కవనజ్యోతి పౌర్ణమి నగదు బహుమతుల కోసం
కవితల పోటీ
క్రోధినామ సంవత్సరం జ్యేష్ట మాసం
అంశం: ఉషాకిరణాలు
నిర్వహణ: లలితాక్రిష్ణ శివునూరి
**********"*********
కవివరుల జాబితా
కవివరుల జాబితా
1.జి.సూర్యనారాయణ గారు
2.మండ నాగేశ్వరరావు గారు
3.కోరాడ నరసింహారావు గారు
4.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు
5.డా.భమిడిమఱ్ఱి కమలాదేవి గారు
6.దోసపాటి వేంకట రామచంద్రరావు గారు
7.కూని అంకబాబు గారు
8.గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు
9.ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
10. వేదాంతం సురేష్ బాబు గారు
11. వడ్ల వీరాచారి గారు
12.కొంజేటి రాధిక గారు
13.తోట సులోచన గారు
14.బొప్పెన వెంకటేష్ గారు
15.వేమూరి సత్యవతి గారు
16.పిళ్ళా వెంకట రమణమూర్తి గారు
17. కోడూరి లలిత గారు
18. కవిత వెంకటేశ్వర్లు గారు
19. కాసుల ధీరాజ శర్మ గారు
20. మద్ది పుల్లారావు గారు
21. గొర్రెపాటి శ్రీను గారు
22.మన్నె లలిత గారు
23.పిన్నక నాగేశ్వరరావు గారు
24. సింహాద్రి వాణి గారు
25. మొహమ్మద్ అఫ్సర్ వలీషా గారు
26. లలితా చండి గారు
27. ఏడెల్లి రాములు గారు
28.డా.బల్లూరి ఉమాదేవి గారు
******************-----
1.
అంశం.. ఉషా కిరణాలు
కవన జ్యోతి పౌర్ణిమి కవితల పోటీకీ...5
నవీన మహర్షి..!
______________
స్వయం కృషితో మహర్షి లా ఎదిగి
అవనిలో అందరికీ ఆదర్శంగా నిలిచి
చెరుకూరి రామోజీరావు కట్టిన
ప్రగతి తోరణాలు ఉషాకిరణాలు
ఎందరెందరికో ఉపాధి చరణాలు
ప్రతిభా మూర్తులకు ఆభరణాలు..!
వాడీవేడీగా వాడలకు వార్త లంది స్తున్న ఈనాడు
తెలుగు జాతిలో వెలుగులు నింపిన అక్షర సూరీడు
ఊరూరా నోరూరిస్తున్న ప్రియమైన రుచులు
మధ్య తరగతి ప్రజలకు పెన్నిధిలా మారిన మార్గదర్శి
చిత్రాలకు శ్రీ కారం చుట్టిన శ్రీ వారికి
ప్రేమ లేఖ
మయూరిలా నర్తించిన వయ్యారి కళాంజలి
కర్షకులకు కల్పతరువైన అన్నదాత
చేవగల రచయితలకు కోవ చతుర విపుల
మయుడికే విస్మయం కలిగించే మయూరే.... రామోజీ ఫిల్మ్ సిటీ
చెరుకూరి స్వయం శక్తికివి నిదర్శనాలు..!
ఇక...
పత్రికా రంగంలో పితామహుడు
రాజకీయాలను శాసించే రాజర్షి
చెండాల రాజకీయాలకు చండ శాసనుడు
పాడుతా తీయగా నడిపే బాలుతో హాయిగా
అలుపెరుగక నడిపేను పలు మహా సంస్థలను
వ్యక్తిగా వచ్చి మహా శక్తిగా మారినాడు
తెలుగు నాట ఉషోదయాన్ని తెచ్చి
అమర పురికి తరలె అనుకోని అతిథిలా..!
(కవన జ్యోతి కవితల పోటీ కి_5)
ప్రత్యేకంగా రాశాను.
2.
ఉషోదయాక్షర తూణీరాలు!
ఈ ఉషాకిరణాలు!!
//======🔥========//
జగానికి చీకటైతే ఉషోదయంతోనే
వెలుగు...జనం అజ్ఞానపుచీకటిలో ఉన్నపుడు ఉషాకిరణాలతోనే విజ్ఞానపు వెలుగు !!
జనంలో చైతన్యపు వెలుగులు నింపడానికి ఉధ్భవించిన ఉషోదయా కిరణమే "ఈనాడు" !!
పత్రికాప్రపంచానికే వెలుగులరేడు!!!
ఆ ఉషోదయానికి ఉషస్సు నింపిన
గర్జనపేరే రామోజీరావు !!
ఎక్కడో పల్లెలో ఉదయించిన
పిండమే....సామాన్య జీవనంతో ప్రారంభించి పచ్చళ్ళ రుచి చూపించే స్థాయినుంచి, తెలుగు పత్రికాప్రపంచానికే తలమానికమై
చండ ప్రచండమై అఖండ తెలుగు తేజమై తెలుగునేలనలుచెరగులా
వేళ్ళూనుకొని పలుసంస్తల ఊడలూనుకుని వటవృక్షమై, నిరుద్యోగులకు కల్పవృక్షంగా నిలిచి అక్షరతూణీర తూటాలతో అవినీతిరాజకీయ నాయకుల గుండెల్లో గుబులునింపి,పెకలించిన అజేయమైన సంపాదకకిశోరమై
చరిత్ర తిరగరాసిన ఉషా'కిరణమే'
ఈనాడు రా మో జీ రా వు !!!
అవరోధాలెన్నున్నా అవకాశమే ఆతని ఊపిరి...
అడ్డంకులన్నైనా అందిపుచ్చుకుని
సాధించడమే ఆతని మగసిరి..!!
ఆతని ప్రతిఘటన,
మౌనపోరాటమే చలనచిత్ర మయూరాలు !!
ఆతను సంకల్పిస్తే చాలు అదే అతనిగోలు !!
అతనికార్యదక్షతకి నిదర్శనమే
రామోజీ ఫిల్మ్ సిటీ...ఒక
అంతర్జాతీయ క్రియేటివిటీ!!
పట్టుదల,ఏకాగ్రత, ఎదురీత,విజయం
వినయాలకు పర్యాయపదం రామోజీ!
అందనంత ఎత్తుకెదిగిన వ్యాపారదిగ్గజం !!
ఆతని మహాభినిష్క్రమణం తెలుగుజాతికి తీరనిలోటు!!
ఆతని ఉషాకిరణాశయాలు తెలుగున్నంతవరకూ, అమేయం,
అ జ రా మ రం !!!
------మండ.నాగేశ్వర్రావు.✒️
7793939724.
3
కవితా గానం , సీజన్ -5
పౌర్ణమి కవితల పోటీ
* ఉషా కిరణాలు *
కోరాడ నరసింహా రావు
@ తిమిరంతో సమరం !
***************
సమస్యల తిమిరంతో...
నిరంతర సమరం చేసిన
వెలుగు వీరుడు రామోజీ!
ఇన్నిన్ని ఘన విజయాల మైలురాళ్లు దాట టానికి...
ఎన్నెన్ని సమస్యల ఎత్తు పల్లా లను , ఎంత ఓర్పు- నేర్పులతో దాటు కొచ్చాడొ...!
ఒక సామాన్యుడు మాన్యుడు కావటమే గొప్ప!
అసామాన్యుడై ,అత్యున్నత స్థి తికి చేరటమంటె,మాటలా...!?
కేవలము అదృష్టాన్నినమ్మే వారు కొందరు...
దీక్ష, పరిశ్రమలనే నమ్మే వారిం కొందరు....
దీక్ష,పట్టుదలలుంటేఅదృష్టము
దానికదే వరించి వస్తుందని....
రుజువు చెయ్యగలిగారు మీరు
ఎందరికొ మార్గదర్శి యై...
చవులూరించే ప్రియమైనపచ్చ ళ్లుగమారి....
ఇంటింట వేకువనే ఈనాడై తలుపుతట్టి... ఈటీవీ , మీటీవీ అంటు అనన్య సామాన్యముగనిలిచి...
లక్ష లాది మందికి జీవనోపాధిని
కల్పించిన మీజన్మమె జన్మము!
ఇట్టి జన్మమేకదా ధన్యము !!
ఎన్నెన్నో సినీ నిర్మాణములకు
ఆలంబన ,రామోజీ ...
నీ ఫిల్ముసిటీ...!
రామోజీ... ఆ పార్ధివ దేహమును వీడి నీవు
పర లోకమున కేగినా... నీ గురుతులు తరతరాల స్మృతు లైఇట....మెదులుతునేయుండును !!
4
*అంశం: ఉషాకిరణాలు*
శీర్షిక:: విశ్వ రహస్యం ఛేదించే జ్ఞానులు
తేదీ ...18/06/2024
స్వీయ రచన::: కేశరాజు వెంకట ప్రభాకర్ రావు,
పాతర్లపాడు, ఖమ్మం..
62816 979 82
ఒకటే పులకింత పుడమి ఒళ్లంతా
పికముల తుళ్ళింత పడతుల హొయలంత!
