మందిరము!! 
   నేటికీ, ఈ నాటికీ నీ పూర్వ వైభవము ! ... ఆ...హా... 
 సంతరించుకున్న దె0తొ సుందర రూపము..!! 
        " అయోధ్య రామయ్య... "
చరణం :-
  ఎన్నాల కెన్నేలకు వచ్చెను నీ రాజ్యము...! 
   తెచ్చిరీ నీ సైన్యము...!! 
ఎంత పోరు సలిపిరరో.... ఎన్నేన్ని శ్రమలను ఓ ర్చి రో.... న్యాయమును నిలబెట్టిరి, ! 
  ధర్మమును రక్షించిరి...!! 
  నీ హక్కును నీ పరము జేయ గా...! నీ రాజ్యమును నీ కప్ప గించగా ...!! 
   " అ యోధ్య రామయ్య.... "
చరణం :-
   మేలుకొనవయ్యా రామా...! 
 పరుల పాలు గానీయక ఏలు కొన వెయ్యా, రామా యేలుకొనవయ్యా...!! 
 దుష్టులు- దుర్మార్గులు ఇటు ఇక కన్నెత్తి చూడ కుందా నీ 
రామ బాణము ఎక్కు పెట్టి
కాచుకొనవయ్యా రామా... 
  కాచు కొనవయ్యా...!! 
    *********************
130012024
****************
1/10
కవితా గానం కవనజ్యోతి సమూహ పక్షాన
అయోధ్యలో రామాలయం ప్రారంభం సందర్భంగా
కవితా గోష్టి నిర్వహణ
తేదీ 13 జనవరి 2024
శీర్షిక :::బాల రాముని జననము 
స్వీయ రచన::: కేశరాజు వెంకట ప్రభాకర్ రావు పాతర్లపాడు ఖమ్మం .


ఘనమైన ఇక్ష్వాకు వంశజుడు 
ప్రజారంజకుడు దశరథుడు 
వేదవేత్త, పరాక్రమశాలి, ధర్మ పరాయణుడు. సుసంపన్నమైన కోసల దేశానికి మహా చక్రవర్తి 
అయోధ్యా నగరం ఆతని రాజధాని !!

జనరంజకమైన పాలనలో జగమంతా జిగి 
వనమంతా పండు వెన్నెల బిగి
మనసు నిండా తీరని దగ
సంతానం లేమితో హృదయం భగ భగ!!

 చింతను వదలాలంటే, సంతును పొందాలని,
మంత్రులు, గురువుల సూచనలతో,
యాగం చేయ తలపెట్టాడు.... అందుకు ముని ఋష్యశృంగులను అయోధ్యకు ఆహ్వానించి !!

 ఋష్యశృంగుని ఋత్విక్కుగా 
అశ్వమేధయాగం, పుత్రకామేష్టి యాగం 
భక్తి శ్రద్ధలతో చేసి ఆ శ్రీ మహావిష్ణువును 
ప్రార్థించి సంతానం పొందే వరమీయమని వేడుకొనగా!!

తాను రావణ సంహారార్ధమై 
తన నాలుగు అంశలతో, నలుగురు కుమారులుగా మానవ జన్మ ఎత్తడానికి సంకల్పించానని..‌. అందుకే
వరమమిస్తున్నానని దశరథ మహారాజు నూరడించే !!

యజ్ఞపురుషుడిచ్చిన పాయసాన్ని 
దశరథుడు తన భార్యలైన కౌసల్య, కైక, సుమిత్రలకందించగా... వారు సంతోషంగా తీసుకుని తేజోవతులై గర్భము దాల్చారు !!


చైత్ర నవమి నాడు, 
పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో, 
గురూదయ సమయంలో 
కౌసల్యకు రాముడు జన్మించాడు!!

రాముని జననముతో
కొండలనుండి నదులు గలగలమంటూ
దునికాయి సంతోషం పట్టలేక
చెట్లు చిగురులు వేసాయి!!

పూల తోటలో పూలు పూచి
కమ్మని సౌరభాలను 
ఖండ ఖండాల నిండా వెదజల్లాయి
పూదేనియలూరి ముల్లోకాలను ముంచాయి!!


కైకకు పుష్యమీ నక్షత్రయుక్త 
మీన లగ్నంలో భరతుడు జన్మించాడు. 
సుమిత్రకు ఆశ్లేషా నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు !!

రామ లక్ష్మణ భరత శతృఘ్నులు
వసుమతి వడిలో ఓలలాడిస్తుంటే
చెంగుమని నింగి వంగి ముద్దాడుతుంటే
చుక్కలు చక్కిలి గిలి పెట్టి నవ్వించాయి
ఆ జగదభిరాముని హర్షాతిరేకాలతో!!

ఇది నా స్వీయ రచన

2/11
కవితాగానం సీజన్4
కవితా శీర్షిక: శ్రీరాముడు
గజవెళ్ళి శ్రీనివాసాచారి 
...
వాల్మీకి విరచితమైన 
రామాయణ కావ్యము 
ధర్మశాస్త్రము

వేదముల వలె 
రామాయణము నిత్య పూజ్యమే 
జనులకు మార్గదర్శకమే
ధర్మ ప్రభోదక శాస్త్రములలో 
ఇది అగ్రగణ్యమేగా 

శ్రీరాముడు 
మర్యాదా పురుషోత్తముడు 
మూర్తీభవించిన ధర్మమే రాముడు
సర్వ సద్గుణాలకు నిధి 
అధర్మము నశింపచేసి 
ధర్మము స్థాపించిన ధర్మమూర్తి 

ఏ నోటవిన్నా రామనామమే 
ఏ ఇంట చూసినా రాముని పటములే 
ఏ ఊరిలో చూసినా 
రామసప్తాహములే 

రాముడు సచ్చిదానంద స్వరూపుడు 
మంగళకారకుడు

3/12
శ్రీరామరామరామా
జై శ్రీరామా...అందామా..!!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏


రామరామ రామా
జయజయ రామా అందామా...!!

కౌశల్య సుతుడే రామచంద్రమూర్తీ
లక్ష్మణుకతడే సోదర దీప్తీ...
సీతమ్మ పతియే సౌందర్యకీర్తి...
ఆంజనేయుడే రామునిస్పూర్తి!!!

రామరామరామా 
జై శ్రీరామా అని అందామా....

రాముని భజనే చేద్దామా
రామనామమే స్మరియిస్తూ
రామమూర్తినే కందామా 
రామరాజ్యాన్ని చూద్దామా!!!

శౌర్యము తానే శ్రీరామా
కారుణ్యమూర్తే శ్రీరామా
సోదరప్రేమా శ్రీరామా
అమృతమూర్తివి ఓ రామా!!

ఆదర్శమూర్తివి రఘురామా 
ఏకపత్నీవ్రతమే జయరామా 
మారుతి మదిలో మారామా 
ప్రతిహృదిలో నీవే కోదండరామా!!

మన నడకా నడతా 
గమనం గమ్యం 
కావాలి శ్రీరామ మయం
అణువణువూ శ్రీరామాలయం
నిత్యం సత్యం ధర్మం
శాంతీ సహనం కావాలి రామమయం!!!

రామరామరామా 
సాకేతరామా అందామా...!!

        ----మండ నాగేశ్వర్రావు.✒️
            సరిపల్లి, పెందుర్తి.
            7793939724.

4/13
కవిత గానం సీజన్ 4 
కవిత శీర్షిక :శ్రీరాముడు డా.బల్లూరి ఉమాదేవి

1.ఆ.వె:మారు తల్లి కోర మారాడక రాము 
             కదిలె సీతతోడ కానలకును
           అవుసరించె తాను అనుజుడా సౌమిత్రి
          కదిలిరెల్ల జనులు కాంచుచుండ.

2.తే.గీ:రాక రాక వచ్చితివి శ్రీ రామచంద్ర
         కలిగె నాకిట హర్షంబు కాలుమోప
          ధన్యు డైతి నీదయ నొంది ధరణి యందు
          యనుచు గుహుడుతా భాషించె యాదరాన.

3.ఆ.వె:గుహుని పడవ నెక్కి గొప్పగా పయనించి
          చిత్రకూటమేగి సీత తోడ
          పర్ణశాలయందు పదిలముగానుండ
          కాపు కాచె భ్రాత కానలందు.

4.ఆ.వె: పసిడి మృగమగోరె పడతి జానకిదేవి
         రాజసానయేగె రాఘవుండు
        మాయ దెలిసి యపుడె మారీచు గూల్చిన
        రామచంద్రు డొసగు రక్ష మనకు

5.ఆ.వె: రావణాసురుండు రమణిని గొంపోవ
         నాప దానవేంద్రు నడ్డు పడిన
       పక్షిరాజు జంపె పంక్తి కంథు డపుడు
       శోక భరిత యయ్యె సుదతి సీత.
డా బల్లూరి ఉమాదేవి

5/14
KV ramana chary
కవిత గానం
కమల జ్యోతి
తేదీ 13-01-2024
శని వారం
అంశం: *శ్రీరాముడు*
పది తలల రావణుడికి అహంకారాలు
పరాక్రమ రాముడికి వీరత్వం
భార్య మోజు పడిన పరాభవo
పరాక్రమమే మిగులునని నుడి వీనది
రామ భక్తి హనుమ ఎదకు హత్తుకున్న దైవం
పాదుకలే పాతికేల్ల పరిపాలన చేసే శక్తి
పావనమూర్తి జయరామునిదే.


ఇది నా స్వీయ రచన.

6/15
కవితాగానం
తేదీ :13-01-2024,శనివారం
కవితార్చన
శీర్షిక:తారకరాముడు
దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం

తారకరాముడు సకలగుణాభిరాముడు
అయోధ్యారాముడు ఆదర్శవంతుడు
అన్నదమ్ములకు ఆదరణీయుడు
అమ్మనాన్నలకు అనురాగపాత్రుడు
వినయవిధేయతలకు మూర్తిమంతుడు
విశాలహృదయానికి వివేకవంతుడు
వీరుడు శూరుడు విజ్ఞానసంపన్నుడు
విద్యావంతుడై విశ్వసనీయుడు
జానకీరాముడు జనప్రియుడు
జనకునికి జామాతైనాడు
జన్మజన్మలకు జ్ఞప్తికొస్తాడు
జటాయువుకు ముక్తినిచ్చాడు
జగదభిరాముడు శ్రీరాముడు
జగదానందకారకుడు ఆ రాముడు
జానకీవల్లభుడు జయజయరాముడు
శ్రీరామ జయరామ జయజయరామ.

ఇది నాస్వీయరచన.


7/16
9493273114
కవితా గానం సీజన్ 4
పేరు కొంజేటి రాధిక
ఊరు రాయదుర్గం
జిల్లా అనంతపురం

జన రంజక పాలనకై ఎన్నో త్యాగాలు చేసిన మచ్చలేని శ్రీరామచంద్రుడని నిరూపించుకుని,
 రాజ్యాన్నే కాదు ప్రాణప్రదంగా కలకాలం కంటికి రెప్పలా కాపాడతానని ప్రమాణం చేసిన భార్యను కూడా అరణ్యాలకు పంపి,
రాజ్య సింహాసనాన్ని తృణప్రాయంగా త్యజించిన త్యాగధనుడు...
 జన సంక్షేమమే తన అభిమతమని,
 జనక్షేమమే తన ఆశయంగా ఆజన్మాంతం జీవించిన అపర పరిపాలన దక్షుడు శ్రీరాముడు...
అధికార పీఠానికై నలుగురు అన్నదమ్ముల్లో ఏ ఒక్కరు తాపత్రయపడక తమలో తాము అంతర్గత కలహాలతో పోట్లాడక, జన సంక్షేమ పాలనకై తపనపడ్డారే కానీ అధికార దురహంకారంతో అధికారానికి, స్వార్థము పగ ప్రతీకారాలు ద్వేషాలు ఏనాడు మచ్చుకైనా కనపడవు....
 మచ్చలేని శ్రీరాముడి పాలనలో సామాన్యుడికైనా న్యాయం చేయాలన్న సంకల్ప బలమే అతడి అభిమతం....
 ఏ ఒక్కరి అసంతృప్తికి చురగొనక అజరామరమైన సంక్షేమ పాలనతో,
 ఏ విషయంలోనూ సంక్షోభంలోకి నెట్టేయక పదుగురు మెచ్చే పాలనతో పది కాలాలు పరిపాలించి జనం మెచ్చిన నాయకుడుగా,
 జనులు ఆకాంక్షించిన నాయకుడు శ్రీరాముడు... సామాన్య మానవుడిగా తన బాధను కన్నీళ్లను అనుభవించి, రారాజైనా సామాన్యుడిగా సాధారణ వ్యక్తిగా జీవించిన అసమాన్యుడు, అసాధారణ వ్యక్తిత్వం ఉన్న శ్రీరాముడు అందుకేనేమో చరిత్రలో చిరస్థాయిగా అనుసరణీయదగిన వ్యక్తిగా నిలిచినాడు రాముడు.
14/01/2024

1/17
కవితా శీర్షిక: రఘుశ్రేష్ఠుడు 
గజవెళ్ళి శ్రీనివాసాచారి 
...
శ్రీరాముడు 
రఘుశ్రేష్ఠుడు 
ప్రపంచ శ్రేయస్సుకై 
దివ్య మంగళరూపము 
ధరించిన విష్ణువు 

సర్వులకు ప్రభువాయన 
నిరాకార స్వరూపుడు 
సత్యసంధుడు 
సుశీల సంపన్నుడు
తండ్రి మాట కోసమే 
రాజభోగాలు త్యజించి 
నార వస్త్రాలు ధరించి 
సీతాసమేతుడై 
వనవాసమేగిన ధర్మమూర్తి 

జనుల హితము కొరకు 
దేశ క్షేమము కొరకు 
గురువుల ఆదేశములను 
పాటించిన ఉత్తముడు 

సాకేతరాముడు 
దయార్ద్రహృదయుడు 
సర్వప్రాణులను 
ఆదరించిన కరుణామూర్తి
2/18

నెల్లూరు వేంకట లక్ష్మీ ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా 
14.01.2024
అంశం:రామాయణం
*******************
విలువలు లుప్తమవుతున్న నేటి తరుణంలో
నీతి నిజాయితీలకు తిలోదకాలిస్తున్న నేటి సమాజంలో
నిజాలను పాతరపెట్టి నిందలను మోస్తున్న నేటి లోకంలో
మంచీ చెడుల విచక్షణ మృగ్యమవుతున్న జీవితాలలో
సకలగుణాలను పొదిగిన సర్వజనుల తారకమంత్రంగా మారిన
శ్రీరాముని దివ్య చరితం శ్రీమద్రామాయణం
తరతరాలకు ఆదర్శ రమణీయ దృశ్యకావ్యం
మదిమదిని సన్మార్గదిశకు నడుపు మహత్తర సందేశం
ఉత్తమ మనిషిగా ఎదుగుదలకు మార్గం చూపు మహాగ్రంధం
సృష్టి వున్నంత వరకు అజరామరంగా అలరాడు అపురూప కావ్యం రామాయణం
అంతటి ఇతిహాసాన్ని చదివిన ప్రతీ మనసు పునీతం
ఆచరించిన ప్రతీ మనిషి జన్మ పావనం 

నెల్లూరు వెంకట లక్ష్మీ, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.

