శివునూరి లలితాక్రిష్ణ
వీరా గుడిపల్లి
*************************
కవనజ్యోతి సమూహం పక్షాన కవితా గానం సీౙన్ 5 నిర్వహించే
పౌర్ణమి నగదు పురస్కారాల కవితల పోటీకి
కవితలు పంపించిన కవివరుల జాబితా
1 .కోరాడ గారు
2 . ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
3. పిళ్ళా వెంకట రమణ మూర్తి గారు
4. దండమూడి శ్రీ చరణ్ గారు
5 వడ్ల వీరాచారి గారు
6. కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
7. కూని అంకబాబు గారు
8 డా వేమూరి సత్యవతి గారు
9. మండ నాగేశ్వరరావు గారు
10. తిప్పావఝల నరసింహ మూర్తి గారు
11.సీతారత్నకుమారి కారుమమూరి గారు
12. పిన్నక నాగేశ్వరరావు గారు
13. డా.భమిడిమఱ్ఱి కమలా దేవి గారు
14. ప్రసాదరావు రామాయణం గారు
15. డి ఎం అనల కుమారి గారు
16. జి.సూర్యనారాయణ గారు
17. కొమురవెల్లి అంజయ్య గారు
18. నాగలక్ష్మి తంగిరాల గారు
19. వాడపల్లి రాధ గారు
20. నెల్లూరు వేంకట లక్ష్మి గారు
21. తోట సులోచన గారు
22. డా.బల్లూరి ఉమాదేవి గారు
23. చంద్రమౌళి కుప్పిలి గారు
24. కొంజేటి రాధిక గారు
25. వాణి సరోజని లక్కరాజు గారు
26.మేకల రామస్వామి గారు
27.గజవెల్లి శ్రీనివాసాచారి గారు
28 సింగీతం సంతోష్ కుమార్ గారు
29. కవిత వెంకటేశ్వర్లు గారు
30.లలితా చండి గారు
31. S. గీత గారు
32. మొహమ్మద్ అఫ్సరవలీషా గారు
33. సింహాద్రి వాణి గారు
34.మన్నె లలితగారు
35. ఏడెల్లి రాములు గారు
36.గొర్రెపాటి శ్రీను గారు
37.మండ శైలజ గారు
38.ముడుంబ తిరువెంకటాచార్యులు గారు
39.దారల విజయ కుమారి గారు
****************************
1
@ సుభిక్షం...!
కోరాడ నరసింహా రావు
***************
యే ఋతువు లో వీయాల్సిన పవనాలు
ఆ ఋతువులోవీయాల్సిందే...!
ఎదురు చూసిన అతిధి లా
ఈశాన్య ఋతు పవనాలు
వేళ మించిపోకుండ వస్తేనే ముద్దు...!!
తొలకరి వానలతో పుడమిపులకించి పోవాలి!
నాగళ్ల తో రైతు ఆనంద తాండ వం చేయాలి నేలతల్లి పు రి టి
నొప్పులతో... క్రొత్త పంటనుపురుదు పోసు కోవాలి!!
పవనం సహకరించనిదేమబ్బు
కనిక రించలేదు...
మబ్బు కనికరించనిదే చినుకు రాలదు...
చినుకు లేనిదే... ప్రాణి కోటికీ బ్రతుకు లేదు...!!
ఆరు ఋతువులూ అందగి స్తేనే... మనిషి బ్రతుకు మంద గించ కుండా.. ముందుకు సాగేది..!!
ఆకాల వర్షాలతో ప్రకృతి...
మసమీద పగ బట్టి0ది అనుకుంటే...
మనం పొర బడ్డట్టే...!!
ప్రకృతి కి మనమీదున్నది...
పగ కాదు... ప్రే మ...!
క్రోధం కాదు... ఆక్రోషమ్...!!
తన సహజ సంపదనంతా
సర్వ నాశనం చేసేస్తే...
చూన్తూ చేతులు కట్టుకు కూ చోవాలా... !?
మితి మీరిన అతి సుఖాాలకు
తనను బలి చేస్తుంటె ...
మనకు విందు భోజనాలందించాలా...?!
ఓ మనిషీ... నువ్ ముందు ప్రకృతిని ప్రేమించు...
నీ కన్న బిడ్డలా లాలించు...!
అపుడే... ఈ ప్రకృతి...
ఆహ్లాద భరిత ఋతు పవనాలైవచ్చి... నిన్ను పలకరించి, పులకింప జేస్తాయి ,
నీ నట్టింట నడయాడే...
చిట్టి పాపయై...
నీ యింట సిరుల పంట పండిస్తాయి...!
అపుడే... ....!!
**********************
2
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
ఊరు:-విశాఖపట్నం
చరవాణి:-9963265762
అంశం:-ఋతుపవనాలు
శీర్షిక:-
పాడిపంటలకు ప్రతీకలు
...........................
గ్రీష్మతాపంలో బీడువారిన భూములు
తొలకరి జల్లుతో ఆకాశంలో దట్టమైన మేఘాలను చూసి
నిరంతర శ్రామికుడైన రైతన్న
తప్పక భవిష్యత్ ఋతుపవన ఆగమనంతో
తమ భవిష్యత్ బంగరుమయం అవుతుందని
ఏరువాక లో తమకు తోడ్పడే గోమాత సంతతి అయిన కాడెద్దులను
తగురీతిని భక్తితో పూజించి
వానలు బాగా కురియాలని
పంటలు సమృద్ధిగా పడితే
తాము పడిన కష్టమునకు ప్రతిఫలం వస్తుందని
ఋతుపవనాలతో వరుణుని కృప తమపై ఉండాలని ఆనందంతో
"వానల్లు కురవాలి వానదేముడా
వరిచేలుపండాలి వానదేముడా" యని
అనాదిగా రైతన్నలు ఆట పాటలతో ఋతుపవనాల రాకతో జరుపుకునే 'ఏరువాక 'పండుగ
రైతన్నల అసలయిన పండుగ
ప్రకృతి పరిరక్షణ చేసి
'వృక్షో రక్షతి రక్షితః' అన్నది పాటిద్దాం
క్రమరీతిన వచ్చు ఋతుపవనాలతో
ఆరోగ్యజీవనానికి పునాదివేద్దాం
శ్రీరామచంద్రుని పాలనలోలా
పంటలు సమృద్ధిగా పండి
ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిద్దాం..!!
........................
ఇది కవితాగానం సీజన్ 5 వైశాఖ మాస పౌర్ణమి పోటీ కొరకు నే వ్రాసిన స్వీయరచన
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం. 973265762..
................
3
అంశం: *ఋతుపవనాలు*
*******************************
శీర్షిక: *రావమ్మా ఋతుపవనమా*
మేఘాల్ని అందమైన పదచిత్రాల పల్లకీ ఎక్కించి..
ఆకాశం చెట్టులోని మబ్బు కొమ్మల్ని వొంచి..
చినుకు పూల దోసిలి పట్టి, నెర్రలిచ్చుకుపోయి దాహంతో నోళ్ళెళ్ళబెట్టిన నాగేటి చాళ్ళ లోకి వొంపి..
తడియారని ధరణి గొంతులో పచ్చని పైరు పల్లవి నాటాలని ఉంది!
తెలిమబ్బులతో జతకట్టి, జడివాన జల్లుల చిత్తడి వర్షగీతాలతో..
మట్టిమెట్టల్లోని మౌననిర్లిప్తతను పొలంగట్టు పల్లె పాటగా ఏ పొద్దు మరచిపోని జానపదమవ్వాలనిఉంది..
అలకపూల తోపుల్లో తొలకరి దోబూచులాడుతున్న..
ఆకాశగంగల్ని బతిమాలి వర్షం ఋతువు రథమెక్కించి..
దిగులు గూళ్ళేసుకున్న మనుషుల మనస్సులకు సరిగంగ స్నాన మాడించాలని ఉంది..
కనిపించకుండా ఊరిస్తున్న ఋతుపవనాలను, అలిగి పుట్టింటికి వెళ్ళిన ఆలిని బతిమాలి తెచ్చుకున్నట్లు మేఘసందేశాలు పంపైనా బుజ్జగించాలని ఉంది!
*ఓ ఋతుపవనమా* !
ఏ అర్థరాత్రో నేలతో నాలుగు కబుర్లు పంచుకుని వెళ్లి పోయిన పిలవని అతిథిలా..
మలయమారుత పవనాల పెరట్లో తరువులు విడిచిన పత్రాల గుట్టలా..
మా చుట్టూ కమ్మేసి, నీ శ్వాసల సువాసనల్లో, ఎదురు చూపుల తపస్సులో..
నీ చిలిపి నవ్వుల నీటిచలమల కోసం తపించే మా ఎండిన గుండె చెరువులను నింపేందుకు..
ప్రాణరాగమై తీగసాగడానికి మేం తపస్సు చేయకుండానే మా కోసం భగీరథి వలె దిగిరావమ్మా ఋతుపవనమా!
""""""""""""""""""""""""""""""""""""""
పిళ్ళా వెంకట రమణమూర్తి
4
వర్ష గీతిక
------------------
వర్షం
నా మనసంతా కురిసింది
కొందరే వర్షంలో తడుస్తారు!
మిగిలినవారు తడిచిపోతారు ....అంతే!
వర్షాన్ని రెండు చేతులా కౌగిలించుకొని,
వర్షంలో చినుకుల్తో ఒళ్ళంతా పచ్చబొట్లు పొడిపించుకొని
వర్షాన్ని గుండె నిండుగా పరుచుకొని
వర్షాన్ని ఓ గీతం చేస్తాను!
వర్షాన్ని జీవన సంగీతం చేస్తాను!!
వర్షం అసలు,
మేఘం కుంచెతో నేల కాన్వాసుపై నింగి చినుకుల వర్ణాలతో వేసే సుందరచిత్రం!
వర్షం అసలు,
నేల వీణపై,మేఘాల మెట్లపై వాన చినుకులతో చేసే వాద్యసంగీతం!
వర్షం అసలు,
మేఘాల కాగితాలపై చినుకుల అక్షరాలతో రాసే అద్భుతమైన కవిత!
వాన నీటికి నేల పట్టే గొడుగులు,నీటి బుడగలు!
నువ్వలా వర్షాన్ని నిలువెల్లా చుట్టుకుంటుంటే,
నువ్వలా వర్షాన్ని మనసంతా నింపుకుంటుంటే
వాక్య సంకేతాలల్లా
వాన సందేశాలైపోతాయి!
ఏ ప్రియుడు తన ప్రేయసికి ఈ చినుకులతో ప్రేమలేఖను గాలికెరటాలపై పంపుతున్నాడో!