మెకముల పరుగంత వనమున గిలిగింత
లోకము నవ్వెంతో!ఆ శీతల ఉషాకిరణాలతో!!
లెక్కలేని జీవితాలను స్పర్శించిన ఆ కిరణాలు
లక్షణమైన భవిష్యత్తును అందించే దార్శనికులు !
అక్షరాలను కుక్షనిండా కూరి, అక్షయమైన జ్ఞానసంపదతో
కక్షలు, కార్పణ్యాలు లేకుండా, సాగిపోయే కాలంతో!!
విపుల గురించి విపులంగా, విశ్వరహస్యాలు ఛేదిస్తుంటే,
విరక్తి కలగకుండ, చతురోక్తులతో ,చైతన్యం పెంచుతూ !
మరణ శయ్యపై ఒరిగి, కొన ఊపిరితో ఉన్న తెలుగుకు,
వెలుగులు నింపి,భాషా వేల్పును చేయాలనే తపన!!
భళ్ళు మని తెల్లవారుతూనే, గడపలో ప్రపంచ
సమాచారం, గుమ్మరించే ఈనాడు,
ఈటీవీ
పుట్టించే, ప్రకంపనల ప్రచండ గోల ,
వ్యవస్థలలో, వ్యవస్థీకృతమైన అవినీతిని ,
దునుమాడే భయంకర పంచాగ్నుల శూల !!
అన్నమో !రామచంద్రాయన్న ఆర్తనాదం ,
అవనిలో వినిపించకూడదని ,
అన్నదాత చేయని ప్రయత్నం లేదు,
వెతలతో వేగిపోతు, పెనంపై
పేలాలయి, పేలిపోతున్న బ్రతుకులను,
జిగిబిగి కౌగిలిలో ఓలలాడించి, కైపు జోలపాడి,
మధురోహలలో, ఊయలలూగించిన సితార !!
చిక్కని పాలలో చక్కని చెక్కర కలిపి ,
చొక్కు రంగరించి, చవిచూపించు డాల్ఫిన్లు!
ప్రపంచానికో ప్రమోదమైన ప్రియను! ఓ ప్రియా అంటుంటే!
వంటింట్లో, వనితల కొలువలో విడిది చేసింది!!
రంగురంగులతో వన్నెలుబోవుచు,మతులను తొలిచే
మహిళల,తళకుబెళకుల మనోరంజిత,బిస్రా,కళాంజలి !
అందమైన రంగుల,హంగుల సొబగులతో హోర్డింగుల్లో
ఫ్లడ్ లైట్ల వెలుతురులో మనోరమల కిలకిలా రావాలు
కొలోరమ పూదోట పూచిన, మదిని దోచే 'ర'మణులే!!
పొడిచిన పొద్దు వాలినా! చీకట్లు క్షణమే!!
మళ్లీ రేపు ఉదయించే ఉషా కిరణాలు,
ఉర్విని ,ఉన్మీలనము చేయుటకే ! కాదా!!
5
కవితాగానం సీజన్ 5
క్రోథినామసంవత్సర
జ్యేష్ఠ మాస కవితలపోటీకీ
నాకవిత
పేరు : డా.భమిడిమఱ్ఱి
కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
తేది : 19-6-24
అంశం : ఉషాకిరణాలు
శీర్షిక : ఉషోదయం
తెలతెలవారుతూనే
తూర్పుదిశాంగన
దిద్దుకుంటోంది తన నుదుట
లేత వర్ణపు ఎర్రని సింధూరాన్ని
ప్రకృతి కాంత ఆలపిస్తోంది
ఉదయరాగాలను
మలయమారుతాల మృదుమధుర పలకరింపులు
పక్షుల కిలాకిలారావాల
స్వాగత వచనాలు
పచ్చని చేలతివాచీలపై
మెరుస్తున్న ముత్యాల మంచుముగ్గులు
విరిసీ విరియని విరుల సుగంధాలు
మధువుకై ఆరాటపడే
భ్రమర ఝంకారాలు
మనసులను దోచుకునే
మధురరాగాలు
ఉషోదయ రాగాలు, ఉదయరాగాలు
చైతన్య వంతాలు, ఉత్తేజ భరితాలు
ఉల్లాస ,ఉత్సాహ ప్రేరకాలు
ఆఉషోదయ కాంతులు
అవి పాడే ఉదయరాగాలు
అవే జగత్తును నిద్రనుండి లేపేమేలుకొలుపుగీతాలు
గగనసుందరి లేలేత ఎరుపురంగు వస్త్రాలను ధరించి తన మేఘమాలికలనేస్తాలతో
ఆటలాడుతూ
ఏతెంచుతోందేమో కదా
కనువిందుచేయు అతి సుందరదృశ్యము
ఆనవచైతన్య ఉషోదయ
కిరణ స్రవంతి
కలిగిస్తుంది
ఆనందాన్ని, ఆహ్లాదాన్ని
ఆస్వాదిద్దాం ఆఆనందాలను
ఆమధురిమలను,
ఆపరిమళాలను
పొందుదాం చైతన్య స్ఫూర్తిని.
పైకవిత నాస్వంతం.
6
*
దోసపాటి వేంకటరామచంద్రరావు
జిల్లా
*
విజయనగరం
ఫోన్
*
7780594995
కవిత
*
కవితాగానం జేష్టపౌర్ణమి నగదు పురస్కారాల కవితలపోటి
అంశం:ఉషోదయకిరణాలు
దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం
శీర్షిక:జ్ఞానజ్యోతులు
ఉషోదయకిరణాలు చిరుచీకట్లను తొలగించే జ్ఞానజ్యోతులు
చైతన్యదీపాలై నిత్యసత్యాలై నిలిచిపోతాయి
తిమిరసంహారాలై విజ్ఞానదీపికలవుతాయి
ఇంటింటా వంటింటా కొత్తరుచులు చూపుతాయి
అక్షరాన్ని ఆయుధంగా మలచి సంధిస్తాయి
నవ్యభావాలకు భాషతో రంగరిస్తాయి
అప్రతిహతంగా కొనసాగుతాయి
కొత్త ఒరవడితో ప్రచారసాధనంగా సాగుతాయి
నూతనుత్తేజంతో నవ్యపధాన నడిపిస్తాయి
అజాతశత్రువై అన్యాయాన్ని ఎదుర్కొంటాయి
పక్కలోబల్లెమై బాధిస్తాయి
కన్నీటిచెలమలై పారుతాయి
బాధితులకు బాసటగా నిలుస్తాయి
ఉపాధినికల్పించి ఊరడిస్తాయి
ఆపన్నులకు ఆసరాగా ఆధారమవుతాయి
అతివలకు ఆలంభనై ఆదుకుంటాయి
ప్రపంచపటాన తనదంటూ శాశ్వతస్థానం కల్పిస్తాయి
విజ్ఞానమేకాదు వినోదం పంచుతాయి
భాషాంతరాలను తొలగిస్తాయి
నిష్పక్షపాతంగా నిర్ధారిస్తాయి.
ఇది నాస్వీయరచన.
7
అంశం: ఉషాకిరణాలు
శీర్షిక: అనలేరు కాదనలేరు
చీకటి తెరలను చీల్చుకుంటూ
వెలుగు రేఖలను గీసుకుంటూ
జగతిని వెలుగుల జిలుగులతో
అలరేలా చేసే
అరుణకాంతుల సోయగాల
కిరణాలే కదా ఉషాకిరణాలు
నరుల జీవితాలకి
శృతిలయలను జోడిస్తూ
రజనీకరుడికి వీడ్కోలంటూ
ధరణికి ఉదయ వేళ సేవతో
చొచ్చుకొని వచ్చే
కాంతి గుచ్చాలే కదా ఉషా కిరణాలు
సకల చరాచర జీవులకు
జవసత్వాలను అందించడానికి
దినకరుడు ఆజ్ఞ సేయగా
దివి నుండి వేంచేయు
శ్రీకర కింకరులే కదా ఉషా కిరణాలు
ఇరులకు చురకలు అంటించి
ఝరులకు సోకులు అద్ది
కడలి అలలతో సయ్యాటలాడుతూ
తరంగిణికి తోడు చెలికత్తెలుగా
కన్యల చిరునగవులకు
తళుకులను జోడించి
రంగవల్లులకు వేళాయెనంటూ
వడి వడిగా దూసుకొచ్చే
శకునాలే కదా ఉషాకిరణాలు
వీటి కొరకే కదా
ఎదురుచూసేది ఎన్నో తరుణాలు
అందులో రుజువు లేదంటారా
అనలేరు కాదనలేరు
ఎందుకంటే అదే రుజువు కదా
8
గజవెళ్ళి శ్రీనివాసాచారి
జిల్లా
*
కాజీపేట హన్మకొండ జిల్లా
ఫోన్
*
9059438068
కవిత
*
కవితాగానం సీజన్ 5
...
అంశం: ఉషాకిరణాలు
శీర్షిక: అసాధ్యుడు
...