హామీ పత్రం
    ఆర్యా!ఈ కవిత నా స్వంతం.ఇది దేనికి అనుకరణ, అనువాదం కాదని హామీ ఇస్తున్నాను.
3/19
డా బల్లూరి ఉమాదేవి 
శీర్షిక : రామకథ

బాలల్లారా రారండి
 హాయిగా సెలవులు గడపండి 
ఇంటిపట్టునే ఉండండి
 బయటి ఆటలు మానండి
రాముడి కథనే చెబుతాను 
చక్కగా మీరు వినరండి
దశరథ సుతడై పుట్టాడు
ముని యాగం రక్షించాడు 
శివుని విల్లునే విరిచాడు
సీతమ్మను చేపట్టాడు
ఒకటే మాట ఒకటే బాణం 
ఒకటే సతి అని చాటాడు 
జగతికి ఆదర్శంగా నిలిచాడు

తండ్రిమాటకై రాజ్యం వీడి
 అడవుల మార్గం పెట్టాడు
పసిడి జింకగా వచ్చిన మారీచుని 
బాణంతో హత మార్చాడు 
యతిగా వచ్చిన రావణుడు 
సీతను ఎత్తుకుపోయా డు
సీతను కానక రాఘవుడు 
వనమంతా వెతికాడు
 జాడకానక విలపించాడు
ఋష్య మూకగిరి చేరాడు 

ఆంజనేయుని చూశాడు
వానర సాయం పొందాడు 
సీతను వెదక సాగిన హనుమకు
అంగుళీయకం ఇచ్చాడు
జానకి పంపిన ఆనవాలును
 చూసి మదిలో మురిశాడు

వానర వీరుల సాయంతో
శరధికి సేతువు కట్టాడు
పది తలల రావణాసురుని 
ఒక్క బాణముతో చంపాడు
విభీషణునికి పట్టం కట్టాడు
 సీతమ్మతో అయోధ్యను చేరాడు
పట్టాభిషేకం జరిగింది 
రామరాజ్యమే వెలసింది
నపరస భరితం రాముని చరితం
ఆలకించగా రారండి 
శ్రీ రాముని దీవెనలందండి.

డా. బల్లూరి ఉమాదేవి
4/20
[14/01, 7:00 pm] కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు Poet: కవితా గానం కవనజ్యోతి సమూహ పక్షాన
అయోధ్యలో రామాలయం ప్రారంభం సందర్భంగా
కవితా గోష్టి నిర్వహణ
తేదీ 14 జనవరి 2024

శీర్షిక ::: వానర భల్లూక జన్మ వృత్తాంతం

స్వీయ రచన::: కేశరాజు వెంకట ప్రభాకర్ రావు 
హైదరాబాద్ (ప్రస్తుతం)

పరంధామము వీడి
పాలకడలిలోని శేషశయనము వదిలి
పాపులను శిక్షించుటకు 
పాంచభౌతిక రూపము దాల్చిన 
పద్మనాభుని ఆజ్ఞతో!!


వేయాలి తలా ఒక చెయ్యి, రావణ సంహార
యజ్ఞంలో, అని తలచి వైకుంఠ నివాసులు, వేల్పులందరు,ఒకటై... భువికి చేరినారు!!

రామ రావణ యుద్దములో 
శ్రీరాముడు ... రావణుని వధించి ,లోక కల్యాణం జరుపుటకు సహాయపడు నిమిత్తం 
మహావీరులైన వానర భల్లూకాలగా
తమ తమ అంశలతో
విశేష మైన గుణగణాలుతో ఉద్భవించుటకు నిశ్చయించుకొని..‌‌. !!

ఇంద్రాది దేవతలు తమ అంశలతో 
వానర, భల్లూక వీరులకు జన్మలనిచ్చారు. 
బ్రహ్మ అంశతో జాంబవంతుడు, 
ఇంద్రుని అంశతో వాలి, 
సూర్యుని అంశతో సుగ్రీవుని జననం!!

దేవ గురువు బృహస్పతి అంశతో తారుడు, 
దేవ శిల్పి విశ్వకర్మ అంశతో నలుడు, 
అగ్ని అంశతో నీలుడు, కుబేరుని అంశతో గంధమాదనుడు, 
అశ్వినీ దేవతల అంశలతో మైంద ద్వివిధులు, వరుణాంశతో సుషేణుడు, పర్జన్యాంశతో శరభుడు 
పుడమి పై ప్రాణం పోసుకున్నారు !!


వాయుదేవుని అంశతో అంజనీదేవి గర్భాన
‌అసమాన పరాక్రమశాలి, 
తేజో వేగ సంపన్నుడు, వజ్ర సదృశ దేహుడు ఆంజనేయుడు 
జై శ్రీరామ్ జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ జన్మించాడు !!
 
ఇది నా స్వీయ రచన
5/21
దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం
శీర్షిక:రఘురాముడు.
రఘురాముడు ఇనకులసోముడు
కోదండరాముడు కారుణ్యధాముడు
అయోధ్యారాముడు ఆరాధ్యదేముడు
కౌసల్యాతనయుడు కమలలోచనుడు
సోదరులకు అనురాగరాముడు
అగ్రజునిగా అవతరించాడు
ఆదర్శమూర్తిగా నిలిచాడు
పితృవాక్యపరిపాలకుడు
ప్రజారంజకుడు
సితాపతిగా పేరొందినాడు
ఏకపత్నీవ్రతుడై ప్రేమించినాడు
లోకనిందకు తలవంచినాడు
తన సతిని అగ్ని పరీక్షకు గురిచేసినాడు
కన్నబిడ్డలతోడ కదనము సల్పినాడు
రఘరాముడు పరంధాముడే జగతిలోన.

ఇది నాస్వీయరచన.
6/22

తేదీ 14-01-2024
రచన: కె వి రమణాచారి
 తెలుగు పండితులు
నిజామాబాద్ జిల్లా
ఆది వారం

అంశం: *ఒక్కటి*
రాముని మాట ఒక్కటే
రాముని బాట ఒక్కటే
రాముని ధర్మమొక్కటే
రామ న్యాయమొక్కటే
రామరాజ్యమొకటే
రాముని భార్య ఒక్కటే
రాముని ప్రేమ ఒక్కటే
రాముని అభిమానం ఒక్కటే
రాముని చేత ఒక్కటే
రాముని వెలుగు ఒక్కటే
రాముని తేజం ఒక్కటే
రాముని అవతారం ఒక్కటే

ఇది నా స్వీయ రచన.
7/23
[14/01, 7:00 pm] Siimhadri Vani Poetess: కవన జ్యోతి
కవితాగానం సీజన్--4
తారీఖు:--14/1/2024
వారం:-- ఆదివారం
శీర్షిక:-- అయోధ్య రాముడు
రచన:-- సింహాద్రి ‌వాణి
ప్రక్రియ:-- గేయం
ఊరు:--‌విజయవాడ
చరవాణి:--7569820872

రఘువంశాంబుధి ‌చంద్రుడా
దశరధాగ్రజ‌ వంద్యుడా
తండ్రి మాటకై‌ రాజ్యము నొదిలీ
సీతాలక్ష్మణ సమేతముగా
కానల కేగిన‌ ధన్యుడా
అవతార పురుషుడా,  
ఇల నవతరించీ, సామాన్యుని‌ వలెనే
బాధలు పొందిన ముల్లోకాలకు వంద్యుడా,
జగత్తంతటికి‌ ఆదర్శవంతమై
ఇలలో నిలచిన మాన్యుడా,
అన్నదమ్ములకు‌ ఆలుమగలకూ
అనుసరణీయము నీ చరితం
ఒకే బాణము‌ ఒకే పత్నియని
ఘనత వహించిన రాముడా!
పాపాలను బాపే నామము‌ నీది
శాపాలు తీర్చే రూపము నీది
సత్ప్రవర్తననకు నిలయం నీవు
సత్య ధర్మముల నెలవే నీవు
ఆంజనేయుడు నీ కమిత భక్తుడు
నీకే సాయం చేసిన శక్తులు
రామా, శ్రీరామా,
కౌసల్యరామ, కోదండ‌రామ అయోధ్యరామ రామా!
జానకిరామ జయ జయరామ శ్రీరామ రామ రామా!
కరుణించు రామ, కాపాడు రామ శ్రీరామ రామ రామా!!
హామీ:-- ఇది నా స్వీయ రచన.

8/24
9908568099
-------------------------------------+++---
కవన జ్యోతి/కవితా గానం
      సమూహము
అంశం:- శ్రీరామ కథ
తేది:14-01-2024. ఆదివారం.
+++++++++++++++++++++++
      శ్రీరామ కథ
     **********
దశరథ మహారాజు, కౌసల్యాదేవి
ముద్దుల తనయుడు శ్రీరాముడు,
జనకమహారాజు కుమార్తె సీతా
దేవిని పరిణయ మాడెను,
రాజ్యపట్టాభిషేకం చేయవలసిన 
రోజుననే అరణ్య వాసమునకేగెను,
లంకాధిపతి దశకంఠుడు రావణుడు
సీతాదేవిని అపహరించి గాను,
హనుమంతుడు, విభీషణుడు
సహాయముతో శ్రీరాముడు
రావణుడిని సంహరించెను,
అయోధ్యా పురికి వచ్చిన పిమ్మట
శ్రీరామ పట్టాభిషేకం జరిగెను,
శ్రీరాముని పాలనలో న్యాయము
 నాల్గు పాదములు నడచింది,
శ్రీరామ జయరామ అయోధ్య రామ
జయుము విజయము సీతారామ!
హామి:-ఇది నా స్వీయరచన.
*****************************
9/25
9493273114
కవితా గానం సీజన్ 4
పేరు కొంజేటి రాధిక
ఊరు రాయదుర్గం

తపస్సు ఒనరించినా, ఒనరించకపోయినా శ్రీరామచంద్రుడు సకల గుణాభిరాముడు... 
 రావణుడు తపస్సును ఆచరించి, ఎన్నెన్నో వరములను పొంది, విశ్వ విజేత అయినా,
 పర స్త్రీ వ్యామోహమనే ఒకే ఒక్క బలహీనత చేత నిందలపాలై తన పతనానికి తానే రహదారిని ఏర్పరచుకొని, చరిత్ర హీనుడిగా మిగిలిపోయాడు రావణుడు...
 అత్యంత బలపరాక్రమవంతుడు ఇంద్రియ నిగ్రహము చేత శివుణ్ణి ప్రసన్నం అందించుకున్న అపర మేధోసంపన్నుడైనా పరస్త్రీ వ్యామోహం అనే ఒకే ఒక్క బలహీనతే అతడి అంతానికి కారణభూతమైంది రామాయణంలో....
 కామ క్రోధ లోభ మదమాత్సర్యాలను జయించలేని ఏ బలహీనతైనా అతః పాతాళానికి తొక్కేస్తుందన్న నగ్న సత్యాన్ని లోకానికి చాటి చెప్పిన గాధ రావణుడిది...
 బలహీనత విజయ గెలుపోటముల ఆటలో విజయాన్ని అందుకోనివ్వదు‌..
 గెలుపు బావుటా ఎగురవేయనీయదు... రంకలేసే ఆరాటాన్ని ఆపి వ్యామోహం చిత్తు చేస్తుంది ప్రగతి పథంలోకి పయనించనీయక... సమర్థవంతుడైన రావణుడి జీవితం వ్యామోహపు ఊబిలో కూరికిపోయి,
గర్వము దురహంకారం చేత చరిత్రహీనుడిగా మిగిలిన అతడి జీవితంలో ఎన్ని సాధించిన,
 ఎంత పేరు ప్రఖ్యాతులు పొందినా మచ్చలు మాత్రం ఏ త్యాగాల ఎరేజర్తో రుద్దినా చెరగవు...
శ్రీరామచంద్రుడి రామాయణ గాధ ఎన్నెన్నో పాఠ్యాంశాలను నేర్పే పాఠ్య పుస్తకం.
10/26
కవితాగానం 
14/1/2024 ఆదివారం
అంశం..రామావతారం- రామాయణకావ్యం 
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336

ఆరుకాండలగ్రంథం రామాయణం
అసురసంహారానికే రామాయణం
అందాలరామునికధే రామాయణం
ఆదర్శవంతకావ్యమే రామాయణం

పితృవాక్యపరిపాలన ఈకావ్యము
సోదర ప్రేమాభరితం ఈ కావ్యము
ఏకపత్నివ్రతనిదర్శనం ఈ కావ్యము
హనుమ భక్తికి ప్రతీక ఈ కావ్యము

వాల్మీకిచే విరచిత పురాణ గ్రంథం
శోకముచే శ్లోకంపుట్టిన మహాగ్రంథం
భక్తి ముక్తి ప్రదము ఈ పుణ్య గ్రంథం
పవిత్రమైన రామ కథయే ఈ గ్రంథం

ప్రజారంజకుడు శ్రీరామచంద్రుడు
అవతారపురుషుడు శ్రీరామచంద్రుడు
లవకుశులజనకుడు శ్రీరామచంద్రుడు
లోక కల్యాణప్రదాత శ్రీరామచంద్రుడు

భార్యాభర్తల అనురాగం రామకథ
తల్లిదండ్రుల ప్రేమబంధం రామకథ
సత్వాక్యపరిపాలనభరితం రామకథ
ఇహపరసుఖములనొసంగు రామకథ

హామీ పత్రం
ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను.తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
11/27
కవన జ్యోతి
కవితా గానం సీజన్ - 4
శీర్షిక : శ్రీరాముడు   


తండ్రి మాటని జవదాటని ఆదర్శం  
గురుభక్తికి నిదర్శనం
సహోదర వాత్సల్యానికి నిలువెత్తు రూపం
కట్టుకున్న భార్య కి అమృతమయమైన ప్రేమను పంచిన
మహోన్నత వ్యక్తిత్వం
రామనామమే సర్వస్వంగా భావించిన 
హనుమ భక్తికి మెచ్చి 
అక్కున చేర్చుకున్న దైవ స్వరూపం
దుష్టుడైన రావణుడ్ని వధించిన ధీరత్వం
ఎంగిలి పండ్లు అందించిన శభరిమాత ను కరుణించిన   
కారుణ్య స్వరూపం
శాపగ్రస్తురాలై శిలగా మారిన అహల్య కు 
శాపవిమోచనం గావించిన దయాస్వరూపుడు
వైకుంఠవాసి గా సకల వైభోగాలతో వర్ధిల్లుతూ ..
సకల సుగుణాల నిజ స్వరూపమై 
మానవ జన్మ సార్థకత చేకూర్చగా ఇల చేరిన....
మహావిష్ణువు స్వరూపమే శ్రీరాముడు ! 

                                                - గొర్రెపాటి శ్రీను

15/01/2024

1/28

కవిత గానము
15.1.24 ... సోమవారం
అంశం:: రామ చరితము
రచన:: కవిత వెంకటేశ్వర్లు
ఊరు:: కర్నూలు
సెల్::8309920625
శీర్షిక:: దేవుడైన రాముడు

దశరథ సూనుడు
ధర్మ పరాయణుడు
సత్యసంధుడు
మాట తప్పని ధీరుడు
ఆవేశము లేని వాడు
కోపము చూపనివాడు
బల పరాక్రమ సంపన్నుడు
ఆజానుబాహుడు
సుందర రూపుడు
సుమధుర వాక్కువాడు
మందస్మిత వదనుడు
అభయహస్త వీరుడు
స్నేహానికి ప్రాణమిచ్చువాడు
రాతిని నాతిగా మార్చినాడు
దయా గుణము కలవాడు
ధర్మపథమున నడుచువాడు
భార్యవియోగము భరించినాడు
మారుతి సాయముతో సీత
జాడ నెఱిఁగినవాడు
సుగ్రీవాది వానర సేనతో
రణమున రావణుడుని
హతమార్చినాడు
సద్గుణరాశి యతడు
రావణ మరణాంతరము
అతని బోధకై సౌమిత్రిని
పంపిన పూజ్యుడు
రావణునిలో ఉన్న జ్ఞాన
సంపత్తిని ఏరిగినవాడు
జానకి మాతతో అయోధ్య
నేలిన దశరథరాముడు
దేవునిగా నిలిచిన శ్రీరాముడు!!
      