తన కన్నీళ్లను ఈ వాన నీటిలో దాచుకున్నాడో
నాకు వానను తడిపేయాలనే పిచ్చి ఆలోచన!
-నా ఊహల జడిలో!!
నాకు వానను వెచ్చబరచాలనే వెఱ్ఱి కోరిక!
--నా విరహోష్ణంతో!!
వాన నాకు దూర బంధువు!
వాన నాకు కావ్య సింధువు!!
వాన నా కవితల్లో హృదయంలో తడిలా పరచుకుంటుంది!
వాన నా హృదయంలో నా కవితల్లా కొత్త కవాటాలు తెరుచుకుంటుంది!!
------ _దండమూడి శ్రీచరణ్_
9866188266,
భువనగిరి, యాదాద్రి భువనగిరి
5
*
వడ్ల వీరాచారి, కవిరత్న, దాశరధి పురస్కార గ్రహీత. రిటైర్డ్టైర్డ్ సహాయక ఇంజనీర్
జిల్లా
*
వనపర్తి టౌన్ మరియు జిల్లా.pin.509103, తెలంగాణ
ఫోన్ నెంబర్
*
Cell.8897182796
కవిత
*
అంశం. ... ఋతుపవనాలు
ఆకాశం కేసి ,మేఘాలకేసి రైతన్నలు దీనంగా చూస్తుంటే అందరి గుండెల్లో దిగాలే.
ఎండిపోయిన చెరువులు ,బక్కజిక్కిన పశువులు, ఊరినిండా ఎండుతున్న పంటలు చూస్తుంటే ఊరందరికీ బుగులే.
మే నెల రెండో వారంలోనే గాలులు వీచి, అసలు వర్షాకాలం సీజన్లో చెయ్యెత్తేస్తుందేమోనన్న ఆదుర్దా రైతుల్లో.
రుతుపవనాలు సక్రమంగా, సకాలంలో ప్రవేశిస్తే వర్షాలకు రాదు కొదువంట
వానలు పడి చెరువులు, కుంటలు ,డ్యాములన్ని నిండితే రైతులకేమీ లేదు తంటా.
వర్షాకాలం సీజన్లో మంచి వానలు పడి పచ్చని పంటలు, పూదోటలతో అలరారుతుంటే ఎందుకు ఉంటుంది జనుల మొగాల్లో దిగులు?
జలధరాలు భారీగా వర్షించి కుంటలు, కత్వలు, ,చెరువులు అన్ని నిండిపోయి ఓండ్ర కప్పలు ఎగురుకుంటూ బెక బెకమంటూ అరుస్తుంటే మన చిన్నతనం జ్ఞాపకం వచ్చి పులకించాలని ఉంది మరొక్క మారు.
6
స్వీయ రచన కేశరాజు వేంకట ప్రభాకర్ రావు ,పాతర్లపాడు ,ఖమ్మం.
ప్రణయ సుధా రసోజ్వల ప్రకృతి
నిత్య పరవశంలో ప్రచలితమై
ప్రయాణిస్తున్నప్పుడు,
ప్రళయమై ప్రకోపించవచ్చు
ప్రమాదాలను ప్రసాదించవచ్చు
ఆ ధాటికి పడిపోయే గిరులు ,తరువుల విలవిలలు,
ఉప్పెనల ఉత్పాతాలతో
ఊళ్ళకు ఊళ్ళు గిల గిలలు !!
చిరు జల్లులతో తడిమితే
పల్లవించే తలిరిటాకుల కిలకిలలు... !
వలపుల అల్లరి వల్లరి అయితే
ఇంపైన ప్రసూనాలతో పరిమళాలను
పరివ్యాప్తం చేస్తు
సరికొత్త చైతన్యం నింపుతుంటే.. మరీచికలన్నీ
మాయం మటు మాయం !!
ఏదైనా జరగవచ్చు ...అది కాల నిర్ణయం!!
పరిణితి చెందిన ప్రకృతి
వాతావరణంతో పరీవృతమై
పరిధులను తనకు తానే
ఏర్పరుచుకుని ఋతువులనే
క్రతువులు చేస్తు,
క్రమించే క్రమంలో
భీకర భానుడి ప్రచండ జ్వాలల భగభగలతో,
అగ్నిగుండమై అల్లాడుతున్న అవని దేహంపై విసురుతుంది ...
చల్లని జల్లుల ఋతుపవనాల
హిమ సాయకము !!
అగడుతో అలమటిస్తున్న అనంత కోటి ప్రాణి
ఆహ్లాదంతో! ఆనందపు అలకనందలో మునకలేయగా !
అదును వచ్చేసిందని పదును పెట్టిన భూమిలో,
కొదువ లేకుండా విత్తుతున్న రైతులు మోదంతో!!
ఋతుపవనాలు
చల్లటి నుండి వెచ్చని ప్రాంతాలకు వీచుతు,
ఆకాశం నిండా మేఘాలుగా ఆవృత్తమై ,
ఒక మోస్తరు ,
లేదా !
అధిక తేమను అలదుకొని
భారీ వర్షాలకు దారులు తెరుస్తాయి,
ఫలితాలెలాఉన్నా !
సృష్టి స్థితి లయకు
సాక్షాత్తు సర్వేశ్వరుని రూపమే
ఈ ఋతుపవనాలు!!
7
*
కూని అంకబాబు
జిల్లా
*
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
ఫోన్ నెంబర్
*
9640637991
కవిత
*
కవనజ్యోతి క్రోధి వైశాఖ పౌర్ణమి కవితల పోటీ
అంశం : ఋతుపవనాలు
శీర్షిక: నేలతల్లి కవలలు
ప్రకృతి వనాలకు తోబుట్టువులు
అలా వచ్చి ఇలా పలకరించు
పెద్దగా పరిచయం అక్కర్లేని
చుట్టాలే ఋతుపవనాలు
మాసాల వారీగ ప్రపంచాన్ని చుట్టేస్తూ
ఎక్కడికక్కడ ప్రకృతికి హంగులు అద్దేసి
మనుషుల మధ్య బంధాలకు ప్రతీకగ
తలవని తలంపుగా వచ్చి
ప్రాంతాలన్నింటిని తడిమి తడిమి
తమ అనురాగాన్ని కుమ్మరించి
లోకుల్ని కదిలించి కలవరపెట్టి
వాన కురులను వ్యాపింపజేసి
పచ్చని పంటవిరులను
జగతి సిగలో తురిమే
అపురూప ఆత్మీయ బంధువులు
భేద భావాలకు తావు లేదు
తమకు తామే సాటి
తమకేవీ లేవు రావు పోటీ
అన్న చందాన అరిగేటి
రసరమ్య ఋతురాగాలు
జగతికి దూరం కాలేని కానట్టి
భవ్య భావాల మరుల ద్వయం
క్రమం తప్పక ఏతెంచు బంధుగణాలు
ఈశాన్య నైరుతి పవనాలు
నేలతల్లి కవలలు ఋతుపవనాలు
8
డా.వేమూరి.సత్యవతి
జిల్లా
*
కృష్ణా
ఫోన్ నెంబర్
*
9885136308
కవిత
*
శీర్షిక--"పవన-సందేశం"
వాయువంటేనే సర్వవ్యాప్తం కదా!
తక్కువ అంచనా వేయొద్ధు!
ఆపాదమస్తకం ప్రాణంతోనే కలసి తిరుగుతుంది!
అతి చేసినా,మత్తుద్రవాలకి లొంగిపోతే..
జీవితాంతం వేధిస్తూ అంతుచూస్తుంది!
సర్వాంతర్యామిలా..తిరుగాడుతూ సముద్రంలోనైనా
సంక్షోభాలను గాలి తెల్సుకుంటూనే వుంటుంది!!
ప్రాణవాయువైనందుకేనేమొ ఇంతటి తాపత్రయం!!
అంబోనిధులపై ప్రబలంగా వీస్తూ..దిశ మార్చుకుని
ఋతుపవనమై ఘనీభవింపచేసి మేఘమై..
తొలకరి చినుకై రైతు గుండెల్లో ఆనందవర్షమౌతుంది!!
నైరుతిపవనాలు నైరాశ్యం పోగొట్టి ఆర్ద్రత తో..
పుడమితల్లికి పురుడుపోసి అన్నపూర్ణను చేస్తాయి!!
కర్మభూమినే నమ్ముకున్న మనిషికి సకాలంలో వర్షమై
ఋతుపవనాలే పంటల్నిచ్చే వరదాయినులు!!
కాలుష్యాలతో ఆగ్రహం తెప్పిస్తే,సమతుల్యత తగ్గిస్తే..
ఋతుపవనాలే వరదలై కొంపలు ముంచేస్తాయి!
కొండగుండె ముక్కలై చరియలు విరిగిపడతాయి!
పర్యావరణ పరిరక్షణ ప్రకృతి దేవికిచ్చే నీరాజనం!!!
ప్రతీసారీ ఋతుపవనాలు మనని హెచ్చరిస్తున్నా..
గాలిమాటగా తీసేయవద్దు!!పంచభూతాలంటే..
వాయుపుత్రుని శక్తిలా లంకని తగలబెట్టగలవు,
సంజీవనిని తెచ్చి బతికించి ప్రాణవాయువవ్వగలవు!
ఋతుపవన "పవనసందేశం" మనకోసమే!
########
9
*
మండ.నాగేశ్వర్రావు.
జిల్లా
*
విశాఖ పట్టణం
ఫోన్ నెంబర్
*
7793939724
కవిత
*
అరుదెంచిన ఋతుపవనం !!
=========🧡=========
మండువేసవిలో అమృతజల్లు
ప్రతికర్షకుని మదిలో హరివిల్లు
ఋతుపవనమై అరుదెంచిందీ...
అందరి మనసుని మైమరపించిందీ !!
తొలకరి తానై పలకరించీ
చల్లని దీవెనలందించీ
ఆశల దీపాలను వెలిగించింది!!
ఎదురుచూసిన ఋతుపవనాలు
ముందుగానే అరుదెంచాయీ....
ఆశావహుల ఆనందాన్ని
ద్విగుణీకృతం చేశాయీ!!!
ప్రకృతి కరుణించాలే గానీ...
జీవులకేనాడూ అన్యాయం చేయలేదు !!
మనమే అతితెలివితో ప్రకృతికి
ఎదురెళ్ళి అనవసర నష్టాన్ని కోరి తెచ్చుకుని తలగోక్కుంటున్నాం !
మనం నిలుచున్న కొమ్మనే మనం
నిలువునా నరుక్కుంటున్నాం!!