ఈనాడు వార్తలే
ఉషాకిరణాలు
అసాధ్యాలను
సుసాధ్యం చేసిన అసాధ్యుడు
పాలకులకు చెమటలు పట్టించి
ప్రజల సమస్యలకు
పరిష్కారం చూపిన మేధావి
పాఠకుల ఆసక్తి గమనించి
అభిరుచులను పసిగట్టి
వార్తాపత్రికలను ఉచితంగా ఎరవేసి
ప్రచారం కొత్త పుంతలు తొక్కించాడు
వేగమే వేదమని
మార్పును స్వాగతించి
ఆచరించిన శ్రమజీవి
ప్రజా ఉద్యమాలలో
శూన్యం భర్తీచేసి
అక్షరం అగ్నికణమై
కథనాలు కరవాలాలై
తెలుగు గడ్డపైన
సేవాయజ్ఞానికి చుట్టెను శ్రీకారం
పట్టుదలే పెట్టుబడిగా
రాళ్లగుట్టలను రామోజీ ఫిల్మ్ సిటీగా
తీర్చిదిద్దిన అభినవ మయుడు
కవనజ్యోతి పౌర్ణమి కవితలపోటీ
9
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
ఊరు:-హైదరాబాద్
అంశం:-ఉషాకిరణాలు
శీర్షిక:-
బహుముఖ ప్రజ్ఞాశాలికి నా అక్షర నివాళి
..............................
సాధారణ రైతుకుటుంబలో పుట్టి
అలుపెరుగని సాధనతో అందనంత ఎత్తుకి ఎదిగి
సమాజాభివృద్ధియే ధ్యేయంగా
మార్గదర్శి చిట్ ఫండ్ ద్వారా సామాన్యుని ఆర్ధికస్థితిని మెరుగపరచి
అక్షరమే ఆయుధంగా ఈనాడు పత్రిక ద్వారా
ప్రజలను చైతన్య పరచి
సమాజ దశా దిశను మార్చి
ప్రియా పచ్చళ్ళ రుచిని
ప్రపంచానికే చవి చూపి
అన్నదాత పత్రిక ద్వారా
రైతన్నల వ్యథలను తీర్చి
చతుర,విపుల పత్రికలద్వారా
సామాజిక స్పృహకలిగిన రచనలతో పాఠకులను రంజింపచేసి
ఉషాకిరణ్ బ్యానర్ పై మయూరి, ప్రతిఘటన,మౌనపోరాటంవంటి ఎన్నో చలన చిత్రాల ద్వారా సమాజ పరిస్థితిని తెలియచేసే
ఈనాడు దూరదర్శన్ ద్వారా దేశ విదేశాల వార్తలతో బాటు
పాడుతా తీయగా కార్యక్రమాన్ని
గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం తో
వయోభేదం లేకుండా
తెలుగు నాటే గాక ప్రపంచానికే తలమానికంగా నిలిపి
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి దోహదపడి
మద్రాసీ అన్నది గాక తెలుగు వారికి గుర్తింపు తెచ్చి
ప్రపంచానికే తలమానికమైన రామోజీ ఫిల్మ్ స్టూడియోను నిర్మించి
'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు' అన్నదానికి ప్రతీకగా నిలచిన
మీరు నంది, గౌరవ డాక్టరేట్ పురస్కారాలకే వన్నెతెచ్చిన మహనీయులు.
మీ దార్శనికత, బహుముఖ ప్రజ్ఞకు గుర్తింపుగా కేంద్రప్రభుత్వం
అత్యున్నత "పద్మ విభూషణ్"పురస్కారం చే
సత్కరించడం తెలుగువారికే గర్వకారణం.
అందుకోండి రామోజీరావు గారు మీకివే నా అక్షర నివాళి.....!!
10
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
అంశం:- ఉషా కిరణాలు
***************************
ముఖంపై చెరగని చిరునవ్వు
అతి నిరాడంబర వ్యక్తిత్వం
స్వయంకృషికి నిదర్శనం
ప్రతి వ్యక్తికీ ఆదర్శ ప్రాయం
అక్షరాలతో సేద్యం
భాషామతల్లికి నైవేద్యం
పచ్చళ్ళు అమ్మినా
పత్రికలు పెట్టినా
చిట్ ఫండ్స్ నడిపినా
టీవీ ఛానెల్స్ నడిపినా
పని ఏదైనా పనియే దైవం
కృషితో నాస్తి దుర్భిక్షం అనే
నానుడికి ప్రత్యక్ష సాక్ష్యం
రాజీలేని వ్యక్తిత్వం
నాణ్యతకు సజీవ ప్రమాణం
ఎందరెందరికో స్ఫూర్తి
దిగ్దిగంతాలకు వ్యాపించిన కీర్తి
అక్షరాలతో ఆడుకున్న
అక్షర యోధుడు
అక్షరాలతో జనుల హృదయాల్ని కలిపిన అక్షర వారధి
తెలుగు భాషను సుసంపన్నం చేసిన
భాషాయోషా కోవిదుడు
సినీ జగత్తుకు విలువలు పెంచిన
అఖండ భారత దిగ్గజం
తెలుగు వెలుగు కిరణాలను
విశ్వవ్యాప్తం చేసిన
బహుముఖ ప్రజ్ఞాశాలి
ఉషా కిరణం
మహోన్నత వ్యక్తి
రామోజీ రావు.
*************************
---- వేదాంతం సురేశ్ బాబు
చెన్నూరు
11
అంశం :-ఉషా కిరణాలు.
తెలతెలవారే వేళ ఉత్సాహంగా, ఉరకలెత్తుతున్న ఉషాకిరణాలు.
నవనవోన్మేషమై కళకళలాడుతూ, మనుషుల్లోని దిగులే కాదు, మబ్బులను తొలగిస్తున్నవి గదా ఈ తిమిర సంహరణాలు.
పచ్చని తోటలో చిలుకల పలుకులు, గోరు వంకల రాగాలు,
పల్లె కిటికీ సందుల్లోనా పిచ్చుకల కిచకిచలు.
నింగి అరుణారుణ రాగ రంజితమై,
జనం హృదిలో, ఉత్సాహ కెరటాలు వెల్లువెత్తిన శుభోదయాన
మదిని దోచు ఈ ఉషా కిరణాలు.
నీలి నీలి జలధరాలు కదులుతుంటే అంబరాన, సంబరాన మబ్బులను తరిమే తిమిర సంహరణాలు.
పల్లె జనులు ముదము మీర, వ్యవసాయ పనుల మీద, వెళుతున్నారు జానపదాలు పాడుతూ!
ఆకాశంలో, రంగురంగుల మేఘాల గుంపు జూచి, పులకించి, మయూరాలు పురులు విప్పి నాట్యమాడి, మురిసి పోతున్నాయి! వయ్యారంగా!
కాలువల నిండా జలము గలగల పారుతుంటే ,ఆనందం నిండిన కళ్ళతో, సంబరపడుతున్నారు అన్నదాతలు లుత్సాహంగా !
పూల తోటలో అరవిరిసిన మల్లె, జాజి, మందారాలు పకపకా నవ్వుతున్నాయి ఆహ్లాదంగా!
పచ్చగడ్డి బయళ్ళపై పరుగులెత్తు హరిణాలు, పచార్లు చేస్తున్నాయి హుషారుగా!
రామోజీ గ్రూప్ సంస్థల అధినేత ,దార్శనికులు, కీర్తిశేషులు శ్రీ రామోజీరావు గారి ఉషాకిరణాలు.
దిగులును, మబ్బులను, తరుముతున్న తిమిర సంహరణాలు!
రచన : వడ్ల వీరాచారి
12
కవితా గానం సీజన్ 5
పౌర్ణమి కవితల పోటీకి గాను...
అంశం..ఉషా కిరణాలు
పేరు కొంజేటి రాధిక
ఊరు రాయదుర్గం
శీర్షిక... చిరంజీవి... రామోజీ
జీవించి ఉన్నా, లేకపోయినా...
పది జీవిత కాలాలలో సాధించాల్సిన ఘన విజయాలను 75 వసంతాలలోనే సాధించిన ఒక అసాధారణ వ్యక్తి జీవిత ప్రయాణమే రామోజీ గారి ఉషాకిరణాలు...
వంద సేవలు మోసేది ఒక్కడే బాహుబలి... వందలాది కుటుంబాలకు ఆశా కిరణం...
కోటి కాంతుల రవి కిరణం.. అజరామరమైన ఖ్యాతికి, ఆచంద్రతారార్కమైన చేతలకు నిలువెత్తు నిదర్శనం...
ఎవరెస్టంత ఎత్తుకు ఎదిగి కోట్లాదిమందిని చైతన్యం దిశగా నడిపించిన గొప్ప వ్యక్తి...
ప్రజా ప్రయోజనాలే పరమావధిగా,
లాభసాటి వ్యవసాయానికి పునాదులు వేసి... వెనకబడిన సమాజాన్ని మున్ముందుకు పురోగమింప చేసే కోహినూర్ వజ్రం...