                  కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు 8309920625
ఈ కవిత నా స్వీయ లిఖితమని హామీ

2/29

[15/01, 7:00 pm] SRINIVASA CHARY Gajavelli: కవితాగానం సీజన్ 4
...
కవితా శీర్షిక: రామాయణం 
గజవెళ్ళి శ్రీనివాసాచారి 
కాజీపేట 
...
రామాయణం 
మహాకావ్యమే కాదు 
ఎన్నో జీవిత పాఠాలు బోధించు 

బాలకాండలో 
రాముడు విలువిద్య, 
ఆటలు నేర్చుకున్నాడుగా 
ఆటల వలన 
జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా 
ఎదుర్కునే సామర్థ్యం పెంచునుగా 

పెద్దలను గౌరవించాలని 
తండ్రి ఆదేశాలు పాటించాలని 
బోధించేది అయోధ్య కాండ 

అరణ్యవాసంలో 
ప్రకృతితో మమేకమై 
వనాలను సంరక్షించెను ప్రభువు 

కిష్కింధ కాండలో 
ఆత్మవిశ్వాసం బలంగా 
లక్ష్యం సాధించెను హనుమ 

ధైర్యసాహసాలు 
సమయస్ఫూర్తిని 
నేర్పింది సుందరకాండ 
యుద్ధకాండలు 

రామాయణం నిత్యం పఠిస్తే
మనసులోని మాలిన్యాలు తొలగి 
శాంతి సౌభాగ్యాలు కలుగునుగా 

నిత్యం రామనామ జపము
పాపములను భస్మం చేసి
ఆనందము, శాంతి ప్రసాదించు

3/30
[15/01, 7:00 pm] కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు Poet: కవిత గానం కవనజ్యోతి సమూహ పక్షాన రామాలయం ప్రారంభం చేయబడుతున్న సందర్భంగా కవిత గోష్టి
తేదీ 15 జనవరి 2024
శీర్షిక ::::శిష్యరికం
స్వీయ రచన::: కేశరాజు వెంకట ప్రభాకర్ రావు హైదరాబాద్ (ప్రస్తుతం)


మారీచ సుబాహులనే రాక్షసులు 
తన యాగాన్ని విధ్వంసం చేస్తున్నారనీ
వారిని సంహరించి యాగాన్ని పరిరక్షించడానికి
రాముని తనతో పంపమనీ దశరథుని కోరాడు
విశ్వామిత్ర మహర్షి నిండు రాజ సభలో!!


పదిహేను వత్సరాల పసి బాలుడు 
కౄర రాక్షసును నిలువరించ జాలడనీ,
 తానే సైన్య సమేతంగా వచ్చి యాగ రక్షణ చేయడానికి అనుమతించమనీ దశరథుడు అర్ధించాడు!!

సమ్మతించని విశ్వామిత్రుడు 
ఆగ్రహించడంతో
అతని తపఃశక్తికి భయపడి వేరే మార్గం లేక
కుల గురువు వసిష్ఠుని సలహాతో
రామునీ, లక్ష్మణునీ విశ్వామిత్రునితో ఆశ్రమానికి
పంపిన దశరథుడు దుఃఖ భారంతో కుంగి పోయాడు!!


మార్గంలో ముందుగా 
విశ్వామిత్రుడు బల, అతిబల అనే తేజోవంతమైన విద్యలను రామ ,లక్ష్మణులకుపదేశించి 
వాటివలన అలసట, ఆకలిదప్పులు కలుగవని
అవి అంతటి మహిమాన్వితమైన శక్తులని తెలిపాడు!!


ఆ రాత్రి మువ్వురూవిశ్రమించి 
తెల్లవారి లేచిన విశ్వామిత్రుడు 
కౌసల్య కడుపు చల్లగా ఉండుగాక. 
రామా. తెల్లవారింది. మేలుకో, 
ఆహ్నికాలు నెరవేర్చుకో" అని ప్రబోధించాడు.

ఆ తదుపరి కర్తవనిష్ఠలో భాగంగా
తాటక వధ చేసినా వదలక,
యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి వచ్చిన
మారీచ సుబాహు, రాక్షసులను 
శేతేశువుతో మారీచుని నూరామడల దూరంలోని సముద్రంలోకి విసిరి...
ఆగ్నేయాస్త్రంతో సుబాహుని దండించాడు !!

 వాయువ్యాస్త్రంతో అందరినీ తరిమికొట్టి 
యజ్ఞం నిరుపద్రవంగా 
నిర్విఘ్నంగా జరుగుటకు తమ శక్తి యుక్తులను
ధార పోసినారు ఆ దశరథనందనులు!!


ఆ తదుపరి విశ్వామిత్రుడు మిక్కిలి సంతోషించి 
రామలక్ష్మణులను దీవించి, 
అనేక దివ్య శస్త్రాస్త్రాలు, వాని ప్రయోగ ఉపసంహార క్రమాలు ప్రసాదించాడు !!

ఆ క్రమంలో 
ప్రవేశించారు సిద్ధాశ్రమం 
ఒకప్పుడు అది త్రివిక్రముడైన శ్రీ వామనమూర్తి 
ఆశ్రమం ,
అక్కడ రామలక్ష్మణులు విశ్రాంతి కుపక్రమించారు!!

మరునాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటనిడుకొని జనక మహారాజు చేసే యజ్ఞాన్ని చూడడానికి మిధిలానగరానికి బయలుదేరాడు.


ఇది నా స్వీయ రచన

4/31

కవిత గానం సీజన్ 4
కవన జ్యోతి

తేదీ 15-01-2024
రచన: కె వి రమణాచారి
 తెలుగు పండితులు
నిజామాబాద్ జిల్లా
సోమ వారం

అంశం: *ఒక్కటి*
అల వైకుంఠ పురము నుండి
ఇలలో అయోధ్యపురానికి
వేంచేసిన విష్ణుమూర్తి అవతారం రాముడు
శ్రీ లక్ష్మీ అవతారమే అయోనిజ సీత మ్మ
ఆదిశేషు దిగివచ్చే లక్ష్మణుడై చెంత
శంకరుని అంశనే ఆంజనేయ భక్తి
తపశక్తి ఋషులందరూ బంధువర్గమంతా
భారతదేశ భూమంతా రాముడు నడయాడిన రాజ్యమంతా
రామ పతం నడిచింది ఈ జగమంతా

ఇది నా స్వీయ రచన.


5/32
కవితా గానం సీజన్ 4
పేరు కొంజేటి రాధిక
ఊరు రాయదుర్గం

రామ పాదము సోకినంతనే రాయి అహల్యగా మారినది కదా అని గుహడు సీతారామ లక్ష్మణాధులను తమసా నదిని దాటించి నప్పుడు వాళ్ల పాద దూళికి తన పడవ ఏమవుతుందోనని సందేహించి ,
గుహుడు అతని పాదాలను స్పృసిస్తూ జన్మ ధన్యము అయినదని ఆనందించగా....
 రాజ భోగభాగ్యములను ఆనందంగా అనుభవించాల్సిన సీతారామ లక్ష్మణులకు నార బట్టలలో వేషధారణలో చూచి, కన్నీరు మున్నీరై, కందమూలాలను సగి శ్రీ మహా విష్ణుమూర్తి అవతారంలోనున్న శ్రీరాముడికి సపర్యలు చేసి తన జన్మకు సార్థకతనందించకున్నాడు కష్టం వచ్చినా,
 సుఖం కలిగినా కలత చెందక,
  కర్మ ఫలమును అనుభవించాల్సిందేనని మానవ మాతృడిగా తన కర్మ ఫలాన్ని అనుభవించినాడు ఎన్నెన్నో సంఘటనలతో శ్రీరామచంద్రుడి భగవంతుడుగా తన మహిమలను చూపి, భక్తుల విరాళంలో వేలకోట్లదిరూపాయలతో ఆలయాన్ని నిర్మింప చేసుకున్న ఘనత శ్రీ రామచంద్రుడిది....
  ఐదు వేల సంవత్సరాలైనా, ఐయేళ్ళయినాదొందల శ్రీరామచంద్రుడి అజరామరం
6/33
కవితా గానం: సీజన్ 4
శీర్షిక: ఎక్కుపెట్టు రామా!
రచన : ఎన్‌.నరేశ్ చారి
సెల్    : 9701334516

ఎక్కుపెట్టు రామా !
*************************
అప్పుడే 
నీ పనేమైపోలేదు రామా!
ఎక్కుపెట్టాల్సిన బాణమేదో
చేయాల్సిన యుద్దమేదో
ఇంకా మిగిలే ఉంది

ఇప్పుడిక్కడ
గల్లీకొక శూర్పణఖ
గ్రామానికొక రావణుడూ
నీవు లేవనుకొని
వీరవిహారం చేస్తున్నారు

మనసు మార్చే మంథరలూ
దుర్బోధచేసే అకంపనులూ
శుభకార్యాలకడ్డొచ్చే సింహికలూ
కాపురాలు కూల్చే పనిలో
తీవ్రంగా నిమగ్నమయ్యారు

కుంభకర్ణుడు లాంటి సోదరుడూ
ఇంద్రజిత్తు లాంటి తనయులూ
చెడుకు ఇంకా 
వత్తాసు పలుకుతూనేవున్నారు

లక్ష్మణుడులాంటి 
తమ్ముళ్ళు కరువై
హనుమంతుడు లాంటి 
కార్యశూరులు కరువై
సుగ్రీవుడు లాంటి మిత్రులు కరువై
విభీషణుడు లాంటి
విచక్షణాశీలురు కరువై
ధర్మదేవత కన్నీరు కారుస్తోంది

తీరిక వేళలో వస్తావో
తీరిక చేసుకొని వస్తావో
ధర్మదేవత కన్నీరు తుడవడానికి
అమ్ములపొదిలో దాచుకున్న బాణాన్ని
త్వరగా ఎక్కుపెట్టు రామా !
త్వరగా ఎక్కుపెట్టు 

          - ఎన్.నరేశ్ చారి
7/34

కరుణా తరంగితహృదయంతో ఆదికవి ఇతిహాసంగా..
తరతరాలకు ఆదర్శంగా తీసుకునే గాధగా..
దాసభక్తికి నిదర్శనంగా నిలచిన మారుతి వీరగాధగా..
"సీతాయాశ్చరిత" మని వినుతి గాంచిన సీతారామంగా
మండోదరి, తార వంటి సతీమతల్లుల గాధా లహరిగా..
రామాయణ సాక్షాత్కారమంటే మాటలా?
సుమంత్రునివంటి మంత్రులు, సుగ్రీవునివంటి మిత్రులు,
జనకుని వంటి రాజర్షులు, విశ్వామిత్రుని వంటి గురువులు,
భరత, లక్ష్మణుని వంటి తమ్ములు, ఋష్యశృంగుని వంటి ఋషి,
"యోగవాసిష్ఠమ" నే గురు హిత బోధలు, అధ్యయనాలు,
శ్రవణకుమారుని వంటి "మాతాపితరుల" సేవానిరతుడు,
"రామాయణరత్నమాల"లోనే కనిపించే విలువైన వజ్రాలు!!
"జననీ,జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ" అనే భాషితం,
ఎంత వైరమున్నా, మరణానంతర ద్వేషాలుండరాదనే హితవు,
పితృవాక్య పరిపాలన సుతుల కర్తవ్యంగా మనిషికి నేర్పే దైవం,
"ఒకే బాణం, ఒకే మాట, ఒకే పత్ని" అనేదే యుగయుగాల నినాదంగా..
సత్య,ధర్మ,వీరాలే నాయక లక్షణాలంటూ చాటుతూ.. "పరదారాగ్రహణం " పతన హేతువని చాటే రావణసంహారం,
స్వచ్ఛభక్తియే ముక్తి హేతువనేలా గుహుడు, శబరి ఉదంతాలతో..
దుష్టశిక్షణ కర్తవ్యంగా కబంధాది వేలాది శత్రుసంహార శౌర్యప్రదర్శనలతో..
అధర్మం అపజయం తెస్తుందని చాటే "వాలి-వధా "ఘట్టం,
పశ్చాత్తాపమే పాపం పోగొట్టి పరమాత్మ పాదస్పర్శ కల్గించగలదనే అహల్యకథ,,
ప్రజారంజకత, శరణాగత రక్షణ రాజకర్తవ్యాలంటూ చాటేలా..
 మన రామాయణం భారతీయుల వారసత్వపు నిధి కదా!
"ఎంత భాగ్యమో!"కదా! కొంతైనా అందుకుందామా!?

                                      **********

వేమూరి.సత్యవతి.
విజయవాడ.
9885136308.

8/35
......కవితగానం .......

అంశం ...రామ నామ స్మరణ లేని        
              ఊరు ఉండదు ...
               
శీర్షిక .....ప్రతి గ్రామం ఒక 
               అయోధ్య ..

పేరు . ఏ .భూపతి
హైద్రాబాద్ 9989218154


తండ్రి మాట కై వనవాసం
గురువు మాటకై రాక్షస వధ
మారీచుడు , రవాణా బ్రహ్మ ల
మారు వేషాలు ,.........

 బిక్షమడగ వచ్చే ,
భిక్ష నిచ్చిన సీతమ్మను 
మోసం తో తీసుకొని వెళ్లి 
లంకలో అశోక వనం లో శోకాన్ని
మిగిల్చే , వానర చెలిమి తో 
సముద్రాలు దాటి రావణ
వధ గాంచి సీతమ్మని 
గైకొని రాజ్య పట్టాభిషేకం 
తో ధర్మ పాలకుడై ప్రజా పాత్రుడై
లోక కల్యాణ మూర్తి గా వెలుగొందినాడు ...
ఇంటే రామాయణం వినాలి 
రాముడు తండ్రి మాట దాటలే
తల్లి ప్రేమ లో కొరత నివ్వలే 
ఏక పత్ని వ్రతుడు ,ధైర్యం
సాహసం ,యుద్ధ సామర్థ్యం 
ఆడిన మాట తప్పని దీక్ష ,సాహస
సుందర మూర్తి , అన్నదమ్ముల
అనుబంధం ,రాక్షస సంహారం
ప్రజనుబంధ పాలన , ధర్మం
న్యాయం , ఒకటే మాట ,ఒకటే బాణం , తో లోక కళ్యాణార్ధం జీవితం సాగించిన మహా నాథుడు
అయోధ్య రాముడు ...రామయ్య
గుడిలేని ఊరు , రామనామ స్మరణ చేయని హిందు వు 
ఉండడేమో ఇండియాలో
హిందువు గా పుట్టిన 
ప్రతి బిందువు రామనామ 
స్మరణ లో నే ఉంటుంది ...
జరగ బోయే అయోధ్య 
రామయ్య పండగ రోజు ప్రతి
గ్రామం ఒక అయోద్యగా 
దర్శించు కుందాం .....

ఈ కవిత నా సొంతసం అనువాదం కాదు ....