దయగల ప్రకృతిని మనంకాపాడుకుంటే , ప్రకృతికూడా మనల్ని కాపాడుతుంది !!
సకాలంలో ఋతుపవనాలే కాదు
అన్ని ఋతువులూ జీవులకు అనుకూలంగానే ఆశ్రయమిస్తాయి !!
వైపరీత్యాలు తగ్గి అమ్మలా లాలిస్తాయి!!
కోటిఆశల కలల్ని సాకారం చేస్తాయి !!
------మండ.నాగేశ్వర్రావు
10
శీర్షిక:రైతన్నల ఆశాకిరణాలు.
దేశానికి వెన్నెముక రైతన్న.
అందరికీ అన్నం పెట్టేది అన్నదాత.
వ్యవసాయం నిలువునా ముంచినా దాన్నేపట్టుక వేళ్ళడుతాడు కృషీవలుడు.
వేసవి దుక్కులు సిధ్ధంచేసుకొన్నా కరుణించలేదు నీలి మేఘం.
నల్లని మేఘాలకై కంట్లో వత్తులు వేసికొని చూస్తాడు ఎదురుచూపులు
అన్నదాతకు చినుకు చింత.
చినుకు కరువైతే తనకు బ్రతుకౌతుందని బరువు.
నెర్రెలుబారిన పొలంలో కూచొని దీనంగాచూస్తుంటాడు నింగి వైపు.
తొలకరి చినుకులుపడితే వచ్చే మట్టి వాసనరైతన్నకు సౌగంధిక పుష్ప సువాసన.
తొలకరిజల్లుల పలకరింపుతో పులకరిస్తుంది భూమాత.
ఏరువాక పూజతో ప్రారంభిస్తాడు వ్యవసాయపు పనులు.
సేద్యానికి ఎంతో ముఖ్యపాత్ర పోషించేది ఋతుపవనాలు.
రైతన్నకుటుంబంలో వెలుగులు నింపేది ఋతుపవనాలు.
.రైతన్న భవితను నిర్దేశించేది ఋతుపవనాలు.
ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి పలకరిస్తేనే తొలకరి చినుకుల చిలకరింపు.
ఋతుపవనాలు అంతటా విస్తరిస్తేనే సంవృద్ధిగా వర్షాలు.
రైతన్న అప్పులు ఊబిలో నుండి బయటపడాలన్నా.
అన్నదాతల ఆత్మ హత్యలునివారింప బడాలన్నా,
వ్యవసాయం పండుగ కావాలన్నా
పెద్దైతే నీవేమిఅవుతావంటే రైతు నౌతాననే జవాబు రావాలన్నా
ఋతుపవనాలు కరుణించి వర్షాలు పడితేనే సాధ్యం.
ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి, విస్తరించి,సంవృద్ధిగా వర్షాలు కురవాలని ఆశిద్దాం.
తిప్పావఝల నరసింహమూర్తి
11
*
సీతారత్నకుమారి కారుమూరి
జిల్లా
*
తూర్పుగోదావరి జిల్లా
ఫోన్ నెంబర్
*
9440670848
కవిత
*
క్రోధి నామ సంవత్సర వైజాగ్ పౌర్ణమి కథల పోటీకి.
శీర్షిక కొత్త పంట.
పగలు కాసిన ఎండవేడికి శరీరం అలసిపోతే
సాయంత్రం చన్నీటి స్నానం అలసట తీర్చింది.
చంద్రుని అందంతో పోటీపడే తెల్లని మల్లెలు
జడలో చేరి సువాసనలు వెదజల్లుతున్నా యి.
మంజుల కట్టిన తెల్లని చీర ఆమె అందం ముందు
వెలవెలబోతోంది. భర్త రాక కోసం ఎదురుచూస్తోంది.
మంజుల భర్త కార్తీక్ ఆకలి ఆకలి అంటూ వచ్చాడు.
ముందు స్నానం చేసి రండి అంటూ నవ్వుతూ బాత్రూం లో కి పంపిది.
ఏంటి మంజూ సువాసనలతో రెచ్చగొట్టే స్తున్నావు.
ఆకలిగా ఉంది అన్నం వడ్డించు.అన్నాడు కార్తీక్.
బయట పెరడులో ఏర్పాటు చేశాను అక్కడ భోంచేద్దాం
సర దాగా అంది మంజుల.
అరుగు దగ్గరగా రెండు కుర్చీలు వేసి ఉంచింది .
వేడి వేడి అన్న్నం కొత్తదైన ఆవకాయ, కోసిన బంగినపల్లి మామిడిపండు ముక్కలు రెడీ గా ఉంచింది.
చల్ల చల్లగా గాలి వీస్తోంది. ఎక్కడో వర్షం పడుతున్నట్టుంది.
కక్యూబ్
12
పిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
క్రోధి వైశాఖ మాసం పౌర్ణమి కవితల పోటీకి...
అంశము :-- ఋతుపవనములు.
శీర్షిక :-- వర్షములకు మూలం.
1.తే.గీ.
వర్షములను తెచ్చు ఋతుపవనము లిలను
గాలి దిశమారి ఋతుపవనాలు సంభ
వించు,కాలానుగుణముగా వీచు గాలు
ల వలన కురియు వర్షములన్ని దిశల.
2.తే.గీ.
దేశమందున నైరుతి దిక్కునుంచి
వచ్చునవి నైరుతి ఋతుపవనము లెపుడు
కేరళను తాకి క్రమముగా భారతాన
వ్యాప్తి చెంది నాల్గు నెలల పాటు వాటి
ప్రాభవమ్మును చూపించి వర్షమిడును.
3.తే.గీ.
కర్షకుల కివి కీలక వర్షములగు
సాగు పనులకు తొలకరి జల్లు కురియ
పంట కాధారభూతమీ వర్షమనుచు
దుక్కులను దున్ను చుందురు మిక్కుటముగ.
4.తే.గీ.
ఋతుపవన ప్రభావము వల్ల గతులు తప్పి
కొన్ని ప్రాంతాల యందున కొన్ని సార్లు
వర్ష మధికముగ కురిసి వరదలకును
కారణంబగుఢ నష్టము కలుగజేయు.
5.తే.గీ.
గాలుల దిశ యాధారముగాను వివిధ
రకములగు ఋతుపవనములు కలవు భువి దేశమందున నీశాన్య దిక్కునుంచి
వచ్చు నీశాన్యపు ఋతుపవనము లెపుడు
క్రమముగా వ్యాప్తి చెంది భారతమునంత
మూడు నెలలుగ ప్రాభవ ముండు నివియు.
6.తే.గీ.
వర్షము పయిన యాధార పడిన పంట
లెక్కువగ కలిగిన దేశమిదియె కనుక
భరత దేశమున ఋతుపవనములు ప్రము
ఖమగు పాత్ర వహించును కచ్చితముగ.
**************************************
13
పేరు: డా.భమిడిమఱ్ఱి కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
తేది : 21-6-24
అంశం : ఋతుపవనాలు
శీర్షిక : వరప్రసాదాలు
భగవత్ వరప్రసాదాలు
ఋతుపవనాలు
నైఋతికానీ ఈశాన్యం కానీ
పూయిస్తాయి తొలకరి
జల్లులనే పుడమి పూలను
కవ్వమై కడలి చిలకగా
తాండవమాడసాగాయి
తరువులు
ధరించింది గగన సుందరి
నల్లనల్లని మబ్బుల చీరను
తొంగితొంగి చూస్తున్నాడు
తూర్పుకొండలపై మబ్బుల పరదాల చాటునుండి
ఉరుకులపరుగుల సెలయేళ్లు
ఏటినీట ఎగరెగిరి చిందులు వేసే చేపపిల్లలు
కప్పలబెకబెకలు, తూనీగల గానసరళులు
కురిపించాయి వానను
మురిపించాయి కానలను
సంతరించుకుంది కోత్త శోభను ప్రకృతి
యావత్తు మెరిసే ఆకులతో
విరజిమ్ముతున్నాయి
ముత్యాలరాశులను మేఘ
కన్నియలు తమఆకాశ
రాజ్యంనుండి
ఆనందంతో నాట్యంజేస్తూ
కురిపిస్తున్నాయి చిరుజల్లలను ఆనీలమేఘ
మాలికలు
పుడమి పరవశాన వెదజల్లుతోంది తన పరిమళాలను
కురిపిస్తున్నాయి ఋతుపవనాలు అమృత
ధారలను
సకలజీవరాసుల జీవనానికై
అవనిని ప్రచండ జ్వాలలతో ఉక్కిరిబిక్కిర
చేస్తున్న ఆభానుని శాంతింపజేయటానికా అన్నట్లు
మేఘాలే అప్సరసలై చల్లని గాలులసరాగాలతో
చిటపట చినుకులుగ
నర్తిస్తున్నాయేమో
వినీలాకాశంలో తారకలతో ఆడుకుంటూ
మేఘమాలికల ఊయలలలోఊగుతూ
మబ్బులపల్లకిలో ఊరేగుతు వచ్చావా
తొలకరి జల్లులను కురిపిస్తున్న
ఓఋతుపవనమా !
స్వాగతం నీకు సుస్వాగతం.
14
రచన :ప్రసాదరావు రామాయణం
ఫోన్: 9441934110
కావలి నెల్లూర్ జిల్లా
పిన్:524201
వృక్షయాగం చేశావే జ్ఞానసూన్యుడా !
సర్పయాగం చేసిన జనమేజయుడననుకున్నావా ?
త్యాగశీలురు తరువువులను
అత్యాశల గొడ్డళ్లతో నరికేశావే ?
వెతికి వెతికి మతిమాలి !
ఆవాసము లేక పక్షులు
విలవిల లాడి పలపలా రాలిపోయాయే
విలపిస్తున్నది చూడు ప్రక్రృతిమాత భోరున
భీతితో కకా వికలైన ఋతువులు చెల్లాచెదరై
అటునిటు పరువులెట్టాయి
వసంతమా ఇది ?,
ఎక్కడ మావిచివురు ?
ఎక్కడ కోకిల గానం ?
ఎక్కడ నింబపూత ?
వసంతంలో శిశిరం !
శిశిరంలో హేమంతం!!
ఎక్కడ దాగాయో జీమూతాలు
ఎప్పుడు చినుకు రాలునో ఎరుకలేదాయే
అయితే వరదలు కాకపోతే కరువులు
కర్షకుని కన్నీరు చూడు ఆకాశంకేసి చూస్తూ
పంటలు లేక కూటికి లేక నీటికి లేక
నికృష్ట చావు చస్తావు మర్త్యుడా త్వరలోనే !