కోట్లాది మంది మగువల మదిలో ఆత్మవిశ్వాసం నింపి, సంకల్పమే పునాదిగా కలల సాకారానికి అంకురార్పణ చేసిన ఘనుడు...
పొదుపు పాఠాలను ప్రజ్వలింప చేసి, బహుళార్థసాధక ప్రయోజనాల దిశ,గా విలక్షణ సృజనాత్మకను కలిగిన మేదో సంపన్నుడు...
ఎరువుల వ్యాపారంలోను, దేశీయ హస్త కళాఖండాలకు ఓ ఆకృతినిచ్చిన మహోన్నతుడు...
ప్రకృతి వైపరీత్యాలలోను బాసటగా నిలచి,
సాహితీ గుబాలింపుల సువాసనలను వెదజల్లే ఎన్నెన్నో ఉత్పత్తులతో ఎందరో ఎందరికో జీవనోపాధిని కలిగించిన వ్యక్తి...
అక్షయమైన సేవాభావంతో, వందలాది వేలాది కుటుంబాలలో ఉపాధిని కల్పించిన ఆశాజ్యోతి ...
ప్రోత్సాహమనే మందు గుళికలను తయారుచేసే సృష్టికర్తేమో రామోజీరావు గారు...
ఆయుర్వేద వైద్య విధానాలతో విద్యార్థులకై సూర్య భవనాలను నిర్మింపజేసి, భూమిలో మరణం లేని అజరామరంగా వెలిగే అఖండ జ్యోతి రామోజీరావు గారు...
లక్షల మెదళ్ళలో కదలికను తీసుకొచ్చిన అక్షర హాలికుడు రామోజీరావు గారు...
పాఠకుడికే పట్టాభిషేకం గావించి, జనుల మదిలో ప్రచండ బానుడై, దివికెగిసినా, భువిలో వెలిగే సూర్యుడు.
13
కవనజ్యోతి పక్షాన కవితా గానం సీజన్ -5
క్రోధి నామ సంవత్సర జ్యేష్ఠ మాసం పౌర్ణమి
కవితల పోటీ
అంశం ఉషా కిరణాలు
శీర్షిక అక్షర యోధుడు
నవతరానికి సాటి లేని స్ఫూర్తి ప్రదాత
మహోన్నత అక్షర సామ్రాజ్యాని కధినేత
ఈనాడు, ఈటీవీ మొదలగు అనేక సంస్థల
రూపకర్త
ఉషా కిరణాల పేరుతో మేటి చలన చిత్రాల
నిర్మాత.
కనీవినీ యెరుగని రీతిలో హైదరాబాదు నందు
అద్భుత ప్రపంచ ప్రఖ్యాతి పడసిన
రామోజీ ఫిల్మ్ సిటినీ నిర్మించిన మహా మేధావి
క్రమ శిక్షణ, పట్టుదల, దీక్ష, ప్రతిభల రూపమే
శ్రీ చెరుకూరి రామోజీరావు గారు
మేధా సంపత్తియే పెట్టుబడిగా పెట్టి
అశేష వ్యాపార సామ్రాజ్యానికి చక్రవర్తియై
ఇంతింతై, వటుడింతై చందంబున పెరిగి
మూర్తీభవించిన మానవత్వంగా పేరు పొంది
వేలమందికి యుపాధి కల్పించిన కల్పతరువే
చిటఫండ్ వ్యవస్థకు మార్గదర్శిగా అశేష కీర్తియే
పాత్రికేయుడిగా, గొప్ప దార్శనికుడిగా మెరిసే
ఉషా కిరణాల ఉషస్సులను చలన చిత్రాలలో
చొప్పించి ప్రేక్షక హృదయాలలో చెరిగి పోనీ
ముద్రను సొంతం చేసుకున్న రామోజీ రావు
అనేక భాషల్లో ఈనాడు పత్రికలను ప్రచురించి
భారతావనిలో విశిష్ట పేరు ప్రఖ్యాతులు గడించే
తెలుగు భాషకు ఆయన చేసిన సేవ అమూల్యమే
అనేక పత్రికలను నడిపి, తెలుగువెలుగులను
ప్రపంచానికి పంచిన మహనీయుడు,మహానుభావుడు, నిరాడంబరుడు, న్యాయ పోరాట వీరుడు, అక్షర యోధుడు
తెలుగునాట స్వర్ణాక్షరములతో లిఖింపదగిన
విజేత.
తోట సులోచన
నెల్లూరు
హామీ పత్రం
ఈ కవిత నా స్వంతమని హామీ యిచ్చు చున్నాను.
14
కవిత శీర్షిక: ఈ ఉషా కిరణాలు
ఈ ఉషా కిరణాలు తెలుగు నేలన ప్రభవించిన పద కమలాలు
తెలుగు భాషకు విలువలు చేకూర్చగా ఈ ఉషా కిరణాలు
అమ్మనుడిని అజరామరం చేయగా ఈ ఉషా కిరణాలు
ఇంటింటా కొలువై సమాచార క్రాంతినందిస్తూ ఈ ఉషా కిరణాలు
సాహితీ సరాగాల సమకృతిగా అలరిస్తూ ఈ ఉషా కిరణాలు
తాను ఎదుగుతూ పరులకు తోడునిస్తూ ఈ ఉషా కిరణాలు
ఇంతింతై చివురులు వేస్తూ
ఈ ఉషాకిరణాల వికసిత కమలాలు తెలుగుజాతి జ్ఞాన సిరులు
ఈ ఉషా కిరణాలు తెలుగు నేలన చెదరని మేలి...
15
*
డా.వేమూరి.సత్యవతి
జిల్లా
*
కృష్ణా
ఫోన్
*
9885136308
కవిత
*
శీర్షిక-ఉదయరేఖ..!
తెలుగు జాతిని జాగృతం చేయగల దీక్ష
ఉన్నత ప్రమాణాలతో ప్రయాణం చేసి "ఓ దినపత్రికై",
ప్రాంతీయమే కాక,దేశ,విదేశాల్లో చదువరుల దరి చేరితే..
మరో ముందడుగు తో వీక్షకులకి కనుల పండుగగా..బుల్లితెరపై,
సంప్రదాయము, ఆధునికతలని చెట్టాపట్టాలుగా ప్రోత్సహిస్తూ...
పాతవైనా, కొత్తవైనా..పసందైనవేవీ వదలకుండా..
చలనచిత్రాలో,నాట్యాలో,పండుగలో,వంటలో,వ్యవసాయపుపంటలో,
తీర్థయాత్రలో,హాస్యమో,రాజకీయమో, ఆధ్యాత్మికమో చూపిస్తూ....
దేశ,విదేశాల్లో తెలుగువారి నోటికి ప్రియా పచ్చళ్లని అందిస్తూ..
వ్యాపారం,వ్యవహారం, కలిపి మధ్యతరగతికి మందహాసమిచ్చే మార్గదర్శిగా,
దీర్ఘదర్శిగా, క్రాంతదర్శిగా భాగ్యనగరాన "రామోజీసిటీ" ని నిర్మించి
చిత్రీకరణలకనువైన సుందరహర్మ్యాలతో పర్యాటకులకి కనువిందు చేసి,
మాతృభాష మమతతో ఎన్నెన్నో ఎనలేని ఆభరణాలనిచ్చిన పునీతుడై....
నిత్యసత్యాలైన సంపాదకీయాలు, విపుల,చతురలు, అన్నదాతలు,
తెలుగువెలుగుల సాహితీసమర్చనలు! నిఘంటునిర్మాణాలు,!!
ప్రతిభామూర్తులసన్మానాలు, పండితపోషణలు,ప్రోత్సాహక కళ్జాంజలులు!
తెలుగువారు గర్వించేలా బహుముఖ -సమర్ధత కి నిలువెత్తు నిదర్శనమై..
లక్ష్మిని లాలిస్తూ..సరస్వతిని అర్చిస్తూ..తెలుగుభాష ని బతికిస్తూ..
పాడుతా తీయగా తెలుగు ప్రాభవమంటూ ...ఒకేవ్యక్తి ఇన్ని పనులుచేస్తూ..
పద్మ విభూషణుడై. పరిపూర్ణజీవిగా., ఒడిదుడుకులకి బెదరని ధీరుడై..
ఆధునిక తెలుగువారి చరిత్రలో భాషాసేవకునిగా,భాషాసమర్చకుడైన
అభిరుచిగల "కళా జీవి"గా, ప్రస్ఫుటమైన ప్రఖ్యాతితో కీర్తికాయుడవైనావు!
తెలుగుభాషాసరస్వతికి నీవిచ్చిన నిరుపమాన నీరాజనం...
చీకటిని దూరం చేసే ఉషాకిరణమై తెలుగుజాతిని వెలిగించాలి!!!!
ఉదయరేఖ గా ధైర్యమిచ్చి, తేటతెలుగు ని మరింత ఉజ్జ్వలం చేయాలి!
16
*
పిళ్ళా వెంకట రమణమూర్తి
జిల్లా
*
విశాఖపట్నం
ఫోన్
*
9701885764
కవిత
*
కవన జ్యోతి పౌర్ణమి కవితల పోటీ.