9/36
. కవితా గానం
అంశంశ్రీరాముడు

1తే.గీ: రామచంద్రుని రూపము రహిని గాంచ
కాన లోన నెదురు జూసె కాంత శబరి
అనుజు తోడ రాముగనిన యతివ తనదు
కన్ను లబ్బెను ఫలమును గాంచె నెదుట.

  
2.తే.గీ:రాక రాక వచ్చితివి శ్రీ రామచంద్ర
         యేళ్ళ తరబడి యిచటనె వేచి యుంటి
          ఫలము లెన్నొ దెచ్చితినిట వరుసగాను
          నొసగ సిద్ధపడితినయ్య నోరు తెరువు.

3.ఆ.వె:రవిజు భయము నుడిపి రామచంద్రునితోడ
         మైత్రి జేసె గాదె మారుతియును
        వాలి నొక్క కోల వధియించె రాముండు
       హరుష మొంది రెల్ల హరులు గూడి.

4.తే.గీ:రాక రాక వచ్చితివి శ్రీ రామచంద్ర
   నీ కొరకు వేచి తిమి కరుణించు మమ్ము
        సకల శుభముల నొసగెడి చక్కనైన
       పేరు పలికించు సతతమ్ము పేర్మి తోడ.

5.కం;ధారుణి యందున బుట్టెను
      నారాయణుడే దశరథ నందనుడై తా
      నారావణుజంపగనిల
      కారణ జన్ముడు జగతి నఘమ్ములు బాపెన్.

డా బల్లూరి ఉమాదేవి

10/37
కవనగానం
అయోధ్యారామునికి కవితార్చన
తేదీ:15-01-2024,సోమవారం
శీర్షిక:శ్రీరాఘవం!
దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం

శ్రీరాఘవం రఘవంశతిలకం
దశరాత్మజం
దశకంఠసంహారణం
సుగ్రీవ సంరక్షణం
వాలి సంహారం
వీభీషణ లంకాపట్టభిషేకం
హనుమంత భక్తి స్వీకారం
సౌభ్రాతృత్వ సందేశం
వనవాసజీవనం
సరళ సామాన్య జీవనం
సకలజనుల సంక్షేమం
సుపరిపాలన సంప్రాదాయం
రామరాజ్య స్థాపనం.

ఇది నాస్వీయరచన.



16/01/2024

1/38
అయోధ్య రామయ్య కు కవితాభి 
        ........షేకం........16.1.24
 అంశం...రామనామ తీర్థం రమ్యమైనది....

రామ నామ పారాయణంతో
తొలగి పోవు సర్వ పాపములు
రామాజన్మ భూమిలో శిలలే కంటి
సిరులై , మదిని మురిపించును ,
రామ నామ జపం అన్ని విజయాలకు దారి చూపును ,
అయోధ్య రాముడు అందరి వాడు 
తెలంగాణ గడ్డ లో తొలిచిన , తోడిగిన , భక్తి రస .. ఆభరణాలు ,అలంకరణలు , అయోధ్యలో మురుస్తూ ...
ప్రపంచానికి కన్నుల పండగ గా
కీర్తి కిరీటమై అలరించునెపుడు
మానవాళి ఆరాధ్య దైవం 
అయోధ్యలో కొలువైనా,భరత
గడ్డ పైన ఊరూరా పండగలో
రమ్య మైన రామ నామ తీర్థం తీసుకుందాం రండి ...

ఈ కవిత నా సొంతం ,అనువాదం కాదు ........
2/39

కవితా గానం
సీజన్ 4
కవితా శీర్షిక:శ్రీరాముడు
డా బల్లూరి ఉమాదేవి.

1ఆ.వె:పసిడి జింక యొకటి వనమున దిరుగంగ
       పడతి సీత తాను వాంఛ చేయ
       దనుజ మాయ యనుచు దలచియు రాముడు
       ముదిత కోర్కె దీర్చ ముందు సాగె.

2.కం:మారీచుని యరుపులు విని
     యారామున కాపదయ్యె నని దుఃఖింపన్
     భారంబగు మది తోడను
    తా రయమున నేగె జూడ తమ్ముడు వడిగా.

3.ఆ.వె:యతిగ రూపు దాల్చి యరుదెంచె రావణుం
       డతివ నపహరింప నాశ తోడ
       బిక్ష నిడగ రాగ వెలది సీతను బట్టి
      పుష్పకంబు నెక్కి పురిని చేరె.

4.ఆ.వె:ధరణిజను వెదుకుచు తమ్మునితో సాగ
       శబర కాంత గాంచి సంతసాన
      యాశ్రమంబు నందు నందివ్వ ఫలములన్
      యారగించి ముక్తి యతివ కొసగె.

5ఆ.వె:సీత జాడ లేక శ్రీరాము డడలుచు
        వెదుక సాగె వనిని వేదనమున
        పవన పుత్రుని గని పరమ హర్షము నంది
        చేరి రవిజు తోడ చెలిమి చేసె
3/40

9493273114
కవితా గానం సీజన్ 4
పేరు కొంజేటి రాధిక
ఊరు రాయదుర్గం

దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై యుగయుగానా భక్తులను ఆదుకోవడానికి,
 లోక కంటకులను జయించి,
 లోక కళ్యాణార్థం
 త్రేతా యుగసారథిగా దశరథుని ఇంట కౌసల్య ముద్దుల పంటగా జన్మించాడు ఆ అయోధ్య పురాదీసుడు శ్రీరామచంద్రుడు... పితృవాక్య పరిపాలకుడిగా జనుల అభీష్టం మేరకు, జనులు కాంక్షించే పరిపాలనా దక్షుడిగా ప్రజల సంక్షేమానికై ప్రజల మనసెరిగి ,
ప్రజల కోసం ఆజన్మాంతం కృషి సల్పిన రారాజు శ్రీరాముడు...
 సద్గుణాలే కాని దుర్గుణాలు లేని మచ్చలేని శ్రీరామచంద్రుడు మానవ మాతృడిగా జన్మించి, అందరి మన్ననలను పొంది విశ్వామిత్రుడి ప్రియ శిష్యుడిగా,
 ఆ మారుతి మదిని గెలిచి,
వానరసేనల అందరి మదిలో చోటుచేసుకుని అందరి అభిమానాన్ని చురకొన్న శ్రీరాముడు రావణ సంహారం తోటి సీతామాత చేకొని, లవకుశల పట్టాభిషేకమొనర్చి, అజరామరమైన కీర్తిని సంపాదించుకున్న భగవానుడు మానవుడిగా తనకెన్ని మహిమలున్నా సామాన్యుడిగా కష్టనష్టాలను అనుభవించిన మహానుభావుడు శ్రీరాముడు...
 శ్రీరామ నామము సకల సౌభాగ్యములను ఇచ్చే తారకమంత్రం....
పాపములను బస్మీపటలం చేసే మంత్రం...
 జన్మ ధన్యతనొందించే మంత్రం శ్రీరామ నామం...
సకల కష్టాలకు, సకల రోగాలకు ఔషధం శ్రీరామ మంత్రం.
4/41
కావ్యగానం
తేదీ:16-01-2024,మంగళవారం
అయోధ్యారామునికి కవితార్చన
శీర్షిక:కళ్యాణ రాముడు
దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం.
కళ్యాణరాముడు కౌవల్యధాముడు
కాంచనసీతతో కార్యము సాధించినాడు
సకలగణాభిరాముడు సందేహించినాడు
పరులనిందకు కట్టుబడినాడు
వీరుడై ధీరుడై రాజ్యమేలినాడు
వనవాసియై విరాజిల్లినాడు
పినతల్లి కోరికను తీర్చినాడు
సొదరభరతునికి పట్టంగట్టినాడు
సౌమిత్రిని తోడుగా సాగినాడు
అనాటి రాముడినే అయోధ్యకు రానున్నాడు
ప్రాణప్రతిష్టకై సిద్దమవనున్నాడు
దేశప్రజలందరు ఎదురుచూస్తున్నారు
సర్వజనరంజకముగా ఏర్పాట్లు చేయుచున్నారు
రామభక్తులందరు ఆనందతరంగితులవుతున్నారు
శ్రీరామ జరరామ జయజయరామ.

ఇది నాస్వీయరచన.
5/42
అయోధ్య రాముడు

రాక్షస సంహారం చేసి   
సీతా లక్ష్మణులతో కలసి రాముడు అయోధ్యకు చేరాడు. 
త్రేతా యుగంలో అల నాడు.
యుగం మారింది 
కాలం మారింది  
కాలధర్మం మారింది 
అసురులు అంతరించినా
రామమందిరం మరుగైంది భూస్థాపితమైంది. 
ఉన్నట్లుండి ఏగాలివీచిందో సమాధి నుండి బయటపడ్డాడు రాముడు ఊరూరా ఇంటింటా పచ్చని తోరాణాలు వెలిగిను దీప కాంతులు
ఆకాశం పూల వాన కురిపించింది 
వాయునందనుడు సురలు రామ నామాల హోరుకు దిగి వచ్చారు అయోధ్యరామునికి స్వాగతం పలుకుతున్నారు

 లలితా చండి
 హైదరాబాదు  
9885552922
 నాస్వీయ రచన✍️

6/43
కవితా గానం సీజన్ 4
తేదీ: 16.01.2024.
అంశం : 
అయోధ్యా రాముడు
శీర్షిక: 
మానవలదు 
మానవులు సద్ధర్మాచరణ!!

సత్ఫలితాల సాధనకై ప్రధాని అలనాడు అయోధ్యా పర్యటన!
శతాబ్దాల నిరీక్షణ 
కాంక్ష నెరవేరి సుందర రామ విగ్రహప్రతిష్టాపన!!

యావద్భారతీయుల
చెరగని తరగని
హిందుత్వ మనోభావన!
యుగ యుగాల
ఘన చరిత్ర కలిగి
సాకారమై పునరాగమన!!

తొణికిసలాడునట్లు 
రోమ రోమములో రామనామ భావన!
మూర్ఖత్వం వదిలి ఐక్యతా సఖ్యతల ఏకత్వపు సద్భావన!

స్వ ధర్మాచరణల 
నిత్య సేవలకై బాలరామ 
విగ్రహ ప్రతిష్టాపన!
అయోధ్యా సమస్య పరిష్కరణ తదుపరి
దేవాలయ నిర్మాణము దేదీప్యమాన!

అతులిత సచ్ఛరిత కలిగిన రాముని సత్యవాక్పరిపాలన!!
సీతా సమేత రామ పరివార సేవలలో మనస్ఫూర్తి ఆరాధన!

నీతి నిజాయితీలతో మహత్తర మహత్తు
కలిగి నిలువెత్తు నిదర్శన!
వీరాంజనేయ స్వామి వారి భక్తి భావాలతో విజయ కేతన!

అను క్షణము క్రమ 
శిక్షణలు కలిగి రామ నామ ఆలాపన!
ఆదరణీయ భావాల ఆచరణ ధర్మాచరణల సహ జీవన!!

అలనాటి జీర్ణ దేవలయాల కంకణ బధ్ధతతో సముద్ధరణ!
న్యాయ నిర్ణయాల విధివిధాన నిబద్ధతల సత్వర పరిష్కరణ!!

అనుచిత విషయాల‌ నిరాదరణ సముచిత బాటలతో ఆదరణ!
వ్యక్తి గత పరిశీలనలతో వేగ జాగరూకత కలిగి ధర్మాచరణ!!

భావి తరాల వారికి తరగని 
భవ్యజీవన నాందీ ప్రస్తావన!
నీతీ నిజాయితీలతో నియమ 
బద్ధతలు కలగి సత్ప్రవర్తన!!
సర్వకాల సర్వావస్థలయందు మానవలదు సద్ధర్మాచరణ!!!

జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

7/44
అయోధ్యానగరిలో తేదీ 22- 1-2024 నాడు  ‌  శ్రీ బాల రాముని విగ్రహ ప్రతిష్ట.
(కవిత)

రచన :వి. వీరాచారి, కవిరత్న, దాశరధి పురస్కార గ్రహీత, వనపర్తి టౌన్ మరియు జిల్లాpin.509103
Cell.8897182796
తెలంగాణ రాష్ట్రం
............
రామచంద్రుడు జగత్ కళ్యాణ కారకుడు.
ఒక్క బాణము, ఒకే భార్యతో రాముడు.
నమ్మిన వారల నాదుకొనే రాముడు.
తండ్రి దశరథునాజ్ఞ పాటించి రాముడు,
పదునాలుగేండ్లు వనములకు జనె రాముడు.
వనములో సుగ్రీవ, హనుమంతులా దిగను,
శ్రీరాముతోడ నెయ్యము మొదలాయెను.
శ్రీరామునాజ్ఞచే వీరభక్త హనుమ
లంకలో సీతమ్మ జాడ జూడగ చనెను.
రాక్షసుల దునుమాడి, సీతమ్మ జాడగనె.
రావణుడి కంటబడి, తన తోక తోడనే,
ఎత్తయిన వేదికను గూర్చుకొని మాట్లాడె.
ఓరి వానర నీకింత కావరమ  ?
అని రావణుండురిమె, కళ్ళెర్ర జేసెను.
రావణాజ్ఞచె  హనుమ తోక నంటించిరి.
తోకనంటించంగ, శ్రీరాముదయతోడ,
హనుమ వాలము చల్లగా దోచెనప్పుడు.
లంకానగరి గాల్చి కిష్కింద  కరుదెంచే.
ఆ నాటి రామాయణమ్మందరీ మదిలొ,
తెరలు ,తెరలుగ జ్ఞాపకం వచ్చునటుల,
యిప్పుడయోధ్యా నగరిలో బాల రాముని
విగ్రహము ప్రతిష్టగా వింతురో సఖులారా!
జనులంత శ్రీరాము నామము జపించండి!
ఆ మహాకార్యము జయప్రదం చేయండి!

🍀🍀🍀
8/45
కవితా గానం(సీజన్4)కవన జ్యోతి ఆధ్వర్యంలో
అయోధ్యలో శ్రీరామచంద్రుని ప్రతిష్ట సందర్భంగా
పేరు:-
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
ఊరు:-విశాఖపట్నం
చరవాణి:-9963265762
శీర్షిక:-
వసుదైకానికే ఆదర్శం
............................
పితృవాక్ పాలకునిగా భార్య సీతమ్మతో
కాననలకేగిన శ్రీరాముడు.

గురువాజ్ఞను పాటించి ఆదరక బెదరక
యజ్ఞక్రతువును కాపాడిన శిష్యుడు రామచంద్రుడు.

అహల్య శాప విమోచనం గావించి
శబరి ప్రేమానురాగాలతో ఇచ్చిన రేగుపళ్ళను స్వీకరించిన స్త్రీ జనోద్దారకుడు.

ధర్మపత్ని సమాచారం చెప్పిన పక్షి జటాయువు దహన సంస్కారాలు చేసి ఉత్తమ గతులు అందచేసిన పుణ్యమూర్తి.

సీతమ్మ జాడ కనుగొనిన ఆంజనేయుని సోదర భరతసమానయని కౌగిలించుకున్న స్నేహశీలి.

శత్రుసమూహానికి చెందిన విభీషణునికి ఆశ్రయమిచ్చిన శరణాగతవత్సలుడు.

వారధి నిర్మాణంలో చిరుప్రాణి ఉడుతకు కూడా మోక్షమునిచ్చిన కరుణామయుడు.

అయోధ్యలో శ్రీరాముని పాలన సుపరిపాలన.
ధర్మానికి ప్రతిరూపమే శ్రీరామచంద్రమూర్తి.