ప్రసాదరావు రామాయణం
15
[22/05, 10:20 am] Lalita Sister: కవనజ్యోతి కవితలపోటీ
అంశం :ఋతుపవనాలు
శీర్షిక :ప్రకృతి విలాపం
..............................
ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలే ఋతువులు.
ఆరుఋతువులు..ఆహార్యముగా ధరణి తనధర్మం తను గతితప్పక నిర్వర్తిస్తుంటే, విచక్షణా జ్ఞానమున్న మనిషిమాత్రం తనకు ప్రకృతి ప్రసాదించిన పశుపక్ష్యాదులనుండి మేలుపొందుతూకూడా వాటిని సంహరిస్తూ ప్రకృతికే విఘాతం కలిగిస్తున్నాడు.. ఫలాపుష్పాదులనిచ్చే చెట్లను స్వార్ధంకోసం నరికి సమతుల్యతకు భంగం కలిగిస్తూ ప్రకృతి విలయ తాండవానికి కారకుడవుతూ, ప్రకృతినే నిందిస్తున్నాడు..
తల్లి తన గర్భంలో నవమాసాలు మోసి రక్తమాంసాలు పంచి పెంచి పెద్దచేస్తే ఆ తల్లిని అవసాన దశలో వీధులపాలుచేసి తనసుఖం తాను చూసుకోవడం న్యాయమా.ఆ తల్లి వేదన పిల్లలకు శాపమేకదా?
మరి ప్రకృతికి విఘాతం కలిగిస్తే
ప్రకృతి ప్రకోపించి అకాలవర్షాలనుకురిపించడం లేదా అనావృష్టితో భూమాతను అతలా కుతలం చేయదా?
అతివృష్టి అనావృష్టి తో రైతు కన్నీరుపెడితే దానికి కారణం ఎవరు. స్వార్ధపరులైన మానవులే కదా.
పన్నెండుమాసాలు, ఆరుఋతువులుగా మూడుకాలాలుగామారాయి.
అవే వసంత గ్రీష్మ వర్ష శరత్ హేమంత శిశిర ఋతువులై ప్రాణికోటి మనుగడకు ఆధారమవుతున్నాయి. వేసవి వర్షా సీతాకాలాలు మూడూ మనిషి బాల్యం యవ్వనం వృద్ధాప్యం లా ముచ్చటగా వచ్చిపోతూనే ఉంటాయి.అన్నీసహనంగా భరిస్తూపోతేనే మనిషి జీవితం ధన్యం.
డి . ఎం. అనలకుమారి
హైదరాబాద్
22-05-2024.
16
చిత్తడి కరచాలనం చేద్దాం..!
_________________________
కొన్నినెలల తరబడి నేల తల్లి
తొలకరి వాన కోసం ఎదురు చూసె!
ఏకరువు పెట్టె కరువు ప్రాంతాలలో
దోసెడు నీరు లేక గొంతెండి పోయే!
తిరుపతి గుండులతో ఉన్న భారీ వృక్షాలు
తలంటు చినుకులకై అన్వేషించె
శుభకర ఏరువాకకు శ్రీ కారం చుడుతూ
అన్న దాతలు ఆకాశం కేసి ఆశగా చూస్తుండగా...
రుతు పవనాలు ఆనవాయితీగా వచ్చి
వేడెక్కిన పుడమి ముంగిలి లో
చినుకులు చుక్కల ముగ్గు లేసి
వేసవి తాపాన్ని జల్లులతో చల్లార్చుతాయి!
వరుణ దేవుడు ఏ రాజకీయ పార్టీ
కాదు . ఆయనిది ప్రకృతి ప్రసాద పార్టీ
రుతు పవనాలు ఏ రాజకీయ పార్టీలో చేరవు! ఖద్దరు నేతలు లాగ
అవకాశ వాద కండువాలు కప్పు కోవు !!
నైరుతీ, ఈశాన్య రుతు పవనాలు
నిర్ణీత సమయంలో మన దేశం లోకి వచ్చి.. సర్వత్రా విస్తరించి
భారతదేశాన్ని హరిత ప్రదేశంగా
జనజీవనాన్ని గణనీయంగా మార్చుతాయి.!
ఆలస్యమైన రుతుపవనాలు
మన దేశంలోకి నేరుగా ప్రవేశిస్తాయి.!
అనుకున్న అతిథికి మనం
నైరుతి, ఈశాన్య మూలల తలపులు తెరచి
సాదర స్వాగతం పలుకు దాం..!
చిత్తడి కరచాలనం చేద్దాం.!
__________________________
జి.సూర్యనారాయణ, 6281725659.
ఆర్యా.. సదరు కవిత నా స్వంతం.
దేనికీ అను వాదం కాదు.అనుకరణ లేదు. మీ పోటీల కు మాత్రం ప్రత్యేకంగా రాశాను.పరిశీలించగలరు.
మీ సూర్యనారాయణ.
17
ఋతుపవనాలు
శీర్షిక ఆత్మీయ పవనాలు
ఎండలు చుట్టుముట్టి తూటాలు పేలుస్తుంటే
వడియాలు ఎండబెట్టుకోవడానికి మంచి కాలమే
కానీ చెమటల చెలిమలు ఎండిపోతున్నాయి
చెట్ల కొమ్మలతో కటీఫ్ అన్న గాలి
ఎండ పాలన కింద చేరి వడదెబ్బ గధ తిప్పుతుంది
పర్రెలు బారిన పొలాలు, బీటలు వారిన చెరువులు
జీవజాతంతా కూరుకపోతుంది వాన తపస్సులో
ఆకాశం పంపే దేవదూతలు ఋతుపవనాల కోసం
అవి రాక్షస పాలన దునుమాడే హరిత సుందరిలు జీవజాలం మనసులు గెలుచుకునే దేేవలోక నర్తకిలు
ఏడాది కాలానికి అన్న పానీయాల ఖజానాలు
తప్పుడు, మోరుదొప్పు వానలతో దెబ్బ మీద దెబ్బ
నెత్తురు నీరైన పంటలపై తీస్తాయి దొంగ దెబ్బ
కాలం కాని కాలంలో కలిసొచ్చే సోపతిగాళ్ళైతే
కరువులో గుక్కెడు నీళ్లు, బుక్కెడు ముద్దలు
ఐదేళ్లకోసారి వచ్చే ఋతుపవనాలు
ఏడేళ్ల కరువును బాపేవి కావు
చినుకు చినుకును ఒడిసిపట్టి దాహం తీర్చవు
జెండాల నీడలో కురిపిస్తాయి సానుభూతి వర్షాలు
కడుపులో పెట్టుకొని, కంట్లో నలుసు పడకుండా చూస్తామంటాయి
ప్రచార యుద్ధంతో ముందుకొచ్చి మన బలం లాగేసుకుంటాయి
ఎన్నికల మాయాతంత్రంలో గెలిచాక
జెండాలు పనికిరావు దిష్టిబొమ్మలా కూడా
ఋతుపవనాలేవైనా ఆదుకునే అమ్మలైతేనే ఊరట
అందని కొమ్మలు కాకుంటే నిండు బలం
..................................................................
కొమురవెల్లి అంజయ్య
18
*
నాగలక్ష్మి తంగిరాల
జిల్లా
*
ఆక్లాండ్
ఫోన్ నెంబర్
*
64212331334
కవిత
*
అంశం: ఋతుపవనాలు కవనం: తంగిరాలనాగలక్ష్మి ******* స్వాగతం పలుకుతున్నాం కవితా గానంతోఋతుపవనములారా! ఋతుపవనాల కవనం శ్రేష్టమై, శుద్ధమై, వజ్రంలా సాగే కవితాగానం ఒకవైపు, మరొకవైపు మేమొస్తున్నాం అంటూ వీచే ఋతు పవనాలు నాదాలుభరతమాతవైపుకు వరుణవాయుదేవుళ్ళు తొంగిజూడ,తామసులకు తాపము చల్లార, కృత్రిమగాలి నియంత్రణయంత్రములు విశ్రాంతినొంద వడగాల్పులఉధృతంబుసన్నగిల్ల వాగులుచెరువులు,బావులు నిండుగాపొంగ ఎండినపంటపొలాలుపచ్చదనపు రంగు లీని పసిడి పంటలు పండుటకు రంగము సిద్ధంచేసుకుంటున్నాయి భూగోళంనిండుతుంది నీటితో కాలచక్రగమనానికనుగుణంగాఋతువులుమారగా ప్రకృతిస్పందనవిలయతాండవంచేసిప్రళయంగామారవచ్చు మలయమారుతంలా ఆహ్లాదామృతంకురిపించనూ వచ్చు దేశం ఎదురు చూస్తోంది మండుటెండలలో మండుతూ వడగాల్పుల గాడి నుండిబయటపడాలని మంచుతునకల కోసం ఎదురు చూస్తోంది నా దేశం చల్లగాహాయిగా రండిశాంతినిప్రసాదిదించండి ఓఋతుపవనములరా! గందరగోళంగా రావద్దని కోరుకుందాం!
ప్రకృతిలోమారుతున్న ఋతువులు మానవ జీవితాలకుదివ్యఫలాలుప్రసాదించేక్రతువులు వేడుకుందాం. పాడుకుందాం కవితా లోకంలో విపంచిలై విహరిద్దాం **********
19
*
వాడపల్లి రాధ
జిల్లా
*
హైదరాబాద్
ఫోన్ నెంబర్
*
9032044635
కవిత
*
కవనజ్యోతి - సీజన్ 5
వైశాఖ పౌర్ణమి కవితల పోటీ
అంశం :--ఋతుపవనాలు
గ్రీష్మ తాపము దీర్చ వచ్చిన జలధరాలు,
రైతు భారము తొలగజేసెడు వర జలాలు,
వేగిపోతున్న జనులకు సాంత్వనాలు...
ఈ ఋతుపవనాలు !
నల్లమబ్బులు నిండిన ఆకసాలు,
మెల్లమెల్లగ కదలాడు పంటచేలు,
మురిసిపోతున్న రైతుల కనుల కలలు...
ఈ ఋతుపవనాలు!
చినుకు చినుకుల జల్లుల సంతసాలు,
చల్లగా వీచు గాలుల పరవశాలు,
తడిసి మురిసిన మట్టికి పరిమళాలు...
ఈ ఋతుపవనాలు!
జలజలా పారు పరుగుల నీటి జాలు,
పిల్లపాపల అల్లిబిల్లి కేరింతలు,
కాగితపు పడవలాటల సంబరాలు...