జ్యేష్ట శుక్ల పౌర్ణమి.
*తే 20-06-2024దీ*
అంశం: *ఉషా కిరణాలు*
(కీ .శే. శ్రీ చెరుకూరి రామోజీరావు సంస్మరణ) """"""""""""""""""""""""""""""""""""""""""""""""""
శీర్షిక: *సుజన మానస రథారోహుడు*
చెరుకూరి వంశ సద్యోజాతక భూషణుడు,
శుద్ధ కాంచన సముద్యద్వర్ణుడు..
భూజనులకు ప్రీతుడై భువిపై జనించిన జనాకర్షక సార్వభౌముడు..
అభిరామ మనోహరుడు విశుద్ధ యశ శ్మరదిందు
చంద్రికాడంబరుడు..
ఫలద శాంత శాత్రవ పరాగుడు, ప్రగాఢ వితీర్ణ జితేంద్రియుడు..
చిత్రసీమా ప్రభావిత పయోధిద్యోత శతాధిక చిత్ర నిర్మాత యితడు ..
ఘన జవసత్త్వ చారు తురంగ విస్ఫుర సుజన మానస రథారోహుడు..
వినయము విస్తరిల్ల గురు వృద్ధ జనాతిధి విప్ర దేవతార్చనా పురోహితుడు..
జ్ఞాన సంపద్విఖ్యాతుడు
సంయమి మార్గదర్శిగా పేరొందిన సంభావ్యానుభావుడు..
ప్రియ విద్వత్సంస్తవనీయ ముద్రణార్చిత , దృశ్య,శ్రవణ మాధ్యమ,
వ్యవస్థాపకుడు..
జయ ప్రాంశు కరాంభోజ జనితోజ్జ్వల
ఉషాకిరణాలు భాస్వరిల్లు కళారాధకుడు..
దయా సౌజన్య దివ్యద్భూరీ తేజోఘనుడు..
అనయంబున శ్రుతవంతుడయిన సుకుమార మానసుడు..
సుఫల అన్నదాతగా పేరోందిన మన రామోజీ నామధేయుడితడు!
17
*
కోడూరి (జక్కని) లలిత
జిల్లా
*
సిద్దిపేట
ఫోన్
*
9885803238
కవిత
*
*శీర్షిక: ఉషాకిరణాలు :*
------------------------
ఆంధ్ర దేశమున
పుట్టగొడుగుల వలె వచ్చిన
సత్తు చిత్తు చెత్త కాపీరాతల
డెయిలీ పేపర్ లు ఎన్ని వస్తేనేమి
పత్రికా రంగమున అరుణమై
*ఈనాడు* ఏనాడూ చెదరని
పీఠమున పాఠకుల
ప్రాతఃకాల మిత్రమై వెలుగు
*ఈ ఉషాకిరణాలు ....!*
సామాజిక సాంస్కృతిక
వారసత్వాల వేదికలు
రాజకీయ రాజనీతి
కుట్రలు కుతంత్రాల వాస్తవాలు
*ఈ ఉషాకిరణాలు... !*
దుష్ట దుర్మార్గములపై
ఎక్కుపెట్టిన
వాడి శరపరంపరలు
ప్రజాశ్రేయస్సు నెంచిన
మణిహారములు
*ఈ ఉషాకిరణాలు...!*
మహిళా సాధికారత పెంచి
స్త్రీ శక్తి నిరూపణకు తోడై
నిలిచిన భరోసాలు....
అతివల అందానికి
దిద్దిన మెరుగులు ....
పడతిఎదుగుదలకు
అద్దిన అభ్యుదయ వర్ణాలు
*ఈ ఉషాకిరణాలు....!*
వ్యాపార మంత్రాంగాలు
పరిపాలనా యంత్రాంగాలు
న్యాయ సలహాలు
ఆరోగ్య ప్రదాతల సమీక్షలు
చెట్టు చేమను పెంచే
పర్యావరణ హిత ప్రబోధాలు
*ఈ ఉషాకిరణాలు.... !*
అన్నదాతా సుఖీభవ
అంటూ నిల్చిన మార్గదర్శి!
చిత్ర సీమ చిత్రవిచిత్రములు
ఎన్నెన్నో మనసుకు నచ్చిన
సమాహారములు మనసు
మెచ్చిన ఆ పాత మధురాలు
*ఈ ఉషాకిరణాలు.... !*
మరుగున పడుతున్న
తెలుగు భాషామ తల్లికి
జవసత్వాలను ఇచ్చిన
కవిపండిత గోష్ఠుల
ముత్యపు నీరాజనాలు !
పరభాషాధిపత్యమున చెలగు
కలుషితమును అచ్చమైన
పదముల వీనుల విందుగా
అందించు శ్రావ్యమైన
జలతరంగిణుల జుగల్బందీ
*ఈ ఉషాకిరణాలు* !
ఆహా ఏమి రుచి....!
రసనాగ్రము ఉవ్విళ్ళూరు
వంటల సందడులు ....
జగతి జనము మెచ్చు
*ప్రియ* మైన పచ్చల్ల
పసందైన ఘుమఘుమలు
ఈ ఉషాకిరణాలు!
*ఉషాకిరణాలు* తిమిర
సంహరణాలై ప్రగతి
రథ చక్రాలై అక్షర తూణీరాలై
వార్తాపత్రికల రంగమున
కొత్త ఒరవడి పరవళ్ళు
ఈ *ఉషాకిరణాలు* !
పఠితుల ఉల్లముప్పొంగ
ఏకకంఠమున పాడిన
తీయని కోయిల గానాలు
ఈ *ఉషాకిరణాలు*...!
*ఈటీవీ* ని ఠీవిగా
*ఫిల్మ్ సిటీ* ని మేటిగా మలచిన
మీ కళాతృష్ణ అమోఘం....!
*ఉషాకిరణాల* పరంపరలు
అద్వితీయాలు అనిర్వచనీయాలు!
ఒక వ్యక్తి మహాశక్తియై
నడిపించిన వివిధ రంగాల
ఉద్యమ చైతన్య దివిటీలు !
మీడియా మాధ్యమాన
తనదైన వాణి...బాణీ లతో
చెరగని ముద్ర వేసి చరిత్రలో
*కింగ్ మేకర్* గా
తన పేజీని తానే అన్ని *తానై*
రాసుకున్న *శ్రీ రామోజీ గారు* !
అందుకోండి మహాశయా ఈ
*ఉషాకిరణాల* తో మా హృదయ పూర్వక సుమాంజలులు!
మీ ఆదర్శ వ్యక్తిత్వానికి
స్పూర్తిమంతమైన నిపుణతకు
అనితర సాధ్యమైన మీ
సేవలకు *మావినమ్ర శ్రద్దాంజలి* !
మీకు అంకితం ఈ
*ఉషాకిరణాలు....* 🙏🙏🙏
---- శ్రీమతి కోడూరి లలిత
S.A.,S.S.ZPHS.,
బస్వాపూర్,కోహెడ
18
కవితా గానం సీజన్ - 5
20.6.24 ... గురువారం
అంశం::*ఉషాకిరణాలు*
రచన:: కవిత వెంకటేశ్వర్లు
ఊరు:: కర్నూలు
శీర్షిక:: అక్షర యోధుడు రామోజీరావు
విగ్రహము గంభీరము
ఆగ్రహము సునిసత్వము
నిర్దిష్ట ప్రణాళిక ఆచరణము
క్రమశిక్షణ కార్యచరణ రూపము
ఈనాడుకు ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవాలి
అది మనము ఒప్పుకోవాలి
ఇచ్చెను తెలుగు భాషకు అత్యంత ప్రాధాన్యత
తెలుగు భాష బాధ్యత
తీసుకున్న అక్షయ అక్షర నేత
అరాచక అప్రజాస్వామిక ప్రభుత్వాలు
ఏన్ని కుయుక్తులు పన్నినా
ఎంతగా వేధించినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా
వేయలేదు వెనుకడుగు ఎదురొడ్డి పోరాడిన వీరుడు
ప్రవేశించిన ప్రతి రంగములో
విజయము సాధించినాడు
సామాన్య కుటుంబములో జన్మించి
అసామాన్య స్థితికి ఎదిగిన అక్షర విరించి
అక్షరాలనే వజ్రాయుధాలుగా
చేపట్టినాడు
అన్యాయాలు అక్రమాలపై గురి
పెట్టినాడు
సమయపాలన నిరాడంబరత
నిజాయితీ
గొప్ప లక్షణాలు గల అసాధారణ మనిషీ ఆయన
"అన్నదాత"సుఖీభవ"ప్రవేశ
పెట్టినాడు
దేశ వ్యాప్తంగా ఈనాడులో
ఆరంభించాడు
1972లో ఈనాడు పేపరు స్థాపించి
రామారావు పెట్టిన టి.డి.పి.కి
అండగా నిలిచి
9 నెలల్లో ముఖ్యమంత్రిగా గెలిపించి
రాష్ట్ర చరిత్ర గతినే మార్చిన ఘనుడు
లక్షలాదిమందికి ఉద్యోగాలు
కల్పించిన కారుణ్యమూర్తి
రామోజీ ఫిలిమ్ సిటి నిర్మించిన
కళల అభిరుచి
భాషలలో సవ్యసాచి
ఆయన ప్రతి ఒక్కరికి స్ఫూర్తి
ఎవ్వరు చేయలేరు ఆయన స్థానాన్ని భర్తీ
భారత రత్నకు యోగ్యుడు
రామోజీరావు అక్షర యోధుడు!!