అందుకే శ్రీమద్రామాయాణం వసుదైకానికే ఆదర్శం...!!
............................

ఇది నా స్వీయకవిత 
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
 (పుష్యమి)
విశాఖపట్నం.
...........................
9/46
కవితాగానం సీజన్ 4
...
గజవెళ్ళి శ్రీనివాసాచారి 
కాజీపేట 
...
శీర్షిక: రామనామము 
...
రామ నామము 
మధురాతి మధురము 
మహిమాన్వితము 
పవిత్ర నామము
దివ్య నామము

రాముడే పరబ్రహ్మము 
రాముడే పరమ తపస్సు 
రాముడే. తారకబ్రహ్మము 

రామనామములో 
ర కారము అగ్ని బీజము 
అ కారము సూర్య బీజము 
మ కారము చంద్ర బీజము 

రామ మంత్ర జపము 
పాపములను నశింపచేసి 
పరమశాంతిని ప్రసాదించు 

శ్రీరామచంద్రుని కంటె 
రామనామము గొప్పది 
రామ నామము జపించిన 
భుక్తి ముక్తి లభించును 
రామనామామృత పానముచే 
రామయత్వమును పొందును 

రామనామము 
శుభాలకు నిలయము 
రామనామ కీర్తన
జ్ఞానములలో గొప్పది 

రామ యను రెండక్షరములు 
శతకోటి మంత్రముల కన్న 
ప్రభావశాలి
10/47
కవితా గానం కవనజ్యోతి సమూహ పక్షాన అయోధ్య రామాలయం సందర్భంగా కవిత గోష్టి
తేదీ::: 16 జనవరి 2024
శీర్షిక :::సీతారామ కళ్యాణం
స్వీయ రచన ::'కేశరాజు వెంకట ప్రభాకర్ రావు 
హైదరాబాద్ (ప్రస్తుతం)



విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు వెంటరాగా 
జనక మహారాజు చేసే యజ్ఞాన్ని వీక్షించడానికి మిధిలానగరానికి పయనమైనారు!!

దారిలో శోణానది తీరాన రామలక్ష్మణులకు 
తన వంశగాధతో పాటు ,
కుమారస్వామి జన్మ వృత్తాంతాన్ని, 
త్రిపధ గామిని అయిన గంగానది అవతరణ గాథను వీనుల విందుగా వినిపించాడు విశ్వామిత్రుడు !!

మిథిలకు వెళ్ళే దారిలో 
శూన్యమైన గౌతమాశ్రమం కనిపించింది, గతంలో ఇంద్రుడు గౌతమ ముని రూపం ధరించి వచ్చి 
గౌతముని పత్ని అయిన అహల్యతో కలిసాడు !!

అందుకు గౌతముడు కుపితుడై ,
ఇంద్రుని, అహల్యను శపించాడు 
 తత్కారణంగా ,అహల్య అదృశ్యరూపంలో 
వాయుభక్షణ చేస్తూ, ధూళిలో పొరలాడుతూ ఆ ఆశ్రమంలోనే, మంచుతెరచే కప్పబడిన పూర్ణ చంద్రబింబంలా, ధూమావృతమైన అగ్నిజ్వాలలా ఉంది!!

శ్రీరాముడు 
ఆశ్రమంలో పాదం మోపినపుడు 
ఆమె శాప విమోచనం పొంది 
అందరినీ ఆశ్చర్యపరిచింది 
రామ లక్ష్మణులు ఆమె పాదాలు స్పృశించారు, 
ఆమె భక్తి శ్రద్ధలతో 
వారిని కొనియాడు చుండగా, 
గౌతముడు కూడా వచ్చి అహల్యతో కలిసి అతిథులను పూజించారు!!

సంతుష్ఠులైన 
విశ్వామిత్ర రామ లక్ష్మణులు 
ప్రయాణం బడలిక లేకుండా కొనసాగించి, 
జనకుని పాలనలో ఉన్న మిథిలా నగరాన్ని చేరుకొనగ, జనకుడు సవినయంగా 
తన యజ్ఞశాలకు ఆహ్వానించి 
విశ్వామిత్రుని రామలక్ష్మణులను పరిచయం చేశాడు !!

యాగ సమయంలో 
భూమిని దున్నుతున్నపుడు నాగేటి చాళ్ళలో 
ఆడు శిశువు లభించగా 
అయోనిజయైన ఆమెకు సీత అని నామకరణం చేసి
జనకుడు పెంచుకున్నాడు !!

ఆమె వీర్యశుల్క అనీ, 
శివధనుస్సును ఎక్కుపెట్టిన వారికే ఇస్తాననీ 
స్వయంవరం ప్రకటించాడు. 

విశ్వామిత్రుని కోరికపై 
జనకుడు శివధనుస్సును తెప్పించి రాఘవులకు చూపించగా...విశ్వామిత్రుని అనుజ్ఞ తీసికొని 
రాముడు అవలీలగా నారి ఎక్కుపెట్టినవెంటనే బ్రహ్మాండమైన ధ్వనితో 
విల్లు విరిగిపోయింది !!

జనకుడు సంతోషించి 
సీతకు రాముడు తగిన వరుడని నిశ్చయించి 
దశరథ మహారాజుకు కబురు పంపగ, 
వర్తమానం తెలుసుకొని దశరథుడు 
మిథిలకు వెళ్ళి 
జనక మహారాజుతో పెళ్లి మాటలు మాట్లాడుకుని
సీతారాముల పెళ్ళికి ఏర్పాట్లు ఘనంగా చేశారు


. సర్వాలంకృతమైన పందిరిలో జనకుడు వశిష్ఠ, విశ్వామిత్ర, శతానందుల సమక్షంలో అగ్నిని ప్రతిష్ఠింపజేసి, హోమాలు చేశాడు. సర్వాభరణ భూషితురాలైన సీతను తీసుకొని వచ్చి జనకుడు కౌసల్యానంద వర్ధనా! రామా! ఇదిగో నా కూతురు సీత.

 సీత నీకు సహధర్మచారిణి, 
ఈమెనంగీకరించి పాణి గ్రహణం చెయ్యి, 
పతివ్రత అయిన మా సీత నిన్నెప్పుడూ 
అనుసరిస్తుంది అని చెప్పి,
 మంత్రపూరితమైన జలం రాముని చేతిలో విడచాడు, ఆకాశంలో దేవ దుందుభులు మ్రోగాయి, పూలవాన కురిసింది !!


వశిష్ఠుని ఆశీస్సులతో 
రాముడు సీతను, లక్ష్మణుడు ఊర్మిళను, 
భరతుడు మాండవిని, శత్రుఘ్నుడు శృతకీర్తిని 
పాణి గ్రహణం చేయగా!!

 వారందరూ అగ్నిహోత్రానికి, 
జనకునకు, ఋషులకు ప్రదక్షిణాలు చేసి 
అందరి ఆశీర్వాదంతో 
సీతారాముల, మరియు వారి సహజన్ముల కళ్యాణం 
అంగరంగ వైభవంగా, జరిగింది !!

రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు 
తమ నవ వధువులతో 
ఋషి బంధు సమేతంగా 
విడిదికి చేరుకున్నారు !!

జై శ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై జై శ్రీరామ్

ఇది నా స్వీయ రచన
11/48
కవితాగానం
 పేరు:శ్రీ శివ లక్ష్మి రాజశేఖరుని 
 శీర్షిక: ఆ దర్శనమే ఆదర్శం

 నాటికీ నేటికీ తానొక్కడే ఆదర్శం
 వేసిన ప్రతి అడుగు
 మానవజాతికి సందేశం
 సకలగుణాభి రాముడై 
 సీతామనోభిరాముడై
 పితృవాక్య పరిపాలకుడై 
 అడవినైనా అయోధ్య నైనా
 రాతిని నాతిగ చేసినా
 కోతిని దూతగ చేసినా 
 ఉడత సాయం చూసి ఉద్ధరించినా 


 దాటలేని కడలిని దాటి
 సాటిలేని పది తలలను కొట్టి
 చెడుపై సంధించిన రామబాణం
 తన చరితంతా పావనం
 నాయకుడై, ప్రజావాక్య పాలకుడై
 నేటికీ నేతలందరికీ దిశానిర్దేశం
 
 మోసాలు ద్వేషాలు
 వీసమెత్తు ఎరుగని సమాజం
 ఆకలెరుగని జనుల గుండెల్లో ఆరాధ్యదైవం
 ప్రజా వాక్య పాలనే శిరోధార్యం
 ఆదర్శమౌ వ్యక్తిత్వం
 రాజే ప్రజలకు మార్గదర్శకం అని చెప్పిన తత్వం
 తీర్చిదిద్దిన మూర్తిమత్వం

 సకల జీవరాశుల పట్ల మానవత్వం
 నరుడైనా వానరుడైన ప్రతి ప్రాణి సమానత్వం
 ఉద్ధరించెను తడిమి ఉడత జాతిని సైతం
 అందుకే ఆ రామాయణ మంత్రం
 నాటికీ నేటికీ ఆదర్శవంతం


అందుకే ఊరురా రామమందిరం
మదిమదిలో రామనామ సంకీర్తనం
ఆ స్మరణం పాపహరణం
జాగత్కల్యాణకారణం


12/49

కవితాగానం 
కవన జ్యోతి సమూహం పక్షాన అయోధ్య రామాలయం సందర్భంగా కవితా గోస్టి
తేదీ 16 జనవరి 2024
పేరు డాక్టర్ నాయకంటి నరసింహ శర్మ
 వనపర్తి 

జగదభి రాముడు జనహృదిధాముడు 
రవి కుల జలధి పూర్ణ శశాంకుడు
సరసిజనయనుడు దశరథ తనయుడు 
కౌసల్యాప్రియ నందనుడు
 ప్రాచేతస రచిత రామాయణ రత్నాకర సంభవుడు
వైదేహీ ప్రియ వల్లభుడు 
జానకీ ప్రాణనాథుడు
అనిలజ భక్తవర కల్ప దృమము
దినకర తనయుని ప్రాణసంహారి
శచీపతిసుతుని జీవదాత
మారీచసుబాహాది భీకర దనుజ
గర్వాపహారి
దీర్ఘమై వెలుగొందు ఘనబాహుబల సమున్నతుడు
విద్యుత్ కాంతి సమాన తేజుడు
మేఘ గర్జన సముదీప్తకంఠస్వనము వాడు
సాగర గంభీర నినాదనిస్వనము వాడు
కమల పత్రాయతేక్షణముల వాడు
అరుణారుణోజ్జ్వలపదయుగ్మమువాడు
అహల్యాశాప విమోచనాహ్లాది
చంచత్చంచరీక కేశచయమువాడు


హామీ పత్రం
స్వీయ రచన ఇది
దేనికి అనుసరణము అనుకరణము అనువాదము కాదని త్రికరణశుద్ధిగా హామీ ఇస్తున్నాను
13/50
కవిత గానం సీజన్ 4
కవన జ్యోతి

తేదీ 16-01-2024
రచన: కె వి రమణాచారి
 తెలుగు పండితులు
నిజామాబాద్ జిల్లా
మంగళ వారం

అంశం: *ఆదర్శం*

అన్యాయాన్ని నేదిరించ అవతార ఎత్తాడు,
సోదర ప్రేమను సాధించిన తీరు మనకు ఆదర్శం,
వానర జంబుకాలలో
స్నేహహస్తం చాచిన వీరుడు,
తండ్రి మాటకే నిలిచిన ఆదర్శ జీవితం,
గురువుల బాధ్యతను గుర్తించిన నిదర్శనం,
ప్రజల పట్ల దైవ స్వరూపం నా శ్రీరాముడు.


ఇది నా స్వీయ రచన.

17/01/2024
1/51
9493273114
కవితా గానం సీజన్ 4
పేరు కొంజేటి రాధిక
ఊరు రాయదుర్గం

ఏ మంత్రమును జపించిన వ్యాధులు, ముసలితనము ఆకలి,  దాహము కాదో... ఏ మంత్రమును జపించిన ఏ అవస్థ ఎందైన రాక్షస పీడలు బాధలు తొలుగునో...
 ఏ మంత్రమును జపించినచో ఈ లోకమందు అసమాన తేజుడై వెలుగొందుచుండునో....
 ఏ మంత్రమును జపించినచో అష్టైశ్వర్య భాగ్యములు కలిగి, సమస్యలపై విజయం సాధించినో...
 ఏ మంత్రం పఠించుట వలన ఆయురారోగ్యములు సమృద్ధిగా సమకూరునో... అట్టి మంత్రమే శ్రీ రామ తారక మంత్రము...
 సకల సౌభాగ్యములను వసగు మంత్రము....
 సర్వకాల సర్వావస్థల యందు పాపరహితుని చేసి పాపప్రక్షాళన గావించి నిరంతరం రక్షణ కవచమై కాపాడే మంత్రం శ్రీరామ మంత్రం....
 రామ బాణంతో సరిసమానమైన మంత్రం శ్రీరామ తారక మంత్రం శ్రీరామ అంటే చాలు జన్మజన్మలను పునీతం చేసే మంత్రం....
2/52
కవితా గానం
సీజన్ 4
డా బల్లూరి ఉమాదేవి 
శ్రీ సీతా రాములకు వందనములు"
తేటగీతి మాలిక

1.తే.గీ:'శ్రీ'కరంబిది సత్ఫలసిద్ధి గలది
      'సీ'త యనిశము జపియించు చిన్మయమ్ము
     'తా'రకమును శుభకరము తత్త్వమయము
      'రా'మ రామ రామ యనెడి నామజపము

2తే.గీ:'ము'నిగణమ్ములు గోరెడు ముక్తిదమును
       'ల'త్త లెల్లను బాపు జపోత్తమమ్ము
      'కు'జయు దయజూపు దలచిన గూర్మితోడ
      'వం'దనము లన రాముని ప్రాపు దొరుకు

3.తే.గీ:'ద'నుజు రావణు పురి జేరి ధరణిజ గని
        'న'గ మశోకము పై రామ నామ మెంచి
        'ము'రిసె హనుమయ్య సీత సమ్ముఖము నంది!
       'లు'ప్త శోకగతుల మర్త్యలోక మందు!


4తే.గీదశరథతనయా నిను గొల్తు ధరణియందు
           వేగ కావగ రావయ్య వినుతి చేతు
         కలియుగమ్మున వెదకినా కనగ రారు
        బ్రోచు వారలు లేరయ్య పుడమి యందు.


5తే.గీ:ఏకపత్నీ వ్రతుడటన్న నిలను చూడ    
          రాముడొక్కడటంచును రహము తోడ
          పల్కుచుందురెల్ల జనులు వాసిగాను
          నట్టి రామచంద్రుని కొల్తు ననవరతము 


డా బల్లూరి ఉమాదేవి

ఇది నా స్వీయ రచన 
డా.బల్లూరి ఉమాదేవి
కామవరంఆదోని
3/53
కవిత గానము
17.1.24 ... బుధవారం
అంశం:: రామ చరితము
రచన:: కవిత వెంకటేశ్వర్లు
ఊరు:: కర్నూలు
సెల్::8309920625
శీర్షిక:: దేవుడైన రాముడు

దశరథ సూనుడు
ధర్మ పరాయణుడు
సత్యసంధుడు
మాట తప్పని ధీరుడు
ఆవేశము లేని వాడు
కోపము చూపనివాడు
బల పరాక్రమ సంపన్నుడు
ఆజానుబాహుడు
సుందర రూపుడు
సుమధుర వాక్కువాడు
మందస్మిత వదనుడు
అభయహస్త వీరుడు
స్నేహానికి ప్రాణమిచ్చువాడు
రాతిని నాతిగా మార్చినాడు
దయా గుణము కలవాడు
ధర్మపథమున నడుచువాడు
భార్యవియోగము భరించినాడు
మారుతి సాయముతో సీత
జాడ నెఱిఁగినవాడు
సుగ్రీవాది వానర సేనతో
రణమున రావణుడుని
హతమార్చినాడు
సద్గుణరాశి యతడు
రావణ మరణాంతరము
అతని బోధకై సౌమిత్రిని
పంపిన పూజ్యుడు
రావణునిలో ఉన్న జ్ఞాన
సంపత్తిని ఏరిగినవాడు
జానకి మాతతో అయోధ్య
నేలిన దశరథరాముడు
దేవునిగా నిలిచిన శ్రీరాముడు!!
      