ఈ ఋతుపవనాలు!
పంటచేలలో మొదలైన ఏరువాక,
ఇంటిలోపల మగువల పనుల కేక,
లోకమంతకు శుభములు నింపు గాక...
ఈ ఋతుపవనాల రాక!
By
వాడపల్లి రాధ
కూకట్ పల్లి,
హైదరాబాద్.
20
*
నెల్లూరు వేంకట లక్ష్మి
జిల్లా
*
కర్నూలు
ఫోన్ నెంబర్
*
9491632232
కవిత
*
పౌర్ణమి కవితా పోటీ
అంశం: ఋతు పవనాలు
శీర్షిక:జీవిత మైదానం
**********************
పరుగెత్తే కాలం తో
పరుగులు పెట్టే జీవితాలు
ఆధునికత వైపు ఉరుకులు
బిజీగా సాగుతున్న గజిబిజి గందరగోళాలు
నలుగురు కలిసి సాగని నడకలు
పదుగురు పంచుకోని పనులు
వెన్నుతట్టి ప్రోత్సహించని హితులు
కష్టసుఖాలు పట్టించుకోని స్నేహితులు
ఆటలు మరచిన చిన్నారులు
విలువలు నేర్పడం మరచిన పెద్దలు
అందరూ...అందరే...
ఒంటరి మైదానం లా మిగిలిపోయారు
కలిసి వుండడం లో తృప్తిని
కలిసి గడపడం లో సంతృప్తిని
ముందు తరాల అలవాట్లను
తిరిగి పొందాలంటే
మైదానం వైపు అడుగులు వేయాలి
మరల ఆ రోజులను గురుతుకు తేవాలి
మైదానపు గుండె తొలకరి జల్లులా తడవాలి
ఋతుపవనాలు ఋజుమార్గంలో పయనించినట్టు
ప్రతీ ఒక్కరూ సన్మార్గంలో నడవాలి...
అప్పుడే జీవిత రహదారి పచ్చదనంతో పరిఢవిల్లేది..
ఈ కవిత నా స్వంతం ఇది దేనికి అనుకరణ అనువాదం కాదని హామీ ఇస్తున్నాను.
21
కవన జ్యోతి , కవితా గానం -5
క్రోధి వైశాఖ మాసపు పౌర్ణమి కవితల పోటీ
అంశం ఋతుపవనాలు
శీర్షిక వర్షమిచ్చే జీవనాధారాలు
నిప్పురవ్వలతో భానుడి భగభగలు
వేడి సెగలతో భూతలం ఉష్ణ మండలమే
ఒక్కసారిగా చిరుజల్లులతో మనసులు
మురిసి ప్రకృతిలో సంతోషాలసందడే
ఋతువుల వలన వచ్చే గాలులు
ఋతు పవనాలుగా ప్రసిద్ధియే
మనకు రెండురకాల ఋతుపవనాలైన
నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతు
పవనాలతో వర్షపాతం సంభవించు
మన వ్యవసాయాని కనుకూలమై
పంటలు సమృద్ధిగా పండి, సుభిక్షానికి
నైరుతు ఋతు పవనాలే జీవనాధారాలు
జూన్ నుండి సెప్టెంబర్ వరకు వానలతో
సస్యశ్యామలమే
ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్ నుండి
డిసెంబర్ వరకు వర్షాలతో ముంచెత్తు
జలం లేనిదే ప్రాణులు జీవించడం గగనమే
బంగాళా ఖాతంపై నుండి వచ్చే గాలులు
ఈశాన్య ఋతు పవనాలుగా, నవంబర్ లో
వచ్చే తుఫానులకు హేతువులివే
మనదేశానికి భగవంతుని వరాలుగా నెంచి
ఈ ఋతుపవనాలు వానలను కురిపించి
తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా దీవించె
నీటిని పొదుపుగా వాడుకుంటూ,భావితరాలు
ఆనందంగా జీవించాలని కోరుకుందాం
వర్షాల కోసం వృక్షాలను పెంచుదాం
తోట సులోచన
నెల్లూరు
చరవాణి 9490173053
హామీ పత్రం
ఈ కవిత నా స్వంతమని హామీ యిచ్చు చున్నాను
22
*
డా బల్లూరి ఉమాదేవి
జిల్లా
*
కర్నూలు జిల్లా
ఫోన్ నెంబర్
*
9493846984
కవిత
*
ఋతుపవనాలు
భారీ వర్షమును అందించు గాలులే
రుతుపవనాలుగా జగతిలో ఖ్యాతి నందె
కాలాను గుణముగానాలుగు నెలల పాటు
వీచే చల్లని గాలులే ఈ రుతుపవనాలు
అధికమౌ వర్షపాతంతోడను తేమతో
మనకు వర్ష సూచన నందించు గాలులివియె
రుతుపవనాలు వీచే సమయంలో
గాలి తాకిడి ఎక్కువ అయ్యే కొలది
వరదలా ప్రవహించి దేశాన్ని అతలాకుతలంచేస్తూ
వస్తుంది ఉరుములతో కూడిన వర్షం
సక్రమంగా కురిస్తే రైతన్నలకు ఇది ఆశాదీపం
పంటలకు నీరు అందించేవీ రుతుపవనాలే
మేలు చేయడంతో పాటు ఈ రుతుపవనాలు
ప్రకృతి వైపరీత్యాలకు కూడా ఒక్కొక్కసారి
కారణభూతం అవుతాయనేది నిజం
భూమి సముద్ర ఉపరితలాల యొక్క వేడిచే
వ్యాపిస్తూ వుంటాయి రుతుపవనాలు
దేశంలో వర్షాకాలంలో వేసవిలో భూమి వేడెక్కి
తేమతో కూడిన గాలి ప్రసరణ ద్వారా పైకి సాగి
విస్తరించి చల్లబడితే ఘనీభవింప చేస్తూ
వర్షం రావడానికి దోహద కారి అవుతుంది
వేసవి తాపాన్ని బాపి చల్లదనాన్ని గూర్చే
రుతుపవనాలను ఆహ్వానిద్దాం
తొలకరి జల్లులలో తడిసి ఆనందిద్దాం
23
*
చంద్రమౌళి కుప్పిలి
జిల్లా
*
శ్రీకాకుళం
ఫోన్ నెంబర్
*
9346457223
కవిత
*
కవితా గానం సీజన్ 5
(పోటీ కొరకు....)
అంశం: ఋతుపవనములు
శీర్షిక: *ఋతురాగం*
రచన :చంద్రమౌళి కుప్పిలి
MEO, Srikakulam
532186. A.P
Ph no: 9346457224
****************************
నేను -- నీలియందాలమేఘాన్ని.. కరిమబ్బులపవనాన్ని..ఋతురాగాన్ని!
బువ్వకోసం నేలనుబురదగచేసే గగనజలాన్ని..
మోసపుటెత్తులు తెలియని అన్నదాతకు ఆశలధారని..
సముద్రతలాన పురుడుపోసుకుని --
ఇలాతలంపై వాలిన నీలివిహంగాన్ని..
నైఋతి,ఈశాన్యములను రెండు రెక్కల ఋతుపవనంపక్షిని...
మోదంతో ఆలపిస్తే నేలంతా -- పచ్చదనమే..
ప్రకృతి వికృతమైతే కనిపించేదంతా భీభత్సమే..
నరుని స్వార్థానికి, దగాకోరుల ధనాశకు మాదారి మళ్ళుతుంది..
మే నెలాఖరుకు కేరళనుతాకే మా రాగం జూన్ వరకూ నొకపరి వినబడదు..
ఈశాన్యపవనాన తమిళనాటను జేరి తబ్బిబ్బు పడుతూ
ఆంధ్రనేలనుతాకగా..
రైతుకూలీ కూలిపోగా.. కర్మజీవులు మోసపోగా .. విస్తుపోతాం..
మేం ఋతురాగాలం!.. వినోద గీతాలం!.. విషాదాశ్రువులం!! ..
నేలతల్లిని కొండతండ్రిని కోతవేసే దుర్ఘటనలకు గాలెత్తునసాక్షులం..
మా దారెటో తెలియని ఆకాశమంత మౌనరాగాలం...
అతివృష్టో అనావృష్టో ఏదో బోధపడని ఆలాపన మాది...
వడగండ్లో కడగండ్లో ఏమీ ఎరుగని కాలం మాది...
మోసపోయిన మేఘం.. పాలిపోయిన మెరుపు.. శబ్దంలేని గర్జన అన్నీ మావే..
చూట్టూ నిశ్శబ్దం.. అంతలోనే పెను తుఫాను..
రైతు గుండెల్లో వాయు'గండం'..
ఇదేనేమో మా అల్పపీడనం.. ఇంతేనేమా మా అంతర్మధనం..!!🙏
--------------చంద్రమౌళి కుప్పిలి..✍️
ధృవీకరణ:ఇది నా స్వీయ రచన
దేనికీ అనుకరణ కాదు
24
*
కొంజేటి రాధిక
జిల్లా
*
అనంతపురం
ఫోన్ నెంబర్
*
9493273114
కవిత
*
9493273114
పేరు కొంజేటి రాధిక
ఊరు రాయదుర్గం
అంశం...ఋతుపవనాలు
శీర్షిక....వరాల జల్లు
మేఘాల సింహగర్జనతో... ఉరుముల శంఖారావంతో యుద్ధభేరిని మోగిస్తున్నట్టుగా...
ఆకాశం గంభీరంతో,
ప్రకృతి నిశ్శబ్దంతో మౌనంగా ఆహ్వానిస్తుంది రుతుపవనాలను...
ఋతురాగాల సరిగమల సవ్వడికై రైతన్నల ఎదురుచూపులు...
ఏ అలజడి వినబడినా,
ఏ జడివాన అలికిడి అగుపడిన సంబరమే....
తొలకరి ప్రియురాలితో కలిసి, పంటచేలలో పరవశాల వర్షంలో తడిసి, ఆశలవిత్తులను నాటి, భవితవ్యాన్ని సువర్ణమయం చేసుకోవడానికి రైతన్నలు పడే తహతహ అంతా ఇంతా కాదు...
రుతు రాగాలలో అపసవ్యం వినపడినా,
దశ దిశ మార్చిన రుతుపవనాలకు రైతన్నల మొహం చిన్నబోతుంది ఆశల సౌధం కూలిపోబోతోందని...
సకాలంలో రుతుపవనాలు ప్రవేశించి,వర్షాలు కురిస్తే రైతన్నల ప్రతిరోజు పండగే...