ఈ కవిత నా స్వీయ రచన అని
హామీ
19
*
కాసుల ధీరాజ శర్మ
జిల్లా
*
తూప్రాన్, మెదక్ జిల్లా
ఫోన్
*
9440522864
కవిత
*
అంశం :
*ఉషా కిరణాలు*
సువిశాల దృక్పథంతో
విజ్ఞత కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి!
త్రికరణశుద్ధిగా రాత్రింబవళ్ళు కృషిసల్పి
పత్రికా రంగానికే వెలుగు
నిచ్చిన సాహసోపేత ధీశాలి!
వర్గభేదములనణిచివేసి
మార్గదర్శియై సామాజిక వర్గ
ఆర్థిక పురోగతికై అహరహం తపించిన
స్నేహశీలి!
పలు వ్యాపార రంగాల్లో
అపార అనుభవంతో
నిలబడి లక్షలాది నిరుద్యోగ యువతకు
ఉపాధి కల్పించిన ధైర్యశాలి!
వైవిధ్యమైన విభేదాల సుడిగాలి
ఒడిదుడుకుల మధ్య ఒద్దికగా నిలబడి
సద్భావనల సద్భుద్ధితో
సమస్యా పరిష్కారాలు సాధించిన సాధుశీలి!
తెలుగు రాష్ట్రాలలో తనదైన చెరగని ముద్ర వేసి ప్రపంచ దృష్టిని ఆకర్షింపజేసి పేరెన్నికగన్న
ఘన వ్యక్తిత్వ వికాస శీలి!
క్రమశిక్షణతో తక్షణమే నిర్ణయాలు తీసుకునే తత్వాన్ని కలిగి, అక్షర మాధ్యమం తో ప్రతి రోజూ ఉషోదయ అక్షయ అక్షర కిరణాలను ప్రసరింపజేసిన శ్రీ రామోజీరావు గారికి ఇదే
నా కవన అక్షరాంజలి!!
20
*
మద్ది .పుల్లారావు
జిల్లా
*
NTR
ఫోన్
*
9951287113
కవిత
*
ఉషాకిరణాలు సుప్రభాత కిరణాలు
ఉషాకిరణాలు తిమిరసంహరణాలు
ఉషాకిరణాలు చైతన్య దీపాలు
ఉషాకిరణాలు మౌనప్రభోదాలు
ఉషాకిరణాలు జగతికి ప్రాణాలు
ఉషాకిరణాలు ప్రగతి రధచక్రాలు
ఓ లెజెండ్ సృష్టించిన అసామాన్య కిరణాలు
రామోజీరావు గారి రసరమ్య కిరణాలు
ఎందరో కళాకారులను పరిచయం చేసిన సినీకిరణాలు
ఎన్నో నైతిక విలువలు సమాజానికి తెలిపిన ఆశా కిరణాలు
సినీ వైభవాన్ని ప్రపంచానికి తెలిపిన చిత్రరాజాలు
సాహితీ విలువలకు పట్టంగట్టిన పాటల పూధోటలు
జన అంత రంగాలను అవలోకించాయి
శ్రీవారి కి ప్రేమ లేఖ రాయడం నేర్పాయి
మయూరి గా నాట్యమాడుట నేర్పాయి
ప్రతిఘటన తో దుష్టుల ను దునుమాడాయి
చందమామ రావే అంటూ జాబిల్లి ని క్రింద కు దింపాయి
మౌనపోరాటంతో అదివరకు దారి చూపాయి
అమ్మ ప్రేమామృతాన్ని రుచి చూపాయి
వసుంధర యొక్క సహనశీలతను తెలిపాయి
నువ్వే కావాలి అంటూ ప్రేమికులను గిలిగింతలు పెట్టాయి
నిన్ను చూడాలని కోరికను అందరిలో కలిగించాయి
ఆనందంతో బ్త్రతకండని యువతీయువకులను నిర్దేశించాయి
మనసుంటే చాలు మనిషికి సంతోషపడుకన్నాయి
ఉషాకిరణాలు నిజంగా తెలుగు వారి పాలిట అమృతబాండాలే
21
*
గొర్రెపాటి శ్రీను
జిల్లా
*
Medchal Malkajgiri
ఫోన్
*
9652832390
కవిత
*
కవన జ్యోతి జేష్ట పౌర్ణమి కవితల పోటీకి
అంశం: ఉషాకిరణాలు
రచన : గొర్రెపాటి శ్రీను
శీర్షిక : సమాజ స్ఫూర్తి ప్రదాత
చేపట్టిన కార్యమేదైన ఘన విజయం సాధించే వరకు
విశ్రమించని శ్రామికుడు రామోజీరావు !
రెండు తెలుగు రాష్ట్రాల్లో
అత్యధిక సర్కులేషన్ కలిగిన ఈనాడు రామోజీ మానస పుత్రిక !
తెలుగు భాషా చైతన్యానికి,
వికాసానికి తోడ్పడిన రామోజీ తెలుగు తల్లి ముద్దుబిడ్డ !
రైతన్నలకు వ్యవసాయ మెళకువలు నేర్పేలా
ఆధునిక సాంకేతికత అందిపుచ్చుకునే లా ఏర్పాటైన
మాసపత్రిక "అన్నదాత"
నమ్మకానికి మారుపేరుగా నిలిచి
కుటుంబ ఆర్థిక ప్రగతికి సోపానంలా నిలిచిన
చిట్ ఫండ్స్ కంపెనీ "మార్గదర్శి"
నోరూరించే రుచులతో
తెలుగువాళ్ళ మమతానురాగాలను అందుకున్న పచ్చళ్ళు "ప్రియా ఫుడ్స్"
"మీ టివీ ఈ టీవీ" అంటూ
సొగసైన తెలుగు భాషను రసరమ్యంగా పలికే "ఈ టీవీ "
పాత్రికేయ వృత్తికే వన్నె తెచ్చేలా ఏర్పాటై
ఎందరో మేధావులను జర్నలిస్ట్ లు గా తీర్చిదిద్దిన
"ఈనాడు జర్నలిజం కళాశాల"
జనరంజకమైన ,ఆలోచనాత్మకమైన ,సందేశభరితమైన
చిత్రాలకు చిరునామా"ఉషాకిరణ్ మూవీస్"
ఫ్యాషన్ ప్రపంచనికి కేరాఫ్ అడ్రస్ గా వర్ధిల్లుతున్న "కళాంజలి"
ఆతిథ్యానికి అర్థమైనిలిచే "డాల్ఫిన్ హోటల్స్"
ప్రపంచ అద్భుతాలని నయనాల ముందు నిలుపుతూ ..
హాలీవుడ్ స్థాయిలో నిర్మితమైన అందాల లోకం "రామోజీ ఫిల్మ్ సిటీ"
"కృషితో నాస్తి దుర్భిక్షం " అనే నానుడికి నిలువెత్తు రూపం రామోజీ !
ఒక వ్యక్తి జీవిత కాలం లో ఎంతో సాధించ వచ్చని ..
చేతల్లో చూపిన సమాజ స్ఫూర్తి ప్రదాత ..రామోజీ !