                  కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు       8309920625
ఈ కవిత నా స్వీయ లిఖితమని హామీ
4/54
శీర్షిక:-- అయోధ్య రాముడు
ప్రక్రియ:-- పద్యం
రచన:-- సింహాద్రి వాణి
ఊరు:-- విజయవాడ
చరవాణి:--7569830872

సీ. దాశరథి తనయుడా, దైవస్వరూపుడా,
అయోధ్య రాముడా, యందగాడ
దివ్య మంగళ నామ భవ్య చరిత్రుడా
రఘువంశ తిలకుడా రామచంద్ర
సీతాపతీ నీకు చేయెత్తి మ్రొక్కంగ
కష్టాలు రాకుండ కాపు కాచి
యానంద మందించి యవనిలోన
చేయూత నిడెదవు శీఘ్రముగను 

ఆ.వె. రామరామ యనిన రాల్చి పాపములన్ని
ఆదుకొనెదవయ్య ననవరతము 
భక్తుల కాపాడు భగవంతుడవు‌ నీవు
భవ్య దివ్య రూప పరమ పురుష

2) సీ. నీలిమేఘపు ఛాయ నిండైన రూపమ్ము
నగవు లొలుకు మోము సొగసులీను
ఆజాను బాహుడు నరవింద నేత్రుడు
పాపాలు బాపును పాదధూళి
మూడు లోకాలలో చూడ చక్కనివాడు
మాత సీతమ్మకు మనసునిచ్చి,
హరివిల్లు విరిచిన యమిత బలాఢ్యుడు
కోదండ రాముడు గొప్ప వాడు.

ఆ.వె. తండ్రి మాట నిలను తలను దాల్చిన వాడు
ఏక పత్ని వ్రతుడు నెల్లవేళ
సాధు సజ్జనులను సతతము కాపాడు,
ఆంజనేయు డనిన‌ యమిత ప్రేమ.
5/55
కవితా గానం సీజన్ 4
శీర్షిక:రామ నామం
తిప్పావఝల నరసింహమూర్తి

రాముని కంటే గొప్పది రామనామం.
అత్యంత మహిమాన్వితం రామనామం.
రామనామాన్ని మూడుసార్లు పలికితే వస్తుందివిష్ణుసహస్రనామ స్తోత్ర ఫలితం.
వస్తుంది శివ సహస్రనామ స్తోత్ర ఫలితమూ.
రామనామప్రాభవాన్ని వర్ణించుట కాదు ఎవరి తరం.
ఆకాశమనే కాగితంపై జగత్తులోని నీటినంతా సిరాగా నింపి రాసినా
వర్ణించలేం రామనామం వైభవం.
రామనామం కలిగిస్తుంది జన్మ రాహిత్యం.
ప్రసాదిస్తుంది జ్ఞానం.
తొలగిస్తుంది ఈతిబాధలు.
ఇస్తుంది మోక్షం.
చేస్తుంది మనసు నిర్మలం.
సిద్దింపజేస్తుంది ఏకాగ్రత.
రామనామాన్ని జపిద్దాం నిరంతరం.
మన జీవితాలను చేసుకుందాం వెలుగులు మయం..
6/56
కవనజ్యోతి కవిత గానం సమూహ పక్షాన అయోధ్య రామాలయం ప్రారంభం సందర్భంగా కవిత గోష్టి
తేదీ 17 జనవరి 2024
శీర్షిక :::అరణ్యవాసం
స్వీయ రచన::: కేశరాజు వెంకట ప్రభాకర్ రావు పాతర్లపాడు ఖమ్మం ( హైదరాబాద్, ప్రస్తుతం)

నలు దిక్కులు జయజయధ్వానాలు పలుకు తుంటే నాలుగు జంటలూ, ఆబాల గోపాలం 
నాట్యం చేస్తుంటే ,అయోధ్యలో ప్రవేశించారు,
నింగి నుండి వేల్పులు విరిజల్లు కురిపించగ!!

ప్రజా రంజకమైన అయోధ్యలో పాలన
నభూతో నభవిష్యతి అన్న రీతిలో సాగుతుండగా
పరిపాలనాభారాన్ని పెద్దకొడుకైన రామున కప్పగింపవలెనని దశరథుడు సంకల్పించాడు!!

అయోధ్య ముస్తాబవుతోంది శ్రీ రామ పట్టాభిషేకానికి 
వాడవాడలా వేడుకలు, వసంత రుతువులో 
వనం రంగురంగుల పూలను పూచి వన్నెలు పోయినట్టు!!

సరిగ్గా అప్పుడే పర్జన్యం గర్జించింది
కైకేయి రూపంలో ... అంతటా కారు మబ్బుల తాండవం దశరధుని గుండెల్లో ఆ కోరికల గునపాల పోటు 
పదునాలుగు ఏళ్ల రాముని వనవాసం, భరతుని పట్టాభిషేకము వినటానికి కర్ణ కఠోరం!!

విషయం అవగతమై సీత ,లక్ష్మణులు తోడు రాగా రాముడు,మందాకినీ తీరాన చిత్రకూటం పై 
పర్ణశాలను నిర్మించుకొని కాలం గడుపుతున్నారు !!

అక్కడ నుంచి గోదావరీ తీరాన పంచవటి వద్ద 
పర్ణశాలను కట్టుకొని సుఖ జీవనం చేయుచుండగా శూర్పణఖనే రాక్షసి వచ్చి రామ లక్ష్మణులను మోహించి సీతను తినివేయడానికి సన్నద్ధమైనది !! 

లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి , రోదిస్తున్న శూర్పణఖనుగెంటివేయగా .... తన అన్న రావణా సురిని
శరణు కోరిన వెంటనే రావణుడు మారీచుని సహాయం తో
సీతను అపహరించి లంకలో దాచి ఉంచగ!!

జానకి జాడతెలియని రాఘవుడు,
జటాయువు సోదరుడైన సంపాతి సలహాతో 
వాలిని చంపి, సుగ్రీవునితో నెయ్యము నెరిపి
వానర భల్లూకాల సైన్యాన్ని సమకూర్చుకుని !!

వారథి కట్టి లంకను పట్టి రాక్షసులను మట్టి లో పెట్టి
రావణ కుంభకర్ణ ఇంద్ర జిత్తు మొదలగు
మహా వీరులైన రాక్షసులకు చితి పెట్టి
ధర్మాన్ని ఆకాశమంత ఎత్తున నిలబెట్టి
లోక కల్యాణం జరుపించిన సీతారాములు ఎంతో గట్టి!!

అలా! ఆ పురుషోత్తముడు
అందరికీ ఆరాధనీయుడై, గుండెల్లో నెలవైన వేల్పు
ఆ రామ నామము పలికిన సమస్త పాప హరణం
ఆ దివ్య మంగళ రూపం దర్శించిన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది... ఇది సత్యం ఇది నిత్యం!!

అవతారం చాలించి యుగాలు గడిచినా
చెక్కు చెదరని భక్తి, అఖండ దీపారాధనతో
నిత్య పారాయణంతో ఆ రామ నామ సంకీర్తన
మానవులనే కాదు నాకము నందున్న ఆ శ్రీ హరిని
వదలక, ముదముతో మిన్గంగలో మునకలేయించే
మోక్ష ప్రదాయిని ఆ రామ నామము!!

ఇది నా స్వీయ రచన
7/57
కవిత గానం సీజన్ 4
కవన జ్యోతి

తేదీ 17-01-2024
రచన: కె వి రమణాచారి
 తెలుగు పండితులు
నిజామాబాద్ జిల్లా
బుధ వారం

అంశం: *రాజు*

వైకుంఠము నందు వదిలి వచ్చే అవనికి,
 విష్ణుమూర్తి దాల్చిన మానవ రాముడై,
లక్ష్మమ్మ భూమిజై జన్మించే,
ఆదిశేషుడై లక్ష్మణుడై,
శంఖ చక్రాలు భరత శత్రజ్ఞులు,
మహాశివుడు అవతారమే హనుమంతుడు,
త్రేతా యుగాన్ని ఏలే శ్రీరామచంద్రుడు,
రాజుగా నిలిచే రామభద్రుడు.

ఇది నా స్వీయ రచన.

8/58

" ఆదర్శ పురుషోత్తమా.... 
       నమో న్నమః...! "
   కోరాడ నరసింహా రావు! 
          ***************
శ్రీ రామా...! 
 అయోధ్య రామా...! 
  పావన నామా....!! 
తిరుగి లేనిది  బాణ0 ..! 
 అంత కంటే... నీ నామమే
  గొప్పడని నిరూపించె కదా హనుమ.! 

రాతిని నాతిగ మార్చ గలిగిన
  నీ పాద ధూళి కెంత మహిమ! 
 
నీ సీత కొరకు రావణు నెదిరిం చిన ఆ జటాయువు ప్రేమను..., 
  దానిపై నీకున్న వాత్సల్యమును.. 
  వర్ణించగ నే నె0త వాడ..శ్రీ రామా..!!

శబరిని బ్రోచితివి... 
 విభీషణుని చేర దీసితివి... 
 "రామో విగ్రహవాన్ ధర్మః"
 అనిపించు కున్న... 
  మూర్తీ భవించిన ధర్మమూర్తీ
 ఓ మర్యాదా పురు షోత్తమా
 నీ చరిత్ర అచంద్ర తారార్కమై నది...! 
   ఆదర్శ మానవ జీవన మును గడిపి... మాకు మార్గ దర్శి వైనువు...! 
     ఇన వంశా0బుధి సోమా... 
 నమో న్నమః...!! 
    *********************
9/59
కవితాగానం సీజన్ 4
...
గజవెళ్ళి శ్రీనివాసాచారి 
కాజీపేట 
...
శీర్షిక: రామాయణ గ్రంథం 
...
ప్రపంచంలోనే అతిపెద్దది
బరువైనది ఈ రామాయణం
ఆగ్రాలో తయారవుతున్నది 

అయోధ్యలో
రాముని ప్రాణప్రతిష్ట నేపథ్యంలో 
పెద్ద రామాయణాన్ని 
రామునికి కానుకగా ఇవ్వాలని
ఆ సంస్థ సంకల్పం 

ఇనుమును ఉపయోగించి 
వాల్మీకి రామాయణాన్ని 
చెక్కుతున్నారు కళాకారులు

వాల్మీకి రాసిన శ్లోకాలను
అత్యాధునిక 
సాంకేతిక సాయంతో
రూపొందించే సుందర రామాయణం 
ఎందరో రామభక్తులు 
ప్రజల సహకారంతో 
సాకారమైంది ఈ గ్రంథం 

శ్రీరామ జన్మభూమి 
తీర్థ క్షేత్ర ట్రస్టుకు బహుకరించాలని 
ఆ సంస్థ ప్రయత్నం
10/60
జై శ్రీరామ్. 
కీర్తన: శ్రీరామా! జయరామా!
("శరణంభవ కరుణామయి"శైలి... ఒక సాహస ప్రయత్నం)
రచన: ముడుంబ 
తిరువేంకటాచార్యులు, మానుకోట. 
శ్రీరామా! జయరామా!ఘననీరదశ్యామా! 
మునివందిత! శివసంస్తుత! భవతారకనామా! Il శ్రీరామా ll 

సురరంజన! అసురభంజన! క్రతురక్షణదీక్షా! విబుధస్తుత! ఫణిసేవిత! పితృవాక్పాలకా! 
ll శ్రీరామా ll

రామా! హర చాపభంజన! సీతా హృత్సరోవిహారహంసా! 
సీతాసతి కరగ్రాహక! ఘనరాజ్యత్యాగీ! ll శ్రీరామా ll 

వనవాస ప్రియ! సతీవిరహశోకాగ్ని హృదయతప్తా! 
వాలీహర ధృతచాపహస్త! 
సుగ్రీవాధిప సంచాలిత కపిసేనావరణా! ll శ్రీరామా ll 

అంజనిసుత ఉదధిలంఘన అన్వేషణ ఫలితం, సీతాసతిక్షేమ జ్ఞాతోల్లాసభరితం, 
రక్షోజనహననోపరి అతిభీకరసమరం, 
లంకాపతి శిరఖండన సీతాశోకవిమోచనం 
ll శ్రీరామా ll 

అయ్యోధ్యాగమనా జనమానస సంతుష్టా సింహాసన స్థిరసంస్థిత రాజాశ్రీరామా ll శ్రీరామా ll 
  **** **** **** **** ****
ఇది స్వీయరచన. అనువాదము కాదు. 🙏
11/61
కవిత గానం సీజన్ 4
మన్నె లలిత
హైదరాబాద్
తేదీ 18/ 1 /20 24
అంశం : శివ ధనుర్భంగం -సీతారాముల వివాహం

దశరథ పుత్రుడు
 విశ్వామిత్ర శిష్యుడు
 గురువు ఆజ్ఞ మేరకు సీత స్వయం వరానికి 
లక్ష్మణ సమేతుడై శివధనుర్భంగం
 చేయుటకు బయలుదేరిన 
సూర్యవంశ పుత్రుడు 
పరమశివుడు సృష్టించిన 
ప్రణవనాదఓంకారమే శివధనుస్సు 
త్రిపురాసురసంహారార్థం దేవరాతునికి
 యజ్ఞఫలంగా లభించిన శివ ధనుస్సు 
జనకునే ఇంట ఉన్న శివధనుస్సును 
బలమైన శివధనుస్సును 
సీత ఎడమ చేతితో అవలీలగా నెట్టగా 
అది చూచిన జనకుడు అబ్బురముతో 
శివ ధనుర్భంగము చేసినవారికి సీతనిచ్చి 
ఉద్వాహము చేయుదునని ప్రకటించి 
శివధనుర్భంగం చేసి అతిలోకసుందరి సీతను 
స్వయంవరంలో గెలుచుకొనుటకు గర్వంతో 
వచ్చిరి ఎందరెందరో రాకుమారులు 
శివధనస్సును పైకి లేపలేక కొందరు
 చదికిలబడి కొందరు, ఎక్కుపెట్టలేక కొందరు
 రాజకుమారుల గర్వం నశించగా 
గురువు ఆజ్ఞతో శివధనస్సును చేపట్టి శ్రీరాముడు 
శివ ధనస్సుకు నమస్కరించి 
శివధనుస్సు చేతపట్టి ఆకర్ణాంతం 
నారి సంధించగా 
పెళపెళ పెటపెట ధ్వనులతో శివ ధనస్సు
 విరిగి రాజుల గర్వాలు నశించగా 
అవనత ముఖులయిరి 
శివధనుర్భంగం కాగానే దిక్కులు 
పిక్కటిల్లి, దిగ్గజాలు నలిగిపోయి
 శేషాహి కృంగిపోయె
దశరథ మహారాజు సంతోషముతో   
సీతారాముల వివాహం ఘనంగా జరిపించె.