పేర్లు మారినా, దిశ మారినా,
రైతన్నల పెదాలపై చిరునవ్వును చూసి, జనుల దాహార్తిని తీర్చే రుతుపవనాలు ఆర్థిక వ్యవస్థపై, పర్యావరణపై గణనీయమైన మార్పులు చేర్పులు జరిగే రుతుపవనాలు ప్రపంచానికి అత్యావశ్యకం.
నైరుతి నిర్వీర్యం చేసినా,
ఈశాన్యం ఈశాడించుకున్న భూగోళంపై కరువు కరాళ నృత్యం చేస్తుంది... ఆకలి,దాహార్తితో జనుల గోలలు భయానకమే...
రుతుపవనాల శ్రావ్యమైన సరిగమల సంగీతం ప్రపంచానికి సంక్షేమాన్ని కలిగించే మలయ మారుతం,...
సంక్షోభంలోంచి ప్రగతి పధం వైపు పయనింపచేసే ప్రగతిరథ చక్రం.
25
కవితాగానం
వైశాఖ పౌర్ణమి కవితలపోటీ
శీర్షిక ఋతుపవనగతులు
వాణి సరోజిని లక్కరాజు హైదరాబాదు
9491054829 .
నిత్యచైతన్యవంతం కాల ప్రవాహ గమనం
పంచభూతాలు , సృష్టి స్థితి లయల హొయలకు పట్టుగొమ్మలుకాగా
ఆమనినుండి ఆకురాలు కాలంవరకు ఋతుపరివర్తనలు
సృష్టి రహస్యాన్ని చెప్పకనే చెబుతున్నాయ్
మానవజీవితంలో, స్థితి గతులు ,జననమరణాలు
సర్వం ఋతుబధ్ధమే
ఆరుఋతువులలో వర్షఋతువుకు దేశ ఆర్దిక వ్యవస్థ సామాజిక,వాతావరణాలతోఅవినాభావసంబంధం
పంటలకై సాగునీరు , ప్రాణుల కు తాగునీరు , యిచ్చేది ఋతు పవనాలే .
ఈశాన్య ,నైరుతీ, ఋతు పవనాలు భారతావని కి బంగారు వరాలు , పెట్టని కోటలు .
శ్రావణ ,భాద్రపదాలు ,వర్ష ఋతువుగా దక్షిణ భారతావనికి
సుబిక్ష ప్రదాతలౌ అన్నదాతలు
చల్లని నైరుతీ ఋతు పవనాల స్పర్శకు నీటి యావిరితో నిండి దట్టంగా పరుచుకున్న మేఘాలు స్పందించి ,
వర్ష మై భూతలాన్ని అభిషేకిస్తాయ్ .
జూన్నుండి సెప్టెంబర్ వరకు నైరుతీ బుతుపవనాలు
చురుకుగా స్పందిస్తాయి .
ఈశాన్య ఋతుపవనాలు అక్టోబరు నుండి డిసెంబరు వరకు
బంగాళాఖాతంమీదుగాఈశాన్యఆగ్నేయాలకుపయనిస్తాయి
పెట్టని కోటలైన హిమగిరి శిఖరాలు ఋతుపవనాలనడ్డ
గించి భారతావనిని బంగరు భూమిగా మలచటంలో
మంచి పాత్ర.వహించాయి .
స్వీయరచన
26
: పవనాల పరిష్వంగంలో
******************
భూగోళం భ్రమిస్తూ
పరిభ్రమిస్తున్న తరుణంలో
పవనాలు దిశను మార్చుకుంటూ
ప్రకృతిలో మార్పుల
కాలవాలమైనపుడు
సూర్యుని దహనం తగ్గిపోయి
నల్లటి మేఘాలు ఆకాశంలో
ఉరుములు మెరుపుల
వస్త్రాలు మార్పుకుంటుంటే
కొత్త గాలుల ఆగమనం
నైఋతి దిశనుండి
చెట్లు వాటి గంభీరమైన
గాయక బృందానికి నృత్యం చేస్తుండగా
వర్షం బిందువుల ముత్యాలు జీవధారలై
నేలకు ప్రాణం పోస్తుంటే
నా చర్మం దాని మీద బట్టలు తిరస్కరిస్తు
నన్ను మరింత కమ్మని చెమటతో
సమ్మోహితం చేస్తుంటే
తాజా బురద పరిమళం
మా నాసికా రంధ్రాలను కప్పివేయగా
దాహర్థితో డస్సిన క్రిమికీటక, జంతుజాలములు
అనందపారవశ్యంలో
సప్తస్వరాలు ఆలాపన చేస్తుంటే
ఇన్నిరోజులుగా గరం గరంగా గడిపిన క్షణాలు
చల్లని పవనాల మేళవింపుతో
ఒళ్లుతేలీని తన్మయత్వంతో
రుతుపవనాల స్పర్శాపరిశ్వంగమైనాను.
***********
మేకల రామస్వామి
చెన్నూర్
27
*
గజవెళ్ళి శ్రీనివాసాచారి
జిల్లా
*
కాజీపేట హన్మకొండ జిల్లా
ఫోన్ నెంబర్
*
9059438068
కవిత
*
శీర్షిక: ఎన్నికల పవనాలు
…
మన దేశాన్ని
జూన్ మాసంలో పలకరించేది
నైఋతి ఋతుపవనాలు
ఈ ఏడు మాత్రం
ఎటుచూసినా
ఎన్నికల పవనాలేగా
ఋతుపవనాలు
కురిపిస్తాయి చినుకులు
ఎన్నికల పవనాలు
రాలుస్తాయిగా ఓట్లు
నోట్లతో ఓట్లు కొనే
దుష్టసంస్కృతికి
తెరలేపింది నేతలు
ప్రజాస్వామ్యానికి
పునాది ఓటైనా
పవిత్రమైన ఓటుకు
కులం మతం రంగుపూసేది
ఎన్నికల క్షేత్రంలో
నోట్లు నాటుతున్నారు
అధికార పంటను కైవసం చేసుకుని
ప్రజల సొమ్మును భోంచేస్తున్నారు
ఇదంతా గమనించి
రాజ్యాంగ నిర్మాతల ఆత్మలు
ఘోషిస్తున్నాయి
28
*
కవి పేరు:- సింగీతం సంతోష్ కుమార్
ఊరు:- ఎల్లారెడ్డి
జిల్లా:- కామారెడ్డి
చరవాణి:- 8897152205
**********************************
వేడి గాలులతో మానవాళిని నరకయాతన చెయు రవి
ప్రతాపానికి
వరుని దేవుని వెదుకున్న నరులు
నరకయాతన చూపే కఠిన కిరణాలు
చెరువులన్నీ ఆవిరి,మనుషుల కాయం వేడి తో
వేడి వేడి అని బాధ పడే సమయాన
నిమ్మల,చల్లని,గాలులతో సమస్త జీవకోటికి చల్లబడేలా,
చల్లని గాలులతో
ఆనందాన్ని పంచే ఋతు పవనాలు
జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి దిశగా
అరేబియా సముద్రం మీదుగా హిమాలయాల వైపు
అక్టోబరులో వ్యతిరేక దిశలో
అరేబియా సముద్రం మీదుగా హిమాలయల వైపు
నిరంతరం
విచె గాలులే
అక్టోబరు మాసంలో వ్యతిరేక దిశలో వీస్టూ
ఈశాన్య రుతుపవనాలని పిలుబడతున్నా గాలుల
వేడి నేలను చల్లాబడిచే
నూతన వర్షపు జల్లు
గాలులు అధిక పీడనం నుంచి తక్కువ పీడనం వైపు వీస్తు
సముద్రంపై ఉష్ణోగ్రత భూమిపై కన్నా కొంచెం చల్లగా ఉంచుతు
సముద్రంపై నుంచి గాలులు విచుతు
గాలులు తమతోపాటు సముద్రపు ఆవిరిని కూడా తీసుకొని
వానగా మార్చే పవనం....
29
22.5.24 .. బుధవారం
అంశం:: ఋతుపవనాలు
శీర్షిక:: జన జీవితాలు
పంచభూతాల కలయికే ప్రకృతి
ప్రకృతితోనే మనకు దొరుకు జీవన భృతి
ఋతువులు లేకుంటే పవనాలు లేవు
పవనాలు లేకుంటే ప్రాణాలు నిలువవు
మనకున్నాయి ఆరు ఋతువులు
అవే మన జీవన విధానానికి ప్రమాణాలు
ఒక్కొక్క ఋతువుకు రెండు నెలల గడువు
ఆ రెండు నెలల గడువులోగా
వెతుక్కోవాలి బతుకు తెరువు
ఉత్తరాయణము దక్షణాయనము అని
ఆయనములు రెండు
ఆధారాలు మనకు మెండు
ఋతువులతోనే మన క్రతువులు సాగును
ఏరువాకతో మనకు సాగు
సక్రమముగా జరుగును
ఋతుపవనాలు సక్రమముగా
ప్రవేశిస్తేనే మన బ్రతుకులు
మన నోటికి మెతుకులు
కానీ ప్రకృతిని వికృతిగా చేసి
అకాల వర్షాలకు
అతివృష్టి అనావృష్టికి కారణ
మవుతున్నాము
ఉద్గారాలతో ప్లాస్టిక్ వ్యర్థాలతో
వాతావరణాన్ని కాలుష్యము
చేస్తున్నాము
దాని నుంచి ఋతువులు గతి
తప్పుతున్నాయి
మన ప్రవర్తన మార్చుకోక పోతే
ప్రకృతి కళ్లెర్ర జేస్తే
మన మనుగడకే ముప్పు
అలా జరగడము మనకు మేలా చెప్పు?!!
కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు. 8309920625
ఈ కవిత నా స్వీయ రచన అని
హామీ
30
శీర్షిక ---- కాలం
రచన ----లలితా చండి
.
కాలం ఎంతమహోన్నతమైనది
వాయు వేగంతో అన్నిటిని కనుమరుగు చేసి తనలో దాచుకునే మాయలాడి,
యుగాల చరిత్రను గంటకొట్టి మరీతెలుపుతుంది
సృష్టికి మూలం కాలమా!
కాలానికి ముందే సృష్టా?
ఏమైనా పంచభూతాలతో నిందినదేగా సృష్టి
నువ్వు నేను వాటి సాదృశ్య చిత్రాలేమేగా!
తెలిరిగే మనసును అదుపు
పెట్టకోలేక తలక్రిందులుగా వ్రేలాడే గబ్బిలాలమేగా?