22
*కవనజ్యోతి పౌర్ణమి కవితల పోటీకి*
*కవితా గానం సీజన్ 5*
*క్రోధి నామ సంవత్సరం జేష్ఠ మాసం కవితల పోటీకి*
*అంశం :ఉషాకిరణాలు*
*శీర్షిక : "కష్టేఫలీ*"*( రామోజీ రావు గారు)*
*************************************************
భారతదేశ యవనికపై ప్రసరించాయి *ఉషాకిరణాలు*
అక్షర సూరీడు ఉదయించి బలోపేతం చేశారెన్ళో కార్యక్రమాలు
చెరుకూరి రామోజీ రావు గారు(రామయ్య)
ఒక వ్యక్తి శక్తై చేసిన అక్షర యగ్జాలు
ఉషోదయానే వార్తలకు పెట్టారు విశాఖ తీరాన *ఈనాడు దినపత్రిక*
కవితలు కథలు ప్రోత్సహించటానికి *చతుర ,విపులలు*
పంటలు, ఫలాలు, చీడపీడలు, వాతావరణం
తెలియజేయుటకు రైతులకు *అన్నదాత* పత్రిక
*అన్నదాత* పండించిన పంటలు,ఫలాలతో ఇచ్చారు నోరూరించే *ప్రియా పచ్చళ్ళు పానీయాలు*
ప్రపంచంలోనే అత్యద్భుత *రామోజీ ఫిల్మ్ సిటీ* నిర్మించి అపరమయులై స్థానం సంపాదించారు గిన్నిస్ బుక్ లో
ఆం.ప్ర లో నిష్పక్షపాత వార్తలందించి కాంగ్రేసతర
ప్రభుత్వం తెప్పించిన పత్రికా నిర్వాహకులు
కోడళ్లను కూతుళ్లుగా భావించి ఇచ్చిన సంస్థలు
*జర్నలిజం స్కూలు* ప్రారంభించిన మార్గసూచి
*పాఠశాలలు* నిర్మించి విద్యావ్యాప్తి
సామాన్య మానవుల పొదుపు కోసం *మార్గదర్శి*
ప్రజల వినోదంకోసం *ఉషాకిరణాల* తో సినిమాలు
బహుభాషల *దూరదర్శన్*
నీటి ఎద్దడి రాకుండా *సుజలం సుఫలాం* తో *ఇంకుడు గుంటలు*
వరద బాధితులకు అండైన *దయామయుడు*
*నిరుపేద నిశానీలకు* చూపించారు తోట పనులు
మహా పట్టణం నాలుగు వైపులా స్థాపించారు సంస్థలు
*పద్మ భూషణ్ రామోజీ* ఉషా కిరణాలతో
తెలుగుకు వెలుగిచ్చి
*తెలుగు నిఘంటు నిర్మాణం* శేషంగా మిగిల్చి
*కష్టేఫలి* ,కృషి, అంకితం, ప్రతిభలే తన జీవిత విజయ రహస్యమని కనుమరుగైన కాంతి కిరణం.
హామీ: ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
23
23
*
పిన్నక నాగేశ్వరరావు
జిల్లా
*
హనుమకొండ
ఫోన్
*
79890 77056
కవిత
*
కవితా గానం(సీజన్ 5). 20--6--2024.
పిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
క్రోధి నామ సంవత్సర జ్యేష్ఠ మాస పౌర్ణమి
కవితల పోటీకి...
అంశము :-- ఉషాకిరణాలు.
శీర్షిక :-- మహోన్నతుడు.
నిబద్ధతకు నిలువెత్తు రూపం
నీతి నిజాయితీలకు పెట్టింది పేరు
ధర్మదీక్షకు కంకణం కట్టుకున్న వాడు
ఎంత ఎత్తుకు ఎదిగినా మిడిసిపడని నిగర్వి
ఆయనే దివంగత రామోజీరావు
ఉషా కిరణాలు ప్రసరించే వేళ
స్వర్గలోకాని కేగిన మహోన్నత వ్యక్తి!
ఉషాకిరణాలు ప్రసరించక ముందే
ప్రపంచ వార్తలు ప్రతిఇంటికి చేరేలా
"ఈనాడు" దినపత్రికతో నూతన
ఒరవడిని ప్రవేశపెట్టిన మార్గదర్శి!
వివిధ రంగాలలో విప్లవాత్మకమైన
మార్పులను తెచ్చిన ఆదర్శప్రాయుడు!
తన ఉద్యోగులకు బాధ్యతా విలువలను
ప్రబోధించిన కార్యదక్షుడు!
దేశానికే కాదు ప్రపంచానికే
మణిమకుటంలా నిలిచే
రామోజీ ఫిలిం సిటీని నిర్మించి
సినీ రంగానికి ప్రయోజనం చేకూర్చిన
చరితార్థుడు రామోజీరావు!
తెలుగు రాష్ట్రాలలో కూడ తెలుగుభాషకు
ప్రాముఖ్యత తగ్గుతున్న దశలో
"తెలుగు వెలుగు" పత్రిక ద్వారా
తెలుగుభాషను ఉన్నత స్థానాన
నిలుపుటకు యత్నించిన భాషాభిమాని!
"ఉషాకిరణ్ మూవీస్" బ్యానర్ పై
విలువలతో కూడిన ఎన్నో చిత్రాలను
ప్రేక్షక లోకానికి అందించి ఎంతోమందికి
ఉపాధి కల్పించిన బహుముఖ ప్రజ్ఞాశాలి!
తెలుగులోనే కాదు దేశంలో ఉన్న
అనేక భాషలలో దూరదర్శన్ "ఈటీవీ"లను
స్థాపించి వినోద,విజ్ఞానములను
జనులకు అందించిన ప్రజాభిమాని!
భువిలో అందరి హృదయాలలో
స్థానం సంపాదించిన రామోజీరావు
దివిలో ధృవతారగా నిలుచును గాక!
***************************
24
కవన జ్యోతి సీజన్ 5
క్రోధి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం పౌర్ణమి నగదు బహుమతుల కవితలు పోటీకి
అంశం:--ఉషాకిరణాలు
ప్రక్రియ:-- వచన కవిత్వం
రచన:-- సింహాద్రి వాణి
శీర్షిక:-- బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీ
ఊరు:-- విజయవాడ
చరవాణి:--7569820872
ఆవగింజలో అరవంతున్న మర్రి విత్తు
వడగాడ్పులను, సుడిగాలులను ఎదుర్కొని
ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని, ఊడలుదిగి విశ్వంలో వటవృక్షమై వ్యాపించి, వృక్షాలు లోనే మహా వృక్షంలా తన వునికిని చాటు కుంటున్నట్లు,
చిన్న వ్యవసాయ కుటుంబంలో పుట్టి, విద్యాధికుడై,ప్రియా పచ్చళ్ళు వ్యాపారాన్ని ప్రారంభించి,
ఎన్నో ఆటంకాలను అధిగమించి, ఇంతింతై వటుడింతై అన్న చందాన ఆకాశాన్ని, భూలోకాన్ని తన పాదాలతో కప్పిన వామనుడిలా,
తన ప్రతిభను నిరూపించేందుకు,
రామోజీ రావు గారు అసాధారణ మేథా సంపత్తితో, అసమాన ప్రతిభా విశేషాలతో, విశ్వంలో వెలుగులు నింపేందుకు, ఉషాకిరణాలతో తిమిరంతో సమరం చేసి తన శక్తిని నిరూపించిన యోధుడు.
ఈనాడుతోపాటు ఎన్నో పత్రికలను నెలకొల్పి, రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపించి,విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
తన సంస్థల్లో వేలమందికి ఉపాధి మార్గం చూపించిన మార్గదర్శి. ఎందరికో ఉద్యోగాల నిచ్చి ఆకలిమంటలు తీర్చిన అన్నదాత.
అకుంఠిత కార్యదీక్షాపరుడు, సమాజ సేవాతత్పరుడు,కారణ జన్ముడు.
అన్యాయం, అక్రమాలను నిగ్గదీసిన ధైర్యశాలి.
ఆయన కృషికి ఫలితంగా ఎన్నో డాక్టరేట్లే గాక, ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ పొంది, దివివ్యాపార వేత్తల గుండియల్ దిగ్గురనగ దివికేగిన వ్యాపారదిగ్గజం.
ఉషాకిరణాలు
తిమిరసంహరణాలు
చైతన్య దీపాలు
ప్రగతిరథ చక్రాలు.
హామీ:-- ఇది నా స్వీయ రచన.
25
కవితా గానం సీజన్… 5
అంశం… ఉషా కిరణాలు
శీర్షిక… క్రమ శిక్షణల కంబలి
తెలుగు జాతికి అక్షరం పవర్ ఏమిటో చూపించిన పాత్రికేయుడు ఆయన… .
తెలుగు జాతి ప్రజల సమస్యలకు అక్షర రూపం ఇస్తే సమాజానికి కలిగి మేలు ఏమిటో చూపించి నిరూపించిన సామాజికవేత్త ఆయన….
తన అక్షరాల ద్వారా గాడి తప్పిన పరిపాలనను సరైన దారి మళ్లించడంలో చేయి తిరిగిన వేటుగాడు ఆయన….
లక్షలాది ప్రజలకు ఉపాధి బాట చూపి వేల సంఖ్యల జర్నలిస్టులను తీర్చిదిద్దిన తెలుగు ఘనుడాయన…
ప్రజానీకానికి దిశా నిర్దేశం చేసి అక్షర సేద్యంలో అలుపు సొలుపు తెలియని మేరు పర్వత మాయన….
ఎంతటి కష్టాన్నైనా, నష్టాన్నై యినా ముందుకు అడుగు వేసి నడిచే ధీరుడాయన…
ఎంత ఎదిగినా ఒదిగి ఉండి నీతి నియమాల బాట మీద నడిచి నమ్మకమే వ్యాపారానికి పునాది అని చూపిన మార్గదర్శి ఆయన…
పేదవాడికి అక్షర రక్ష కల్పించాలి అన్న ఆలోచనలో ఈనాడు డైలీ పునర్ ఆవిర్భావానికి గ్రామ గ్రామానికి జర్నలిస్టులను తీర్చిదిద్దిన గురువాయన….