ఇది నా స్వీయ రచన
మన్నె లలిత
హైదరాబాద్.
18/01/2024
1/62
కవితా గానం
అంశం రాముడు
ప్రక్రియ గజల్
శ్రీ శివ లక్ష్మి

గజల్

 వేటగాని ఓ వేదన రామాయణ చరితైనది
 ఇసుక మోయు ఉడతకేమొ వేలి గురుతు వరమైనది

 తాటకినే దునిమాడిన ఆవేశం ఆరలేదు
 పాద ధూళి తాకగానే రాయేమో పడతైనది

 తప్పిదాలు చేసిందే ఘాతుకాల కాకి జన్మ
 ఆగ్రహాన ఆ చేతికి గడ్డిపోచ శరమైనది

 అగ్నిలోన దూకమన్న న్యాయమేదొ తెలియలేదు
 పునీతగా నిను చేరగ పుణ్యశీల సీతైనది

 విరిగేందుకు విల్లు కాను రాసేందుకు మొల్ల కాను
 నీ లీలలు తెలియలేని సత్యమనసు బరువైనది..


 రాజశేఖరుని శ్రీ శివలక్ష్మి
 సత్య స్వరాళి
2/63
కవితాగానం
అయోధ్యారామునికి కవితార్చన
తేదీ:18-01-2024
శీర్షిక:అయోధ్యాలో కోలాహలం
దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం
ఆ‌రంభమయ్యింది అయోధ్యనగరిలో కోలాహలం
బాలారామునికి ప్రాణప్రతిష్టాపన
ఎన్నెన్నో యేళ్ళ కలసాకారం
న్యాయపీఠం ఆదేశం
దేశమంతటా రామనామజపం
భక్తిపారవశ్యంతో వెల్లువ
భక్తజనకోటి భజనల సవ్వడి
గొంతుగొంతులో శ్రీరాముని కీర్తనం
వీనులవిందుగా 
వాడవాడలా వేడుకలు
సర్వాంగ సుందరం
రమణీయదృశ్యం
అదిగదిగో అయోధ్యానగరం
ఆనందతరంగాల సందోహం.

ఇది నాస్వీయరచన.

3/64
కవితా గానం(సీజన్4).
పిన్నక నాగేశ్వరరావు. 18--1--2024.
హనుమకొండ. 
శీర్షిక :-- (మినీ) రామాయణం.

కౌసల్య పుత్రుండు కారణ జన్ముడు
                   దశరథ తనయుడు దాశరథియె
జన్నము కావ విశ్వామిత్రుడును వేడ
                 వెడలె తమ్మునితోడ నడలకుండ 
దనుజుల జంపి యమ్ముని యజ్ఞముఁ గాచె
                 అస్త్రములను ముని యందజేసె
 శివ ధనువు విరిచె సీతను పెండ్లాడె 
               బంధు వర్గము బుధవరులు మెచ్చ
తండ్రి యానతినివ్వ తరుణి జానకితోడ
                   వనవాస మేగెను భ్రాత రాగ
రాతిగా మారిన నాతి యహల్యకు 
                   శాపము తొలగించి రూపమిచ్చె 
ఎదురుచూచు శబరి యెంగిలి ఫలములు
                  భక్షించి యామెకు మోక్ష మిడెను
కాంచి బంగరు లేడిఁ గాంక్షించ జానకి
                 మారీచు డయ్యెను మాయ లేడి
మాయ వేషముతోడ మగువ సీతను లంక
                 చేర్చి రావణుడంత చెఱను బెట్టె
కడలిని లంఘించి కడకు హన్మంతుడు 
                  కాంచె సీతననుచు కబురు వచ్చె
కపుల సాయముతోడ కడలికి వారధి
                   కట్టి లంకకు చేరె కపుల సేన
రామ రావణులకు రణము జరుగగాను
              హతుడయ్యె రావణు డనిని తుదకు
తే.గీ.
సంతసమ్ముగ రాముడు జానకి దరి
చేర కపుల గణము సంతసించి రప్పు 
డందరు నయోధ్యకున్ జేరి సందడిగను
రామ పట్టాభిషేకము రమ్యముగను 
జరుగ నాశీస్సు లందించ గురువులెల్ల
పాలనము చేయ శ్రీరామ ప్రభువు తాను
రామ రాజ్యాన సుఖియించిరందరున్ను.
**************************************
4/65
కవితాగానం సీజన్ 4
...
గజవెళ్ళి శ్రీనివాసాచారి 
కాజీపేట 
...
శీర్షిక: రామాయణం
...
రామాయణం అంటే 
రాముని ఆయనం 
రాముడు నడిచిన మార్గం 

వాల్మీకి ఘంటం నుంచి 
జాలువారినదే రామాయణం 
శ్రీరామ కథా సుధాపానం చేసి
తరించిన భక్తులు ఎందరో 

వేదాల ద్వారా తెలుసుకోదగిన 
పరమ పురుషుడే
దశరథ నందనుడిగా 
ఇలలో జనించెను 

భగవత్తత్వాన్ని 
లోకానికి చాటిచెప్పిన 
ధర్మమూర్తి రామచంద్రుడు 

రామాయణం నిండా 
మానవ సంబంధాలు 
కుటుంబ ధర్మాలు 
పాలనా ధర్మాలు 
నేటి మానవులకు ఆచరణీయాలు
ఆదర్శ సమాజానికి పునాదులు
5/66
కవితా గానం సీజన్--4
ప్రక్రియ:-- గజల్
త్రిస్రగతి 6/6/6/6
రచన:-- సింహాద్రి వాణి
ఊరు:--‌విజయవాడ
చరవాణి:--7569820872

అంతులేని భక్తితోడ నిండినదీ
వాణిమనసు
రామనామ స్మరణలోన మునిగినదీ వాణిమనసు

జీవకళయె ఉట్టిపడగ చెక్కిరంట‌ శిల్పాలను
వినినంతనె శిల్పులనూ పొగిడినదీ వాణిమనసు

అంతులేని అందంగా కట్టిరంట మందిరమును
చూడాలని మరీమరీ కోరినదీ వాణిమనసు

రామజన్మ భూమిలోన అద్భుతాలు 
వున్నవటా
భూలోకపు స్వర్గంగా తలచినదీ
వాణిమనసు

రాముడు దయ చూపాలీ భరతభూమి వాసులపై
భక్తజనుల క్షేమమునూ కోరినదీ వాణిమనసు.
6/67
కవిత గానం సీజన్ 4
కవన జ్యోతి

తేదీ 18-01-2024
రచన: కె వి రమణాచారి
 తెలుగు పండితులు
నిజామాబాద్ జిల్లా
గురు వారం

అంశం: *నిరీక్షణ*
14 ఏళ్ల రామునికై అయోధ్య సింహాసనం ఎదురుచూపు.
ఎంగిలి పండ్లతో నిరీక్షణ చూపులతో వృద్ధాప్యమే తెచ్చుకున్న శబరిమాత.
రాయి అయినా అహల్య రాముని పాదానికై శాప విముక్తి నిరీక్షణ.
అడుగులు పెట్టడానికి గుహుని నిరీక్షణ.
500 సంవత్సరాల నుండి నేటి భారతీయుడు నిరీక్షణ.
నేటి భారతదేశంలో అదృష్టం నిరీక్షణ ఫలితాలు అందుకుంటుంటే ఆనందం ఆహ్లాదం జైశ్రీరామ్

ఇది నా స్వీయ రచన.
7/68
కవనజ్యోతి కవిత గానం సమూహ పక్షాన అయోధ్య రామాలయం ప్రారంభం సందర్భంగా కవిత గోష్టి
తేదీ 18 జనవరి 2024
శీర్షిక :::అరణ్యవాసం
స్వీయ రచన::: కేశరాజు వెంకట ప్రభాకర్ రావు పాతర్లపాడు ఖమ్మం .

అలాంటి! ఇనుకులోత్తముని జన్మస్థలమున!
అందమైన! సుందర ధామము నిర్మించుకొని!
అపేక్షతో ! సరయూ నది తీరాన పేరాశను !
అచంచలమైన! భక్తితో వదిలించు కొను తీర్థం మని!!

ఆ ఆది పురుషుడు ! శ్రీ రామ చంద్రుని భజించుచు!
అనురాగంతో ! ఒకరికొకరు ఆసేతు హిమాచలము!
అర్చన చేయుచు ! ఆధ్యాత్మిక అమృతవాహినిని!
అలలైపొంగించి! అలవైకుంఠ పురము చేరుచుండగా!!

ముష్కరులు ! మతోన్మాదులు! విదేశీ మూకలు మందిరముపై దాడి చేసి అయోధ్యను 
ముక్కలు ముక్కలు చేసి,చిన్నా భిన్నం చేసి, మదమెక్కిన
మనుజ రూప రాక్షసులు, అడ్డు పడిన భక్తుల
మస్తకాలను మారణాయుధాలతో లక్షల్లో ఉత్తరించినా!!

మందిరం పై భారీ మసీదు కట్టి ,బాబ్రీ మసీదని
మురిసిన ఆక్రమణ దారుల గుండెల్లో గుబులు పుట్టిస్తు
మద్భాగవత భక్తులు నిరంతరం ప్రాణాలను లెక్కచేయక
మతోన్మాదుల మారణహోమంలో మలమల మాడినా!!


ఆగలేదు పోరు! సాగుతూనే ఉంది! సరయూ నదినిండా
రక్తం ప్రవహిస్తూ! 
విదేశీ పాలన అంతరించినా! స్వాతంత్ర్యం సంప్రాప్తించినా!
కరసేవకులను, సాధు సన్యాసులను పదిహేను వేలకు
పైగా కాల్చి సరయూనదిలో విసిరేసిన పైశాచిక ప్రభుత్వం
మనదే! దానికి సాక్షీభూతంగా నిలచిన సరయూనే!!

ఐదు వందల సంవత్సరాల రణరంగంలో
లక్షలాది సనాతన ధర్మ పరాయణుల రుధిర తర్పణంతో
భారత మాత ముద్దు బిడ్డల చొరవతో, ధైర్యసాహసాలతో,
అధికారం కోసం వెంపర్లాడని సనాతన నాయకత్వంలో ,
బాల రాముని పునః ప్రతిష్ట జరగటం భారతీయుల అదృష్టం!!

ఇది నా స్వీయ రచన
(ఆ నాటి కరసేవకుడు)
8/69
9493273114
కవితా గానం సీజన్ 4
పేరు కొంజేటి రాధిక
ఊరు రాయదుర్గం

శ్రీరామ అనిన చింతే లేదు కష్టమూ లేదు
 నరకము లేదు
 శ్రీరామ అనినా కొదవేలేదు పాపము లేదు... 
తారక మనునది రామ నామము...
సనాతన హిందూ ధర్మానికి ఆదర్శప్రాయమైన కావ్యం రామాయణం..‌
 హిందూ ధర్మాలను ఔపోసన పట్టి,
 సమాజానికి ఓ ఉత్తమమైన మహోన్నతమైన కుటుంబ వ్యవస్థను పరిచయం చేసి, మహోన్నతమైన వ్యక్తిత్వాలను తరతరాల తరగని చరిత్రగా మిగిలిపోయేలా అనుసరణీయ తగిన వ్యక్తిత్వాన్ని రాచబాటగా వేసిన శ్రీరామచంద్రుడు భావనలు సత్ప్రవర్తన అజరామరం...
జనులు అభిలాషించే పరిపాలన గావిస్తూ, పరిపాలనా దక్షతకు నిదర్శనంగా,
 జనం మెచ్చి జేజేలు పలికిన నాయకుడుగా శ్రీరాముడి పాలన చరిత్రలో చిరస్మరణీయం... నిరాడంబరుడిగా తన జీవితాన్ని ప్రవహింపచేసుకుని, సామాన్య మానవుడిగా కష్టనష్టాలకు అతీతంగా జీవించి...
 శాసించే స్థానంలో ఉన్నా సమన్వయంతో పరిస్థితులను సానుకూల పరుచుకొని, రావణ సంహారం కావించిన రాముడు శ్రీ రామ చరిత మహోన్నతమైనది జగతికి...
అధర్మం అధర్మం హెచ్ఛై, ధర్మాన్నికి కళంకం ఏర్పడినప్పుడు
 ధర్మంపై జయకేతనం ఎగురవేయడానికి ధర్మసంస్థాపనను గావించడానికి భువిలో ఉదయించిన భగవత్ స్వరూపం శ్రీరాముడు లోకానికి ఆదర్శప్రాయం.
9/70
శ్రీరామ శరణం మమ
అక్షరార్చన జానకీ రామునికి
డా.తంగిరాల నాగలక్ష్మి
**************
 కూజంతం రామ రమేతి మధురం మధురాక్షరం ఆరూహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం
  ***********
నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకత్మజాయై
నమోస్తు రుద్ర,ఇంద్రనిలేభ్యో
నమోస్తు చంద్రార్క మరుత్ గణేభ్యః 
     **************
వాల్మీకి రామాయణ మాది కావ్య వృక్షం నుండిశాఖోపశాఖలుద్భవించాయి
 ఆనందరామాయణం, ఆధ్యాత్మరామాయణం, మొల్లరామాయణం,
కంబ రామాయణం 
అహో రామాయణాలెన్నో... 
ఇంటింటా రామయణమే
రామాయణానికి వాల్మీకి పెట్టిన పేరే " సీతాయాశ్చరితం మహత్"
ఎంతమందికి తెలుసు?
ఎంద రెందరో ఎన్నెన్ని భాషలలో రచించిన రామాయణం
మానవ జీవన ప్రయాణానికి ఆదర్శ మైన మార్గం
గమ్యం చేరుకోవటానికి 
సమస్యలవలయం లో చిక్కుకుంటే బయట పడే ఆయుధం రామాయణం

రామ నామమే పవిత్రంమ్ పుణ్యం
తారక మంత్రమోయి... 
రామ భక్తి గొప్పదనాన్ని చాటారు 
కబీర్, రామదాసు, తులసీ దాసు త్యాగరాజు లెందరో..
అయోధ్య రామ జన్మ భూమి పుణ్యభూమి, మోక్ష పురి అడుగిడిన చాలు జన్మ ధన్యం 

రామ లక్ష్మణ భరత శతృఘ్ను సోదరుల పరస్పర ప్రేమ, అన్న అంటే ఉండాల్సిన గౌరవం చెబుతోంది రామాయణం
పుత్ర వాత్సల్యం, 
పితృవాక్య పరిపాలన,
గురువాజ్ఞ శిరసా వహించటం
వశిష్ట విశ్వామిత్రులతో అనుసరించిన మార్గం
ధర్మ పరిపాలన, శిష్టరక్షణ,
మైత్రీ బంధం సుగ్రీవునితో
క్షమాగుణం శత్రువైనా కానీ, రావణునికి రాయబారం పంపటం
సీతా మహాదేవి అగ్నిప్రవేశం లోని ఆంతర్యం...
సీతారాముల దాంపత్యం ఆదర్శం పరస్పరానురాగం అనుసరణీయం
ఇలా ఎన్నో ఈ ఇతిహాసం లో

 యుగాలు కల్పాలు మారినా చెక్కు చెదరక నిలచి, మన్న నలందినది రామాయణం ...