జీవులన్ని బుద్భుదాలే,
వాయు భక్షకాలే
అయనాలను సంవత్సరాలను కలిపేసే ఋుతుపవనాలకు
తబ్బిబ్బు అయ్యే సజీవ చైతన్య తేజో మూర్తులే సుమా!.
చరా చరాలన్నీ పవన సంస్పర్శలేగా!
వసంత గాలులనుఆస్వాదిస్తూ,
గ్రీష్మ తాపాలకు అల్లాడే
ఆషాఢమేఘాలలో విరాజిల్లే సద్యోజాతులే, ఋతుపవనాలకు కొట్టుకుపోయే తృణాలైనా
కలికాలంలో పుట్టుకు వచ్చిన
విజ్ఞాన పరమాణువులు
అందుకే ఆటంబాంబులై
మారణాస్త్ర రూపాలుగా మారినా...
నైరుతి ఋతుపవనాలు రాగాలై జల ధారలుగా కురిసిన వేళ
పుడమి పులకరింతలకు మురిసి సేద్యం చేసే అన్నదాతలే, కాలానికి ప్రత్యక్ష సాక్షులు
చరిత్ర కారులైన ఆపరబ్రహ్మకు
వారసులు అయినా...
మరో సృష్టి కర్తలెై ఇతర గ్రహవాసంకై పరుగులు తీసే వట్టి మనుషులో, గట్టి మనుషులో లేక కాలంలో కలిసిపోయే మట్టి మనుషులో?
లలితా చండి
31
*
S Geetha
జిల్లా
*
Srikakulam
ఫోన్ నెంబర్
*
8919143321
కవిత
*
కవితా గానం సీజన్ 5 పోటీ కొరకు
అంశం: ఋతుపవనములు
శీర్షిక -- *ఋతురాగము*
రచన: శంభాన గీత
ఊరు: ఆమదాలవలస, శ్రీకాకుళం
ఆంధ్రప్రదేశ్, 532186
ఫోన్ : 8919143321
*********************************
ఆ.వె: 1)
ఋతుపవనములనెడి క్రతువున మేలగు
వర్షములుకురియుచు హర్షమిచ్చు!
నిండుకుండవోలె నీటికళకళలు
ముదముమేఘమలరి నదులుపారు !
2)
ఋతువులారుయైన ఋతురాగములురెండు
నిఋతిపవనమొకటి నిశ్చయమ్ము !
యిమ్మహినతదుపరి యీశాన్యపవనము
రెండు కూడ మనకు నిండుదనము !
3)
మేనెలాఖరుండి యానిఋతిరావచ్చు
నాంధ్రప్రాంతమందు నడుగుబెట్టు !
పాడిపంటలన్ని పచ్చదనముగూర్చు
రైతుకష్టమునకు రశ్మినిచ్చు !
4)
యిలనుభరతతలము నీశాన్యపవనము
యానవంబరాది నడుగువేయు
తమిళనాడునాట తనదువాటాయని
కురియువర్షధార కుమ్మరించి!
కం:(5)
నిండిన చెరువులు నదులును
పండిన పంటలనుజూడ పరవశమొందన్ !
దండిగ ఖేదము నొకపరి
కుండల వర్షములకు'వరి' కూలగ నేలన్ !
6)
ఎక్కువ తక్కువ గాకను
చక్కగ పవనాలురాగ చల్లని బ్రతుకే !
మక్కువ మీరగ యంతట
మిక్కిలి సంతసమువిరియు మిలమిల సిరితో !
---------------శంభాన గీత
32
కవితా గానం సీజన్, 5
అంశం.... ఋతు పవనాలు
శీర్షిక....ఎదురు చూపులు
మొదటి చినుకు చిట పట
మంటుంటే ఒళ్ళంతా
తుళ్లింత పడుతుంది...
గ్రీష్మ తాపానికి
అలసి సొలసిన
దేహాలను శాంత
పర్చు కోవాలనుకునే దేహార్తి ....
పుడమి తల్లి
ఆర్తిగా పెదవి
తడుపుకోవాలనే తపనలు...
రైతన్న కోటి ఆశలతో
ఆకాశం వంక చూస్తూ
నాగళ్లు సిధ్ధం చేసుకునే తొందర పాటు....
రోగ నిరోధక శక్తికి
పుష్టి నిచ్చే బెల్లం
ఇంగువలను సిధ్ధం
చేసుకునే కోవాలనుకునే
పకృతి సిద్ధ హస్తులు....
ఉబ్బసం నిబ్బరంగా
ఉండేందుకు చేపమందు కై
ఉత్సాహ వంతులు....
వేడెక్కిన దేహాలను
ఆనందంగా చల్ల బర్చాలనే ఆర్తితో
ఋతుపవనాలకై ఎదురు చూపులు... ! !
హామీ... ఈ కవిత నా స్వీయ రచన అని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను🙏
మొహమ్మద్ అఫ్సర వలీషా
ద్వారపూడి (కోనసీమ జిల్లా)
33
రచన:-- సింహాద్రి వాణి
శీర్షిక:-- ఋతుపవనాలు
ఊరు:-- విజయవాడ
చరవాణి:--7569820872
మానవ ప్రమేయం, మేధస్సు ప్రయోగ సంబంధం లేకుండా ప్రకృతిలో పరిణమించును పరిణామాలు.
ప్రకృతి సంఘటనల్లో మార్పులు, చేర్పులు, అననుకూల పరిస్థితులకు అనుకూలమైన కూర్పులు మనుష్యులు చేతుల్లో, చేతల్లో లేవు.
ప్రకృతి ధర్మాలైన పగలూ రాత్రులు, అమావాస్య పున్నమిలు, సూర్య చంద్ర గ్రహణాలు మున్నగునవి సృష్టిలో యుగాలు నుంచీ వస్తున్న సహజ ధర్మాలు.
మండువేసవి వేడితీవ్రతకు చరాచర జీవరాసులు బాధించ బడతాయి. భూమాత సైతం నెర్రలిచ్చి నోరు తెరుస్తుంది దాహార్తితో.
కష్టాల్లో ఆదుకునే మంచి మిత్రునిలా ఋతుపవనాలు ప్రవేశిస్తాయి మెల్లగా చల్లగా భూమాతను జీవరాశులనూ సేదదీర్చేందుకు. రైతులకు వ్యవసాయానికినీరందించేందుకు.
హద్దుమీరిన కోపంతో మనిషి విజ్ఞత కోల్పోయి, విచ్చల విడిగా ప్రవర్తించినట్లు, ఋతుపవనాల వేగతీవ్రత వలన విపరీతమైన గాలులు వీచి, భారీ వర్షపాతం ఉరుములు పిడుగులతో ప్రకృతి ప్రకోపించి, వాతావరణం బీభత్సంగా మారి,వాగులూ వంకలూ పొంగి, జలాశయాలు ఉప్పొంగి,భారీ వరదలు వచ్చి విపరీతమైన నష్టం వాటిల్లుతుంది.
ఋతుపవనాలు సమయానికి రాకుంటే వ్యవసాయం పనులు సాగవు.వేసవి వాతావరణంలో మార్పు రాదు.
ఋతుపవనాల తాకిడి అధికమైనా, అల్పమైనా నష్టదాయకమే.
హామీ:--ఇది నా స్వీయ రచన.
34
శీర్షిక: రైతు పవనాలు
పేరు: మన్నె లలిత
ఊరు :హైదరాబాద్.
నైరుతి రుతుపవనాలు ,ఈశాన్య రుతుపవనాలు
రైతుకు ప్రకృతి ప్రసాదించిన వరాలు
దక్షిణాసియాలో ప్రాథమిక ఋతుపవనాలు
ఆంగ్ల నెలలు జూన్ నుండి సెప్టెంబర్ వరకు
నైరుతి రుతుపవనాలు
రైతులకు పంటలకు నీరందించి
హర్షించే నైరుతి పవనాలు
నీటి సరఫరాలకు ప్రాముఖ్యతనిచ్చే
రుతుపవనాలు
ఆకలి కోసం పుట్టకతోనే ఏడ్చే మనిషి
గిట్టేవరకు శ్రమిస్తూనే ఉంటాడు
బుక్కెడు బువ్వ కోసం
రైతు ఆరుగాలాలు శ్రమించి ఇస్తాడు ధాన్యం
"ఉత్తర "చూచి ఎత్తుతాడు "గంప"
రైతు మది పులకించగా
నాణ్యమైన విత్తనం మొలకెత్తుతుంది
కలుపులు తీసి, ఎరువులు వేసి
పాలు పోసుకున్న కంకులు చూచి
కలలు కంటాడు ఎన్నో
రుతువులు అనుకూలించక అధిక వర్షపాతం
వరదలతో పంట కొట్టుకుపోయి
వర్ష ధారలతో కన్నీటి ధారలు కలిసి
నిరాశ్రయుడయ్యే రైతన్నా!
ప్రభుత్వ అండదండలతో నిలబడు నిట్డాడిలా!
ప్రకృతి ప్రకోపించకుండా చేయాలి మానవ సాయం!
రుతుపవనాలు కావాలి రైతు పవనాలు!!
హామీ: ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.
మన్నె లలిత
హైదరాబాద్
7416863289.
35
ఏడెల్లి రాములు
అంశం*ఋతుపవనాలు
శీర్షిక*వర్శాషనాలు
చక్కనైన ఓ చిరుగాలి చల్లగాలిగా రావే
నీ రాకలో ఈ నేలకు వర్షోత్సవాన్ని తేవే
రైతు మోముపై నవ్వుల రాఖీవి నీవే
గాలి గోపురం మీద వర్షపు మేఘం నీవే
ఎంత అందంగా ఉంటావే నీవు
నల్లని కురులదానా నాజూకు మెరుపుదానా
నింగికి మెరుపుతీగల వడ్డానమిచ్చి
నేలకు మేఘగర్జనల పిడుగులంపేవు
వరుణాత్మవై వర్షార్థివై హర్షంతో రావా
పిల్లల పాటలలో కప్పతల్లి ఆటలలో
నిఖిలజగతి నిన్నే వేడగా
చినుకుల మేడలలో ఆకాశగంగవై దిగి రా
ఆనందాలు పంచగా అవనిమేనియపై
పచ్చని పైటేసి నిలిచిపోవా
ఓ కరుణాంతకాంతవర్షిణీ
అనావృష్టి నివారిణీ
హరిణివైన వర్షపు భరిణీ
చినుకుల సవ్వడి విరిబోణీ
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
రావమ్మా వర్షార్షిణి వర్షాషని
నీవే మా మనోపూజిత జలపుష్పిణీ
నీ రాకకై ప్రణమిల్లి పబ్బతి పట్టేము
కరువును పారదోల దీవించగా
నీ జలధారలతో మము కరుణించగ రా
దివ్యరూపిణీ మా హరివిల్లు జనని
సకలజన ఆరోగ్య సంజీవిని నమో నమః
ఏడెల్లి రాములు✍️
36
*
గొర్రెపాటి శ్రీను
జిల్లా
*
Medical
ఫోన్ నెంబర్
*
9652832290
కవిత
*
కవన జ్యోతి క్రోధి వైశాఖ పౌర్ణమి కవితల పోటీకి
అంశం: రుతుపవనాలు
రచన : గొర్రెపాటి శ్రీను
శీర్షిక :"రైతే రాజు"!