ఈటీవీ సమాచారంతో వినోదాన్ని ప్రపంచ ప్రజల ముందు తెరకెక్కించి, రెండు తెలుగు రాష్ట్రాల సమగ్ర దృశ్యామాలిక ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్, ఈటీవీ తెలంగాణ లకు ఊపిరి పోసిన యజ్ఞుడాయన….
కిరణ్ యాడ్స్, వసుంధర ఫెర్టిలైజర్స్, ప్రియ పచ్చళ్లు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందించిన వ్యాపారశీలి ఆయన…
కవులు కవయిత్రులు నూతన నటీనటులను పరిచయం చేసి, రామోజీ ఫిలిం సిటీ నిర్మించి అటు సినిమాలకు, ఇటు సామాన్య ప్రజలకు ఉపయోగ పడేలా పర్యాటక ప్రదేశంగా తయారుచేసి చూసిన ప్రపంచ చరిత్రకారుడు ఆయన…
సామాన్య రైతుబిడ్డగా జన్మించి, వ్యాపారవేత్తగా రాణించి, మహా సామ్రాజ్యాన్ని ఆఖరి క్షణం వరకు ప్రజల సంక్షేమం కోసం అడుగులు వేసిన అఖండ జ్యోతి ఆయన….
అన్ని రంగాలలో ఉషోదయ కిరణాలుగా విస్తరింప చేసిన క్రమశిక్షణ కంబళి, ఆదర్శ మూర్తి, స్ఫూర్తి ప్రదాత, అందరికీ చిరస్మరణీయుడు ఆయన…
రామోజీ సదా మీకు సలాంజీ 🙏🙏🙏…
హామీ… . నమస్తే రామోజీ రావు గారి గురించి ఉషా కిరణాలు అంశాన వ్రాసిన క్రమశిక్షణల కంబలి శీర్షికన వ్రాసిన కవిత నా స్వీయ రచన అని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను🙏
మొహమ్మద్. అఫ్సర వలీషా
ద్వారపూడి (కోనసీమ జిల్లా)
26
కవనజ్యోతి పౌర్ణమి కవితలపోటీ
కవనజ్యోతి పక్షాన కవితాగానం సీజన్--5
క్రోధినామ సంవత్సరం జ్యేష్ట మాసం కవితలపోటీకి గాను
*అంశం: ఉషాకిరణాలు*
*శీర్షిక ---రామోజి కిరణాలు*
చెదరని చిరునవ్వు కుదురైన నిగ్రహం
చాణక్యుని నీతి క్రమశిక్షణకు కోట
పట్టుదలకు విక్రమార్కుడు
పరిశ్రమలకు పట్టుకొమ్మ
వ్యక్తి వ్యవస్థగా మారితే రామోజీ
విజయమే ఈమోజిగా నిలచిన రామోజి
పొదుపు మదుపుకు మూలం అదుపు అంటూ
మార్గదర్శిలో చేరిక ఉద్యోగస్తుల జీతాలకు భరోసా,
అడుగుల బాటలో మరో అక్షరాల తోట చేరింది అక్షరమే ఆయుధంగా మారి అందరికి నేస్తంగా నాటినుంచి ఈనాటికి రాజకీయలను మలుపు తిప్పిన మరో ఛిత్రిక
ఈనాడు పత్రికగా విఫులంగా,చతురంగా ఎందరో రచనలకు వెలుగులు ఇస్తూ...అన్నట్లు ..
ఆకలికి పచ్చడైన రుచే అంటూ ఇంటింటా *ప్రియా* పచ్చళ్ళు వంటింటి నేస్తంగా చేరాయి
దూరదర్శన్ ఒంటరి తనానికి జంటగా ఈటీవీఛానల్ పెట్టి అనతి కాలంలో ఆరు ముఖాలుగా విస్తరించింది
నిత్యం వెలుగును పంచే భానుని ఉషాకిరణాలు రామోజి మనసులో నూతన కిరణాలుగా చిత్రాలై కొత్త కొత్త నటీ నటులకు ఊపిరి పోసి నిలబెట్టిన చిత్రాలు ఎన్నో...
ప్రపంచ స్థాయి చిత్రపరిశ్రమ నెలకొల్పి
నేటికి సాటిలేని పోటి పడే ఉషా కిరణాలు చిత్రాలు సిరియల్స్,తీస్తూ డిజిటల్ మార్కెటింగ్ లోను దూరి సాటి మేటిలేని సంస్థ
నెలసరి జీతాలు నిలకడగా ఒకటో తేదినే ఇచ్చే గొప్ప తనాన్ని చాటుకుంది
పాడుతాతీయగా పసిపాపలా పెరగండి అంటూ ఎందరెందరో బాల గంధర్వుల వెలుగులు నిత్య కీర్తనలు
రెండు శతాబ్ధాల కాలంగా
వినిపిస్తూ... ఒడిదుడుకులలో సైతం మానవతావాదంతో, ఎన్నో లక్ష్యాలు
నిలువెత్తు క్రమశిక్షణ అలుపెరుగని నిరంతర సేవా సాధన,ఎందరికో జీవనోపాధి ఇచ్చిన రామోజి మనకు లేరా?!...
ఉన్నారు!
సంస్థగా మనతో మమేకమై మహోన్నత
వెలుగులు పంచుతూ నిత్యం ఉషా కిరణాలతో ...
లలితాచండి
రచయిత్రి/న్యాయవాది
9885552922
27
కవితాగానం
జ్యేష్ఠ మాస పౌర్ణమి కవితల పోటీ
కోసం
*ఉషాకిరణాలు*
శీర్షిక *తెలుగు వెలుగు*
ఆలోచనలకు పుటం పెట్టి
పథకరచనలకు శ్రమశక్తి గొడుగు పట్టి
ఇంతింతై ఒక్కో మెట్టు ఎదిగిన ధీశాలి
*ఉషాకిరణాల* ను వెండితెర మీద
పండించిన *సితార* చెలికాడు
అక్షరాల సాలులో
విలువల విత్తనాలేసిన దార్శనికుడు
వ్యాపార గణితంలో
సామాన్యుడిని భాగస్వామ్యం చేసిన
*మార్గదర్శి*
తనో శిలా
తానొక శిల్పీ
తనను తాను మలచుకున్న నేర్పరి
విభిన్న శైలిలో పయనమైన *విద్యాధరి*
పనిలో విశ్రాంతి ఎరుగని యోగి
రమ్యమైనకళాకాంతుల విరాగి
తానొక ఏకాంత శోధనా కవ్వం
తానొక నవరసపోషణా పూర్ణబింబం
రైతు నాగేటి చాల్లల్లో *అన్నదాతై* నడక
పాడిపంటలకు కాడీ కోడీ
పాలధారల కల్పనా వేదిక
తానొక పరిచయం అక్కర్లేని
*బహుముఖ ప్రజ్ఞాశాలి*
కష్టాలను విజేత ఫలాలను
కావడి కుండల్లా మోసిన *బాటసారి*
*శ్రమను పరిశ్రమగా జాలెవోసిన నేత*
*పల్లెలను ప్రగతిపథంలో నడిపిన దాత*
*తన పేరును తానే *రామోజీరావు గా పెట్టుకుని*
*దశదిశలా తెలుగు వెలుగై నిలిచిన*
*కీర్తి శిఖరమా నీకు నీవే సాటి*
*కానరారెవరు నీకు మరొకరు పోటి*
ఏడెల్లి రాములు✍️
ది*21*06*24(22*48)
ఎల్కలపెల్లి🌹
28
28
*
డా బల్లూరి ఉమాదేవి
జిల్లా
*
కర్నూలు
ఫోన్
*
9493846984
కవిత
*
ఉషాకిరణాలు
రామోజీరావు
తెలుగు భాషా వ్యాప్తికై శ్రమించిన రామోజీ
స్థాపించెను తెలుగువారి కొరకొక దినపత్రిక
కల్పించినందుకు తావీయక నిజాలను
నిర్భయముగా చాటి నట్టి జననేత
విపుల చరిత అన్నదాత తెలుగు వెలుగు అనెడి
తెలుగుపత్రికలను స్థాపించిన భాషా ప్రేమికుడు
తెలుగు భాష గరిమను నలుదెశలా చాటెతాను
మార్గదర్శి సంస్థను స్థాపించి జనులకెల్ల
మార్గదర్శి గా నిలిచిన నాయకుడు
కవులకు గాయకులకు తనసంస్థలద్వారా
ప్రోత్సాహం మొసగిన అక్షరయోధుడు
మాటలతో సరిపెట్టక చేతలందుచేసిచూపె
అలుపెరుగని అభివృద్ధి కార్యాలను
చక్కని చలన చిత్రములను తీసి
ఉపాధి కూర్చె కార్మికులకు కళాకారులకు
అన్నివర్గాలవారికుపయుక్తమగునట్లుగ
పలు శీర్షిక లతో పాఠకులకు చేరువయ్యె
ఉషాకిరణాలను దశదిశలా ప్రసరింపచేసె
పర్యాటక ప్రాంతముగా తీర్చిదిద్దె తనమేధచే
తెలుగువారు మరువలేనితెలుగుతేజ మీరామోజీ
Comments
Post a Comment