రాముడే నాదం వేదం 
అన్నాడు త్యాగయ్య

ధర్మం తెలుసుకుంటే చాలదు ఆచరిస్తేనే జయం అదే ధర్మం
రాముని గుణగణాలతో జీవిం చాలన్నదే రామాయణం మనకిచ్చే సందేశం
 రామాయణం అది కావ్యం జాతికి దొరికిన అమూల్యరత్నం

సకృదేవ ప్రపన్నాయ తవాస్మిత యాచయే అభయం సర్వ భూతేభ్యో దదామి వ్రతం మమ అని వాగ్దానం చేసిన రాజారాముని సార్వభౌముని భూమి యిది
*************
 భక్తిగరామనామమును భావము తోడ భజించుచుండుడీ 
రక్తిని పెంచుచున్ మనకు రక్షగ యుండును రామ చంద్రుడే!
శక్తిని యాతడే యొసగు జానకి రాముడుమానవాళి కిన్
ముక్తికి దారి జూపు
మన మోహన రాఘవు డీతడే గదా!
      **************
 సౌమ్య గుణగణాల సాకేత వాసుడ
రామ నామ మంత్ర రాజ మున్న చాలు మనుజజన్మసార్థకంబగునోయి
కల్మషము హరించు కంజ నాభ
         ***********
 రామ నామ జపము రంజింప జేయును
మనసు తారకమది మంత్ర రాజ
మైతరింప జనులుమర్మమెరుగరోయి
సుఖము సులభతరము శుభకరంబు
     **************
10/71
* మాపాలి దైవమా....! *
  కోరాడ నర సింహా రావు. 
     *****************
సనకసనందాదుల శాపవశ మున జయ - విజయులు... 
 రావణ - కుంభకర్ణులుగ జని యించే...! 

వర గర్వమున రావణుడు... 
 త్రిలోక వాసుల హింసించె..! 
 దేవతలందరు, వైకుంఠముజేరి
 శ్రీ హరిని ప్రార్ధించే...! 

శ్రీహరికరుణించి....కోసలాధిపతిదశరధునికి పెద్దకొదుకు గా... 
 కవుసల్య కడుపునజనియించే

  శ్రీ హరియే... శ్రీ రామునిగా... 
 శ0ఖ , చక్ర, ఆదిఆదిశేషులే... 
  భరత , లక్ష్మణ , శతృఘ్నిలై
  కారణజన్ములు అవతరించెను

లే లేత ప్రాయమునె రామ, లక్ష ణులు , ముని యాగము గావగ
బయలు దేరిరి...! 
 వాత్సల్యమునవిశ్వామితృడు .. అతిబల - మహాబల , దివ్య శక్తులననుగ్రహించెను...! 

 ఆదిగ రాముడుతాటకనుజంపి
 రక్కసులదుష్క్రియలు నిరో
ధించి , మునియాగము గాచిరి రామ, లక్ష్మణులు...! 

హరఛాపము విరిచిన ఘను డవు., భార్గవుని మదము ననచినావు..! 
 శీతను పరిణయ మాడినావు.!

తండ్రి మాటకై కానల కేగగ.... 
శీతను రావణు డపహరించ గా
 వానర మూకను సమీకరించి... 
 జలధిన వారధి నిర్మింప జేసి... లంకపై దండెత్తి... దుష్ట దను జులను సంహ రించి... ఇలపై ధర్మము నిలిపిన మర్యాదాపురుషోత్తమా... 
  మాపాలిట దైవమా... 
  నమోన్నమః....! 
    *******************
11/72
కవితా గానం
సీజన్ 4
డా బల్లూరి ఉమాదేవి 



శీర్షిక:పావన నామం
పల్లవి

రమ్యమైనది శ్రీరామనామము
భుక్తిని ముక్తిని ఒసగే నామం//

చరణం:1

భక్త జనులను బ్రోచే నామం
తాపము లణచే దివ్య నామం
చిన్నా పెద్దా తేడాలెంచక
అందరు తలచే దివ్యనామం//

చరణం:2

అహల్యాదులను కాచిన నామం
శబరికి ముక్తిని ఇచ్చిన నామం
సతికి శివుడుపదేశించిన నామం
యుగాలు మారినా వన్నె తగ్గని నామం //

చరణం:3

కలిమిని బలిమిని పెంచే నామం 
బాధల నెల్లా బాపెడు నామం
మోదమైనా ఖేదమైనా అలవోకగ
అందరి నోట వచ్చే నామం//

చరణం:4

హనుమంతునిలో నిండిన నామం
 సుగ్రీవుని కాపాడిన నామం 
విభీషణుని బ్రోచిన నామం
ఎల్లవేళలా అందరు తలచే పవిత్ర నామం

చరణం:5

త్యాగరాజుపై దయచూపిన నామం 
 రామదాసును కరుణించిన నామం
రామా-- రామా శ్రీ రఘురామా
నీ నామ స్మరణం మధురాతి మధురం//

డా బల్లూరి ఉమాదేవి

ఇది నా స్వీయ రచన 
డా.బల్లూరి ఉమాదేవి
కామవరంఆదోని
12/73
*క
వితాగానం సీజన్ 4*
*****************************
*తేదీ:18.01.2023*
*శీర్షిక:పరమ పావనుడు రాముడు*

రామాయణం కడు పవిత్ర కావ్యం
రాముని పావన చరితం
లోకాన్ని సంస్కరించే ఇతిహాసం
ఆదర్శ పురుషుని కథామృతం

పితృ వాక్య పరిపాలకుడు రాఘవుడు
మాతృ వాత్సల్య తత్పరుడు రాముడు
గురు ఆజ్ఞ పాలకుడు దాశరథి
లోకాన్ని కాపాడే యోధుడు వీరుడు

దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం జన్మించినవాడు
సాక్షాత్తు త్రిమూర్తుల శక్తిమంతుడు
అతని రూపం సమ్మోహనం
ఏకపత్నివ్రత నిష్టా గరిస్టుడు రాముడు

శివుని విల్లును విరిచిన మహా బలశాలి
షోడశగుణ సంపన్నుడు ,సత్యవ్రతుడు
సహన,వినయ సంపన్నుడు 
నీ దర్శనం చాలు రామయ్య మా జన్మ పునీతం

రామనామం కలిగించు కైవల్యం
వందనం అభివందనం కౌసల్య తనయ
దశకంఠుని గర్వమును అణచినవాడా
ధన్యోస్మి సూర్యవంశ శ్రేష్ఠుడా రాఘవా...


*పేరు:వనపర్తి గంగాధర్*
*ఊరు:హన్మకొండ*
చరవాని:9440146435

13/74
" ఈ జగతికి ఆదర్శ0...! "
  కోరాడ నరసింహా రావు. 
       ****************
భద్రుని కోరిక దీర్చగా భద్రా చలమున వెలసిన రామా...! 
 ఆదిగ వాల్మీకి రచించెగదా నీచరితము... పిదప మొల్ల,
తులసీదాసు.. భాస్కరులాదిగా ఎంద రెందరో కవుల ,కావ్యము లాయె కదా నీ చరిత...! 
 ఎందరో భక్తులు, వీనులవిందు గా... గానముచేసిన ఘన మైనది కద నీచరిత...! 

పతితపావనా... భక్త మందార
 ఆశ్రిత పక్ష పాత ...నిరతము నీ నామము వీడక జపియించే... 
  హనుమ జన్మచరితార్ధమాయె
  నీ చేతి వ్రేలు తాకగా...ఉడుత
 యు ధన్యత నొందినది
     సుగ్రీవుని , విభీషనుని కరుణించితివి..! 
 నీ రూపము మనోహరం... 
  నీ నామము మోక్ష ప్రధ0... 
 నీ జీవనమే... ఈ జగతికి... 
... ఆదర్శ0..! 
   **********************
14/75
కవితా గానం
సీజన్ 4
సింగీతం సంతోష్ కుమార్ 
ఊరు:-ఎల్లారెడ్డి,కామారెడ్డి జిల్లా 
తేదీ:-18-01-2024
శీర్షిక:- జగదభీ రాముడు

*************************************
శ్రీరామ నామం మధురం
సూర్య వంశానికి పాల సంద్రం
లాంటి పున్నమి చంద్రుడు 
కౌసల్యాదేవి గర్భమనే ముత్యపు చిప్పలో జనించిన మేలి ముత్యం
దశరథ వరఫల కారణజన్ముడు
సుఖ దుఃఖాలకు అతీతుడు
 కౌశిక యాగం కాచిన ఘనుడు
విశ్వామిత్ర ప్రియ శిష్యుడు
భారత జాతి గుండె చప్పుడు రామనామం
నీవు ధర్మానికి ప్రతీక పదహారుగుణాలే మహోన్నత వ్యక్తి
సకల గుణాభి రాముడు
శివధనుస్సును విరిచిన మహావీరుడు
సకల ప్రాణుల మంచికోరే
నీవు గాలితో సహా విశ్వ బోధకుడివి 
ఈ సృష్టిస్థితిలయల నిర్వాహకుడివి నీవే బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా
నేను దైవాన్ని అని ఒప్పుకోని అవతార మూర్తి
నీవు జ్ఞాన ప్రదాతవు విశ్వ క్రియవు గుణవంతుడు ధర్మాత్ముడు సత్యం పలికే మహానీయుడు.

*************************************
ఇది నా స్వియ రచన....

15/76
కవితా గానం
నాగేశ్వరరావు దామెర్ల
మంగళగిరి, గుంటూరు జిల్లా
తేది,18-1-24
శీర్షిక:-శ్రీరామ నామము
          పుణ్య ప్రదము.
+++++++++++++++++++++++
శ్రీరామ జయరామ
అయోధ్య రామ,
నీ నామమే జగతికి వెలుగు,
నీ నామమే పుణ్య ప్రదము,
నీ నామమే మోక్ష దాయకం,
నీ నామమే సకల పాప హరణం,
నీ నామమే సమస్త లోక లక్షణం,
నీ నామమే సమస్త తీర్థముల
  స్నాన పుణ్య ఫలితం,
నీ నామమే సకల దేవాలయ
వీక్షణ పుణ్య ప్రదము,
నీ నామమే మోక్ష దాయకం.
శ్రీ రామ,జయరామ,అయోధ్య రామ
  జయం, జయం, జయ మంగళం.
******************************




Comments

Popular posts from this blog

సింధూరం 07052025

****************** సింధూరం దిద్దిన వారు  1.వీరా గుడిపల్లి 2.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, 3.గొర్రెపాటి శ్రీను  4.దోసపాటి వేంకట రామచంద్రరావు  5.అపరాజిత్ 6.వేమూరి సత్యవతి  7.జ్యోతి  8.మండ నాగేశ్వరరావు  9.గడ్డం కృష్ణారెడ్డి.రేపాల.సూర్యాపేట 10.కవిత వెంకటేశ్వర్లు  11.ఆర్ వి వి రాజా  12. శ్రీ కోరాడ నరసింహారావు గారు  13. శ్రీ ఉదయగిరి మధుమోహన్ గారు  14. శ్రీమతి బల్లూరి ఉమాదేవి గారు  15. శ్రీమతి తోట సులోచన గారు  16. శ్రీ జి సూర్యనారాయణ గారు  17. శ్రీ గజవెల్లి శ్రీనివాస చారి గారు  18. శ్రీ వనపర్తి గంగాధర్ గారు  19. శ్రీమతి వాణి సరోజిని లక్కరాజు గారు  20. శ్రీమతి సింహాద్రి వాణి గారు 21. శ్రీ ఆచార్య అయ్యల సోమయాజులు ప్రసాద్ గారు  22. 23.శ్రీమతి నెల్లూరు వేంకటలక్ష్మి గారు 24.శ్రీ ఏడెల్లి రాములు గారు  25. శ్రీమతి డాక్టర్ తంగిరాల నాగలక్ష్మి గారు  26. శ్రీ కూని అంకబాబు గారు  27. శ్రీ తిన్నాక నాగేశ్వరరావు గారు  28. శ్రీమతి లలితా చంటి గారు  29. శ్రీ పిల్ల వెంకటరమణ మూర్తి గారు  30. ...

season 6 వైశాఖ పూర్ణిమ

కవనజ్యోతి,కవితాగానం సీజన్ 6  వైశాఖ పౌర్ణమి నగదు పోటీలు   పోటీకి కవితలు పంపించిన కవి వరుల జాబితా  1. శ్రీ పిళ్ళావెంకటరమణ మూర్తి గారు  2. శ్రీ సంగీతం సంతోష్ కుమార్ గారు ji 3. శ్రీ జి సూర్యనారాయణ గారు  4.శ్రీ మండ నాగేశ్వరరావు గారు 5.శ్రీమతి కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  6.శ్రీమతి నెల్లూరు వెంకటలక్ష్మి గారు 7.శ్రీ అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 8..శ్రీ కోరాడ నరసింహ రావు గారు  9.శ్రీమతి డాక్టర్ భమిడిమర్రి కమలాదేవి గారు 10.శ్రీ కాసుల ధీరజ్ శర్మ గారు  11.శ్రీ కూని అంకబాబు గారు 12.శ్రీ మతి డా.వేమూరి సత్యవతి గారు  13.శ్రీమతి డా.బల్లూరి ఉమాదేవి గారు 14.శ్రీ.దోసపాటి వేంకట రామచంద్రరావు గారు 15.శ్రీ అపరాజిత రెడ్డి గారు  16. శ్రీ ఏడెల్లి రాములు గారు  17.శ్రీ డాక్టర్ ఆళ్ళ నాగేశ్వరరావు గారు  18. శ్రీ కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  19. శ్రీ మద్ది పుల్లారావు గారు  20.శ్రీమతి సింహాద్రి వాణి గారు  21. శ్రీ డా.దీపక్ న్యాతి గారు  22. శ్రీ ఆర్.వి.వి.రాజా గారు  23.శ్రీమతి వాణీ సరోజినీ లక్కరాజు గారు...

వీడ్కోలు ఆషాఢమాసం పౌర్ణమి

అంశం: వీడ్కోలు  సందర్భం: ఆషాఢమాసం పౌర్ణమి  నిర్వహణ:  వీరా గుడిపల్లి లలితాకృష్ణ  ################## కవివరుల జాబితా  1.పిళ్ళా వెంకట రమణమూర్తి గారు  2. జి.సూర్యనారాయణ గారు  3.మండ నాగేశ్వరరావు గారు  4.డా‌.బల్లూరి ఉమాదేవి గారు  5. డా.కమలాదేవి గారు  6.గొర్రెపాటి శ్రీను గారు  7.వేమూరి సత్యవతి గారు  8.కూని అంకబాబు గారు  9.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు  10.కొలకలూరి దేవికారాణి రత్నాకర్ గారు  11.తోట సులోచన గారు  12.వాణిసరోజిని లక్కరాజు గారు  13. అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు  14.అపరాజిత రెడ్డి గారు 15.లలితాచండి గారు 16. నెల్లూరు వెంకటలక్ష్మి గారు  17.కమలశ్రీ గారు  18.రాధిక గారు 19.చంద్రమౌళి గారు  20.శ్రీకాంత్ గారు  21.సింగీతం సంతోష్ కుమార్ గారు  22.. దారల విజయ కుమారి గారు  23.ఎన్.నరేశ్ చారి గారు  24. పిన్నక నాగేశ్వరరావు గారు  25.సింహాద్రి వాణి గారు  26.ఏడెల్లి రాములు గారు  27.కొంజేటి రాధిక గారు  ++++++++++++++++++++++++++++++++ ఆషాడ మ...