నీలాల నింగి వంక ఆశగా ఎదురుచూస్తున్న
రైతన్న ఆశలు తీరేలా రుతుపవనాల ఆగమనం శుభసూచకం!
దుక్కి దున్నింది మొదలు
విత్తనాలు జల్లుతూ
నేలతల్లి ఆశీర్వాదం కోసం తపిస్తాడు రైతన్న!
నింగిలో కదులుతున్న మేఘమాలికలు
చల్లని చిరుజల్లులను కురిపిస్తూ
భూమాతని ముద్దాడువుంటే
రైతన్నల నయనాలలో హర్షాతిరేఖాల ఉత్సవాలు..
పసిడిపంటలు పండే నేలతల్లిని కన్నతల్లిలా భావిస్తూ
రైతన్నలు ఇష్టంగా,శ్రద్దగా,ఉత్సాహంగా
పంటలు పండిస్తుంటే
ప్రపంచానికి ఆహారాన్ని అందించే "రైతే రాజు"!
ఎండనక ,వాననక ,రాత్రనక,పగలనక ..
విత్తనాలు చల్లింది మొదలు ..
పంట ఇంటికే చేర్చేదాకా..
రైతన్నలు పడే శ్రమ అంతా ఇంతాకాదు !
"శ్రమయేవ జయతే" అన్నట్లుగా
రైతన్నలు..మానవ జీవన వికాసానికి ,
దేశ ఆహార,ఆర్థిక సంవృద్దికి కారకులు ..
అందుకే వారి శ్రమని,కష్టాన్ని గుర్తించి గౌరవిద్దాం !
కవిత నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను.
- గొర్రెపాటి శ్రీను
37
*
మండ.శైలజ
జిల్లా
*
విశాఖ పట్టణం
ఫోన్ నెంబర్
*
9160956125
కవిత
*
శీర్షిక: ముద్దుచినుకులు !!
================
చిరుజల్లుల చినుకుల ముద్దులతో
మౌనంగా ఎదురుచూస్తున్న మట్టి
తడిసి ముద్దయింది..!!
చినుకులకోసం మట్టీ...
మట్టికోసం చినుకులూ పరితపిస్తూ...ఒకరినొకరు ఎడతెరిపి లేకుండా ముద్దులజడిలో తడిసి ముద్దయి తపనల ఒడిలో సేదతీరాయి!!
ఋతుపవనాల ఆగమనంతో
ఆనందంతగా ప్రకృతి ఒరుసుకుని
మర్నాటికి మొలకలై మట్టిని చీల్చుకుని కొత్తచిగురులతో తలెత్తి వినీలాకాశం వైపు గర్వంగా గుబాళిస్తూ వనాలుగా ఎదిగుతాయ్!!
అవే వనాల ఆనవాలుగా అనంతమేఘాలు ముద్దుల కుంభవృష్టికురిపిస్తూ,
కొండలూకోనలూ దాటి
వాగులూవంకలై...ఏరులై,సెలయేరులై
మహోన్నత పంటలకు
ప్రాణాధారమై,జీవకోటికీ శ్వాస గా, ప్రాణికోటికీ ప్రాణాన్ని నిలిపే
జలధారగా మారి అనంతసృష్టికీ
ఆలంబనమౌతోంది...!!
మట్టీ , చినుకులే ప్రాణికోటి మనుగడకు ఆధారం!!
పరిమళించు ప్రణయాలే
సృష్టి స్థితీలయలకు జీవం!!
సృష్టి ఉన్నంతవరకూ ఆగదు ఈ చక్రభ్రమణం!!
మట్టీ చినుకుల ప్రణయం అజరామరం!!!
-----మండ.శైలజ, విశాఖ.
38
అంశం: ఋతుపవనాలు.
ముడుంబ తిరువేంకటాచార్యులు, మానుకోట.
శీర్షిక: ఋతుపరివర్తనం
పుడమి ప్రకృతిని ఉత్తేజితం చేసే ఉదయభానుడు సైతం వసంతంలోనూ ప్రచండ గ్రీష్మతాపం జ్వలింపజేస్తున్నాడు,
చల్లని వెన్నెలలు పూయించాల్సిన పున్నమిచందమామ సైతం చెమటలు పట్టిస్తున్నాడు,
అతివృష్టి, అనావృష్టి కూడబలుక్కుని
అన్నదాతల ఆరుగాలం శ్రమతో ఆటాడుకుంటున్నాయి,
వాతావరణంలో ప్రతికూలమార్పులు అంతుచిక్కని వ్యాధులకు కారణమవుతున్నాయి, ప్రజాజీవిత నిత్యావసర విధులు క్రమం తప్పుతున్నాయి, ప్రాణులలో జీవనవిధులలో సత్తువ సన్నగిల్లుతోంది, ... కానీ,
సూర్యచంద్రుల గమనాలలో మార్పు లేనప్పుడు ఇటువంటి వైపరీత్యాలకు హేతువేది?
ప్రకృతిజీవులన్నీ ప్రకృతితో మమేకమై నియమబద్ధంగా
జీవిస్తున్నప్పుడు ఈ విపరిమాణాలకు కారణమేమిటి?
జవాబు: మానవపోకడలు,
....., కాదంటారా?
ప్రకృతి నియమాలను తన చెప్పుచేతల్లో నడపాలనే స్వార్థం శృతి మించి,
సమస్తభూమండలాన్ని స్వాహా చేయాలని వేగంగా అడుగులు వేస్తూ, ఆధునిక విజ్ఞానం పేరిట అన్ని రకాల కాలుష్యానికి తెర తీసి, విచక్షణారహితంగా హరితహననానికి పాల్పడుతూ, వాతావరణాన్ని శాసిస్తూ, తానే ఈ భూమండలం పై ప్రకృతి సౌందర్యానికి చెల్లుచీటీ రాస్తున్నాడు. తద్వారా కాలగమనంక్రమం తప్పడానికి కారణభూతుడవుతున్నాడు.
ఇకనైనా మేలుకొని వనసంరక్షణ యుద్ధప్రాతిపదికన చేపట్టి, తాను సృష్టించిన కృత్రిమ కాలుష్య కారకాలను సమూలంగా నిర్మూలించి సహజ ఋతు ఆగమనానికి దారులు వేయాలి, అప్పుడే ఋతుపవనాల రాకను ఆనందంగా స్వాగతించి, ఆస్వాదించగలము, ప్రతి ఋతువులోని వైవిధ్యాన్ని మనసారా అనుభవించగలం.
ఇది నా స్వీయరచన. ఇతర రచనలకు అనువాదం గానీ, అనుకరణగానీ, అనుసరణగానీ కాదు.
39
శీర్షిక : ఆహ్వానం
****************
నిరుడు ఎప్పుడో రాల్చి వెళ్ళిన కాసిన్ని చినుకుల్ని
ఇంకా నెమరేసుకుంటోంది నేల
తొలి మలి సంధ్యలలో
అరచెయ్యి ని నుదురుకానించుకుని
అదేపనిగా ఆకాశం వంక చూసే అన్నదాతలను ఆబాల గోపాలాన్ని..
ఇదిగో మబ్బులు..అదిగో గాలులంటూ ఊరించడం న్యాయమా
సూర్యుడు..ఎండ..వేడి..దూలిగాలీ తప్ప
చల్ల గాలుల అలికిడి లేదు..చిరు జల్లుల చిందులు లేవు
నిలువెల్లా కమిలిన నేలేమో..
నెర్రెల్లా నోళ్ళు తెరిచి నింగి వైపు చూస్తూనే ఉంది
ఎదురు చూసిన చెట్లన్నీ అలసి నిద్రపోతున్నప్పుడో..
కేకలు పెడబొబ్బలు పెట్టిన కొండలు సొమ్మసిల్లి నపుడో..
చినుకుల పొట్లాలను పడేసి పోరాదా..
ఎండలకు ఎగసెగసి పడుతున్న పొలాల కోసం గొల్లు మంటున్న గట్లను సముదాయించ రారాదా
చిగుళ్లేసు కున్న బాలింత కొమ్మల కోస మైనా
ముచ్చటగా మూడు పదునులను
ముడేసుకొచ్చి పలకరించి పోరాదా..
నీళ్ళ నవ్వులను మా లోగిళ్లలో చల్లిపోరాదా..
అలా గుప్పున లేచిన మట్టి పరిమళం మనసంతా సందడి చేసి ఎన్నాళ్ళైంది..!
చినుకులు చేళ్ళ చుబుకం మీటి ఎన్నాళ్ళైంది..!
జల్లుల మాలలను పకృతి సిగలో ముడుచుకుని ఎన్నాళ్ళైంది..!
నువ్వొస్తే చాలు..కళ్ళం లోకి కాసిన్ని గింజలు
నోళ్ళల్లోకి నాలుగు ముద్దలు వస్తాయి
ఆట్టే..మాయమైపోతాయి మాయదారి కరువు కాటకాలు
పచ్చని స్వప్నాలన్నీ రాలిపోతుంటే రొద పెట్టిన వనం రొమ్ము విరుచుకుంటుంది
అరణ్యాలు అలవాటుగా అటు ఇటు చూస్తున్నాయి
ఇక ఋతువులను సంజాయిషీ అడగలేను
ఋతుపవనాలు వెనుదిరిగి పోయాయని
ఒక విషాద ప్రకటన మాత్రం విడుదల చేయకు
ఋతుపవనమా..నీ పేరేమిటో నైరుతో..ఈశాన్యమో ఒక్కసారి ఇటు వచ్చిపోవమ్మా..
డా. దారల విజయ కుమారి
హామీ పత్రం
*********
నమస్తె సర్/ మేడం
ఈ కవిత నా స్వంత రచన. ఎటువంటి అనువాదం కాదు. ఏ సోషల్ మీడియాలో నూ ప్రచురితం కాదు.
ఇట్లు
తమ విధేయురాలు
డా. దారల విజయ కుమారి
91771
Comments
Post a Comment